Jagananna Pala Velluva
-
పాడికి భరోసాపై కాలకూట విషం
సాక్షి, అమరావతి: సంక్షోభంలో చిక్కుకుని మూతపడ్డ సహకార పాల డెయిరీలను పునరుద్ధరించారు.. ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సహకార రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. లీటర్‌కు రూ.4 చొప్పున అదనపు లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా లీటర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకూ అదనపు లబ్ధి చేకూరుస్తున్నారు. ఇప్పుడు పాడి రైతు చిరునవ్వులు చిందిస్తుంటే ఈనాడు రామోజీకి నచ్చడం లేదు. తన హయాంలో పాడి రైతును దగా చేసిన చంద్రబాబుకు బాకా ఊదడమే లక్ష్యంగా విషపు రాతలతో తెగబడుతున్నారు. తన బురద రాతలతో పాడి రైతుకు భరోసాపై ఓర్వలేనితనంతో కాలకూట విషం కక్కుతున్నారు. ‘పాడి కష్టం..అమూల్ పాలు’ అంటూ కాకిలెక్కలతో ఈనాడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈనాడు ఆరోపణ: ఏళ్లు గడుస్తున్నా..పెరగని పాలసేకరణ వాస్తవం: రాష్ట్రంలోని ప్రైవేటు డెయిరీలన్నీ కలిపి రోజుకు 22 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంటే..అమూల్ సంస్థ కేవలం 3.45 లక్షల లీటర్లు మాత్రమే సేకరిస్తోందని ఆరోపించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ సంస్థ రోజుకు 3.75 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. నేడు 4778 గ్రామాల్లో 4.15 లక్షల మంది మహిళా పాడి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,09,763 మంది రోజూ పాలు పోస్తున్నారు. 2023 జూలైలో రోజుకు 1.74 లక్షల లీటర్లు పాలు సేకరణ చేయగా.. 2024 జనవరి నాటికి 3.75 లక్షల లీటర్ల పాలసేకరణకు చేరుకుంది. 4 లక్షల లీటర్ల పాల సేకరణకు ప్రైవేటు డెయిరీలకు రెండు దశాబ్దాలకుపైగా పడితే అమూల్ కేవలం మూడేళ్లలో 4 లక్షల లీటర్లకు చేరువలో ఉంది. ఆరోపణ: నమ్మించి నట్టేట ముంచారు వాస్తవం: మధ్యవర్తులు లేకుండా మహిళా పాడి రైతులకు నేరుగా ప్రతి పదిరోజులకోసారి పాల బిల్లులను చెల్లిస్తున్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం కింద ప్రతి లీటర్‌కు పాల నాణ్యత మేరకు రూపాయి నుంచి రూ.2.75 చొప్పున అందిస్తున్నారు. 180 రోజులకు తక్కువకాకుండా పాలు పోసే మహిళా పాడి రైతులకు మూడేళ్లలో రాయిల్టీ ఇన్సెంటివ్ కింద ఇప్పటి వరకు రూ.4.93 కోట్లు చెల్లించారు. ఆరోపణ: ప్రైవేటు డెయిరీ కంటే తక్కువ ధర? వాస్తవం: జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి పాల సేకరణ ధరలు ఏడు సార్లు పెంచారు. ఫలితంగా గేదె పాలు లీటరుకు రూ.18.29(రూ.71.47 నుంచి రూ.89.76) ఆవు పాలకు రూ.9.49(రూ.34.20 నుంచి రూ.43.69)కు పెంచారు. 13 శాతం కొవ్వు, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో లీటరుకు గరిష్టంగా రూ.104 చొప్పున పాడిరైతులకు ఇస్తున్నారు. ఈ ధర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేటు డెయిరీ చెల్లించడం లేదు. ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ధర, ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ధర చెల్లిస్తుంటే, జగనన్న పాల వెల్లువలో సీజన్‌తో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర అందిస్తున్నారు. అమూల్ ధరలు పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా తమ పాలసేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా ప్రైవేటు డెయిరీల నుంచి పాలు పోసే రైతులకు ఈ ప్రాజెక్టు ఫలితంగా రూ.4818.05 కోట్ల అదనపు లబ్ధి చేకూరింది. ఆరోపణ: పాడి రైతులకు చేయూత ఏదీ? వాస్తవం: పాడి రైతులకు 20 శాతం సీపీతో అత్యంత నాణ్యమైన పశువుల దాణా సరఫరా చేస్తున్నారు. ఈ కారణంగానే గరిష్ట ధర పొందుతున్నారు. ఇంతవరకు 1065 టన్నుల దాణా పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా పాలుపోసే వారికి నిర్వహణ ఖర్చులు, దాణా, పశువైద్య సాయం, నీరు, విద్యుత్ సరఫరా వంటి వాటి కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలు కూడా అందిస్తున్నారు. పాల సేకరణకు 317 మండలాల్లో 6684 గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే 137 చోట్ల బీఏంసీయూ భవనాలు నిర్మించారు. గ్రామ స్థాయిలో పాల సేకరణ, పరీక్ష, శీతలీకరణ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.126 కోట్లు విడుదల చేసింది. ఆరోపణ: గలీజు ఒప్పందాలు..అప్పు తీర్చి అప్పగించారు.. వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రైవేటు డెయిరీలు మూతపడ్డాయి. అలాగే యూహెచ్‌టీ, పౌడర్ ప్లాంట్లు, ఎంసీసీలతో పాటు 141 బీఎంసీయూలను మూసేశారు. మూతపడిన డెయిరీలను పునరుద్దరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. లిక్విడేషన్‌లో ఉన్న చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. డెయిరీలోని కొంత భాగాన్ని మాత్రమే అమూల్‌కు లీజుకు ఇచ్చారు. వాటి ఆస్తులు, భూములపై అమూల్‌కు ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఈ ప్రాజెక్టు కోసం అమూల్ రూ.385 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చిత్తూరు డెయిరీకి రూ.182 కోట్లు అప్పులు తీర్చి అప్పగించారంటూ చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. ఈ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయాం నుంచి ఉన్నవే. వాటిని క్లియర్ చేసిందే తప్ప అమూల్‌కు లీజుకు ఇచ్చేందుకు చెల్లించలేదు. ఒంగోలు డెయిరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అమూల్‌కు లీజుకు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు అమూల్ పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాంటపుడు రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తులు ధారాదత్తం చేస్తున్నారని పస లేని రాతలు రాస్తున్నారు. -
మూడింతలు పెరిగిన అమూల్‌కు పాలు పోసే పాడి రైతులు
-
నమ్మకాన్ని కాపాడింది
