Appointments
-
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పలువురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నియామకాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం(నవంబర్ 11) ఆదేశాలు జారీ చేసింది.ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్,పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించారు. కాగా, ఇటీవల వైఎస్సార్సీపీలో పలు కీలక పదవులను పార్టీ ముఖ్య నేతలతో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ప్రశ్నిస్తామనే ప్రతిపక్షహోదా ఇవ్వలేదు: వైఎస్ జగన్ -
YSRCPలో కీలక పదవులకు నియామకాలు
తాడేపల్లి, సాక్షి: వైస్సార్సీపీలో కీలక పదవులకు నియామకాలు జరిగాయి. రెండు జిల్లాలకు అధ్యక్షులతో పాటు కీలక విభాగాలకు నియామకాలు చేస్తూ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదలయ్యింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలనుసారం.. కర్నూలు జిల్లాకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాలకు పార్టీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. ఇక.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. అలాగే.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది. -
వైఎస్సార్సీపీలో పలు జిల్లాల అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు జిల్లా, నగర అధ్యక్షుల నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులుగా అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీ చరణ్, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షులుగా మార్గాని భరత్ రామ్ నియమితులయ్యారు.కాగా, మంగళవారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. పార్టీ నాయకుల సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. -
మిగిలిన గురుకుల పోస్టులను మెరిట్‌తో భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి న ఉత్తర్వులను పాటించాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అభ్యర్థులు పోస్టులు వదులుకోవడంతో..: గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు ఇచ్చి ంది. అయితే ఈ నియామకాలను అవరోహణ క్రమంలో ఎగువ స్థాయి పోస్టులను ముందు, దిగువ స్థాయి పోస్టులను తర్వాత) చేపట్టాల్సి ఉన్నా.. ఒకేసారి అన్ని ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దీనితో మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోగా.. మిగతా పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇలా మిగిలిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన విజయ్ మనోహర్‌తోపాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది హిమాగ్జి వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్ ఇచ్చి న పోస్టులన్నీ భర్తీ కాకుండా మిగిలిపోతే, వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో నింపవచ్చని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. పిటిషనర్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఈ మేరకు వినతిపత్రం కూడా అందజేశారని కోర్టుకు విన్నవించారు. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని.. మిగిలిన ఖాళీల్లో పిటిషనర్లను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తదుపరి గురుకుల నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ తుది తీర్పున కు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరాలు తెలు సుకుని చెప్పాలని స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చే యాలంటూ.. విచారణను వాయిదా వేసింది. గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫి కేషన్ ఇచ్చింది. అయితే నోటిఫికేషన్లో ఇచ్చిన నిబంధనలు పాటించకుండా తమను పక్కకు పెట్టడాన్ని సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్ పుల్ల కార్తీ క్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యా యవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేసి నా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూ డా ఉన్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని.. నివేదిక వచ్చేదాకా ఆగాలని అధికా రులు సూచించారు. అయితే ఆ నివేదిక రాక ముందే పిటిషనర్లను పక్కకు పెట్టి ఇతరులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదు. మెరిట్ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్టాండింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. -
ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తిరుమలేశ్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్ఎస్పీడీసీఎల్కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్ లోకల్ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు. -
సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు
-
ఎస్సై నియామకాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామకాలకు సంబంధించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సై నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్‌కు మంగళవారం క్లియరెన్స్ ఇచ్చింది. అభ్యర్థుల ఎత్తు. కొలతల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలను అడ్డుకున్న స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు విచారణ చేపట్టింది. ఆపై న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించింది. అయితే.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. రిక్రూట్ మెంట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏం జరిగింది? ►నెలన్నర కింద న్యాయస్థానం ముందు ఎస్సై అభ్యర్థుల పిటిషన్ ►ఇప్పటికే పలు మార్లు పిటిషన్లు వేసిన అభ్యర్థులు ►అభ్యర్థుల తరపున జడ శ్రవణ్ పిటిషన్ ►ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు కోర్టులో కేసులు ►తొలుత ఫలితాలు విడుదల చేయకుండా హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ►ఎస్సై రిక్రూట్మెంట్లో ఎత్తు విషయంలో అభ్యంతరాలు ►ఇప్పటికే రెండు సార్లు ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►ఎత్తు విషయంలో విఫలమయ్యారని తేల్చిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►రెండో సారి కొలిచిన తర్వాత మళ్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందుకు పిటిషన్ ►రెండో సారి మాన్యువల్‌తో కాకుండా.. స్కానర్లతో ఎత్తు కొలిచిన బోర్డు ►రెండో పరీక్షలోనూ అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు ►అయినా హైకోర్టులో మళ్లీ పిటిషన్ వేసిన జడ శ్రవణ్ ►అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారని ఆరోపణలు ►రిక్రూట్మెంట్ బోర్డు పై ఆరోపణలు తప్పని తేలితే రూ.లక్ష జరిమానా కడతారా? ప్రశ్నించిన హైకోర్టు ►అంగీకారం తెలుపుతూ మెమో దాఖలు చేయాలని ఆదేశం ►హైకోర్టు సమక్షంలో ఒక్కొక్క అభ్యర్థి ఎత్తు కొలుస్తామన్న జడ్జిలు ►ఎత్తు విషయంలో అర్హత సాధించలేకపోతే.. లక్ష కడతామని రాసివ్వాలని షరతు ►అభ్యర్థులు వెనక్కి తగ్గడంతో ఫలితాలు విడుదల చేసుకోవచ్చన్న హైకోర్టు ఇదీ చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది -
అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు
అయోధ్య(యూపీ): అయోధ్యలో నిర్మాణం తుది దశకు చేరుకున్న రామమందిరంలో పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి 3,000 దరఖాస్తులు అందినట్లు రామ మందిర్ తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఉన్నతాధికారి సోమవారం చెప్పారు. వీరిలో 20 మందిని మాత్రమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. -
‘సింగరేణి’ నియామకాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు ఊరటనిచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష ఫలితాలను వెల్లడించి, నియామక ప్రక్రియ చేపట్టవచ్చని చెప్పింది. అభ్యర్థులను ఎంపిక చేయ వచ్చని చెబుతూ.. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూని యర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022 లో సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 98,882 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2022, సెప్టెంబర్ 4న రాష్ట్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్షకు 79, 898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవ కతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేశారు. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. కాగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ పరీ క్ష రాసిన పలువురు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ జె.అనిల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సింగరేణి తరఫున స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమా ర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ని యామక ప్రక్రియకు అనుమతించింది. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని చెబుతూ విచారణను వాయిదా వేసింది. కాగా, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్.బలరామ్ తెలిపారు. త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. -
