five star hotel
-
స్టార్ హోటల్ బాల్కనీలో ఎండకు బట్టలు : అయితే ఏంటట? వీడియో వైరల్
నగరాల్లోని అపార్టమెంట్లలో ఉండేవాళ్లు బట్టలు బాల్కనీలోనే ఆరేసుకోవాలి తప్పదు. కానీ స్టార్ హోటల్ అయినా, లగ్జరీ హోటల్ అయినా హోటల్‌కి వెళ్లినపుడు, తడి బట్టలు ఎక్కడ ఆరేయాలి. ఇది టూర్లలో, ప్రతీ తల్లికి ఉండే ఇబ్బందే. (ఎందుకంటే బట్టలు ఆరేయడం గురించి మగవాళ్లు పెద్దగా పట్టించుకోరు కాబట్టి) అయినా తప్పదు ఆరేయ్యాలి కదా.. తడి బట్టలు అలాగే పట్టుకెళ్లలేం. ముక్కి, వాసన వస్తాయి అందుకేనేమో దుబాయ్ వెళ్లిన ఒక తల్లి బట్టలు ఆరేయడం ఇంటర్నెట్లో చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టోరీ ఏంటంటే..ఇండియాకు చెందిన ఒక కుటుంబం దుబాయ్‌లో విహార యాత్రకు వెళ్లింది. అక్కడ అత్యంత ప్రసిద్దమైన, విలాసవంతమైన ‘అట్లాంటిస్, ది పామ్’ హోటల్లో దిగారు. అక్కడ పొద్దున్నే బాల్కనీలో మహిళ దుస్తులు ఆరేసింది. తన తల్లి బట్టలు ఆరేసిన వీడియోను పల్లవి వెంకటేశ్ అనే యువతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘పొద్దున్నే అమ్మ పని ఇది’ అంటూ ఫన్నీగానే వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎక్కడైనా అమ్మ.. అమ్మే..తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోదు అని కొందరు కామెంట్ చేశారు. హాటల్లో అలా చేయడం మర్యాద కాదని కొందరు, ఈ అమ్మలు ఇంతే మారరు అని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pallavi Venkatesh (@iam.pallavivenkatesh) అయితే హోటల్ యాజమాన్యం స్పందన విశేషంగా నిలిచింది. తల్లి బాధ్యతలు అని కామెంట్ చేసింది. అలాగే దుస్తులు ఆరేసుకునేందుకు ప్రతి బాత్రూంలో డ్రైయింగ్ త్రాడును చేర్చుతాం తద్వారా అక్కడే దుస్తులను ఆరబెట్టుకోచ్చు అనే కూడా వివరణ ఇచ్చారు. ఏడు రోజుల కిందట పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 12 మిలియన్ల వ్యూస్‌ను, లక్షకు పైగా లైక్స్‌ను దక్కించు కోవడం విశేషం. -
లిటిల్ స్టార్స్ ఇన్ ఫైవ్‌స్టార్
ఒక వ్యక్తి కొంత మంది పిల్లలను ఫైవ్‌స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లి వారికి ఇష్టమైన పదార్థాలు తినిపించిన వీడియో వైరల్ అయింది. ఆ పిల్లలకు ఈయన తండ్రి కాదు. కనీసం దూరపుచుట్టం కాదు. వీరు వీధిబాలలు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో 39 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. కవల్చాబ్ర అనే వ్యక్తి కారు ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయినప్పుడు కొందరు పిల్లలు కారు అద్దాలను తుడవడం మొదలు పెట్టారు. వారిని చూడగానే చాబ్రకు ‘అయ్యో!’ అనిపించింది. వెంటనే పిల్లలను కారులో కూర్చోబెట్టుకొని ఫైస్టార్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ వైరల్ వీడియో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తోంది. -
బిల్లు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే!
ఫైవ్ స్టార్ హోటల్ అంటేనే విలాసవంతమైన వసతులకు కేరాఫ్ అడ్రస్. విశాలమైన గదులు, హై క్లాస్ ఫుడ్, కళ్లు చెదిరే స్మిమ్మింగ్ ఫుల్ ఇలా ప్రతి ఒక్కటి లగ్జరీస్‌గా ఉంటాయి. సామన్యులు ఈ హోటల్లో ఉండటం ఎంతో ఖరీదైన వ్యవహారం. ఒక్క రోజు ఇక్కడ బస చేయాలన్న లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి దాదాపు రెండేళ్లుగా ఫైవ్ స్టార్ హోటల్లోనే గడిపాడు. అది కూడా బిల్లు చెల్లించకుండ.. వినడానికి కొంచెం ఆశ్యర్యంగా అనిపించినా ఈ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఎరోసిటీలో రోసేట్ హౌస్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. అయితే ఆ హోటల్ సిబ్బందితో కుమ్మక్కై రెండేళ్లపాటు ఓ వ్యక్తి ఎలాంటి బిల్లు కట్టకుండా ఉండటంతో రూ. 58 లక్షల నష్టం వాటిల్లిందని సదరు హోటల్ యాజమాని వినోద్ మల్హోత్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అంకుశ్ దత్తా అనే వ్యక్తి 2019 మే 30న ఒకరోజు నిమిత్తం హోటల్లో దిగాడు. మరుసటి రోజు ఖాళీ చేయాల్సి ఉంది. కానీ దాన్ని ఆయన 2021 జనవరి 22 వరకు పొడిగించుకుంటూ వచ్చాడు. మొత్తం 603 రోజులు ఉన్నాడు. చివరకు బిల్లు చెల్లించకుండానే తప్పించుకోవడంతో అతను హోటల్‌కు రూ.58 లక్షలు బకాయిపడ్డాడు. ఆడిట్లో రికార్డుల తనిఖీల సందర్భంగా ఇటీవల ఈ మోసం బయటపడింది.హోటల్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి బిల్లు చెల్లించకుండా 72 గంటలకు పైగా ఉంటే. ఆ విషయాన్ని వెంటనే సిబ్బంది హోటల్ సీఈఓ, ఫైనాన్షియల్ కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పై స్థాయికి అధికారులకు తీసుకెళ్లలేదని సదరు వ్యక్తి వెల్లడించారు. చదవండి: ఇదేంటండీ..! ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు చేస్తారా..? అయితే హోటల్ సిబ్బంది కొంతమంది అంకుశ్ దత్తాకు సహకరించినట్లు హోటల్ ప్రతినిధి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రేమ్ ప్రకాష్, మరి కొందరు కలిసి హోటల్ గదులను యాక్సెస్ చేసే సాఫ్ట్వేర్ సిస్టమ్‌ను మార్చి, అకౌంట్స్‌లో భారీ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. హోటల్ నిబంధలు ఉల్లంఘించి దత్తాను హోటల్లో బస చేయించాడని ఆరోపించారు. దీనికి ప్రకాష్, దత్తా నుంచి కొంత మొత్తంలో నగదు పొంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం మొత్తంలో ప్రేమ్ ప్రకాష్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ప్రకాష్ మే 30 2019 నుంచి అక్టోబరు 25 2019 వరకు ఎలాంటి పేమెంట్ రిపోర్ట్లు చేయలేదని అయితే అక్టోబరు 25 తర్వాత అతను దత్త బాకీ ఉన్న పేమెంట్ రిపోర్ట్‌ను రూపొందించినప్పుడు కావాలనే ఇతర పెండింగ్ బిల్లులతో కలిపి రిపోర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే బిల్లులను ఫోర్జరీ చేసి నిందితుడికి అనుకూలంగా అనేక నకిలీ బిల్లులను సృష్టించినట్లు చెప్పారు. అయితే దత్తా మూడు వేర్వేరు తేదీల్లో మూడు సార్లు వరుసగా రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షలు విలువ చేసే చెక్కులను ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ, అవి బౌన్స్ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కూడా ప్రకాశ్ దాచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో హోటల్ ప్రతినిధి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..నేరం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు.. -
