Bilaspur
-
బీసీననే నాపై ద్వేషం: ప్రధాని మోదీ
బిలాస్పూర్: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాల ఇండియా కూటమిని అహంకారుల గ్రూప్‌గా, కాంగ్రెస్‌కు తానంటే ఎనలేని ద్వేషమని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘అసలు బీసీలన్నా, ఎస్సీలు, ఎస్టీలన్నా, ముఖ్యంగా పేదలన్నా ఆ పారీ్టకి ఎనలేని ద్వేషం. అందుకే కాంగ్రెస్ వాళ్లు నన్ను నోటికొచి్చనట్టు తిట్టిపోస్తుంటారు. ఆ నెపంతో వాళ్లు అవమానించేది నిజానికి బీసీలను’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు శిక్షించినా వారి వైఖరి అసలే మారలేదని దుయ్యబట్టారు. ‘రాష్ట్రపతి పదవికి దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ అభ్యరి్థత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. తాజాగా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపదీ ముర్ము అభ్యర్థిత్వాన్నీ అలాగే వ్యతిరేకించింది. ఆయా సామాజికవర్గాల పట్ల ద్వేషమే అందుకు కారణం తప్ప సైద్ధాంతిక విభేదాలు కాదు. లేదంటే యశ్వంత్ సిన్హా వంటి మాజీ బీజేపీ నేతను పోటీగా బరిలో దింపేవారే కాదు’ అని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం బిలాస్పూర్లో బీజేపీ నిర్వహించిన ‘పరివర్తన్ మహాసంకల్ప’ ర్యాలీలో మోదీ మాట్లాడారు. 30 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏమీ చేయని కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీల అహంకార గ్రూప్ తాను బిల్లును ఆమోదం దాకా తీసుకెళ్లడం చూసి ఆశ్చర్యపోయిందన్నారు. ‘అందుకు వాళ్లు నాపై ఆగ్రహంగా కూడా ఉన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే మహిళా బిల్లుకు వాళ్లు మద్దతిచ్చారు. ఇప్పుడిక మోదీకి మహిళలంతా ఎక్కడ మద్దతు పలుకుతారోనని భయపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను ఓబీసీలకు కూడా వర్తింపజేయాలంటూ కొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీసింది. తద్వారా మహిళల మధ్యా విభేదాలు రాజేసేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు. ‘మహిళా రిజర్వేషన్ల ప్రభావం వేలాది ఏళ్ల పాటు ఉంటుంది. మీ కూతుళ్ల భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది’ అని అన్నారు. ‘అమ్మలరా. అక్కాచెల్లెళ్లారా! కాంగ్రెస్ వంటి అబద్ధాలకోర్ల వలలో పడకండి. నాకు మీ ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. అప్పుడే మీతో పాటు ప్రతి ఒక్కరి ఆకాంక్షలనూ నెరవేర్చగలుగుతా’ అని పేర్కొన్నారు. అవినీతి కూపంలో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మోదీ ఆరోపించారు. ఖజానాలో డబ్బులకు కొదవే లేదని, కేంద్రం నుంచి వేలాది కోట్లు వస్తున్నాయని సాక్షాత్తూ ఆ పారీ్టకి చెందిన ఉప ముఖ్యమంత్రే వేదికపై చెప్పారని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో ప్రతి స్కీమ్‌లోనూ స్కామే. ఆ పారీ్టకి గనక మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మరింత దోచుకుంటుంది’ అని దుయ్యబట్టారు. -
ట్రెండ్ ఫాలో అవుతున్న రాహుల్ గాంధీ
-
కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి కిందపడ్డ నాయకులు..
