governement
-
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్‌ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు!
ప్రేమ ఎంత గొప్పదో అని తెగ ఫీలైపోయే ప్రేమికులు.. కొన్నిసార్లు అంతే తిప్పల్ని ఎదుర్కొక తప్పదు కూడా. ఓ యువకుడు ప్రేయసి కోసం ఎవరూ చేయలేని సాహసమే చేసి.. చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. పంజాబ్‌లో జనవరి 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది. ఫజిల్కా ప్రాంతానికి చెందిన అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు.. తన ప్రేయసి పరంజిత్ కౌర్ బదులు ఆ పరీక్ష రాయాలకున్నాడు. అమ్మాయిల వస్త్రధారణతో పరీక్ష హాల్‌కు వెళ్లాడు. ఫ్రూఫ్ల కింద.. వెంట పరంజిత్ కౌర్ పేరుతో సృష్టించిన ఫేక్ వోటర్ ఐడీ, ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నాడు. కానీ, విధి అతన్ని తప్పించుకోనివ్వలేదు. బయోమెట్రిక్ డివైస్ దగ్గర అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆ యువతి దరఖాస్తు ఫారమ్‌ను తిరస్కరించిన అధికారులు ఆమెను అనర్హులిగా ప్రకటించిన అంగ్రేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా అతనిపై చట్టపరమైన చర్యలకు యూనివర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
నిధులు విడుదలవ్వక.. నాలాల, చెరువుల విధులంతే !
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో వానొస్తే వరదలు.. రోడ్లు చెరువులుగా మారడం తెలిసిందే. అందుకు కారణం వరదనీరు సాఫీగా పారే నాలాలు కబ్జాలపాలై కొన్ని చోట్ల.. వ్యర్థాలతో నిండి చాలాచోట్ల నీరు పారే దారి లేక పోవడమే అందుకు ప్రధాన కారణమని తెలుసు. వాటితోపాటు నగరంలోని చాలా చెరువులు సైతం కబ్జాల పాలై నీరు నిలిచే పరిస్థితి లేకపోవడం కూడా ముంపునకు మరో కారణం. ముంపు సమస్యల పరిష్కారానికి రెండు దశాబ్దాల నుంచి రెండేళ్ల క్రితం వరకు వివిధ పనులు చేపట్టారు. అవి ఇప్పటికీ పూర్తికాలేదు. సమస్య గుర్తించినా.. వరద సమస్యల పరిష్కారానికి నాలాల విస్తరణ, ఆధునికీకరణే శరణ్యమని రెండు దశాబ్దాల క్రితమే గుర్తించారు. కిర్లోస్కర్, వాయెంట్స్ కమిటీల సిఫార్సుల మేరకు విస్తరణ పనులు కొంత మేర చేపట్టి.. ఆ తర్వాత నిలిపి వేశారు. వరద సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకాన్ని (ఎస్ఎన్డీపీ) రెండేళ్ల క్రితం చేపట్టారు. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. వాటికంటే ముందు దాదాపు రూ. 452 కోట్లతో నాలాల విస్తరణ పనులు చేపట్టారు. అవి సైతం ఇంతవరకు పూర్తికాలేదు. కొత్తవి, పాతవి ఏవీ పూర్తికాకపోవడంతో వానొస్తే నగరంలో ముంపు సమస్యలు తప్పేలా లేవు. చెరువుల పనులూ కాలేదు.. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులుండగా, వివిధ పథకాల ద్వారా పూడికతీత, మరమ్మతులు, పునరుద్ధరణ, అలుగు, తూముల ఏర్పాటు వంటి పనులు చేస్తున్నారు. వీటితోపాటు మురుగునీటి మళ్లింపు, చెరువుకట్టల ఆధునీకరణ, ఫెన్సింగ్ తదితర పనులు చేపట్టారు. తద్వారా ముంపు సమస్యలు తగ్గుతాయని భావించారు. అలా 355 పనులకు రూ.345 కోట్లు మంజూరు కాగా, రూ.108.29 కోట్లతో 191 పనులు మాత్రం పూర్తయ్యాయి. 144 పనులు పురోగతిలో ఉన్నాయి. 20 పనులు వివిధ కారణాలతో పెండింగ్‌లో పడ్డాయి. ఇవి కాక రాష్ట్రప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కోసం 19పనులకు రూ.282.63 కోట్లు మంజూరు చేయగా, వాటిల్లో రూ.132.21 కోట్లతో 8 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కాలేదు. నిధుల విడుదల కాకపోవడమే ఇందుకు కారణం. పూర్తి కాని పనుల్లో.. పూర్తికాని నాలాల పనులు పాతవాటిలో కిషన్‌బాగ్ నాలా రిటైనింగ్ వాల్, సన్నీగార్డెన్ – శివాజీనగర్ వరకు ముర్కి నాలా రిటైనింగ్ వాల్ ఆధునీకరణ, నూరమ్మచెరువు నుంచి మీరాలం ట్యాంక్ వరకు (వయా శివరాంపల్లి చెరువు, ఊర చెరువు, ప్రభాకర్జీ కాలనీ) కల్వర్టులు, ఉందాసాగర్ నుంచి పల్లెచెరువు వరకు రిటైనింగ్ వాల్, బహదూర్‌పురా నాలా కల్వర్టు, రిటైనింగ్ వాల్ తదితరమైనవి ఉన్నాయి. వీటితో పాటు పలు ప్రాంతాల్లో పనులు పూర్తి కాలేదు. ఓవైపు నాలాలు, మరోవైపు చెరువుల పనులు పూర్తి కాకపోవడంతో నగరంలో వానా కాలం సమస్యలు తీరలేదు. -
మహారాష్ట్రలో గోగోరో వేల కోట్ల ఇన్వెస్ట్ - కారణం తెలిస్తే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ విభాగాన్ని ప్రోత్సహించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రముఖ బ్యాటరీ స్వాపింగ్ కంపెనీ 'గొగోరో' (Gogoro) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాటరీ స్వాప్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు 'అల్ట్రా మెగా ప్రాజెక్ట్' ప్రారంభించనుంది. దీని కోసం దాదాపు 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) అల్ట్రా మెగా ప్రాజెక్ట్‌లో భాగంగా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో ఓపెన్ అండ్ యాక్సెస్ చేయగల బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. దీనికి మహారాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో రాష్ట్రం అగ్రగామిగా కావాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా దాదాపు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. (ఇదీ చదవండి: మస్క్ & జుకర్‌బర్గ్ రియల్ ఫైట్? చూడటానికి సిద్ధమేనా!) ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. కావున ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేయడానికి స్వాపబుల్ స్మార్ట్ బ్యాటరీ స్టేషన్లు చాలా సహాయపడతాయి. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడంలో కూడా సహాయపడే అవకాశం ఉందని భావిస్తున్నాయి. తైవాన్‌లో మల్టిపుల్ వెహికల్ తయారీదారులకు మద్దతు ఇచ్చే ఓపెన్ బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను గొగోరో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి భారతదేశంలో కూడా తన ఉనికిని చాటుకోనుంది. ఇది తప్పకుండా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాము. -
కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’
విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో, ఎప్పుడు ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి. సెంట్రల్ సిలబస్‌లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది, దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యత లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్తుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన! విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని, ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ, రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్లమీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ, మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు సంబంధించిన అంశాలు కావు. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళ కిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకం లో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోద్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే, మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుధ్యాలు ఉంటాయి. వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ, చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ, చిత్రించేటప్పుడు, ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులే స్వయంగా దోపిడీ దారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం, ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమమీదా, చేతి వృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు). చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పధంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి! వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ -
జగన్ సర్కారుపై కక్ష, అసూయ, అక్కసుతో రామోజీరాతలు
-
ఒక బాల్యం నేలపాలు.. మూడు బాల్యాలు కటకటాలపాలు...
