bonda umamaheswar rao
-
విజయవాడలో టీడీపీ నేతల రచ్చ రచ్చ
సాక్షి, అమరావతి బ్యూరో/మొగల్రాజపురం: విజయవాడలో టీడీపీ నేతల మధ్య కొన్నాళ్ల నుంచి రగులుతున్న ఆధిపత్య పోరుకు వర్గ విభేదాలు తోడు కావడంతో వ్యవహారం రచ్చకెక్కింది. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ మేయర్ అభ్యర్థి తండ్రి, ఎంపీ కేశినేని నానిపై నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మైనార్టీ నాయకుడు నాగుల్‌మీరాలు నిప్పులు చెరిగారు. వీరంతా శనివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి, కేశినేనిపై మండిపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నువ్వు పెద్ద తోపువా.. అయితే చూసుకుందాం రా.. ఓపిక నశించి ఈ రోజు మీడియా ముందుకొచ్చాం. కేశినేని నాని చంద్రబాబును ఏకవచనంతో ఇష్టానుసారం మాట్లాడాడు. అధిష్టానం నేనేనంటూ చిటికెలు వేసి చెప్పాడు. ఆరోజే నానిని చెప్పు తీసుకుని కొట్టేవాడిని. నువ్వేంటి? నీ స్థాయేంటి? నేనే పెద్ద హీరోనంటున్నావ్.. నువ్వెక్కడ హీరోవి? చూసుకుందాం రా.. చంద్రబాబు జోలికి వచ్చిన రోజే నీకు ఈ సవాల్ విసరాలి. వంగవీటి మోహన్ రంగా హత్య కేసులో ముద్దాయిని వన్‌టౌన్‌లో తిప్పుతున్నావ్. ప్రజలు ఓట్లేస్తారా? ఛీకొడ్తారు. ఏంటి నీకీ అహంకారం? నా కులం గురించి మాట్లాడుతున్నావ్. నీకు నీ కులంలోనే ఓట్లేయరే. సొంత ఇమేజితో గెలిచానంటావా? చంద్రబాబును, మమ్మల్నీ లెక్క చేయవు. నువ్వు పెద్ద తోపువా? తోపువైతే రా.. ఎక్కడైనా సెంటర్ చూసుకుందాం.. నువ్వో నేనో తేల్చుకుందాం. కనకదుర్గ గుడికి నీ ఇద్దరు కూతుళ్లను తీసుకుని రా.. చంద్రబాబును విమర్శించలేదని అమ్మవారి మీద ప్రమాణం చేయ్. మీడియా సాక్షిగా చెబుతున్నా. రేపు చంద్రబాబు ఆశీస్సులతో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా.. ఈ రోజు నుంచి ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతా. – బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ మాకు తెలియని స్థాయా నీది? నువ్వెవరికి తెలుసు? కేశినేనీ.. నువ్వు కులహంకారంతో మాట్లాడుతున్నావు. బలహీన వర్గాలంటే నీకు లెక్కలేదా? సైకిల్ గుర్తు లేకుండా నీకు ఒక్కడు ఓటేస్తాడా? నువ్వు పార్టీలోకి ఎప్పుడొచ్చావ్? 2013లో వచ్చావ్. మేం 1998 నుంచి ఉన్నాం. మేం కట్టుబానిసలమా? మా డబ్బు మేం ఖర్చు పెట్టుకుంటున్నాం. మీ నాయకత్వం కింద మేం పని చేయాలా? మేం నాయకులం కాదా? నీ స్థాయి ఏమిటి? మాకు తెలియని స్థాయా నీది? నువ్వెవరికి తెలుసు? నిన్ను చూసి ఓట్లేయరు.. మమ్మల్ని చూసి వేస్తారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేయలేం. మీ చెప్పులు మోయాలా? ఇంకెన్నాళ్లు మోస్తాం? మోసే రోజులు పోయాయ్. – నాగుల్ మీరా, మైనార్టీ నేత సత్తా ఉంటే రాజీనామా చెయ్.. నీకు నిజంగా సత్తా , గ్లామర్ ఉంటే రాజీనామా చెయ్. చంద్రబాబు ఫొటో లేకుండా, తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా ఇండిపెండెంట్‌గా గెలువు. అప్పుడు మేం రాజకీయాలను వదిలేసుకుని, ఊరు వదిలేసి వెళ్లిపోతానని సవాల్ చేస్తున్నా. నువ్వెంత అహంకారంతో మాట్లాడుతున్నావ్. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావ్. నువ్వు మోనార్క్వని గెలిచావా? పార్టీ టిక్కెట్టు మీద గెలిచావా? కార్యకర్తలు ఎవరి దగ్గరకు వెళ్లాలి? ఎటు వెళ్లాలి? ఎంపీ పిలిస్తే వెళ్లాలా.. లేక ఎమ్మెల్సీలో, మాజీ ఎమ్మెల్యేలో పిలిస్తే వెళ్లాలా? ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఆదివారం చంద్రబాబు విజయవాడ పర్యటనలో కేశినేని నాని ఉంటే మేం పాల్గొనం. లేదంటే ఆయన్ను అదుపులో పెట్టండి. నాని ఒంటెత్తు పోకడలు, అవమానకరమైన ప్రవర్తన, బీసీలను, కాపులను చులకనగా చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. -బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే -
వడ్డీ పేరిట పీల్చి పిప్పి చేసేస్తున్నారు..
