GVL Narsimha Rao
-
‘బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అన్ని గడపలు తొక్కుతోంది’
సాక్షి, ఢిల్లీ: టీడీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోందని తెలిపారు. కాగా, జీవీఎల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అన్ని గడపలు తొక్కుతోంది. టీడీపీ తప్పుడు మాటలు చెబుతోంది. కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ-జనసేన పొత్తుపై టీడీపీకి అక్కసు ఎందుకు?. పవన్ కల్యాణ్ మాతోనే కలిసి ఉన్నాడు. రాష్ట్రంలో టీడీపీ అబద్దపు ప్రచారం చేస్తోంది అని సీరియస్ అయ్యారు. -
కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సీరియస్ అయ్యారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఆంధ్ర ద్రోహి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, జీవీఎల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ కొనుగోలుకు అధికారులను పంపిస్తామని ఆంధ్రా ద్రోహి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఏపీని కేసీఆర్ ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఉన్న మాట వాస్తవమే. ఈ అంశంపై కేంద్ర మంత్రులకు లేఖలు రాశాం. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కేసీఆరే. ఆయన రాజకీయ అవసరాల కోసం ఏపీ ఉద్ధరిస్తాననడం సిగ్గుచేటు. ఏపీలో డ్రామాలకు తెరతీస్తే తగిన బుద్ధి చెబుతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఐటీ పాలసీతో కంపెనీల ఏర్పాటు సులభతరం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ పాలసీతో కంపెనీల స్థాపన మరింత సులభతరం కానుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏర్పాట్లు తదితర అంశాలపై పల్సస్ గ్రూప్ లిమిటెడ్ సీఈవో గేదెల శ్రీనుబాబు నేతృత్వంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాది కాలంలో విశాఖకి పలు ఐటీ దిగ్గజ కంపెనీలు రానున్నాయని చెప్పారు. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపె నీలకు తెలియజేసే ఉద్దేశంతోనే జనవరి నుంచి ఏప్రిల్ వరకు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులతో పాటు గ్లోబల్ టెక్ సదస్సును విశాఖలో నిర్వహిస్తున్నామని వివరించారు. జనవరి 6,7,8 తేదీల్లో విశాఖలో హెల్త్ సమ్మిట్ జరగబోతుందని, అదే నెల 20, 21 తేదీల్లో ఇన్ఫినిటీ ఐటీ సదస్సు జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జీ 20 సదస్సు, మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు విశాఖలోనే నిర్వహిస్తున్నామని తెలి పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు, గ్లోబల్ టెక్ సమ్మిట్ ద్వారా పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకటి, రెండు నెలల్లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, అమెజాన్ త్వరలోనే విశాఖలో అడుగుపెట్టబోతుందని, హెచ్‌సీఎల్ విశాఖ, తిరుపతి, కాకినాడ, గుంటూరులో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిందని గుర్తుచేశారు. ఐటీ రంగానికి చెందిన యాంకర్ యూనిట్లు విశాఖకు వస్తే, ఐటీ హబ్‌గా పేరొందిన పలు నగరాల సరసన విశాఖ కూడా నిలుస్తుందన్నారు. విశాఖలో వాతావరణం కూడా ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర పది రంగాలకు చెందిన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి విశాఖలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తామన్నారు. త్వరలో ఎంఎస్ఎంఈలతోపాటు ఐటీ ఇన్సెంటివ్‌లను కూడా విడుదల చేస్తామని చెప్పారు. గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ గ్లోబల్ టెక్ సమ్మిట్‌కు 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందన్నారు. ఈ సమ్మిట్‌కు సంబంధించి ఇప్పటికే భువనేశ్వర్, ఢిల్లీ, హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహించామని చెప్పారు. జీ 20 దేశాలలో కూడా ఈ సదస్సు ప్రాధాన్యత వివరించి ఐటీ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించనున్నామని తెలిపారు. జీవీఎల్‌కు విభజన హామీల మీద చర్చించే ధైర్యం ఉందా.. రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చించే ధైర్యం బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకు ఉందా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఇ వ్వాల్సిన ప్రాజెక్ట్‌లు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని దా నికి జీవీఎల్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జీవీ ఎల్‌ను నాయకుడిగా బీజేపీ వాళ్లే గుర్తించడం లేదన్నారు. 2024 నాటికి జీవీఎల్ ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు. -