భార్యాభర్తల స్థితి నుంచి తల్లిదండ్రులవ్వటం అనేది ప్రకృతి సహజంగా జరుగుతున్న మార్పు. అంతవరకు ఆడుతూపాడుతూ ఉన్న జంట, ఒక్కసారిగా బాధ్యతగల తల్లిదండ్రులుగా మారిపోతారు. చంటిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నిద్రాహారాలకు దూరమౌతారు. ఇది సృష్టి ధర్మం. ఇటీవల లండన్‌లో జరిగిన సంఘటన తల్లులు ముక్కున వేలేసుకునేలా చేసింది. సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. లండన్‌కి చెందిన 19 సంవత్సరాల వెర్ఫీ కుడీకి 20 నెలల పసి పాప ఉంది. చిన్న వయసులోనే బిడ్డకు జన్మనివ్వటం వల్లనేమో, ఆమె తన సరదాలకు దూరంగా ఉండలేకపోయింది. కుడీ తన పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకోవటం కోసం ఇంటి నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న ఎలిఫెంట్ అండ్ క్యాజిల్‌కి వెళ్లారు. అక్కడే ఆరు రోజుల పాటు ఉండిపోయారు. ఆరు రోజుల పాటు ఆకలితో అలమటించి మరణించింది ఆ పసిపాప. తిరిగి వచ్చిన తనకు కుమార్తె చనిపోయి కనిపించింది. అందుకు తాను బాధపడట్లేదని, ఇది అతి సహజంగా జరిగిందంటున్నారు వెర్ఫీ కుడీ. ఇది ఇలా ఉంటే... ఖమ్మంలో గిరిజన జాతికి చెందిన కవిత, కావ్య, రాణి అనే ముగ్గురు మహిళల మీద హత్యానేరం మోపబడింది. అక్కడి రైతులు పత్తి పంట పండిస్తున్నారనే కోపంతో వీరు ఆ రైతుల మీద హత్యా యత్నం తలపెట్టడంతో అక్కడి ఆదివాసీలకు జైలు శిక్ష వేశారు. అందులో ఈ ముగ్గురూ పసిపిల్లల తల్లులు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు తల్లులతో పాటు జైలు జీవితం అనివార్యంగా గడపాలి. అక్కడ ఆ తల్లి తన వేడుక కోసం పసిబిడ్డను విడిచిపెట్టి, ఆమె మరణానికి కారణమయ్యారు. ఇక్కడ ఆవేశంలో చేసిన పనికి ఈ పసిపిల్లలు బలవుతున్నారు. నిండు నూరేళ్ల జీవితం మసకబారిపోతోంది. తల్లిదండ్రులతో గడపవలసిన బాల్యం ఒకచోట బాల్య దశలోనే ముగిసిపోయింది, మరోచోట బాల్యమంతా జైలులో గడవబోతోంది. ‘‘ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి టీనేజ్ తల్లుల సమస్యలపై దృష్టి సారించాలి. సరైన వయసు వచ్చేవరకు తల్లి కాకుండా చట్టాలు సవరించాలి. తల్లి కాబోయే ముందు రాబోయే సాధక బాధకాలు వివరంగా తెలియజేయాలి. సరైన పెంపకంలో పెరగని పిల్లలు ఏ మార్గంలో పయనిస్తారో చెప్పడం కష్టం. ఆ దుస్థితి ముందు తరాల వారికి రాకూడదంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కళ్ళు తెరవాలి’’ అంటున్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సెలర్ శ్రీమతి కె. శోభ. తల్లిదండ్రుల లాలనలో బాల్యం అందంగా గడవాలి. వృద్ధాప్యంలో సైతం బాల్యాన్ని తలచుకునేలా ఉండాలి. అటువంటి బాల్యం మొగ్గలోనే వాడిపోవటం, జైలులో గడవటం... పిల్లల ఎదుగుదలకు అవరోధాలు. ‘‘జైలుకి వెళ్లిన ఆదివాసీలు తమ పిల్లల్ని తమతో పాటు తీసుకువెళ్లాలి. అందువల్ల ఆ పిల్లలు జైలు వాతావరణంలో పెరుగుతారు. వాళ్లని లోపల ఉంచే హక్కు ఎవరికీ లేదు. ముగ్గురు పాపంపుణ్యం తెలియని పిల్లల్ని అక్కడ ఉంచటం వల్ల వాళ్లకి ప్రపంచం తెలియదు. తల్లులు చేసిన తప్పులకు పిల్లలు బలవుతున్నారు. పిల్లల్ని బతికించుకోవటానికి వారు ఈ పనులు చేశామంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వారు ‘అడవి మా హక్కు’ అన్నారు. తరతరాలుగా అది వారి హక్కు. ఒక ఆదివాసీ ఒక మాట అన్నారు, ‘చెరువులో నీళ్లు చేపలు తాగితే చెరువు ఎండిపోతుందా’ అని. ఆదివాసీలు చెట్లు కొట్టడం వల్ల అడవి తరిగిపోదు. ఆవేశంలో వారు చేసిన పనికి, ఆ తల్లుల కారణంగా పిల్లల్ని జైలులో పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. పిల్లలు స్వేచ్ఛను అనుభవించటం కోసం తల్లుల్ని వదిలేయాలి’’ అంటున్నారు సామాజిక వేత్త దేవి. ఇప్పుడు వెర్ఫీ కుడీకి తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఖమ్మం మహిళలకు కూడా జైలు శిక్ష పడింది. – వైజయంతి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి! అంతులేని స్వేచ్ఛ, సమానత్వం పొంగిపొర్లే దేశం ఒకటి. అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొనే దేశం మరోటి. రెండుచోట్లా బాధితులు పసివారే. దేశాల అభివృద్ధితో సంబంధం లేదని ఈ రెండు సంఘటనలు నిరూపించాయి. తల్లి తన పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు. కానీ తల్లే తన పసికందు మరణానికి కారణమవడం విచారకరం. పైగా విచారణలో కూడా ఆమెలో బాధ, పశ్చాత్తాపం కనపడలేదట. మానసిక పరిపక్వత, శారీరక సామర్థ్యం లేకుండా అమాయకంగా ప్రేమలో చిక్కుకునే అమ్మాయిలు ఇలాగే ఉంటారు. రైతు మహిళల అరెస్టు సైతం ఇదే కోవకు వస్తుంది. తల్లులు జైలులో ఉంటే పాల బుగ్గల పసివారి సంగతి ఏమిటి ? ఇటీవలి కాలంలో తల్లుల కోపానికి బలవుతున్న పిల్లల సంఘటనలు అనేకం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం సరైన చదువు లేకపోవడం, సమస్యలపై అవగాహన లేకపోవడం. - కె. శోభ , ఫ్యామిలీ కౌన్సెలర్ వారిని నిందించకూడదు.. పసిబిడ్డను నిర్లక్ష్యం చేయటాన్ని ఎవ్వరూ సమర్థించరు. అసలు 20 సంవత్సరాల లోపు వయసున్నవారు పిల్లల్ని కనకూడదు. అనివార్యంగా కన్నప్పటికీ వారికి బాధ్యతగా పెంచటం తెలియదు. వెర్ఫీ కుడీ చేసిన పనికి ఆమె మీద నింద మోపకూడదు. ఆడుకునే వయసులో తిరగాలనే కోరికను వదులుకోలేరు. వాళ్లకి బాధ్యత తెలీదు. బిడ్డను పెంచలేమనుకుంటే, బేబీ కేర్ సెంటర్లకు అప్పచెప్పాలి. అలా చేసి ఉంటే ఆ పసిపాప మొగ్గలోనే రాలిపోయేది కాదు కదా. ఇలా చేయటాన్ని సమర్థిస్తున్నామని కాదు. అదొక మార్గం మాత్రమే అని చెబుతున్నాం. – దేవి, సామాజికవేత్త -
'మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి'
-
ఉద్యోగులపై ‘మూడో’ కన్ను
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నిఘా పెట్టింది. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినప్పటికీ పరి పాలనలో ఒడిదుడుకులు ఇంకా అధిగమించలేదనే అభిప్రాయానికి వచ్చింది. ప్రధానంగా పాలనకు గుండెకాయలాంటి సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఇటీవలే అన్ని విభాగాల పనితీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం అంతర్గతంగా సర్వే చేయించింది. పలు కార్యాలయాలకు వచ్చే ప్రజలు, అర్జీదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అక్కడి ఉద్యోగులు స్పంది స్తున్న తీరును రహస్యంగా తెలుసుకుంది. తమది ‘ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సందర్భం వచ్చినప్పుడల్లా పలుమార్లు ప్రస్తావించటం తెలిసిందే. కానీ.. ఈ సర్వేలో పలు ఆందోళనకర అంశాలు దృష్టికి రావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా విధి నిర్వహణలో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ విభాగాలతో పాటు సచివాలయం కేంద్రంగా అవినీతి వ్యవస్థీకృతమైందని సర్వేలో తేలింది. ఇరిగేషన్ విభాగంతో పాటు పలు విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను బేరం పెట్టి దళారులు లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ దందాల్లో తెర వెనుక ఇక్కడి ఉద్యోగుల ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. ఉద్యోగుల్లో ఏదీ నాటి స్ఫూర్తి ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఎక్కువ గంటలు పని చేస్తామని, ఎక్కువ శ్రమిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వివిధ సంఘాలుగా ఏర్పడి ఒక్కతాటిపై నిలబడ్డారు. అదే స్ఫూర్తిని రగిలించేందుకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబడింది. అడిగిందల్లా కాదనకుండా.. తెలంగాణ ఇంక్రిమెంట్‌తోపాటు 43 శాతం ఫిట్మెంట్తో పదో పీఆర్సీ సిఫారసులను అమలు చేసింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించిన తరహాలోనే అదే ఆనవాయితీని ఉద్యోగులు కొనసాగిస్తున్నారని.. అర్జీలను పట్టించుకోవటం లేదని, మంత్రులు, ప్రముఖుల సిఫారసుల ఫైళ్లను మాత్రమే చకచకా కదిలిస్తూ మిగతా వాటిని పక్కన పడేస్తున్నారని గుర్తించింది. దీంతో కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు స్థానచలనం కల్పించటం ద్వారా ఈ రుగ్మతలను పారదోలవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన సిబ్బంది కొన్ని విభాగాల్లో ఏళ్లకేళ్లుగా పాతుకుపోయారు. వీరిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాలని, సెక్రెటేరియట్‌లో పని చేస్తున్న ఉద్యోగులను అవసరమైతే జిల్లాలకు పంపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత ం ఉన్న సెక్రెటేరియట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇక్కడి ఉద్యోగులను జిల్లాలకు పంపించటం కుదరదు. అయితే వారిని జిల్లాలకు పంపేందుకు అవసరమైతే సర్వీస్ రూల్స్‌ను సరళీకృతం చేయాలని సీఎం ఉన్నతాధికారులను సూచించినట్లు తెలిసింది. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు.. అవినీతి రహిత పాలనతో పాటు పారదర్శకంగా వీలైనంత వేగంగా ప్రజలకు సేవలందించాలనేది బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. పది నెలల కిందటే అవినీతిని సహించేది లేదని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్ని విభాగాలకు సీఎం హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా నేరుగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. మొదటి వారంలోనే వేలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తటంతో వాటిని ఆయా విభాగాలకు పంపించటం తప్ప.. సీఎంవో కార్యాలయం వీటిపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో అక్కడ ఫిర్యాదు చేసినా.. అంతే సంగతులనే ప్రచారం జరిగింది. ఫలితంగా కాల్‌సెంటర్‌కు వచ్చే రోజువారీ ఫిర్యాదుల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయికి పడిపోయింది. తాజా సర్వేతో అందిన సమాచారంతో ఇకపై అవినీతి ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సచివాలయ ఉద్యోగులు, అధికారుల వేళలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆరంభంలో స్వయంగా మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఉద్యోగులు సమయపాలన పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. అదే తరహాలో ఉన్నతాధికారులు, మంత్రుల సారథ్యంలో అడపాదడపా తనిఖీలు కొనసాగించే ఆలోచనలు చేస్తోంది. -
ఆ ప్రాజెక్టును మా వద్దే ఉంచండి
ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలించవద్దని ఉద్యమం ఉధృతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు జన్మ స్థానమైన తుమ్ముడి హెట్టి వద్ద ధర్నా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్, జలసాధన సమితి రాష్ట్ర నాయకులు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ ప్రజల ఆశాదీపమైన ప్రాణహిత చేవెళ్లను వేరే చోటుకు తరలిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. మున్మందు రోజుల్లో దీక్షను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. -
ఇక సర్కారీ వరుణయాగాలు, జపాలు..
