Earthquake zone
-
భూకంప జోన్లో మల్లన్నసాగర్
సాక్షి, హైదరాబాద్: తగిన అధ్యయనాలు, పరిశోధనలు చేయకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ డ్రాయింగ్లను ఆమోదించి, నిర్మాణం చేపట్టారని ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంత భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా చీలికలు, కదలికలు ఉన్నాయని.. భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తమ ప్రాథమిక నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ సిఫార్సులను పట్టించుకోకుండా.. తగిన సర్వేలు, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని తప్పుపట్టింది. ఒకవేళ భూకంపం వస్తే సమీప ప్రాంతాల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడేళ్లుగా సమగ్ర ఆడిట్ నిర్వహించిన కాగ్.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలివీ.. సగం ఆయకట్టు మల్లన్నసాగర్ కిందే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద 10.3లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన మొత్తం ఆయకట్టులో ఇది సగానికికన్నా ఎక్కువ. 2017 అక్టోబర్‌లో మల్లన్నసాగర్ నిర్మాణాన్ని ప్రారంభించగా.. మార్చి 2022 నాటికి రూ.6,126 కోట్లు విలువైన పనులు చేశారు. గత సీఎం 2020 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అధ్యయనం జరపాలని కోరినా... మల్లన్నసాగర్ ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. అయితే నిర్మాణం ప్రారంభించడానికి ముందే ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై (సైట్ స్పెసిఫిక్ సీస్మిక్ స్టడీస్) నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సంస్థలతో అధ్యయనం జరిపించాలని సూచించారు. దీంతో సంబంధిత అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదల శాఖ హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. కానీ ఆ అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే.. 2017లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించింది. తర్వాత ఎన్జీఆర్ఐ నివేదిక ఇచ్చింది. భూకంపాలకు అవకాశం ఉందంటూ.. దేశంలో భూకంపాల సంభావ్యత తక్కువగా ఉండే సీస్మిక్ జోన్–2లో తెలంగాణ ఉన్నా.. 1967లో కోయినాలో, 1993లో లాతూర్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపాలతో.. జోన్–2 ప్రాంతం కూడా భూకంపాలకు అతీతం కాదని తేలిందని ఎన్జీఆర్ఐ నివేదికలో పేర్కొంది. ఇటీవలికాలంలో ఒంగోలు, లాతూర్‌లో వచి్చన భూకంపాలతో తెలంగాణలోనూ ప్రకంపనలు వచ్చాయని, ఇక్కడి నిర్మాణాలకు స్వల్పంగా నష్టం జరిగిందని తెలిపింది. 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచి్చన భూకంపంతో దక్షిణ భారతదేశం అంతా ప్రకంపనలు కనిపించాయని పేర్కొంది. 1983 జూన్‌లో హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని.. దాని ప్రభావం 200 కిలోమీటర్ల వరకు కనిపించిందని గుర్తు చేసింది. నాటి భూకంప కేంద్రం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇక్కడ 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే తట్టుకునేలా కట్టని (నాన్ ఇంజనీర్డ్) నిర్మాణాలు దెబ్బతింటాయని పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంతంలోని భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా మూడు జతల చీలికలు (3 సెట్స్ ఆఫ్ డామినెంట్ లీనమెంట్) ఉన్నాయని.. కదలికలు కూడా చోటుచేసుకుంటున్నాయని నివేదికలో తెలిపింది. వీటితో పడే ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పట్టించుకోకుండా, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మల్లన్నసాగర్ దృఢత్వం, భూకంపం వస్తే జరిగే విపత్తు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలేనని కాగ్ పేర్కొంది. అత్యవసరంగా డ్రాయింగ్స్కు ఆమోదం మల్లన్నసాగర్ నిర్మిత ప్రాంతంలో భూకంపాల సంభావ్యతపై అధ్యయనాలు లేవని.