విశాఖకు మరిన్ని ఐటీ సంస్థలు: జీవీఎల్ నరసింహారావు
సాక్షి, విశాఖపట్నం: ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని వనరులు విశాఖపట్నంలో ఉన్నాయని బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. దేశంలోనే టాప్ ఐటీ డెస్టినేషన్ సిటీగా విశాఖ నిలవనుందన్నారు. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు విశాఖకు వచ్చాయని, మరికొన్ని రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఊరూ, పేరు లేని ఐటీ కంపెనీలకు సబ్సిడీలిచ్చి ప్రభుత్వ సొమ్మును దురి్వనియోగం చేశారని మండిపడ్డారు. అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘విశాఖ అభివృద్ధి’ అజెండాతో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.రవీంద్ర పాల్గొన్నారు. -
టీడీపీ నేతలు ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదు: జీవీఎల్
-
బియ్యం పంపిణీపై జీవీఎల్ వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హితవు పలికారు. బియ్యం పంపిణీపై జీవీఎల్ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు.. ఏపీలో పూర్తిగా నూకల్లేని సన్న బియ్యం (సార్టేక్స్) బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నాన్ సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేస్తే సరిపోదని అన్నారు. అంతేగాక కేంద్రం సార్టెక్స్ బియ్యం ఇవ్వకపోగా నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తీరు వల్లే ఉచిత బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. ఈ విషయంపై నీతి ఆయోగ్‌కు లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. తాము 1.46 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం ఇస్తుంటే ఏపీలో సగం జనాభాకే ( 86 లక్షల మందికి) ఇస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర మాత్రం అధికంగా ఇస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రధానికి కూడా సీఎం జగన్మోహన్రెడ్డి మే 16న లేఖ రాశారని గుర్తు చేశారు. ‘రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే ఆ బియ్యాన్ని తెచ్చే ఏర్పాటు చేయండి. కేంద్రంలో మీరే ఉన్నారు కాబట్టి మాకు రావాల్సింది ఇప్పించండి. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీరు ఇప్పుడైనా రావాల్సిన బియ్యం కోసం లేఖ రాయండి. ప్రజలకు మీరిచ్చే అర్థ బంతి బోజనాలు మేము పెట్టలేము. నీతి ఆయోగ్ సిఫార్సులను వెంటనే అమలయ్యేలా మీరు కృషి చేయండి. మేము సిద్దంగా ఉన్నాం...మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. సీఎం దావోస్ పర్యటనలో ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు.’ అని తెలిపారు. చదవండి: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు: మంత్రి అంబటి -
‘బీజేపీ బుల్డోజర్’ అంటే కేటీఆర్‌కు భయం: జీవీఎల్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగరవేస్తుందన్న భయంతోపాటు బీజేపీ బుల్డోజర్ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే తెలంగాణ మంత్రి కె.తారక రామారావు ప్రధాని మోదీపై హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కేంద్రం విస్తృతంగా సహాయం చేస్తున్నప్పటికీ విమర్శిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ ఇటీవల బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని, దీనిని బట్టే బీజేపీ అంటే టీఆర్ఎస్కు ఉన్న భయమేంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ కేంద్రంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాసినా, ప్రసారం చేసినా ఉపేక్షించేది లేదని పలు పత్రికలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీపై తప్పుడు