రాయ్‌పూర్: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో కాంగ్రెస్ ఆదివారం చేపట్టిన టార్చ్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టేజీపైకి పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎక్కడంతో బరువు ఆపలేక అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వేదికపై ఉన్నవారంతా కిందపడిపోయారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. అయితే ఈ ఘటనను కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. స్టేజీ కూలిన వెంటనే అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. అందరూ తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత ర్యాలీ యథావిధిగా కొనసాగింది. #WATCH | Chhattisgarh: Stage breaks down during torch rally organized by Congress to protest against termination of Rahul Gandhi's membership of Lok Sabha in Bilaspur. (02.04.23) pic.twitter.com/PjnXREl5JN — ANI (@ANI) April 3, 2023 2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయను సంఘీభావం తెలిపాయి. కాగా.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ సవాల్ చేశారు. సోమవారం సోదరి ప్రియాంక గాంధీతో కోర్టుకు వెళ్లారు. రాహుల్‌కు ఈసారైనా అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో చూడాలి. చదవండి: జమిలీ ఎన్నికలు తథ్యం.. -
భార్యను చంపి 5 ముక్కలుగా నరికి..
బిలాస్పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఇంట్లోని ఖాళీ నీళ్ల ట్యాంకులో పడేశాడు. సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలాస్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంట్లో సోదాలు జరిపారు. బాత్రూం మూలన ఉన్న ట్యాంకులో టేప్ వేసి పాలిధీన్ కవర్లో చుట్టిన శరీర భాగాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను జనవరి 6న గొంతు పిసికి చంపినట్లు విచారణలో అతడు వెల్లడించాడు. అనంతరం కట్టర్‌తో మృతదేహాన్ని ఐదు ముక్కలు కోసి, కొనుక్కొచ్చిన ట్యాంకులో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
జిందాల్‌కు బెదిరింపు
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ సెంట్రల్ జైలు ఖైదీ ఒకడు పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు బెదిరింపు లేఖ రాశాడు. రూ.50 కోట్లను 48 గంటల్లోగా పంపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అందులో హెచ్చరించాడు. ఈ మేరకు గత వారం రాయ్‌గఢ్‌లోని పత్రపాలి గ్రామంలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్)కు లేఖ అందింది. దీనిపై కోట్రా రోడ్ పోలీసులు సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. సదరు బెదిరింపు లేఖను బిలాస్పూర్ జైలులోని ఖైదీ పోస్టు ద్వారా పంపినట్లు తేలిందని దర్యాప్తులు పోలీసులు చెప్పారు. -
పామేడు– కొండపల్లి మధ్య ఆర్కే అంత్యక్రియలు
చర్ల/టంగుటూరు: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మృతిని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆర్కే మృతిపై గురువారమే కథనాలు వచ్చినా పార్టీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం శుక్రవారం వెలువడింది. ఆయన గురువారం ఉదయం కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందగా శుక్రవారం మధ్యాహ్నం పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో నిర్వహించిన అంత్యక్రియల ఫొటోలు, వీడియోలను శనివారం మావోయిస్టు పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆర్కే మృతి సమాచారాన్ని పార్టీ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు తెలియజేయడంతో పాటు మిలీ షియా, గ్రామకమిటీ సభ్యుల ద్వారా వివిధ గ్రామాలకు చేరవేసి అంత్యక్రియలకు రావాలని సూచించడంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరలి వచ్చిన ఆదివాసీలతో పాటు మావోయిస్టులు