delhi metro trains
-
మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా?
దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాంక్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్ ఇప్పుడు ముందుకొచ్చారు. మరి తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? శ్రీధరన్‌కి వయోపరిమితి అడ్డు రాదు. బీజేపీ వయోపరిమితి ఆంక్షలను చాలా సందర్భాల్లో సడలించేసింది. వామపక్షాలు మాత్రమే ఇప్పటికీ ఈ వయోపరిమితి నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం మన దేశంలోని రాజకీయ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని తమకు తాముగా ఉల్లంఘిస్తుంటాయి. దేశంలో అనేక సంక్లిష్టమైన బ్రిడ్జిలను, ప్రత్యేకించి అత్యంత ప్రాచుర్యం పొందిన ఢిల్లీ మెట్రో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన మాజీ రైల్వే అధికారి, మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. కానీ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి వయస్సు ఆయనకు అడ్డంకేమీ కాలేదు. ఆయన వేసిన అడుగు సాహసోపేతమైనది కాబట్టే కొనియాడదగినది. కేరళలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండటం, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ చాలా దూరంలో ఉంటున్న నేపథ్యంలో శ్రీధరన్ నిర్ణయం అసాధారణమైందనే చెప్పాలి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అశ్వమేధ యజ్ఞం ప్రకారం బీజేపీకి కేరళలో అధికారం చేజిక్కించుకోవడం చాలా కీలకమైన విషయం. దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాం క్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. కాబట్టి ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్ ఇప్పుడు ముందుకొచ్చారు. గవర్నర్ వంటి రాజ్యాంగ పదవులు చేపట్టడంపై తనకు ఆసక్తి లేదని, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి వెనుకాడబోనని శ్రీధరన్ స్పష్టం చేశారు. ఇంతవరకు అంతా బాగుంది. ఎందుకంటే తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? కానీ ఇక్కడ ఒక అవరోధం ఉంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు, ఒక పుకారు వ్యాప్తిలోకి వచ్చింది. అదేమిటంటే ఎన్నికల్లో గెలుపు సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు 75 ఏళ్లు దాటిన బీజేపీ సభ్యులకు మంత్రివర్గంలో చేరే అర్హత ఉండబోదని అప్పట్లో వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేవారికి అప్పట్లో వయోపరిమితిని పెట్టలేదు. కాబట్టే తమకు నూతనంగా ఏర్పడే ప్రభుత్వంలో మంత్రిపదవులు లభించబోవనే స్పష్టమైన అవగాహనతోటే లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను నాటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించారు. ఆ తర్వాత అడ్వాణీ, జోషీలు తమ నియోజకవర్గాలలో గెలిచి అయిదేళ్లపాటు పార్లమెంటులో నిస్సారమైన జీవితం గడిపారు. తర్వాత 2019లో రిటైర్ అయ్యారు. వారిని తర్వాక బీజేపీ మార్గదర్శక్ మండల్ సభ్యులను చేసిపడేశారు. అయితే ఈ మండల్ ఇంతవరకు ఒక్కసారికూడా భేటీకాలేదనుకోండి. రాజకీయాల్లో వీరి అద్భుతమైన ప్రయాణం చివరకు వారి సుప్రసిద్ధ శిష్యుడి (నరేంద్రమోదీ) చేతిలోనే ముగిసిపోయింది. అంటే అక్బర్/బైరాం ఖాన్ కథ మరోసారి ఇక్కడ పునరావృతమైంది. అయితే బైరాం ఖాన్ లాగా అడ్వాణీ, జోషీలు ఢిల్లీనుంచి బహిష్కరణకు గురి కాలేదు. పూర్తి సదుపాయాలతో, సంపూర్ణ భద్రతతో వీరు ప్రభుత్వ వసతి గృహంలో ఢిల్లీలో నివసించడానికి వీరిని అనుమతించారు. ఆ తర్వాత వారి గురించి నేను వినలేదు. ఇటీవలకాలంలో వారిని నేను కలిసిందీ లేదు. కానీ వారు ఆరోగ్యంతో పనిచేసుకుంటున్నట్లు ఆశిస్తాను. ఇప్పుడు శ్రీధరన్ వద్దకు వద్దాం. ఏదేమైనప్పటికీ ఆయన ఒక అసాధారణమైన వృత్తినిపుణులు. ఆయన రాజకీయ జీవితంలోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టారు. బీజేపీలో 75 ఏళ్ల వయోపరిమితి గురించి అయనకు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా తెలిసి ఉండొచ్చు కూడా. అయితే ఈ నియమానికి కూడా ఇప్పటికే కొన్ని మినహాయిం పులు