అరబ్ ఎమిరేట్స్ అధికారి రేంజ్లో కలరింగ్.. చివరికి బిల్లు కట్టకుండా..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ప్రభుత్వాధికారిలా నటించి ఓ ఫైస్టార్ హోటల్‌నే మోసం చేశాడు. ఈఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాధికారిలా నటించి దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ లీలా హోటల్ ఫ్యాలస్ అనే ఫైస్టార్ హోటల్లో బస చేశాడు. ఆ హోటల్ మేనేజర్ అనుపమదాస్ గుప్తాకి ఒక నకిలీ బిజినెస్ కార్డుని చూపించి దాదాపు మూడు నెలలు పాటు అక్కడే ఉన్నాడు. అతను ఆగస్టు1, 2022 నుంచి నవంబర్ 20, 2022 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నటుండి హోటల్ బిల్ చెల్లించకుండా ఆ హోటల్లో ఉన్న విలువైన వస్తువులను దొంగలించి పరారయ్యాడు. అతను సుమారు రూ. 23 లక్షల బిల్లు కట్టకుండా పరారయ్యాడు. దీంతో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడు గురించి తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి కర్ణాటకలోని దక్షిణ కన్నడకు చెందిన 41 ఏళ్ల మహ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. అతను సమర్పించిన చెక్కు కూడా బౌన్స్ అయ్యిందని, అతను ఉద్దేశపూర్వకంగానే హోటల్ని మోసం చేసేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందని పోలీసలు వెల్లడించారు. (చదవండి: షాకింగ్ ఘటన: కారుతో ఢీకొట్టి..ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...) -
మసాలా.. అదిరింది
సాక్షి, అమరావతి: ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ.. తాజాగా రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేయనుంది. సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి, వేగంగా విస్తరించింది. సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో రేపు సీఎం పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఉదయం 9.40 – 10.35 గంటల మధ్య ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. ఈ కళాశాల ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం 1.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
Maharashtra Crisis: గౌహతి హోటల్లో రెబల్ ఎమ్మెల్యేల ఖర్చెంతో తెలుసా?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే క్యాంపు రాజకీయాలకు తెరలేపిన విషయం తెలిసిందే. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగాలని, బీజేపీతో జట్టు కట్టాలని ఏక్నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నారు. అయితే గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా 24 గంటల్లో ముంబై వచ్చి సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చిస్తే ఎమ్వీఏ కూటమి నుంచి వైదొలిగే ఆలోచన చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. 70 గదులు బుకింగ్ దాదాపు 42 ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ప్రస్తుతం గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తున్నారు. హోటల్ పేరు రాడిసన్ బ్లూ. ఆ హోటల్లో మొత్తం 196 గదులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఏడు రోజులకుగానూ 70 గదులు బుక్ చేసుకున్నట్లు హోటల్ వర్గాలు, స్థానిక రాజకీయ నాయకుల ద్వారా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు తొలుత బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ హోటల్లో బస చేశారు. అనంతరం మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలోని గౌహతికి బుధవారం మకాం మార్చారు. చదవండి: Maharashtra Political Crisis: హాట్ టాపిక్‌గా మారిన నెంబర్ గేమ్! రోజుకు రూ. 8 లక్షలు రాడిసన్ బ్లూ హోటల్లోని 70 గదులకు ఏడు రోజులకు రూ. 56 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అంటే ఒక్క రోజు గది, ఆహారం ఇతర అవసరలకయ్యే ఖర్చు రూ.8 లక్షలు అన్నమాట. అయితే హోటల్లోని మొత్తం 196 గదుల్లో ఇప్పటికే 70 బుక్ చేసుకోవడంతో ఇక ఎమ్మెల్యేలకు కొత్తగా రూమ్‌లు కేటాయించేది లేదంటూ హోటల్ యాజమాన్యం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. హోటల్లోని బాంక్వేట్ హాల్‌ను కూడా మూసేసింది. హోటల్లో బస చేసే వారికి మినహా రెస్టారెంట్ కూడా మూసివేశారు. మరి ఆ ఖర్చుల సంగతేంటి? ఇవే కాక మొత్తం ‘ఆపరేషన్’ ఖర్చులో చార్టర్డ్ ఫ్లైట్లు, ఇతర రవాణా ఖర్చుల సంగతేంటి అనేది కూడా తెలీదు. అంతేగాక హోటల్లో ఉంటున్న ఎమ్మెల్యేల ఖర్చు తడిచి మోపడవుతోంది. మరి వీటన్నింటిని ఎవరూ చెల్లిస్తున్నారనేది కూడా ప్రశ్నర్థకమే. అయితే అసోంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అండ్ రాడిసన్ దగ్గర అసోం బీజేపీ మంత్రులే పహారా కాస్తున్నారు. దీంతో క్యాంపు ఖర్చంతా కమలం ఖాతాలోనే పడే అవకాశాలూ లేకపోలేదు. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: ప్రాణాలకు తెగించి కాపాడాడు.. కొంచెం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగేదో.. ఇదిలా ఉండగా గౌహతి హోటల్ నుంచి తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకారం ఏక్నాథ్ షిండే వర్గంలో ప్రస్తుతం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే గురువారం ఉదయం తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిత్య ఠాక్రేతో సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. దీంతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. -
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
పాకిస్తాన్ క్రికెటర్లకు ఘోర అవమానం.. హోటల్ నుంచి గెంటేశారు!
