exhibition
-
విజయవాడ జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)
-
బంజారాహిల్స్ : ఆసియా జ్యువెలరీ ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
Numaish: ఈ నెల 17 వరకూ నుమాయిష్
అబిడ్స్: నుమాయిష్‌ను రెండు రోజుల పాటు పొడిగిస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ తీర్మానం చేసింది. జనవరి 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఈ నెల 15న ముగియాల్సి ఉంది. ఈ ఏడాది రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిబిషన్ ప్రారంభమైనందున మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 15న ముగిసే ఎగ్జిబిషన్ ఈసారి 17న ముగియనుంది. -
హైదరాబాద్‌లో కిసాన్ అగ్రి షో
హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. కిసాన్ అగ్రి షో 2025 (KISAN Agri Show 2025) నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. కిసాన్ అగ్రి షో-2025 మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుండి 9 వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన సిద్ధంగా ఉంది.మూడు రోజుల పాటు ఈ భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. 150 పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లో కిసాన్ అగ్రి షో వ్యవసాయ ప్రదర్శన మొదటి రెండు ఎడిషన్లు విజయవంతమైన నేపథ్యంలో మూడవ ఎడిషన్‌కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.ఈ ఎగ్జిబిషన్‌నలో వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఇతర విభాగాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా రైతులకు అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన విధానాలు, పథకాలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనకారులు తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి కిసాన్ అగ్రి షో విలక్షణ వేదికగా నిలవనుంది. వ్యవసాయ రంగంలో విజ్ఞాన మార్పిడికి కేంద్రం కానుంది. -
హైదరాబాద్ : హైటెక్స్‌లో ముగిసిన పెటెక్స్ ఎక్స్పో (ఫొటోలు)
-
2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌ను... ఎత్తుకెళ్లారు
ఎస్సెన్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్‌లో దొంగలు ఏకంగా వేల ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌పైనే కన్నేశారు. ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను బాంబులతో బద్ధలుకొట్టి మరీ దోచుకెళ్లిపోయారు. అది ఏకంగా 2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్! దాంతో ఈ దొంగతనం సంచలనం సృష్టించింది. ప్రాచీన వస్తు ప్రదర్శన కోసం తమ దేశం నుంచి నెదర్లాండ్స్ పట్టుకుపోయిన అత్యంత విలువైన వస్తువులు చోరశిఖామణుల పాలబడటంతో రొమేనియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. నెదర్లాండ్స్‌లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తుప్రదర్శనశాలలో ఈ భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకొచ్చి బయటివైపు ఉన్న భారీ తలుపును రంధ్రాలు పెట్టే మెషీన్, ఇనుప రాడ్లతో ఎలాగోలా తెరిచారు. అక్కడే లోపలివైపు ఇంకో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్టంగా ఉన్న దీనిని మామూలుగా తెరవడం సాధ్యంకాదని దొంగలకు తెలుసో ఏమో, ముందుజాగ్రత్తగా పెద్ద బాంబును వెంట తెచ్చుకున్నారు. తలుపుకు బాంబు అమర్చి పేల్చేశారు. తునాతునకలైన ద్వారం గుండా ఎంచక్కా లోపలికి వెళ్లి అక్కడ అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువులను తీసుకుని ఉడాయించారు. వెలకట్టలేని హెల్మెట్ చోరీకి గురైన వాటిల్లో 2,500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉంది. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్‌ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. ‘హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీ’గా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారు. హెల్మెట్ ముందుభాగంలో పెద్ద కళ్లను చెక్కారు. దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు. జంతు వధ చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనుకవైపు చెక్కారు. రొమేనియా సంస్కృతి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తంచేసింది. దీంతోపాటు డేసియన్ల రాజ్యానికి చెందిన అలనాటి రాయల్ బ్రేస్లెట్సహా మూడు వస్తువులనూ దొంగలు పట్టుకెళ్లిపోయారు. రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజ్యమేలిన డేసియన్ల సంస్కృతిని కళ్లకుకట్టేందుకు ఆనాటి వస్తువులను ఒక దగ్గరకు చేర్చి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. గత ఏడాది జూలై నుంచి ఈ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన హెల్మెట్‌ను సైతం రొమేనియా నుంచి తెప్పించిమరీ ప్రదర్శనకు ఉంచగా అది కాస్తా ఇప్పుడు దొంగలపరమైంది.