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ (జేపీవీ)కు ఆదరణ వెలువెత్తుతోంది. ప్రైవేట్ డెయిరీల దోపిడికీ చెక్ పెడుతూ ‘అమూల్’ దూసుకెళుతోంది. నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ పాడి రైతుల నమ్మకాన్ని చూరగొనడంతో పాలు పోసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాల సేకరణ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రోజుకు 1.74 లక్షల లీటర్ల పాలను సేకరించిన అమూల్ ప్రస్తుతం ఏకంగా 3.61 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అమూల్‌కు పాలు పోసే పాడిరైతుల సంఖ్య మూడింతలు పెరిగింది. 1,800 లీటర్ల నుంచి 3.61 లక్షల లీటర్లకు.. రాష్ట్రంలో జగనన్న పాల వెల్లువ ఓ ఉద్యమంలా సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2020 డిసెంబర్లో జేపీవీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు (వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం) జిల్లాల్లో 401 గ్రామాలతో మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 19 జిల్లాల్లో 4,127 గ్రామాలకు విస్తరించింది. తొలుత ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యేందుకు 24,277 మంది ముందుకు రాగా నేడు అది 3,78,567 మందికి చేరింది. రోజూ పాలుపోసే పాడి రైతులు ప్రారంభంలో 800 మంది ఉండగా నేడు ఏకంగా లక్ష మందికి చేరుకున్నారు. ప్రారంభంలో రోజుకు సగటున 1,800 లీటర్లు పాలు పోయగా ఇప్పుడు ఏకంగా 3.60,808 లీటర్ల సేకరణ జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర, విస్తృత నెట్వర్క్ కలిగిన ప్రైవేట్ డెయిరీలు సైతం రోజుకు సగటున 6 లక్షల లీటర్లకు మించి పాలు సేకరించలేని పరిస్థితి నెలకొనగా మూడేళ్ల వయసున్న అమూల్ నిత్యం రాష్ట్రంలో 3.61 లక్షల లీటర్లకు పైగా పాలు సేకరిస్తుండడం అరుదైన రికార్డుగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా గత ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జూలై నాటికి 3,475 గ్రామాల పరిధిలో 3.11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా రోజుకు సగటున 68 వేల మంది 1.74 లక్షల లీటర్ల పాలు పోసేవారు. అలాంటిది డిసెంబర్ 25 నాటికి 4,127 గ్రామాలకు విస్తరించగా ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 3.78 లక్షల మందికి చేరుకుంది. రోజుకు సగటున 3.61 లక్షల లీటర్ల పాలు పోయడంతో ఆర్నెల్లలో సేకరణ రెట్టింపు దాటింది. వృద్ధి రేటు ఏకంగా 197.99 శాతంగా నమోదు కావడం గమనార్హం. నమ్మకం పెరిగిందిలా... అమూల్ ప్రారంభంలో 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో గేదె పాలకు రూ.71.74 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా మూడేళ్లలో ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు సేకరణ ధరలు తగ్గించడం, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచినట్లుగా గిమ్మిక్కులు చేస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీలు దోచుకునేవి. అమూల్ మాత్రం ఉత్పత్తి తగ్గినా, పెరిగినా ఒకే రీతిలో ప్రకటించిన ప్రకారం పాల సేకరణ ధరలను చెల్లిస్తోంది. పైగా ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతాన్ని బట్టి లెక్కగట్టి అణాపైసలతో సహా పాలు పోసిన 10 రోజుల్లో నేరుగా పాడిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతాన్ని బట్టి గేదె పాలకు లీటర్‌కు రూ.100, ఆవు పాలకు రూ.50కు పైగా ధర పక్కాగా లభిస్తుండడంతో పాడిరైతుల్లో అమూల్ పట్ల భరోసా ఏర్పడింది. రూ.4.93 కోట్ల బోనస్.. భారీగా రుణాలు ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు క్రమం తప్పకుండా పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున అమూల్ బోనస్ చెల్లిస్తుండడం పాడిదారులకు భరోసానిస్తోంది. మూడేళ్లలో రాయల్టీ ఇన్సెంటివ్ (బోనస్) కింద రూ.4.93 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. లాభాపేక్ష లేకుండా 2,300 టన్నులకుపైగా నాణ్యమైన ఫీడ్‌ను పంపిణీ చేసింది. అంతేకాకుండా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెలకు రూ.30 వేలు, ఆవులకు రూ.25 వేల చొప్పున ఆర్ధిక చేయూతనివ్వడమే కాకుండా కొత్తగా పాడి కొనుగోలుకు ముందుకొచ్చే రైతులకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేల చొప్పున స్వయంగా రుణాలందిస్తోంది. ఇప్పటివరకు 12,728 మంది మహిళా పాడి రైతులకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.60.29 కోట్లు అందించారు. 3,090 మంది రైతులకు పాడి కొనుగోలకు రూ.30.01 కోట్లు రుణాలిచ్చారు. జేపీవీ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాలసేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. జేపీవీ ప్రారంభ మైనప్పటి నుంచి నేటి వరకు 12.70 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.575.42 కోట్లు పాడి రైతుల ఖాతాల్లో జమ చేసింది. అరుదైన రికార్డు.. జేపీవీ ప్రాజెక్టుకు గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. మూడేళ్లలో అనూహ్య పురోగతి సాధించింది. రోజుకు 3.61 లక్షల లీటర్ల పాలను సేకరించడం ఓ అరుదైన రికార్డుగానే చెప్పవచ్చు. ప్రైవేట్ డెయిరీలు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నాయో, ఎలా నష్టపోతున్నారో పాడి రైతులకు అర్ధమయ్యే రీతిలో చెప్పడంలో అమూల్ విజయవంతం కావడం వల్లే ఇది సాధ్యమైంది. నాలుగు లక్షల లీటర్ల సేకరణను అధిగమించే రోజు దగ్గర్లోనే ఉంది. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీడీడీసీఎఫ్ అణా పైసలతో సహా చెల్లిస్తున్నారు.. జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజూ 4–5 లీటర్ల గేదె పాలు పోస్తుంటాం. నాణ్యమైన మేత వల్ల పాల నాణ్యత పెరిగింది. ఫ్యాట్ 13, ఎస్ఎన్ఎఫ్ 9 శాతంతో మంగళవారం 4.4 లీటర్ల పాలు పోయగా లీటర్‌కు రూ.102.50 చొప్పున రూ.451 సేకరణ ధర లభించింది. ప్రకటించిన ధర కంటే రూ.56 అదనంగా వచ్చింది. ప్రైవేట్ డెయిరీలకు పాలు పోస్తే లీటర్‌కు రూ.50 రావడం కూడా గగనంగా ఉండేది. ఫ్యాట్ 11, ఎస్ఎన్ఎఫ్ 9 శాతానికి మించి ఇచ్చేవారు కాదు. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న సమయంలో ఏదో ఒక సాకుతో కోతలు పెట్టేవారు. ఇప్పుడు ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ ఎంత శాతం ఉంటే ఆ మేరకు లెక్కగట్టి నగదు మా ఖాతాల్లో జమ చేస్తున్నారు. – చిరుమామిళ్ల రాణి, కొంజెర్ల, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా -
‘గిట్టుబాటు’పై తడబాట్లు..
