ఖమ్మం (అర్బన్) : యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి, బ్లాక్‌మెరుులింగ్‌కు పాల్పడిన నిందితులను ఆరెస్టు చేసినట్లు ఖమ్మం డీఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన ఎస్‌కె. హుస్సేన్ పాల్వంచలోని బీపార్మసీ కాలేజీలో 2013లో డీఫార్మసీ చదువుతుండగా విజయవాడకు చెందిన బీఫార్మసీ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. హుస్సేన్ ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మించి లైంగిక అవసరాలు తీర్చుకున్నారు. అంతేకాకుండా విద్యార్థినికి తెలియకుండా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. తర్వాత బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ విద్యార్థిని నుంచి రూ. 25 వేల నగదు, రూ. లక్షా 35 వేల విలువైన బంగారు గాజు, రెండు చైన్లు, రెండు జతల చెవి దిద్దులు తీసుకుని తన జల్సాలకు ఖర్చు చేశాడు.
హుస్సేన్ సెల్ ఫోన్‌లోని యువతితో గడిపిన చిత్రాలను తన మిత్రులకు చూపించాడు. వాటిని చూసిన మిత్రులు సునీల్ ( తల్లాడ మండలం ముద్దునూరు) రెహమాన్ (ఖమ్మం ఖిల్లా ), మనోజ్ ( భద్రాచలం)కు చూపించాడు. దీంతో వారు యువతిచేత లైంగిక అవసరాలు తీర్పించాలని హుస్సేన్‌పై ఒత్తిడి పెంచారు. హుస్సేన్ యువతికి ఫోన్ చేసి మిత్రుల విషయం చెప్పడంతో ఆమె ఈనెల 21న అర్బన్ పోలీసులను కుటుంబసభ్యులతో ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు హుస్సేన్, సునీల్, రెహమాన్‌లను అరెస్టు చేశారు. మనోజ్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుండి రూ. 25 వేల నగదుతోపాటు, బంగారపు ఆభరాణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ప్రేమ పేరుతో మోసం- బ్లాక్ మెయిలింగ్
Published Sat, Feb 28 2015 12:11 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement
Advertisement