‘ఇండియా’ కమిటీల్లో నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని వివిధ కమిటీలకు మరికొన్ని నియామకాలు చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కూటమిని సన్నద్ధం చేసే క్రమంలో శుక్రవారం ప్రకటించిన సమన్వయ, ఎన్నికల వ్యూహ కమిటీలోకి వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులను తీసుకున్నారు. తాజాగా, ప్రచార కమిటీలోకి కాంగ్రెస్ నేత గుర్దీప్ సింగ్ సప్పాల్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేనకు చెందిన అనిల్ దేశాయ్, ఆర్జేడీ సంజయ్ యాదవ్, ఎన్సీపీ నుంచి పీసీ చాకో, జేఎంఎం నేత చంపాయి సోరెన్, ఎస్పీకి చెందిన నందా కిరణ్మయ్, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఎం నేత అరుణ్ కుమార్, సీపీఐఎంఎల్ నుంచి రవి రాయ్, వీసీకే నుంచి తిరుమావలన్, ఐయూఎంఎల్ నేత కేఎం కాదర్ మొయిదిన్, కేసీ–ఎం నేత జోస్ కె మణి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీ నేత మెహబూబ్ బేగ్‌లను నియమించారు. టీఎంసీ నుంచి ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ఖమ్మం: సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 8వ తేదీ వరకు ర్యాలీ జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాజరుకానున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోటీలు ప్రారంభించారు. తొలి రోజు 1,225 మంది అభ్యర్థులకు 926 మంది హాజరయ్యారు. వీరిలో వైద్య పరీక్షలకు 329 మంది అర్హత సాధించారు. పోటీలను కలెక్టర్ వీపీ గౌతమ్, ఆర్మీ అధికారి దాస్, డీవైఎస్వో టి.సునీల్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. కాగా, అభ్యర్థులకు వసతి సౌ కర్యం కలి్పంచినట్లు చెబుతున్నా.. అవగాహన క ల్పించకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు రహదారుల వెంటే సేదదీరాల్సి వచ్చింది. -
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం సంచలనాత్మక తీర్పు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తులను నియమిస్తోందనే తీవ్ర ఆరోపణల నడుమ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరిచింది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఇకపై ఈ వ్యవస్థను రద్దుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలు జరపాలని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. అది ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది ‘శక్తివంతమైన తుపాకీ కంటే బ్యాలెట్ మరింత శక్తిమయం. ఎన్నికల ప్రక్రియ అతిగా దుర్వినియోగానికి గురైందంటే అది చివరకు ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది. అధికారం ముందు సాగిలపడే వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికకాకూడదు. ఇంకొకరి ఆదేశాలను శిరసావహించే వ్యక్తి ప్రజాస్వామ్య తలరాతను మార్చే హోదాలో ఉండకూడదు. ఎన్నికల ప్రక్రియ స్వతంత్రతను మరింతగా ఇనుమడింపజేసేందుకే ఈ ఆదేశాలు ఇస్తున్నాం. స్వచ్ఛత తగ్గిపోతే వినాశక పరిణామాలు సంభవిస్తాయి. పార్లమెంట్లో కొత్త చట్టం వచ్చేవరకు నూతన నియామక ప్రక్రియ అమలులో ఉంటుంది’ అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఇన్నాళ్లూ కేంద్రప్రభుత్వం రాష్ట్రపతికి కొత్త సీఈసీ, ఈసీల కోసం సిఫార్సుచేసేది. సిఫార్సులమేరకు రాష్ట్రపతి వారిని నియమించేవారు. ఇకపై కొత్త ప్రక్రియ ప్రకారం లోక్‌సభలో విపక్షనేత లేని సందర్భంలో లోక్‌సభలో సంఖ్యపరంగా అతిపెద్ద విపక్ష పార్టీ నేత త్రిసభ్య కమిటీలో సభ్యునిగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో గతంలో దాఖలైన నేపథ్యంలో వాటిని విచారించిన కోర్టు గురువారం ఈ తీర్పు చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. తీర్పును స్వాగతించిన విపక్షాలు ‘ప్రభుత్వ ప్రమేయం, ప్రభావం బారిన పడకుండా ఈసీని కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కోర్టు తీర్పు బాటలు పరిచింది’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తీర్పును ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అభివర్ణించారు. ‘ఇంతకాలం ప్రధాని ఎన్నికల ర్యాలీలు, ప్రభుత్వ పథకాల ప్రకటనలకు అనుగుణంగా ఎన్నికల తేదీలను ఈసీ నిర్ణయించేది. ఇకపై ఎన్నికల సంఘంలో ఎవరు ఉంటారనే త్రిసభ్య కమిటీ చూసుకుంటుంది’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. -