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున వరుణయాగాలు, వరుణజపాలు నిర్వహించేందుకు దేవాదాలయ శాఖ సన్నధ్దమైంది. శుక్రవారం దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దీనిపై శాఖ కమిషనర్‌తో చర్చించారు. వీటి నిర్వహణకు సంబంధించి పండితులతో మాట్లాడి పూర్తి వివరాలను తెలపాల్సిందిగా ఆదేశించారు. అంతుకుముందు తెలంగాణ అర్చక సమాఖ్య ప్రతినిధులు మంత్రితో భేటీ అయి..వర్షాభావం నేపథ్యంలో తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నందున వరుణయాగాలు, జపాలు నిర్వహిస్తే సానుకూల అవకాశం ఉంటుందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేకంగా కమిషనర్‌ను పిలిపించి ఈ అంశమై పరిశీలన చేయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. -
'అది అనైతిక చర్య'
వరంగల్: కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని పలు కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఇలాంటి చర్యలు అనైతికమని హితవు పలికారు. ప్రభుత్వం, అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ స్వర్ణ వినతిపత్రం అందజేశారు. -
తప్పు చేస్తే ప్రశ్నిస్తాం: కోదండరాం
గోదావరిఖని(కరీంనగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీగా ఏర్పడి ఉద్యమించిన తరహాలోనే ప్రభుత్వ పాలనలో ఏదైనా తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నిస్తామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల అభినందన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని, లేకుంటే మరో ఉద్యమానికి జేఏసీ సిద్ధంగా ఉంటుందని తేల్చి చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విజయాన్ని ఆస్వాదించినట్లే పరిపాలనలో ఏవైనా తప్పులు దొర్లితే పాలకులను అడగవలసిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రజలతో కలిసి నడిచేందుకు జేఏసీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, జేఏసీ నాయకులు పిట్టల రవీందర్, గురిజాల రవీందర్రావు, కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డున పడేస్తున్నారు
గుంటూరు: భజరంగ్ జూట్ మిల్లును మూసేందుకు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అపార్ట్ మెంట్లు, గ్రూప్ హౌస్‌ల నిర్మాణం పేరుతో పరిశ్రమ స్థలాలను రియల్ ఎస్టేట్ వారికి అప్పగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మూడు వేలమంది కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా స్థలాలను అమ్మేశారని చెప్పారు. అక్రమాలు ఆపకపోతే కార్మికులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు -
నేత్రవైద్య సహాయకుల వ్యథలు
రాష్ట్రవ్యాప్తంగా నేత్రవైద్య సహాయకులు అనే క సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. చా లా సంవత్సరాల క్రితం శిక్షణపొందినా ప్రభు త్వ దవాఖానాలలో నేత్రవైద్య సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీచేయడంలో ప్రభు త్వం జాప్యం చేస్తోంది. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులలో పని చేస్తూ నేత్రదానం పట్ల అవ గాహన కల్గిస్తున్నారు. మానవ శరీరంలో అతి సున్నితమైన అవయవం కన్ను మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటివారిని గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకునేలా, అవగాహన కలిగించడంలో వీరి సేవలు ఎనలేనివి. ఆఫ్తా ల్మిక్ అసిస్టెంట్లుగా పేరు గడిస్తున్నా, ప్రభు త్వం మాత్రం వీరి సేవలను వినియోగించు కోవడంలేదు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి. ముప్పిడి రంజిత్ పరకాల, వరంగల్ -
'అన్ని చెప్పాకే ఆ పని చేయండి'
విశాఖపట్నం: ప్రభుత్వ భూములు కేటాయించి రెండున్నర దశాబ్ధాలు అయినాఇప్పటి వరకు హిందూజ పవర్ ప్లాంట్ ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ అన్నారు. నలుగురు కలెక్టర్లు మాట్టాడినా నేటికి ఆర్ ఆర్ ప్యాకేజీ విషయంలో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్పారు. ఏప్రిల్ 13,2013న విడుద లచే సిన జీవో ప్రకారం ఆరు శాఖలతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. నివేదిక అంది ఉంటే ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేయకుండా ఈ నెల 30, మే 1న మరోసారి హిందూజ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకోబోతుందని తెలిసిందని చెప్పారు. వీటన్నింటిపై ప్రజలకు అన్ని వివరాలు తెలియజేశాకే హిందూజాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
సాగు సాగేనా?
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగులో కదలిక లేకుండా పోయింది. ఆరుద్ర కార్తె దాటి పోతున్నా వర్షాల జాడ కనిపించడం లేదు. పంట పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వలేని అన్నదాతలు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. సీజన్ నడుస్తున్నా ప్రభుత్వం నుంచి రుణమాఫీపై గానీ, కొత్తగా పంట రుణాల మంజూరు గురించి గానీ స్పష్టత రాలేదు. దీనికితోడు సబ్సిడీ విత్తన వేరుశనగ నాణ్యత లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటి వరకు 20 వేల హెక్టార్లలో కూడా పంటలు వేసుకోలేకపోయారు. ఇక 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఎప్పుడు సాగవుతాయో అర్థంకాని పరిస్థితి. మరో 15 రోజులు ఇలాగే కొనసాగితే ఖరీఫ్ సాగు పూర్తిగా పడకేసినట్లే. అదే జరిగితే మునుపెన్నడూ లేని విధంగా ‘అనంత’ ైరె తులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 15 వరకు విత్తుకు అదను వేరుశనగ విత్తుకునేందుకు మంచి అదను జూలై 15వ తేదీతో ముగుస్తుంది. శాస్త్రవేత్తలు మాత్రం జూలై ఆఖరు వరకు వేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ తరువాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. జూన్ 22న ప్రారంభమైన ఆరుద్ర కార్తె జూలై 5వ తేదీతో ముగుస్తుంది. ఈ కార్తెలో విత్తనం పడితే మంచి పంటలు పండుతాయని రైతుల నమ్మకం. జూలై 6న ప్రారంభమయ్యే పునర్వసు కార్తె మొదట్లో విత్తనం వేసుకున్నా కొంత వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అంటే జూలై 20 వరకు విత్తుకునేందుకు సమయం ఉన్నట్లుగా భావించవచ్చు. అంతలోగా వేరుశనగ విత్తనం పడకపోతే లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి రావడం గగనమే. వారం.. పది రోజుల్లో వర్షం వస్తే వేరుశనగ విస్తీర్ణం పెరుగుతుంది. అయితే.. ఆ జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ సాధారణ వర్షపాతం 63.9 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. నేటి వరకు 47 మి.మీకే పరిమితమైంది. అరకొర తేమలోనే అక్కడక్కడ కొందరు రైతులు వేరుశనగ విత్తుకున్నారు. తర్వాత వర్షం లేక లేతపైరు ఎండుముఖం పడుతోంది. జూలై సాధారణ వర్షపాతం 67 మి.