సాక్షి, అమరావతి : అతికినట్లు అబద్ధం చెప్పాలని ఈనాడు రామోజీరావు తెగ తాపత్రయపడతారు. కానీ, ఆ తడబాటులో చెప్పకుండానే ఆయన నిజాలు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే.. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తారాస్థాయిలో ఆయనకున్న అక్కసు, విద్వేషం వెళ్లగక్కడంలో ఆయన ఏం చేస్తున్నారో.. ఏం రాస్తున్నారో తెలుసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. తాజాగా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో అమూల్ సంస్థవల్లే గిట్టుబాటు ధర లభించడంలేదని.. అమూల్ ఉద్దేశ్యపూర్వకంగానే పాల సేకరణ ధరలు తగ్గించేసిందని పెడబొబ్బలు పెడుతూ ఈనాడు ఎప్పటిలాగే సిగ్గూఎగ్గూ గాలికొదిలేసి ‘రోడ్డెక్కిన పాడి రైతులు’ అంటూ చేతికొచ్చింది ఎడాపెడా రాసిపారేసింది. నిజానికి.. అసలు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకం ఆ మండలంలో ఇంకా శ్రీకారం చుట్టనేలేదు. అలాంటప్పుడు అమూల్ పాల సేకరణ ధరలు ఎలా ఇస్తుంది? ఈ మండలంలో జేపీవీ ఇంకా ప్రారంభం కాలేదంటే అమూల్ ఇంకా అక్కడకు వెళ్లలేదనే కదా అర్థం. మరి అమూల్ నుంచి గిట్టుబాటు ధర ఎలా లభిస్తుంది? ఇంత చిన్న లాజిక్‌ను రామోజీ ఎలా మిస్సయ్యారు? ఇక ఇదే జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో అమలవుతున్న జేపీవీతో పాడి రైతులు ఎంతో లబ్ధిపొందుతున్నారు. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ, జమ్మలమడుగులో పాడి రైతులు పాలు నేలపాలు చేశారంటే అక్కడున్న ప్రైవేట్ డెయిరీలు లేదా ప్రైవేట్ వ్యాపారులు సరైన ధరలు ఇవ్వడంలేదనే కదా అర్థం. పాడి రైతుల నిరసనతో అక్కడ అమూల్ అవసరం ఎంతుందో దీనిబట్టి తెలీడంలేదా రామోజీ.. అబద్ధం చెప్పాలన్న ఆతృతలో నిజం కక్కేసి మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు కదా.. అలాగే, ఈ ఉదంతంతో అక్కడ అమూల్ అవసరం ఎంతుందో స్పష్టం చేస్తోంది కదా..! అసలు విషయం ఏమిటంటే.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద కొంతమంది పాడి రైతులు తమకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ తమ వెంట తెచ్చుకున్న పాలతో గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి మరికొంత నేలపాలు చేసి నిరసన తెలిపారు. ఈ మండలంలో పాల వ్యాపారులతోపాటు ప్రైవేటు డెయిరీలు పాడి రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. మొన్నటి వరకు లీటర్ రూ.80 వరకు చెల్లించేవారు. పాల ఉత్పత్తి పెరిగిందనే సాకుతో ఇప్పుడు వీరు పాల సేకరణ ధరను రూ.55కు మించి ఇవ్వడంలేదు. దీంతో తమకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ వారంతా నిరసన వ్యక్తంచేశారు. కానీ, ఇందులోని నిజానిజాలు ఏమీ తెలుసుకోకుండా.. ఒకవేళ తెలిసినా తెలీనట్లు నటిస్తూ జగనన్న పాల వెల్లువ పథకం కింద పాలు సేకరిస్తున్న అమూల్ సంస్థవల్లే గిట్టుబాటు ధర లభించడంలేదని.. అమూల్ కావాలనే పాల సేకరణ ధరలు తగ్గించేసిందని ఈనాడు నిస్సిగ్గుగా ఆరోపించింది. విజయవంతంగా అమలవుతుంటే.. నిజానికి.. డిసెంబర్ 2020లో జగనన్న పాలవెల్లువ (జేపీవీ) పథకాన్ని ప్రారంభించిన జిల్లాల్లో వైఎస్సార్ జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో చక్రాయపేట, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లోని 100 గ్రామాల్లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పెండ్లిపర్రి, వీరపునాయనపల్లి మండలాలకు విస్తరించారు. ప్రారంభంలో 1,483 మహిళా పాడి రైతుల నుంచి రోజుకు 4,066 లీటర్ల పాలు సేకరించే వారు. ప్రస్తుతం ఈ తొమ్మిది మండలాల పరిధిలో 162 గ్రామాల్లో పాలుపోసేవారి సంఖ్య 4,416 మందికి చేరగా, రోజుకు 23,964 లీటర్లు పాలు సేకరిస్తున్నారు. ఇక పాల సేకరణ ధరలను అమూల్ సంస్థ మూడేళ్లలో ఏడుసార్లు పెంచింది. గేదె పాలకు లీటర్‌కు రూ.71.47 నుంచి రూ.89.76కు, ఆవు పాలకు లీటర్‌కు రూ.34.20 నుంచి రూ.43.69కు చొప్పున పెంచారు. గేదె పాలపై లీటర్‌కు రూ.18.29, ఆవుపాలపై లీటర్‌కు రూ. 9.49 చొప్పున పెంచారు. పైగా ఈ జిల్లాలో ఇప్పటివరకు 471.30 టన్నుల పశువుల దాణాను 2,100 మంది మహిళా పాడి రైతులకు పంపిణీ చేశారు. ఏడాదిలో 180 రోజులపాటు పాలుపోసిన రైతులకు రాయల్టీ ఇన్సెంటివ్ రూపంలో రూ.4.93 కోట్లు చెల్లించారు. ఇదే జిల్లాలోని 20 మండలాల్లో మరో 270 గ్రామాల్లో విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. విచ్చలవిడిగా ప్రైవేట్ డెయిరీల దోపిడీ.. అమూల్ పనితీరు ఇలా ఉంటే.. సాధారణంగా ప్రైవేటు డెయిరీలు, పాల వ్యాపారులు మాత్రం పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు పాల సేకరణ ధరలు తగ్గించడం.. ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు పెంచడం వంటి జిమ్మిక్కులు చేస్తూ పాడి రైతులను దోచుకుంటుంటారు. కానీ, అమూల్ మాత్రం ఎప్పుడైనా ఒకే విధంగా ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతా నికి అనుగుణంగా ధరలు నిర్ణయిస్తూ అణా పైసల తో సహా పాలుపోసిన 10 రోజుల్లో వారి ఖాతాల్లో జమచేస్తోంది. ఈ నేపథ్యంలో.. జమ్మలమడుగు రాజుపాలెం, పెద్దముడియం మండలాల్లో జేపీవీ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధంచేశారు. వాస్తవానికి జమ్మలమడుగు మండలంలో ఏ ఒక్క గ్రామంలోనూ జేపీవీ ప్రారంభించలేదు, అమూల్ పాలసేకరణ జరగడంలేదు. కానీ, ఈ వాస్తవాలేమీ తెలుసుకోకుండా గిట్టుబాటు ధర కల్పనలో విఫలమైన ప్రైవేటు డెయిరీలను ఎండగట్టడం మానేసి, దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి, సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే అమూల్ సంస్థ గిట్టుబాటు ధర ఇవ్వడంలేదంటూ ఈనాడు పెడబొబ్బలు పెట్టింది. ప్రభుత్వంపై రామోజీకి అక్కసు, ఆక్రోశం ఏ స్థాయిలో ఉందో మరోసారి తేటతెల్లమైంది. -
జగనన్న పాల వెల్లువతో పాడి రైతుల్లో వెల్లివిరిసిన దరహాసం
-
పొంగిన సిరులు!