ఏర్పడ్డాయి. కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను ఎంపిక చేసినప్పుడు ఆ నిబంధనను బీజేపీ పాటించలేదు. ఆయన 75 ఏళ్లకు మించిన వయస్సులో కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఆయన నియామకం మాత్రం తప్పనిసరైంది. ఎందుకంటే కర్ణాటకలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారు బేజీపీలో ఎవరూ లేరు. కొంతమంది అయితే ఈ నియమం కేంద్ర స్థాయిలోనే కానీ రాష్ట్రాల్లో వర్తించదని బలహీనమైన వాదనను తీసుకొస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అంటే నరేంద్రమోదీ ఇంకా బీజేపీకి యజమాని కాకముందు, వామపక్షాలకు మల్లే రాజ్యసభకు ఎంపికయ్యే బీజేపీ సభ్యులను రెండుసార్లకు మాత్రమే పరిమితం చేయాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది. అరుణ్ షౌరీ, శత్రుఘ్న సిన్హా వంటి బీజేపీ ప్రముఖులను మూడోసారి చట్టసభలోకి అడుగు పెట్టకుండా చేయడానికి ఉపయోగపడింది. కానీ పరిస్థితులు మారిపోయాక, పాలకుల వంతు వచ్చినప్పుడు, ఈ నియమం మళ్లీ మారింది. అప్పటికే చట్టసభల్లో ఉన్నవారికి మూడోసారి, నాలుగోసారి కూడా అవకాశం కల్పిం చారు. దివంగత సీనియర్ నేత అరుణ్ జైట్లీ కూడా లేటు వయసులో ఈ జాబితాలో భాగమయ్యారన్నది వాస్తవం. కాబట్టి నియమాలు, వాటి పాటింపు గురించి చాలానే మాట్లాడుకున్నాం. కాబట్టి శ్రీధరన్‌కి ఇప్పటికీ అవకాశం ఉంది. వయోపరిమితి ఆయనకు అడ్డు రాదు. దీంతో పోలిస్తే వామపక్షాలు ఇప్పటికీ ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. రాజ్యసభలో అసాధారణమైన పనితీరు ప్రదర్శించిన ప్రముఖ వామపక్ష నేతలు కూడా రెండు సార్లు చట్టసభకు ఎన్నికయ్యాక పల్లెత్తు మాటనకుండా రాజ్యసభ నుంచి తప్పుకుని తమతమ పార్టీల నిర్ణయాన్ని గౌరవించారు. సీతారాం ఏచూరి కూడా ఇప్పుడు అదే వరసలో ఉంటున్నారు. వామపక్షాలు ఈ నియమాన్ని తమకు తాముగా రూపొందించుకోవడమే కాకుండా దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నందుకు వారంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. అంతేకానీ మీ ముఖం నాకు చూపించండి, మీకు వయోపరిమితి నిబంధనను చూపిస్తాను అనే రకంగా ఉండే బీజేపీ నినాదాన్ని వామపక్షాల ఆచరణతో పోల్చి చూద్దాం మరి. అయితే బీజేపీ ఏదైనా సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఈ 75 సంవత్సరాల వయోపరిమితిని తీసుకురాలేదు. ఒకే ఒక వ్యక్తి ఆదేశంలో ఇది ఇలా ముందుకొచ్చింది. ఆ సమయంలో నూతన పాలకుల అధికార బలాన్ని అడ్డుకోలేని పలువురు సీనియర్ నేతలకు రంగంనుంచి తప్పించుకోవడానికి ఈ వయోపరిమితి చాలా సులభమైన మార్గంగా ఉపయోగపడేది. ఈ నియమంతో వ్యవహరించడం చాలా సులభం. ఇప్పుడు ఈ నియమం లక్ష్యం నెరవేరిది. ఎందుకంటే మనుషుల కోసమే నియమాలు తయారవుతాయి కానీ నియమాల కోసం మనుషులు తయారు కారు కదా.. అమెరికాలో దేశాధ్యక్షుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అర్హుడు కాదు. అందుచేతనే చాలామంది అమెరికా అధ్యక్షులు చాలా తక్కువ వయస్సులోనే అధ్యక్ష పదవిని చేపట్టేవారు. వారితో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 78 సంవత్సరాల వయస్సులో గద్దెనెక్కడం ప్రత్యేక విషయమే అనుకోండి. భారత్‌లో, అలాంటి పదవీ కాల పరిమితులు లేదు. పదవి, ఆఫీసులో పనిచేసే కాలం విషయంలో మనకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. కానీ మనకు కూడా అలాంటి పరిమితులు విధిస్తేనే బావుం టుందా? నేనయితే కచ్చితంగా చెప్పలేను. ప్రజాస్వామ్యంలో మనం ఇలాంటి విషయాలను ప్రజలకు వదిలేయకూడదా? అయితే ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం ఆ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని ఉల్లంఘిస్తుంటాయి. ఇకపోతే శ్రీధరన్ విషయానికి వస్తే, వయసుతో సహా ఆయన్ని వెనక్కు లాగే అవకాశాలు లేవు. కాబట్టి కేరళ ప్రజలు కోరుకుంటే ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. ఇది జరగాలంటే వారు రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవాల్సి ఉంటుంది మరి. వ్యాసకర్త బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా (ఎన్డీటీవీ సౌజన్యంతో...) -
ఉచితాలతో నష్టాల్లోకి నెట్టేస్తారా?
