biyyapu madhu sudhan reddy
-
శ్రీకాళహస్తిలో నవరత్న నిలయం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి నవరత్నాల నిలయాన్ని నిర్మించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను కళ్లకు కట్టినట్టు నిర్మించారు. నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. నిలయం మధ్యలో జగన్ ఫొటో ఏర్పాటు చేసి నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా చిత్రాలను రూపొందించారు. అద్దాల గోపురంలో జగనన్న నిలయంపైన ప్రత్యేకంగా అద్దాల గోపురం నిర్మించారు. మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రాగి ఆకుల్లో సీఎం జగన్ బొమ్మను చిత్రీకరించారు. అద్దాల గోపురంలోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్ జగన్ ఫొటోలు కనిపిస్తాయి. నిలయం నిర్మాణానికి ప్రత్యేక నిపుణులు నవరత్నాల నిలయం కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి తెప్పించారు. నవరత్నాల నిలయం ప్రారంభం అనంతరం 2,500 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో ఇంటి స్థలం విలువ రూ.14 లక్షలు ఉంటుందని అంచనా. -
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘన స్వాగతం
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. ఈ గ్రామంలో రెండు చోట్ల జగన్ కాన్వాయ్‌ను క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన తమిళ మహిళలు ఆపి అభిమాన నేతను కలుసుకున్నారు. తమను జగన్ ఆశీర్వాదించారనేది తమిళంలో చెప్పుకుంటూ సంతోషపడ్డారు. కిక్కిరిసిన రోడ్లు తంగేళ్లపాళెంలో జగన్ రాక సందర్భంగా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. జననేతను చూసేందుకు యువకులు చెట్లపైకి ఎక్కడం కనిపించింది. తారాజువ్వలు పేల్చుతూ తమ నాయకుడికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికాయి. అక్కడ నుంచి బసవయ్యపాళెం, కొత్తబైపాస్రోడ్డు క్రాస్‌ల్లో తన కోసం వేచి ఉన్న మహిళలను, గ్రామస్తులను పలకరిస్తూ జగన్మోహన్రెడ్డి శ్రీకాళహస్తిలోని వీఎంపల్లెకు చేరుకున్నారు.