fishermans
-
ఐదేళ్ళ లో అంచెలంచెలుగా ఎదిగిన మత్స్యకారులు
-
చేపల వేటలో నాగచైతన్య .. ఎందుకో తెలుసా?
మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకునే పని మీద నాగచైతన్య శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లిన విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసమే టీమ్ కసరత్తులు చేస్తోంది. గురువారం శ్రీకాకుళంలోని మత్స్యకారులను స్వయంగా కలిసి, వారి సంస్కృతి, జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు చైతన్య, చందు, ‘బన్నీ’ వాసు. శుక్రవారం వైజాగ్ పోర్టును సందర్శించారు. మత్స్యకారులతో కలసి చేపల వేటకు వెళ్లారు. సముద్ర ప్రయాణం, వేట, అక్కడ ఎదురయ్యే పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. -
సీఎం జగన్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు : సీదిరి అప్పలరాజు
-
Uppada: మత్స్యకారుల వలకు ‘బాహుబలి’
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): బంగాళాఖాతం సముద్ర జలాల్లో తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు బాహుబలి చేప చిక్కింది. కంబాల టేకుగా పిలిచే ఈ చేప సుమారు 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల మేర వెడల్పు ఉంది. బరువు సుమారు 300 కేజీలు. దీనిని అతి కష్టంపై బోటు నుంచి క్రేన్‌తో ఆటో పైకి ఎక్కించి, కాకినాడకు తరలించారు. అర డజను మంది మత్స్యకారులు తాళ్ల సాయంతో కిందకు దింపి విక్రయించగా వెంకన్న అనే వ్యాపారి రూ.16,500కు కొనుగోలు చేశాడు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు -
చెరువులో విషప్రయోగం.. లక్షల్లో చేపలు మృత్యువాత
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని వెల్ది బుడమాయి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. దీంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ముదిరాజ్ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ చెరువులో ముదిరాజ్ కులస్తులు చేపలు పడుతూ జీవనం సాగిస్తుండగా, శుక్రవారం ఉదయాన్నే వందలాదిగా చేపలు చనిపోయి ఒడ్డుకు వస్తుండడాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కుల పెద్ద ఆళ్ల కొమురయ్య మాట్లాడుతూ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెరువు చైర్మన్ ఆళ్ల గట్టయ్యతో పాటు కావాటి దానయ్య, కావాటి నాగరాజు, రాజు, లింగరాజు, బోయిని కృష్ణ పాల్గొన్నారు. -
వలేసి పట్టేద్దాం!
మానికొండ గణేశ్, సాక్షి, అమరావతి: పది గ్రాముల పిత్తపరిగి మొదలు 25 కేజీల ట్యూనా చేపలను వేటాడేందుకు, ఉప్పాడ వంటి మారుమూల గ్రామం నుంచి ఉత్తర అమెరికా వరకు సముద్ర మత్స్య సంపద ఎగుమతికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడి సముద్ర జలాల సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు చిక్కి బాధలు పడిన మత్స్యకారుల పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీటిని నిర్మించనుంది. హార్బర్ల ద్వారా ఇకపై కోస్తా తీరాన్ని సంపదలకు నెలవుగా, ఉపాధి అవకాశాలు కల్పించే కల్పతరువుగా రూపు మార్చనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణం కానున్నాయి. ► దాదాపు రూ.2,639 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయనుంది. వీటిలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాలకు నాబార్డు రూ.450 కోట్లను ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద (ఎఫ్ఐడిఎఫ్) రుణం ఇవ్వనుంది. ► ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, నాబార్డుకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, మచిలీపట్నం, నిజాంపట్నాల్లోని ఫిషింగ్ హార్బర్ల రెండో దశ నిర్మాణాలకు, ఉప్పాడ ఫిషింగ్ హార్బరు నిర్మాణాలకు రూ.1,015.219 కోట్లతో అంచనాలు తయారు చేసింది. ఇందులో నిజాంపట్నం హార్బరు నిర్మాణానికి రూ.379.17 కోట్లు, మచిలీపట్నం హార్బరు నిర్మాణానికి రూ.285.609 కోట్లు, ఉప్పాడ నిర్మాణానికి రూ.350.440 కోట్లు అవసరవవుతాయని అంచనా. ► వీటిల్లో ఒక్కోదానికి ఎఫ్ఐడీఎఫ్ కింద లభించే రూ.150 కోట్ల రుణం పోను మిగిలిన ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం 90% నిధులను ఎన్ఐడీఐ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) రుణం ద్వారా సమకూర్చనుంది. మిగిలిన 10% నిధులను రాష్ట్రం ఖర్చు చేయనుంది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ రూ.288.80 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ ► నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బరు నిర్మాణానికి రూ.288.80 కోట్లతో అంచనాలు తయారు చేయగా, సాగరమాలలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్, బీఆర్) కింద కేంద్రం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించనున్నాయి. ► మొదటి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.18 కోట్లు విడుదల చేశాయి. ఇటీవల అప్పటి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి, ఆ జిల్లా శాసన సభ్యులు రేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. ► శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం హార్బరుకు రూ.332.09 కోట్లు, విశాఖ జిల్లా పూడిమడక హార్బరుకు రూ.353.10 కోట్లు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం హార్బరుకు రూ.325.16 కోట్లతో అంచనాలు తయారయ్యాయి. ► ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకం కింద ఒక్కో హార్బరుకు రూ.120 కోట్ల రుణం విడుదల కావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప హార్బరు నిర్మాణానికి అవసరమైన నివేదికను బెంగళూరుకు చెందిన సీఐసీఈఎఫ్ (సైసెఫ్) ఇవ్వాల్సింది. ► మొదట్లో దీనిని ఫిష్ ల్యాండింగ్ సెంటరుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, హార్బరుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.300 కోట్లతో అంచనాలు రూపొందించారు. హార్బర్ల నిర్మాణాలతో ఎన్నో ప్రయోజనాలు ► కొత్తగా నిర్మించనున్న హార్బర్ల వల్ల అదనంగా 11,280 ఫిషింగ్ బోట్లకు లంగరు వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా ట్యునా చేపలు శుభ్రం చేయడానికి, నిల్వ చేయడానికి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ► వీటి ద్వారా 76,230 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే ఐస్ప్లాంట్లు, ప్రీప్రాసెసింగ్ సెంటర్లు, చేపల రవాణా, మార్కెటింగ్ ఇతర అనుబంధ సంస్థల్లో పనులు చేయడానికి మత్స్యకారులకు అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హార్బర్లలోని పనుల నిర్వహణకు మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా వినియోగ రుసుములను వసూలు చేసి హార్బర్ల నిర్వహణ ప్రభుత్వానికి భారం కాకుండా చూస్తాయి. ► రొయ్యలు, చేపలకు మంచి రేటు వచ్చే వరకు హార్బరులోనే నిర్మించే కోల్డు స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల మత్స్యకారులు, మర పడవల నిర్వాహకులకు లబ్ధి చేకూరడమే కాకుండా విదేశీ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. ► సాలీనా 4.22 లక్షల టన్నుల చేపలు, రొయ్యల పట్టుబడి అదనంగా జరుగుతుంది. ► తుపానులు, ప్రకృతి వైపరీత్య సమయాల్లో మర పడవలు సురక్షితంగా హార్బర్లలో లంగరు వేసుకునే సౌకర్యం లభిస్తుంది. ► వేట విరామ సమయాల్లో మత్స్య కార్మికులు హార్బరులో నిర్మించే భవనాల్లో వలలు, ఇతర పరికరాల మరమ్మతులు చేసుకునే సౌకర్యం ఏర్పడుతుంది. మొగ వద్ద ఇసుక మేటలతో ఇక్కట్లు మొగ (సముద్ర ముఖ ద్వారం) దగ్గర ఇసుక మేటలు వేస్తోంది. సముద్ర అలల వేగం వల్ల మా ఊళ్లో అనేక బోట్లు దెబ్బ తిన్నాయి. వాటిని బాగు చేయించుకోవాలంటే ఓనర్లు లక్షలు పోయాల్సిందే. ఇక్కడి హార్బర్ నుంచి మొగ దగ్గరకు వెళ్లే కాల్వ లోతు పెంచక పోవడం వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇందువల్లే చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు పోతున్నాం. ఇన్నాళ్లూ మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ మా సమస్యపై దృష్టి పెట్టారు. మొగ వద్ద ఇసుక మేటలు తొలగించాకే మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. – మల్లికార్జునరావు, గిలకలదిండి, కృష్ణా జిల్లా బోట్లు పెరుగుతుంటే లంగరుకు చోటేదీ? హార్బరులో బోట్లు పెరుగుతున్నాయి. మంచి సీజనులో గిలకలదిండి, నరసాపురం నుంచి బోట్లు వస్తాయి. అప్పుడు ఒడ్డుకు ఎవరు ముందు వస్తే వాళ్లు జట్టీలకు బోట్లు కట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా తీరానికి దగ్గరలోని చెట్లకు తాళ్లతో కట్టుకుంటున్నారు. భారీ వర్షాలు, గాలులు వచ్చినప్పుడు చెట్లకు కట్టిన తాళ్లు తెగి బోట్లు గల్లంతవుతుంటాయి. అలలకు కొట్టుకుపోతాయి. కొన్నిసార్లు వలలు, ఇంజన్లను దొంగలెత్తుకెళ్తారు. వాటిని కొనుక్కుని వేటకు వెళ్లాలంటే నెల పడుతుంది. ఈ సమస్యలన్నీ తీరాలంటే జట్టీల సంఖ్య పెంచాలి. – ఆర్.రాము, నిజాంపట్నం, గుంటూరు జిల్లా విస్తారమైన అవకాశాలు హార్బర్ల ద్వారా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విస్తారమైన అవకాశాలున్నాయి. పెద్ద పెద్ద బోట్ల ద్వారా సముద్రలోతుల్లో మత్స్య సంపదను పట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాలు లేక రాష్ట్రంలోని పెద్ద పడవల నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఈ పడవలకు హార్బర్లలో అన్ని సౌకర్యాలు సమకూర్చితే రాష్ట్ర ప్రభుత్వానికి సముద్ర సంపద ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. పోషక విలువలు కలిగిన సముద్ర జాతి వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. – కన్నబాబు, ఫిషరీస్ కమిషనర్ ఫిషింగ్ హార్బర్లు ► పెద్ద పెద్ద పడవలు మత్స్య సంపదను సముద్ర ఒడ్డుకు తేవడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. సముద్రపు ఒడ్డున లోతు ఎక్కువగా ఉండేలా వీటిని నిర్మించడం వల్ల మత్స్యకారులకు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎగుమతులకు వీలుంటుంది. ► జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్త పట్నం, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ► వేటాడి తెచ్చిన చేపలను అన్లోడ్ చేయడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. విక్రయాలకూ అవకాశం ఉంటుంది. ► మంచినీళ్లపేట, బీమిలీ, నక్కపల్లి, చింత పల్లిలో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచి నీళ్లపేటలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.11.95 కోట్లు కేటాయించింది. పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థను కూడా ఖరారు చేసింది. మాకు కష్టాలు తప్పుతాయి.. మా జువ్వలదిన్నెలో చేపలరేవు కడతామని చంద్రబాబు అనేకసార్లు చెప్పాడు. మాట నిలుపుకోలేదు. సీఎం జగన్ మా జిల్లాకు వచ్చినప్పుడు మా రేవు నిర్మాణం గురించి హామీ ఇచ్చారు. మొన్నీమధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మా ఊరొచ్చి రేవు కట్టడానికి అనువైన ప్రాంతాన్ని చూశారు. వెంటనే రేవు కడతారంట. నిధులు కూడా వచ్చేశాయని మా ఓనర్లు చెబుతున్నారు. ఇక్కడ రేవు కడితే మద్రాసు, గుజరాత్ వెళ్లక్కర్లేదు. బాధలు తప్పుతాయి. ఇక్కడి నుంచే చేపల వేటకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. – కొమరిరాజు, తుమ్మలపెంట, కావలి మండలం, నెల్లూరు జిల్లా -
ఆశల వేటకు గంగపుత్రులు సిద్ధం..