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అత్యవసర పరిస్థితిలో రిజర్వాయర్ డ్రాయింగ్స్‌ను ఆమోదిస్తున్నామని సీడీఓ చీఫ్ ఇంజనీర్ పదేపదే పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ డ్రాయింగ్స్ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఐఐటీ–రూర్కి’ల నుంచి ఈ డ్రాయింగ్స్కు తదుపరి ఆమోదం(వెట్టింగ్) తీసుకోవాలని కూడా సూచించారు. కానీ నీటిపారుదల శాఖ సదరు సంస్థలతో వెట్టింగ్ చేయించినట్టు ఎలాంటి రికార్డులు లేవని కాగ్ పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్మాణం 95శాతం పూర్తయ్యాక 2021 జనవరిలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలైన డిజైన్లు, స్థిరత్వ విశ్లేషణలు, డిజైన్లకు వెట్టింగ్ కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం విడ్డూరమని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరపలేదని, ఎలాంటి నివేదిక సైతం ఇవ్వలేదని పేర్కొంది. ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించి మల్లన్నసాగర్ డ్యామ్ దెబ్బతింటే.. ప్రాణ, ఆస్తి నష్టం నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ ఓ నివేదిక సమర్పించింది. మల్లన్నసాగర్లో నీళ్లు నింపడానికి ముందే ఈ నివేదికలోని అంశాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని సూచించింది. మల్లన్నసాగర్లో 2021 ఆగస్టు నుంచి నీళ్లు నింపడం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఎమర్జెన్సీ ప్లాన్‌ను తయారు చేయలేదని కాగ్ ఆక్షేపించింది. ఒకవేళ్ల మల్లన్నసాగర్‌కు ప్రమాదం జరిగితే.. సమీప ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది. -
ఆ మట్టే ‘పీసా’ను నిలబెట్టింది
ఇటలీ: ప్రఖ్యాత పీసా టవర్ (బెల్ టవర్) నిర్మాణంపై ఇప్పటివరకు అంతుచిక్కకుండా ఉన్నపలు విషయాలను భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్రీ.శ.1173లో నిర్మాణమై, రెండు ప్రపంచ యుధ్దాలకు సాక్షిగా నిలిచిన ఈ భారీ నిర్మాణం ఒకవైపు ఒరిగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిర్మాణ దశలోనే ఇది భూమిలోకి కుంగటం ప్రారంభమైందట. పునాదిలో కొంత మెత్తటి భూభాగం ఉండడంతో అలా జరిగిందట. మొత్తంగా నిర్మాణం పూర్తయ్యే సరికి టవర్ 5.5 డిగ్రీల మేర ఓ వైపుకు ఒరిగింది. పీసాకు అదే ప్రత్యేకత తెచ్చిపెట్టింది. వందల ఏళ్ల చరిత్ర ఒకవైపు, నిర్మాణంలో లోపం ఉన్నా చెక్కు చెదరకుండా వందల ఏళ్లుగా పర్యాటకుల మన్ననలు పొందుతుండటం మరోవైపు పీసాకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్‌లో స్థానం సంపాదించి పెట్టాయి. కాగా, 1990 నుంచి పదేళ్లపాటు పీసా టవర్ పునరుద్ధరణ పనులు జరిగాయి. టవర్ ఒంపును 5.5 డిగ్రీల నుంచి 3.9 డిగ్రీలకు సరిచేశారు. నాలుగు భారీ భూకంపాలను తట్టుకుని.. ఎంతో ఆధునిక నిర్మాణ పద్ధతులు పుట్టుకొచ్చిన నేటికాలంలో.. చిన్న పాటి భూ ప్రకంపనలకే భారీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భవనాలు పేకమేడల్లా నేలమట్టం అవుతున్నాయి. అలాంటిది నిర్మాణ లోపంతో ఓ వైపు కుంగిపోయిన పీసా టవర్ ఇప్పటి వరకు 4 భారీ భూకంపాలకు గురైంది. అయినా, చెక్కు చెదరకుండా నిలబడింది. ప్రజలను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6 కి పైగా నమోదైన పరిస్థితులను సైతం తట్టుకొని ఈ టవర్ నిలిచివుండడం పట్ల శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి లోనయ్యారు. దీని వెనక గల కారణాలను శోధించడం మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలను తొలుస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఏ మెత్తటి భూభాగం కారణంగా పీసా టవర్ ఓవైపు ఒరిగిందో.. అదే మెత్తటి మట్టి ఈ నిర్మాణానికి బలాన్ని, భవిష్యత్తును ఇచ్చింది. టవర్ ఎత్తు, దృఢత్వం, పునాది మట్టిలోని మృదుత్వం టవర్‌కు వైవిధ్యమైన లక్షణాలను అందించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మట్టి కారణంగా భూకంప ప్రకంపనలతో ప్రతిబింబించని విధంగా టవర్‌కు ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయినీ, వందల ఏళ్లుగా టవర్ దర్జాగా నిలిచివుండడాని కారణమిదేనని వారు వెల్లడించారు. కాగా, మరో 200 ఏళ్లపాటు పీసా టవర్ చెక్కు చెదరకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పీసా అంటేనే ప్రత్యేకం.. ఇప్పుడు అద్వితీయం..!! -
భూకంప జోన్లో రాజధాని!