న్యూఢిల్లీ: మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు మెట్రోలో ఉచిత ప్రయాణం ఎందుకు? ఇలా ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల భవిష్యత్తులో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్సీ)ను నష్టాల బాటలో నడిపిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఉచిత’ నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, ఇలాంటి ఉచిత తాయిలాలను ఉపేక్షించబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఢిల్లీలో నాలుగో ఫేజ్‌లో భాగంగా త్వరలో చేపట్టే మెట్రో విస్తరణ కోసం భూసేకరణ చేయాలని, దానికి అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని ‘ఆప్’ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత ప్రయాణాల వల్ల దీర్ఘకాలంలో నష్టాలు తప్పవని, ఇలాంటి హామీలనిస్తూ కేంద్రం ఈ ఖర్చునంతా భరించాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మెట్రో, బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గతంలో ప్రకటించడం తెల్సిందే. -
ఉచిత మెట్రో ప్రయాణాన్ని సమర్థిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రో రైళ్లు, డీటీసీ, క్లస్టర్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పించే ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 1,000 జనసభలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పార్టీ మహిళా విభాగం కార్యవర్గసభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశాల ద్వారా సేకరించిన అభిప్రాయాలు, పార్టీ నిర్వహించే సర్వేల ఆధారంగా వారం ఆఖరున సమగ్ర ఫీడ్‌బ్యాక్ నివేదిక రూపొందిస్తారు. చదవండి: ఢిల్లీ మహిళలకు శుభవార్త ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మహిళా విబాగం సభ్యులు తమ తమ ప్రాంతాలలో జనసభలు జరిపి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తారు. ఈ వారం రోజులలో 1,000 జనసభలు జరుపుతారు. ప్రతి ఎమ్మెల్యే, కౌన్సిలర్, మహిళా విభాగం సభ్యులకు పదేసి జనసభలు నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాలలో నివసించేవారితో మాట్లాడి నోట్స్ రూపొందిస్తారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సమర్థిస్తున్నారా, సమర్థిస్తున్నట్లయితే ఎందుకు అని పార్టీ కార్యకర్తలు ప్రజలను ప్రశ్నిస్తారు. ఈ పథకంపై బీజేపీ వ్యతిరేకతను అంగీకరిస్తారా అని కూడా ప్రశ్నిస్తారు. అంగీకరిస్తామని సమాధానమిచ్చేవారిని ఎందుకు అంగీకరిస్తున్నారని కూడా ప్రశ్నిస్తారు. -
మహిళలూ.. కత్తులు తీసుకెళ్లచ్చు!
-
మహిళలూ.. కత్తులు తీసుకెళ్లచ్చు!
ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళలు తమ భద్రత కోసం చిన్నపాటి కత్తులు, లైటర్లు, అగ్గిపెట్టెల లాంటి వాటిని తీసుకెళ్లచ్చు. మహిళలపై పెరుగుతున్న వేధింపుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొంతమంది మహిళలు వీటిని తెస్తున్నా, భద్రతా సిబ్బంది వాటిని వెనక్కి తీసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లలో భద్రతా వ్యవహారాలు చూసే సీఐఎస్ఎఫ్ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు నిషేధిత వస్తువుల జాబితాలో ఉన్న చిన్న కత్తులు, లైటర్లు, అగ్గిపెట్టెలను ఆ జాబితా నుంచి తొలగించారు. ఢిల్లీ శాస్త్రి పార్కులోని మెట్రోడిపోలో వేలకొద్దీ చిన్న కత్తులు, లైటర్ల లాంటివి పేరుకుపోతుండటంతో సీఐఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. రోజుకు సగటున వంద వరకు లైటర్లు, అగ్గిపెట్టెలను తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు సీఐఎస్ఎఫ్ చెబుతోంది. ఇప్పుడు వీటిని అనుమతించడంతో పాటు కూలీలు తీసుకెళ్లే పనిముట్లను కూడా అనుమతిస్తున్నామని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, వాటిని ముందుగా తాము పరిశీలించి, ప్రయాణికులకు నిజంగా అవి అవసరమో కాదో తెలుసుకుని ఒక రిజిస్టర్లో నమోదుచేస్తామని వివరించారు. ఇక కొన్ని మతాలకు చెందినవారు కొన్ని కొన్ని వస్తువులను తప్పనిసరిగా తీసుకెళ్తారని, వాటికి కూడా మినహాయింపు ఇస్తున్నామని అన్నారు. కొసమెరుపు గడిచిన సంవత్సర కాలంలో ఢిల్లీ మెట్రోరైల్లో పట్టుకున్న పిక్ పాకెటర్లలో 91 శాతం మంది మహిళలేనని సీఐఎస్ఎఫ్ సిబ్బంది చెప్పారు. అంతకుముందు సంవత్సరం అయితే వీళ్ల సంఖ్య 93 శాతమట!! -
మెట్రోరైలుకు మరిన్ని బోగీలు, మరిన్ని ట్రిప్పులు
మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరగడం, రైళ్లు ఏమాత్రం సరిపోకపోవడంతో ఉన్న రైళ్లకు మరిన్ని బోగీలు జత చేయాలని, అలాగే రైళ్ల ట్రిప్పులను కూడా బాగా పెంచాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇదే విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును అడిగి హామీ కూడా తీసుకున్నారు. జహంగీర్‌పురి - సమయ్‌పూర్ బద్లీ ఎక్స్టెన్షన్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా ఆయనీ విషయం చెప్పారు. 'టీమ్ ఇండియా'గా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్, వెంకయ్య నాయుడు ఇద్దరూ స్పష్టం చేశారు. కొత్త సెక్షన్లో రెండు స్టేషన్ల పేర్లు మార్చాలన్న కేజ్రీవాల్ విజ్ఞప్తిని కూడా వెంకయ్య నాయుడు ఆమోదించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న పురోగామి సభ్యుల్లో వెంకయ్య ఒకరంటూ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో ఇప్పటికే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు మెట్రో రైళ్లను ఉపయోగిస్తున్నారని, అయితే కార్లలో వెళ్లేవాళ్లు కూడా వాటిని వదిలిపెట్టి మెట్రో రైలు ఎక్కినప్పుడే అది నిజంగా విజయం సాధించినట్లవుతుందని అన్నారు. -
దర్జాగా.. దౌర్జన్యంగా.. ఏం మగాళ్లండీ వీళ్లు?!
