beneficiaries
-
అనుమతి లేకుండా యాంజియోప్లాస్టీ.. ఇద్దరు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు అనుమతి లేకుండా ఏడుగురు బాధితులకు యాంజియోప్లాస్టీ నిర్వహించాడు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నవంబర్ 10న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. దీనికి 19 మంది బాధితులు హాజరయ్యారు. వీరిలో 17 మంది రోగులకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. ఏడుగురికి యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్యం దిగజారింది. ఈ నేపధ్యంలో మహేశ్ గిర్ధర్ భాయ్ బరోట్, నగర్ సేన్మా అనే బాధితులు మృతిచెందారు.విషయం తెలుసుకున్న బాధితుల గ్రామస్తులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం పరారయ్యింది. ఆసుపత్రి డైరెక్టర్, చైర్మన్ కూడా పరారయ్యారని సమాచారం. కాగా ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) సొమ్మును దక్కించుకునేందుకు ఈ ప్రైవేట్ ఆసుపత్రి.. బాధితుల అంగీకారం తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ మెడికల్ కౌన్సిల్ అహ్మదాబాద్‌లోని ఖ్యాతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో సహా ఐదుగురి నుంచి జీఎంసీ సమాధానాలు కోరింది. యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ గురించి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని కోరింది. మరోవైపు ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పీఎంజేఏవై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.ఈ పథకం కింద ఆసుపత్రికి అందాల్సిన అన్ని బకాయి చెల్లింపులను నిలిపివేసింది. కాగా గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధికి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ వ్యాధి గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఫలితంగా రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఈ చికిత్సతో కుచించుకుపోయిన ధమనులు లేదా సిరలను విస్తరించేలా చేస్తారు. ఫలితంగా కరోనరీ ధమనులకు రక్త ప్రవాహ పునరుద్ధరణ సవ్యంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
‘మూసీ’ ప్రక్షాళన.. నిర్వాసితుల తరలింపు (ఫోటోలు)
-
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
సాక్షి, విజయవాడ: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్ వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయి. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,566.22 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు జమ చేశాం. గతంలోని హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్లు విడుదల చేశాం. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటివరకు రూ.366 కోట్లు విడుదల చేశాం. గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91 లక్షల మందికి వైద్యసేవలు అందించాం ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 13,471 కోట్లు ఖర్చు చేశాం.. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తాం’’ అని ట్రస్ట్ సీఈవో లక్ష్మీషా వెల్లడించారు. -
డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం
సాక్షి, విజయవాడ: డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటమాడుతోంది. లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు చేస్తోంది. ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరుకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నిన్న అర్థరాత్రి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారు. క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరగా, ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరో వైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసింది. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ పేర్కొనగా, దీంతో టీడీపీ బాగోతం బయటపడింది. -
డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
సాక్షి, విజయవాడ: పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎందుకంత కడుపుమంటో అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు.. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్రకు తెరలేపాడు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలైన వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అడ్డుకుంటూ, లబ్దిదారులకు డబ్బులు చేరకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది.తాజాగా ఇప్పటి వరకు కొనసాగుతున్న డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై విద్యార్ధులు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని లంచ్ మోషన్ కింద హైకోర్టు విచారించనుంది. -
ఒకే రోజు 25,000 ఇళ్ల పట్టాలు..
-
నిరుపేదలకు తీరిన సొంతింటి కల
-
వచ్చే ఎన్నికల్లోనూ ఫ్యాన్ ప్రభంజనమే అంటున్న లబ్ధిదారులు
-
మా జీవితాలు మారాయి..మళ్లీ జగనన్నకే మా ఓటు
-