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఆశల వేటకు అంతా సిద్ధమైంది. సుమారు 61 రోజుల తర్వాత సముద్రాన్ని మదించేందుకు గంగపుత్రులు సిద్ధమవుతున్నారు. బోట్లను తీర్చిదిద్దుతూ, వలలను అల్లుకుంటూ, ఇంధనాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. వేట నిషేధ కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకారులు ఇక ఆ కష్టాలను మరిచిపోయి తమ బతుకు వేటవైపు సాగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నెల 1న వేటకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ నెల 2న అర్ధరాత్రి నుంచి వేటకు బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సందడిగా ఫిషింగ్ హార్బర్ తూర్పు తీరంలో ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోయిన చేపల వేట తిరిగి ఈ నెల 2న మొదలు కానుంది. చేపల వేట నిషేధం నేపథ్యంలో జిల్లాలో సుమారు ఆరు వేల బోట్లు తీరంలో నిలిచిపోయాయి. వేటకు బయలుదేరే సమయం ఆసన్నం కావడంతో ఫిషింగ్ హార్బర్లోని బోట్ల యజమానులు తమ బోట్లకు దాదాపు మరమ్మతులు పూర్తి చేసుకుని, ఇంధనం, ఇతర సామగ్రి సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. చేపల రేవు కేంద్రంగా నిత్యం 678 పడవలు, 2,996 మరపడవలు, సంప్రదాయ పడవలు 742, (జిల్లా వ్యాప్తంగా మొత్తం మరపడవలు 4,416) 1100 తెప్పలు నిత్యం చేపలు, రొయ్యల వేట సాగిస్తుంటాయి. తొలి రోజు 150 వరకూ బోట్లు వేటకు వెళ్లే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. బోట్లలో పనిచేసే కుర్రాళ్లు సైతం ఎప్పుడెప్పుడు వేటకు వెళ్తామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చేపల వేట విరామ సమయంలో కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకార కార్మికులు తిరిగి నగరానికి చేరుకున్నారు. వేట కొనసాగుతుందన్న ఉత్సాహం వారి కళ్లలో కనిపిస్తుంది. ఒక బోటు వేటకు వెళ్లేందుకు చేసే ఖర్చు... ►20 రోజులపాటు వేట సాగించే బోటుకు 4 వేల లీటర్లు ఇంధనం అవసరమవుతుంది. సుమారు రూ.3 లక్షలు. ►వలలు సుమారు రూ.30 వేలు. ►బీమా చెల్లింపులు సుమారు రూ.60వేలు. ►ఆహార సామగ్రి రూ.10 నుంచి రూ.15వేలు. ►సుమారు 15 టన్నుల ఐస్ రూ.22 వేలు. ►ఇతర సామగ్రి ఖర్చులు సుమారు 30 వేలు. ►మొత్తంగా యజమానులు ఒక్కో బోటుపై సుమారు రూ.4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజు వేటకే మొగ్గు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెల్లవారుజామున వేటకు వెళ్లి అదేరోజు సాయంత్రం జెట్టీకి చేరేందుకు అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ బోట్లు జెట్టీలకు చేరుకున్నా చేపలు అమ్మే విషయంలో విధివిధానాలు విధించడంతో లాంగ్ రన్ వేట కన్నా రోజువారీ వేటకే బోటు యజమానులు సిద్ధపడుతున్నారు. బోట్లు 2వ తేదీ అర్ధరాత్రి వెళ్లి 3వ తేదీ జెట్టీలకు చేరడం వల్ల చేపల మార్కెట్ కూడా 3న తెరుచుకోనుంది. టన్ను ఐస్ రూ.1400 ఫిషింగ్ హార్బర్లో ఉన్న 11 ఐస్ ఫ్యాక్టరీల్లో నాలుగు మాత్రమే తెరుచుకున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే కారి్మకులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారంతా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. కొన్ని రోజులపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఐస్ వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఐస్ ధర టన్ను రూ.1400లు వరకూ ఉన్నా అన్ని బోట్లు ఒకేసారి వెళ్లకపోవడం, లాంగ్‌రన్‌కు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఐస్‌కు డిమాండ్ లేదేని యజమానులు చెబుతున్నారు. నిబంధనలు తప్పక పాటించాలి మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పక పాటించాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కె.ఫణిప్రకాష్ పేర్కొన్నారు. మరబోట్ల సంఘాల అధ్యక్షులు, బోటు యజమానులు, ఎగుమతిదారులు, చేపల వర్తక సంఘాల ప్రతినిధులతో ఫిషింగ్ హార్బర్లోని మత్స్యశాఖ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడీ మాట్లాడుతూ బోట్లమీద పనిచేసే కలాసీలు, జెట్టీల మీద ఉండేవారు, చేపల వ్యాపారులు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హార్బర్ జెట్టీల మీద ఐదుగురికి మించి ఉండరాదన్నారు. జూన్ 1 నుంచి వేటకు అనుమతిచ్చినా బోటు యజమానులు 2వ తేదీ అర్ధరాత్రి బయలుదేరనున్నారని, వీరు వేట ముగించి ఏ జెట్టీకి తమ బోటును చేరుస్తారో అక్కడే సరకు దించాలని సూచించారు. వేటకు వెళ్లి తిరిగి వచ్చిన అన్ని బోట్లను ఒకే జెట్టీమీదకు చేర్చకూడదని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆటోలు, వ్యాన్లకు హార్బర్లోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. హార్బర్లోని షెడ్లలో వేలం నిర్వహణ కొనసాగుతుందని, వేలంలో పాల్గొనే మత్స్యకారులు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణరావు, మరబోట్ల సంఘాల ప్రతినిధులు పి.సి.అప్పారావు, బర్రి కొండబాబు, సీహెచ్.సత్యనారాయణమూర్తి, పోర్టు సిబ్బంది, వివిధ మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అండమాన్‌లో ఆర్తనాదాలు
కాశీబుగ్గ: అండమాన్ నికోబర్ దీవుల్లో సిక్కోలు వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ ఉండలేక స్వగ్రామాలకు వెళ్లలేక కుటుంబాలకు దూరమై ఆకలి కేకలు పెడుతున్నారు. అక్కడ తమ అగచాట్లను వాట్సాప్ ద్వారా వీడియో, చిత్రాలు పంపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత తొందరగా తెలుగు వాళ్లను రప్పించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అండమాన్ నికోబర్ దీవుల్లోనూ కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడ నుంచి రాష్ట్రానికి వెళ్లే అన్ని రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిపివేశారు. దాంతో అభర్డెన్ బజార్, జంగ్లీఘట్, డైరీఫారం, బృక్షబాద్, డిగిలిపూర్, కమ్మలబ్యాగ్, వండూరు, మాయబందర్, బాతుబస్తీ, గేరాచలంలో రెండు వేల మంది మత్స్యకారులతోపాటు పర్యాటకులు కరోనా లాక్డౌన్లో చిక్కుకున్నారు. (ఆ ఆరు రాష్ట్రాలు హైరిస్క్) అండమాన్ నికోబర్ దీవిలో చిక్కుకున్న మత్స్యకారులు జిల్లాలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం మండలాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేక వేట సాగక తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఫిషింగ్ జెట్టీల బోట్లపై పడుకుని కాలం గడుపుతున్నారు. రెండు నెలలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండమాన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, ఆకలి బాధలతో అలమటిస్తున్నామని కంటతడి పెడుతున్నారు. ఈ నెల 25 నుంచి రవాణా సౌకర్యం పునరుద్ధరించడంతో అండమాన్ నుంచి వైజాగ్‌కు ఓడ లేదా విమానంలో తరలించాలని కోరుతున్నారు. ప్రస్తుతం అండమాన్‌లో ఒక్క కరోనా వైరస్ రోగి లేరని చెబుతున్నారు. ఇప్పటి వరకు గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చడంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం) ఓడలపై తలదాచుకుంటున్న మత్స్యకారులు -
6న మత్స్యకారులకు విరామ భృతి
సాక్షి, అమరావతి: లాక్డౌన్, చేపల వేటపై నిషేధం కారణంగా ఈ ఏడాది మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు విరామ భృతి అందించే కార్యక్రమాన్ని ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఒక్కో కార్మికుడి బ్యాంకు ఖాతాలో రూ.10 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ భృతికి అర్హుల పేర్లు, వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 1.09 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 24న లాక్డౌన్ ప్రకటించడంతో అప్పటి నుంచి సముద్రంలో చేపల వేటను మత్స్యకారులు నిలిపివేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో వేటను నిషేధించింది. ఈ రెండు కారణాలతో సముద్రంలో చేపల వేటకు అవకాశం లేకపోయింది. దీంతో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వీరికి విరామ సాయం వెంటనే అందిస్తే కొంత వరకు సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ సాయం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు మరో 1600 మంది మత్స్యకారులు క్వారంటైన్ సెంటర్లకు తరలింపు కరోనా కారణంగా గుజరాత్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు శుక్రవారం రాత్రి నుంచి విశాఖకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం 16 వందల మంది మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు. 