పీడబ్ల్యూసీలో 30,000 నియామకాలు
న్యూఢిల్లీ: రాబోయే కొన్నేళ్లలో భారత్‌లో సుమారు 30,000 మంది సిబ్బందిని తీసుకునే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ చైర్మన్ బాబ్ మోరిట్జ్ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర దాదాపు 31,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌పై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ చైర్మన్ జాన్–పాస్కల్ ట్రైకోయిర్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత భారత్ తమకు అతి పెద్ద మార్కెట్‌గా ఉందని వివరించారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పురోగమించేందుకు భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. -
యూఎస్ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్. తొలిసారి వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లకు ఊరట ఇచ్చింది అగ్రరాజ్యం. వీసా కోసం పడిగాపులు పడకుండా ఉండేందుకు అదనపు చర్యలు చేపట్టింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత మూడేళ్ల నుంచి విజిటర్ వీసా కోసం వేల మంది పడిగాపులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వీసా ప్రాసెసింగ్‌లో ఉన్న బ్యాక్లాగ్ సమస్యను పరిష్కరించడానికి.. శనివారాల్లో ప్రత్యేక వీసా ఇంటర్వ్యూలను నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా అదనపు స్లాట్లతో భారీగా అప్పాయింట్మెంట్లు అందుబాటులోకి రాన్నాయి. వీసా దరఖాస్తుదారుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించే ఈ భారీ ప్రయత్నంలో భాగంగా.. జనవరి 21వ తేదీన న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని కాన్సులేట్లు విజిటర వీసా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఇందుకోసం డజన్ల కొద్దీ తాత్కాలిక సిబ్బందిని నియమించారు కూడా. ఇక ఈ ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడానికి జనవరి మరియు మార్చి 2023 మధ్య వాషింగ్టన్, ఇతర రాయబార కార్యాలయాల నుండి డజన్ల కొద్దీ తాత్కాలిక కాన్సులర్ అధికారులు భారతదేశానికి రానున్నారు. మరోవైపు ఎంబసీ, కాన్సులేట్లకు శాశ్వతంగా కేటాయించిన కాన్సులర్ అధికారుల సంఖ్యను కూడా పెంచుతోంది. "రాబోయే రోజుల్లో.. ఎంపిక చేసిన శనివారాల్లో అపాయింట్మెంట్ల కోసం అదనపు స్లాట్లను తెరుస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదిలా ఉంటే.. ఇదివరకే మునుపటి అమెరికా వీసాలతో ఉన్న దరఖాస్తుదారుల కోసం ఇంటర్వ్యూలను మినహాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్‌ను అమలు చేసింది. అటువంటి దరఖాస్తుదారులు ఇకపై వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరుకావలసిన అవసరం లేదు. -
Passport: ఇక నుంచి వేగంగా పాస్‌పోర్టుల జారీ
సాక్షి హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం చాలాకాలం నిరీక్షించకుండా మరిన్ని సాధారణ, తత్కాల్ అపాయింట్మెంట్లను పెంచినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్లు 50, తత్కాల్ 50, అమీర్‌పేట పీఎస్కేలో సాధారణ 25, తత్కాల్ 25, టోలిచౌకి పిఎస్కెలో సాధారణ 25, తత్కాల్ 25, నిజామాబాద్ తత్కాల్ 20 అపాయింట్మెంట్లను పెంచినట్లు ఆయన తెలిపారు. పెంచిన అపాయింట్మెంట్లు 16వ తేది నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. గత డిసెంబర్ మాసంలో 5 ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా క్రేందాల్లో వరుసగా 4 శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అపాయింట్మెంట్ల లభ్యత పెంచినట్లు వివరించారు. దీనివలన గతంలో తత్కాల్ అపాయింట్మెంట్ల లభ్యత సమయం 30 రోజులకు, సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల లభ్యత సమయం 40 రోజులకు తగ్గిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు) -