సాక్షి, అమరావతి: నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పుడు రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ పాడి రైతన్నల ఇళ్లలో సిరులను పొంగిస్తోంది. మూడు జిల్లాలతో మొదలైన అమూల్ ప్రస్థానం ఇప్పటికే 19 జిల్లాలకు విస్తరించి గ్రామగ్రామాన క్షీరాభిషేకం చేస్తోంది. మూతపడ్డ డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో సహకార రంగంలో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం 2023 తీసుకొచ్చింది. అమూల్ వచ్చిన తర్వాత ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్‌కు రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రూ.10 నుంచి రూ.20 వరకు పాడి రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తుండడంతో అమూల్‌కు పాలు పోసే వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. దీనివల్ల పాడి రైతులకు అదనంగా మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కృషి ఫలితంగా మూతపడిన చిత్తూరు డెయిరీతో సహా సహకార సంఘాలు జీవం పోసుకుంటున్నాయి. 33 నెలల్లో 11.37 కోట్ల లీటర్ల సేకరణ మూడు జిల్లాలలో 2020 డిసెంబర్లో ప్రారంభమైన జగనన్న పాలవెల్లువ (జేపీవీ) నేడు 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమంలో నేడు 4,114 గ్రామాలలో 3,79,850 మంది భాగస్వాములయ్యారు. 33 నెలల్లో 11.37 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.512.83 కోట్లు చెల్లించారు. అమూల్‌కు ప్రస్తుతం రోజుకు సగటున 2,84,755 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీలు రోజుకు సగటున 6 లక్షల లీటర్ల చొప్పున పాలను సేకరిస్తున్నారు. నిండా 33 నెలలు కూడా నిండని అమూల్ సంస్థ ఇప్పటికే రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందంటే పాడి రైతులకు ఎంతో మేలు చేస్తోందో ఊహించవచ్చు. పాలు పోసే రైతులకు ప్రతి 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. పాడి రైతులకు రూ.2,604.06 కోట్ల అదనపు లబ్ధి అమూల్ ప్రారంభంలో లీటర్‌కు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించగా 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ప్రస్తుతం గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. అయితే రైతుకు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్‌ను బట్టి గేదెపాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. 18 నెలల్లో పాల సేకరణ ధరను అమూల్ ఏడు దఫాలు పెంచింది. లీటర్ గేదె పాలకు రూ.16.09, ఆవుపాలకు రూ.8.36 చొప్పున అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గతంలో రెండేళ్లకోసారి పాల సేకరణ ధరలు పెంచే ప్రైవేట్ డెయిరీలు అమూల్ రాకతో ఏటా అనివార్యంగా కనీసం రెండుసార్లు పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధర తప్పనిసరిగా పెంచాల్సి రావడంతో పాడి రైతులకు రూ.2,604.06 కోట్ల మేర అదనంగా ప్రయోజనం చేకూరడం గమనార్హం. అమూల్ ప్రతి సంవత్సరం చివరిలో పోసిన ప్రతి లీటరు పాలకు రూ.0.50 చొప్పున లాయల్టీ బోనస్ పాడి రైతులకు చెల్లిస్తోంది. మరోవైపు గత 18 నెలల్లో అమూల్ 2,235.45 మెట్రిక్ టన్నుల నాణ్యమైన ఫీడ్‌ను లాభాపేక్ష లేకుండా పంపిణీ చేసింది. గేదెలకు రూ.30 వేలు, ఆవులకు రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తున్న ప్రభుత్వం కొత్తగా పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఏఎంసీయూ, బీఎంసీయూలు.. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మొదటి దశలో రూ.680 కోట్ల ఉపాధి నిధులతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలను నిర్మిస్తున్నారు. చేయూత లబ్ధిదారులకు వారి ఇష్ట ప్రకారం పాడి పశువుల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉంటే అమూల్‌కు మేలు చేసేందుకు ప్రభుత్వం రూ.పది వేల కోట్లు ఖర్చు చేసిందని, విలువైన సహకార డెయిరీలను అప్పనంగా అప్పగిస్తోందంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడింది. హెరిటేజ్ కోసం.. సహకార డెయిరీల రంగం నిర్వీర్యమైంది చంద్రబాబు హయాంలోనే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే ‘మాక్స్’ (మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలు)లోకి మార్చుకుని తర్వాత సొంత కంపెనీలుగా ప్రకటించుకున్నారు. ఇలా చంద్రబాబు హయాంలో విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా మిల్క్ యూనియన్లు కంపెనీలుగా మారిపోయాయి. పులివెందుల, చిత్తూరుతో సహా 8 డెయిరీలు మూతపడ్డాయి. అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. హెరిటేజ్ కోసం సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారు. హెరిటేజ్ సేకరణ ధరలు పెంచాల్సి వస్తుందనే భయంతో పాడి రైతులకు ఎక్కడా ధరలు పెరగకుండా కట్టడి చేశారు. హెరిటేజ్ బాగుంటే చాలు పాడి రైతులు ఎలా పోయిన ఫర్వాలేదని చంద్రబాబు భావించారు. ‘చిత్తూరు’లో క్షీరధారలు.. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని పునరుద్ధరించగా 2021 నుంచి అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం ఆ డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఇలా ఒకపక్క సహకార రంగాన్ని బలోపేతం చేస్తుంటే ఒంగోలు డెయిరీని ఆమూల్‌కు అప్పగిస్తే వదిలేసిందని, విలువైన ఆస్తులు కట్టబెడుతున్నారంటూ ఎల్లో మీడియా బురద చల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పాడి రైతులకు మేలు జరిగే చర్యలను సైతం అడ్డుకునే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పాల వెల్లువపై విష ప్రచారం
-
అవినీతికి ఆస్కారంలేదు
-
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు క్రెడిట్ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడి రైతుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారికి మరింత మేలు చేకూర్చనున్నారు. జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయించి, వారి వ్యాపారానికి అవసరమైన రుణాలను మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆసరా, చేయూత మహిళా లబ్దిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాడి పశువుల కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరు చేయిస్తున్నారు. వీరి నుంచి అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా జగనన్న పాల వెల్లువ లబ్దిదారులు వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్డుల ద్వారా లబ్దిదారులకు అవసరమైన వర్కింగ్ కేపిటల్ కోసం రుణాలు మంజూరు చేయించనుంది. ఇందుకోసం జిల్లాలవారీగా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇటీవల జరిగిన బ్యాంకర్ల సబ్ కమిటీ సమావేశంలో 18 జిల్లాల్లోని 2.28 లక్షల మంది జగనన్న పాల వెల్లువ లబ్దిదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. వీరందరికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి, రుణాలు మంజూరు చేయాలని ఆ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా పశు, మత్స్యకార రైతులకు ప్రత్యేకంగా కార్డులు ఇచ్చి, వారికి అవసరమైన రుణాలు మంజూరు చేస్తారు. అర్హులైన వారందరికి ఈ కార్డులు ఇవ్వడానికి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పశు, మత్స్యకార రైతులకు ఈ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం జిల్లాలవారీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారులతో శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ కార్డులపై వర్కింగ్ క్యాపిటల్‌గా లబ్దిదారులకు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఈ రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారు వార్షిక వడ్డీలో 3 శాతం సత్వర రీపేమెంట్ ప్రోత్సాహకానికి అర్హులవుతారు. ప్రతి శుక్రవారం శిబిరాలు ఈ కార్డులతో పాటు రుణాల మంజూరుకు ప్రతి శుక్రవారం బ్యాంకులు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తాయి. అక్కడికక్కడే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వెంటనే ప్రాసెస్ చేస్తాయి. సూత్రప్రాయ మంజూరు కూడా ఈ శిబిరాల్లోనే చేస్తారు. వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్దిదారులు ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాదారులగా ఉన్నారని, అలాగే ఇప్పటికే జగనన్న పాల వెల్లువ కింద పాడి పశువులను కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వీరికి క్రెడిట్ కార్డులు, రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. -