మీ. అయితే, వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించినా వర్షం పడలేదు. నైరుతి గాలులు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వీయాల్సి వుండగా.. 12-14 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. నాలుగు రోజుల కిందట వరకు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు కాస్త తగ్గినా ఉక్కపోత మాత్రం కొనసాగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు వరుస పంట నష్టాలతో కుదేలైన రైతన్నలకు ఈ ఖరీఫ్‌లో పంట పెట్టుబడులు సవాలుగా మారాయి. రుణమాఫీ విషయం తేలితే కానీ బ్యాంకర్లు ఖరీఫ్ రుణ లక్ష్యం మేరకు రూ.2,764 కోట్లు పంపిణీ చేసే పరిస్థితి లేదు. 2013లో నష్టపోయిన వేరుశనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ కింద మంజూరు చేస్తారనుకున్న రూ.643 కోట్ల గురించి ఎవరూ పట్టించుకుంటున్న పాపానపోలేదు. ఇక రూ.90 కోట్ల ప్రీమియం చెల్లించి ఎదురు చూస్తున్న వాతావరణ బీమా పరిహారం అతీగతీ లేదు. దీంతో రైతులు భూములు దుక్కులు చేసుకుని.. విత్తనాలు, ఎరువులు కొనేందుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. -
బతుకు ముళ్లపాన్పు
‘వ్యయ’సాయం చేయలేక రైతన్న చతికిలపడుతున్నాడు. రబీ.. ఖరీఫ్.. ఏదో ఒకటి కలసి రాకపోతుందా అనే ఆశే తప్పిస్తే.. నాలుగు రాళ్లు మిగలని దయనీయ పరిస్థితి. జూదంగా మారిన సాగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంతోనే ఆయన జీవితం గడచిపోతోంది. ఆకాశాన్నంటిన ఉల్లి, టమాట ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూడటంతో పెట్టుబడి కూడా చేతికందక రైతాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: పది మందికి అన్నం పెట్టే చేతులు.. నేడు చేయి చాస్తే తప్ప పూటగడవని దైన్యం. మట్టినే నమ్ముకున్న రైతులకు చివరకు మట్టే తప్ప ఏమీ మిగలని రోజులివి. ప్రకృతే కాదు.. ప్రభుత్వం కూడా వీరి బాధలను పంచుకునే బాధ్యత విస్మరించింది. అప్పులు చేయడం.. ఆశల జూదంలోకి కాడి దింపడం.. ఆ తర్వాత షరా మామూలుగా అప్పుల ఊబిలో కూరుకుపోవడం అన్నదాతకు పరిపాటిగా మారింది. తాజాగా ఉల్లి,టమాట పంటలు రైతులను నిలువునా ముంచేశాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో దళారీలు నిర్ణయించిన మొత్తానికే సంవత్సరం కష్టార్జితాన్ని తెగనమ్ముకుంటున్నారు. మూడు నెలల క్రితం వరకు ఉల్లి, టమాట ధరలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాజాగా ధరలు పడిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. మూడు నెలల క్రితం కిలో టమాట ధర రూ.50లకు చేరుకోగా.. ప్రస్తుతం 25 కిలోల గంపకు రూ.25లు కూడా దక్కకపోవడం రైతుల దీనస్థితికి నిదర్శనం. రబీ సీజన్లో జిల్లా మొత్తం మీద 5వేల ఎకరాల్లో టమాట సాగయింది. మొత్తం పంట ఒకేసారి మార్కెట్లోకి రావడంతో డిమాండ్ తగ్గిపోయింది. దీనికి తోడు కర్ణాటక రాష్ట్రంలో పండిన టమాట రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ముంచెత్తుతోంది. ఫలితంగా ధరలు అనూహ్యంగా పడిపోయాయి. నష్టాలను భరించలేక దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, ఆలూరు, ఆస్పరి ప్రాంతాల్లోని రైతులు పంటను పశువులకు వదిలేస్తున్నారు. టమాట ఆధారిత జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు కలగా మారడంతో ఏటా రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. అయితే రైతుల కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉల్లి రైతుల పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. క్వింటా ఉల్లి ధర రూ.600లకు పడిపోయిందంటే ఏ స్థాయిలో నష్టాలు వస్తున్నాయో తెలియజేస్తోంది. రబీలో దాదాపు 18వేల ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. దీనికి తోడు మహారాష్ట్రలో పండిన ఉల్లి రాష్ట్రాన్ని ముంచెత్తుతుండటంతో ధర ఆకాశం నుంచి నేలను తాకింది. రబీలో ఉల్లి పండించిన రైతుల్లో 80 శాతం మంది నష్టాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. టమాట, ఉల్లి పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు బతుకులు గాలివాటమయ్యాయి. జిల్లాలో ఉల్లి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా ఆచరణలో సాధించలేకపోయారు. మహారాష్ట్రకు వెళ్లి అధ్యయనం చేసినా.. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో రైతుల బతుకులు దర్భరంగా మారుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లి, టమాట రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెట్టుబడి కూడా చేతికందలేదు రబీ సీజన్లో 4 ఎకరాల్లో ఉల్లి సాగు చేసి రూ.50 వేలు నష్టపోయాను. మూడు నెలల క్రితం గాలివాటంగా పెరిగిన ధర ఒక్కసారిగా పడిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టగా.. పంటను అమ్ముకుంటే రూ.70వేలు మాత్రమే చేతికందింది. పెట్టుబడి కూడా దక్కకపోతే ఎలా బతికేది. ప్రభుత్వం ఉల్లి దిగుబడులకూ మద్దతు ధర ప్రకటించాలి. - రామనాయుడు, రైతు, పులకుర్తి, కోడుమూరు మండలం పంటను పశువులకు వదిలేశాం బోరు కింద ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చు చేసి మూడెకరాల్లో టమాట పంట సాగు చేశాం. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోయినా రాత్రి, పగలు కష్టించాం. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కలేదు. 25 కేజీల టమాట గంప రూ.10 నుంచి రూ.20లు పలుకుతోంది. కూలీకి రూ.100, మార్కెట్‌కు తరలించేందుకు ఆటో బాడుగ రూ.10, కమీషన్ రూ.10 చెల్లించాల్సి వస్తోంది. గిట్టుబాటు కాకపోవడంతో పంటను పశువులకు వదిలేశాం. - హనుమంతమ్మ, మహిళా రైతు, జొన్నగిరి -
చెల్లని కార్డులు 1,27,936
చిగురుమామిడికి చెందిన నారాయణపురం హన్మంతు అనే నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. హౌసింగ్ ఏఈ రవీందర్‌రెడ్డి రేషన్‌కార్డు చూపించాలని కోరారు. హన్మంతు ప్రభుత్వం తనకు ఇచ్చిన రేషన్‌కార్డు (నంబర్ ట్యాప్ 205320608864)ను అందించాడు. ఏఈ ఆన్లైన్లో పరిశీలిస్తే సదరు కార్డు నంబరు కనిపించలేదు. దీంతో హన్మంతుకు మంజూరైన ఇల్లు రద్దవుతుందని చెప్పారు. గత్యంతరం లేక హన్మంతు డెప్యూటీ తహశీల్దార్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తామేమీ చేయలేమని డీటీ బదులిచ్చారు. ఇలాంటి కార్డుల గురించి పై అధికారులకు నివేదించామని, తిరిగి ఉత్తర్వులు వచ్చేంత వరకు వేచిచూడాలని సూచించారు. ఇది ఒక్క హన్మంతు పరిస్థితే కాదు.. జిల్లావ్యాప్తంగా 1,27,936 కుటుంబాలదీ ఇదే వ్యథ. - న్యూస్‌లైన్, చిగురుమామిడి చిగురుమామిడి, న్యూస్‌లైన్ : జిల్లాలో గత నవంబర్‌లో జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 1,27,936 మందికి కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేసినట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు గొప్పగా ప్రచా రం చేసుకున్నారు. కానీ కార్డుల స్థానంలో తాత్కాలిక కూపన్లు జారీ చేయడంతో అవి ఎందుకూ కొరగావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూపన్లపై