Dakshina murthy
-
దక్షిణామూర్తి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్ చైతన్యపురిలోని తన గృహంలో శనివారం కన్నుమూశారు. తెలుగు అకాడమీ ఉప సంచాలకునిగా పనిచేసి 1993లో పదవీ విరమణ పొందిన దక్షిణామూర్తి అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘వెలుగు వెన్నెల గోదావరి’ నవలను ఉత్తరాంధ్ర, ‘ముత్యాల పందిరి’ నవలను తెలంగాణ, ‘రంగవల్లి’ నవలను రాయలసీమ మాండలికాల్లో రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సెయింట్’ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి ‘ఒక యోగి ఆత్మకథ’ పేరిట తెలుగులో అనువదించారు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆయన కొండేపూడి సాహితీ సత్కారంతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. దక్షిణామూర్తి 1935 డిసెంబర్ 29న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరంతా చైతన్యపురి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన శనివారం రాత్రి 7.20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం వీవీ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. సంతాపం ప్రకటించిన సీఎం జగన్ పోరంకి దక్షిణామూర్తి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసిన దక్షిణామూర్తి ఎన్నో ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్నారని, ఆయన అనువదించిన ‘ఒక యోగి ఆత్మకథ’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసం- బ్లాక్ మెయిలింగ్
ఖమ్మం (అర్బన్) : యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి, బ్లాక్మెరుులింగ్కు పాల్పడిన నిందితులను ఆరెస్టు చేసినట్లు ఖమ్మం డీఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన ఎస్కె. హుస్సేన్ పాల్వంచలోని బీపార్మసీ కాలేజీలో 2013లో డీఫార్మసీ చదువుతుండగా విజయవాడకు చెందిన బీఫార్మసీ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. హుస్సేన్ ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మించి లైంగిక అవసరాలు తీర్చుకున్నారు. అంతేకాకుండా విద్యార్థినికి తెలియకుండా సెల్ఫోన్లో చిత్రీకరించాడు. తర్వాత బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ విద్యార్థిని నుంచి రూ. 25 వేల నగదు, రూ. లక్షా 35 వేల విలువైన బంగారు గాజు, రెండు చైన్లు, రెండు జతల చెవి దిద్దులు తీసుకుని తన జల్సాలకు ఖర్చు చేశాడు. హుస్సేన్ సెల్ ఫోన్లోని యువతితో గడిపిన చిత్రాలను తన మిత్రులకు చూపించాడు. వాటిని చూసిన మిత్రులు సునీల్ ( తల్లాడ మండలం ముద్దునూరు) రెహమాన్ (ఖమ్మం ఖిల్లా ), మనోజ్ ( భద్రాచలం)కు చూపించాడు. దీంతో వారు యువతిచేత లైంగిక అవసరాలు తీర్పించాలని హుస్సేన్‌పై ఒత్తిడి పెంచారు. హుస్సేన్ యువతికి ఫోన్ చేసి మిత్రుల విషయం చెప్పడంతో ఆమె ఈనెల 21న అర్బన్ పోలీసులను కుటుంబసభ్యులతో ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు హుస్సేన్, సునీల్, రెహమాన్లను అరెస్టు చేశారు. మనోజ్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుండి రూ. 25 వేల నగదుతోపాటు, బంగారపు ఆభరాణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.