Cube Movie Network Company
-
రేపటి నుంచి సినిమాల ప్రదర్శన బంద్
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(క్యూబ్, యూఎఫ్ఓ) వసూలు చేస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) తగ్గించనందుకు నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)’ స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రాందాస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్లోకి మారుతూ వచ్చింది. వీపీఎఫ్ నామమాత్రమే చెల్లించండి.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పిన క్యూబ్, యూఎఫ్ఓ యాజమాన్యాలు ఇప్పుడు మాట మారుస్తున్నాయి. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్నూ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ చిత్రవర్గాలు నిర్మాత డి.సురేశ్‌బాబు చైర్మన్‌గా, నిర్మాత కిరణ్ కన్వీనర్‌గా ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ని 25శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఫీజును 10 శాతం తగ్గిస్తామని వారు అంటే ఒప్పుకోలేదు. ఫిబ్రవరి 23న బెంగళూరులో మరో సమావేశం నిర్వహించగా, 9శాతం మాత్రమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే ఓ వ్యక్తి ‘ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ’ అని వ్యంగ్యంగా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయాడు. మా డిమాండ్లకు ఒప్పుకోకుంటే మార్చి 2నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని వారికి స్పష్టం చేశాం. మా నిర్ణయానికి సౌత్ ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా క్యూబ్, యూఎఫ్ఓ కంపెనీలు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు మా డిమాండ్లు ఒప్పుకుంటే సినిమాల ప్రదర్శన ఉంటుంది. వారు ఒప్పుకున్నా కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వెనకడుగు వేయం’’ అన్నారు. -
చర్చలు విఫలం
వారం వారం విడుదలయ్యే కొత్త చిత్రాల కోసం సినిమా లవర్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. అయితే మార్చి 2కి థియేటర్లలోకి కొత్త బొమ్మ వచ్చే అవకాశం కనిపించడంలేదు. థియేటర్లు మూతపడబోతున్నాయి. వినడానికి షాకింగ్‌గానే ఉంటుంది. ఎందుకీ పరిణామం అంటే.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్ఓ), నిర్మాతల మధ్య ధర విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ధర ఎక్కువగా ఉందని భావించిన నాలుగు (తెలుగు, తమిళ, కన్నడ, కేరళ) రాష్ట్రాల నిర్మాతలు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు. శుక్రవారం బెంగళూరులో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ జాయింట్ యాక్షన్ కమిటీ (తెలుగు, తమిళ, కేరళ, కర్నాటక) వారు డిజిటల్ ప్రొవైడర్స్‌తో మరో సమావేశం నిర్వహించారు. ఇçప్పుడు వసూలు చేస్తున్న మొత్తంలో 20 శాతం తగ్గిస్తే చాలన్నది నిర్మాతల విన్నపం అని తెలిసింది. గత సమావేశాల్లా ఈసారి కూడా చర్చలు విఫలం అయ్యాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు 9 శాతం మాత్రమే తగ్గించడానికి ముందుకు వచ్చారని సమాచారం. దాంతో మార్చి 2 నుంచి కొత్త చిత్రాల కంటెంట్ ఇవ్వకూడదనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారు. కంటెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా థియేటర్లు మూతపడతాయి. అది మాత్రమే కాదు.. అప్పటికే ఆడుతున్న సినిమాలను కూడా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఈ పరిస్థితి ఎందాకా వెళుతుందో వేచి చూడాలి. -
థియేటర్లలో లఘు చిత్రాలు
థియేటర్లలో లఘు చిత్రాల ప్రదర్శన ఇప్పటివరకూ జరగలేదు. అలాంటిది భారతదేశంలోనే తొలిసారిగా ఐదు ఉత్తమ లఘు చిత్రాల ప్రదర్శనకు తమిళనా డులో శ్రీకారం జరిగింది. మూవీ బ ఫ్, ఫస్ట్ క్లాప్ సంస్థలు సంయుక్తం గా గతేడాది డిసెంబర్లో నిర్వహించిన లఘు చిత్రాల పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. 250 లఘు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో ఐదు లఘు చిత్రాలు ఎంపికయ్యాయి. ఈ ఐదు లఘు చిత్రాలు ఈ నెల 10 నుంచి ఏప్రి ల్ నెల 13వ తేదీ వరకూ తమిళనాడులో ని 150 థియేటర్లలో వారానికి ఒక లఘు చి త్రం చొప్పున క్యూబ్ సినిమా నెట్వర్క్ సంస్థ ప్రదర్శించనుంది. కాగా ఈ ఐదు చిత్రాల్లో ఆన్లైన్ కాంటెస్ట్‌లో అధిక ప్రజాదరణ పొం దిన మూడు చిత్రాల దర్శకులకు నటుడు సూర్య 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నగదు బహుమతులతో పాటు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించనుందని ఈ సంస్థ నిర్వాహకుడు సోమవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో 250 లఘు చిత్రాల్లో ఉత్తమ లఘు చిత్రాలుగా ఎంపికయిన అప్లాక్ చిత్ర దర్శకుడు ప్రదీప్ రంగనాథన్, ఇందనాళ్ ఇనియనాళ్ చిత్ర దర్శకుడు హహేశ్ బాలసుబ్రమణ్యం, అవళ్ అళగు చిత్ర దర్శకుడు శ్రీ విజయ్గణపతి, థింక్ అండ్ ఇంక్ చిత్ర దర్శకుడు నట్టుదేవ్, ఎన్నంగ సార్ ఉంగ చట్టం చిత్ర దర్శకుడు ప్రభు జయరామ్‌లతో పాటు దర్శకుడు జయేంద్ర, క్యూబ్ సినిమా నెట్వర్క్ నిర్వాహకుడు తదితరులు పాల్గొన్నారు. యువ ప్రతిభను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ లఘు చిత్రాల పోటీని నిర్వహించినట్లు మూవీబఫ్, ఫస్ట్ క్లాప్ సంస్థల నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఉన్నత విద్యను పూర్తి చేసి సినిమాపై ఆసక్తితో అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరిగిన తమకు ఈ లఘు చిత్రాల పోటీలు సినీరంగ ప్రవేశానికి మంచి మార్గం అవుతాయన్నారు. ఇప్పటికే తమ లఘు చిత్రాలను థియేటర్లలో చూసిన మిత్రులు, బంధువులు చాలా బాగున్నాయని అభినందిస్తున్నారని పోటీలో ఫైనల్‌కు చేరిన ఐదు లఘు చిత్రాల దర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.