contact lenses
-
నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు!
ఆరోగ్య పరిరక్షణలో టెక్నాలజీ వాడకం కొత్తేమీ కాదు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త, వినూత్న వైద్య పద్ధతులు అందుబాటులోకి వస్తూండటం విశేషం. అమెరికాలోని లాస్‌వేగస్‌లో ప్రస్తుతం జరుగుతున్న కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్ –2018)లో ఈ ఏడాది కనిపించిన టెక్నాలజీలే ఇందుకు తార్కాణం. ఒత్తిడిని తగ్గించే హెడ్‌బ్యాండ్, వయోవృద్ధులు మందులు సరిగా తీసుకుంటున్నారా? లేదా? అన్నది చెక్ చేసేందుకు కాలి సాక్స్‌లో దాగే సెన్సర్లు.. తుంటి ఎముకలకు రక్షణ కల్పించే వినూత్న బ్యాగ్ వంటివి మచ్చుకు కొన్నే.. ఒక్కోదాని వివరాలు చూసేద్దాం... నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు! నిద్ర పట్టకపోయినా.. ఉదయాన్నే నిద్రలేవాలంటే బద్ధకంగా అనిపిస్తున్నా తెల్లవారకముందే మెలకువ వచ్చేస్తున్నా.. ఈ హైటెక్ కళ్లద్దాలు వాడేయమంటోంది పెగాసీ గ్లాస్ అనే సంస్థ. ఫ్రేమ్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్ల కారణంగా సుఖనిద్రకు కావాల్సిన మెలటోనిన్‌ను నియంత్రించవచ్చునన్నది కంపెనీ అంచనా. తద్వారా మన శరీరాల్లోని గడియారం సహజస్థితికి చేరుతుందని.. నిద్ర సమస్యలన్నీ దూరమవుతాయని కంపెనీ అంటోంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.12 వేల వరకూ ఉంటుంది! ఒత్తిడికి విరుగుడు ఈ హెడ్‌బ్యాండ్ కెనడాకు చెందిన స్టార్టప్ ఇంటరెక్సాన్ ‘మ్యూజ్’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ హెడ్‌బ్యాండ్ మన మెదడులోని నాడుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒత్తిడిని తగ్గిస్తుందట. ధాన్యం చేసేటప్పుడు ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు, అథ్లెటిక్స్ పోటీల్లో ఒత్తిడిని జయించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. దక్షిణ కొరియాకు చెందిన లూక్సిడ్ ల్యాబ్స్ కూడా ఇలాంటి పరికరాన్నే ప్రదర్శించినప్పటికీ ప్రస్తుతం తాము పరిశోధన దశలోనే ఉన్నామని కంపెనీ ప్రకటించింది. వృద్ధుల స్థితిగతులపై కన్నేసేందుకు.. మతిమరపు లేదంటే అయిష్టత కారణంగా వయసు మీదపడిన వారు మందులు తీసుకునేందుకు అంతగా ఇష్టపడరు. ఈ సమస్యకు పరిష్కారంగా వాషింగ్టన్ స్టార్టప్ కంపెనీ సెన్సోరియా పేరుతో ఓ వినూత్నమైన గాడ్జెట్‌ను సిద్ధం చేసింది. వ్యాయామ సమయంలో శరీర కదలికలను గుర్తించి.. తప్పుఒప్పులను సరిచేసేందుకు కొన్నేళ్ల క్రితం సిద్ధం చేసిన ఓ గాడ్జెట్నే ప్రస్తుతం వృద్ధులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. మన