High Security
-
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో సోమవారం(జులై 15) సెక్రటేరియట్ సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను బీఆర్కేభవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అంతకుముందు సెక్రటేరియట్‌కు వెళ్లే అన్ని దారుల్లో నిఘా పెంచారు. ముందస్తుగా నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ముట్టడికి బయలుదేరిన వారిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోటీ పరీక్షలు వాయిదా వేయాలని రెండు రోజుల నుంచి అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. -
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత
-
అనకాపల్లి జిల్లాలో 1529 పోలింగ్ కేంద్రాలు..
-
సీఎం జగన్ కర్నూలు పర్యటనకు భారీ సెక్యూరిటీ..
-
సీఎం జగన్ సిద్ధం సభకు భారీ బందోబస్తు
-
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వచ్చిన బాంబుల బెదింపులు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ మెయిల్ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైకోర్టుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టులో భారీ బాంబు పేలుడు సంభిస్తుందని బుధవారం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మెయిల్ వచ్చింది. ‘ఫిబ్రవరి 15న హైకోర్టులో బాంబు పేల్చుతా. ఈ పేలుడు ఢిల్లీలోనే అతిపెద్దది కానుంది. ఎంతమంది భద్రతా బలగాలైనా పెట్టుకోండి.. అందరినీ పేల్చివేస్తాం’ అని గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే రోజు మరోవైపు బిహార్ డీజీపీకి వాట్సప్ ఆడియో క్లిప్ ద్వారా బాంబు బెదిరింపు రావటం గమనార్హం. అయితే ఈ ఘటనలో నిందితుడిని కర్ణాటకలో పటుకున్నామని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి అతన్ని విచారణ కోసం పట్నా తరలించారు. నిందితుడిని అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత
-
స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట బందోబస్త్
-
జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తిస్థాయి చర్యలు
-
స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు...
-
తిరుమలలో పటిష్టమైన నిఘా, పోలీసుల భద్రత
-
అమరావతి అమరలింగేశ్వర ఆలయం వద్ద చర్చకు సిద్ధమైన నంబూరు
-
2500 మంది పోలీసులతో భద్రత
-
హైదరాబాద్: మొహర్రం సందర్భంగా పాతబస్తీలో భారీ బందోబస్తు
-
హాజరుకానున్న ప్రధాని... ఆ ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా...
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర పోలీసు విభాగం యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అనేక మంది అత్యంత ప్రముఖులు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు దేశంలోని 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కానుండటం, ఇక్కడే ఉండనుండటంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఆఖరి రోజు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. నగరంలోని రాజ్‌భవన్ లేదా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు నోవాటెల్, వెస్టిన్ లేదా ఐటీసీ కోహినూర్ల్లో ఏదో ఒకచోట మోదీ బస చేస్తారని తెలుస్తోంది. ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులదే తుది నిర్ణయమని పోలీసులు చెబుతున్నారు. రాజ్‌భవన్‌తో పాటు ఆయా హోటళ్లలోనూ అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ హోటళ్లలో నో రూమ్స్... అత్యంత ప్రముఖులతో పాటు ఇతరులు, వారి భద్రతా సిబ్బంది బస చేయడానికి బీజేపీ పార్టీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మాదాపూర్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న హోటళ్లను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు బుక్ చేసేసింది. ప్రధాని సహా ప్రముఖులు దాదాపు 350 మంది రానున్నారని తెలుస్తోంది. వీరితో పాటు అనుచరులు, సహాయకులు సైతం పెద్ద సంఖ్యలోనే వస్తారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హోటళ్లతో పాటు సాధారణ హోటళ్లలోని రూమ్‌లన్నీ బ్లాక్ చేసి ఉంచారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఐటీ కారిడార్‌లోని హోటళ్లను బుక్ చేసుకుని అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. ఆ మూడు రోజు లూ సాధారణ కస్టమర్లకు హోటళ్లలో గదులు దొరకని పరిస్థితి ఉంది. మరోపక్క నగరంలోనూ కొన్ని హోటళ్లలోని రూమ్స్ బీజేపీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అబిడ్స్, లక్డీకాపూల్లతో పాటు బేగంపేట్, అమీర్‌పేట్, సికింద్రాబాద్‌ల్లో ఉన్న హోటళ్లను బుక్ చేసి ఉంచారు. ప్రారంభమైన సెక్యూరిటీ వెట్టింగ్ ప్రక్రియ.. ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు, బీజేపీ జాతీయ ముఖ్యనేతలు రానుండటంతో సైబరాబాద్ పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. బందోబస్తు కోసం రాచకొండతో పాటు ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించనున్నారు. భద్రత చర్యల్లో భాగంగా ఆయా హోటళ్లలో పని చేసే సిబ్బందికి సంబంధించి సెక్యూరిటీ వెట్టింగ్ చేపడుతున్నారు. వారి వివరాలు, ఆధార్ లేదా గుర్తింపుకార్డుల్ని సేకరిస్తున్నారు. వీటిని స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు సాయంతో సరిచూస్తున్నారు. హెచ్ఐసీసీతో పాటు ఆయా హోటళ్ల పక్కన నిర్మాణంలో ఉన్న భవనాల పైనా పోలీసులు దృష్టి పెట్టారు. వాటిలో పని చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీల వివరాలు సేకరిస్తున్నారు. వీరందరి పూర్వాపరాలు, గత చరిత్ర, నేరాలు సంబంధాలు తదితరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ సెక్యూరిటీ వెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలు బస చేసే హోటళ్ల వద్ద యాక్సెస్ కంట్రోల్ పాయింట్లు, చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అడుగడుగున వాహనాల తనిఖీలు చేపట్టనున్నారు. హోటల్ సిబ్బందితో పాటు బస చేస్తున్న వారికీ సరైన గుర్తింపు కార్డులు ఉంటేనే లోనికి అనుమతించనున్నారు. ఆయా హోటళ్లల్లో ఇప్పటికే ఉన్న వాటి పనితీరు పరిశీలించడంతో పాటు తోడు కొత్తగా పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: బీజేపీ నేతల తీరు దుర్మార్గం: బాల్క సుమన్) -
Suriya: హీరో సూర్య ఇంటి వద్ద హై సెక్యూరిటీ
Jai Bhim Controversy: Suriya Gets Police Protection: హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఓటీవలె ఓటీటీలో విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఓవైపు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వన్నియర్ సంఘం తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. చెన్నైలోని సూర్య నివాసం వద్ద పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు సూర్యకు పలువురు ప్రముఖులు సహా అభిమానులు అండగా నిలుస్తున్నారు. ట్విట్టర్లో # WeStandwithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. సూర్యకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
నిఘా నీడన నిమజ్జనం
-
తమిళనాడులో ‘లష్కరే’ జాడ
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావటంతో పోలీసులు శుక్రవారం గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు తెలియడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి. ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుసబాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఐసిస్ మద్దతుదారులకు విదేశాల్లో శిక్షణనిచ్చి ఇక్కడ చొప్పించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకు రంగంలోకి దిగారు. నుదుట తిలకం పెట్టుకుని... కోయంబత్తూరులో చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నుదుట తిలకం పెట్టుకుని ఉన్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
కాకినాడ సిటీ: ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలతో పాటు, జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో శనివారం పోలీసు సూపరింటెండెంట్లు, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అంతర వలయంలో సీఆర్పీఎఫ్ దళాలు, మధ్య వలయంలో ఏపీఎస్పీ దళాలు, బాహ్య వలయంలో స్థానిక పోలీస్ దళాలను మోహరించాలని సూచించారు. అభ్యర్థులు ప్రతిపాదించిన కౌంటింగ్ ఏజెంట్ల ప్రవర్తన, నేర చరిత్రలను పోలీసు శాఖ పరిశీలించి నివేదికను ఆర్వోలకు అందజేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున గుంపులు, సమూహాలు ఉత్సాహం, నైరాశ్యాలకు లోనై ఎవరూ శాంతిభద్రతలకు కలిగించకుండా కౌంటింగ్ కేంద్రాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లతో రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించేలా కోరాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన తరువాత ఆర్వోలు, డీఎస్పీలు ఈవీఎంలను గోడౌన్‌కు, స్టాట్యుటరీ పత్రాల ట్రంక్ బాక్సులను కలెక్టరేట్‌కు సురక్షితంగా తరలించి భద్రపరచాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్ గున్ని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా 911 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా తగిన ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ సూచనల మేరకు జేఎన్టీయూకేలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మరో 150 నుంచి 200 మంది అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పా రు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, రంపచోడవ రం ఐటీడీఏ పీవో నిషాంత్ కుమార్, సబ్ కలెక్టర్లు సా యికాంత్ వర్మ, వినోద్‌కుమార్, చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త కిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సుమీత్‌కుమార్ గాంధీ, డీఆర్వో ఎం వీ గోవిందరాజులు, సీఆర్పీఎఫ్ దళాల ఇన్చార్జి ము రళీ, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