♦ కమిషనరేట్‌కు క్యూ కడుతున్న కాల్‌మనీ బాధితులు ♦ బొండా ఉమా సహా పలువురిపై ఆరోపణలు సాక్షి ప్రతినిధి, విజయవాడ/విజయవాడ సిటీ: ఆడపిల్ల పెళ్లి.. కొడుకు చదువు.. వ్యాపార విస్తరణ.. ఇళ్ల కొనుగోలు.. ఇలా ఒకటేమిటి అనేక అవసరాల కోసం కాల్‌మనీ కేటుగాళ్ల బారిన పడి వీధుల పాలైన అనేక మంది విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు క్యూ కడుతున్నారు. కాల్‌మనీ బాధిత మహిళలు గుండెలవి సేలా రోదిస్తున్న తీరు కమిషనరేట్‌లో పోలీసులను సైతం కదిలించివేస్తోంది. ఐదు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన ఈ సెక్స్ రాకెట్లో ప్రాథమికంగా ఏడుగురు నిందితులను గుర్తించి కేసు నమో దు చేయగా, వీరిలో యలమంచిలి శ్రీరామమూర్తి అలి యాస్ రాము, దూడల రాజేష్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టిసారించినట్టు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. సీపీ ప్రకటనతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. తమను ఈ ఊబి నుంచి బయటపడేయాలంటూ ప్రాధేయపడుతున్నారు.ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కాల్‌మనీ వ్యాపారులకు అండగా ఉంటున్నాడంటూ బాధితులు ఆరోపించారు. బెజవాడలో లెక్కలేనన్ని కాల్‌మనీ సెంటర్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే బొండా సపోర్టు... రామకృష్ణాపురానికి చెందిన మానేపల్లి రణధీర్ వద్ద వ్యాపార అవసరం కోసం రూ. 2.95 లక్షలు అప్పుగా తీసుకున్నాను. తొలుత నెలవారీ వడ్డీ అని చెప్పి కొద్ది రోజుల తర్వాత కాల్‌మనీ అన్నాడు. నెలకు రూ.90 వేల చొప్పున వడ్డీ కింద రూ. 5.60 లక్షలు చెల్లించాను. అసలు కింద రూ. 3 లక్షలు కట్టాను. ఐనా అప్పు తీరలేదంటూ ముందు తీసుకున్న చెక్కులతో మన్నెం కనకవల్లి అనే మహిళ ద్వారా కోర్టులో కేసులు వేయిస్తున్నాడు. పైగా పొలం కూడా అతని ఆధీనంలోనే ఉంది. ముందు పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామన్నారు. తర్వాత సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పోలీసులపై ఒత్తిడి తేవడంతో వారు పట్టించుకోవడం లేదు. - డి.కిరణ్, దుర్గాపురం కాల్‌మనీతో సంబంధం లేదు: బోడె కంకిపాడు: కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న బోడె ప్రసాద్ సోమవారం సాయంత్రం కృష్ణాజిల్లా కంకిపాడులోని పసుపుకోటలో విలేకరులతో మాట్లాడారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులో ఐదో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పారు. అతనితో కలసి విదేశీ పర్యటనలకు వెళ్లినంత మాత్రాన ఈ వ్యవహారంతో సంబంధం అంటగట్టడం తగదన్నారు. విదేశీ పర్యటనలో తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలను సైతం మార్ఫింగ్ చేసి సంబంధాలు న్నట్లుగా ప్రయత్నించడం శోచనీయమన్నారు. తాళిబొట్టూ గుంజుకున్నారు... కుటుంబ అవసరాల కోసం సమీప ప్రాంతానికి చెందిన అక్కా చెల్లెళ్లు దుర్గ, లక్ష్మి, విజయ, ఝాన్సీ నుంచి రూ. లక్ష తీసుకున్నాను. కొన్నాళ్లు వడ్డీ కట్టాను. ఆర్థిక ఇబ్బందులతో తర్వాత కట్టలేకపోయాను. దీంతో రూ.5 లక్షలు విలువ చేసే ఇంటిని గుంజుకున్నారు. ఇంకా చాలవంటూ మెడలోని పుస్తెల తాడు సహా నగలు గుంజుకొని ప్రైవేటు ఫైనాన్స్‌లో తనఖా పెట్టుకున్నారు. అయినా నా వద్ద తీసుకున్న ఖాళీ నోట్లు ఇవ్వడం లేదు. అదేమంటే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డ్రైవర్ పేరిట బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయండి. - కాజ సులోచన, రాజీవ్‌నగర్ డబ్బులు