పాకిస్తానీ క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫీ ఫైనల్లో బాగంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తున్న ఆటగాళ్లను ఉన్నపళంగా హోటల్ నుంచి సిబ్బంది ఖాళీ చేయించారు. దీంతో ఆటగాళ్లు లగేజితో రోడ్డున పడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫి ఫైనలిస్ట్‌లు ఫన్ఖుత్వా, నార్తరన్ జట్లు క్లబ్ రోడ్డులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తున్నాయి. ఈ ఆటగాళ్ల కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిసెంబర్22 వరకు మాత్రమే హోటల్‌ను బుక్ చేసింది. తదపరి బుకింగ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడ్వాన్స్ చెల్లించలేదు. అయితే, ముందు చెప్పిటన్లు కాకుండా... జట్టుసభ్యులు సంఖ్య ఎక్కువగా ఉండండంతో మునపటి బుకింగ్‌ను రద్దు చేసిన తరువాతే కొత్త బుకింగ్ చేస్తామని ఆ హోటల్‌కు బోర్డు తెలిపినట్లు సమాచారం. ఆ తరువాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, హోటల్ మేనేజ్మెంట్ మధ్య ఎలాంటి సంప్రదింపులు జరుగలేదు. కానీ.. పీసీబీ మాత్రం తమ బుకింగ్‌లను హోటల్ ధృవీకరించబడినట్లు భావించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య సమాచార, సమన్వయ లోపం కారణంగా ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. లగేజీతో రోడ్డు మీద వేచిచూడాల్సిన దుస్థితి వచ్చింది. చదవండి: IPL 2022- SRH: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ -
పట్టాలెక్కనున్న ఫైవ్ స్టార్ హోటల్.. దేశంలో తొలిసారి ఇలా
గాంధీనగర్: దేశంలో తొలిసారిగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కబోతుంది. ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కడమేంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది చదవండి. గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్‌ను భారత రైల్వేశాఖ కొత్త హంగులతో సుందరీకరిస్తుంది. ఇందులో భాగంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ను పట్టాలపై నిర్మించాలని ఓ వినూత్న ఆలోచన చేసింది. దేశంలో తొట్టతొలిసారి నిర్మించ తలపెట్టిన ఇలాంటి ప్రాజెక్ట్‌ను భారతీయ రైల్వేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. ఈ ఫైవ్ స్టార్ హోటల్‌ను లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. మూడు టవర్లుగా నిర్మించే ఈ హోటల్లో మొత్తం 300 గదులు ఉండనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ఈ ఐదు నక్షత్రాల హోటల్ కింద రైళ్లు తిరుగుతున్నా ఎలాంటి ప్రకంపనలు కానీ శబ్దాలు కానీ హోటల్లో ఉన్న వారికి వినిపించకుండా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజానికి అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులు సాధారణమే అయినా.. భారత్‌లో మాత్రం రైలు పట్టాలపై ఇదే తొలి ఫైవ్ స్టార్ హోటల్ అని వెల్లడించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. -
బిల్లు చూసి ‘గుడ్లు’ తేలేసిన రచయిత..!
ముంబై : రెండు అరటి పండ్లకు ఏకంగా రూ.443 బిల్లు వసూలు చేసి చంఢీగడ్‌లోని మారియట్ హోటల్ వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ట్విటర్లో ఈ విషయం పంచుకోవడంతో ఎక్సైజ్-పన్నుల శాఖ స్పందించింది. జీఎస్టీ పరిధిలోకి రాని అరటిపండ్లపై జీఎస్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.25వేల జరిమానా విధించింది. ఇక ఈ సంఘటన మరువక ముందే ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ ఘనకార్యం బయటపడింది. రెండు కోడిగుడ్లకు సదరు హోటల్ ఏకంగా రూ.1700 వసూలు చేసిందని ‘ఆల్ ద క్వీన్స్ మెన్’ పుస్తక రచయిత కార్తీక్ దార్ ట్విటర్లో పేర్కొన్నాడు. రాహుల్ బోస్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘నిరసన వ్యక్తం చేద్దామా భాయ్..!’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వ్యవహారంపై హోటల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఇక ఈ ట్వీట్‌పై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ‘గుడ్డుతో పాటు బంగారం కూడా ఇచ్చారా’ అని ఒకరు.. ‘చికెన్ తినాలంటే సంపన్న కుటుంబంలో మాత్రమే జన్మించాలా’అని మరొకరు కామెంట్ చేశారు. ఇక రెండు ఎగ్ ఆమ్లెట్లకు కలిపి ఫోర్ సీజన్స్ రూ.1700 బిల్ చేయడం గమనార్హం. -
బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!
