contraceptive operation
-
గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి ..
ఇటీవల చాలామంది స్త్రీలు గర్భం రాకుండా ప్లానే చేసుకునేలా అందుబాటులోకి వచ్చిన సరికొత్త వైద్య విధానాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. టాబ్లెట్ల దగ్గర నుంచి వివిధ రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. కాకపోతే అవన్నీ వైద్యుల సూచనలు సలహాల మేరకే వినియోగించాల్సి ఉంటుంది. అలానే ఇక్కడొక మహిళ కూడా గర్భం రాకుండా ఉండేలా అత్యాధునిక వైద్యం చేయించుకుంది. అందులో భాగంగా ఓ పరికరాన్ని ఇంప్లాంట్ చేస్తే అది కాస్త నేరుగా ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్‌కి చెందిన 22 ఏళ్ల క్లో వెస్టర్వే తన చేతికి రెండేళ్ల క్రితం గర్భ నిరోధక పరికరాన్ని ఇంప్లాంట్ చేశారు. ఈ వైద్య విధానంలో భాగంగా ఓ ఫ్లైక్సిబుల్ రాడ్‌ని ఆమె చేతికి ఇంప్లాంట్ చేశారు. నిజానికి ఈ రాడ్ ప్రతినెల అండోత్సర్గాన్ని ఆపేలా ప్రొజెస్టెరాన్‌ను రక్తప్రవాహంలో విడుదల చేస్తుంది. ఈ రాడ్ మూడు సంవత్సరాల వరకు గర్భరాకుండా చేస్తుంది. పైగా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే రోజు గర్భం రాకుండా మాత్ర వేసుకునే ఇబ్బందకి చెక్ పెడుతుంది. ఆరోగ్య పరంగా మంచిది. అందుకనే ఎక్కువ మంది మహిళలు గర్భం రాకుండా ఉండేలా ఈ ఇంప్లాంట్కే ఎక్కువ మక్కువ చూపించడానికి ప్రధాన కారణం. అయితే ఏం జరిగిందో ఏమో! సడెన్‌గా ఈ ఇంప్లాంట్ జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి క్లో గుండెల్లో మంట, వాంతులు, అధిక రక్తస్రావం, దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఆస్పత్రికి వెళ్లి చెకప్చేయగా ఆమెకు ఇంప్లాంట్ చేసిన రాడ్ చేతి వద్ద కనపించలేదు. ఎంత ప్రయత్నించిన వైద్యులుఆ రాడ్ ఎక్కడుందనేది కనుగొనలేకపోయారు. చివరికి ఆ రాడ్ ఆమె గుండెలోని పల్మనరీ ధమనుల్లోకి వెళ్లిపోయిందని గుర్తించి షాక్‌కి గురయ్యారు వైద్యులు. అది సుమారు నాలుగు సెంటిమీటర్ల పరికరం. నిజానికి ఇది వైద్యులు గర్భం రాకుండా ఉండేలా ఆమె చేతిపై చర్మం వద్ద ఉంచిన ఒక ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ రాడ్. దీని కారణంగా ఆమె తీవ్రమైన నరాల నొప్పి, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలను చవిచూసింది. ఇప్పుడూ ఆ ఫ్లెక్సిబుల్ రాడ్‌ని తొలగించేందుకు సదరు బాధిత మహిళకు మొదటగా ఊపిరితిత్తుల ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, తదితర శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని వైద్యులు ఆమెకు తెలిపారు. ఆమె కోలుకోవడానికే దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది. దీని కారణంగా ఆమె జీవితంలో ఆమె ఏ బరువైనా వస్తువుని పైకి ఎత్తలేదు, తనంతట తాను స్వయంగా లేవలేదు. కాగా యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం గర్భనిరోధక ఇంప్లాంట్ వికటించిన కేసులు 18 ఉన్నాయి. అలాగే ఆమెలా గుండె పల్మనరీ ధమనుల్లోకి పరికరం చేరిన కేసులు 107 ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాస్తవానికి ఆ పరికరం పనిచేయకపోతే ఇలా గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాలు గర్భధారణను నివారించడంలో 99% సమర్థవంతంగా పనిచేస్తుందని, పైగా ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్యులు. ఐతే ఇలా కొన్ని కేసుల్లో ఈ పరికరం ఎందుకు వికటిస్తోందో తెలియాల్సి ఉందన్నారు. దీని గురించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: క్యాన్సర్‌కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..) -
కుక్కలకూ కు.ని.
♦ స్పెషల్ డ్రైవ్‌గా సంతాన నిరోధక ఆపరేషన్లు ♦ ఆరు నెలల్లో 70 శాతం లక్ష్యం ♦ పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వీధి కుక్కలకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా సంతాన నిరోధక ఆపరేషన్లతో వీధి కుక్కల పునరుత్పత్తి కట్టడి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నగరంలో ఆరు లక్షలకు పైగా వీధి కుక్కలు ఉండగా, స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆరు నెల ల్లో వాటిలో 70 శాతం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించా రు. ఇందులో జీహెచ్ఎంసీ వెటర్నరి విభాగంతో పాటు రాష్ట్ర పశు సంవర్థక శాఖ సేవలను కూడా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగరంలో ఎనిమల్ కేర్ సెంటర్లను ఐదు నుంచి తొమ్మిదికి పెంచాలని నిర్ణయించారు. మంగళవారం జీహెచ్ఎంసీలో కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర పశుసంవర్థక శాక డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సీనియర్ అధికారి డాక్టర్ సంపత్‌కుమార్, జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు తదితరులు పాల్గొని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. జంటకు నాలుగువేల ఉత్పత్తి ఒక కుక్కల జంట ఏడేళ్లలో 4 వేల కుక్కలు ఉత్పత్తి సేస్తుంది. కుక్క జీవిత కాలం 8 నుంచి 11 సంవత్సరాలు కాగా, ప్రతి ఎనిమిది నెలలకు ఒకసారి నాలుగు నుంచి ఆరు పిల్లలకు జన్మనిస్తోంది. నగరంలో ఉన్న సుమారు ఐదున్నర లక్షల వీధి కుక్కల్లో పునరుత్పత్తి రేటు అధికంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ప్రైవేటులో ఆపరేషన్లు ప్రైవేటు సంస్థల ద్వారా కూడా కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 11 మంది ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లు, 24 మంది ప్రైవేటు డాక్టర్లు 102 డాగ్ క్యాచర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేటు డాక్టర్లతో పాటు వెటర్నరీ ఆసుపత్రుల్లో కూడా వీధి కుక్కలకు ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ నగరంలోని వంద శాతం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయనున్నటు కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా ఏటా లక్ష కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. రెబిస్ రహిత నగరంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెబిస్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్ఎంసీతో కలిసి పనిచేసేందుకు సిద్దమేనని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకుగాను కనీసం 20 మంది డాక్టర్లను ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేబిస్ కేసులు తగ్గుముఖం జీహెచ్ఎంసీ పరిధిలో గత రెండేళ్లలో రేబిస్ వ్యాధితో ఒక్కరు కూడా మరణించలేదని నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. గత రెండేళ్లలో 61,749 మంది కుక్క కాటుకు గురైనట్లు వారు పేర్కొన్నారు. ఇంటి కుక్కలకు లెసైన్స్ తప్పని సరి ఇంటి కుక్కలకు లెసైన్స్ తప్పనిసరి చేశారు. జీహెచ్ఎంసీలో రూ. 50 చొప్పున చెల్లించి ప్రత్యేక నంబర్ లెసైన్స్ పొందాల్సి ఉంటుందని, లెసైన్స్‌లేని కుక్కలను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.