సర్వత్రా చర్చనీయాంశం భూకంప ప్రాంతాల వర్గీకరణలో మూడో జోన్లో గుంటూరు, కృష్ణా జిల్లాలు భవిష్యత్తులో ప్రమాదాలకు ఆస్కారమంటున్న నిపుణులు ఇదే విషయాన్ని తేల్చిచెప్పిన శివరామకృష్ణన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: నేపాల్ కేంద్రంగా శనివారం సంభవించిన పెను భూకంపం తాలూకా ప్రకంపనలు దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నూతన రాజధాని ప్రాంతంలోనూ రావడం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. దీనికి ప్రధాన కారణం ఏపీ కొత్త రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రాంతం భూకంప జోన్లో ఉండడమే. అదేవిధంగా ఈ ప్రాంతంలోని భూమి పూర్తిగా నల్ల రేగడి నేల కావడం, వదులుగా ఉండటం. దీంతో ఈ ప్రాంతంలో చేపట్టబోయే నిర్మాణాలు భూకంపాలను తట్టుకోగలిగే నైపుణ్యంతో నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పైగా రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతమంతా కృష్ణానది పరివాహక ప్రాంతం కావడం వల్ల కూడా నిర్మాణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతం వరదలు సంభవించే ప్రాంతమే కాకుండా శ్రీశైలం, నాగార్జున్ సాగర్, పులిచింతల ప్రాజెక్టుల కింద భాగంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఓ అధికారిపేర్కొన్నారు. దేన్నైనా తట్టుకునే నిర్మాణాలు అవసరం భూకంపాన్ని ముందస్తుగా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదని, భూకంప జోన్లను గుర్తించినప్పటికీ అక్కడ ఎప్పుడు భూమి కంపిస్తుందో తెలుసుకునే పరిజ్ఞానం కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లోను అమెరికాలోని సాన్ఫ్రాన్సిస్కోలోను భూకంపాలను తట్టుకునే టెక్నాలజీతో నిర్మాణాలను చేపట్టారని ఒక అధికారి తెలిపారు. సహజ సంపద తోడేయడం కూడా పెద్ద ఎత్తున చమురు, సహజవాయువుల్ని వెలికితీయడం వల్ల భూమి లోపలి పొరల్లో ఖాళీ ఏర్పడి భూకంపాలకు దారితీస్తోందని కృష్ణా, గోదావరి జిల్లాల్లో పలు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన ఆంధ్రా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, భూగర్భ శాస్త్ర నిపుణుడు జీవీ కృష్ణారావు ‘సాక్షి’కి చెప్పారు. కొన్ని దేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ వెలికితీసిన తర్వాత అదే మోతాదులో ఇసుక, నీటిని భూమిలోకి నింపి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. అందుకే వద్దంది! రాజధాని ప్రాంతమైన అమరావతి, ఉండవల్లిలో శనివారం కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆ ప్రాంతంపైనే పడింది. రాజధాని నిర్మాణంపై గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో కూడా ఈ ప్రాంతం భూకంప జోన్లో ఉన్నట్టు ఎన్జీఆర్ఐ నివేదికలను ఉటంకిస్తూ చెప్పారు. 2000 సంవత్సరం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూకంపంలో రెండు, మూడో జోన్లలో ఉంది. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలు మూడో జోన్లో ఉండగా అనంతపురం రెండో జోన్‌గా ఉంది. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతంతో పాటు గోదావరి, కృష్ణా డెల్టాలు మూడో జోన్లో ఉన్నాయి. హైదరాబాద్ సిటీ రెండో జోన్లో ఉంది. అలాగే కష్ణా-గోదావరి బేసిన్లో చమురు, సహజవాయు నిక్షేపాలను ఏళ్ల తరబడి తోడేయడంతో భూమి కుంగిపోయే ప్రమాదం ఉందని అనేకమార్లు భూగర్భ శాస్త్ర నిపుణులు హెచ్చరించారు. అది ప్రభావిత ప్రాంతమే ‘భూకంప ప్రాంతాల వర్గీకరణ ప్రకారం.. ఏపీ కొత్త రాజధాని ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాలు మూడో జోన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6గా నమోదయ్యే అవకాశముంది. అంటే ప్రభావం తీవ్రం. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలంటే తొలుత జియో టెక్నికల్ స్టడీ చేయాలి. భూగర్భం వదులుగా ఉన్నట్టు తేలితే భవంతుల నిర్మాణానికి ఆధునిక పరిజ్ఞానం వినియోగించాలి.’ - ఆర్కే చద్దా, ఎన్జీఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త