ప్రచారం, విమర్శలు చేస్తే చట్టబద్ధంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 రెట్లు ఎక్కువగా తెలంగాణకు నిధులు ఇస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందని, ఆ పార్టీల పాలన దూరం చేసేలా 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని ఖరారు చేశారన్నారు. ‘ఏపీలో కేంద్ర వాటాకింద నిధులు ఇస్తున్నా, ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్సీపీ స్టిక్కర్లు పెడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉపయోగిస్తే, కేంద్రం వాటా ఉందని చెప్పాలని, తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. సబ్సిడీ బియ్యం పథకానికి మీ ఫొటోలు ఎలా పెడతారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి’అని జీవీఎల్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రమంత్రులు పర్యటించి, కేంద్ర పథకాలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే అంశాలకే నిధులు ఇవ్వాలని కోరతానని చెప్పారు. -
బీజేపీ నేత జీవీఎల్ కు వెల్లంపల్లి సవాల్
-
హోదాపై ప్రత్యేక కమిటీ వేయండి: జీవీఎల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించడానికి, ఆచరణాత్మక మార్గాలను పరిశీలించడానికి.. దానిని సిఫార్సు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు లేఖ రాశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఈ లేఖ ప్రతులను మీడియాకు అందజేశారు. లేఖలో ప్రత్యేక హోదా అన్న పదాన్ని జీవీఎల్ ప్రస్తావించలేదు. తెలంగాణతో పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై 17న జరిగే సబ్ కమిటీ సమావేశం అజెండా నుంచి హోదా సహా నాలుగు అంశాలను సవరించడాన్ని ఆయన అందులో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి నాలుగు అంశాలను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో కారణాలు వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆ లేఖలో జీవీఎల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర స్థాయిలో చర్చ జరిగితే తమకూ సంతోషమేనని తెలిపారు. బాబు ప్రతిపాదనతోనే ప్యాకేజీ హోదానైనా ఇవ్వండి లేదా అంతకు సరిపడా ప్యాకేజీ ఇవ్వండి అని అప్పట్లో చంద్రబాబు ప్రతిపాదన చేసేనే కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందని జీవీఎల్ చెప్పారు. -
కేంద్రం నుంచి తగ్గుతున్న పన్ను ఆదాయం
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడమే కాకుండా పలు విభాగాలకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తొలి ఏడాది నుంచి ఆర్థిక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి తోడు 2019–20లో ఆర్థిక మందగమనంతో రాష్ట్రానికి రావాల్సిన సొంత పన్ను ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఆ తరువాత రెండేళ్ల నుంచి కోవిడ్ మహమ్మారి కారణంగా ఇటు రాష్ట్ర పన్ను ఆదాయం.. అటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇటీవల రాజ్యసభలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నది. గత మూడేళ్లగా కేంద్ర పన్నుల వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్నులు ఎలా తగ్గిపోయాయో పంకజ్ చౌదరి వివరించారు. 2018–19తో పోల్చి చూస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.4,545 కోట్లు తగ్గిపోయింది. 2019–20 ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2020–21 ఆర్థిక ఏడాదిలో రూ.3,781 కోట్లు తగ్గిపోయింది. ఇక ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జనవరి వరకు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రాష్ట్రానికి కేవలం రూ.22,072 కోట్లే వచ్చాయి. అలాగే విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం కూడా గత రెండు ఆర్థిక ఏడాదుల నుంచి తగ్గిపోయినట్లు పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానంలో స్పష్టమైంది. అలాగే గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి రాష్ట్రం నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి వసూలైన రాబడి కూడా తగ్గిపోయినట్లు మంత్రి పంకజ్ చౌదరి వివరించారు. -
ఉదయం దీక్ష.. మధ్యాహ్నం ఫైట్!