చంఢీగర్ : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్యుడు వాటివంక కన్నెత్తి చూడాలంటేనే వణికిపోతున్నాడు. జేబుకు చిల్లు పడుతుందేమోనని జాగ్రత్త పడుతున్నాడు. సంపన్నులకు అలాంటిదేం ఉండదు. ఎంతంటే అంత పెట్టి కొంటారు. అయితే, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు మాత్రం ఓ ఫైవ్‌స్టార్ హోటల్ ఊహించని షాక్ ఇచ్చింది. జిమ్ చేసిన అనంతరం రెండు అరటి పండ్లు ఆర్డర్ ఇచ్చిన అతను బిల్ చూసి కళ్లు తేలేశాడు. రెండు బనానాలకు ఏకంగా రూ.443 బిల్ చేశారు. ‘పండ్లు కూడా చెడు చేస్తాయనడానికి ఇదే ఉదాహరణ. ఇంత ధరపెట్టి కొంటే బాధగా ఉండదా..!’ అని ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వాటిపై జీఎస్టీ కూడా వేశారని పేర్కొన్నాడు. బోస్ ట్వీట్‌పై కొందరు కామెంట్లు చేశారు. తాజా పండ్లపై జీఎస్టీ వేయడం అన్యాయమని ఒకరు.. పట్టపగలే దోచేస్తున్నారని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయినా, భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ఆ హోటల్ ఉండటమెందుకు.. వేరొక లగ్జరీ రూమ్‌లోకి షిఫ్ట్ కావొచ్చు కదా’ అని ఇంకొకరు బోస్కి సలహా ఇస్తున్నారు. ‘సినిమా హాళ్లలో కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. టికెట్లు, పాప్‌కార్న్‌కు భారీగా వసూలు చేస్తున్నారు. నువ్ మరో హోటల్‌కి మారడం మంచిది. అరటి పండ్లు బయట కూడా దొరుకుతాయి. అక్కడ కొనుక్కో’అని ఇంకో అభిమాని సూచించాడు. దిల్ దడ్కనే దో, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, ది జపనీస్ వైఫ్, విశ్వరూపం-2 సినిమాల్లో బోస్ నటించారు. You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB — Rahul Bose (@RahulBose1) July 22, 2019 -
పాక్‌లో హోటల్‌పై దాడి
కరాచీ: పాకిస్తాన్‌లోని తీరప్రాంత నగరం గ్వదర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రఘటనలో హోటల్ సెక్యూరిటీ గార్డు, ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. శనివారం సాయంత్రం పెర్ల్ కాంటినెంటల్ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద ముగ్గురు సాయుధ దుండగులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ హోటల్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డగించిన హోటల్ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపారు. వెంటనే స్పందించిన ప్రత్యేక బలగాలు ఉగ్రవాదులతో హోరాహోరీ తలపడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో హోటల్లోని కొందరు సందర్శకులు, సిబ్బంది గాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడి ఘటనకు తమదే బాధ్యతంటూ నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ శనివారం ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో వెంటనే హోటల్లో ఉన్న విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న గ్వదర్..పాక్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతం. వేలాది కోట్ల రూపాయల చైనా నిధులతో ఇక్కడ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల ఏప్రిల్ 18వ తేదీన ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. -
మెక్సికన్లపై హోటల్ మేనేజర్ అత్యాచారయత్నం
జైపూర్ : మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని తాజాగా థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వే వెల్లడించడంతో దేశం పరువు అంతర్జాతీయంగా మసకబారింది. మరోవైపు భారత్ పర్యటనకు వచ్చిన విదేశీ మహిళలపై బుధవారం లైంగికదాడి యత్నం జరగడంతో దేశంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమేనన్న వాస్తవం కళ్లకు కట్టినట్టయింది. వివరాలు.. పింక్ సిటీ (జైపూర్) పర్యటనలో ఉన్న ఇద్దరు మెక్సికన్ మహిళలు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో దిగారు. హోటల్ జనరల్ మేనేజర్ రిషిరాజ్ సింగ్(40) బుధవారం రాత్రి వారి గదిలోకి చొరబడి అత్యాచార యత్నం చేశాడని పోలీసులు తెలిపారు. అతని బారి నుంచి తప్పించుకున్న సదరు మహిళలు హోటల్ సిబ్బంది సాయంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు, ఘటనా ప్రదేశంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు రిషిరాజ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని జైపూర్ (దక్షిణ) డీసీపీ వికాస్ పాటక్ వెల్లడించారు. -
పోలీసునని మోడల్ని సర్వం దోచాడు
ముంబయి: ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేసే వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ మోడల్ మోసపోయింది. నమ్మి అతడి వద్దకు వెళితే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా డబ్బు బంగారం దోచుకున్నాడు. మరో లక్ష రూపాయలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తాను తీసిన ఫొటోలు, వీడియోలు బయటపెడతానని అన్నాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఎంబీఏ పూర్తి చేసిన సుదీప్ బిశ్వాల్ అనే యువకుడు ముంబయిలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేస్తున్నాడు. తాను ఓ మంచి మోడల్ కోసం వెతుకుతున్నానని, ఇంటర్వ్యూకు రావాలని ఒక మోడల్ కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతడి వద్దకు వెళ్లగానే వణికిపోయేలా చేశాడు. తాను ఒక పోలీసు అధికారినని పరిచయం చేసుకున్నాడు. 'మోడల్ ముసుగులో ఉన్న నువ్వు చాలా కాలంగా వ్యభిచారం చేస్తున్నావని నా వద్ద సమాచారం ఉంది. మంచితనంగా నేను చెప్పింది చేయ్. నీ దగ్గరున్న డబ్బు నగలు నాకు ఇచ్చేయ్' అని అన్ని తీసుకోవడంతోపాటు ఆ మోడల్ తో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా ఆమె అభ్యంతరకర ఫొటోలు తీశాడు. అనంతరం ఆమెకు అంతకు ముందు ఓ నటితో ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు లక్ష చెల్లించాలని, లేదంటే కటకటాలపాలు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు గత ఏప్రిల్ నెలలో అతడికి తన వద్ద ఉన్నవన్ని ఇచ్చేసింది. ఆ తర్వాత కూడా అతడు వేధించడం మొదలుపెట్టడంతో ఈ విషయం పోలీసులకు చేరవేయగా ట్రాప్ చేసి అతడిని చివరకు అరెస్టు చేశారు. -
