సాక్షి, నిజామాబాద్: బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రచార వాహనం డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేకులు వేయడంతో.. పైన ఉన్న రెయిలింగ్ విరిగి నేతలంతా తలోదిక్కు పడబోయారు. అయితే రెయిలింగ్ విరిగి కిందపడకపోవడం, సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
ఆర్మూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం బ్రేకులు వేశాడు డ్రైవర్. ఈ ప్రమాదంలో బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేష్‌రెడ్డి వాహనం నుంచి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు పడబోగా.. వెనక ఉన్న సిబ్బంది పట్టుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డి, ఇతరలు రెయిలింగ్ ముందుకు వంగి ఆగిపోయారు. ఈ ఘటన తర్వాత కూడా కేటీఆర్ తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నా గురించి ఆందోళన వద్దు:కేటీఆర్
ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వద్దని పార్టీ కేడర్‌కు, అభిమానులకు ఆయన తెలియజేశారు. ఈ ఘటన తర్వాత ఆర్మూర్ నుంచి కొడంగల్ రోడ్‌షోలో పాల్గొనేందుకు కేటీఆర్ వెళ్లారు. మరోవైపు కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించారు.
Spoke to BRS working President KTR Garu. As scary as the video looks, he assures me and everyone that he is perfectly fine. Rearing to go and continue campaign as energetic as always!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 9, 2023
Take care Ramanna and let’s win this 🩷🩷🩷
Comments
Please login to add a commentAdd a comment