22 డబుల్ డెక్కర్ బస్సుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి చెందిన మత్స్యకారులు 16 వందల మంది రాగా, వీరిలో 323 మంది విశాఖకు చెందిన వారున్నారు. వీరందరికీ జిల్లా యంత్రాంగం భోజన సౌకర్యం, స్నాక్స్ అందించింది. అంతకుముందు శుక్రవారం రాత్రి 890 మంది విశాఖకు చేరుకున్నారు. వీరందరినీ లంకెలపాలెం కూడలి వద్ద జిల్లా యంత్రాంగం ఆహ్వానించి నగరంలోని నాలుగు క్వారంటైన్లకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం విశాఖకు చెందిన 381 మంది వచ్చారు. లాక్డౌన్ అమలుతో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోయారు. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 2911 మంది ఉన్నారు. అలాగే విజయనగరం జిల్లా నుంచి 711, విశాఖపట్నం నుంచి 418, తూర్పుగోదావరి జిల్లా నుంచి 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. తమిళనాడు నుంచి కూడా.. తమిళనాడు రాష్ట్రంలో కాసిమేడ్ ప్రాంతంలోచిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన 900 మంది మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయడానికి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. వీరిని త్వరలోనే స్వస్థలాలకు చేర్చుతామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం/రామవరప్పాడు(గన్నవరం)/జగ్గయ్యపేట/రాజానగరం: గుజరాత్లో చిక్కుకున్న మన రాష్ట్ర మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 12 బస్సుల్లో 890 మంది రాగా.. మిగిలిన 3,178 మంది శనివారం వారి స్వగ్రామాలకు చేరుకుంటారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 2,911 మంది ఉండగా, విజయనగరం జిల్లాకు చెందిన వారు 711, విశాఖపట్నం జిల్లాకు చెందినవారు 418, తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు, ఒడిశాలో ఉంటున్న మరో 14 మంది ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్లో నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక 37 రోజుల పాటు వీరంతా అష్టకష్టాలు పడ్డారు. వారి కుటుంబసభ్యుల వినతి మేరకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు. మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు రాష్ట్రానికి తీసుకురావడానికి రూ.3 కోట్లు విడుదల చేయించారు. ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇస్తాం: మోపిదేవి మత్స్యకారులకు శుక్రవారం విజయవాడ సమీపంలోని నిడమానూరులో మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు స్వాగతం పలికి అల్పాహారం, మంచినీటి బాటిళ్లను అందించారు. వారు ఇళ్లకు వెళ్లాక వారి కుటుంబ అవసరాలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అంతకుముందు ఆంధ్రా సరిహద్దు.. కృష్ణా జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తదితరులు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం రాజమహేంద్రవరం సమీపంలో అందరికీ భోజన సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ వారికి మాస్కులు అందించారు. మత్స్యకారులకు గరికపాడు వద్ద స్వాగతం పలుకుతున్న విప్ ఉదయభాను, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తదితరులు విజయ్ రూపానీకి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు సాక్షి, అమరావతి: లాక్డౌన్ వల్ల గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు జాలర్లను క్షేమంగా ఏపీకి తీసుకురావడానికి సహాయ సహకారాలు అందజేసిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు జగన్ ట్వీట్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే సహకారం అందుతుందని ఆశిస్తూ అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం.. కుటుంబ పోషణ కోసం ఆరునెలల క్రితం గుజరాత్‌కి వెళ్లాను. లాక్డౌన్ కారణంగా గుజరాత్‌లోనే చిక్కుకుపోయా. తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డా. మా కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించిన సీఎం వైఎస్ జగన్ మేము రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. – చిన దానయ్య, మత్స్యకారుడు, రెల్లివీధి (విశాఖపట్నం) ఆంధ్రా బోర్డర్‌కు వచ్చాకే భోజనం తిన్నాం గుజరాత్లో బయలుదేరి మూడు రోజులైనా ఎక్కడా షాపులు, హోటళ్లు లేకపోవడంతో ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆంధ్రా బోర్డర్‌కి వచ్చినప్పటి నుంచి కడుపునిండా భోజనం తిన్నాం. భీమవరంలో బిర్యానీ పెట్టారు. – వి. శంకర్, విజయనగరం జిల్లా -
చిక్కుకుపోయాం.. ఆదుకోండి
సాక్షి, ముంబై: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ముంబైకి సమీపంలో చిక్కుకుపోయి నానా అగచాట్లుపడుతున్నారు. థాణే జిల్లా లోని ఉత్తన్ తీరప్రాంతంలో ఉన్న వీరంతా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. సుమారు నాలుగు నెలల కిందట కళింగపట్నం, కపాసుకుద్ది, ఇద్దివానిపాలెం, కళింగపట్నం కుసుకుంపురం తదితర ప్రాంతాల నుంచి సుమా రు 200 మంది ముంబైకి సమీపంలోని ఉత్తన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పనుల్లేవని, లాక్డౌన్ కారణంగా ఇంటికొచ్చే అవకాశమూ లేకుండాపోయిందని ఆందోళన చెందుతున్నారు. తమలో ఒకరికి కిడ్నీ సమస్య ఉందని.. మందులు కూడా లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను స్వగ్రామాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారు పడుతున్న వెతలను ‘సాక్షి’తో చెప్పుకున్నారు. మమ్మల్ని ఇంటికి చేర్చండి.. మమ్మల్ని ఎలాగైనా మా గ్రామాలకు చేర్చండి. ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. మా కుటుంబ సభ్యులు కూడా∙ఆందోళనలో ఉన్నారు. – ఇద్ది దుర్యోదన్ ఒక పూటే తింటున్నాం.. ఇక్కడ పనులు కూడా లేకపోవ డంతో ఒక పూటే తింటున్నాం. ఒక నెల పాటు బాగానే ఉన్నా.. లాక్డౌన్ పొడిగించడంతో కష్టాలు మొదలయ్యాయి. – మద్దు మోహన్‌రావు ఏపీకి తీసుకొస్తాం.. ముంబైలో చిక్కుకున్న మత్స్య కారులను ఏపీకి తెచ్చే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. ముంబై సమీపంలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్య కారులనూ రాష్ట్రానికి తీసుకొస్తాం. – మంత్రి మోపిదేవి వెంకటరమణారావు -
సీఎం జగన్ చొరవతోనే మత్స్యకారుల విడుదల
సాక్షి, అమరావతి/భావదేవరపల్లి–నాగాయలంక (అవనిగడ్డ): పాకిస్తాన్ జైల్లో ఉన్న మత్స్యకారులను విడిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశారని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో బాధిత కుటుంబ సభ్యులు సమస్యను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ ప్రధాని, అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారన్నారు. అమిత్‌షాకు 2019 ఆగష్టు 31న సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని, తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం డిసెంబర్ 31న మత్స్యకారులను రిలీజ్ చేయడానికి అంగీకరిస్తూ విదేశాంగ శాఖకు సమాచారం పంపించిందన్నారు. సీఎం చొరవతో ఈనెల 6న సాయంత్రం 4 గంటలకు 20 మంది మత్స్యకారులు వాఘా సరిహద్దు ద్వారా భారతదేశంలోకి చేరుకుంటారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మరో నెల రోజుల్లో వస్తారన్నారు. కాగా, కోస్తా తీరంలో చేప ఉత్పత్తులకు సంబంధించి దివిసీమ జోన్లో ప్రత్యేక క్లస్టర్‌గా పాంపినో, సీబాస్, జెల్ల చేపల విత్తన కేంద్రాలు (హేచరీస్)ను మార్కెట్లోకి తీసుకువచ్చే కార్యాచరణ చేపట్టబోతున్నట్లు మంత్రి మోపిదేవి తెలిపారు. నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ప్రయోగాత్మకంగా చెరువులలో పెంచిన ఉప్పునీటి చందువా చేపల పట్టుబడి కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుతో కలసి ఆయన ప్రారంభించారు. -