'హవ్వా ఫైవ్ స్టార్ హోటల్లో నివాసమా'
హైదరాబాద్ : ఓ వైపు రాష్ట్రం ఆర్థికలోటుతో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో నివాసం ఉంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు (చదవండి....ఫైవ్ స్టార్ హోటల్లో చంద్రబాబు నివాసం) తక్షణమే స్టార్ హోటల్ బస నుంచి చంద్రబాబు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. దుబరా ఖర్చులు చేస్తూ చంద్రబాబు నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. 'కాపు భవనాలు, సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టాలని, మీరే జీవో విడుదల చేసి నాటకాడుతున్నది వాస్తవం కాదా?. మేధావులు, స్వామీజీలకు రాజకీయాలు అంటగట్టడం దారుణం. హామీలు అమలు చేయాలని వాళ్లు కోరితే అందుకు వైఎస్ జగన్‌ను నిందిస్తారా?. ముద్రగడ పద్మనాభంను విమర్శిస్తూ కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మినీ మహానాడు పేరుతోనూ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. అవి మినీ మహానాడులు కాదు...మనీ మహానాడులు. ఎన్నికల వాగ్దానాలపై చర్చించకుండా వైఎస్ జగన్‌ను దూషించడం సరికాదు.' అని అంబటి అన్నారు. -
ఈ సారైనా అమ్ముడవుతుందా?
మరోసారి అమ్మకానికి జీఎంఆర్ ఎయిర్పోర్ట్ హోటల్ - రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా సఫలం కాని ప్రక్రియ - గతంలో వచ్చిన రేటు ఇప్పుడు రాదంటున్న నిపుణులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘అసెట్ లైట్’ కార్యక్రమంలో భాగంగా జీఎంఆర్ గ్రూపు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌ను మరోసారి అమ్మకానికి పెట్టింది. ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్న ఈ హోటల్ విక్రయానికి... తాజాగా మరోసారి బిడ్డింగ్‌లను పిలవడంతో ఈ సారైనా జీఎంఆర్ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌కు (జీహెచ్ఐఏఎల్) 100 శాతం అనుబంధ సంస్థగా ఉన్న జీఎంఆర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ ‘నొవోటెల్’ పేరుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్వహిస్తోంది. సరైన ఆక్యుపెన్సీ లేక భారీ నష్టాలతో నడుస్తున్న ఈ హోటల్‌ను అమ్మాలని కంపెనీ బోర్డు 2013లో నిర్ణయం తీసుకుంది కూడా. అప్పటి నుంచి అనేకమార్లు అమ్మకానికి ప్రయత్నించినా ఇంత వరకు సఫలం కాలేదు. గతంలో జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో రూ.300 కోట్లకు కొనుగోలు చేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చినా... బోర్డులో సభ్యులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిడ్డింగ్ విధానంలో పారదర్శకత లోపించిందని, కనీసం రెండు దినపత్రికల్లోనైనా ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కంపెనీ హోటల్ విక్రయానికి సంబంధించి ప్రకటనలు జారీ చేసింది. తదనంతరం 12 సంస్థలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించాయి. హోటల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లేకుండా ఈ ప్రకటనలు జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు పూర్తి వివరాలతో మంగళవారం కొన్ని పత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. 305 గదులున్న హోటల్ కనీస బిడ్డింగ్ ధర రూ. 213.5 కోట్లుగా సంస్థ పేర్కొంది. కనీసం రూ.500 కోట్ల నెట్‌వర్త్ కలిగిన సంస్థలు సెప్టెంబర్ 8 లోగా బిడ్డింగ్ చేయొచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రియల్ ఎస్టేట్ ధరలు తగ్గడం, వాణిజ్య కార్యకలాపాలు సన్నగిల్లడంతో గతంలో వచ్చిన రేటు కూడా ఇప్పుడు రావడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. 2009లో ప్రారంభమైన ఈ హోటల్‌ను ‘నొవోటెల్’ పేరుతో ’ఏక్కర్ గ్రూపు నిర్వహిస్తోంది. -
ఫైవ్ స్టార్ హోటల్ సీజ్
హరిద్వార్: గంగా నదిని అపవిత్రం చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. పవిత్ర గంగా నదిని కాలుష్య కసారం చేస్తున్నందుకు హరిద్వార్ లోని రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ ను ఉత్తరాండ్ కాలుష్య నియంత్రణ బోర్డ్(ఎస్‌పీసీబీ) అధికారులు సీజ్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిబంధనలకు విరుద్ధంగా కాల్యుష్యాన్ని గంగా నదిలోకి వదులుతున్నందుకు ఈ చర్య తీసుకున్నామని ఎస్‌పీసీబీ రూర్కీ ప్రాంతీయ అధికారి అంకుర్ కాన్సాల్ తెలిపారు. ఎన్జీటీ నివేదిక ఆధారంగా పది రోజుల క్రితం నోటీసు ఇచ్చినా హోటల్ యాజమాన్యం పద్ధతి మార్చుకోలేదని ఎస్‌పీసీబీ కార్యదర్శి వినోద్ సింఘాల్ వెల్లడించారు. కాలుష్య కారకాల ఆధారంగా హోటళ్లను మూడు విభాగాలుగా ఎస్‌పీసీబీ వర్గీకరించింది. గంగా నదిని కాలుష్య రహితంగా, స్వచ్ఛంగా మార్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. -
పార్టీ మస్తీ..