కట్టినా స్థలం గుంజుకుంది కష్టపడి దాచుకున్న డబ్బులతో మంటాడలో సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా. డబ్బు లు చాలకపోవడంతో కానూరుకు చెందిన చివులూరు విజయలక్ష్మి వద్ద రూ.4 లక్షలు అప్పు చేశాం. సక్రమంగానే వడ్డీ కట్టేవాళ్లం. స్టీరింగ్ ఆటోలను నగరంలోకి అనుమతించకపోవడంతో కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం. దీంతో కొన్న ఇంటి స్థలాన్ని కూతురు పేరిట బెదిరించి రాయించుకుంది విజయలక్ష్మి. తీసుకున్న చెక్కులు, నోట్లు కూడా ఇవ్వలేదు. అదేమంటే మా ప్రభుత్వమే అధికారంలో ఉందికాబట్టి ఎవరూ ఏం చేయలేరని బెదిరిస్తోంది. - పట్టపు సత్యనారాయణ, వరలక్ష్మి, కానూరు, తులసీనగర్. -
మావాళ్లే దొరికారా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) కుర్రాడు బర్త్ డే అని తన స్నేహితులతో సరదాగా అలా షికారు చేస్తే పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారే. రెండు కార్లు, ఐదారు బైకులతో బయటికి వస్తే ర్యాలీ అని పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు. రూల్స్ అడ్డంగా ఉల్లంఘించాడని గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను పుట్టినరోజు చేసుకోవడం పాపమా, బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం నేరమా. ఎమ్మేల్యే కొడుకు జన్మదిన వేడుకలు 'గ్రాండ్'గా చేసుకుంటే ఇంత రచ్చ చేస్తారా? మా చిన్నోడు పుట్టినరోజు నాడు ఫ్రెండ్స్ తో రెండు కార్లు, బైకులతో అరకిలోమీటర్ రోడ్డుపై అలా వెళ్లాడో, లేదో ర్యాలీ అంటూ రాద్ధాంతం చేసేస్తున్నారు. మావాడి స్నేహితులు కార్లు పట్టుకుని వేలాడుతూ, చేతులు బయటకు పెట్టి కేకలు, ఈలలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారే కానీ ఎవరనీ ఇబ్బంది పెట్టలేదే. చిన్నపిల్లలు బైకుల సెలైన్సర్లు తొలగించి సరదా చేస్తే అల్లరి అంటారా. వాడు నా బిడ్డ. పొరపాటు చేస్తాడేమో గానీ నేరం మాత్రం చేయడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినంత మాత్రానా ఏదో పెద్ద నేరం చేసినట్టు యాగీ చేయడం కరెక్టు కాదు. రోజూ రోడ్డుపై రాంగ్ రైడింగ్ చేస్తున్న వేలాది మందిని వారిని వదిలేసి నా సుపుత్రుడి వెంట పడడం సమంజసం కాదని సభా ముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆ మధ్యన ఇలాగే హంగామా చేశారు. సరదాకి మా పెద్దోడు బైకు రేసింగ్ ఆడితే సునామీ వచ్చినంత హడావుడి చేశారు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారని ఇష్టమొచ్చినట్టు రాసిపారేశారు. రేసును షూట్ చేయొద్దని మీడియా ప్రతినిధులకు సర్దిచెబితే దౌర్జన్యం చేశాడని ఇంతలంతలుగా వర్ణించారు. ఆమాట కొస్తే రుబాబు చేయని 'అధికార సుపుత్రులు' ఏపీలో ఒక్కరైనా ఉన్నారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అలాంటోళ్లందరినీ పెద్దగా పట్టించుకోకుండా మా పుత్రరత్నాల వెంట పడడం భావ్యమా? మొన్నామధ్య రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి చనిపోతే మా సిద్ధు కారణమంటూ అకారణంగా కేసు పెట్టారు. సొంత కారులో కోర్టుకు తీసుకెళ్లి బెయిల్ ఇప్పించగలిగాను కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మావాడు ఎంతో ఇబ్బంది పడేవాడో. నేను సెంట్రల్ ఎమ్మెల్యే కావడం వల్లే మావాళ్లను 'సెంటర్' చేసినట్టు కనబడుతోంది. ఏదో అధికారంలో ఉన్నాం కాబట్టి నిభాయించుకుంటున్నాం కానీ లేకపోతే నా బిడ్డలను ఎప్పుడో జైలు పాల్జేసెవారు. మళ్లీ చెప్తున్నా మావాళ్లు పొరపాటులే చేస్తారు. నిజంగా నేరాలు చేయరు.