ఆర్కేకు నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన ఆర్కే మృతదేహాన్ని చూసి ఆదివాసీలు కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం. ఆర్కేకు ఘన నివాళి ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు శనివారం ఆర్కేకు నివాళులర్పించారు. ‘ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’అని ఈ సందర్భంగా శిరీష అన్నారు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారని విరసం నేత కల్యాణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని భార్య శిరీష, కుటుంబ సభ్యులు విలపించారు. ఇదిలా ఉండగా ఆర్కే పోలీసులకు లొంగిపోయుంటే ఆయనకు మంచి వైద్యం అందేదని, బతికేవాడని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. మంచి వైద్యం అందించినా.. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య వచ్చిందని, డయాలసిస్ చేయిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మృతి చెందారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు పార్టీ తరఫున మంచి వైద్యం అందించినా దక్కించుకోలేకపోయామని తెలిపారు. ఆర్కే మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం అభయ్ ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారని లేఖలో వెల్లడించారు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినా కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారని పేర్కొన్నారు. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యే శ్రద్ధాంజలి ఘటించి అంత్యక్రియలు పూర్తిచేశామని తెలిపారు. కామ్రేడ్ రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, ధైర్యసాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించారని కొనియాడారు. పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించారని వివరించారు. ఆర్కే సాధారణ జీవితం, ప్రజల పట్ల ప్రేమ, సహచరులపై ఆప్యాయత, విప్లవం పై స్పష్టత, దూరదృష్టి నుంచి యావత్ పార్టీ కేడర్ ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. -
తిరుపతి –బిలాస్పూర్, పూరీల మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి–బిలాస్ పూర్ ప్రత్యేక రైలు(07481) ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలు దేరుతుంది. సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని, మరుసటి రోజు సాయంత్రం 5.25 గంటలకు బిలాస్పూర్ చేరు కుంటుంది. తిరుగు ప్రయాణంలో (07482) 9వ తేదీ నుంచి ప్రతి మంగళ, శనివారాలలో మధ్యాహ్నం 3.35గంటలకు బిలాస్పూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, అదే రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి–పూరి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07479) 8వ తేదీ నుంచి ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి, సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని, మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు పూరి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07480) 10వ తేదీ నుంచి ప్రతి సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు పూరిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, అదే రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. చదవండి: ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా?.. -
అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపాడు..