6న పాక్ చెర నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ/ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం జిల్లా)/ విజయనగరం: పాకిస్తాన్లో బందీలుగా ఉన్న 20 మంది ఉత్తరాంధ్ర జాలర్లు వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌కు డిసెంబర్ 31న సమాచారం అందించింది. గుజరాత్‌కు చెందిన చేపల వేట బోటు యజమానులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది జాలర్లను, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లను చేపల వేట కోసం నియమించుకున్నారు. 2018 నవంబర్ 28న జీపీఎస్ పనిచేయకపోవడంతో పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి మూడు బోట్లలో 20 మంది జాలర్లు వెళ్లడంతో వారిని పాకిస్తాన్ కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి వీరు కరాచీ జైలులో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 10న రాజ్యసభ సభ్యులు(ప్రస్తుత వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత) వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నాటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి సమస్యను నివేదించారు. తదనంతరం అనేకమార్లు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం ఈ విషయాన్ని విదేశాంగ దృష్టికి తెచ్చింది. 22 ఆగస్టు 2019న కూడా మరోసారి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. పలుమార్లు లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాలు, ఇతర సందర్భాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న వాఘా సరిహద్దు నుంచి వారు స్వదేశానికి రానున్నట్టు పాకిస్తాన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. చెర వీడనున్న జాలర్లు వీరే.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన కె.ఎర్రయ్య, కేశం రాజు, సన్యాసిరావు, ఎం.రాంబాబు, జి.రామారావు, ఎస్.అప్పారావు, కల్యాణ్, ఎస్.కిశోర్, గురుమూర్తి, సుమంత్, బడివానిపేటకు చెందిన బాడి అప్పన్న, శామ్యూల్, వెంకటేశ్, మణి, శ్రీకాకుళం మండలం దమ్మలవీధికి చెందిన శివ, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన బవిరిడు, నక్కా అప్పన్న, ధనరాజు, నక్కా కొండ, భోగాపురం మండలం ముక్కామకు చెందిన ఎం.గురువులు పాకిస్తాన్ చెర వీడనున్నారు. వీరిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు శ్రీకాకుళం ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ వీవీ కృష్ణమూర్తితో కూడిన అధికారుల బృందం ఢిల్లీ పయనమైంది. ఉపాధి కోసం గుజరాత్‌కు.. ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఉపాధి కోసం ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళుతుంటారు. చిత్రమేమిటంటే వలసదారుల్లో 2,500 మంది వరకు చిన్నపిల్లలే. డ్రైవర్లు దళారులుగా మారి గుజరాత్ బోటు యజమానుల నుంచి అడ్వాన్సులు తీసుకుని ఉత్తరాంధ్ర మత్స్యకారులను పనికి తీసుకువెళుతున్నారు. అక్కడ తండేలు, సహాయ తండేలు, కళాసీలుగా పనిచేస్తే రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకూ జీతం ఇస్తుంటారు. పిల్లలకైతే రూ.6 వేల లోపు జీతం వస్తుంది. ఏడాదిగా ఎదురు చూస్తున్నాం ఏడాది తరువాత మా కొడుకు వస్తున్నాడని విదేశాంగ శాఖ ద్వారా సమాచారం అందింది. ఈ విషయం తెలిసి ఎంతో ఆనందపడుతున్నాం. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రాలు దాటి కూలికి పంపిస్తే అనుకోని విధంగా శత్రు దేశమైన పాక్‌కు పొరపాటున మా వాళ్లు బందీ అయ్యారు. –నక్కా నర్సమ్మ, తిప్పలవలస ఏకాకిగా మిగిలాను నా భర్త నక్కా అప్పన్న, కుమారుడు నక్కా ధనరాజు పాక్‌కు బందీలుగా చిక్కడంతో ఏకాకిగా మిగిలి వారి కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాను. రెండు రోజుల్లో వారు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏడాదిగా చాలా బాధగా వున్నాం. –నక్కా పోలమ్మ, తిప్పలవలస -
మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
సాక్షి, మచిలీపట్నం: కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులకు మంచిరోజులొచ్చాయి. గంగమ్మ తల్లినే నమ్ముకున్న వారి బతుకులు బాగుపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సముద్రంలో వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు వేటనిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాకుండా డీజిల్ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9లకు పెంచింది. తాజాగా మైదాన ప్రాంతాల్లో చెరువుల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులకు కిసాన్ క్రిడెట్ కార్డులివ్వాలని నిర్ణయించింది. జిల్లాలో ఇన్లాండ్ మత్స్యకార సంఘాలు 211, మెరైన్ మత్స్యకార సంఘాలు 43, మహిళా మత్స్య కార సంఘాలు 81 ఉన్నాయి. వీటి పరిధిలో 38,914 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. మత్స్య కారులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో ఉంటూ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టే మత్స్యకారులు తగిన ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతున్నారు. రొయ్యలు చెరువులు సాగు చేసే మత్స్యకారులైతే దాణా, మందులు కొనుగోలు చేయడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సౌకర్యం గతంలో ఉండేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతకాలం నిలుపుదల చేశారు. కాగా కేంద్రం మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరింపజేసింది. ప్రస్తుతం సొసైటీల పరిధిలో యాక్టివ్‌గా ఉన్న మత్స్యకారులకు ఈ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. చేప రైతుల(వ్యక్తిగతంగా, గ్రూపులు, భాగస్వాములు, కౌలుకు సాగు చేసే వారు)తో పాటు సెల్ఫ్‌హెల్ప్, జాయింట్ లైబలిటీ, మహిళా మత్స్యకార గ్రూపులు ఈ కార్డులు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. అలాగే వర్కింగ్ కాపిటల్ కాంపొనెంట్‌తో సాగు చేసే మత్స్యకారులకు కూడా ఈ కార్డులు పొందేందుకు అర్హులు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం సీడ్, ఫీడ్, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, హార్వస్టింగ్స్, మార్కెటింగ్ చార్జీలు, ఆయిల్, విద్యుత్ చార్జీలు, ఐస్, ల్యాండింగ్ చార్జీలు లేబర్, లీజ్‌ల కోసం ఈ కార్డుల ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు.ఈ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. చేపల పెంపకం, వేట, విక్రయాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించవచ్చు. అర్హులైన వారిని గుర్తిస్తున్నామని, జనవరి 1వ తేదీ నుంచి వారికి మత్స్యశాఖ తరఫున కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్టు మత్స్యశాఖ డీడీ రాఘవరెడ్డి తెలిపారు. -
ఉడికిన పీత..లాభాలమోత
పిఠాపురం: సముద్ర పీతలు.. ఒకసారి తింటే ఆ రుచి మరచిపోలేం.. ఇక మన రాష్ట్ర తీరంలో దొరికే సముద్ర పీతలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. కొన్ని రకాల పీతల ధర విదేశాల్లో కిలో వేలల్లో ఉంది. మత్స్యకారులు, వ్యాపారులకు లాభాల పంట పండిస్తున్న ఈ పీతలు ఎగుమతికి అంత అనుకూలం కాకపోవడంతో.. ఐస్‌లో ఎంత పకడ్బందీగా పంపినా కొన్నిసార్లు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు పరిష్కారం కనుగొన్నారు. అదే పీతల్ని ఉడికించి ఎగుమతి చేయడం. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు రుచిలో కూడా శ్రేష్టంగా ఉండడంతో ఈ విధానంలో ఎగుమతులు జోరందుకున్నాయి. సముద్ర పీతల ధర మన వద్ద కిలో రూ. 350 నుంచి రూ. 500 ఉంటే.. విదేశాల్లో రూ.5 వేల వరకూ పలుకుతుంది. బ్లూ క్రాబ్, త్రీస్పాట్ క్రాబ్, పచ్చ పీత, మండ పీత, జీలా పీత, చుక్క పీత తదితర రకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని తీరప్రాంతాల నుంచి రోజూ సుమారు 20 నుంచి 25 టన్నుల పీతలు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో జీలా రకం పీతలకు క్రేజ్ ఎక్కువ. సాధారణంగా పీతలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అమెరికా లాంటి దేశాలకు పంపాలంటే ఎక్కువ రోజుల నిల్వ చేయాల్సి రావడంతో ఎగుమతులు తక్కువగా ఉండేవి. పీతల్ని ఉడకబెట్టడం ద్వారా అవి ఎక్కువకాలం పాడవకుండా ఉండడాన్ని గుర్తించారు. దీంతో వేటాడి తెచ్చిన పీతలను కొనుగోలు చేసిన వ్యాపారులు తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాల్లో ఉడకబెట్టి, ఐస్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈ పీతలు కాకినాడ నుంచి ముంబయి, చెన్నై వంటి నగరాల్లోని కంపెనీలకు ప్రత్యేక కంటైనర్లలో తరలించి అక్కడి నుంచి విమానాల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పీతల వేటకు పెట్టుబడి ఎక్కువే.. పీతల్లో మొత్తం 7,693 రకాలున్నాయి. మన వద్ద 10 నుంచి 15 రకాలు మాత్రమే దొరుకుతాయి. పీతల్ని పట్టాలంటే బలమైన వలలు అవసరం. ఒక్కోసారి వల ఎంత గట్టిగా ఉన్నా.. పీతల డెక్కల నుంచి రక్షించడం కష్టం. అందుకే పీతల వేటకు ప్రత్యేక వలలు ఉపయోగిస్తారు. ఒక వల రెండు మూడు వేటల కంటే ఎక్కువ ఉపయోగపడదు. అందువల్లే వీటి వేటకు పెట్టుబడి ఎక్కువ. ఒకసారి పాడైతే అవి మరమ్మతులకు కూడా పనికిరావు. చేపల వేటకైతే 20 నుంచి 30 వేటల వరకు వల పనికొస్తుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినప్పుడు పీతల కోసం ప్రత్యేక వలలు వేస్తారు. కొంచెం లోతుగా ఉండే ప్రాంతాల్లో పీతలు ఎక్కువగా దొరుకుతాయి. ఆ ప్రదేశాల్లో ఎక్కువ పీతలు పడితే ఆ రోజు పంట పండినట్లే. అర కేజీ నుంచి సుమారు రూ.8 కేజీల బరువైన పీతలు దొరుకుతాయి. మాంసాన్ని వేరు చేసి ఎగుమతులు విదేశాల్లో పీతల్ని కాకుండా.. వాటి నుంచి వేరు చేసిన మాంసాన్ని కొనుగోలు చేస్తారు. దీంతో పీతల అవయవాల్ని బట్టి రేటు మారుతుంది. డెక్కల్లో మాంసానికి ఒక రేటు, కడుపు భాగంలో మాంసానికి మరో రేటు పలుకుతుంది. మన తీరప్రాంతంలో కొన్న పీతలను ఉడకబెట్టి.. ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తారు. అక్కడ వాటిని శుభ్రం చేసి డిప్పలు, డెక్కలు పూర్తిగా తొలగించి కేవలం మాంసాన్ని మాత్రమే ఎగుమతి చేస్తారు. విడివిడిగా ప్యాకింగ్‌లు చేసి విదేశాలకు పంపుతారు. గిరాకీ పెరిగింది ఉప్పాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రతీ రోజు సుమారు టన్ను వరకు పీతలు కొనుగోలు చేస్తున్నారు. వేట ఎక్కువ ఉంటే 2 నుంచి 5 టన్నుల వరకు పీతలు కొంటున్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన పీతలను కంటైనర్ ద్వారా చెన్నై, ముంబయిల్లోని ఫ్యాక్టరీలకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మేము అమ్మే కంపెనీలు పీతల్ని అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. – మల్లిబాబు, పీతల వ్యాపారి, ఉప్పాడ జోరుగా ఎగుమతులు గతం కంటే పీతల ఎగుమతులు పెరిగాయి. ఉడకబెట్టి ప్యాకింగ్ చేయడం వల్ల పీతలు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు నాణ్యంగా ఉంటాయి. అందువల్లే విదేశాల్లో వీటికి గిరాకీ పెరిగింది. ఈ పీతల రకాలు మన తీర ప్రాంతంలోనే లభ్యమవుతాయి. చెరువుల్లో పెంచే పీతలకంటే సముద్ర పీతలకు గిరాకీ ఎక్కువ. ఉప్పాడ, కాకినాడ, అంతర్వేది తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని కేజీల లెక్కన కొంటున్నారు. జీలా రకం పీత ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. –శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ, కాకినాడ -
మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు
సాక్షి, అమరావతి: మత్స్యకారులు కోరుకున్న ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జెట్టీల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనువుగా ఉన్నాయో తొలుత పరిశీలన చేయాలని సూచించారు. మరపడవల లంగరు కోసం అనువైన జెట్టీలు లేకపోవడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మత్స్యకారులు చెన్నై, గుజరాత్‌కు తరలి వెళ్లిపోతున్నారని, వారంతా సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా వాడరేవుల్లో రెండు పెద్ద జెట్టీల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్‌పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జట్టీలను నిరి్మంచాలని సూచించారు. బందరు పోర్టును మేజర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. నిజాంపట్నం హార్బర్ రెండోదశ విస్తరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్.. చేపలు, రొయ్యలు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేపలు, రొయ్య పిల్లలు, మేతను పరీక్షించడానికి అనువుగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సీడ్, ఫీడ్ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్ల సహాయంతో రైతులు ప్రభుత్వ పథకాలను సది్వనియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో కాలుష్యం అంతా సముద్రంలోకి చేరుతోందన్నారు. ఇదే ప్రాంతం నుంచి తాను పాదయాత్ర చేసినట్టు సీఎం గుర్తు చేశారు. ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ ఇతర పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, పర్యావరణాన్ని కలుíÙతం చేయడం సరికాదన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని సవాల్‌గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారి బ్రాండ్ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతిభావంతుల సహకారం తీసుకుంటే మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగై రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ప్రతి గ్రామానికి పశు వైద్యశాల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పశుపోషణ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలన్నారు. పశువులకు కూడా హెల్త్‌కార్డులను జారీ చేసి చెవులకు ట్యాగ్, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర నిధులను ఇందుకు వినియోగించాలని సూచించారు. పశువుల ఔషధాల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలన్నారు. పులివెందులలోని ‘ఏపీకార్ల్’కు నేరుగా నీటిని సరఫరా చేసేలా నీటిపారుదలశాఖతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అక్కడ ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు బాధిత ప్రాంతాల్లో పశువుల మేతకు కొరత లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు రూ.50 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. పశువుల వైద్యం కోసం వచ్చే ఏడాది నుంచి 102 వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పశు సంవర్ధకశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. సీఎం సమీక్షలో మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్, పశు సంవర్థకశాఖ డైరెక్టర్ సోమశేఖరం తదితరులు పాల్గొన్నారు. ►రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలి. – అధికారులకు సీఎం ఆదేశం -
మృగశిరొచ్చే..
ఖమ్మంవ్యవసాయం: మృగశిర అనగానే గుర్తుకొచ్చేది ఆ రోజున చేపలు తినడం. అయితే దీని వెనుక అనేక రకాల కారణాలున్నాయి. కార్తె ఆరంభమైందంటే దాదాపు వేసవి కాలం నుంచి వర్షాకాలంలోకి అడుగిడినట్లే. వర్షాకాలం ఆరంభం.. మృగశిర కార్తె తొలిరోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లో బత్తిని సోదరులు చేపమందు వేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అంతదూరం వెళ్లలేని వారు మృగశిర రోజున తప్పక చేపలు తింటారు. అంతేకాక వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందని, అది చేపలు తినడం వల్ల దూరమవుతుందనేది పెద్దల మాట. దీంతో కూడా మృగశిర ఆరంభం రోజున చేపలను తింటుంటారు. ఈ క్రమంలో మృగశిర రోజున చేపలకు మంచి గిరాకీ ఉంటుంది. చేపల విక్రయదారులు కార్తె ఆరంభం రోజును పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి చేపలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయాలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వైరా, పాలేరు రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున చేపల పెంపకం జరుగుతోంది. వైరా రిజర్వాయర్‌లో ఇప్పటికే చేపల వేట జరుగుతుండగా.. పాలేరు రిజర్వాయర్‌లో శనివారం నుంచి చేపలు పట్టడానికి అంతా సిద్ధం చేశారు. 100 టన్నులకు పైగానే విక్రయానికి సిద్ధం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 100 టన్నుల చేపలను మత్స్యకారులు, చేపల విక్రయదారులు అమ్మకానికి సిద్ధం చేసినట్లు సమాచారం. చేపలను వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని.. ఐస్ బాక్స్‌ల్లో నిల్వ చేస్తున్నారు. మృగశిర కార్తె ఆరంభం రోజైన శనివారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 నుంచి 150 టన్నుల చేపలను విక్రయించే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్క ఖమ్మంలోనే సుమారు 40 నుంచి 45 టన్నుల చేపలు విక్రయించే అవకాశాలున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా రహదారుల వెంట చేపల విక్రయాలకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. పెద్ద పట్టణాలు కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు, మధిర, వైరా, భద్రాచలం, అశ్వారావుపేటతోపాటు మండలాల్లో కూడా మృగశిర రోజున చేపల విక్రయాలు భారీగానే జరుగుతాయి. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో దాదాపు 40 నుంచి 50 టన్నుల మేర చేపలు విక్రయించే అవకాశం ఉంది. ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం వంటి ప్రాంతాల్లో కూడా క్వింటాళ్ల కొద్దీ చేపలను విక్రయాలకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. ఆంధ్రా నుంచి దిగుమతి ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో పెంచిన చేపలు మృగశిర రోజున విక్రయానికి సరిపోవని గుర్తించిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా దిగుమతి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, బాపట్ల, విజయవాడ, గోదావరి జిల్లాలోని రాజమండ్రితోపాటు పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నారు. టన్నుల కొద్దీ చేపలను వాహనాల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకొని.. ఐస్ వేసుకొని తీసుకొచ్చి నిల్వ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. రకాన్నిబట్టి డిమాండ్ చేపల రకాన్నిబట్టి ధర పలికే అవకాశం ఉంది. సహజంగా మన ప్రాంతంలో అధిక ధర ఉండే కొర్రమీను చేప ధర మృగశిర కార్తె ఆరంభం రోజున రెట్టింపు పలుకుతుంది. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలో రూ.300 ఉంటుంది. కానీ.. మృగశిర రోజున కిలో రూ.500 ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఇక పచ్చి రొయ్యలు, బొచ్చలు, రవ్వు, గ్యాస్కట్, బంగారు తీగ వంటి రకాలు సాధారణ రోజుల్లో కంటే అధిక ధరలు పలికే అవకాశాలు ఉన్నాయి. కిలో ఒక్కంటికి అదనంగా మరో రూ.30 నుంచి రూ.50 వరకు అధిక ధర పలికే అవకాశం ఉంది. సమృద్ధిగా చేపలు ప్రభుత్వం చేప పిల్లల పథకం చేపట్టిన తర్వాత చెరువుల్లో సమృద్ధిగా చేపల ఉత్పత్తి జరుగుతోంది. స్థానిక చెరువులు, జలాశయాల్లో ఉత్పత్తి అయ్యే చేపలను మత్స్యకారులు ఆయా గ్రామాలు, మండలాల్లోనే విక్రయిస్తున్నారు. మృగశిర కార్తె రోజున పలు చెరువుల్లో చేపలు పట్టడానికి మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. అన్ని ప్రాంతాల్లో మృగశిర రోజున సమృద్ధిగా చేపలు లభించే అవకాశాలున్నాయి. – బుజ్జిబాబు, జిల్లా మత్స్య శాఖాధికారి -