‘పాల వెల్లువ’కు కేంద్రం ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ(జేవీపీ) పథకానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. జేవీపీ ప్రాజెక్టు ఆలోచన అద్భుతమని కేంద్రం ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఏపీలో పాడి రైతులకు దేశంలోనే అత్యధిక పాలసేకరణ ధరలు దక్కుతున్నాయని పేర్కొంది. ఏపీని బెంచ్ మార్క్‌గా తీసుకొని పాడి రైతులకు గరిష్ట ధర చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించింది. పశు సంవర్ధక, డెయిరీ రంగాలపై కేరళలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సదస్సులో జేవీపీ ప్రాజెక్టుపై ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహ్మద్ బాబు, పశుసంవర్ధక శాఖ డైరక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్‌తో కలసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. – సాక్షి, అమరావతి పాడి రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం: అహ్మద్ బాబు సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడం, పాడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 డిసెంబర్లో జగనన్న పాలవెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. గ్రామస్థాయిలో మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా లీటర్‌కు రూ.10 నుంచి 20 వరకు పాడి రైతులకు అదనపు లబ్ధి చేకూరుతోంది. మూడు జిల్లాలతో ప్రారంభమై ప్రస్తుతం 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలతో మొదలై 3,775 గ్రామాలకు విస్తరించింది. 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమంలో నేడు 3.61లక్షల మంది భాగస్వాములయ్యారు. రోజూ 85 వేల మంది సగటున 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. మూడేళ్లలో పాల సేకరణ ధరలను ఎనిమిది సార్లు పెంచారు. గేదె పాల ధర లీటర్‌కు రూ.71.74 నుంచి రూ.89.76కు, ఆవుపాల ధర లీటర్‌కు రూ.34.20 నుంచి రూ.43.69కు పెంచారు. ఫ్యాట్ శాతాన్ని బట్టి లీటర్ గేదెపాలకు రూ.103, లీటర్ ఆవుపాలకు రూ.54కు పైగా పాడి రైతులకు ధర లభిస్తోంది. 10 రోజులకు నేరుగా వారి ఖాతాలకు చెల్లింపులు చేస్తున్నాం. ఇప్పటి వరకు జేవీపీ కింద 9.98 కోట్ల లీటర్ల పాలు సేకరించగా రూ.446.93 కోట్లు చెల్లించాం. ప్రైవేటు డెయిరీలు అమూల్‌తో పోటీపడి పాలసేకరణ ధరలు పెంచాల్సి రావడంతో పాడి రైతులు రూ.4,283 కోట్లకు పైగా ప్రయోజనం పొందారు. క్రమం తప్పకుండా 180 రోజుల పాటు పాలుపోసే రైతులకు బోనస్, సొసైటీలకు ఇన్సెంటివ్ ఇస్తున్నాం. వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.30 వేల వరకు ఆర్థిక చేయూత ఇవ్వడమే కాకుండా పాడి గేదెల కొనుగోలుకు రూ.90 వేలకు పైగా రుణాలు ఇప్పిస్తున్నాం. ఏపీ ఆదర్శం : అల్కా ఉపాధ్యాయ, కేంద్ర పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా మహిళా పాడి రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో పాడి రైతులకు చాలా తక్కువ ధరలు చెల్లిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఏపీలో జేపీవీ ప్రాజెక్టు ద్వారా పాడి రైతులకు గరిష్టంగా లీటర్ గేదె పాలపై రూ.100 అంతకంటే ఎక్కువ ధర లభిస్తుండడం ప్రశంసనీయం. దేశంలో పాడి ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి జేవీపీ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించాలి. ఏపీని రోల్ మోడల్‌గా తీసుకుని తమ రాష్ట్రాల్లో పాడి రైతులకు గిట్టుబాటు కల్పించాలి. -
పాడిలో మేలి మలుపు
-
‘పాడి’కి మేలి మలుపు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన కరమూడి శైలజకు రెండు పాడి గేదెలున్నాయి. ఇది వరకు ప్రైవేట్ డెయిరీకి రోజూ పాలు పోసేది. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) శాతం ఎంత ఉన్నప్పటికీ లీటర్‌కు గరిష్టంగా రూ.80కి మించి చెల్లించే వారు కాదు. జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజుకు 3 లీటర్ల పాలు పోస్తే ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 13 శాతం రావడంతో లీటర్‌కు రూ.103 చొప్పున చెల్లించారు. ఏకంగా లీటర్‌కు రూ.23 అదనంగా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన రోజుకు రూ.69 చొప్పున నెలకు రూ.2,100 వరకు అదనంగా ఆదాయం వస్తుండడం పట్ల ఆమె ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా వేమవరానికి చెందిన యాదాల వరలక్ష్మికి రెండు ఆవులున్నాయి. ప్రైవేటు కేంద్రానికి ప్రతీ రోజూ పాలు పోసేది. ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా.. లీటర్‌కు గరిష్టంగా రూ.35కు మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇటీవలే ప్రారంభించిన జగనన్న పాల కేంద్రంలో ఎస్ఎన్ఎఫ్ 9 శాతం, ఫ్యాట్ 6.6 శాతంతో తొలి రోజు 2.58 లీటర్ల పాలు పోస్తే లీటర్‌కు రూ.53.86 చొప్పున రూ.138.96 వచ్చింది. ఈమె రెండు పూటలా పాలు పోస్తోంది. ఈ లెక్కన రోజుకు 5 లీటర్లు పోస్తే.. రోజుకు అదనంగా రూ.94.30 చొప్పన నెలకు రూ.2,829 అదనపు ఆదాయం వస్తోందని ఆమె ఆనందంతో చెబుతోంది. ‘అన్నా.. ఇది పాల బాటిల్.. నీళ్ల బాటిల్ కంటే తక్కువ ఖరీదు.. నీళ్ల కంటే పాలే చవకగా దొరుకుతున్నాయి. ఇలాగైతే ఎలా బతికేదన్నా.. అని పాడి రైతులు నాతో చెప్పుకుని బాధపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని కచ్చితంగా మారుస్తాం’ అని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పిన మాటలివి. ఆ మాట మేరకు అక్షరాలా పరిస్థితిని మార్చేశారనేందుకు ఇప్పుడు ఊరూరా కళకళలాడుతున్న జేపీవీ కేంద్రాలే నిదర్శనం. పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాడి రైతులు నేడు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకం కింద పాలు పోస్తూ కోట్లాది రూపాయలు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు, దళారీలు వారిస్తున్నా, ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. తాము మాత్రం జగనన్న కేంద్రంలోనే పాలు పోస్తామంటూ ముందుకొస్తున్నారు. పాలవెల్లువ పథకం ఇటీవలే ప్రారంభమైన కాకినాడ జిల్లానే తీసుకుంటే.. హెరిటేజ్, వల్లభ, శ్రీ చక్ర, తిరుమల, జెర్సీ, దొడ్ల, విశాఖ డెయిరీలు పాలు సేకరిస్తుంటాయి. ఇప్పటి వరకు ఇవి గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.80, ఆవు పాలకు రూ.35కు మించి ఇస్తున్న దాఖలాలు లేవు. అలాంటిది పాల వెల్లువ పథకం ద్వారా నేడు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.103, ఆవు పాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లోని పాడి రైతులు చెబుతున్నారు. ప్రైవేటు కేంద్రాల కంటే కనీసం లీటర్‌కు రూ.10–30 వరకు అదనంగా వస్తుందని హర్హం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీల వల్ల ఏళ్ల తరబడి తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి జేపీవీ కేంద్రానికే పాలు పోస్తామని స్పష్టం చేస్తున్నారు. పక్కాగా వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం పాలల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ (ఘన పదార్థాలు) శాతం ఎంత ఉందో లెక్కించేందుకు ప్రైవేట్ డెయిరీలు ఒక శాస్త్రీయ పద్దతి అంటూ పాటించే వారు కాదు. పాడి రైతుల్లో నూటికి 90 శాతం పెద్దగా చదువుకోని వారే. వారు కేంద్రానికి పాలు తీసుకురాగానే, వాటిని పూర్తిగా మిక్స్ చేయకుండా, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా ఫ్యాట్ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించి ఖాతా పుస్తకాల్లో రాసుకునే వారు. అడిగితే ఓ కాగితం ముక్క మీద రాసిచ్చేవారు. దాణా, ఇతర అవసరాల కోసం తీసుకున్న అప్పును మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని 15 రోజులకో, నెలకో ఇచ్చేవారు. పాలు ఎక్కువ పోసే వారికి ఒక ధర, తక్కువ పోసే వారికి మరో ధర, సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర ఉండేది. కొందరు కొలతల్లోనూ మోసానికి పాల్పడే వారు. ‘జగనన్న పాల వెల్లువ’ మొదలైన తర్వాత ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కొంతమేర కళ్లెం పడింది. రైతుకు పాల ధర పెరగడమే కాదు.. పాలల్లో నాణ్యత, చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. ప్రైవేటు కేంద్రాల్లో టెస్టింగ్ మిషన్ ఒకటే ఉంటుంది. అదే జేవీపీ కేంద్రంలో మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిల్క్ ఎనలైజర్ (వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతం, ప్రొటీన్, వాటర్ శాతాన్ని లెక్కించేందుకు), ్రస్ట్రిరర్ (పాలు మిక్స్ చేయడానికి) సాప్ట్వేర్ సిస్టమ్ ద్వారా పాల సేకరణ జరిగేందుకు వీలుగా ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ స్కేల్ వంటి పరికరాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి పాలు రాగానే మిక్స్ చేసిన పాలను ్రస్ట్రిరర్పై పెట్టి, ఆ శాంపిల్‌ను మళ్లీ ఎనలైజర్‌లో ఉంచి వెన్న, ఘన పదార్థాల శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి.. తూకం వేసి తీసుకొని ధరను నిర్ధారిస్తారు. వెన్న శాతం లెక్కింపు లేదా ధర నిర్ణయంలో ఎలాంటి దళారీ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా సా‹ఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమూల్‌కు, హెరిటేజ్‌కు మధ్య ఎంత తేడా! 2020 డిసెంబర్లో 3 జిల్లాలతో ప్రారంభమైన జేపీవీ పథకం నేడు 18 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమం నేడు 3,691 గ్రామాలకు విస్తరించగా, 3.18 లక్షల మంది భాగస్వాములయ్యారు. 31 నెలల్లో 9.58 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. ప్రస్తుతం 85 వేల మంది పాడి రైతులు ప్రతి రోజూ 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. 2020 అక్టోబర్ వరకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో లీటర్‌కు హెరిటేజ్ కంపెనీ గేదె పాలకు రూ.58.43, ఆవు పాలకు రూ.31.58 చెల్లించింది. సంగం డెయిరీ గేదె పాలకు రూ.58.90, ఆవు పాలకు రూ.32.87 చొప్పున చెల్లించేవారు. అమూల్ ప్రారంభంలోనే లీటర్ గేదె పాలకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో రూ.71.47, ఆవు పాలకు 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో రూ.34.20 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత గడిచిన 31 నెలల్లో అమూల్ ఎనిమిదిసార్లు పాల సేకరణ ధరలు పెంచగా, ప్రైవేటు డెయిరీలు కేవలం మూడు సార్లు మాత్రమే పెంచాయి. హెరిటేజ్ ప్రస్తుతం గేదె పాలకు లీటర్ రూ.77కు పెంచామని చెబుతున్నప్పటికీ, రైతులకు వివిధ కారణాలు చెబుతూ వాస్తవంగా చెల్లిస్తున్నది రూ.66.50 మాత్రమే. అదే సంగం డెయిరీ లీటర్‌కు రూ.80.30కు పెంచామని చెబుతున్నా, వాస్తవంగా రైతులకు చెల్లిస్తున్నది మాత్రం రూ.69.35 మాత్రమే. అమూల్ మాత్రం ఖచ్చితంగా 11 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎ¯Œన్ఎఫ్తో గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. ప్రైవేటు డెయిరీలు గరిష్టంగా గేదె పాలకు 11 శాతం, ఆవు పాలకు 5 శాతం ఫ్యాట్‌కు లాక్ చేసి ఆ తర్వాత ఎంత ఫ్యాట్ ఉన్నా సరే 11 శాతం కిందే పరిగణించి సొమ్ములు చెల్లిస్తున్నాయి. అమూల్ మాత్రం ఎలాంటి లాక్ సిస్టమ్ లేకుండా పాలల్లో ఉండే ఫ్యాట్ శాతం లెక్కగట్టి అణాపైసలతో సహా చెల్లిస్తోంది. ఫలితంగా గేదె పాలకు గరిష్ట ధర 103, ఆవు పాలకు రూ.53.86 ధర రైతులకు లభిస్తోంది. పాడి రైతులకు అన్ని విధాలా భరోసా గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం ఎనిమిది నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. అమూల్ మాత్రం 20–22 శాతం ప్రోటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. పైగా ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్‌కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వార్షిక ఆదాయాన్ని బట్టి ఏటా లీటర్‌కు 5 శాతం చొప్పున బోనస్ చెల్లిస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు కమిషన్ ఇస్తాయే తప్ప పాలుపోసే రైతులకు ఎలాంటి ఇన్సెంటివ్ ఇవ్వవు. మరొక పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 321 పాడి రైతులకు గేదెల కొనుగోలుకు రూ.3.69 కోట్ల రుణాలిచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ కింద 7,517 మందికి రూ.36.61 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చింది. ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే వారికీ రూ.4,283 కోట్ల లబ్ధి కల్తీకి అడ్డుకట్ట వేసి, నాణ్యత పెంచేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టాయి. ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేపీవి అమలు కాని ప్రాంతాల్లో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఆదాయం పెరిగింది. ఫలితంగా రూ.4,283 కోట్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు లబ్ధి పొందారు. అదనపు ఆదాయం నిజం మా ఊళ్లో ఏర్పాటు చేసిన జగనన్న పాల వెల్లువ కేంద్రంలో శుక్రవారం 1.32 లీటర్ల పాలు పోశాను. వెన్న 14 శాతం, ఎస్ఎన్ఎఫ్ 10.1 శాతం ఉందని లెక్కించారు. ఆ మేరకు లీటర్‌కు రూ.97.92 చొప్పున రూ.129.25 చెల్లించారు. అదే ప్రైవేటు డెయిరీకి పోస్తే రూ.80కి మించి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ పాలు పోయడం వల్ల రూ.30కి పైగా అదనంగా ఆదాయం వచ్చింది. – కాళ్ల మంగ, చిత్రాడ–2, కాకినాడ జిల్లా నెలకు రూ.3,600 అదనపు ఆదాయం మాకు మూడు గేదెలున్నాయి. ప్రైవేటు కేంద్రానికి రోజుకు 6–8 లీటర్ల పాలు పోసేవాళ్లం.ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఎంత ఉన్నా లీటర్‌కు రూ.70–80 మధ్య వచ్చేది. మా గ్రామంలో ఏర్పాటు చేసిన జేపీవి కేంద్రంలో ఎస్ఎన్ఏఫ్ 9.2 శాతం, ఫ్యాట్ 12.3 శాతంతో పాలు పోస్తే లీటర్‌కు ఏకంగా రూ.97.92 వచ్చింది. లీటర్‌పై సగటున రూ.20కి పైగా అదనంగా వచ్చింది. ఈ లెక్కన ఐదు లీటర్లకు రూ.120 చొప్పున నెలకు రూ.3,600కు పైగా అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ప్రైవేటు డెయిరీల్లో ఎప్పుడూ ఈ స్థాయిలో ధర రాలేదు. – పరసా వెంకటసుధ, విరవాడ, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా గతంలో రూ.30కి మించి వచ్చేది కాదు మాకు రెండు ఆవులున్నాయి. ప్రతి రోజూ 8 లీటర్ల పాలు కేంద్రానికి పోసేవాళ్లం. లీటర్‌కు రూ.30 రావడం గగనంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అమూల్ కేంద్రంలో పోస్తే ఎస్ఎన్ఏఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.1 శాతంతో లీటర్‌కు 39.33 వచ్చింది. ఈ లెక్కన లీటర్‌కు అదనంగా రూ.9.33 చొప్పున నెలకు రూ.2,239కు పైగా ఆదనపు ఆదాయం వస్తోంది. ఇక నుంచి ఈ కేంద్రానికే పాలు పోస్తాం. – చిట్నీడి వెంకటలక్ష్మి, విరవాడ, పిఠాపురం మండలం కాకినాడ జిల్లా రైతుల నుంచి మంచి స్పందన జగనన్న పాల వెల్లువ పథకాన్ని కాకినాడ జిల్లాలో ఈ నెల 3వ తేదీన ప్రారంభించాం. పాడి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రైవేటు డెయిరీలు, పాల వ్యాపారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయినా సరే 96 గ్రామాల్లో ప్రతి రోజూ 200 మందికి పైగా రైతులు 4,500 లీటర్ల పాలు పోస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక మంది పాడి రైతులకు లీటర్ గేదె పాలకు రూ.95, ఆవు పాలకు రూ.53 వరకు ఆదాయం లభిస్తోంది. – డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరావు, జాయింట్ డైరెక్టర్, పశు సంవర్థక శాఖ -
క్షీర విప్లవం వెల్లువెత్తేలా..!