రాయ్‌పూర్: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చత్తీస్‌గఢ్‌లోని ఖారున్ నది పరవళ్లు తొక్కుతోంది. బిలాస్‌పూర్‌లోని ఖుతాఘాట్ డ్యామ్ వద్ద ఖారున్ నది మహోగ్ర రూపం దాల్చింది. అయితే, ఓ వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడో ఏమో తెలియదు గానీ ఆ డ్యామ్ మధ్యలో చిక్కుకుపోయాడు. రక్షించండని స్థానికులను వేడుకున్నాడు. కానీ, వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో స్థానికులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంతలోనే సమాచారం అందుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలీకాప్టర్‌తో రంగంలోకి దిగింది. బిలాస్పూర్ చేరుకుని కిందకు తాడు వేసి బాధితున్ని పైకి లాగి రక్షించింది. అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపిన ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) తక్షణ స్పందనపై స్థానికులు సెల్యూట్ చేశారు. సోమవారం ఉదయం సంఘటన జరిగింది. -
బిలాస్పూర్: నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి
-
అనకొండ ట్రైన్, రైల్వే శాఖ రికార్డు
బిలాస్పూర్: మూడు గూడ్స్ రైళ్లను ఒకే ట్రైన్‌గా మార్చి భారతీయరైల్వే బుధవారం సరికొత్త రికార్డును సృష్టించింది. బిలాస్పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జతచేసి ఒకే ట్రైన్‌గా విజవంతంగా నడిపింది. లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్‌పుర్-చక్రధర్పూర్ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కొండను మింగిన కొండచిలువలాగా ఈ రైలు పట్టాలపై సాగిపోతుందని రైల్వే శాఖ అభివర్ణించింది. దీనిని అనకొండ రైలుగా పిలుస్తున్నారు. (ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్) దీని గురించి భారతీయ రైల్వే శాఖ మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ సరుకును రవాణా చేసేందుకు మూడు రైళ్లను కలిపి ఒకే రైలుగా మార్చే ప్రయోగం చేసినట్లు వివరించింది. 15 వేల టన్నులకు పైగా సరుకుతో ఈ గ్రూడ్స్ రైలు ప్రయాణం చేసినట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్‌లో సరుకు రవాణా సమయాన్ని ఆదా చేసేందుకు మరికొన్ని పొడగాటి రైళ్లను నడిపే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు కనబడుతోంది. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజా రవాణా రైళ్లను రైల్వే శాఖ పరిమితసంఖ్యలోనే నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం విధించిన అన్‌లాక్ 2.0 నిబంధనల ప్రకారం ప్రజా రవాణా రైళ్లను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్ రైలు సేవలు యథాతథంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. (రైల్వే ఇక మేడిన్ ఇండియా) Taking a big leap in reducing the transit time of freight trains, Bilaspur division of SECR broke yet another frontier by joining & running 3 loaded trains (more than 15000 tonnes) in 'Anaconda' formation through Bilaspur & Chakradharpur divisions. pic.twitter.com/5lZlQHDpkI — Ministry of Railways (@RailMinIndia) June 30, 2020 -
కరోనాపై పోరు: విధుల్లో స్టార్ ప్లేయర్
సిమ్లా: కరోనా పోరులో నేను సైతం అంటూ భారత కబడ్డీ జట్టు సారథి అజయ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. రైడింగ్, ట్యాకిల్స్‌తో ప్రత్యర్థి జట్టు పనిపట్టడంతో పాటు.. సారథిగా జట్టును బ్యాలెన్స్ చేయడంలో, వారిలో ఆత్మస్థైర్యం నింపడంలో అజయ్ ఠాకూర్ సిద్దహస్థుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్, ప్రాక్టీస్ సెషన్స్ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో కరోనా పోరాటంలో అజయ్ ఠాకూర్ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్ సందర్భంగా బిలాస్పూర్ డీఎస్పీ అజయ్ ఠాకూర్ తన బృందంతో కలసి రంగంలోకి దిగారు. బిలాస్‌పూర్‌లోని గల్లీగల్లీని పరిశీలించారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులు, ప్రజలను ఆపి లాకౌడౌన్ ఉద్దేశాన్ని వివరించారు. అంతేకాకుండా కరోనా పోరులో భాగంగా తాను నిర్వర్తించిన విధులకు సంబంధించిన వీడియోను అజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలు స్వచ్చందంగా లాక్డౌన్లో పాల్గొనాలని, అత్యవసర సమయాల్లో మినహా వీధుల్లోకి రాకూడదని బిలాస్పూర్ డీఎస్సీ అజయ్ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. View this post on Instagram On duty # अभी भी समय है अपने घर रहे ओर दूसरों क़ो भी बोले आप सब सहयोग करें प्रशासन का । तभी य मुमकिन है A post shared by AJAY THAKUR (@ajaythakurkabaddi) on Mar 25, 2020 at 8:38am PDT చదవండి: ‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’ తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా -
విశాఖ జూకి రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జూ లోకి రాయల్ బెంగాల్ టైగర్ ప్రవేశించింది. బిలాస్పూర్ జూ నుంచి ఆడ రాయల్ బెంగాల్ టైగర్ రైలులో గురువారం విశాఖ జూ కి చేరుకుంది. అనంతరం జూ క్యూరేటర్ యశోద బాయి పులిని పరిశీలించారు. ఏడాది వయస్సున్న ఆడ పులికి జూ అధికారులు దుర్గగా నామకరణం చేశారు. ఆడపులికి విశాఖ జూ పూర్తిగా కొత్తది కావటంతో అలవాటు పడటానికి ప్రత్యేక రక్షణలో ఉంచారు. ఆడ పులిని పంపినందుకు బదులుగా రెండు జతల నక్షత్ర తాబేళ్లను విశాఖ జూ అధికారులు బిలాస్పూర్ జూకు పంపారు. -
‘రాఖీ విత్ ఖాకీ’కి గిన్నిస్ గుర్తింపు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘రాఖీ విత్ ఖాకీ’కి గిన్నిస్ బుక్ గుర్తింపు లభించింది. ఆగస్టు 25న నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం పది గంటల వ్యవధిలోనే సుమారు 50 వేల మంది మహిళలు, బాలికలతో పోలీసులకు రాఖీలు కట్టించారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ రికార్డును గుర్తిస్తూ శనివారం గిన్నిస్ బుక్ నుంచి సర్టిఫికేట్ అందుకున్నట్లు బిలాస్పూర్ పోలీసులు వెల్లడించారు. మహిళల భద్రతకు హామీ ఇస్తూ వారితో పోలీసులకు రాఖీలు కట్టించాలనే ఆలోచన బిలాస్పూర్ ఎస్పీ షేక్ ఆరిఫ్ హుసేన్‌కు వచ్చింది. -
రైల్లో విమానం లాంటి కోచ్‌లు
న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రైల్లోనూ విమానంలో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌లను చూడొచ్చు. చైనా సరిహద్దుల్లో నిర్మిస్తున్న బిలాస్పూర్–మనాలి–లేహ్ మార్గంలో ప్రయాణించే రైళ్లలో ఇలాంటి బోగీలను ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే మార్గం ఇదే. కాబట్టి సముద్ర మట్టానికి సుమారు 5 వేల మీటర్ల ఎత్తులో వెళ్లే సమయంలో ప్రయాణికులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతోంది. ఇందుకోసం విమానాల్లో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌ల లాంటివి అయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తోంది. ఎక్కువ ఎత్తులో ప్రయాణికులు శ్వాస తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విమానాల్లో ప్రెషరైజ్డ్ కోచ్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం చైనాలోని క్వింగే–టిబెట్ రైల్వే లైనులోనే ఈ తరహా కోచ్‌లను వినియోగిస్తున్నారు. ఆక్సీజన్ పాళ్లు తక్కువగా ఉన్న వాతావరణంలో ప్రయాణికుల్ని తీసుకెళ్లేలా ఈ కోచ్‌లను డిజైన్ చేశారు. -
దేశంలోనే తొలి ‘సొరంగ’ రైల్వే స్టేషన్ !
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్పూర్–మనాలి–లేహ్ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కీలాగ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. దేశంలో సొరంగంలో ‘మెట్రో’ స్టేషన్లు ఉన్నా.. సొరంగంలో తొలి ‘రైల్వే స్టేషన్’ మాత్రం ఇదేకానుంది. ‘బిలాస్పూర్–మనాలి–లేహ్ మార్గంలో జరిపిన తొలి సర్వే ప్రకారం..కీలాగ్ స్టేషన్‌ను సొరంగంలో నిర్మిస్తాం’ అని ఉత్తర రైల్వే చీఫ్ ఇంజినీర్ డీఆర్ గుప్తా తెలిపారు. 27 కి.మీ పొడవైన సొరంగంలో ఏర్పాటయ్యే కీలాగ్ స్టేషన్ సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. 465 కి.మీ పొడవైన ఈ లైను నిర్మాణానికి రూ.83,360 కోట్లువ్యయం అవుతుందని అంచనా. ఈ లైను భద్రతా బలగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు షాక్!