సందర్భం ఏదైనా పార్టీ కామన్ సిటీలో. ఇంకా మాట్లాడితే... పార్టీ చేసుకోవాలంటే కారణం అసలు సందర్భమే అక్కర్లేదనేవారూ ఉన్నారు. హంగు, ఆర్భాటం, ప్లానింగ్... ఇవేమీ లేకుండానే ఎంచక్కా అంతా కలసి ఎంజాయ్ చేసేస్తుంటారు. రోడ్ సైడ్ బండి వద్దయినా... ఫైవ్‌స్టార్ హోటల్లో డిన్నరైనా... ఏదైనా పార్టీనే. చూస్తుంటే... నచ్చిన నలుగురితో కలిసి గడపడం కోసం హైదరాబాదీలు ఈ పార్టీ అన్న పదాన్ని ఇంతగా ఓన్ చేసుకుని ఉంటారనిపిస్తుంది. ఇంచుమించూ అలాంటి థీమ్‌తో వెలిసిందే ‘హైదరాబాద్ పార్టీ క్లబ్’... - ఓ మధు మూడేళ్ల కిందట హైదరాబాద్ పార్టీ క్లబ్ ప్రారంభమైంది. ప్రస్తుతం రెండొందల మంది సభ్యులున్నారు. దాదాపు వారం వారం ఏదో ఒక పార్టీ నిర్వహిస్తూనే ఉంటారు. ‘మీటప్ డాట్ కామ్’ ద్వారా ఈవెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎక్కువగా పబ్స్‌లో అంతా కలసి ఎంజాయ్ చేస్తుంటారు. మ్యూజిక్, డ్యాన్స్, గేమ్స్, ఫుడ్... ఇలా అన్నీ క్లబ్ పార్టీలో ఉంటాయి. ఐటీ, డాక్టర్స్, టాలీవుడ్ సెలబ్రెటీలు, ఆర్జేలు... నలుగురితో కలసి సరదాలను ఆస్వాదించాలనుకొనేవారెవరైనా ఈ క్లబ్ మెంబర్ కావచ్చు. ‘క్లబ్ ఆరంభం నుంచి ఇందులో సభ్యుడిగా ఉన్నా. ఇందులో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కొత్తవారెందరు వచ్చినా... పార్టీ తరువాత అంతా... ముఖ్యంగా మహిళలు క్షేమంగా ఇంటికి చేరేలా క్లబ్ బాధ్యత తీసుకుంటుంది. ఈవెంట్స్‌లో పాల్గొనే మెంబర్స్ ఫోన్, ఫేస్బుక్ వివరాలను గోప్యంగా ఉంచుతాం. అలాగే మరెన్నో భద్రతా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు క్లబ్ ఆర్గనైజర్ డాక్టర్ పెద్దిరెడ్డి. వీకెండ్లో రీఫ్రెష్ కావడానికి, ఒకే తరహా ఆసక్తి ఉన్నవారంతా కలవడానికి క్లబ్ ఓ వేదికగా నిలుస్తుంది. కొత్త వాళ్లు కూడా ఎలాంటి బెరుకూ, జంకూ లేకుండా మెంబర్స్‌తో త్వరగా కలసిపోయేలా రకరకాల యాక్టివిటీస్ నిర్వహిస్తుంటారు. అదే సమయంలో వచ్చినవాళ్ల వ్యవహార శైలి, తీరును ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. చిగురించే స్నేహం ఆర్గనైజర్ సభ్యుల సంఖ్యను బట్టి ముందుగా అనుకున్న పార్టీయింగ్ స్పాట్‌కి వెళ్లి, అది అనువుగా ఉందా లేదా అన్నది పరిశీలిస్తారు. తర్వాత మెంబర్స్‌కి ఈవెంట్ ప్లేస్ అండ్ టైమ్ డీటైల్స్ అందిస్తారు. ‘సాధారణంగా పబ్‌ల్లో శనివారాలు సింగిల్‌గా నో ఎంట్రీ. మా గ్రూప్‌తో వెళ్తే అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. కారణం... మేం మా సభ్యులతో తప్ప మరొకరితో కలవం. అక్కడ ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా మెంబర్స్ ఇష్టం. ఖర్చు కూడా వారిదే. మనకు నచ్చిన, మనలా ఆలోచించేవారితో ఎంజాయ్ చేయడంలో ఉన్న మజానే వేరు. ఇలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారినవాళ్లు, ఆ తరువాత వాళ్లంతా కలసి వారి వారి ఇళ్లలో పార్టీలు చేసుకున్నవారూ ఉన్నారు’ అంటారు క్లబ్ వ్యవస్థాపకుడు అతుల్‌రాయ్. పార్టీ అంటే కేవలం ఏదో గోల చేసి వెళ్లటం కాదు... పరిచయాలను పెంచుకుంటూ చక్కటి అనుబంధాన్ని, స్నేహాలను పెంచుకోవటం అంటారు క్లబ్ సభ్యులు. ఇరవై నుంచి అరవై వరకు ‘మెంబర్‌గా చేరిన నేను ప్రస్తుతం ఆర్గనైజర్‌గా మారాను. మన ప్రవర్తన, ప్లానింగ్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ఆర్గనైజింగ్ బాధ్యతలు అప్పజెబుతారు. ఎరోబిక్స్, లంచ్ పూల్, ఫెస్టివ్ వంటి రకరకాల థీమ్‌లతో పార్టీను నిర్వహిస్తుంటాం. పబ్‌లు, క్లబ్బుల్లో మాత్రమే కాదు... రోడ్ సైడ్ చాయ్, టిఫిన్ బండ్ల వద్ద కూడా ఎంజాయ్ చేస్తుంటాం. ఇరవై నుంచి అరవై ఏళ్ల వారి వరకూ సభ్యులున్నారు’ అని చెప్పారు క్లబ్ ఆర్గనైజర్, సైంటిస్ట్ తన్వీ. మాది మధ్యప్రదేశ్, జబల్పూర్. ఇక్కడ ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నా. పబ్బింగ్, పార్టీలు చాలా ఇష్టం. డీసెంట్ అండ్ ఫ్రెండ్లీ గ్రూప్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ క్లబ్ గురించి తెలిసింది. ఫస్ట్ పార్టీకి వచ్చినప్పుడు ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. సరదా సరదా గేమ్స్ ఉంటాయి. పది నిమిషాల్లో అంతా ఫ్రెండ్స్ అయిపోతారు’... ఇది క్లబ్ సభ్యుడు కార్తీక్ మాట. -
దీని డిజైన్.. ఫ్యూచరిస్టిక్..