ఈ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో శనివారం స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈనెల 26న శనివారం సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 22వ తేదీన సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల పలువురి అపాయింట్మెట్ రీషెడ్యూల్ చేశారు. అలాంటి వారికి ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాల్లో శనివారం ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటన చేశారు. రీషెడ్యూల్ చేసిన వారికి మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ‘22-11-2022(మంగళవారం) రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కేఎస్), 14 పోస్ట్ ఆఫీస్ పాస్ట్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఓపీఎస్కేఎస్) సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించాం. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపాం. అందులో భాగంగా 22న మంగళవారం ఎవరి దరఖాస్తులు నిలిచిపోయాయో వారికి ప్రత్యేకంగా శనివారం సేవలందించాలని నిర్ణయించాం. నల్లగొండ, ఖమ్మంలోని 5 పీఎస్‌కేఎస్, 2 పీఓపీఎస్కేఎస్లలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి ఎస్ఎంఎస్ పంపించాం.’ అని తెలిపారు దాసరి బాలయ్య. ఎస్ఎంఎస్లు అందిన దరఖాస్తుదారులు వారికి కేటాయించిన పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలకు షెడ్యూల్ టైమ్ ప్రకారం హాజరుకావాలని కోరారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ -
వీసా అపాయింట్మెంట్ల పెంపునకు కృషి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా తగ్గిపోయిన వీసా అపాయింట్మెంట్లను పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నా మని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లా ర్సన్ తెలిపారు. హైదరాబాద్‌లో యూఎస్ఏ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్‌ను అమెరికాలో ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. కొద్దిరోజుల్లో ఆమె హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. జెన్నిఫర్ మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తాన న్నారు. వచ్చే నవంబర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఎంబసీని హైదరాబాద్‌లో ప్రా రంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త భవన సముదాయంలో 55 వీసా విండోస్‌తో వేగంగా ప్రాసెస్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సమాజానికి అందించిన ఉత్తమసేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఇచ్చే ‘ప్రెసిడెంట్ వాలంటరీ అవార్డు’ను సాఫ్ట్వేర్ రంగంలోని వ్యాపారవేత్త రవి పులికి అందించారు. 2019లో కోవిడ్ సందర్భంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను రవి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేర్చారు. 5,279 గంటల వాలంటరీ సమయాన్ని ఆయ న సమాజహితం కోసం కేటాయించడం గర్వించదగినదని జెన్నిఫర్ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అవార్డుతోపాటు ఇచ్చే ‘బటన్’ను రవికి బహూకరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారత కాన్సులేట్ మినిస్టర్(ఎకనామిక్) డాక్టర్ రవి కోటతోపాటు యూఎస్ఐబీసీ, సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, యూఎస్ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: వైద్యశాఖ నియామకాల్లో ఉమ్మడి విధానం
సాక్షి, అమరావతి: వైద్య విభాగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టనుంది. బయో మెడికల్ ఇంజినీర్, డైటీషియన్ తదితర 42 విభాగాల్లోని 2,572 పారామెడికల్ పోస్టులను ఈ నెలలోనే భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులో పబ్లిక్ హెల్త్ విభాగంలో 466 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 806 పోస్టులు, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో 1,300 పోస్టులు ఉన్నాయి. అన్ని విభాగాలు, పోస్టులకు ఉమ్మడిగా నియామకాలు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడిగా నియామక ప్రక్రియను చేపట్టాలని జిల్లాల ఎంపిక కమిటీల (డీఎస్సీ)కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాల్లో నోటిఫికేషన్ జారీచేసి ఈ నెలాఖరులోగా స్రూ్కటినీ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు. ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అభ్యర్థులు అన్ని విభాగాల నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరంలేకుండా, ఉమ్మడిగా నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. గతంలో టీచింగ్ మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం–కుటుంబ సంక్షేమ విభాగాలు ఖాళీలను వేర్వేరుగా భర్తీ చేసుకునేవి. దీనివల్ల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేయడానికి ఇబ్బందులు పడేవారు. ఇకపై అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు తొలిసారిగా మూడు విభాగాలకు ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల మెరిట్ లిస్టును ఏడాదిపాటు పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత పోస్టుల భర్తీలో అవకాశం దక్కని వారికి, మెరిట్ ఆధారంగా తదుపరి నియామకాల్లో అవకాశం కల్పించనున్నారు. కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వారికి నియామకాల్లో మార్కుల వెయిటేజీ కల్పించారు. ఉమ్మడి నోటిఫికేషన్‌తో అభ్యర్థులకు మేలు గతంలో డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులకు అర్హతలు ఒక్కటే అయినప్పటికీ భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చేవి. అభ్యర్థులు కూడా మూడు విభాగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అందుకు అప్లికేషన్ నుంచి మొదలు అన్ని దశల్లోనూ మూడుసార్లు అదనపు భారం, ప్రయాస పడాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందుల్లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విభాగాల్లోను ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అభ్యర్థులు మూడు విభాగాలకు ఒక్క దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు మూడు విభాగాల్లో ఎక్కడ పనిచేయదలచుకున్నారో ఆ విభాగాన్ని ఎంచుకునే అవకాశం వారికే కల్పించింది. ఉమ్మడి ఎంపికవిధానం ద్వారా ఒక్కో అభ్యర్థికి దరఖాస్తు రుసుం రూ.500 కలిసి రావడంతో పాటు ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా అవుతుంది. ఉమ్మడి భర్తీ ప్రక్రియ, అభ్యర్థుల అర్హతలకు సంబంధించి జిల్లా ఎంపిక కమిటీలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు సైతం జారీచేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా ఉండే ఎంపిక కమిటీలో వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యశాఖ, డీఎంఈ విభాగాలకు చెందిన అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను వీరు పరిశీలించి, రిజర్వేషన్లు పాటించి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో నియామకాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాను పక్కనపెట్టి కొందరినే ఏరికోరి నియమించడం ఏమిటని నిలదీసింది. ‘నియామక పత్రాలను పరిశీలిస్తే సెలెక్ట్ లిస్ట్ నుంచి కేవలం ముగ్గురిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వారంతా నిరీక్షణ జాబితాలో ఉన్నవారే. సెలెక్ట్ లిస్ట్‌లోని ఇతరుల పేర్లను తిరస్కరించారు. సర్వీసు చట్టం ప్రకారం.. సెలెక్ట్ లిస్టును కాదని వెయిటింగ్ లిస్టుకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదు. ఇదేం పద్ధతి? ఇదేం ఎంపిక ప్రక్రియ?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాలోని పేర్ల నుంచే ట్రిబ్యునళ్లలో ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్ బదులిచ్చారు. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఇన్‌కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) కోసం సెలక్షన్ కమిటీ 41 మందిని సిఫారసు, అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారని లాయర్ అరవింద్ దాతర్ చెప్పారు. ఇదేం కొత్త కాదు, ప్రతిసారీ ఇదే కథ అని ధర్మాసనం ఆక్షేపించింది. ట్రిబ్యునళ్లలో నియామకం కోసం తమ దృష్టికి వచ్చిన పేర్లను షార్ట్‌లిస్టు చేయడానికి కోవిడ్ కాలంలో కోర్టు ఎంతగానో శ్రమించిందని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. తాజా నియామకాలను పరిశీలిస్తే ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీ కాలం కేవలం సంవత్సరమే ఉందని పేర్కొన్నారు. సంవత్సరం కోసం జడీ్జలు ట్రిబ్యునల్ సభ్యులుగా వెళ్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే పాటించకపోతే ఎలా? సెలక్షన్ కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం ప్రతిస్పందించింది. ‘‘మనది రూల్ ఆఫ్ లా పాటించే దేశం. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం. ‘సిఫారసులను అంగీకరించను’ అని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు’’ అని హితవు పలికింది. నియామకాల ప్రక్రియను ప్రభుత్వమే పాటించకపోతే ఆ ప్రక్రియకు విలువ ఏమున్నట్లు? అని వ్యాఖ్యానించింది. ఆదరాబాదరగా నియమించాలి్సన అవసరమేంటి? నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా జస్టిస్ వేణుగోపాల్‌ను ఆదరాబాదరగా నియమించడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. -