అక్కచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమం జరుగుతుంది. గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల పైబడి ఇచ్చాం. రూ.35వేల రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోంది. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సిమెంటు, స్టీల్, మెటల్ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు మంచి జరిగేలా చూస్తున్నాం. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 -20 లక్షల వరకూ ఒక ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇప్పిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని రీయింబర్స్మెంట్ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. ఇదీ చదవండి: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు -
పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
-
లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ నిధులు విడుదల చేశారు
-
విజయ గాథలతో వీడియోలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలను నాలుగేళ్ల పాటు చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకాల లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో వలంటీర్ల ద్వారా సేకరించి పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఈ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మహిళల జీవితాలు, స్థితిగతులను ఏ రకంగా మార్చాయో వీడియోల్లో పొందుపరచాలని సూచించారు. పంపిన వాటిల్లో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇవి మరి కొందరిలో స్ఫూర్తిని పెంచుతాయన్నారు. సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున ఉత్తమ విజయ గాథలకు బహుమతులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని, వాటితో పాటే లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు అందచేస్తామని తెలిపారు. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం. 2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా మారిపోయిన దుస్థితి నెలకొంది. 18 శాతం పైచిలుకు ఖాతాలన్నీ అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం అధికారంలోకి వచి్చన తర్వాత వారికి చేయూతనిచ్చి ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక స్వావలంబన, సాధికారత క్రమం తప్పకుండా ఏటా లబ్ధిదారులకు పలు పథకాలను అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. అందువల్లే ఈ రోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి పరిమితమయ్యాయి. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా నిలిచి నడిపించిన ప్రభుత్వం మనది. జనవరిలో వైఎస్సార్ ఆసరా చివరి విడత ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారానే రూ.25 వేల కోట్లకుపైగా మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈ పథకం కింద మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం. నాలుగో విడతగా, చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు్ల ఇస్తున్నాం. జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది. దీని ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి. ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలను వివరించే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి. సుస్థిర జీవనోపాధి.. మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం. స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం. ఇందులో భాగంగానే పలు మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించాం. ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు దీనిపై అవగాహన పెంపొందించాలి. ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం. మహిళా సంఘాలు తీర్మానాలు చేస్తే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది. ‘చేయూత’తో రూ.14,129 కోట్లు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం వేడుకలా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందచేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచి వారికి జీవనోపాధి చూపించేలా కార్యక్రమం చేపట్టాం. 45 ఏళ్లకు పైబడ్డ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తూ 26.50 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ పథకం వారి జీవితాల్లో ఏ రకంగా మార్పులు తెచి్చందో తెలియజెప్పాలి. జీవనోపాధి మార్గాలపై అవగాహన కలి్పస్తూ వారికున్న అవకాశాలను వివరించాలి. ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. సామాజిక న్యాయానికి చిహ్నంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సామాజిక న్యాయానికి చిహ్నంగా విజయవాడలో 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో రూపొందించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరిస్తున్నాం. సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ప్రతి సచివాలయం పరిధిలో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి సచివాలయం నుంచి ఐదుగురిని 19న జరిగే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలి. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతాం. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో వారందరినీ భాగస్వాములను చేస్తాం. గ్రామ స్థాయిలో పరిపాలనను చేరువ చేసి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం. ఇదొక గొప్ప మార్పు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఈ మార్పులకు ప్రతిరూపంగా నిలుస్తుంది. -