కొన్ని చోట్ల రేషన్ సరుకులు ఇస్తుండగా, మరికొన్ని చోట్ల వాటికీ దిక్కులేదని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులతో లంకె పెట్టిన విషయం తెలిసిందే. సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాలు, సబ్సిడీగ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలు కొత్త రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు వర్తిం చడం లేదు. రేషన్‌కార్డులను తాత్కాలింకగా పనికి వచ్చేలా జారీచేయడంతో కార్డులు పొందిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కార్డులు కేవలం రేషన్ సరుకుల కోసం తప్ప మరే అవసరానికీ ఉపయోగపడడం లేదని వాపోతున్నారు. కార్డులపై ఉన్న నంబర్లు ఆన్లైన్లో కనిపించడంలేదని తిరస్కరిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో చుక్కెదురవుతోంది. జిల్లావ్యాప్తంగా మొదటి, రెండో విడత రచ్చబండ కార్యక్రమాలతోపాటు జిల్లా, మండల స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేశామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పుకున్నారు. ఇలాంటి కార్డులు జిల్లాలో 1,27,936 మంజూరు చేయగా, చిగురుమామిడి మండలంలో 1,074 కుటుంబాలకు అందించారు. తాత్కాలికంగా ఆయా కుటుంబాలకు అందించిన కార్డులు సంక్షేమ పథకాలకు వర్తించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఆశల మొలక.. నష్టాల మునక
ముందస్తుగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఆశల పంటకు ఊపిరి పోశాయి. అత్యధిక విస్తీర్ణంలో పైర్లు సాగయ్యాయి. అయితే పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు ముంచేశాయి. అలాగే చీడపీడలు ప్రబలి దిగుబడులు భారీగా తగ్గాయి. నకిలీపురుగు మందులు సైతం అన్నదాత పాలిట శాపంగా మారాయి. గిట్టుబాటు ధర లభించక నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఉల్లి సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండింది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో కొంత ఉపశమనం లభించినట్లయింది. మొత్తంగా ఈ ఏడాది వ్యవసాయంలో కొంత మోదం..మరికొంత ఖేదం మిగిలింది. - న్యూస్‌లైన్, కర్నూలు (అగ్రికల్చర్) దరిచేరని పథకాలు.. 2013లో ప్రభుత్వం చేపట్టిన పథకాలు రైతులకు చేరలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఉద్యోగుల సమ్మె కారణంగా వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూచేతన కార్యక్రమం రైతులకు అందలేదు. భూముల్లోని సూక్ష్మ పోషకాల లోపాలను నివారించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కాగితాలకే పరిమితం అయింది. సీడ్ విలేజ్ ప్రోగ్రామ్, పొలంబడి, ఐసోఫాం తదితర పథకాలు ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి అక్టోబర్ నెల వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో సాధారణ సాగు 5.61 లక్షల హెక్టార్లు ఉండగా అది 6.51 లక్షల హెక్టార్లకు చేరింది. ఎప్పుడూ లేని విధంగా ఈఏడాది పత్తి రికార్డుస్థాయి 2.03 లక్షల హెక్టార్లలో వేశారు. అయితే ఖరీఫ్ పంటలకు చీడపీడలు సోకడంతో దిగుబడులు పడిపోయాయి. అంతంతమాత్రం పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో 2013లో కూడా రైతులకు అప్పుల కుప్పే మిగిలింది. అయితే ఈ ఏడాది ఉల్లి రైతులు మాత్రం మంచి లాభాలు గడించారు. క్వింటా ధర రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండే ఉల్లి ఒక దశలో రూ.5000 వరకు వెళ్లింది. ఉల్లి సాగు చేసిన రైతుల్లో 80 శాతం మంది నష్టాలనుంచి గట్టెక్కారు. నకి‘లీలలు’ నకిలీ పురుగుమందులు 2013లో వెల్లువెత్తాయి. వీటి బారిన పడి రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. రైతుసంఘాల అంచనాల ప్రకారం జిల్లాలో దాదాపు రూ. 300 కోట్ల విలువ చేసే నకిలీ పురుగుమందుల విక్రయాలు సాగాయి. నకిలీ బయో పెస్టిసైడ్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు వర్ధిల్లింది. జిల్లాలో 2013లో నకిలీ బయోమందులు దాదాపు రూ.600 కోట్ల విలువ అమ్మకం అయినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రూ.5 కోట్ల విలువ చేసే నకిలీ పురుగుమందులు, నకిలీ బయో పెస్టిసైడ్స్‌ను సీజ్ చేయడం గమనార్హం. నిరాశపరచిన రబీ... రబీ సీజన్ కూడా నిరాశపరచింది. ఈసారి 2.02 లక్షల హెక్టార్లలో శెనగ వేయగా చీడపీడలు పొగమంచు కారణంగా దెబ్బతినింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో చినుకు లేకపోవడంతో పైర్లు ఎదుగు బొదుగు లేకుండాపోయాయి. రబీ సాధారణ సాగు 4.35 లక్షలు ఉండగా 3.14 లక్షల హెక్టార్లకే పరిమితం అయింది. ధరలు పతనం... మామూలుగా అయితే ఏడాదికేడాది వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పెరగాలి. 2013లో మాత్రం ధరలు తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేసింది. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, శెనగ ఇలా అన్ని పంటల ధరలు పడిపోయాయి. మొక్కజొన్న మద్దతు ధర రూ.1,310 ఉంటే మార్కెట్లో రూ.800 నుంచి రూ.1,100 మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్, జేసీలు చొరవ తీసుకుని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1.30 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను ఎంఎస్పీతో కొనిపించారు. వేరుశెనగ, పత్తి, శెనగ ధరలు పడిపోయినా కొనుగోలు సెంటర్ల ఏర్పాటు గూర్చి పట్టించుకోలేదు. సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ కరువు... ప్రభుత్వం సరఫరా చేసిన సబ్సిడీ విత్తనాలను తీసుకునేందుకు రైతులు ఉత్సాహం చూపలేదు. జిల్లాకు ఖరీఫ్‌లో 64 వేల క్వింటాళ్ల వేరుశెనగ మంజూరు కాగా, 32 వేల క్వింటాళ్లు మాత్రం పంపిణీ అయింది. రబీలో 4 వేల క్వింటాళ్ల శెనగ విత్తనాలు మంజూరయ్యాయి. పూర్తి ధర చెల్లించి విత్తనాలు తీసుకుంటే తర్వాత సబ్సిడీని బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో రైతులు మందుకు రాలేదు. థైవాన్ స్ప్రేయర్ల కోసం ఎదురుచూపు... థైవాన్ స్ప్రేయర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు నీటి సరఫరా పైపులు, స్ప్రింకర్లకు డిమాండ్ ఉంది. 2013లో రైతులు ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటిని పంపిణీ చేయలేకపోయారు. నాన్ సబ్సిడీ ఎంత చెల్లించాలనేదానిని వ్యవసాయ శాఖ ప్రకటించకపోవడంతో రైతులు వీటిని పొందలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి వ్యవసాయ శాఖ 2013-14 సంవత్సరానికి సంబంధించి వీటిని పంపిణీ చేయడం లేదని చేతులెత్తేసింది. దెబ్బతీసిన వర్షాలు... అక్టోబర్ 22 నుంచి 27 వరకు తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లడం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మొక్కజొన్న, వరి, శెనగ, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 40 వేల హెక్టార్లలో అతివృష్టి ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. అయితే వ్యవసాయాధికారులు కేవలం 4,500 హెక్టార్లలోనే పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు. -