చెరువుకు చేరని ‘చేప’
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేప పిల్లల పంపిణీ నత్తనడకన కొనసాగుతోంది. మత్స్యకారులకు చేయూతను అందించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఐదు జిల్లాల్లో మొత్తం 13.01 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.31 కోట్ల చేప పిల్లలను మాత్రమే మత్స్యకారులకు అందించారు. చెరువుల్లో చాలా వరకు 20 రోజులక్రితం కురిసిన వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో చేప పిల్లల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. 50 శాతం కూడా పంపిణీ కాలేదు.. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారం వరకే చేప పిల్లలను పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే వర్షాలు ఆలస్యంగా కురవడంతో సెప్టెంబర్ చివరి వారం వరకు సమయమిచ్చారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరడంతో చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని మాధన్నపేట చెరువులో ఆగస్టు 28న చేప పిల్లలు వదిలి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాన్ని సమయమిచ్చారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరడంతో చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని మాధన్నపేట చెరువులో ఆగస్టు 28న చేప పిల్లలు వదిలి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో 50 శాతం చేప పిల్లల పంపిణీ కూడా పూర్తి కాలేదు. వరంగల్ అర్బన్ జిల్లాలో 1.49 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 83 లక్షలు, వరంగల్ రూరల్ జిల్లాలో 2.16 కోట్ల చేప పిల్లలకుగాను 85 లక్షల చేపల పిల్లలు మహబూబాబాద్ జిల్లాలో 4.43 కోట్ల చేప పిల్లలకు 2.50 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2.13 కోట్లకుగాను 85 లక్షలు, జనగామ జిల్లాలో 2.80 కోట్ల చేపపిల్లలకుగాను 28 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. మండల కేంద్రాల్లో పంపిణీ.. చేప పిల్లల పంపిణీ కోసం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు హన్మకొండలోని భీమారం ఫిషరీస్ నిర్వాహకులతోపాటు కొండా సుష్మితాపటేల్, పట్టాభి చేప పిల్లల పంపిణీని దక్కించుకున్నారు. భీమారం ఫిషరీస్ వారు వరంగల్ అర్బన్ జిల్లాలోని మెజార్టీ చెరువులకు పంపిణీ చేయాల్సి ఉండగా, మిగిలిన చెరువులతోపాటు వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పట్టాభి, సుష్మితా పటేల్ చెరిసగం చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉంది. పటాభికి వరంగల్‌లోని కాజీపేట మండలం అమ్మవారిపేటలో ఫాం ఉండగా, కొండా సుష్మితా పటేల్‌కు గీసుకొండ మండలం వంచనగిరిలో ఫాం ఉంది. సదరు కాంట్రాక్టర్లు ఆయా మండల కేంద్రాలకు చేప పిల్లలను తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేస్తాం జిల్లాలో ఎంపిక చేసిన అన్ని చెరువుల్లో సెప్టెంబర్ చివరికల్లా చేప పిల్లల పంపిణీ పూర్తిచేస్తాం. మా శాఖ పర్యవేక్షణలో చేప పిల్లల పంపిణీ జరుగుతోంది. చేప పిల్లలు గతంలో నేరుగా చెరువుల్లో వదలడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. అందుకే ఫాం దగ్గరనే పంపిణీ చేస్తున్నాం. – నరేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
సామాన్యులే రియల్ హీరోలు
వారంతా సాధారణ ప్రజలు. ఇతరులకు సాయం చేయడానికి కోట్లకొద్దీ డబ్బు లేదు. చేతిలో అధికారం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అవసరమైన అధునాతన పరికరాలు లేవు. ఉన్నదల్లా కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయాలనే సంకల్పం. ఆ ఆశయంతోనే ఎంతోమంది సాధారణ ప్రజలు ముందుకు కదిలారు. వారిలో పదేళ్లు కూడా నిండని పిల్లలు, జైలు ఖైదీలూ ఉన్నారు. అలాంటి కొందరు స్ఫూర్తిప్రదాతల గురించి తెలుసుకుందాం. కిడ్డీ బ్యాంక్ ఇచ్చేసింది.. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన 9 ఏళ్ల అనుప్రియ సైకిల్ కొనుక్కోవాలనే లక్ష్యంతో చాలా రోజుల నుంచి ఒక్కో రూపాయీ పోగేస్తోంది. రూ.9,000దాకా ఆమె కిడ్డీ బ్యాంక్‌లో పోగయ్యాయి. అదే సమయంలో టీవీల్లో కేరళ ప్రజల దైన్యాన్ని చూసి చలించిపోయింది. సైకిల్ కొనుక్కోడానికి దాచిన నగదంతా సహాయక కార్యక్రమాలకు పెద్ద మనసుతో ఇచ్చేసింది ఈ చిన్నారి. ఈ విషయం తెలుసుకున్న హీరో సైకిల్స్ సంస్థ బాలికపై ప్రశంసలు కురిపించింది. మానవత్వానికి అనుప్రియను ప్రతీకగా అభివర్ణించిన హీరో సైకిల్స్.. ఆమె జీవితాంతం ఏడాదికొక సైకిల్‌ను అనుప్రియకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మత్స్యకారుల మానవీయత చేపల వేట కోసం రోజూ సముద్రంలోకి వెళ్లే గంగపుత్రులు వారు. లోతైన నీటిలోనూ ఎలాంటి బెరుకూ లేకుండా ఈదడం వారికి వెన్నతో పెట్టిన విద్య. తమకు తెలిసిన విద్యతో కేరళలో వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడాలని వారు తలచారు. అనుకున్నదే తడవుగా సొంత ఖర్చుతోనే తమ పడవలను ట్రక్కుల్లోకి ఎక్కించి తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరారు. వారిలో ఎక్కువగా త్రివేండ్రానికి చెందినవారే ఉన్నారు. మత్స్యకారుల సాయం గురించి తెలుసుకున్న కొందరు ట్రక్కు డ్రైవర్లు, యజమానులు.. వారి పడవలను ఉచితంగానే రవాణా చేశారు. పతనం తిట్ట, ఎర్నాకుళం, త్రిస్సూర్ సహా అనేక చోట్ల మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సహాయక సిబ్బంది తాము చేరుకోలేమంటూ చేతులెత్తేసిన చోటుకి కూడా జాలరులు వెళ్లి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కేపీ జైసాల్ అనే మత్స్యకారుడు ఇలా బలగాలకు సాధ్యంకాని చోటుకు కూడా చేరుకుని తన వీపును మెట్టుగా మార్చి ముగ్గురు మహిళలను బోటులోకి ఎక్కించి రక్షించడం మనకు తెలిసిందే. ఈ నిజమైన హీరోల సేవలను గుర్తించిన సీఎం విజయన్.. వారందరికీ ఒక కొత్త బోటుని, సహాయక చర్యల్లో పాల్గొన్నన్ని రోజులకూ రోజుకు రూ. 3 వేల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. నిరాశ్రయులకు ఖైదీల చపాతీలు వరదల్లో నిరాశ్రయులుగా మారిన వారికి ఆహారం అందించేందుకు త్రివేండ్రం పూజాప్పురలో ఉన్న కేంద్ర కారాగారంలోని ఖైదీలు తీవ్రంగా శ్రమించారు. మంచినీటి సీసాలతోపాటు దాదాపు 50 వేల చపాతీలను ఖైదీలతో తయారు చేయించి జైలు అధికారులు సహాయక బృందాలకు అందజేశారు. నీటిలో చిక్కుకుని ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారికి హెలికాప్టర్ల నుంచి జారవిడిచేందుకు తమ చపాతీ ప్యాకెట్లు బాగా ఉపయోగపడ్డాయని అధికారులు చెప్పారు. 2015లో చెన్నైలో వరదల సమయంలోనూ ఇదే జైలు నుంచి 50 వేల చపాతీలను పంపారు. సాధారణ రోజుల్లోనూ ఖైదీలు చపాతీతోపాటు శాకాహార, మాంసాహార వంటకాలను తయారుచేసి త్రివేండ్రంలో ‘ఫ్రీడమ్’ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. ప్రేమతో.. ఫేస్బుక్ దళం 2015లో చెన్నై వరదల సమయంలో సహాయక కార్యక్రమాల కోసం పురుడుపోసుకున్న ఫేస్బుక్ గ్రూప్ ఒకటి ప్రస్తుతం కేరళలో సహాయక చర్యల్లో పాల్గొంటోంది. నాడు 9 మందితో ప్రారంభమైన ఈ గ్రూప్‌లో నేడు వేలాది మంది ఉండగా దాదాపు 2,000 మంది సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆ గ్రూప్ పేరే ‘అన్బోదు కొచ్చి’ (ప్రేమతో కొచ్చి). కొచ్చిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలోనే ఈ గ్రూప్‌లోని 500 మంది ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ప్యాక్ చేసి నిరాశ్రయులకు పంపించే పనిలో ఉన్నారు. బిస్కెట్లు, రస్క్, వంట పాత్రలు, దుస్తులు తదితరాలను ప్యాక్ చేసి సహాయక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ దళాల ద్వారా అవసరమైన వారికి అందిస్తున్నారు. కొచ్చిలో ఓ పాఠశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరంలో భోజనం చేస్తున్న ఓ వరదబాధిత చిన్నారి -
మత్స్యకారుల మధ్య స్పీడ్ బోట్ల చిచ్చు
-
తీరంలోనే లంగరు..