సాక్షి, అమరావతి/ఉయ్యూరు (పెనమలూరు)/గుడివాడ/ఉంగుటూరు (గన్నవరం): ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలు మంగళవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఎంపీ సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రాజు, విష్ణువర్దన్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకొచ్చిందని సోము వీర్రాజు ఆరోపించారు. కాగా, దీక్షను మధ్యాహ్నానికి విరమించి, బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామంటూ సోము నేతృత్వంలో పార్టీ నేతలు గుడివాడకు బయలుదేరి వెళ్లారు. నందమూరు అడ్డరోడ్డు వద్ద హైడ్రామా గుడివాడలో సంక్రాంతి సంబరాలను టీడీపీ వివాదాస్పదంగా మార్చింది. దీనికి వంతపాడుతూ గుడివాడ పర్యటనకు బయలుదేరిన బీజేపీ నాయకులను నందమూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి, సీఎం రమేష్ సహా 35 మంది బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఘర్షణకు దిగారు. వీర్రాజుతో పాటు 18 మందిని ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. వీర్రాజు మాట్లాడుతూ.. తాము చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకున్నా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఎందుకు అడ్డుకున్నారు? బీజేపీ ఎంపీ జీవీఎల్ సాక్షి, న్యూఢిల్లీ: సంక్రాంతి కార్యక్రమాల ముగింపు వేడుకలకు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం గుడివాడ వెళ్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారని, అరెస్ట్ చేసి బయటకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసుల ప్రవర్తన చూస్తే ఎంత అరాచకంగా వ్యవహరించారో తెలిసిపోతుందన్నారు. ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలంటే వైఎస్సార్సీపీ నేతలకు చేదా అని అడిగారు. -
భవిష్యత్‌లో పోటీ చేస్తారా? లేదా? అనే మీమాంసతో టీడీపీ శ్రేణులున్నాయి
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విధానపరమైన నిర్ణయం: జీవీఎల్
-
గెజిట్ నోటిఫికేషన్ ను అందరూ స్వాగతించాలి : జీవీఎల్
-
కేంద్రం గెజిట్ నోట్ విడుదల చేయడం శుభపరిణామం
-
బీజేపీలో వర్గపోరు కలకలం
సాక్షి, విజయనగరం: జిల్లా బీజేపీలో వర్గపోరు కలకలం రేపింది. పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర కోశాధికారిగా ఉంటూ పాకలపాటి సన్యాసిరాజు పార్టీ ఫండ్ పేరిట అవినీతి పాల్పడ్డారంటూ పావని రెడ్డి వర్గం ఫిర్యాదు చేసింది. తనపై ఫిర్యాదు చేశారన్న కారణంతో సన్యాసిరాజు పదవికి రాజీనామ చేశాడు. దీంతో అప్పటినుంచి పావని రెడ్డి, సన్యాసి రాజు మధ్య వర్గపోరు మొదలైంది. జిల్లాలో వీరిద్దరి వర్గ పోరుతో బీజేపీ ద్వితీయ శ్రేణి కేడర్ నిరుత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్ నరసింహారావు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. -
హైకోర్టు తరలింపుపై స్పందించిన కేంద్రం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్లో ఓ ప్రకటన చేశారు. హైకోర్టు తరలింపు అంశంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామనిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని, హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు.న్యాయస్థానం తరలింపు కోసం ఎలాంటి గడువూ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారా అన్న జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇదివరేక సంకల్పించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో పవన్ కల్యాణ్ ఎదురుచూపులు..
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కూడా బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ అగ్రనాయకులతో భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది కీలక నేతలతో సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. అయితే సాయంత్రం వరకు ఎటువంటి భేటీ జరగలేదు. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ అగ్రనాయకులను అడిగేందుకే ఢిల్లీకి పవన్ వచ్చారని ప్రచారం జరుగుతోంది. (చదవండి: బీజేపీ ముందు పవన్ కీలక ప్రతిపాదన!) తిరుపతిలో బీజేపీనే పోటీ చేస్తుంది: జీవీఎల్ ఇక త్వరలో జరగబోయే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో మేమే పోటీ చేస్తాం.. జనసేనకు ఇవ్వమని తెలిపారు. -
బాబు అక్రమాల కేసు గిన్నిస్ రికార్డు లెవల్లో..