చెరకు రైతుల బకాయిలకు రూ. 7200 కోట్లు
కేంద్ర మంత్రుల కమిటీ సిఫారసు న్యూఢిల్లీ: చెరకు రైతులకు శుభవార్త. వారి బకాయిల చెల్లింపు కోసం బ్యాంకుల ద్వారా రూ. 7200 కోట్ల వడ్డీరహిత రుణాలను చెరకు మిల్లులకు ప్రభుత్వం అందజేయాలనుకుంటోంది. చెరకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ అధ్యక్షతన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ శుక్రవారం ఈ మేరకు సిఫారసు చేసింది. 4 మిలియన్ టన్నుల ముడి పంచదారను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు, బఫర్ స్టాక్ ఏర్పాటుతో పాటు చెరకు మిల్లులు గతంలో తీసుకున్న రుణాల పునర్వ్యవస్థీకరణను కూడా కమిటీ తమ సిఫారసుల్లో చేర్చింది. అలాగే, పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ను 10 శాతానికి పెంచింది. కమిటీ సిఫారసుల వివరాలను పవార్ విలేకరులకు తెలిపారు. బ్యాంకులు ఇచ్చే రూ. 7200 కోట్ల వడ్డీరహిత రుణం మొత్తాన్ని చెరకు బకాయిల చెల్లింపు కోసమే వాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాంకులకు చెల్లించే వడ్డీని కేంద్రప్రభుత్వం, సుగర్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) భరిస్తాయని, 5 ఏళ్లలోగా బ్యాంకు రుణాన్ని మిల్లులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. గత మూడేళ్ల సగటు ఎక్సైజ్, సెస్ సుంకం చెల్లింపు ఆధారంగా మిల్లులకు బ్యాంకులు రుణాలిస్తాయని వెల్లడించారు. తమ సిఫారసులపై తుది నిర్ణయం రెండు, మూడు వారాల్లో కేబినెట్ తీసుకుంటుందన్నారు. చెరకు కొనుగోలుకు అధిక ధర చెల్లించాల్సి రావడంతో పంచదార పరిశ్రమ రైతులకు దాదాపు రూ. 3400 కోట్లు అప్పు పడి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. -
అటకెక్కిన అర్జీలు
పాలమూరు, న్యూస్‌లైన్: పేదల సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం చేతల్లో చూపించడం లే దు. రచ్చబండ రెండుసార్లు, ప్రజాపథం మూ డుసార్లు నిర్వహించి ఆ కార్యక్రమాల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు ఇంతవరకు అతీగతిలేదు. ఇళ్లు, పింఛన్లు, ఇతర సమస్యల పరిష్కారం ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మూడోవిడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. జి ల్లాలో 2011 జనవరిలో మొదటి విడత చేపట్ట గా.. రెండో విడత రచ్చబండ కార్యక్రమాన్ని అ దే ఏడాది నవంబరులో చేపట్టింది. అప్పట్లో లక్షల్లో దరఖాస్తులు తీసుకున్న అధికారగణం వాటిని వేలల్లో కూడా పరిష్కరించలేకపోయింది. మూడోవిడత కార్యక్రమం చేపట్టే నాటికి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొనడంతో ప్రజలు తమ సమస్యల పరిష్కార ం కోసం పడిగాపులు గాస్తున్నారు. గత రెండు రచ్చబండ కార్యక్రమాల్లో ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులకు లక్షలాది దరఖాస్తులు వచ్చినా అందులో పరిష్కారానికి నోచుకున్నవి తక్కువే. వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్ ఉన్నవాటిని అధికారులు ‘ఆన్లైన్’ చేయడం తప్ప ఈలోగా అర్జీదారులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారు. రెండు విడతల రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం 1.90 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా, వాటిలో 60వేల దరఖాస్తులను తిరస్కరించారు. మిగతావాటిని ఇప్పుడు చేపట్టనున్న కార్యక్రమం ద్వారా లబ్ధి కల్పించనున్నారు. పింఛన్ల కోసం 1.50 లక్షల దరఖాస్తులు అందగా.. కేవలం 70వేల మందికి మాత్రమే అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పేద కుటుంబాలకు చెందిన వారు 95వేల దరఖాస్తులు అందజేయగా.. 55వేల ఇళ్లకు మాత్రమే మంజూరు లభించింది. వారిలోనూ ఎంతమందికి పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు చేస్తారన్నది అయోమయంగా మారింది. అసలు విషయమేమిటంటే.. ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో సరైనలెక్కలు కూడా లేకపోవడంతో ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందో తెలియడం లేదు. ఇళ్లు మంజూరు చేయాలంటే సదరు లబ్ధిదారునికి కచ్చితంగా రేషన్‌కార్డు, స్థలం ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఇల్లు మంజూరు చేసే అవకాశం లేదు. ఇళ్లకు అర్హత సాధించిన వారిలో చాలామందికి రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత 2011 జనవరిలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామీణస్థాయిలో నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్రస్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కారణంగా అదేఏడాది నవంబర్‌లో నిర్వహించిన కార్యక్రమాన్ని మండలస్థాయికి మార్చారు. నేటి నుంచి చేపట్టనున్న మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామాల్లోనూ చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రచ్చబండ ద్వారా సర్కారు ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చనుందో వేచిచూడాలి. పింఛన్ కోసం తిరుగుతున్నా.. నాలుగేళ్ల క్రితం ఒక కాలు ను పూర్తిగా కోల్పోయా. కుటుంబ పోషణ భారమవ్వడంతో పింఛన్ కోసం రచ్చబండలో దరఖాస్తు చేసుకున్నా. కానీ ఇంత వరకు మంజూరు చేయలేదు. అధికారులు చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయా. దీంతో నేను పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పింఛన్ మంజూరుచేయండి. -సత్యనారాయణ, బండర్‌వల్లి, సీసీ కుంట మండలం ఇళ్లు మంజూరుచేయండి 8ఏళ్ల క్రితం పక్షవాతం రావడంతో ఏ పనిచేసేందు కు చేతకావడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉన్న ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డాం. ఇళ్లు మంజూరుచేయమని అడిగితే పట్టించుకునేవారు లేరు. నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇళ్లు మంజూరు చేసి ఆదుకోండి. -మహేందర్, అంకిళ్ల, కోయిల్‌కొండ మండలం -