పురుషోత్తములు రైళ్లలో, సిటీ బస్సుల్లో ‘స్త్రీలకు మాత్రమే’ అని ఉన్నచోట ఈ మగాళ్లెలా ధైర్యంగా కూర్చోగలరో ఎప్పటికీ అర్థం కాని విషయం. పైగా దబాయింపు చూపొకటి... ‘లేవం, ఏం చేసుకుంటావో చేస్కో ఫో’ అన్నట్లు! ఎందుకిలా ప్రవర్తిస్తారు వీళ్లు? ఆ... ఆడవాళ్లే కదా అన్న తేలిక భావమా? సంస్కారం లేకపోవడమా? కారణాలు ఏవైనా ఇలాంటి మగాళ్లకు బుద్ధి చెప్పడం కోసం మహిళాప్రయాణికులతోపాటు, ఇప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్సులూ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ మెట్రో రైళ్లు. వీటిల్లో మొదటి కంపార్ట్మెంట్ పూర్తిగా మహిళలది. మగాళ్లు కూర్చోకూడదు. అయినా కూడా ఈ ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ కంపార్ట్మెంట్లలో పట్టుబడిన ‘పురుషోత్తముల’ సంఖ్య 3,500. ఈ సంఖ్య గతేడాది ఇలా లేడీస్ కంపార్ట్మెంట్లలో దర్జాగా కూర్చొని దొరికిపోయినవారి సంఖ్య కన్నా తక్కువేనట. అంటే మగాళ్లలో మార్పు వచ్చిందనా? కాదు కాదు, ‘సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (మెట్రో) నిఘా పెరిగింది. ఈ ఫోర్సు మెల్లగా వస్తుంది. మామూలు దుస్తులలో వస్తుంది. లేడీస్ సీట్లలో కూర్చొని ఉన్న మగాళ్లను మెరుపులా పట్టేస్తుంది. కొందరు ‘తెలియక ఎక్కాం’ అంటారు. కొందరు ‘పెహ్లీ బార్ థా, జానేదో ప్లీజ్’ అంటారు. కొందరు ‘ఐ వాజ్ జస్ట్ చార్జింగ్ మై మొబైల్’ అంటారు. కొందరు ‘సారీ’ చెప్పి స్టేషన్ రాగానే దిగి పోతారు. ఇలాంటివి మినహాయించినా కూడా ఇన్ని వేల మంది దొరకడమే విశేషం. పట్టుకున్న వారిని సెక్యూరిటీ ఫోర్స్ ఊరికే వదిలి పెట్టదు. ఫైన్ వేస్తుంది. ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రాలు చేస్తుంటే పోలీసులకు అప్పజెబుతుంది. ప్లాట్‌ఫారమ్ మీద, ఉమన్ కంపార్ట్మెంట్ లోపల స్త్రీలకు మాత్రమే అని గమనికలు ఉంటాయి. ‘స్త్రీల కంపార్ట్మెంట్లో స్త్రీలనే కూర్చోనివ్వండి’ అనే అనౌన్స్మెంట్లు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే, మగాళ్లు కనిపిస్తూనే ఉండడం సెక్యూరిటీ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘రోజుకి సుమారు 50 మంది మగాళ్లు లేడీస్ కోచ్‌లో మాకు పట్టుబడతారు. వాళ్లను మా సిబ్బంది... స్టేషన్ కంట్రోల్ రూమ్‌కి తరలిస్తారు. అక్కడే వాళ్లు ఫైన్ కూడా కట్టాలి. మహిళలను వేధించడానికే వాళ్లంతా ఆ కోచ్‌లో కూర్చున్నారు అనేందుకు లేదు. కానీ కొందరు అందుకోసమే ఎక్కుతారు. ఏ ఉద్దేశంతో ఎక్కినా, తమ తప్పు ఒప్పుకుని లేచిపోతే పర్వాలేదు కానీ, వాదనకు దిగితే మాత్రం వారికి ఫైన్ తప్పదు’’ అని సీఐఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ అరవింద్ రంజన్ అంటారు. ఒక్క ఢిల్లీ మెట్రోలోనే కాదు, మెట్రో వ్యవస్థ ఉన్న ప్రతి నగరంలోనూ, సిటీ బస్సులలోను మహిళా ప్రయాణికులకు మగవాళ్ల బెడద తప్పడం లేదు. అంతదాకా ఎందుకు... మన హైదరాబాద్ సిటీ బస్సులలోనే చూడండి. లేడీస్ సీట్లలో మగాళ్లొచ్చి కూర్చుంటారు. లేవమంటే కోపంగా చూస్తారు. లేదంటే మాట వినిపించుకోనట్లు కిటికీల్లోచి బయటికి చూస్తుంటారు. చాలాసార్లు కండక్టర్ కూడా వాళ్లను లేపలేని అసహాయ స్థితిలో పడిపోవడం కనిపిస్తుంది. టికెట్ చెకింగ్‌కి ఉన్న విధంగా... లేడీస్ సీట్లలో ధీమాగా, దర్జాగా, ధైర్యంగా, దౌర్జన్యంగా కూర్చున్న మగాళ్లను లేపడానికి సిటీ బస్సులలో కూడా సెక్యూరిటీ ఫోర్స్లాంటి మెరుపు దాడులుండాలి. అప్పుడుగానీ లేడీస్ సీట్లు లేడీస్‌కి దక్కవేమో!