ప్రకృతి వైపరీత్యాలు.. పాలకుల నిషేధాజ్ఞలతో జిల్లాలోని మత్స్యకారుల గ్రామాల్లో చేపల వేట తీరం దాటడం లేదు. సముద్రం నిండుగా చేపలు ఉన్నా.. అందులోకి వెళ్లి వేట చేయలేని దుస్థితి. తీరం వెంబడి సముద్రంలోకి వెళ్లే ముఖద్వారాల వద్ద ఇసుక మేటలతో వేట సాగించే బోట్లు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి పూడికతీతకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడంతో గంగపుత్రులు వేటకు దూరం అవుతున్నారు. వాకాడు(నెల్లూరు): జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులకు చేపల వేటకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో వేట అంతంత మాత్రంగా సాగుతోంది. దీనికి తోడు పునరుత్పత్తి కాలంగా ఏటా రెండు నెలలు వేటను నిషేధిస్తున్నారు. మిగిలిన కాలంలో సజావుగా వేట సాగించడానికి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలు వేటకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి తీర గ్రామం నుంచి సముద్రంలోకి వెళ్లడానికి ముఖద్వారాలు ఉన్నాయి. సముద్రంపై సజావుగా వేటసాగాలంటే సాగర ముఖద్వారాలు తెరుచుకుని నిండుగా నీరు ప్రవహించాల్సి ఉంది. మత్స్యకారులు తమ బోట్లను ఎలాంటి ఆటంకం లేకుండా సముద్రంలోనికి తీసుకెళ్లడం, వేట తర్వాత మత్స్య సంపదను తీరానికి చేర్చడానికి వీలు అవుతుంది. కానీ ప్రస్తుతం సముద్రంతీరం ఆటు, పోటుల కారణంగా అన్ని చోట్ల ముఖద్వారాల వద్ద 10 మీటర్లు ఎత్తులో ఇసుక మేటలు వేయడంతో పూడిపోయింది. వేటకు పాట్లు జిల్లాలో 14 చోట్ల సముద్ర ముఖద్వారాలు ఉన్నాయి. అందులో ముత్తుకూరు, జువ్వలదిన్నె ముఖద్వారాలు మినహా మిగిలిన ద్వారాలు మూసుకుపోవడంతో మత్స్యకారులు వేటకు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలోని 113 మత్స్యకార గ్రామాలకు చెందిన 6 వేల ఫైబర్ బోట్లపై ఆధారపడిన 60 వేల మంది మత్స్యకారులు నానా పాట్లు పడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సముద్రుడు కరుణించడంతో మత్స్యకారులకు ఇప్పుడు మత్స్యసంపద దండిగా దొరుకుతుంది. అయితే మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్లలేక తమ బోట్లకు తీరం ఇవతలే లంగర్ వేయాల్సిన పరిస్థితి దాపురించింది. పట్టించుకోని పాలకులు, అధికారులు మత్స్యకారుల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న పాలకులు, అధికారులు సముద్ర ముఖద్వారాల్లో పూడిక తీతను పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా మత్స్యకార సంఘాల నాయకులు, గ్రామ కాపులు, మత్స్యకారులు సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సభల్లో విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మత్స్యకారులే అప్పులు చేసి ఏటా రూ. 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ముఖద్వారాల పూడిక తీత పనులు చేయించుకుంటున్నారు. జిల్లాలో వాకాడు, కోట, చిల్లకూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, విడవలూరు, కొడవలూరు, అల్లూరు మండలాల్లో మత్స్యకారులే చందాలు వేసుకుని ప్రస్తుతం ముఖద్వారాల పూడికలు తీయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాకాడు మండలం కొండూరుపాళెం సముద్ర ముఖద్వారం వద్ద మత్స్యకారులు పూడిక పనులను వేగంగా సాగిస్తున్నారు. నిషేధ కాలానికి పరిహారం.. కాగితాలకే పరిమితం రెండేళ్లుగా వేట నిషేధిత కాలంలో మత్స్యకారులకు అందించే సాయం కాగితాలకే పరిమితమైంది. గతంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట విరామం కింద రూ. 2 వేలు సాయం అందించే వారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని రెట్టింపు చేసి రూ.4 వేలు సాయంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన మత్స్యకారుల్లో ఆనందాన్ని నింపినప్పటికీ రోజులు గడిచే కొద్దీ నిరాశే మిగిల్చింది. వేట విరామం నగదు సాయం కోసం జిల్లాలో అధికారికంగా 3,500 బోట్లు, 21 మర పడవలపై ఆధారపడిన 15 వేల మంది మత్స్యకారులు నమోదు చేసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ విధిగా ఉండాలని మెలిక పెట్టి ఆంక్షలు విధించడంతో రెండేళ్లుగా దాదాపు 10 వేల మందికి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వేట విరామంలో ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించి ఉంటే మత్స్యకారులకు కొంత మేర ఉపయోగపడేది. కానీ రెండేళ్లుగా ఒక్కపైసా కూడా అందకపోవడం, వేట సజావుగా సాగకపోవడంతో మత్స్యకారులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తీర గ్రామాల్లోని ముఖద్వారాల వద్ద పూడిక తీత పనులకు చర్యలు చేపట్టాలని జిల్లాలోని మత్స్యకారులు కోరుచున్నారు. నెల రోజులుగా వేట లేదు సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో నెల రోజులుగా వేట చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని అనేకసార్లు జిల్లా కలెక్టర్‌కు, ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. తూపిలిపాళెం, కొండూరుపాళెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు చందాలు వేసుకుని రూ. 5 లక్షలు వ్యయంతో పూడిక తీయిస్తున్నారు. – మేలంగారి పోలయ్య, కాపు కొండూరుపాళెం రెండేళ్లుగా డబ్బులు రావడం లేదు రేషన్‌కార్డు, ఆధార్ కార్డులను అధికారులు తప్పులుగా ఉన్నాయంటూ మెలిక పెట్టి రెండేళ్లుగా వేట విరామం డబ్బు ఇవ్వడం లేదు. నిజంగానే ఆధార్, రేషన్ కార్డులు తప్పులుగా ఉంటే తమకు రేషన్, పింఛన్, బ్యాంక్, తదితర లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం, పాలకపక్షాన ఉన్న అధికారులు ఆడుతున్న నాటకం మాత్రమే. గత ప్రభుత్వంలో వేట విరామం నగదు సకాలంలో అందేది. – కె. రాజు, మత్స్యకారుడు, కొండూరుపాళెం సముద్ర ముఖద్వారాల పూడిక పనులపై ప్రభుత్వానికి నివేదించాం ఇసుక మేటలతో పూడిపోయిన సముద్ర ముఖద్వారాల పూడిక పనుల విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. పూడికతీత పనులు వేల రూపాయలతో జరిగేవి కావు. రూ.లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. – కె రమేష్‌బాబు, ఎఫ్డీఓ -
స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళన
సాక్షి, నెల్లూరు : పోలీసులు అకారణంగా తమపై దాడి చేశారంటూ గిరిజనులు చేపట్టిన ఆందోళన సంగంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. నెల్లూరు జిల్లా సంగం పరిధిలోని నీలగిరి జలాశయం వద్ద రోజు మాదిరిగానే గిరిజజన మత్సకారులు చేపల వేటకు వెళ్ళారు. అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు.. మత్సకారులను తరిమేసే ప్రయత్నం చేశారు. దీంతో మత్సకారులకు పోలీసులకు గొడవ మొదలైంది. ఏ కారణం లేకుండా పోలీసులు కొట్టడంతో గిరిజనులు తిరగబడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు 8 మందిని మత్స్యకారులను అరెస్టు చేసి సంగం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. దీనిపై స్థానిక గిరిజన మహిళలు స్టేషన్ ముందు ఆందోళకు దిగారు, ఏ కారణం లేకుండానే వారిని కొట్టారని ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న మత్సశాఖ అధికారిని వెంటనే పోలీసు స్టేషన్‌కు రావడంతో పోలీసులు అతడిని కూడా అడ్డుకున్నారు. -
ట్యూన్..అయ్యేనా?
ఒంగోలు టౌన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మత్స్యకారులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సాధారణంగా పది నుంచి పదిహేను కిలోమీటర్ల లోపలికి వెళ్లి వేట సాగిస్తే చేపలు ఎక్కువగా పడుతుంటాయి. ప్రస్తుతం ఎంతసేపు వేట సాగించినా చేపలు తక్కువగానే పడుతున్నాయి. కొంతమంది మత్స్యకారులు అనుమతికి మించి సముద్రం లోపలికి వెళ్లి వేట సాగిస్తున్నారు. డీప్ సీలోకి వెళ్లి వేటాడుతున్నారు. డీప్ సీలో ట్యూనా చేపలు ఎక్కువగా పడుతుంటాయి. వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. చైనా, జపాన్ దేశాలకు భారత్ నుంచి ట్యూనా చేపలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ట్యూనా చేపలు భారత కరెన్సీ ప్రకారం చూస్తే కేజీ వెయ్యి రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇంతటి డిమాండ్ ఉన్న ట్యూనా చేపలు పట్టుకునేందుకు మత్స్యకారులు సాహసం చేస్తున్నారు. డీప్ సీలోకి వెళ్లి వేట సాగించాలంటే ప్రస్తుతం మత్స్యకారులు ఉపయోగిస్తున్న పడవలు అనుకూలించవు. ఆదాయం కోసం మత్స్యకారులు సాహసం చేస్తూ డీప్ సీలోకి వెళ్లి ట్యూనా చేపలు పట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డీప్ సీలోకి వెళ్లి ట్యూనా చేపలు పట్టుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్ బోట్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నిజాంపట్నంలోనే స్టీల్ బోట్లు ఉన్నాయి. ఎంతో ఖరీదైన ఈ స్టీల్ బోట్లను మత్స్యకారులకు రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంత జిల్లాలకు యూనిట్లు కేటాయించింది. అందులో భాగంగా జిల్లాకు 20 యూనిట్లను కేటాయించింది. ఒక్కో స్టీల్ బోటు 70 నుంచి 80 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ స్టీల్ బోటును 40 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందించాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం మత్స్యకారులు గ్రూపుగా ఏర్పడి తమ సొంత డబ్బుతో లేదా బ్యాంకు రుణంగా పొందేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇంత వరకూ ఒక్క యూనిట్‌ను కూడా మంజూరు చేయలేదు. కాగితాలపైనే యూనిట్లు కదులుతూ ఉండటం గమనార్హం. విషయం తెలుసుకొన్న కొంతమంది మత్స్యకారులు మత్స్యశాఖ అధికారులను స్టీల్ బోట్ల విషయమై అడుగుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో వారు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. -
ఇదేం అ'న్యాయం'!