బిలాస్పూర్: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రామ్‌దయాళ్ ఉయికె బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అణచివేతను భరించలేకే తిరిగి సొంతగూటికి వచ్చానన్నారు. రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధరమ్‌లాల్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఉయికె బిలాస్పూర్లో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ తీవ్ర అణచివేతకు గురయ్యా. సిద్ధాంతాలు, ఆశయాలను ఆ పార్టీ విస్మరించింది. అశ్లీల సీడీ రాజకీయాలతో రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బఘేల్ పార్టీ ప్రతిష్టను దిగజార్చారు. ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, పేద ప్రజలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడంతో ఎస్టీ వర్గానికి చెందిన వాడిగా ఎంతో ఆవేదనకు గురయ్యా’ అని తెలిపారు. ఓ మహిళతో రాష్ట్ర మంత్రి రాజేశ్ మునత్ రాసలీలలు నెరుపుతున్న సీడీ బహిర్గతం కావడం వెనుక సూత్రధారిగా సీబీఐ పేర్కొంటున్న వారిలో రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బఘేల్ కూడా ఒకరు. 2000వ సంవత్సరంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉయికె.. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలైన పాలి–తనఖార్ లేదా మర్వాహిల నుంచి ఉయికెను బీజేపీ పోటీలోకి దించే చాన్సుంది. -
అర్చకులైన అధ్యాపకులు
ప్రమోద్ కుమార్ : ప్రభుత్వ పాఠశాలలో సంస్కృత అధ్యాపకుడు ప్రస్తుతం : శ్రీ మహాకపాలేశ్వర్ ఆలయంలో అర్చకుడు సంజీవ్ కుమార్ : ప్రభుత్వ పాఠశాలలో క్రీడాపాధ్యాయుడు ప్రస్తుతం : శివాలయంలో అర్చకుడు జై కిషన్ : ప్రభుత్వ పాఠశాల ప్రధానోధ్యాపకుడు, ప్రస్తుతం : సఫేద్ గురు బచ్చాచా ఆలయంలో ఆర్చకుడు మోహన్ లాల్ : ప్రభుత్వ పాఠశాలలో హిందీ అధ్యాపకుడు ప్రస్తుతం : సఫేద్ గురు బచ్చాచా ఆలయంలో ఆర్చకుడు బిలాస్ పూర్ : వీళ్లేకాదు.. మరో 91 మంది టీచర్లు.. బిలాస్‌పూర్‌లోని వివిధ ఆలయాల్లో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. హరియాణాలో పవిత్ర రోజులుగా పేర్కొనే కపాల్ మోచన్ మేళ సందర్భంగా వివిధ ఆలయాల్లో టీచర్లు అర్చకులుగా విధులు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ టీచర్లకు గత నెల 29న అర్చకత్వంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. టీచర్లను ఇలా ఇతర కార్యక్రమాలకు వినియోగంచడంపై ప్రభుత్వ టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్లను వేరే కార్యక్రమాలకు వినియోగించడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుందని ఇతర అధ్యాపకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధ్యాపకులను ఇతర కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తారంటూ.. విద్యాశాఖాధికారులకు జిల్లా మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖాధికారులు.. ఇటువంటి పర్వదినాల్లో భక్తులకు అవసరమైన సేవలు అందించాలంటే అర్చకలు సరిపొవడం లేదని.. కేవలం ఆరు రోజులు మాత్రమే ఇలా వినియోగించడం జరగుతుందని వివరణ ఇచ్చారు. -
బిలాస్పూర్ @ 49.3 డిగ్రీలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో సోమవారం రికార్డు స్థాయిలో 49.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పరికరాలలో లోపాలు ఏమైనా ఉన్నాయేమోనని నిపుణులు పరిశీలించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఎన్నడూ ఇంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. దీంతో ఉష్ణోగ్రతలను కొలిచే పరికరాలతోపాటు వేడి పెరగడానికి కారణమైన ఇతర అంశాలను కూడా నిపుణులు పరిశీలించారు. అయితే పరికరాలలో తప్పులేవీ లేవనీ, సోమవారం నిజంగానే అంత ఉష్ణోగ్రత నమోదైందని ఓ అధికారి తెలిపారు. నిపుణుల బృందం బుధవారం మరోసారి ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపనుంది. బిలాస్పూర్లో మంగళవారం 47.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి నుంచి వస్తున్న వేడి గాలుల వల్లే ఉష్ణోగ్రతలు పెరిగి ఉండొచ్చని పలువురు పేర్కొంటున్నారు. -
మరుగుదొడ్లు దొంగిలించారట!