చోరుల కోసం వేట మొదలు మళ్లీ అప్పజెప్తామని చెప్పి బుకారెస్ట్ నగరంలోని ‘నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా’ నుంచి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు పోవడంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం క్రితం చోరీకి గురైన ఒక కారు ఈ మ్యూజియం దగ్గర కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి ఈ రెండు చోరీలకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టుకొచ్చిన కారులో ఇక్కడికొచ్చిన దొంగలు ఆ తర్వాత పారిపోతూ నాలుగు మైళ్ల దూరంలో కారును వదిలేసి తగలబెట్టిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కొట్టేసిన కారుకు నకిలీ నంబర్ ప్లేట ఉండటం చూస్తుంటే ఇదేదో ఆరితేరిన దొంగలముఠా పనిగా అనుమానిస్తున్నారు. ‘‘ మా మ్యూజియం 170 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి చోరీ ఘటన చూడలేదు. నిజంగా ఇది దురదృష్టకరం’’ అని ఎస్సెన్లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ అన్నారు. -
Numaish 2025: రెక్కలు తొడిగిన ఆశలు
వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు.. చంటి పిల్లలకు ఎలా అయితే అన్నీ చూడాలని ఆశ ఉంటుందో వయస్సు పెద్దపడిన వారికి కూడా ప్రతిదానిపై ఆసక్తి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నగరానికి చెందిన దోబారా అనే ఎన్జీవో.. వారి కోసం అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని అపోలో హోంకేర్, గ్లెన్‌ఫీల్డ్ మల్లారెడ్డి తదితర ప్రైవేటు ఆస్పత్రులు, స్కూల్స్‌ను భాగం చేస్తూ నిరుపేద వృద్ధుల కోసం ప్రత్యేక నుమాయిష్ సందర్శనను ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సై అన్నారు. అయితే రోజువారీ వేళల్లో అయితే పెద్ద వయసు వారికి రద్దీలో, జనం మధ్యన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా 2గంటల నుంచీ సాయంత్రం రద్దీ మొదలయ్యే లోగా దీనిని పూర్తి అయేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అనాధాశ్రమాల నుంచి.. నగరవ్యాప్తంగా 89 మంది వీల్‌చైర్స్ ఉప్పల్, చిక్కడపల్లి.. ఇలా నగరంలోని 12 ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటీజన్ అసోసియేషన్లకు చెందిన సభ్యులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. పెద్దలు అందరినీ కార్లలో గౌరవంగా తోడ్కొని వచ్చారు. అక్కడ నుంచి నడవలేని వారి కోసం దాదాపుగా 80కిపైగా వీల్ఛైర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా నర్సింగ్ స్కూల్స్‌కు సంబంధించిన విద్యార్థులను కూడా ఉంచారు. వీరి కోసం ప్రత్యేకంగా ఉచిత ట్రైన్ రైడ్స్‌ను నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల కోసం ఉచిత పార్కింగ్‌ను కూడా కలి్పంచారు. ఫుడ్ ప్యాక్స్.. పిస్తా హౌజ్, షాజ్ మహమ్మూద్ అనే వాలంటీర్ల సహకారంతో ఫుడ్ ప్యాక్స్ అందించారు. అలాగే కొందరు దాతలు ఇచి్చన సహకారంతో వృద్ధులకు ఉపయోగపడే టవల్స్ వంటివి కొనుగోలు చేసి అందించారు.పెద్దలకు ప్రత్యేకంగా.. ఏడాదికో సారి నుమాయిష్ లాంటి ప్రదర్శనను తిలకించాలని అందరూ అనుకున్నట్టే సీనియర్ సిటిజన్స్ కూడా ఆశిస్తారు. అయితే ఆశించినట్టుగా చాలా మందికి జరగకపోవచ్చు. కొందరికైనా దీన్ని సాకారం చేద్దామనే ఆలోచనతో ఈ ‘సీనియర్ సిటిజన్స్ ఎట్ నుమాయిషి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక సీనియర్ సిటిజన్‌గా పెద్దలకు సంబంధించిన జెరంటాలజీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ చేసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ల మనసుకు ఎంత సంతోషాన్ని అందిస్తాయనేది నాకు తెలుసు. – మతీన్ అన్సారీ, వ్యవస్థాపకులు, దోబారా స్వచ్ఛంద సంస్థ -
నుమాయిష్.. సోషల్ జోష్..
కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. సాధారణంగా నగరంలో కొత్తగా ప్రారంభించిన కేఫ్ అయినా లేదా ఏదైనా ఆసక్తికరమైన ఈవెంట్ అయినా, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో తక్షణమే ప్రత్యక్షమవుతుంది. అయితే వందల సంఖ్యలో వెరైటీ ఉత్పత్తులు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్టాల్స్.. ఉండే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సోషల్ జోష్ నింపుతోంది.. దీంతో వీరికి చేతినిండా పని పెడుతోంది. ఈ క్రమంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. హైదరాబాద్‌లోని నాంపల్లి మైదాన ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిన దుకాణాలతో, సందర్శకులతో కిటకిటలాడుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఐకానిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18, 2025 వరకూ సందర్శకులను అలరించనుంది. మరోవైపు ఈ 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ ఈసారి సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారం అవుతోంది. విభిన్న రకాల కంటెంట్స్ చేసేందుకు వీలుండడంతో ఇది క్రియేటర్లకు గమ్యస్థానంగా మారింది. స్థానికులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఇష్టమైన హైదరాబాద్ ఐకానిక్ వార్షిక ఫెయిర్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల ప్రవాహానికి నిలయంగా మారింది.రోజుకొకటి.. అదే వెరైటీ.. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్.. ఒక్కో రోజును ఎగ్జిబిషన్‌లోని ఒక్కో విభాగాలకు అంకితం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక రోజు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ గురించి, మరొక రోజు సంప్రదాయ చేనేత స్టాల్స్ గురించి.. తర్వాతి రోజు రైడ్లు.. ఎంటర్టైన్మెంట్ జోన్లను ఇలా విభజిìæంచి చూపిస్తున్నారు. ఈ సమాచారం వీక్షకులకు వినోదాన్ని మాత్రమే కాకుండా నుమాయిష్ సందర్శనను ప్లాన్ చేయడంలో కూడా ఉపకరిస్తోంది. వీరి కంటెంట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగానూ అనేక మందిని ప్రభావితం చేస్తోంది. రీల్స్ కేరాఫ్‌గా.. ఆహార ప్రియుల సాహసాల నుంచి షాపింగ్ స్ప్రీల వరకూ.. ఫీడ్‌లో స్క్రోల్ చేయడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో నుమాయిష్ షాపింగ్, ఆహార ఉత్పత్తులను మాత్రమే కాకుండా సృజనాత్మక సోషల్ మీడియా కంటెంట్‌ను కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని శరవేగంగా వ్యాపిస్తుండడంతో నుమాయిష్ రీల్స్, వీడియోలకు కేరాఫ్‌గా మారింది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా నిర్వాహకులతో ఎగ్జిబిషన్ సందడిగా మారుతోంది.అడుగడుగునా కెమెరాలు.. నుమాయి‹Ùలోని కలర్‌ఫుల్ స్ట్రీట్స్ మీదుగా నడుస్తుంటే.. సందడిగా ఉన్న స్టాల్స్‌కు ముందు పలు కెమెరాలను అమర్చడాన్ని గమనించవచ్చు. ఇన్‌స్టా, లేదా యూట్యూబ్ ద్వారా ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్‌లోని ప్రతి మూలనూ కవర్ చేస్తూ ప్రతిరోజూ వందల సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. లక్నో చికన్ కారీ స్టాల్స్ నుంచి కాశ్మీరీ షాపుల వరకూ నోరూరించే ఫుడ్ కోర్ట్ నుంచి వినోద ప్రదేశంలో థ్రిల్లింగ్ రైడ్ల వరకూ దేనికదే వెరైటీగా కినిపిస్తోంది. దీంతో మెటీరియల్‌కు కొరత లేకపోవడం వీరికి మరింత ఉత్తేజాన్ని అందిస్తోంది.క్రేజీగా..మెన్ ఎట్ నుమాయిష్?.. ఈ సంవత్సరం ‘మెన్ ఎట్ నుమాయిష్’ పేరుతో ఓ రీల్ ఇంటర్నెట్లో క్రేజీగా మారింది. మగవాళ్లు తమ కుటుంబాలతో కలిసి షాపింగ్ ట్రిప్‌లలో చురుకుగా పాల్గొంటున్నట్లు చూపే ఈ రీల్ వేగంగా వైరల్ అయ్యింది. ఈ రీల్‌కి ఇన్‌స్టాలో ఒక్క రోజులో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 75,000 పైగా లైక్‌లు రావడం విశేషం. షాపింగ్ బ్యాగ్‌లను మోసుకుంటూ భార్యల్ని అనుసరించే భర్తలు, పిల్లలను ఎత్తుకుని ఆడిస్తుంటే మహిళలు షాపింగ్‌లో మునిగిపోవడం.. రీల్‌ని సూపర్ హిట్ చేశాయి. -
బెంగళూరులో 23 నుండి ఐఎంటీఈఎక్స్ 2025
న్యూఢిల్లీ: మెషిన్ టూల్ పరిశ్రమకు సంబంధించి జనవరి 23 నుండి 29 వరకు బెంగళూరులో ఐఎంటీఈఎక్స్ 2025 ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్ తదితర 23 దేశాల నుండి 1,100కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గోనున్నారు. సుమారు 90,000 చ.మీ. విస్తీర్ణంలో నిర్వహించే ఎగ్జిబిషన్లో టూల్‌టెక్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ మొదలైన కార్యక్రమాల్లో భారత తయారీ సాంకేతికత సామర్థ్యాలను ప్రతిబింబించే పలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మెషిన్ టూల్ రంగ సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్ రాజేంద్ర ఎస్ రాజమాణె తెలిపారు. -