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్‌కార్డును ప్రామాణికం(థంబ్‌రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్‌సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్‌సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్‌లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
ఐటీని పంపుతాననుకున్నావా..ప్రధాని సరదా వ్యాఖ్యలు
వారణాసి:సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దివ్యాంగులైన వ్యాపారవేత్తలతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ల వల్ల వారు చేస్తున్న వ్యాపారాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ వ్యాపారవేత్తలతో సంభాషణలో భాగంగా అందులో ఒకరిని మోదీ పలకరించారు. ఏం వ్యాపారం చేస్తున్నావని మోదీ ప్రశ్నించారు. తాను స్టేషనరీ వ్యాపారం చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ తనకు, తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని ఆ దివ్యాంగుడు బదులిచ్చాడు. ఆదాయం ఎంత వస్తోందని మోదీ అడగ్గా చెప్పేందుకు అతడు కాసేపు ఆలోచించాడు. దీంతో ఇన్‌కమ్‌ట్యాక్స్(ఐటీ) వాళ్లను పంపుతాననుకుంటున్నావా అతనితో అని మోదీ చమత్కరించారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఆయుష్మాన్భారత్ యోజన, ఉజ్వల్ యోజన, పీఎం స్వనిధి యోజన, ముద్రయోజన తదితర పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. కాశీ తమిళ్ సంగమం 2.0ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవు -
3 వేలు పెన్షన్ పై లబ్ధిదారులు హర్షం
-
కొత్త రేషన్‌కార్డులు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ మొదలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా ఉండాలంటే..రేషన్‌కార్డు తప్పనిసరి అయ్యింది. అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు (ఆహారభద్రత కార్డులు) జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మంగళవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కార్డులు ఉన్నాయనే కారణంతో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 3 లక్షల కార్డులు జారీ చేశారు. అప్పటి నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వనించలేదు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడినవారు... ఈ పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా కార్డుల్లో చేర్చలేదు. చనిపోయిన వారి పేర్లు మాత్రమే ఎప్పటికప్పుడు తొలగించారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌కార్డులు: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 90.14 లక్షలు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్నయోజన కింద 5.62 లక్షల కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల పరిధిలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభా, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్డుల లబ్ధిదారుల్లో 20 శాతం వరకు అనర్హులే ఉన్నట్టు గత ప్రభుత్వం గుర్తించింది. అయితే అనర్హుల నుంచి కార్డులను ఏరివేత ప్రక్రియ ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంగా యథాతథ స్థితి కొనసాగించింది. అనర్హులను తొలగిస్తారా...? గతంలో తెలుపు, గులాబీ రేషన్‌కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీకార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులు ఇచ్చిం ది. ఈ లెక్కన రాష్ట్రంలో 90.14 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.83 కోట్లు. రాష్ట్ర జనాభానే 4 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహారభద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రేషన్‌కార్డులలో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి, కొత్తగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా లేక ఉన్న వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా అర్హులను గుర్తిస్తారా చూడాలి. -
జగనన్న ఫీజు.. మా అమ్మాయి ఇంజినీర్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా అమ్మాయి ఇంజినీర్.. మాది గిరిజన కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడదు. కొండపోడు పనులు, కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో కొండ శిఖరంపైన ఉన్న జన్నోడుగూడ గ్రామానికి చెందిన నాకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు చదువంటే చాలా ఇష్టం. స్థానికంగా ఉన్న ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఇద్దరినీ ఇంటర్మీడియట్ వరకు చదివించాను. ఆ పై చదువులు చదివించాలంటే చాలా ఖర్చు అవుతుందని భయపడ్డాను. అయితే పేద కుటుంబాల పిల్లల చదువుకు ప్రభుత్వం సాయం అందిస్తోందని గ్రామంలో చదువుకున్న వారు చెప్పారు. దీంతో పిల్లలను చదివించేందుకు ఏర్పాట్లు చేశాను. సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. హాస్టల్లో ఉండి చదువుకునేందుకు జగనన్న వసతిదీవెన పథకం కింద డబ్బు సమకూరుస్తోంది. పెద్దకుమార్తె విజయ ఏలూరులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. చిన్నకుమార్తె ప్రశాంతి విశాఖపట్నంలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. పైసా ఖర్చు లేదు. ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నా భార్య బ్యాంకు ఖాతాలో వేయడంతో కళాశాలకు ఫీజులు కడుతున్నాను. మాలాంటోళ్ల పిల్లలు ఇంజనీరింగ్ చదవడమంటే మాటలా! మా కల నిజమైంది. – సవర బంగారయ్య, జన్నోడుగూడ (బోనుమద్ది కొండలరావు, విలేకరి, సీతంపేట) పథకాలే మా బంధువులు భార్యభర్తలిద్దరం కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ మా నలుగురు బిడ్డల్ని చదివించుకునేవాళ్లం. రానురాను కూలి పనులు తగ్గిపోయాయి. రాబడి కూడా అంతంతమాత్రంగానే ఉండేది. కూలి చేస్తూ నలుగుర్ని సాకడం కష్టమైపోయింది. అప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలో పాలుపోలేదు. బంధువుల్లో కూడా మాపై చిన్నచూపు ఏర్పడింది. మాతో మాట్లాడేందుకు, మా ఇంటికి వచ్చేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం.. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత పథకాల ద్వారా నాకు లబ్ధి కలిగింది. ఈ మొత్తాలకు శ్రీ నిధి తోడైంది. బ్యాంకు లింకేజీ కింద 1.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తీసుకుని, ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం తుమ్మల చెరువులో కిరాణా షాప్ పెట్టుకున్నాము. నేను, నా భర్త కలిసి దుకాణాన్ని నడుపుతున్నాము. మా చుట్టుపక్కల ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలంతా మా దుకాణంలోనే సరుకులు కొంటున్నారు. క్రమంగా మా ఆర్థిక పరిస్థితులు గాడిలో పడ్డాయి. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశాం. ఈ ప్రభుత్వమే లేకపోయి ఉండుంటే మేము ఏమైపోయేవాళ్లమో! ప్రభుత్వ పథకాలే మా బంధువులయ్యాయి. ఇప్పుడు హాయిగా ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నాం. – షేక్ మహబున్నీ, తుమ్మల చెరువు (రామయోగయ్య, విలేకరి, తుర్లపాడు) పని కోసం ఇక వలసపోము.. జీవనోపాధి కోసం గతంలో చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లం. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత ఆ బాధలు తప్పాయి. మా సొంత ఊరు పార్వతీపురం మన్యం జిల్లాలోని కొత్తపల్లి. నా ఇద్దరు ఆడ పిల్లలను మా అమ్మ దగ్గర ఉంచి నేను, నా భర్త జీవనోపాధి కోసం చెన్నైకి వెళ్లి పనులు చేసుకునే వారం. అయితే కోవిడ్ సమయంలో మా ఊరికి తిరిగొచ్చాం. తరువాత పిల్లలతో సహా విశాఖపట్నం వచ్చాము. ఇక్కడ అక్కయ్యపాలెం అబిత్నగర్లో నేను అపార్ట్మెంట్లో వాచ్ ఉమెన్‌గా ఉంటున్నాను. నా భర్త పోలిశెట్టి తాపీ పనులకు వెళ్తున్నాడు. డిగ్రీ చదువుతుండగానే మా పెద్దమ్మాయికి పెళ్లి చేశాము. రెండో అమ్మాయి మౌనిక అక్కయ్యపాలెం జీవీఎంసీ హైసూ్కలులో తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ పాపను బాగా చదువించుకోవాలని కోరిక. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో మా లాంటి పేదలకు ఆ ఆశ నెరవురుతుందా అనే భయం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడా భయం లేదు. వరుసగా నాలుగేళ్లుగా అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి. దీంతో మా అమ్మాయికి కావలసినవన్నీ కొనగలుగుతున్నాను. బడికి పంపిస్తే పుస్తకాలు, బూట్లు, బ్యాగు ఇలా అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. జగనన్న చేస్తున్న సాయం మాలాంటోళ్లకు భరోసాగా నిలుస్తోంది. ధైర్యంగా పిల్లలను చదివిస్తున్నాం. మేము కూలి పనుల కోసం ఎక్కడికీ వలస వెళ్లాల్సిన అవసరం లేదు. – వెంపటాపు లక్ష్మీ, అబిత్నగర్, విశాఖపట్నం (కోవెల కాశీ విశ్వనాధం, విలేకరి, విశాఖపట్నం) -
పింఛన్ చూసి ఒకటో తారీఖు గుర్తుకొస్తోంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. బతుకు పంట పండింది పచ్చటి పంట చేలో నీళ్లు పెడుతూ.. పంటను సంరక్షించుకుంటూ పొలం పనిలో నిత్యం నిమగ్నమై పోవాలనేది నా కల. నేను గిరిజన రైతుని. నాకు నాలుగు ఎకరాల 20 సెంట్ల భూమి ఉంది. మా భూమి పూర్తిగా వర్షాధారం. వర్షం నీటిపై ఆధారపడి పంటలు పండించాల్సిన పరిస్థితి. నీరు సరిపోక పత్తి పంట వేసినప్పుడల్లా నష్టాలపాలయ్యేవాడిని. ఆదాయం అంతంతమాత్రంగా ఉండడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. గతేడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వం జలకళ పథకంలో భాగంగా నా పొలంలో బోరు వేయించింది. ఉచిత కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఎకరం భూమిలో మొక్కజొన్న, 1.20 ఎకరాల్లో వైట్ బార్లీ వేశాను. మిగిలిన పొలంలో పొగాకు పంట సాగు చేశాను. జలకళ బోరు వల్ల పంటలకు పుష్కలంగా నీరందింది. నాలుగు డబ్బులు చేతికందే అవకాశముంది. దీంతో నా బతుకు పంట పండినట్లే. మాది ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కాకులవారిగూడెం గ్రామం. నాకు భార్య, ఓ బాబు. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వస్తోంది. ఈ సొమ్ము పంట పెట్టుబడికి సరిపోతుంది. రైతు భరోసా కేంద్రం నుంచి ఎరువులు తీసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు వ్యవసాయం పండుగైంది. నాలాంటి గిరిజన రైతులు ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. – కమ్మే శ్రీనివాసరావు, కాకులవారిగూడెం (కోడూరి ఆనంద్, విలేకరి, బుట్టాయగూడెం) నాలుగు ముద్దలు నోట్లోకెళ్తున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో రూ.200 చాలీచాలని పింఛను ఇచ్చేవారు. నా భర్త శ్రీమోను కాలం చేశారు. కుమార్తెకు పెళ్లి చేసి పంపాను. ఇక ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే. నేను కూలికి వెళితే 200 రూపాయలు వస్తుంది. ఆరోగ్యం