Armur Assembly Constituency
-
కేసీఆర్ నీ టైం అయిపోయింది: అమిత్ షా
సాక్షి, నిజామాబాద్: పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏ పనీ చేయలేదని, కానీ తన కొడుకు కేటీఆర్ కోసం వేలాది కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆర్మూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ సర్కార్ నెరవేర్చలేదు. పదేళ్లుగా తెలంగాణను నాశనం చేసింది. 2014లో దళితుడ్ని సీఎంను చేస్తానని కేసీఆర్ మాటిచ్చి తప్పారు. కానీ, బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని హామీ ఇస్తున్నా. తెలంగాణలో ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ ప్రభుత్వం కబ్జా చేసింది. పేపర్ లీకేజ్‌లతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. టేబుల్‌పైన ఎక్కువ డబ్బులు ఎవరు పెడితే.. వాళ్లను మంత్రి వర్గంలో కేసీఆర్ చేర్చుకునేవారు. కేసీఆర్ నీ టైం అయిపోయింది. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం వచ్చింది.. ..అవినీతిపరులందరినీ జైలుకు పంపే కార్యక్రమం బీజేపీ చేపట్టింది. కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ కోసం ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తాం. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. కేసీఆర్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉంది. ఓవైసీకి, రజాకార్లకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్‌తో సుపరిపాలన సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌లో కేవలం మంత్రి పదవి పొందాలంటే ఢిల్లీలో చర్చించాలి అని.. అలాంటి పార్టీ అవసరమా?.. ..మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలిచింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీడీ వర్కర్ల కోసం ప్రత్యేక హాస్పిటల్ కట్టిస్తాం. ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీని తెస్తాం. జీఎస్టీలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నాం. బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం అని షా ప్రకటించారు. ఆర్మూర్ సభ అనంతరం రాజేంద్ర నగర్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు అమిత్ షా. సాయంత్రం అంబర్‌పేటలో రోడ్ షర్లో పాల్గొంటారు. -
KTR Accident: బీఆర్ఎస్ ర్యాలీలో అపశ్రుతి.. కేటీఆర్‌కు తప్పిన ముప్పు
సాక్షి, నిజామాబాద్: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రచార వాహనం డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేకులు వేయడంతో.. పైన ఉన్న రెయిలింగ్ విరిగి నేతలంతా తలోదిక్కు పడబోయారు. అయితే రెయిలింగ్ విరిగి కిందపడకపోవడం, సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం బ్రేకులు వేశాడు డ్రైవర్. ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్‌రెడ్డి వాహనం నుంచి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు పడబోగా.. వెనక ఉన్న సిబ్బంది పట్టుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డి, ఇతరలు రెయిలింగ్ ముందుకు వంగి ఆగిపోయారు. ఈ ఘటన తర్వాత కూడా కేటీఆర్ తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నా గురించి ఆందోళన వద్దు:కేటీఆర్ ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వద్దని పార్టీ కేడర్‌కు, అభిమానులకు ఆయన తెలియజేశారు. ఈ ఘటన తర్వాత ఆర్మూర్ నుంచి కొడంగల్ రోడ్‌షోలో పాల్గొనేందుకు కేటీఆర్ వెళ్లారు. మరోవైపు కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించారు. Spoke to BRS working President KTR Garu. As scary as the video looks, he assures me and everyone that he is perfectly fine. Rearing to go and continue campaign as energetic as always! Take care Ramanna and let’s win this 🩷🩷🩷 — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 9, 2023 -
ఆర్మూరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసేది ఎవరు?
ఆర్మూరు నియోజకవర్గం ఆర్మూరు నియోజకవర్గంలో మరోసారి ఆశన్నగారి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పక్షాన ఘన విజయం సాదించారు.ఆయన 28795 ఓట్ల ఆదిక్యతతో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఆకుల లలితపై గెలుపొందారు. ఆకుల లలిత ఎన్నికలు పూర్తి కాగానే టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. జీవన్ రెడ్డికి 72125 ఓట్లు రాగా, లలితకు 43330 ఓట్ల వచ్చాయి. కాగా బిజెపి తరపున పోటీచేసిన పి.వినయ్ కుమార్ రెడ్డికి 19వేలకు పైగా ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్ది రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఆర్మూరులో తొలి నుంచి రెడ్డి సామాజికవర్గం నేతలే అత్యదికంగా గెలిచారు. 2014లో ఆర్మూరులో మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి ని జీవన్ రెడ్డి ఓడిరచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల నాటికి సురేష్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయి తదుపరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ఐ అధికారంలోకి వచ్చాక స్పీకరు పదవిని చేపట్టిన కె.ఆర్. సురేష్‌రెడ్డి ఇంతకుముందు బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందగా 2009లో ఆయన బాల్కొండలో కాకుండా ఆర్మూరు నియోజకవర్గానికి మారి పోటీ చేయగా, స్వయాన ఆయన మేనత్త ఆలేటి అన్నపూర్ణమ్మ చేతిలో అనూహ్యంగా పరాజితులయ్యారు. ఆర్మూరు నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిది సార్లు గెలిస్తే, తెలుగుదేశం పార్టీ మూడుసార్లు,టిఆర్ఎస్ మూడుసార్లు, సోషలిస్టుపార్టీ ఒకసారి గెలుపొందాయి. ఆర్మూరు నుంచి సంతోష్‌రెడ్డి నాలుగుసార్లు గెలుపొందారు. రెండువేల నాలుగులో టిఆర్ఎస్ పక్షాన గెలిచి కొంతకాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తరువాత ఆయన అసమ్మతి నేతగా మారి శాసనమండలి ఎన్నికలలో విప్ ఉల్లంఘన కింద అనర్హతకు గురయ్యారు. అయితే తీర్పు వెలువడడానికి ఒక రోజు ముందు ఈయన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసారు. సంతోష్‌రెడ్డి గతంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో కూడా సభ్యునిగా ఉన్నారు. కొంత కాలం జడ్పి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన తుమ్మల రంగారెడ్డి బాల్కొండలో మరోసారి గెలిచారు. రంగారెడ్డి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత పొందారు. మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య ఒకసారి, మాజీ మంత్రి జి.రాజారామ్ మరోసారి ఇక్కడ నుంచి గెలిచారు. అంజయ్య ముషీరాబాద్‌లో మూడుసార్లు, రామాయంపేటలో మరోసారి గెలిచారు. అలాగే లోక్‌సభ, రాజ్యసభలకు కూడా ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయన కొంతకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. రాజారామ్ బాల్కొండలో మరో నాలుగుసార్లు గెలిచారు. ఈయన కూడా జలగం, మర్రిచెన్నారెడ్డి, అంజయ్యల క్యాబినెట్లలో పనిచేసారు. 1999లో ఇక్కడ గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ 2004లో బాన్స్వాడ నుంచి గెలిచారు. 2014,2018లలో టిఆర్ఎస్ తరపున నిజామాబాద్ రూరల్ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1985లో ఆర్మూరులో గెలిచిన మహీపాల్‌రెడ్డి, 1994, 2009లో గెలుపొందిన అన్నపూర్ణమ్మలు భార్యాభర్తలు. మహిపాల్‌రెడ్డి ఎన్టీఆర్ క్యాబినెట్లో కొద్ది కాలం మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్మూరు గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..