-
గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాజ్యాంగానికి లోబడే గవర్నర్ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్ గవర్నర్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదన్న విషయాన్ని తాము పార్లమెంటులోనే చెప్పామని గుర్తుచేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలన్నదే బీజేపీ వైఖరిని పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయానికి కేంద్రంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) ‘అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా గవర్నర్ వ్యవస్థపై మాట్లాడే పార్టీలు ఉన్నాయి. స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని రాజధానిగా టీడీపీ ఎంచుకుంది. చంద్రబాబు అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగం తనకు అనుకూలంగా పనిచేయాలనుకోవడం చంద్రబాబుకు సరికాదు. నాడు రాజధానిపై చర్చ సందర్భంగా అమరావతి తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టాడమని కేంద్రం చెప్పింది. కేంద్రంపై టీడీపీ ఇకనైనా దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా బాబు మూర్ఖంగా వ్యవహరించారు. ఫెడరల్ స్ఫూర్తితో పని చేస్తున్నాం.’ అని జీవీఎల్ పేర్కొన్నారు. -
స్థానిక పోరు : జనసేన-బీజేపీ ఉమ్మడి పోటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు విజయవాడ వేదికగా సమావేశమయ్యారు అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేనా కలిసి పోటీచేయాలని నిర్ణయించినట్లు భేటీ అనంతరం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. బీజేపీ బలంగా ఉన్న స్థానాలు మీద చర్చించామని, సరైన అభ్యర్థులను బరిలో నిలపుతామని తెలిపారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై జనసేన నాయకులతో చర్చలు జరుపుతామన్నారు. ఇరు పార్టీల సమన్వయంతో అభ్యర్థులను నిర్ణయిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ పోరులోనూ జనసేన, బీజేపీ ఉమ్మడిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాయని తెలిపారు. కాగా బీజేపీ-జనసేన మధ్య ఢిల్లీ వేదికగా ఇటీవల పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. కాగా అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికలపై విజయవాడలో బీజేపీ-జనసేన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీట్లు సర్దుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టోపై ప్రధాన చర్చ జరిగినట్లు సమచారం. ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి జీ. సతీష్, కేంద్ర మాజీమంత్రి పురంధరేశ్వరి, సోము వీర్రాజు, మాధవ్, కామినేని పాల్గొన్నారు. జనసేన నుండి నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. -
‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకే అమరావతిపై తను ప్రకటన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ సైతం వేసవి రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ సీఎం ప్రకటనతో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్డీఏ చట్టం ద్వారా రైతుల భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెట్టవద్దని హితవు పలికారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని పనులను కేంద్ర ప్రభుత్వం చేయదని చెప్పారు. పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్ సూచించారని తెలిపారు. ఒక చానల్ తనపై తప్పుడు వార్తలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ కట్టుకథలు అల్లితే సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అమరావతిపై జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తను మాట్లాడుతున్నట్టు చెప్పారు. -
‘జీవీఎల్‌పై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణం’
సాక్షి, అమరావతి : రాజధానిపై వివరణ ఇచ్చినందుకుగాను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై జోక్యం చేసుకోమని కేంద్రం వెల్లడించినా.. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోందని విమర్శించారు. ‘రాజధానిపై కేంద్ర జోక్యం చేసుకోదని పార్లమెంట్లో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. పచ్చ మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌పై దుష్ర్పచారానికి ఒడిగట్టడం దారుణం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. లోకేశ్ తర్వాత ఆయనే చక్రం తిప్పారు ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు గత ఐదేళ్లలో అక్రమ పద్దతిలో రూ.వేలకోట్ల ఆస్తులను పోగేసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త. బాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు. అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : వామ్మో.. ఏబీవీ!: సర్వత్రా విస్మయం) -
మండలి రద్దు: కేంద్రం అడ్డు చెప్పే ఛాన్సే లేదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. (మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం) -
బీజేపీ, జనసేన కీలక భేటీ : విలీనమా? పొత్తా?
సాక్షి, విజయవాడ : బీజేపీతో జనసేన పార్టీ పొత్తా? విలీనమా? అనేది నేడు తేలనుంది. దీనిపై చర్చించేందుకు ఇరుపార్టీల ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున ఇన్చార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన తరపున సమావేశంలో పాల్గొన్న వారిలో పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు. మూడు రోజుల క్రితం హస్తినాలో మకాంవేసిన పవన్.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆతర్వాత బీజేపీ, జనసేన పొత్తుపై ప్రతిపాదనలు వచ్చింది. దీంతో జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవడమా లేదా పొత్తు కుదుర్చుకోవడమా అనే అంశంపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. అయితే దీనిపై బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుతో రహస్య పొత్తు కుదుర్చుకున్న పవన్‌తో కలిసి ఎలా పనిచేద్దామని కొంతమంద నేతలు ప్రశ్నింస్తుండగా, ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని మరికొంత మంది కొంతమంది ప్రతిపాదించినట్లు సమాచారం. జనసేనతో భేటీకి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. జనసేన అధినేత పవన్‌తో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వచ్చే నాలుగేళ్లలో జనసేనతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చంచామని బీజేపీ సినియర్ నేత జీవీఎల్ అన్నారు. కేవలం అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలే తమ ఎజెండా కాదని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణ ఉంటుందన్నారు. 2024 ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జీవీఎల్ పేర్కొన్నారు.