నుమాయిష్ ఎగ్జిబిషన్లో జోరుగా లేడీస్ డే వేడుకలు (ఫొటోలు)
-
నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు..పోటెత్తిన సందర్శకులు (ఫొటోలు)
-
Hyderabad: జనవరి 3 నుంచి నుమాయిష్..
అబిడ్స్: జనవరి 3 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రవేశ రుసుమును ఈసారి రూ.40 నుంచి రూ.50కి పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2 వేల స్టాళ్లతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ను ఈ ఏడాది రెండు రోజులు వాయిదా వేశామని, 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి ఆర్. సురేందర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రభా శంకర్, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, పబ్లిసిటీ కనీ్వనర్లు సురేష్‌కుమార్, సురేష్రాజ్లు మాట్లాడారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్‌ను మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లో డబుల్ డెక్కర్ బస్సును మిని ట్రైన్‌తో పాటు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలు, 250 మంది వలంటీర్లు, ప్రైవేటు సెక్యూరిటీతో బందోబస్తు పర్యవేక్షిస్తామన్నారు. గోల్డెన్‌జూబ్లీ బ్లాక్ ఎదురుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు, ఇతరులు ఎవరైనా శుభ కార్యక్రమాలు, ఇతర ప్రకటనలు ఇవ్వవచ్చన్నారు. ప్రతి రోజు మధాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంట్టుందన్నారు. మినీ ట్రైన్ టికెట్ రూ.30, డబుల్ డెక్కర్ టికెట్ రూ.40గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్, వైఫై టవర్.. మొదటిసారిగా పలు శాఖల అధికారుల కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సెల్ఫోన్ల నెట్వర్క్ సమస్య వస్తుండడంతో మొదటి సారిగా వైఫై టవర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నుమాయిష్‌లో సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను సమకూరుస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీన లేడీస్ డే గా, జనవరి 31వ తేదీని చి్రల్డన్స్ డేగా ప్రకటించినట్లు తెలిపారు. గత సంవత్సరం యశోధ ఆసుపత్రి సహకారంతో ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. గత ఏడాది నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో రూ.66 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు వారు వివరించారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఎగ్జిబిషన్ ప్రతినిధులు డాక్టర్ గంగాధర్, హన్మంతరావు, అశ్వినిమార్గం, జీవీ రంగారెడ్డి, ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు. -
మాదాపూర్ : ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
విజయవాడ : హై లైఫ్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
భారీస్థాయిలో సిద్ధేశ్వర అగ్రికల్చరల్ షో, క్యాట్ అండ్ డాగ్ షో కూడా
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్‌కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.క్యాట్, డాగ్ షో అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారుప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు.. 300 కు పైగా కంపెనీల హాజరు ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన. భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్ రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన -
హైదరాబాద్ : జ్యూయల్స్ ఎక్స్పో నగరంలో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మెరిసిన సీరత్ కపూర్, సాన్వే మేఘనా (ఫొటోలు)
-
హైదరాబాద్ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం
భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు. చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం) -
ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన నటి దివి, దీక్షా పంత్ (ఫొటోలు)
-