రైళ్లలో పెద్దగా సదుపాయాలేముంటాయ్.. ఉంటే.. గింటే.. ఏసీ వంటివి మాత్రమే ఉంటాయి అనుకునేవారికి ఝలక్ ఇచ్చే అల్ట్రా లగ్జరీ రైలు ఇదీ. ఒక విధంగా ఇది పట్టాలపై పరుగులు తీసే ఫైవ్ స్టార్ హోటల్లాంటిదన్నమాట. జపాన్ భవిష్యత్తు రైలుగా చెబుతున్న ఈ ’క్రూయిజ్ ట్రైన్’ను ఫెరారీ డిజైనర్ కెన్ ఒకుయామా.. జేఈ ఈస్ట్ రైల్వే కోసం డిజైన్ చేశారు. 2017లో పట్టాలెక్కే ఈ రైలులో మొత్తం 10 బోగీలుంటాయి. రైలు వెనుక భాగంలో రెండు అబ్జర్వేషన్ ప్రాంతాలుంటాయి. ఈ బోగీ అంతా అద్దాలతో తయారుచేసి ఉంటుంది. దీని వల్ల చుట్టు పక్కల ఉండే ప్రకృతి అందాలను చూస్తూ.. ప్రయాణికులు ఎంజాయ్ చేయవచ్చు. ఈ రెండంతస్తుల రైలులో అత్యాధునిక సదుపాయాలుండే డీలక్స్ సూట్స్ కూడా ఉన్నాయి. ఐదు నక్షత్రాల హోటళ్లోని సదుపాయాలన్నీ ఇందులో అడుగడుగునా ఉం టాయి. ఇంకా డిన్నర్ ఏరియా వంటివి.. అదిరిపోయేలా ఉంటాయి. ఈ రైలు ధర. 307 కోట్లు.. -
37 ఏళ్లుగా ఐదు నక్షత్రాల హోటల్లోనే
అనారోగ్యంతో మృతిచెందిన కోటీశ్వరుడు - దశాబ్దాలకుపైగా ఐదు నక్షత్రాల న్యూఢిల్లీ: మూడు దశాబ్దాలకుపైగా ఐదు నక్షత్రాల హోటల్ లోనే ఉంటున్న 81 ఏళ్ల వ్యాపారవేత్త చనిపోయాడు. నగరంలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్లోని ఓ విలాసవంతమైన సూట్లో 37 ఏళ్లుగా ఉంటున్న వ్యాపారవేత్త దాడి బల్సారా సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మ్యాక్స్ ఆస్పత్రిలో మృతిచెందాడు. 2009లోనే బల్సారా భార్య చనిపోయిందని, వారికి పిల్లలు లేరని అదనపు పోలీస్ కమిషనర్ ఎస్బీఎస్ త్యాగి తెలిపారు. మృతుడికి ఇద్దరు సోదరులు మాత్రమే ఉన్నారు. అనారోగ్యం బారినపడిన నాటినుంచి బల్సారా మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రవాస భారతీయుడైన బల్సారా 1991లో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు. తన ఉత్పత్తికి హిమాలయన్ అని నామకరణం చేశాడు. తాజ్‌మాన్‌సింగ్ హోటల్లోని 901వ నంబర్‌గల అత్యంత విలాసవంతమైన సూట్లో కాలం గడిపేవాడు. అనేక సంవత్సరాలుగా తమ హోటల్లోనే బస చేస్తుండడాన్ని గమనించిన యాజమాన్యం...బల్సారాతో ఒక ఒప్పందం కుదుర్చుకుని కిరాయి తగ్గించింది. రోజుకు రూ. 15 వేలు చెల్లిస్తే సరిపోతుందని తెలి పింది. ఇలా అతను మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హోటళ్లనే నివాసం మార్చుకున్నాడు. ఇదిలే ఉంచితే ఇతడు మధుమేహ వ్యాధిపీడితుడు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. ఎప్పటిలాగానే బుధవారం రాత్రి 9.30కి భోజనంచేసిన బల్సారా ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. 11.30కు నిద్ర లేచిన బల్సారా మళ్లీ నిద్రపోయాడు. గం2.30 సమయంలో బల్సారా గదికి అటెండెంట్ వచ్చాడు. బల్సారా కదలిక లేకుండా పడి ఉండడాన్ని గమనిం చిన అటెండెంట్... ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశాడు. కాగా బల్సారా గుండెపోటుతోనే చనిపోయినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 250 కోట్లు ఉన్నాయి. అందులో కొంతమొత్తాన్ని తన బంధువులకు, మరి కొంత మొత్తాన్ని విరాళాల కింద ఇవ్వాలని బల్సా రా అనుకున్నట్టు పోలీసులు తెలిపారు. బల్సారా మృతి సహజమరణమనేనని భావిస్తున్నారు. -
నన్ను మారనివ్వండి ప్లీజ్!