బాగోలేని రోజు ఆ డబ్బులు కూడా ఉండవు. పింఛనే నాకు ఆధారం. ఇటువంటి సమయంలో అవసరాలు తీరడానికి అప్పులు చేసేదాన్ని. అయితే, నిత్యం ఏ మోహం పెట్టుకుని అప్పులోళ్ల దగ్గరకు వెళ్లగలను? దీంతో తరచూ ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొనేదాన్ని. ఈ ప్రభుత్వం పుణ్యమా అని ప్రస్తుతం పింఛన్ రూ.2,750 వస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాను. వలంటీరే ప్రతి నెలా ఒకటవ తేదీన ఇంటికి వచ్చి పింఛను ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటి అవసరాల కోసం అప్పులు చేయడం లేదు. మానసిక ఒత్తిడి లేకుండా జీవిస్తున్నాను. సంతోషంగా నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి. ఈ ప్రభుత్వం నాకు మరో మేలు చేసింది. లే అవుట్ వేసి, సెంటున్నర ఇంటి స్థలం కూడా మంజూరు చేసింది. అద్దె ఇంట్లో ఉన్న నాకు ఇంటి స్థలం ఇవ్వడం సంతోషంగా ఉంది. తొందరలో అక్కడ ఇల్లు కట్టుకుంటాను. – పరదేశి రత్నమ్మ, మిట్నాల, నంద్యాల. (కె.చంద్రవరప్రసాద్, విలేకరి, నంద్యాల న్యూటౌన్) భిక్షాటన మానేశాం.. నేను, మా ఆయన సింహాద్రి రోజూ ఊరూరా తిరిగి భిక్షాటన చేసేవాళ్లం. మేం బుడగ జంగాలం. భిక్షాటన మా కులవృత్తి. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో ఎలాగోలా ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలను నెట్టుకొస్తుండేదాన్ని. ఏమాత్రం ఆరోగ్యం సహకరించకపోయినా ఆరోజు గడప దాటి వెళ్లలేకపోయేవాళ్లం. అప్పుడు పస్తులుండాల్సి వచ్చేది. కిందా మీదా పడి అందరికీ పెళ్లిళ్లు చేశాం. ఒకబ్బాయి తాపీ పని చేస్తుండగా... మరో కొడుకు ఆరోగ్యం అంతంత మాత్రమే. ఇద్దరబ్బాయిలు వారి భార్యలతో కలిసి మాతో పాటే ఉంటున్నారు. ఈ పరిస్థితిలో కుటుంబ పోషణ ఎలా.. అని దిగులు పడుతుండేవాళ్లం. ఆ తరుణంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 నా ఖాతాలో వేసింది. గత మూడేళ్లుగా పైకం అందింది. దానితోపాటు మూడేళ్లుగా ఆసరా పథకం ద్వారా కూడా డబ్బు అందుతోంది. ఆ వచ్చిన మొత్తంతో మా సొంతూరైన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మహర్తాపురంలో పాన్‌షాపు పెట్టుకున్నాను. నా భర్తకు పింఛన్ వస్తోంది. మనవళ్లకు అమ్మ ఒడి కింద డబ్బులొస్తోంది. తద్వారా మేము ఇప్పుడు కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నాం. భిక్షాటన మానేసి గౌరవంగా బతుకుతున్నాం. – ప్రసాదం యల్లమ్మ, మహర్తాపురం (అల్లు నర్సింహరావు, విలేకరి, కొత్తూరు) -
ఆసరా వచ్చింది.. అప్పు తీర్చింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కట్టెలమ్మిన చోటే పండ్లమ్ముతున్నా.. 20 ఏళ్లుగా నాకున్న రెండెకరాల్లో నిమ్మతోటనే జీవనాధారంగా చేసుకుని ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాను. గతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎటుచూసినా తోట మొత్తం ఎండిపోయేది. సరిపడా నీరు లేక దిగుబడి చాలా తక్కువగా చేతికొచ్చేది. దీంతో నిమ్మకాయల మార్కెట్ యార్డులో వ్యాపారుల వద్ద అప్పులు చేసి, పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరించాల్సి వచ్చింది. అదే క్రమంలో ఎండిపోయిన తోటను పూర్తిగా నరికించి వంట చెరకుగా అమ్మేశాను. ఫలితంగా కుటుంబ పోషణే భారంగా మారింది. చుట్టూ అప్పులతో మునిగిపోయాను. దిక్కుతోచని పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన జలయజ్ఞం నా తోట స్వరూపాన్నే మార్చేసింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మా గ్రామం పులికల్లు చెంతనే కండలేరు హై లెవల్ స్లూయిజ్ నుంచి ఎడమగట్టు కాలువను రూ.40 కోట్లతో తవ్వించారు. దీంతో మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. తర్వాత మళ్లీ నిమ్మ తోట పెంచాను. ప్రస్తుతం తోట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిమ్మతోట ఎండిందే లేదు. ఫలసాయం అందడంతో ఇబ్బందుల నుంచి బయటపడ్డాను. చేసిన అప్పులన్నీ క్రమంగా తీర్చేశాను. ఇప్పుడు మళ్లీ ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నా. ఈ ప్రభుత్వం పుణ్యంతోనే ఉద్యాన పంటలను చక్కగా పండించుకుంటున్నాము. గత పాలకులు మాటలతో మభ్యపెట్టి దశాబ్దాలుగా మా ప్రాంతంలో కాలువ పనులు చేపట్టకపోవడం వల్ల నా లాంటి రైతులు ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం పథకాల పుణ్యమాని నా పిల్లల చదువులు పూర్తయ్యాయి. – సన్నాల శ్రీనివాసులురెడ్డి, పులికల్లు (కె.మధుసూదన్, విలేకరి, పొదలకూరు) ఓ గూడు దొరికింది నా భర్త ఊరూరూ తిరిగి బట్టల వ్యాపారం చేస్తారు. వచ్చిన ఆదాయం అంతంత మాత్రంగా సరిపోయేది. బతకడానికే ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ఇల్లు కట్టుకునే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఆ ఊహకే స్వస్తి పలికాం. కాకినాడ జిల్లా సామర్లకోటలోని వీర్రాఘవపురంలో సుమారు 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నాను. గతంలో అనేక పర్యాయాలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసినా ఏ ప్రభుత్వంలోనూ స్థలం రాలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఒక రోజు వలంటీర్ మా ఇంటి వద్దకు వచ్చాడు. దరఖాస్తు పెట్టుకుంటే ఉచితంగా ఇంటి స్థలం ఇస్తారని చెప్పారు. ఇదంతా చూసిందేలే అనుకున్నాము. మా వలంటీరే దరఖాస్తు నింపించి ప్రభుత్వానికి పంపించారు. కొద్ది రోజుల్లోనే వలంటీరే మా ఇంటికి వచ్చి సామర్లకోట ఈటీసీ లేఅవుట్లో స్థలం కేటాయించారని శుభ వార్త చెప్పారు. ఆ స్థలంలో చక్కగా మా ఆలోచనకు అనుగుణంగా ఇల్లు కట్టుకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలకు తోడు మరింత మొత్తం కలిపి అందంగా నిర్మించుకున్నాం. ఇదివరకు నెలకు రూ.5 వేలు అద్దెగా కట్టేవాళ్లం. ఇప్పుడు ఆ మొత్తం ఆదా అవుతోంది. పిల్లలకు అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాలు వస్తుండటంతో వారి చదువుకు ఇబ్బంది లేకుండా పోయింది. మా జీవితానికి ఈ ప్రభుత్వం ఒక కొత్త బాట వేసింది. – కట్టా పద్మావతి, సామర్లకోట (అడపా వెంకటరావు, విలేకరి, సామర్లకోట) మా వ్యాపారానికి ‘ఆసరా’ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మాది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాం. రెండో అమ్మాయి ఇక్కడే హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. మా ఆయన చేపలు పట్టి తెస్తే వాటిని ఇక్కడే అమ్మేవాళ్లం. సరుకు కొని బయటికి వెళ్లి వ్యాపారం చేయాలని ఉన్నా పెట్టుబడి లేక ఊరుకున్నాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాకు అండగా నిలిచాయి. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలోని వీరభద్ర పొదుపు సంఘంలో ఉన్న నాకు మూడు విడతలుగా ఆసరా కింద రుణమాఫీ మొత్తం రూ.21,300 అందింది. బ్యాంకు లింకేజీ కింద రూ.1,00,000, స్త్రీనిధి నుంచి రూ.50,000 మంజూరైంది. ఈ సొమ్ముతో చేపల వ్యాపారం ప్రారంభించాం. సరుకు కొనుగోలు చేసి మా ఆయనతో కలిసి అరకు, అనంతగిరి మండలాల్లో అమ్ముతున్నాం. కూతురి చదువుకు అమ్మఒడి సొమ్ము అందుతోంది. జగనన్న విద్యాకానుక రూపంలో ఆమె చదువుకు అవసరమైన సామగ్రి అంతా ప్రభుత్వమే అందిస్తోంది. ఇప్పుడు మా వ్యాపారం కూడా బాగుంది. ఈ ప్రభుత్వం వల్ల మా కుటుంబం గౌరవంగా బతికే అవకాశం కలిగింది. – గుదేలక్ష్మి, నెయ్యిలవీధి, లక్కవరపుకోట (ఆర్.వి.సూర్యప్రతాప్, విలేకరి, శృంగవరపుకోట) -
చెట్టంత కొడుక్కి కాలు పోయింది.. కానీ జీవితం రోడ్డున పడలేదు
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను.. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితంగా రాష్ట్రంలో కోట్లాది మందికి నవరత్న పథకాలు అండగా నిలిచాయి. చిన్నారులు మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆనందంగా జీవించేలా వనరులు సమకూరుతున్నాయి. కనీస అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యానికి ఢోకా లేదనే విషయం ఊరూరా కళ్లకు కడుతోంది. పేదల జీవితకాల కల అయిన ‘సొంతిల్లు’ సాకారం కావడంతో కొత్తగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తుండటం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, ఆసరా అండగా నిలుస్తోంది. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైతం చదివేందుకు రాచబాట సిద్ధమైపోయింది. అన్నదాతకు వ్యవసాయం పండుగగా మారింది. వెరసి నవరత్నాల వెలుగులు ప్రతి ఊళ్లోనూ ప్రసరిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ తపన, తాపత్రయం, ఆకాంక్ష ఫలించిన తీరు లబ్ధిదారుల మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆరోగ్యశ్రీ లేకుంటే ఏమయ్యేదాన్నో! మేము ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలోని బీసీ కాలనీలో ఉంటున్నాం. గతంలో చేనేత పని చేస్తూ జీవించేవాళ్లం. నాకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ముగ్గురికీ వివాహమైంది. ప్రైవేటు బస్సులో క్లీనర్‌గా పనిచేసే నా కుమారుడు వెంకటేశ్వర్లుకు అనారోగ్య సమస్యలు తలెత్తి కాలు తీసేయాల్సి వచ్చింది. చెట్టంత కొడుక్కు కాలు తీసేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాం. కుటుంబం రోడ్డున పడిపోయింది. చివరికి కుటుంబ భారం మొత్తాన్నీ నేనూ, నా కోడలు సునీత మోస్తున్నాం. ఏదోలా సంసారాన్ని నెట్టుకొస్తున్న సమయంలో నాకు రెండేళ్ల కిందట తీవ్రంగా సుస్తీ చేసింది. గుండె ఆపరేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. దీంతో నేను వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లాను. అక్కడ వాళ్లు ఆపరేషన్ ఖర్చు రూ.5 లక్షలవుతుందన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఆపరేషన్ కోసం రూ.5 లక్షలు ఎక్కడి నుంచి తేగలను? నేను మరింత కుంగిపోయాను. నాకేమైనా జరిగితే అంగవైకల్యంతో ఉన్న నా కుమారుడి గతి ఏమవుతుందోనని మరింత బెంగ పట్టుకుంది. ఆ సమయంలో ఆరోగ్య శ్రీ నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా. ప్రభుత్వం కల్పించిన చేయూత, ఆసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాలు నాకూ వర్తించాయి. మూడు విడతలుగా చేయూత రూ.56,250 వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద రూ.31,800 లబ్ధి చేకూరింది. నేతన్న నేస్తంలో భాగంగా రూ.72 వేలు వచ్చాయి. డబ్బులతో చిల్లర కొట్టు పెట్టుకున్నాను. పచ్చళ్లు తయారు చేసి అమ్ముతున్నా. నెలకు రూ.20 వేల ఆదాయం వస్తోంది. – తిరుపతమ్మ (పి.హనుమంతరెడ్డి, విలేకరి, బేస్తవారిపేట) రుణమాఫీతో ఆర్థిక ఆసరా మేము విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెం అబిద్‌నగర్ కాలనీలో ఉంటున్నాము. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా చెయ్యలేదు. కానీ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి నాలాంటి పేద కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా కల్పించారు. నేను, నా భర్త, ఇద్దరు పిల్లలతో బతుకుదెరువుకోసం సాలూరు నుంచి విశాఖకు వలస వచ్చాము. అబిద్‌నగర్‌లో నా భర్త అపార్టుమెంట్ వాచ్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఐటీఐ, మరొకరిని ఇంటర్ చదివిస్తున్నాము. 