తిరకాసు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లించిన రైతులకు వడ్డీ మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై తర్జనభర్జనలు పడి ఖరీఫ్ సీజన్‌కు బ్యాంకర్లు అమలు చేశారు. నిబంధనల ప్రకారం సీజన్‌తో సంబంధం లేకుండా రైతులందరికీ దీనిని వర్తింపజేయాలి. అయితే ఇక్కడే బ్యాంకర్లు తిరకాసు పెడుతున్నారు. రబీసీజన్‌కు సంబంధించి అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి బ్యాంకర్ల నిబంధనల ప్రకారం రబీ సీజన్ మొదలైంది. ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు, పెద్దశెట్టిపల్లె, దొరసానిపల్లె, రేగుళ్లపల్లె, తాళ్లమాపురం, ఎర్రగుంట్లపల్లె, రంగసాయిపురం, కొత్తపేట, నంగనూరుపల్లె, కాకిరేనిపల్లె, శంకరాపురం, నరసింహాపురం, చౌటపల్లె, సీతంపల్లె, సోములవారిపల్లె, బొల్లవరం గ్రామాలతోపాటు ప్రొద్దుటూరులోని 36, 38 వార్డులు కూడా ఎస్బీఐ వ్యవసాయాభివృధ్ది బ్యాంకు పరిధిలో ఉన్నాయి. పట్టణంలో వ్యవసాయాభివృద్ధి శాఖ ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ బ్యాంక్ పరిధిలో సుమారు 6వేల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ కే భూషణంను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తమకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మాత్రమే ఆదేశాలు వచ్చాయని తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి మళ్లీ ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. కడపలోని బ్యాంక్ రీజినల్ కార్యాలయం అధికారులను వివరణ కోరగా ఇదే విషయాన్ని తెలిపారు. జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ వీరారెడ్డిని ఫోన్లో వివరణ కోరగా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. -
తొలగనున్న ఆధార్ కష్టాలు
చిలుకూరు, న్యూస్‌లైన్: ఆధార్ కార్డుల ప్రక్రియ సెప్టెం బర్ నుంచి ప్రారంభం కానున్నది. అం దుకోసం ప్రస్తుతం ఉన్న కేంద్రాలు కాక జిల్లాకు మరో 126 ఆధార్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో జి ల్లాలో ఆధార్ కష్టాలు తొలగనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకానికి, గతంలో కొనసాగుతున్న పథకాలకు తప్పని సరిగా ఆధార్ కార్డు పిన్ నంబర్ అనుసంధానం చేయడంతో ఆధార్ కార్డుకు అత్యంత ప్రాధాన్యత కలిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది వివిధ పథకాల ద్వారా లబ్ధిపొం దుతుండగా ఇప్పటి వరకు కేవలం 25 లక్షల మందికి మాత్రమే ఆధార్‌కార్డులు ఉన్నాయి. మిగిలిన10 లక్షల మంది లబ్ధిదారులు ఆధార్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, ఓబీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉపకార వేతనాలు పొం దాలంటే తప్పని సరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో గర్భిణులకు అందిస్తున్న పారితోషికానికి ఆధార్‌కార్డు తప్పని సరి. గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీని నగదు బదిలీ రూపంలో అందజేసేందుకు ప్రభుత్వం ద్వారా పింఛన్లు పొందుతున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కూడా ఆధార్ కార్డు తప్పని సరిగా అవసరం. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఆధార్ కార్డు ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నా నేటికీ అర్హులైన లబ్ధిదారులందరికీ ఆధార్ కార్డు అందని పరిస్థితి దాపురించింది. ఆధార్ కార్డుల నమోదు బాధ్యతలు చేపట్టిన గుత్తేదారులు సరైన రీతిలో నమోదు ప్రక్రియను చేపట్టకపోవడం, దీనికితోడు ఆ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించపోవడం వంటి కారణాలతో ఆధార్ కార్డుల నమోదు కార్యక్రమం నత్తనడకన సాగుతూ వస్తున్నది. నూతనంగా మరో 126 కేంద్రాలు ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను సెప్టెంబర్ నెలలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇటీవల జిల్లాకు 200 కేంద్రాలు మంజూరయ్యాయి. వాటిల్లో ఇప్పటికే 145 కేంద్రాలు ఏర్పాటు చేయగా మిగిలినవి రెండు రోజుల్లో అనుసంధానం చేసేందుకు అదికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆధార్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మరో 126 కేంద్రాలను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 2.70లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు పొందుతుండగా, 6.34 లక్షల మంది సబ్సిడీ ద్వారా గ్యాస్ పొందుతున్నారు. అలాగే ఉపాధిహామీ పథకం ద్వారా 10 లక్షల మంది, ఐసీడీఎస్ ద్వారా జననీ సురక్ష పథకం కింద మరో 92 వేల మంది లబ్ధిపొందుతున్నారు. వీరందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం. వీరందరికీ కార్డులు అందజేసేందుకు ప్రభుత్వం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. చిలుకూరుకు నాలుగు కేంద్రాలు చిలుకూరు మండలానికి త్వరలో నాలుగు ఆధార్ కేంద్రాలు కొత్తగా వస్తున్నాయి. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు వచ్చిన ఆధార్ కేంద్రాల ద్వారా కేవలం లభ్ధిదారులకు మాత్రమే దించాం. కానీ, ఈ సారి ఇప్పటి వరకు ఆధార్ కార్డులు దిగనివారందరికీ కార్డులు అందజేస్తాం. - ఎన్. సూర్యనారాయణ, తహసీల్దార్, చిలుకూరు -
హెచ్ఎండీఏ.. ఏమవుతుందో?
భువనగిరి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న వార్తల నేపధ్యంలో జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో జీవించాలన్న తమ ఆశయం నెరవేరబోతున్న సమయంలో కేంద్రం హెచ్ఎండీఏ పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీల సమాచారాన్ని కోరి నట్లు ప్రకటనలు రావడంతో ఈ ప్రాంత ప్రజల్లో అలజడి మొదలైంది. తాము హైదరాబాద్ రాజధానిగా కూడిన తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నామే తప్పా కేంద్ర పాలిత ప్రాంతం కాదని ప్రజలు అంటున్నారు. ఎప్పటినుంచో తమ జీవితాల్లో భాగమైన హైదరాబాద్‌ను పరాయి పరం చేయవద్దని కోరుతున్నారు. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్ మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఈ మండలాలన్నీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుండగా, మునుగోడు అసెంబ్లీ పరిధిలోకి చౌటుప్పల్‌లో 25, ఆలేరు పరిధిలోని బొమ్మలరామారంలో 25, భువనగిరి పరిధిలోకి పోచంపల్లిలో 21, బీబీనగర్‌లో 27, భువనగిరిలో 35 గ్రామాలు కలిపి మొత్తం 133 గ్రామాలు ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నేపధ్యంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న సీమాంధ్ర నాయకుల డిమాండ్ల నేపధ్యంలో కేంద్రం హెచ్ఎం డీఏ పరిధిపై సమగ్ర రాజకీయ సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే మండలాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువెళతారేమోనని ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంటే స్వయం పాలన కోల్పోయి, విధాన నిర్ణయాధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్తాయి. దీంతో తమను తాము పరిపాలించుకోకుండా పరాయి పాలనలో ఉన్నామన్న భావన వస్తుందని మేధావులు అంటున్నారు. ఇక్కడి ప్రజలు చెల్లించే పన్నులు రాష్ట్రానికి కాకుండా కేంద్రానికి వెళ్తాయని, తద్వారా అభివృద్ధిలో సమతుల్యత దెబ్బతింటుందన్న అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. హెచ్ఎండీఏ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు వీరే.. భువనగిరి లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, భువనగిరి ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన బూడిద భిక్షమయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యేగా సీపీఐకి చెందిన ఉజ్జిని యాదగిరిరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.