బిలాస్పూర్: వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమ మరుగుదొడ్లు కనిపించడం లేదని, కాస్త వెతికిపెట్టాలంటూ ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. వివరాల్లోకెళ్తే... బిలాస్‌పూర్‌లోని అమర్పూర్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల బేలాబాయ్ పటేల్.. తన కూతురు చందాతో కలిసి కేసు పెట్టారు. తమ మరుగుదొడ్లను ఎవరో ఎత్తుకెళ్లారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. తమకు స్వచ్ఛభారత్ అభియాన్ కింద మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు డబ్బులు ఇవ్వాలంటూ బేలాబాయ్, చందాలు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు వారి దరఖాస్తును తిరస్కరించారు. కారణమేంటని ఆరా తీయగా... ఇదివరకే వారికి మరుగుదొడ్లు మంజూరయ్యాయని, నిర్మాణం కూడా పూర్తయిందని, అందుకు సంబంధించిన ఫొటోలను చూపిస్తూ దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని తల్లీకూతుళ్లు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ మరుగుదొడ్లు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో అసలు మరుదొడ్లే లేకుండా అవి పోయాయంటూ ఎలా ఫిర్యాదు చేస్తారంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో గ్రామపంచాయతీ రికార్డులను, ఫొటోలను ఆధారంగా చూపారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే ఆ ఊరిలోని వారందరికీ మరుగుదొడ్లు మంజూరైనా ఎవరెవరివో ఫొటోలు జతచేసి, అందరికీ మరుగుదొడ్లు నిర్మించినట్లు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు రికార్డులు సృష్టించారు. పేదల కోసం మంజూరైన సొమ్మునంతా నొక్కేశారు. ఈ భాగోతమంతా తల్లీకూతుళ్ల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అసలు మరుగుదొడ్లే నిర్మించలేదంటే గ్రామ పంచాయతీ అధికారులు చిక్కుల్లో పడక తప్పదు. నిర్మించారని రికార్డులు చూపితే.. వాటిని వెతికి పెట్టక పోలీసులకు తప్పదు. తల్లీకూతుళ్లిద్దరూ అటు అధికారులను, ఇటు పోలీసులను భలే ఇరికించారు. -
న్యాయమూర్తికి బెదిరింపు ఎస్సెమ్మెస్
బిలాస్పూర్(ఛత్తీస్‌గఢ్): గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు అనుకూలమైన తీర్పు ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఛత్తీస్గడ్ న్యాయమూర్తి మహాదేవ్ కతుకర్కు బెదిరింపు ఎస్సెమ్మెస్ వచ్చింది. ఓ విడాకుల కేసుకు సంబంధించి ఆయన తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో బెదిరింపు వచ్చింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఎస్సెమ్మెస్ వచ్చిన సమయంలో న్యాయమూర్తి మహదేవ్ 2013లో జైరాం లోయలో జరిగిన మావోయిస్టుల దాడికి సంబంధించిన కేసును పరిశీలిస్తున్నారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో న్యాయమూర్తికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఆయనకు మావోయిస్టులు చంపేస్తామంటూ బెదిరింపు లేఖ పంపించారు. -
డబ్బులిస్తామని మభ్యపెట్టి ఆపరేషన్లు చేశారు!