1500 కళాకారులు.. 350 ఎగ్జిబిట్స్, 100 స్పీకర్స్, 12 దేశాలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లోక్ మంథన్’ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సుమారు 2 వేల మందికి పైగా జానపద కళాకారులు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రీ లోక్ మంథన్ పేరిట అవగాహన సదస్సులను, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని, విదేశీయుల దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజలకంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని, ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిర్లక్ష్యానికి గురైందని లోక్ మంథన్ నిర్వాహకులు భావిస్తారు. అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే లక్ష్యంతోనే ‘లోక్ మంథన్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జానపదుల విశ్వాసాలు, జీవన విధానం, దృక్పథం, వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే లోక్‌మంథన్ ఉద్దేశం. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఈ లోక్‌మంథన్ వేడుకలు ఇప్పటి వరకు రాంచీ, భోపాల్, గువాహటి, తదితర నగరాల్లో ఘనంగా జరిగాయి. భాగ్యనగరం వేదికగా.. ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే లోక్‌మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దిబియా తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు.చదవండి: ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టునగరీకరణ కారణంగా అస్తిత్వాన్ని మరిచిపోతున్న నేటి తరానికి భారతీయ సామాజిక జీవిత మూలాలను తెలియజేసే ప్రయత్నమే లోక్ మంథన్. మన వ్యవస్థలో మొదటి నుంచి అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రముఖ స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ సంస్కృతి మరుగునపడింది. దీంతో అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియజేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ లోక్‌మంథన్‌కు దేశ విదేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు, మేధావులు, పరిశోధకులు హాజరుకానున్నారు.మనది అడవి బిడ్డల సంస్కృతి నగర ప్రజలు కెరీర్ వైపు, ఆధునికత వైపు విస్తారంగా పరుగులు తీస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమూహానికి.. మన సమాజం మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే లోకమంథన్. మన భారతీయల వ్యవస్థలో మొదటి నుంచీ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. అందుచేత అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు దేశంలోని వివిధ నగరాలలో లోక మంథన్ నిర్వహిస్తున్నాం. – నందకుమార్, ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్ -
కళింగలో పట్టు ప్రదర్శన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కళింగ కల్చరల్ హాలు వేదికగా ప్రతిష్టాత్మక ‘జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన’ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శణను రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ ఫౌండర్, ఆక్యుపేషనల్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళింగ కల్చరల్ హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూ్యమ్స్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సాతి్వక గుప్తా అన్నారు. ఈ సందర్భంగా చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి 75 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. -
హైదరాబాద్‌లో ‘డిజైన్ డెమోక్రసీ’ ప్రారంభం
హైదరాబాద్: ఎంతగానో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2024’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శన అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫీక్కీ ఫ్లో మాజీ చైర్పర్సన్ పింకీ రెడ్డి, డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ ప్రారంభించారు.తెలంగాణ మ్యూజియం బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి, క్యూరేటర్ సుప్రజా రావుతో కలిసి డిజైన్ డెమెక్రసీ వ్యవస్థపాకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ, అర్జున్ రాఠీ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ అసాధారణ సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది. -
ఆధునికత, హస్తకళా నైపుణ్యం మేళవింపుతో గౌరాంగ్ హోం ‘నీల్’ కలెక్షన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి."గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.'నీల్' కలెక్షన్లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్‌లో ఫర్నిషింగ్స్, బెడ్‌స్ప్రెడ్‌లు, కంఫర్టర్లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. ఇందులో జమ్దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్లో ఆకట్టుకుంటాయి.అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్‌తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది. -
హైలైఫ్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన నటి సీరత్ కపూర్, మోడల్స్..(ఫొటోలు)
-
హెచ్ఐసిసి లో జరిగిన హైలైఫ్ ఎగ్జిబిషన్ లో ముద్దుగుమ్మల సందడి (ఫొటోలు)