Get to Gether
-
ఇట్స్ ఏ ట్విన్స్ టైమ్
సాక్షి, విశాఖపట్నం: ఒక ఇంట్లో కవలలు ఉంటేనే ఆ సందడే వేరు. మరి అలాంటిది కవలలంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే విశాఖపట్నం బీచ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. నగరంలోని పలువురు ట్విన్స్ సోమవారం ఓ హోటల్లో ప్రపంచ ట్విన్స్ డేను ఘనంగా నిర్వహించారు. వారి అనుభూతులను ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం ఆట పాటలతో సందడి చేశారు. 25 మంది జతల కవలలు వాట్సప్ గ్రూఫ్‌లో ఉండడం వల్ల వీరంతా ఒక దగ్గర కలవగలిగారు. -
ఉల్లాసం.. ఉత్సాహం
ఒక్కచోట చేరిన ‘పోరూరి’ వారి కుటుంబాలు ఆడిపాడి సందడి ఏడాదికోసారి గెట్ టుగెదర్ సామాజిక సేవలోనూ ముందుకు ప్రపంచంలో ఉన్నవారంతా ఒక్కచోట చేరాలన్న సంకల్పం మల్కాజిగిరి: వారంతా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారైనా ఇంటి పేరు మాత్రం ఒక్కటే. ‘పోరూరి’ ఇంటిపేరు గల వారంతా ఏడాదికోసారి ఓ చోట చేరి సందడి చేస్తుంటారు. అలాగే ఈసారి కూడా కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆదివారం మల్కాజిగిరిలోని శంకరమఠం (కనకరాజుతోట)లో గెట్ టుగెదర్ సందర్భంగా అంతా ఒక్కచోట చేరారు. చిన్నా, పెద్ద అంతా కలిసి ఆడిపాడి సందడి చేశారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన పోరూరి సురేన్‌కుమార్ 2008 నుంచి గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి నగరానికి వచ్చి మల్కాజిగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తనతోపాటు దేశంలోని ఆయా ప్రాంతా ల్లో స్థిరపడిన 70 కుటుంబాలకు చెందిన వారు విచ్చేసినట్టు సురేన్‌కుమార్ తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పోరూరి పేరున్న కుటుంబాలు 450కిపైగా ఉన్నాయన్నారు. అందులో 250 కుటుంబాల వివరాలు సేకరించినట్టు తెలిపారు. వారిలో ప్రముఖ క్రీడాకారులు లక్ష్మి పోరూరి, మౌనిక పోరూరి తదితరులు ఉన్నారన్నారు. తమ ఇంటిపేరుతో ప్రపంచంలో ఉన్న వారమంతా ఇలా ఒకరోజు ఓ చోట చేరి ఆనందంగా గడపాలన్నది తమ సంకల్పమని ఆయన తెలిపారు. అంతేకాదు సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో రెండేళ్ల క్రితం ‘అంగీరస చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశామన్నారు. చదువుపై ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఈ ట్రస్ట్ ద్వారా చేయూతనందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 20 మంది విద్యార్థులకు రిటైర్డ్ పోలీస్ అధికారి డీవీఎల్‌ఎన్ రామకృష్ణారావు చేతుల మీదుగా నగదు పారితోషకాన్ని అందించినట్టు తెలిపారు. -
‘ఉమ్మడి’ అనుబంధాల కలబోత
ప్రాంతాలు వేరయ్యే వేళ.. ఇరు ప్రాంతాల ఉద్యోగుల ఆత్మీయ కలయిక పంచాయతీరాజ్ కార్యాలయంలో గెట్ టుగెదర్ పంజగుట్ట, న్యూస్‌లైన్ : వారంతా 25 సంవత్సరాలుగా కలిసి పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయి ఉద్యమాలు చేశారు. విడిపోవాలని కొందరు.. కలిసుండాలని మరికొందరు విడివిడిగా ఆందోళనలు చేశారు. తెలంగాణ ఉద్యోగులు సకల జనుల సమ్మె చేస్తే.. సీమాంధ్ర ఉద్యోగులు 60 రోజుల పాటు విధులు బహిష్కరించారు. ఉద్యమం సమయంలో పోటాపోటీ నినాదాలు... తోపులాటలు... ఘర్షణ వాతావరణం... తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు... ఉద్యమానికే ఆ కార్యాలయం కేంద్ర బిందువుగా మారింది. సీన్ కట్ చేస్తే... రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో శుక్రవారం ఇరు ప్రాంతాల వారు గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములా కలిసుందామంటూ అందరూ కలిసి సమైక్య రాష్ట్రంలో ఆఖరి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఎర్రమంజిల్‌లోని పంచాయతీ రాజ్ కార్యాలయం వేదికయింది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగులు, మిత్రులతో కలిసి సహపంక్తి బోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతాలకతీతంగా అందరూ పాల్గొని ఎంతో ఆనందంగా గడిపారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘కేవలం రాష్ట్రాలు మాత్రమే విడిపోయాయి. మన బందాలు ఎన్నటికీ విడిపోవు’ అంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. విడిపోయినా కలిసి ఉందామనే.. ఉద్యమ సమయంలో ఉద్యమానికే మా కార్యాలయాలు కేంద్ర బిందువుగా నిలిచాయి. రాబోయే రోజుల్లో ఇరుగు, పొరుగు రాష్ట్రాలుగా ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉందామనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. - అబు శ్రీనివాస్, ఇండియా ఇంజనీర్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ రాష్ట్రాలు వేరైనా ఒక్కటేనని చాటిచెప్పాలి 1947లో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. కాని ఇప్పటికీ మన పిల్లలకు పాకిస్థాన్ ప్రమాదకర దేశమని చెబుతుంటాం. అలాంటి వాతావరణం కలగకుండా తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఒక్కటేనని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలి. ఉద్యోగులు ఒకరికి మరొకరు సహాయ సహకారాలు అందిస్తూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలి. - సీవీఎస్ రామ్మూర్తి, ఇంజనీర్ ఇన్ చీఫ్, పంచాయతీరాజ్ -
సంజె కాంతుల్లో...సౌందర్య రాగం!