దుస్తులకు గానీ, సాక్స్కుగానీ ఈ గాడ్జెట్‌ను తగిలించుకుంటే.. వ్యాయామం సరిగా చేస్తున్నారా లేదా?, మందులు సక్రమంగా తీసుకుంటున్నారా? వంటి అంశాలన్నింటినీ వారికి గుర్తు చేస్తూంటుంది ఇది. తుంటి ఎముకలకు రక్షణ కవచం.. వృద్ధులు పొరబాటున జారిపడితే తుంటి ఎముకలకు నష్టం జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారి కోసమే ఫ్రాన్స్ కంపెనీ హెలైట్ తుంటిభాగానికి రక్షణ కల్పించే ఓ హైటెక్ సంచిని తయారు చేసింది. నడుముకు తగిలించుకుని వెళుతూంటే చాలు.. వాటిలోని మోషన్ సెన్సర్స్ మన కదలికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ప్రమాదవశాత్తూ పడిపోతే.. ఇవి వెంటనే స్పందిస్తాయి. గాలి బుడగలు విచ్చుకునేలా చేస్తాయి. ఫలితంగా సున్నితమైన తుంటి ఎముకలకు రక్షణ ఏర్పడుతుందన్నమాట. -
కంట్లో 27 కాంటాక్ట్ లెన్సులు
వైద్యులే ఆశ్చర్యపోయిన ఓ ఘటన లండన్‌లో వెలుగుచూసింది. కళ్లద్దాలకు బదులుగా వాడే కాంటాక్ట్ లెన్సుల గురించి మనకు తెలిసిందే. అయితే ఎవరి కళ్లల్లోనైనా ఒకటి మించి కాంటాక్స్ లెన్స్ ఉండవు. కానీ ఓ మహిళ కంట్లో నుంచి ఏకంగా 27 కాంటాక్ట్ లెన్స్‌లను బయటకు తీశారు వైద్యులు. లండన్‌లో 67 ఏళ్ల ఓ మహిళకు కంటి శుక్లాల శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. కంటి లోపల నీలిరంగులో పొరలు ఉండటాన్ని గమనించి, వాటిని పరీక్షించి చూసి నివ్వెరపోయారు. కంట్లో కాంటాక్ట్ లెన్స్‌లను తీయకుండా సదరు మహిళ అలాగే ఉంచేసుకుందని గుర్తించారు. తొలుత రెండో మూడో కాంటాక్ట్ లెన్స్‌లు ఉన్నట్లు భావించిన వైద్యులు ఆ తర్వాత తీసేకొద్దీ వస్తుండడంతో అవాక్కయ్యారు. మొత్తం అలా చిక్కుకున్న 27 లెన్స్‌లను బయటకు తీశారు. కాంటాక్ట్ లెన్స్‌లు వాడిన అనంతరం తొలగించకపోవడంతో ఇవన్నీ కంటిలో చిక్కుకున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ‘ఇలాంటి ఘటనను మేం ఇంత వరకూ చూడలేదు. భారీ మొత్తంలో కాంటాక్ట్‌లెన్స్‌లు ఆమె కంటిలో చిక్కుకుపోయాయి. 17 లెన్స్‌లు కలిసి ముద్దగా మారాయి. అయితే బాధితురాలు ఈ విషయాన్ని గమనించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ కారణంగానే ఆమె కంటి సమస్య మరింత ముదిరింది. మొదట మేం 17 లెన్స్‌లను మాత్రమే గుర్తించాం. ఆ తర్వాత మరిన్ని పరీక్షలు నిర్వహించగా మరో పది ఉన్నట్లు తేలింది’ అని ఆమెకు చికిత్స అందించిన వైద్యుల్లో ఒకరైన రూపల్ మోర్జారియా తెలిపారు. వైద్యులను సంప్రదించకుండానే డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని రూపల్ స్పష్టం చేశారు. -
చిన్నా.. మాట వినాల్సిందే కన్నా..
అసలే సెలవులు.. దీంతో పొద్దున్న లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకూ నాన్న సెల్లో.. అమ్మ మొబైలో పట్టుకుని.. ఆపమని పోరు పెడుతున్నా.. వినకుండా వీడియో గేమ్స్ ఆడుకునే పిల్లల జనరేషన్ ఇదీ.. తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో టెంపుల్ రన్ అంటూ.. సబ్వే సర్ఫర్స్ అంటూ గంటలతరబడి వీడియో గేమ్స్ ఆడటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అడ్డదిడ్డంగా కూర్చుని.. సోఫాపై ఇష్టానుసారం పడుకుని వీటిని ఆడుతుంటారు. తిన్నంగా కూర్చోమని చెప్పినా వినరు. దీని వల్ల వాళ్ల వెన్నుపూస, మెడ భాగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కళ్లద్దాలు ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ చె ప్పనున్నాయి. ఇంతకీ ఇదేం చేస్తుంది? ఠి ఈ అద్దాలు, ఒక యాప్‌తో లింక్ అయి ఉంటాయి. దీన్ని ఫోన్లో లోడ్ చేసుకుంటే చాలు.. పిల్లలు గేమ్స్ ఆడుతున్నప్పుడు సరైన భంగిమలో కూర్చుంటున్నారో లేదో ఇందులోని సెన్సర్లు గమనిస్తూ ఉంటాయి. సరిగా కూర్చోకుంటే.. హెచ్చరిక సందేశాలను పిల్లలకు, మనకూ పంపిస్తాయి. ఇలా ఐదు సార్లు చెబుతుంది. అయినా వినకుంటే.. వీడియో గేమ్ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. కళ్లద్దాలు తీసేస్తేనో.. పిల్లలు ఈ కళ్లద్దాలను తీసేసినప్పటికీ.. హెచ్చరికలు వస్తునే ఉంటాయి. కౌంట్ దాటగానే.. కళ్లద్దాలు తీసేసినప్పటికీ.. గేమ్ ఆగిపోతుంది. అంతేకాదు.. ఇందులో వచ్చే వార్నింగ్‌ల సంఖ్యను మనం సెట్ చేసుకోవచ్చు. అంటే.. 3 సార్లు వార్నింగ్ వచ్చి.. తర్వాత షట్‌డౌన్ అయిపోయేలా మనం మార్చుకోవచ్చు. గేమ్స్ నిర్ణీత సమయానికి షట్‌డౌన్ అయిపోయేలా కూడా మార్పులు చేయవచ్చు. ఎవరు తయారుచేశారు? రేటెంత? ఐఫోర్సర్ అనే సంస్థ తయారుచేసింది. దీన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు కిక్‌స్టార్టర్ ద్వారా నిధుల సేకరణ చేస్తోంది. ధర రూ.8 వేలు. -
కాంటాక్ట్ లెన్సులు ఇక చీకట్లోనూ చూపునిస్తాయ్!
వాషింగ్టన్: జేమ్స్‌బాండ్ సినిమా తరహాలో చిమ్మచీకటిలో సైతం పరిసరాల్లో మనుషులు, జంతువుల సంచారాన్ని చూపగలిగే వినూత్న కాంటాక్ట్ లెన్సులను యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే పనిచేసేలా వారు రూపొందించిన గ్రాఫీన్ లైట్ డిటెక్టర్లు పరిసరాల్లో పూర్తిస్థాయి ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్(పరారుణ వర్ణపటం)ను పసిగడతాయట. దీంతో మామూలు కాంటాక్ట్ లెన్సులతో కూడా చీకట్లో ఇన్ఫ్రారెడ్ చూపు త్వరలోనే సాధ్యం కానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలాంటి ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్లు ఇదివరకే వచ్చినా.. వాటిని ఎల్లప్పుడూ చల్లబర్చాల్సి ఉండటం ప్రతిబంధకంగా ఉంది. అయితే గ్రాఫీన్ డిటెక్టర్లు గది ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచే యడమే కాకుండా వాటిని కాంటాక్ట్ లెన్సులు, మొబైల్ఫోన్లకు కూడా అనుసంధానం చే యొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాగా చీకట్లో మనుషులను పసిగట్టేందుకే కాకుండా.. రోగుల శరీరంలో రక్తప్రసరణను వైద్యులు పర్యవేక్షించేందుకు, పర్యావరణంలో రసాయనాలను గుర్తించేందుకు కూడా ఇన్ఫ్రారెడ్ విజన్ పరికరాలు ఉపయోగపడతాయట.