ఇక వాహనంతో పాటే ‘హైసెక్యూరిటీ’
సాక్షి, హైదరాబాద్ : ఇక నుంచి హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ)తో పాటే వాహనాలు రోడ్డెక్కనున్నాయి. తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై వాహనాలను విడుదల చేసే పద్ధతికి త్వరలో స్వస్తి చెప్పనున్నారు. బండి కొనుగోలు సమయంలో షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌తో పాటు హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ను బిగించి ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. ఇటీవల కేంద్రం వాహన తయారీదార్లతో జరిపిన సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. వాహనం తయారీతో పాటే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ ఏర్పాటు చేసి ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తయారీదార్లు తేల్చారు. అది డీలర్ల స్థాయి లోనే అమలు జరగాలని స్పష్టీకరించారు. ఈ మేరకు కేంద్రం తాజాగా విధివిధానాలను రూపొందించింది. దీంతో రవాణా శాఖ చర్యలు చేపట్టింది. త్వరలో ద్విచక్ర వాహనా లు, కార్లు, తదితర అన్ని రకాల వాహన డీలర్లతో సమావేశం జరిపి మే నెల నుంచి అమలు చేయనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ ‘సాక్షి’తో చెప్పారు. హెచ్ఎస్ఆర్పీ ఇలా.... వాహనాల భద్రత దృష్ట్యా హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ప్లేట్లను అమర్చాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ మేరకు రవాణాశాఖ 2013 నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమలు చేస్తోంది. రాష్ట్రంలో లింక్ ఆటోటెక్ సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. మొదట్లో ఆర్టీఏలో నమోదయ్యే వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా నంబర్ప్లేట్లను తయారు చేసి ఇవ్వడంలో ఆ సంస్థ విఫలమైంది. ఒక్కో వాహనానికి కనీసం 2 నుంచి 3 నెలల వరకు సమయం పట్టేది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటా సుమారు 2 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుండగా వాటిలో కనీసం సగానికి కూడా అందజేయలేకపోయారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకోవడంతో ఆర్టీఏ అధికారులు దీనిపై దృష్టిసారించారు. అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోనే లింక్ ఆటోటెక్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నంబర్ప్లేట్లను అందజేసేవిధంగా చర్యలు చేపట్టారు. దీంతో 2016 నుంచి కొంత మార్పు వచ్చింది.పెండింగ్ వాహనాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కనీసం 15 నుంచి 20 రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. మరోవైపు ఈ జాప్యం కారణంగా వాహనదార్లే హెచ్ఎస్ఆర్పీ పట్ల విముఖత ప్రదర్శించారు. దీన్ని ఇప్పుడు అధిగమించే దిశగా రవాణా శాఖ అడుగులు వేస్తోంది. మరింత పకడ్బందీగా... తాజా ఆదేశాలతో బండి కొనుగోలు సమయంలో షోరూమ్‌లోనే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ ఏర్పాటు చేసి ఇవ్వనున్న దృష్ట్యా వినియోగదారుడు నిరాకరించే వీలుండదు. అంటే శాశ్వత రిజిస్ట్రేషన్‌తోనే వాహనం బయటకు వస్తుంది.వాహనం ఖరీదులో భాగంగానే దీనిని ఏర్పాటు చేసి ఇస్తారు. హెచ్ఎస్ఆర్పీ కోసం ప్రత్యేకంగా అదనపు రుసుము వసూలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ అధికారులను సంప్రదించవలసిన అవసరం ఉండదు. బండి విడుదలైన వారం, పది రోజుల్లో వాహన యజమాని ఇంటికే ఆర్సీ పత్రాలు స్పీడ్ పోస్టు ద్వారా చేరేలా చర్యలు తీసుకుంటారు. స్పెషల్ నంబర్లపైన ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇందుకోసం మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