మా సహనాన్ని పరీక్షిస్తున్నారా?: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. భర్తీ విషయంలో అలసత్వం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం వాదనలు జరగ్గా.. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం మీద గౌరవం లేనట్లు మాకనిపిస్తోంది. మా సహనాన్ని పరీక్షిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఒక వారంలో ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సీజే నేతృత్వంలోని న్యాయమూర్తుల బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక సోలిసిటర్ జనరల్ మెహతాకి మూడు అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపిన సీజే రమణ.. నియమకాలు చేపట్టడం, ట్రిబ్యునల్స్‌ను మొత్తంగా మూసేయడం, నియమాకాలకు తమకు(సుప్రీం) అవకాశం ఇచ్చి.. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధపడడం ఆప్షన్స్‌ను కేంద్రం ముందు ఉంచారు. ‘‘మేం అసహనంతో ఉన్నాం. ప్రభుత్వంతో ఇబ్బందికర వాతావరణం మేం కోరుకోవట్లేదు’’ అని సీజే వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా‘‘ప్రభుత్వమూ ఇబ్బందికర పరిస్థితుల్ని కోరుకోవట్లేద’’ని తెలిపారు. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ దాఖలు చేసిన ట్రిబ్యునల్ ఖాళీల భర్తీ పిటిషన్‌పై.. చీఫ్ జస్టీస్ రమణ, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపుతోంది. ఈ క్రమంలోనే సోమవారం కేంద్రానికి నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణను సెప్టెంబర్13కి వాయిదా వేసింది. చదవండి: వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు -
2,000 మంది నియామకం: లెన్స్‌కార్ట్
న్యూఢిల్లీ: కంటి అద్దాల తయారీ, విక్రయంలో ఉన్న లెన్స్‌కార్ట్ వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 2,000 మందికిపైగా సిబ్బందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది. అలాగే సింగపూర్, పశ్చిమ ఆసియా, యూఎస్‌లో మరో 300 మందిని చేర్చుకోనున్నట్టు బుధవారం వెల్లడించింది. టెక్నాలజీ, డేటా సైన్స్, విక్రయాలు, సరఫరా, ఫైనాన్స్, మానవ వనరుల వంటి విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నట్టు తెలిపింది. సంస్థ వృద్ధిలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతా ల్లో నిపుణులైన మానవ వనరులను కొత్తగా చేర్చుకుంటున్నట్టు లెన్స్‌కార్ట్ ఫౌండర్ పీయూష్ బన్సల్ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 5,000 పైచిలుకు సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. 2010లో ప్రారంభమైన లెన్స్‌కార్ట్ ఇప్పటికే కేకేఆర్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఐఎఫ్‌సీ వంటి సంస్థల నుంచి నిధులను సమీకరించింది. -
గుంతకల్లు రైల్వేలో బయటపడ్డ నకిలీ నియామకాలు
గుంతకల్లు(అనంతపురం): ‘నకిలీ అపాయింట్మెంట్’ల వ్యవహారం రైల్వే ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది. నకిలీ ఉత్తర్వుల వ్యవహారంలో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం 12 మంది నకిలీ ఉత్తర్వులతో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించారు. వీరిలో చెన్నైకి చెందిన టి.రవికుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్నాడు. మిగిలిన 11 మంది వివరాలు రైల్వే అధికారులు గోప్యంగా ఉంచారు. వాస్తవానికి ఇలాంటి నకిలీ ఉత్తర్వులతో దాదాపు 50 మందికి పైగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం అక్రమాల్లో తమిళనాడుకు చెందిన 12 మంది నుంచే కాకుండా గుత్తి, గుంతకల్లుకు చెందిన మరో 38 మంది అభ్యర్థుల నుంచి రూ. లక్షలు వసూలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బు పర్సనల్ డిపార్టుమెంట్‌లోని కొందరు సిబ్బందితోపాటు ఒకరిద్దరు అధికారులు కూడా వాటాల రూపంలో దండుకున్నట్లు సమాచారం. ఫోర్జరీ సంతకాలతో.. అపాయింట్మెంట్ ఆర్డర్లో ఆఫీస్ ముద్రతోపాటు డీపీఓ పోర్జరీ సంతకంతో కూడిన ఉత్తర్వులు చూస్తుంటే దీని వెనుక పెద్ద గూడుపుఠానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా రైల్వే ఆస్పత్రి నుంచి ఫిట్నెస్, మెడికల్ సరి్టఫికెట్లు కూడా పొందారంటే..ఇందులో పర్సనల్ డిపార్టుమెంట్ కార్యాలయ సిబ్బంది ప్రమేయం తప్పకుండా ఉంటుందని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. కాగా ఈ నకిలీ బాగోతం బహిర్గతం కావడంతో అప్రమత్తమైన అవినీతిపరులు తప్పిదం తమ మీదకు రాకుండా దారి మళ్లించే పథకం రచించినట్లు సమాచారం. పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులు ఆదివారం గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. గుత్తి డీజిల్òÙడ్లో ఎం.