బిలాస్ పూర్: అధిక మొత్తంలో డబ్బులు ఇప్పిస్తామని ప్రలోభపెట్టి చత్తీస్ గఢ్ లో మహిళలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఒప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొన్ని రోజులక్రితం చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని 13 మంది మహిళలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇప్పిస్తామని చెప్పడంతో పాటు మందులను ఉచితంగా ఇప్పిస్తామని ఆరోగ్య అధికారులు తమను బలవంతంగా ఒప్పించారని బైగా అనే మహిళ భర్త మీడియాకు వెల్లడించాడు. అయితే ఆపరేషన్ తరువాత తన భార్య చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఆపరేషన్ తరువాత ప్రయాణ ఖర్చుల కింది రూ.40 మాత్రమే ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యాడు. రాయ పూర్ కు 260 కి.మీ దూరంలో ఉన్న గౌరెలా గిరిజన ప్రాంతాల్లో 18 మందికి పైగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. -
బిలాస్పూర్ బాధితులకు రాహుల్ పరామర్శ
బిలాస్పూర్: చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను శనివారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. నిర్లక్ష్యం, అవినీతి, నకిలీ మందుల కారణంగా మహిళల మరణించారని రాహుల్ విమర్శించారు. బిలాస్పూర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాహుల్ అన్నారు. బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 13 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 13 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. -
నేడు బిలాస్పూర్లో రాహుల్ పర్యటన
బిలాస్పూర్: చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. శనివారం రాహుల్ బిలాస్పూర్లో పర్యటించనున్నారు. బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 13 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. బిలాస్పూర్ పట్టణ శివార్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 13 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. -
అక్కడ మొత్తం 83 ఆపరేషన్లూ ఫెయిలే!!
-
కబళించిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 11 మంది మహిళల మృతి ఛత్తీస్‌గఢ్‌లో ఘటన; నలుగురు వైద్యాధికారుల సస్పెన్షన్ దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం బిలాస్పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 11 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. బిలాస్పూర్ పట్టణ శివార్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 11 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. మరో 49 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ల అనంతరం మొత్తం 83 మంది మహిళలకు మందులు ఇచ్చి వైద్యులు డిశ్చార్జి చేయగా వారిలో 60 మంది 24 గంటల వ్యవధిలోనే వాంతులు, పొత్తి కడుపులో నొప్పితో ఆస్పత్రులపాలయ్యారు. తీవ్ర రక్తస్రావం వల్ల శరీరానికి గుండె తగినంత రక్తం సరఫరా చేయలేకపోవడం లేదా ఆపరేషన్ చేసిన ప్రదేశంలో ఇన్ఫెక్షన్ సోకడం వల్ల మరణాలు సంభవించి ఉండొచ్చని తెలుస్తోందని వైద్య సేవల డిప్యూటీ డెరైక్టర్ అమర్‌సింగ్ తెలిపారు. శవపరీక్షల తర్వాతే కారణాలు బయటపడతాయన్నారు. మృతులంతా 22-32 ఏళ్ల వయసులోపు వారేనన్నారు. నలుగురు వైద్యాధికారులపై వేటు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఇందుకు కారణమైన నలుగురు జిల్లా వైద్యాధికారులను సస్పెండ్ చేయడంతోపాటు ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. వైద్య సేవల డెరైక్టర్‌ను బదిలీ చేసింది. ఆపరేషన్లకు నేతృత్వం వహించిన సర్జన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు సీఎం రమణ్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తొలుత రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా సీఎం దాన్ని రూ.4 లక్షలకు పెంచారు. బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించడంతోపాటు వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ...ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రమణ్‌సింగ్‌ను ఆదేశించారు. ప్రస్తుతం మయన్మార్ పర్యటనలో ఉన్న మోదీ మంగళవారం రమణ్‌సింగ్‌తో ఈ మేరకు ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని కార్యాలయం ‘ట్వీట్’ చేసింది. సీఎం రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం రమణ్‌సింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి అమర్ అగర్వాల్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2011-13 మధ్య ప్రభుత్వం నిర్వహించిన కంటి ఆపరేషన్లు వికటించి 62 మంది రోగులు ఒక్కో కంట్లో చూపు కోల్పోయిన ఘటన నుంచి సర్కారు ఏమాత్రం గుణపాఠాలు నేర్చుకోలేదని తాజా ఉదంతం నిరూపిస్తోందని విమర్శించింది. ఈ సంఘటనకు నిరసనగా బుధవారం ఛత్తీస్‌గఢ్ బంద్‌కు పిలుపునిచ్చింది.