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న సమయం.. సందర్భం.. పక్కనే కొనసాగుతున్న మత్స్యకారుల దీక్షలను పట్టించుకోకపోవడం ఇప్పుడు వివాదానికి తావిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి వారమైంది. ఇన్నాళ్లూ నోరుమెదపని వాసపల్లి ఈరోజే పనిగట్టుకొని కొంతమందిని వెంటేసుకొచ్చి నిరసన పేరుతో కాసేపు హడావుడి చేశారు.. ఆ పక్కనే తన సామాజికవర్గీయులే ఎస్టీ జాబితాలో చేర్చాలని 43 రోజులుగా చేస్తున్న దీక్షలను మాత్రం ఆయనగారు పట్టించుకోలేదు.. కనీసం శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు.. బడ్జెట్ కేంద్రం పరిధిలోనిది.. తనకు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఏదో చేశానన్న మెహర్బానీ కోసం నిరసన తెలిపిన ఎమ్మెల్యే.. రాష్ట్ర పరిధిలోని అంశమైన మత్స్యకారుల ఎస్టీ సాధన డిమాండ్‌ను పట్టించుకోకపోవడం.. సీఎంను ఒప్పించ లేకపోవడం.. దీక్షలను ఉపేక్షించడంపై నిరసన వ్యక్తమవుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గంలోనే మత్స్యకార జనాభా ఎక్కువగా ఉన్నా.. ఎమ్మెల్యే వాసుపల్లి అంటీముట్టనట్లు వ్యవహరించడం చర్చలకు తావిచ్చింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా బుధవారం నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తనదైన శైలిలో నిరసన చేపట్టిన ఎమ్మెల్యే.. ఆ పక్కనే ఉన్న మత్స్యకారుల దీక్షా శిబిరం వైపు తొంగిచూడకపోవడం విమర్శలపాలవుతోంది. తమను ఎస్టీ జాబితాలో చేర్పించాలంటూ పార్టీలకతీతంగా మత్స్యకారులు గత డిసెంబర్ 27 నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో దీక్షాశిబిరం జోలికి వెళ్లని వాసుపల్లి.. సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడు మాత్రం ఏదో చేశానని చెప్పుకోవడానికి మత్స్యకార నాయకులను ఆయన వద్దకు తీసుకుని వెళ్లారు. కానీ సీఎం అందరి ముందు వాసుపల్లిని చెడామడా తిట్టేశారు. ఆయనతోపాటు మత్స్యకార నేతలపైనా బాబు విరుచుకుపడ్డారు. కనీసం వినతిపత్రం కూడా తీసుకోకుండా ‘తొక్క తీస్తా.. బ్లాక్మెయిల్ రాజకీయాలు నా వద్ద చేస్తున్నారా’.. అంటూ వాసుపల్లి ముందే మత్స్యకారులపై మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌తో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మత్స్యకారులపై సీఎం అలా మాట్లాడినా వాసుపల్లి ఏమీ స్పందించలేని పరిస్థితిలో మిన్నకుండిపోయారు. ఆ ఘటన దరిమిలా వాసుపల్లి మత్స్యకారుల దీక్షాశిబిరం జోలికి వెళ్లలేదు. పోలీసులు వేధిస్తున్నా.. పట్టించుకోని ఎమ్మెల్యే మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత దీక్షలతో నిరశన తెలియజేస్తున్న మత్స్యకారులపైకి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీక్షలకు అనుమతి లేదంటూ శిబిరాన్ని ఎత్తివేయాలని గత రెండు రోజులుగా నేతలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకారుల దీక్షలు భగ్నం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ అనుకూల కుట్రదారులు దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. అటువంటి ఘటనలు ఇక్కడా చోటుచేసుకోవచ్చన్న నెపంతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వాస్తవానికి అటువంటి పరిస్థితి విశాఖలో లేదు. గత 43రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రశాంతంగానే దీక్షలు కొనసాగుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఓ విధంగా మత్స్యకార నేతలను వేధిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులకు అండగా నిలవాల్సిన వాసుపల్లి అస్సలు పత్తా లేకుండా పోయారు. బుధవారం బడ్జెట్‌పై నిరసన చేపట్టిన సందర్భంగానైనా పక్కనే ఉన్న మత్స్యకారుల శిబిరం వద్దకు వస్తారని అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యే అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలపాలవుతోంది. వాసుపల్లి తీరు గర్హనీయం ఓ వైపు పగపట్టిన విధంగా ప్రభుత్వ తీరు.. పోలీసుల ఆంక్షలతో నిరసనకారులు అల్లాడిపోతుంటే కనీసం దీక్షా శిబిరం వద్దకు రావాలన్న కనీస స్పృహ కూడా ఎమ్మెల్యే వాసుపల్లికి లేకపోయిందని వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు విమర్శించారు. న్యాయమైన డిమాండ్‌తో గంగపుత్రులు 43 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యేగా, మత్స్యకార వర్గీయునిగా ఉన్న వాసుపల్లి ఏమాత్రం పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. తీరిక లేదేమో దీక్షా శిబిరం వైపు తొంగిచూడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరుపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మత్స్యకార సంఘం నేత నీలకంఠం వ్యాఖ్యానించారు. బహుశా ఆయనకు తీరిక లేదేమో.. అందువల్లనే వచ్చి ఉండరు.. అని వ్యంగాస్త్రం సంధించారు. -
గంగపుత్రుల సర్వే
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో మత్స్యకారుల లెక్క తేలనుంది.. గంగపుత్రుల సంక్షేమం కోసం జాతీయ మత్స్య సహకార ఫెడరేషన్ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేక సర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే సబ్సిడీ, రాయితీ, బీమా పరిహారం వంటివి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా మత్స్యకారుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు జిల్లాలో సర్వే చేస్తున్నాయి. మత్స్యకారుల బీమా వంటి ప్రత్యేక పథకాలను కేంద్రం ఈ ఫెడరేషన్ ద్వారా అమలు చేస్తోంది. ఉదాహరణకు ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే అందించే బీమా పరిహారాన్ని ఇప్పటివరకు కుటుంబసభ్యులకు చెక్కుల రూపంలో చెల్లిస్తోంది. ఈ చెక్కులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా మత్స్యశాఖ అధికారులకు వచ్చేవి. వాటిని జిల్లా మత్స్యశాఖ అధికారులు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ఇకపై ఇలాంటి పథకాల లబ్ధిని నేరుగా మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా అధికారులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక బృందాలు.. జిల్లాలో 260 మత్స్య సహకార సంఘాలుండగా, సుమారు 16 వేల మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో దాదాపు 1,400 మంది జలాశయ మత్స్యకారులు. వీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, బ్యాక్వాటర్లలో చేపలు వేటాడతారు. ఇలా 16 వేల మంది మత్స్యకారులకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను జిల్లాకు పంపింది. జిల్లా మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది సహాయంతో ఈ బృందాలు మత్స్యకారుల వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కో మత్స్యకారుడికి సంబంధించి మొత్తం 21 అంశాలను నమోదు చేసుకుంటున్నారు. పేరు, వయస్సు, తండ్రి పేరు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు సహకార సంఘంలోని సభ్యత్వానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నారు. సంఘం పేరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఎన్ని సంవత్సరాలుగా వృత్తిలో ఉన్నారు.. చేపలు పడుతున్న చెరువు పేరు, ఆ చెరువుకు ఆధారమైన నీటి వనరుల వివరాలు, మత్స్యకారుడి బ్యాంకు ఖాతా, ఆధార్ వంటి వివరాలను సేకరిస్తున్నారు. అయితే, జిల్లాలో ఇప్పటికే చాలా మంది మత్స్యకారుల వివరాలు మత్స్యశాఖ అధికారుల వద్ద ఉన్నాయి. ఈ వివరాలు నమోదు కాని వారి వివరాలను ఈ సర్వే బృందాలు సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని అంతా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తున్నారు. కాగా జాతీయ మత్స్య సహకార ఫెడరేషన్ ద్వారా మత్స్యకారులకు వృత్తి నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ వంటి పథకాల అమలు చేస్తోంది. ఈ సర్వే వివరాలను సేకరించడం ద్వారా పథకాల లబ్ధి నేరుగా మత్స్యకారునికి అందించవచ్చని ఆ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. సర్వే పూర్తవుతోంది.. మత్స్యకారుల సర్వే జిల్లాలో పూర్తి కావస్తోంది. మా శాఖ ఎఫ్‌డీవోలు, ఇతర సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలు వివరాలను సేకరిస్తున్నాయి. ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా మత్స్యకారులకు అందించేందుకు వీలుంటుంది. – మహిపాల్, జిల్లా మత్స్యశాఖాధికారి