సాక్షి, అమరావతి: జగనన్న పాలవెల్లువ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద ప్రస్తుతం 1,515 ఆర్బీకేల పరిధిలో 2.60 లక్షల మంది మహిళా రైతులు నమోదు కాగా.. 65 వేల మంది నుంచి ప్రతిరోజు 1.75 లక్షల లీటర్ల పాలను అమూల్ సంస్థ ద్వారా అత్యధిక ధర చెల్లించి సేకరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 5,388 ఆర్బీకేల పరిధిలో కనీసం 4.58 లక్షల మంది రైతుల నుంచి ప్రతిరోజూ 6 లక్షల లీటర్లు, 2024 మార్చి నాటికి 8,021 ఆర్బీకేల పరిధిలో 6 లక్షల మంది రైతుల నుంచి 9 లక్షల లీటర్లను సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. నిత్యం 30 మందితో మాట్లాడేలా.. పాల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లాకో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కంట్రోల్ సెంటర్ పని చేస్తాయి. డీఆర్డీఎ, పశుసంవర్థక, సహకార శాఖల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఈ సెంటర్లో సేవలందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. ప్రతిరోజు కనీసం 30 మంది మహిళా పాడి రైతు సంఘాల కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ల సిబ్బంది మాట్లాడతారు. పాలుపోసే మహిళా పాడిరైతులతోపాటు రూట్ ఆఫీసర్స్, అమూల్ టీమ్‌కు జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు. పాల సేకరణ, ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతం గుర్తింపు, సకాలంలో డబ్బులు జమ వంటి విషయాల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేస్తారు. సేకరణ తగ్గితే రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు ఏ గ్రామంలో అయినా పాల సేకరణ తగ్గినట్టుగా గుర్తిస్తే వెంటనే అందుకు గల కారణాలను విశ్లేషించి పెరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు ప్రత్యేక టీమ్‌లను పంపించే ఏర్పాటును కమాండ్ కంట్రోల్ సెంటర్లు చేస్తాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుతో పాటు బీఏంసీయూ, ఏఎంసీయూ భవనాల నిర్మాణాల పురోగతి, పాడి రైతులకు బ్యాంక్ లింకేజ్‌ను కలెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇందుకోసం ఎంపీడీఓ, తహసీల్దార్ నేతృత్వంలో మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సొసైటీల రిజిస్ట్రేషన్లు, పాల సేకరణకు చెల్లించే హ్యాండ్లింగ్, నిర్వహణ చార్జీలు ఎప్పటికప్పుడు జమయ్యేలా చూస్తాయి. రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అన్ని గ్రామాలకు విస్తరిస్తాం జగనన్న పాల వెల్లువ పథకాన్ని దశల వారీగా అన్ని ఆర్బీకేలకు, అన్ని గ్రామాలకు విస్తరించడంతో పాటు సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 2024 మార్చి కల్లా పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకే పరిధిలో పాల సేకరణ ప్రారంభించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ -
పాడి రైతులకు పండుగ
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా ఐదోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.37, ఆవు పాలపై రూ.1.73 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.31, ఘన పదార్థాలపై రూ.12 మేర సేకరణ ధర పెరిగింది. ఈ పెంపు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గురువారం నుంచి వర్తించనుంది. దీనిద్వారా 40 వేల మంది రైతులకు అదనంగాలబ్ధి చేకూరనుంది. గత రెండేళ్లలో ఇప్పటికే నాలుగు దఫాలు పాల సేకరణ ధరలను పెంచగా తాజా పెంపుతో ఐదోసారికి చేరుకుంది. మూడు నెలల్లోనే మళ్లీ.. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.84.15, ఆవు పాలకు రూ.40.73 చొప్పున చెల్లిస్తోంది. అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలను సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ సెప్టెంబర్‌లో పాల సేకరణ ధరలు పెంచగా 3 నెలలు తిరగకుండానే మరోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలు రూ.87.52, ఆవు పాలు రూ.42.46 చొప్పున పెరిగాయి. అమూల్ గత రెండేళ్లలో గేదె పాలపై రూ.16.05, ఆవు పాలపై రూ.8.26 మేర పెంచింది. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాలవెల్లువ ద్వారా 2020 డిసెంబర్లో 3 జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా 2 నెలల్లోనే 17 జిల్లాలకు విస్తరించారు. 27,277 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో ఇపుడు ఏకంగా 2,47,958 మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో ప్రారంభమై 2,856 గ్రామాలకు విస్తరించింది. రోజూ సగటున లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది. 1,587 ఆర్బీకేల పరిధిలో 2,49,998 మంది పాడి రైతులు నిత్యం పాలు పోస్తున్నారు. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.232.26 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా ప్రస్తుతం లీటర్ గేదె పాలకు రూ.15 –రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 – రూ.12 వరకు అదనపు లాభం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు అదనంగా రూ.2,400 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. సంక్రాంతికి మిగతా జిల్లాల్లోనూ.. జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ ఐదోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదార్థాల సేకరణ ధరలను కూడా పెంచింది. ఇప్పటికే 17 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. సంక్రాంతి కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేలా కృషి చేస్తున్నాం. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
అమూల్ పాలసేకరణ ధర పెంపు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో పాలసేకరణ ధరను అమూల్ పెంచింది. ఇటీవలే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాలసేకరణ ధరను పెంచిన అమూల్ తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటరు గేదెపాలపై రూ.2.47, ఆవుపాలపై రూ.1.63 చొప్పున పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి రానుంది. జగనన్న పాలవెల్లువ కింద అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇటీవలే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగోసారి పాలసేకరణ ధర పెంచగా, రాయలసీమ జిల్లాల్లో నేటినుంచి అమలు చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 3.5 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.30.50 నుంచి రూ.32.13కు పెంచింది. లీటరు గేదెపాలకు (ఫ్యాట్ 6 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.42.50 నుంచి రూ.44.97కు పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5కు పెంచారు. హ్యాండ్లింగ్ చార్జీల కింద లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 4 శాతం ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) రూ.1.24, గేదెపాలకు (ఫ్యాట్ 8 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9.2 శాతం) రూ.1.64 చొప్పున సొసైటీలకు చెల్లించనున్నారు. అమూల్ దాణాపై 50 కిలోల బస్తాకు రూ.10 చొప్పున ఆయా సొసైటీ కార్యదర్శులకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఫలితంగా వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 44 వేలమంది రైతులతోపాటు 3,768 మహిళా పాడిరైతు సంఘాలు లబ్ధిపొందనున్నాయి. అమూల్ రాకతో అదనపు లబ్ధి జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఇటీవలే తిరుపతి జిల్లాకు విస్తరించారు. ప్రస్తుతం 17 జిల్లాల్లో 1,644 ఆర్బీకేల పరిధిలోని 2,856 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలవుతోంది. 2,47,958 మంది మహిళా పాడిరైతుల నుంచి రోజూ 1.