త్వరలో హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులు మరో 3 నెలల్లో అత్యంత భద్రతా ఫీచర్లున్న హై సెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు అందుకోనున్నారు. ఉన్నత విద్య, వైద్యం, పర్యాటకం, తాత్కాలిక నివాసం తదితర అవసరాల నిమిత్తం విదేశీ పర్యటనలు చేసేందుకు పాస్‌పోర్ట్‌లు తప్పనిసరి. దీంతో మహానగరం పరిధిలో నెలకు లక్షకు పైగా నూతన పాస్‌పోర్ట్‌ల జారీ, పాతవాటి రెన్యువల్స్ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో హైసెక్యూరిటీ గల ఈ–చిప్‌లు ఉండే పాస్‌పోర్ట్‌లను అందజేసేందుకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతితో దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల డిమాండ్ అధికంగా ఉన్న నగరాలకు అత్యంత భద్రతా ఫీచర్లతో పాస్‌పోర్ట్‌లను ముద్రించే ప్రింటింగ్ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ యంత్రాలను నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో తయారు చేస్తున్నట్లు వివరించారు. మరో 3 నెలల తర్వాత నూతనంగా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకున్నవారికి, పాతవాటిని రెన్యువల్ చేసుకునేవారికి ఈ–చిప్‌లు ఉన్న అత్యంత భద్రమైన పాస్‌పోర్ట్‌లను అందజేయనున్నారు. నో ట్యాంపరింగ్..: పాస్‌పోర్ట్‌లో అత్యంత కీలకమైన పుట్టినతేదీ, తండ్రి, భార్య, భర్త పేరు, ఆధార్ నంబర్, ప్రస్తుత, శాశ్వత చిరునామా వంటి వ్యక్తిగత వివరాలకు అత్యంత భద్రత కల్పించేందుకే ఈ హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు జారీ చేయాలని విదేశాంగ శాఖ సంకల్పించింది. ప్రస్తుతం జారీ చేస్తున్న 36 పేజీలు లేదా 60 పేజీల బుక్‌లెట్‌లా ఉండే హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లో అత్యంత నాణ్యత ఉండే కాగితాన్ని వినియోగించడంతోపాటు పేజీల్లో అంతర్లీనంగా ఈ–చిప్‌లను పొందుపరచనున్నారు. ఒకవేళ ఇతరుల ఫొటో పెట్టి ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఈ–చిప్‌ల ద్వారా పాస్‌పోర్ట్ కార్యాలయానికి సందేశం అందుతుందని పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. భద్రత పరంగా ఇవి అత్యంత సురక్షితమని తెలిపారు. ఇక ఈ–చిప్ ఉన్న పాస్‌పోర్ట్‌ల జారీకి ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయని చెప్పారు. -
కేంద్ర బలగాలా? రాష్ట్ర బలగాలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్ర త వ్యవహారంపై పీటముడి ఏర్పడింది. తనకు అధికార పార్టీతోపాటు పలువురు అధికారుల నుంచి ప్రాణహాని ఉందని, రాష్ట్ర పోలీసులు కాకుండా ఇతర స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బలగాల నుంచి భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి కోరినట్లుగా భద్రత కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారితోపాటు డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం వికారాబాద్ ఎస్పీ టీఎస్ఎస్పీకి చెందిన 4+4 భద్రతను రేవంత్‌రెడ్డి ఇంటికి పంపించారు. అయితే రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండటంతో భద్రతా సిబ్బంది ఆయన వచ్చే వరకు వేచి ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది రజనీకాంత్‌రెడ్డిని సంప్రదించగా తాము కేంద్ర బలగాలు లేదా రాష్ట్రానికి సంబంధం లేదని స్వతంత్ర విభాగం నుంచి భద్రత కోరామని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్ర అధికారులపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఆ మేరకు న్యాయస్థానం పిటిషనర్ రేవంత్‌రెడ్డి కోరినట్లు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆదేశించినట్టు ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే.. పోలీస్ శాఖ మాత్రం హైకోర్టు ఆదేశాల ప్రకారమే తాము రాష్ట్ర భద్రతను కల్పించేందుకు సిబ్బందిని పంపించామని చెప్పారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం ఇక్కడ సిబ్బందితోనే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి ఆ భద్రతను వద్దనుకుంటే అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమాధానమిస్తామని స్పష్టం చేశారు. అటు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం ఇది కోర్టు« ధిక్కరణ కిందకు వస్తుందని, తాము కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. -
చెన్నైలో బీజేపీ ఆఫీసు వద్ద భారీ భద్రత
-
బేగంపేట ఎయిర్‌పోర్టులో హైసెక్యూరిటీ
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. 28వ తేదీనుంచి ప్రారంభం కానున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టులో విమానం దిగనున్నారు. అందుకోసం బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఎస్పీజీ తనిఖీలు నిర్వహించింది. ధాని మోదీ ల్యాండింగ్, టేక్ ఆఫ్ ప్రాంతాలను పరిశీలించింది. ఇప్పటికే బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఎస్పీజీ అధీనంలో ఉంది. బేగంపేట్ పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా పెంచారు. భద్రతా ఏర్పాట్లను సీపీ వి.వి.శ్రీనివాస్ రావు పరిశీలించారు.