*ఘరానా చోరీలు.. జల్సా జీవితం *చోరీ సొత్తులో కొంత పేదలకు పంపకం *ఆరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 110 నేరాలు *భూక్యానాయక్ నేరాల స్టైలే వేరు! *ఆటకట్టించిన కార్ఖానా పోలీసులు రాంగోపాల్‌పేట, న్యూస్‌లైన్: ఖరీదైన ప్రాంతాలే టార్గెట్.. చోరీ సొత్తులో కొంత బీదాబిక్కీకి పంపకం.. ఊరు దాటాలంటే ఫ్లైట్.. బస చేయాలంటే ఫైవ్‌స్టార్ హోటల్.. గజదొంగ భూక్యానాయక్ శైలి ఇది. అతని ఆటకట్టించిన కార్ఖానా పోలీసులు 85 తులాల బంగారు, రెండు కేజీల వెండి ఆభరణాలు, నగదు స్వాధీ నం చేసుకున్నారు. సోమవారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి వివరాలు వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో పంజా విసిరి... కృష్ణా జిల్లా ఎ.కొండూరుకి చెందిన భూక్యానాయక్ 2007 నుంచి చోరీలకు అలవాటుపడ్డాడు. హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు నేరాలు చేశాడు. పి.ఉమామహేశ్వరరావు, పి.సురేష్, ఎన్.సురేష్, ఎం.భాస్కర్ (చనిపోయాడు), కె.విజయకృష్ణతో ముఠాకట్టి ఆరేళ్లలో 110 కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లొచ్చాడు. ఇతనిపై పలు ఠాణాల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా... మేలో బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం కార్ఖానా ఠాణా పరిధిలో ఐదిళ్లలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నాడు. చోరీ సొత్తును చార్మినార్‌లో విక్రయించేందుకు సోమవారం సిటీకి వచ్చిన ఇతగాడు సికింద్రాబాద్‌లోని ఓ బస్టాప్ వద్ద వేచి ఉన్నాడు. సమాచారం అందుకున్న కార్ఖానా ఠాణా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వి.నాగయ్య బృందంతో దాడిచేసి అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి చోరీ సొత్తును కొన్న గుత్తికొండ పవన్కుమార్నూ పట్టుకున్నారు. పవన్ బీకాం (కంప్యూటర్స్) చదివాడు. భూక్యానాయక్ గురించి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిటికెలో చోరీ.. పగలూరాత్రి తేడా లేకుండా పంజా విసిరే భూక్యానాయక్కు ఖరీదైన ప్రాంతాల్లో నివసించే వారే టార్గెట్. తాను చేసిన చోరీలపై బాధితులు ఫిర్యాదు చేయడానికీ వెనుకాడే పరిస్థితి కల్పిస్తాడు. పట్టపగలు ఇంటి ముందు వాచ్మెన్ కాపలా ఉన్నా... కళ్లుగప్పి తాళం పగులగొట్టి ఊడ్చుకుపోతాడు. చోరీ సొత్తులోని కొంత భాగం యాచకులకు, రాత్రి వేళల్లో ఆస్పత్రుల వద్ద రోడ్డు పక్కనే నిద్రించే వారికి పంచుతాడు. పోలీసులకు దొరికినప్పుడు మాత్రం అప్పటికి ఏ సందర్భంలోనైనా తనను ఇబ్బంది పెట్టిన వాళ్లను ఇరికించడానికి యత్నిస్తాడు. నేరాల్లో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు చెప్పడం ద్వారా పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తాడు. బెయిల్‌పై వచ్చాక ‘నీ ఏరియాలో చోరీ చేస్తున్నా.. దమ్ముంటే కాచుకో’ అంటూ చాలెంజ్ చేయడం భూక్యా నైజం. 2010లో మచిలీపట్నం నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసు ఎస్కార్ట్కు మస్కా కొట్టి జీపులో నుంచి దూకి తప్పించుకున్నాడు. ‘రియల్’ ముసుగులో జల్సాలు చోరీల ద్వారా భారీ మొత్తం మూటగట్టాక పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కర్ణాటక, తమిళనాడు, గోవాకు విమానాల్లో చెక్కేస్తాడు. రియల్ఎస్టేట్ వ్యాపారినంటూ బిల్డప్ ఇచ్చి ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తాడు. చిన్న వస్తువు కొనాలన్నా పెద్ద షాపింగ్ మాల్‌కు వెళ్లాల్సిందే. ఎక్కడా నిలకడగా ఉండకుండా తరచూ సెల్‌ఫోన్, సిమ్‌కార్డు మారుస్తూ నిఘా నుంచి తప్పించుకుంటాడు. స్టార్‌హోటళ్లలో బస చేసినప్పుడు మాత్రమే రెడ్‌వైన్ తాగుతాడు. ఏడో తరగతి మాత్రమే చదివిన భూక్యా.. తనకు సహకరించేందుకు ఇద్దరు ముగ్గురు సన్నిహితులను తీసుకువెళ్తుంటాడు. డ్యాన్సర్ కూడా కావడంతో పబ్‌లకు వెళ్లి చిందేస్తాడు. సినీ పరిశ్రమలోనూ పలువురితో పరిచయాలు ఉన్నట్లు సమాచారం. కోస్తా జిల్లాల పోలీసుల తొలి టార్గెట్‌లో ఎప్పుడూ భూక్యానాయక్ ఉంటాడు. బెయిల్ పిటిషన్ వేయడానికి పోటీ భూక్యానాయక్ నిరంతరం కొందరు అడ్వకేట్లతో టచ్‌లో ఉంటాడు. పోలీసులకు చిక్కినప్పుడు బెయిల్ పిటిషన్ వేయడానికి వారు పోటీపడతారని తెలుస్తోంది. ఈ ఖర్చులకే భూక్యా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ఖర్చు చేసి ఉంటాడని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇతడి స్నేహితుల్లో కొందరు ప్రస్తుతం బాగా ‘స్థిరపడినట్లు’ సమాచారం. ఇతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నన్ను మారనివ్వండి ప్లీజ్! 'నేను దొంగతనాలు మాని సాధారణ జీవితం గడపాలనుకున్నా, పోలీసులు నన్నలా ఉండనివ్వట్లేదు. నా ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఉన్నతస్థాయిలో చూడాలని ఉంది. పోలీసుల తీరుతోనే ఇలా మళ్లీ మళ్లీ దొంగగా మారాల్ని వస్తోంది. పోలీసులు, మీడియా నేను మారేందుకు సహకరించాలి' అంటూ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో భూక్యా నాయక్ అన్నాడు.