2014 నుంచి 44వ వార్డు బిస్మిల్లా ఎంపీఎస్ గ్రూప్‌లో సభ్యురాలుగా కొనసాగుతున్నాను. అప్పట్లో గ్రూప్‌లో ఒకొక్కరికి రూ.50 వేల చొప్పున డ్వాక్రా రుణం ఇచ్చారు. అందులో కొంత వరకు నెలనెలా కట్టాను. సీఎం జగన్ నవరత్నాల పథకాల్లో భాగంగా వైఎస్సార్ ఆసరా పథకం కింద 2019 ఏప్రిల్ నాటికి ఉన్న డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వార్త విన్నాక చాలా సంతోషం కలిగింది. ఆసరా పథకం వల్ల నాకు రూ.25,465 వరకు రుణ మాఫీ అయ్యింది. విడతకు రూ.6,366 చొప్పున మూడు విడతల రుణం మాఫీ అయ్యింది. వాచ్‌మేన్‌గా మాకు ఆదాయం అంతంత మాత్రమే. అటువంటి సమయంలో ఆసరా పథకం కింద రుణమాఫీ జరగడం మా కుటుంబానికి చాలా వరకు ఆర్థిక భారం తప్పింది. ఐదు నెలల కిందట మళ్లీ మా గ్రూపునకు ఏడున్నర లక్షల రుణం మంజూరైంది. ఒక్కో సభ్యురాలికి రూ.75 వేల రుణం లభించింది. సున్నా వడ్డీ కింద రూ.2,539 నాలుగు విడతలుగా జమ అయింది. కరోనా సమయంలో పనులు లేక, ఆదాయం లేక ఇంటి పట్టున ఉంటున్న సమయంలో సున్నా వడ్డీ జమ కావడంతో మా కుటుంబాన్ని ఆర్థికంగా చాలా ఆదుకుంది. – ఎస్.రవణమ్మ, డ్వాక్రా సభ్యురాలు (బి.అనితా రాజేష్, విలేకరి, సీతంపేట, విశాఖపట్నం) అప్పుచేసే బాధ తప్పింది మాది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పీఎస్‌పేట గ్రామం. మా కుటుంబం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. మా తాత, తండ్రుల నుంచి వ్యవసాయమే జీవనాధారం. మా పొలాల పక్కనే పెద్దేరు నది పారుతుండటంతో నీటికి ఇబ్బంది లేదు. అందుకే వరి, చెరకు పంటలు వేస్తుంటాము. నాకు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. ఏటా 70 సెంట్లలో వరి, 80 సెంట్లలో చెరకు వేస్తుంటాను. ఈ ఏడాది కూడా వరి, చెరకు పంటలు వేశాను. వరికి ఉడుపుల నుంచి కోతలు వరకు సుమారు రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తం ఖర్చు అంతా నేనే భరించాల్సి వచ్చేది. అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టేవాడిని. ఒక్కోసారి తుపాన్లు వచ్చినప్పుడు పంట పూర్తిగా నష్టపోయి పెట్టుబడి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దయవల్ల నాలుగేళ్లుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున అందుతోంది. ఈ సొమ్ము ప్రభుత్వం ఇవ్వడం వల్ల నాకు అప్పులు చేసే బాధ తప్పింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలై ఇప్పుడు వరి పంట వెన్ను దశలో ఉంది. ఇది పెట్టుబడులు పెట్టే అదును. ఈ సమయంలో రైతు భరోసా కింద మొదటి విడతగా రూ.4 వేలు ఇటీవలే నా ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు పొలానికి ఎరువులు, మందులు, కలుపు పనులు చేయించాల్సి ఉంది. ఈ రైతు భరోసా డబ్బులు నాకే కాదు రైతులందరికీ ఎంతో ఉపయోగపడ్డాయి. – గొలగాని ఎరుకునాయుడు (కొప్పాక భాస్కర్‌రావు, విలేకరి, చోడవరం) -
మా పిల్లలు డాక్టర్ అయ్యే వరకు జగనన్నే సీఎంగా ఉండాలి
-
నాలాంటి పేదోడికి జగనన్నే దిక్కు
విత్తు నాటిన వెంటనే చెట్టయిపోదు. ఫలించడానికి దానికి సమయమివ్వాలి. ఈలోగా సంరక్షించాలి. ఇదిగో.. రాష్ట్రంలో ఇపుడా ఫలాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు మాయమాటలు చెప్పి... గెలిచాక మరిచిపోయే కుటిల రాజకీయాలకు స్వస్తి చెప్పారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను... గెలిచిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. కోవిడ్ చుట్టుముట్టి యావద్దేశాన్నీ అతలాకుతలం చేసినా... రాష్ట్రం సైతం ఆరి్థకంగా తల్లకిందులైనా... ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితం... ‘అమ్మ ఒడి’తో స్కూళ్లలో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను అన్నట్టే రూ. 3,000 వరకూ పెంచుకుంటూ వెళుతుండటంతో వారికి ఆసరా దొరికింది. డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలు తలెత్తుకు నిలబడ్డారు. నగదు జమచేసి రైతుకు భరోసా కల్పించటమే కాదు. ఈ–క్రాప్‌తో ఉచితంగా నూరుశాతం బీమా చేయించి పంటనష్టమనే భయం లేకుండా చేశారు. రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయాన్ని లాభసాటి చేశారు. చరిత్రలో తొలిసారి ఉచితంగా ప్రతి పేద మహిళకూ ఇంటి స్థలాన్నివ్వటమే కాక.. ఇళ్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు. ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపు రేఖలనే మార్చేశారు. విద్యాకానుక, గోరుముద్ద, వసతి దీవెన పేరిట విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ఇక ఆరోగ్య రంగంలో తెచ్చిన సంస్కరణలు అమూల్యం. ఆసుపత్రుల రూపురేఖల్ని మార్చటమే కాదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి దాదాపు ప్రతి చికిత్సా వచ్చేలా ప్రొసీజర్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్‌ను పంపించి, ఉచితంగా మందులిస్తూ పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇలా చెబుతూ వెళితే ఐదేళ్లలో ఇన్ని చేయటం సాధ్యమా? అనే ఆశ్చర్యం కలగకమానదు. కాకపోతే సంకల్పం కన్నా శక్తిమంతమైనదేదీ లేదని నిరూపించారు వైఎస్ జగన్. అందుకే.. ఆ ‘నవరత్నాల’ వెలుగుల్ని ఆయా లబ్ధిదారుల మాటల్లోనే చూపించే ప్రయత్నం ఆరంభించింది సాక్షి.. నా ప్రాణం నిలబెట్టారు.. మాది టెక్కలి సమీపంలోని రాందాస్‌పేట. శ్రీకాకుళం జిల్లా. నేను టెక్కలి రోడ్డులో కొబ్బరికాయలు అమ్ముకుంటూ బతుకుతున్నాను. గతేడాది ఆరో నెలలో ఎక్కువగా గుండె వద్ద నొప్పి వస్తుంటే... అందరూ గ్యాస్టిక్ నొప్పి అని చెప్పారు. శ్రీకాకుళంలోని పెద్ద డాక్టర్‌కు చూపిస్తే వెంటనే ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. అప్పుడే నా గుండె ఆగినంత పనైంది. మా ఆవిడ అమ్ములమ్మతో కలిసి తిరిగి మా ఊరొచ్చేశాము. దిగాలుగా ఉండిపోయాం. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేసేశాను. ఇంకా ఒక పిల్ల ఉంది. మేము రోజంతా రోడ్డు మీద కొబ్బరికాయలు, పళ్లు అమ్మితేనే ఇళ్లు గడుస్తుంది. ఏం చెయ్యాలిరా దేవుడా అని బెంగపడ్డాను. వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఈ డబ్బులు లేకుండానే ఆపరేషన్ చేస్తారని ఎవరో మా ఆవిడకి చెప్పారు. వెంటనే టెక్కలి ఆస్పత్రికి వెళ్లి నా జబ్బు కోసం చెప్పాను. ఇలా చెప్పానో లేదో నాలుగైదు రోజు ల్లోనే ఆపరేçషన్ చేయిస్తామని కబురు చెప్పారు. శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. పది రోజులు అక్కడే ఉన్నాం. వెంటనే పనికి వెళ్లలేనని ఆసరా పథకం అంటూ పది వేలు నగదు నా ఖాతాకు వేశారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేకపోతే..నాలాంటి పేదోడికి దిక్కేది చెప్పండి. నాకోసం రూ.4.30 లక్షలు వరకు ఈ ప్రభుత్వం భరించింది. ఈ ఆరోగ్యశ్రీ యే నా ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడైతే నా ఆరోగ్యం బాగానే ఉంది. ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేసేశాను. ఆనందంగా ఉన్నాను. – బోర రామ్మూర్తి, రాందాస్‌పేట (బి.శివప్రసాద్, విలేకరి, అరసవెల్లి) మా రెక్కల కష్టానికి మద్దతు మాది ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరం. పదేళ్ల క్రితం వివాహమైంది. మా కుటుంబంలో నేను చిన్న కోడలిని. మాకు సెంటు భూమి కూడా లేదు. భార్యభర్తలమిద్దరం రెక్కల కష్టం మీదే ఆధారపడి జీవిస్తున్నాం. ఒక్క రోజు కూలికి వెళ్లకపోతే ఆ రోజు పస్తు ఉండాల్సిందే. కూలి పనులకు వెళ్తూనే మా ఇద్దరు బిడ్డలు జాస్మిన్ (8వ తరగతి), అమర్ (7వ తరగతి)లను చదివించుకోవాలి. వారికి మంచి దుస్తులు, పుస్తకాలు కొనాలంటే మాలాంటి వారికి తలకు మించిన భారమే. ఈ దుస్థితిలో మా బిడ్డల్ని ఎలా చదివించాలి అని మథనపడేవాళ్లం. వారు పెద్దవుతున్న క్రమంలో ఇంకా భయం పట్టుకొంది. పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే మా వల్ల కాదు. మాలాగా మా పిల్లలు ఉండకూడదు. వారిని ఉన్నత చదువులు చదివించాలనేదే నా ముందున్న పెద్ద సవాలు. కానీ మాకు ఆ స్తోమత లేదు. అలాంటి సమయంలో నాలుగేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మ ఒడి పథకం మాకు కొండంత ఆసరాగా నిలిచింది. నాలుగేళ్లుగా నా బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బులు పడుతున్నాయి. వాటితో మా బిడ్డలకు కావల్సిన ఇతరత్రా వస్తువులు కొనుక్కుంటున్నాము. ఒకప్పుడు స్కూళ్లు తెరుస్తున్నారంటే ఎంతో భయపడిపోయేవాళ్లం. వారికి ఏ విధంగా డబ్బులు సమకూర్చాలి? ఎక్కడ అప్పు చేయాలి..? అని మేమిద్దరం నెల రోజులపాటు ఆలోచించేవాళ్లం. ఎంతమందిని అడిగినా అప్పు పుట్టేది కాదు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ ఏమిటా అని భయపడేవాళ్లం. కానీ అమ్మ ఒడి రూపంలో ఆ దేవుడే కరుణించాడు. ఈరోజు ఏపీలో మా లాంటి నిరుపేదల పిల్లలకు మంచి చదువు దొరుకుతోంది. తొందరలో మాకు సొంతింటి కల నెరవేరనుంది. – అత్తంటి యేసుమ్మ, ఒమ్మెవరం (ఎ.మధుబాబు, విలేకరి, నాగులుప్పలపాడు) ఇదిగో మా సొంతిల్లు అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని సిబ్యాలకు చెందిన మేము 30 ఏళ్ల క్రితం ముగ్గుÆý‡ు కొడుకులతో కలిసి బతుకుదెరువు కోసం మదనపల్లెకు వలస వచ్చాం. నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరినగర్, మాయాబజార్ ఇంకా చానా చోట్ల అద్దె ఇళ్లల్లో ఉన్నాం. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. ముగ్గురు బిడ్డలకు పెళ్లిళ్లయ్యాక జీవనోపాధికి మగ్గాలు నేసుకునేందుకు వేర్వేరుగా వెళ్లిపోయారు. మాకు వయసై పోవడంతో చంద్రబాబు ఉన్నప్పుడు సొంతింటి కోసం తిరిగాము. చేతిలో అర్జీ పెట్టుకొని తిరగని ఆïఫీసంటూ లేదు. చేతులెత్తి మొక్కని ఆఫీసర్ లేడు.. చెప్పులరిగిపోయాయేగానీ పెద్దసార్ల మనసు కరగలేదు. తహసీల్దార్, మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద చాలా సార్లు అర్జీలు ఇచ్చాము. తలదాచుకునేందుకు ఓ చిన్న గూడు కట్టుకుందామన్నది మా ఆశ. అది ఈ జన్మలో తీరదనుకుని ఆశ వదిలేసుకున్నాం. ఓ రోజు మా ఇంటికి వలంటీర్ రోజా ‘పెద్దయ్య, పెద్దమ్మా.. మీకు ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటారా’అంటూ మా దగ్గరికొచ్చింది. ఇది కూడా వట్టి మాటలే అనుకున్నాం. కొన్ని రోజులుపోయాక శ్రీవారినగర్ సమీపంలో ఇల్లు మంజూరైందని చల్లని కబురు చెప్పింది. పట్టా కూడా చేతికి రావడంతో నమ్మలేకపోయాం. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో, మా కష్టంతో ఇల్లు ఇలా కట్టుకున్నాం. – సుబ్బరామయ్య, రాములమ్మ దంపతులు (ఎస్.వంశీధర్, విలేకరి, మదనపల్లి) -
జగనన్న వలన మా సొంత ఇంటి కల నెరవేరింది.. మాకంటూ ఒక స్థిరాస్తిని కల్పించారు
-
వెంకటాచలంలో అట్టహాసంగా జగనన్న ఇళ్ల ప్రారంభం