ముస్తాబు వేసవి సాయంత్రాలలో మల్లెల గుబాళింపులే కాదు వేడుకల వాతావరణమూ ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చిన్నాపెద్దా గెట్ టు గెదర్లు, పాశ్చాత్యశైలి పార్టీలు ఇప్పుడు మన సంస్కృతిలో భాగమైపోవడంతో పార్టీకి తగ్గ వేషధారణ కూడా ముఖ్యమైంది. కొత్త కొత్త ఫ్యాషన్ల కోసం వెతుకులాట సాధారణమైంది.కొంచెం పాశ్చాత్యం... ఇంకొంచెం సంప్రదాయం... రెండింటి మేళవింపును ఇష్టపడే యువతరం కోరుకునే దుస్తుల పరిచయమే ఈ ముస్తాబు. 1- ఎరుపు, పువ్వుల కాంబినేషన్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పొడవాటి గౌన్ బర్త్ డే, వీకెండ్ పార్టీలలో అదుర్స్ అనిపిస్తుంది. కింద పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్ మెటీరియల్‌ను ఉపయోగించారు. నడుము, పై భాగాన్ని కలుపుతూ కర్దానా బెల్ట్‌ను ఉపయోగించారు. పైన వి నెక్ ఉన్న బ్లౌజ్‌కు ఎరుపు రంగు షిఫాన్ ఫ్యాబ్రిక్‌ను వాడారు. 2- వారాంతపు పార్టీలో చూపులను కట్టిపడేసే పొడవాటి గౌన్ ఇది. స్కర్ట్ భాగానికి షిఫాన్ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ భాగానికి బ్లాక్ వెల్వెట్ వాడారు. నడుము భాగాన్ని చుట్టి ఉన్న బెల్ట్‌పై శాటిన్ రిబ్బన్‌తో వర్క్ చేశారు. 3- సాయంకాలం పార్టీని ఆహ్లాదపరిచే రంగుల కలబోత ఈ లాంగ్ గౌన్ ప్రత్యేకత. జైపూర్ ప్రింట్ ఉన్న ఇక్కత్ సిల్క్, పైన ప్లెయిన్ షిఫాన్కు క్రాస్ షేప్ తీసుకువచ్చారు. బ్లౌజ్ పార్ట్‌కు ఇక్కత్ సిల్క్ వాడారు. స్కర్ట్ భాగంలో వాడిన ప్రింటెడ్ క్లాత్‌తో ఫ్లవర్‌ను తీర్చిదిద్ది, భుజం దగ్గర బ్రోచ్లా అమర్చారు. 4- మయూరాన్ని తలపించే నీలం రంగు పొడవాటి గౌన్ పార్టీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. తెల్లటి షిఫాన్ క్లాత్‌కు డై చేయించి, పీకాక్ కలర్ తెప్పించారు. బ్లౌజ్ భాగాన్ని రాసిల్క్ చెక్స్ మెటీరియల్‌తో డిజైన్‌చేశారు. సైడ్స్ పర్పుల్ ఫ్యాబ్రిక్వాడారు. 5- తెల్లటి పొడవైన ఈ గౌను సాయంకాలపు పుట్టిన రోజు, పెళ్లిరోజు పార్టీలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. క్రింది భాగానికి మూడు లేయర్లుగా తెల్లని నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన హై కాలర్ నెటెడ్ బ్లౌజ్‌కి క్యాప్ స్లీవ్స్ ఇచ్చి యాంటిక్ బీడ్స్, వైట్ గోల్డ్, రాక్ గోల్డ్ సీక్వెన్స్‌తో మొత్తం ఫ్లోరల్ డిజైన్ చేశారు. 6- సాయంకాలం సంగీత్, మెహెందీ, రిసెప్షన్ వంటి సంప్రదాయ వేడుకలకు ఈ ఎర్రటి పొడవాటి గౌన్ ఎందరిలో ఉన్నా ఇట్టే ఆకట్టుకుంటుంది. క్రింది భాగాన్ని మూడు లేయర్లుగా ఎక్రటి నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన బ్రొకేడ్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్, బోట్ నెక్ ఇచ్చి, కుడి భుజం పైన జర్దోసి వర్క్, గ్రీన్ స్టోన్స్‌తో మెరిపించారు. నడుము భాగంలో ఎరుపురంగు సిల్క్ మెటీరియల్‌తో చేసిన బెల్ట్‌ను జత చేశారు. పార్టీలో గ్రాండ్‌గా..: పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు మేకప్ మరీ ఎక్కువ కాకూడదు. మేకప్ కనిపించీ కనిపించనట్టు ఉండాలి కేశాలంకరణ సంగతికొస్తే - హై పోనీతో కానీ, జుట్టు పూర్తిగా వదిలేయడం కానీ చేయాలి. సమకాలీన లుక్ ఉండేలా చూసుకోవాలి గౌన్లు వేసుకున్నప్పుడు హై హీల్స్, శాండల్స్ బాగా నప్పుతాయి డ్రెస్‌కు సంబంధం లేనట్టు కాకుండా యాక్ససరీస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి హ్యాండ్‌బ్యాగ్ బదులు క్లచ్ లాంటివి పట్టుకుంటే లుక్ బాగుంటుంది. కర్టెసి: భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ www.bar9999@gmail.com