విజయస్టాన్లీ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడనీ, ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి తమను నమ్మించాడు. ఈ ఏడాది జనవరిలో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను అందజేశాడని తెలిపారు. అలాగే సర్టిఫికెట్, మెడికల్, ఫిట్నెస్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లుగా వివరించాడు. తీరా జాయిన్ అయ్యే సమయంలో అవి పోర్జరీ సంతకాలతో కూడిన అపాయింట్మెంట్ లెటర్లు అని తేలడంతో తాము మోసపోయినట్లు బాధితులు బోరుమన్నారు. చనిపోయిన వ్యక్తి పేరుతో దందా.. వాస్తవానికి నకిలీ ఆర్డర్ కాపీలతో తమను మోసపుచ్చాడని నిరుద్యోగులు చెబుతున్న విజయ్‌స్టాన్లీ అనే వ్యక్తి కొంతకాలం క్రితం కరోనాతో మృతి చెందాడు. అతని ఐడీ కార్డును ఉపయోగించుకుని ఓ వ్యక్తి తాను రైల్వే ఉద్యోగినంటూ మోసానికి తెర లేపినట్లు తెలిసింది. ఇలా 50 మంది తాము మోసపోయినట్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అయితే ఈ కుంభకోణంలోని ప్రధాన పాత్రధారులంతా పక్కకు తప్పుకొని... చనిపోయిన స్టాన్లీబాబుపైకి నేరం నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు సూత్రధారులు బయటపడే అవకాశం ఉంది. చదవండి: అంతేనా లోకేష్.. టీడీపీ నేతల ప్రాణాలకు విలువే లేదా! ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
వీటిలో గత పదేళ్ళుగా నియామకాలు లేవు!
హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలకు మోక్షం లభించట్లేదు. కోర్టు కేసులంటూ కొన్నేళ్లు.. ప్రభుత్వ అనుమతుల కోసమంటూ ఇంకొన్నేళ్లు.. తీరా ప్రభుత్వం అనుమతి ఇచ్చాక నిబంధనల రూపకల్పన పేరుతో మరికొన్నేళ్లు.. తరువాత ఎన్నికల కోడ్.. ఇలా కారణం ఏదైనా పదేళ్లుగా నియామకాలు జరగట్లేదు. సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయినా వీసీల నియామకాలు జరగకపోవడంతో అధ్యాపకుల పోస్టుల ఖాళీల భర్తీకి ముందడుగు పడట్లేదు. కాంట్రాక్టు సిబ్బందితో నెట్టుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఎంతో కీలకమైన ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో యూనివర్సిటీల్లో పరిశోధన అటకెక్కింది. లెక్కలు తేల్చిన విద్యాశాఖ... యూనివర్సిటీల్లోని ఖాళీలు, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల తాజా లెక్కలను విద్యాశాఖ విడుదల చేసింది. దీని ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులుంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. యూనివర్సిటీల్లో కేవలం 968 మందే (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయకపోవడం గమనార్హం. ఆరు యూనివర్సిటీల్లో లేని ప్రొఫెసర్లు.. రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేకుండానే శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలు నెట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేని దుస్థితి నెలకొంది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒక్కరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కగట్టింది. చారిత్రక యూనివర్సిటీల్లోనూ భారీగా ఖాళీలే... వందేళ్లు దాటిన ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. గత పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలను పెద్దగా చేపట్టకపోవడం, వివిధ కారణాలతో పోస్టుల భర్తీని ఉన్నత విద్యాశాఖ వాయిదా వేయడమే ఇందుకు కారణం. ఓయూ తరువాత ఎంతో కీలకమైన కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరే అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. అభివృద్ధిపైనా లేని ధ్యాస.. యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. గతేడాది కంటే ఈసారి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెరిగినా యూనివర్సిటీల అభివృద్ధికి ప్రగతి పద్దు కింద నిధులను కేటాయించట్లేదు. ఈసారి కూడా నిర్వహణ పద్దులోనే ఆ మెుత్తాన్ని పెంచింది. గతేడాది రూ. 606.73 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ. 627.28 కోట్లు కేటాయించింది. అయితే అవి వర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. -
రెల్లి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం
సాక్షి, అమరావతి: రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాల కార్పొరేషన్ చైర్మన్‌గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్‌గా కొమ్మూరి కనకరావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్‌గా వదయ్ మధుసూధన్‌రావులు నియమితులయ్యారు.