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. గడిచిన 24 నెలల్లో 5.12 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. పాలుపోసిన పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రూ.219.57 కోట్లు చెల్లించారు. లీటరుపై రూ.4 అదనంగా లబ్ధిచేకూర్చేలా కృషిచేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ కంటే మిన్నగా లీటరు గేదెపాలపై రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 వరకు అదనంగా లబ్ధిచేకూర్చారు. ప్రైవేటు డెయిరీలు ఇస్తున్న రేట్లతో పోలిస్తే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న గ్రామాల్లోని రైతులు రూ.25 కోట్ల వరకు అదనంగా లబ్ధిపొందారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడి ధరలను పెంచాల్సి వచ్చింది. మూడేళ్లలో వరుసగా నాలుగుసార్లు పెంచడంతో అమూల్‌తో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం లీటరుపై రూ.15 వరకు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా జగనన్న పాలవెల్లువ పథకం కింద పాలుసేకరిస్తున్న గ్రామాల్లోనే కాదు.. ప్రైవేటు డెయిరీలకు పాలుపోస్తున్న రైతులకు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో లబ్ధికలిగింది. ఆయా డెయిరీల పరిధిలోని రైతులు మూడేళ్లలో రూ.2,354.22 కోట్ల మేర లబ్ధిపొందగలిగారు. ఇప్పటికే అమూల్ తరఫున పాలు సేకరిస్తున్న సబర్కాంత్, బనస్కాంత్ యూనియన్లు పాలసేకరణ ధర పెంచగా, తాజాగా గురువారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పాలుసేకరిస్తున్న కైరా యూనియన్ కూడా నాలుగోసారి పెంచింది. జగనన్న పాలవెల్లువ పథకాన్ని డిసెంబర్ కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేదిశగా ముందుకెళుతున్నారు. -
‘అమూల్’ రైతులకు అదనపు లాభం
సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలసేకరణ ధరను అమూల్ సంస్థ తాజాగా మరోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.3.30, ఆవు పాలపై రూ.1.58 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. నాలుగోసారి పెంపు వర్తింపు ‘జగనన్న పాల వెల్లువ’ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా ప్రస్తుతం 16 జిల్లాలకు విస్తరించారు. గత 23 నెలల్లో మూడుసార్లు సేకరణ ధరలను పెంచారు. ఉత్తరాంధ్ర పరిధిలో గత నెలలో పెంచగా, తాజాగా కోస్తాంధ్రలో 10 జిల్లాల పరిధిలో పాలసేకరణ ధరలను నాలుగోసారి పెంచారు. 1.12 లక్షల మందికి అదనపు లబ్ధి కోస్తాంధ్ర పరిధిలో ఇప్పటికే లీటర్ గేదె పాలకు రూ.79.20, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవుపాలపై రూ.1.58 పెంచారు. దీంతో గరిష్టంగా గేదె పాలు రూ.82.50, ఆవు పాలు రూ.39.48 చొప్పున సేకరణ ధరలు చేరాయి. వెన్నపై కిలోకు రూ.30, ఎస్‌ఎన్‌ఎఫ్‌పై కిలోకు రూ.11 చొప్పున పెంచడంతో వెన్న ధర రూ.750, ఘన పదార్థాల ధర రూ.280కి చేరుకుంది. గత నెలలో అమలులోకి వచ్చిన పెంపు వల్ల ఉత్తరాంధ్రలో 233 గ్రామాల పరిధిలోని 33,327 మంది రైతులు లబ్ధి పొందగా తాజా పెంపుతో కోస్తాంధ్రలోని బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 890 గ్రామాలకు చెందిన 1,12,313 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. రూ.208.23 కోట్లు చెల్లింపు రాష్ట్రంలో ప్రస్తుతం 16 జిల్లాల పరిధిలో 2,833 గ్రామాలకు చెందిన 2,44,069 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 30 వేల మంది పాల ఉత్పత్తిదారులు ప్రతిరోజూ సగటున లక్ష లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు. ఇప్పటివరకు 4.86 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.208.23 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.25 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా ప్రతి పది రోజులకోసారి పాలుపోసే రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. డిసెంబర్ లోగా రాష్ట్రమంతా విస్తరణ జగనన్న పాల వెల్లువ కింద పాలసేకరణ ధరను అమూల్ నాలుగోసారి పెంచింది. ఇప్పటికే 16 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రమంతా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
పొంగిన పాల సేకరణ ధర
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచింది. ఇటీవలే ఆవుపాలపై లీటర్‌కు గరిష్టంగా రూ. 4.12 చొప్పున పెంచగా, తాజాగా గేదె పాలపై రూ.3.93 పెంచింది. అంతేకాక.. పాలుపోసే రైతులతోపాటు సొసైటీలకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నెలకు 200 లీటర్లకు పైబడి పాలుపోసే రైతులకు రూ.2.50 వరకు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. మహిళా పాడిరైతు సంఘాల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు ప్రత్యేక ప్రోత్సాహం కింద లీటర్‌కు పావలా చొప్పున ఇవ్వనున్నారు. ఆదివారం నుంచి ఈ పెంపు, ప్రోత్సాహకాలు అమలులోకి రానున్నాయి. 20 నెలల్లో రూ.181.90 కోట్ల చెల్లింపు ‘జగనన్న పాలవెల్లువ’ కింద 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా, 20 నెలల్లో 15 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించారు. 2,344 గ్రామాల్లో 2,34,548 మంది నమోదు కాగా, రోజుకు 1.06 లక్షల మంది పాలుపోస్తున్నారు. ఇప్పటివరకు 4.20 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.181.90 కోట్లు చెల్లించారు. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇక విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ట్రయిల్ రన్ నిర్వహిస్తుండగా.. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సర్వే జరుగుతోంది. వీటితో పాటు మిగిలిన అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ జిల్లాల్లో డిసెంబర్‌లోగా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగోసారి పాలసేకరణ ధర పెంపు పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించిన అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో మూడుసార్లు పాలసేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతంు లీటర్ గేదె పాలకు గరిష్టంగా రూ.80.22, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరఫున ఉత్తరాంధ్రాలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ నాలుగోసారి పాల సేకరణ ధర పెంచింది. ఇటీవలే ఆవు పాలకు లీటర్‌పై గరిష్టంగా రూ.4.12ల చొప్పున పెంచిన యూనియన్, తాజాగా గేదె పాలపై లీటర్‌కు రూ.3.93 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా ఆవుపాల ధర లీటర్ రూ.40.73లకు చేరగా, తాజాగా గేదె పాలు ధర లీటర్‌కు రూ.84.15కు చేరనుంది. అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో గేదె పాలపై రూ.12.68, ఆవు పాలపై రూ.6.53ల మేర పెంచింది. పాడి రైతులకు ప్రోత్సాహకాలు పాల సేకరణ ధర, రాయల్టీ బోనస్ కాకుండా పాలుపోసే రైతులతో పాటు సొసైటీ నిర్వాహకులకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలను ప్రతీనెలా 7వ తేదీన చెల్లించనుంది. పాలుపోసే సామర్థ్యాన్ని బట్టి లీటర్‌కు రూ.0.75 నుంచి రూ.2.25ల వరకు రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. ఇక సొసైటీ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు సైతం లీటర్‌పై పావలా రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రతీ సొసైటీ పరిధిలో ఒక రూపాయి నుంచి రూ.2.50 వరకు అదనపు ప్రోత్సాహం అందుకోనున్నారు. ప్రైవేటు డెయిరీల పరిధిలో.. ఇక అమూల్ రాకతో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం పాలసేకరణ ధరను విధిగా పెంచాల్సి వచి్చంది. ఫలితంగా వాటికి పాలుపోసే పాడి రైతులకు అదనపు మేలు చేకూరింది. గతంలో ఎన్నడూలేని రీతిలో లీటర్‌పై రూ.12 నుంచి రూ.15ల వరకు ఆయా డెయిరీలు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా 20 నెలల్లో ఏకంగా రూ.2,020.46 కోట్ల మేర రైతులకు అదనపు లబ్ధిచేకూరినట్లుగా అంచనా వేశారు. 20 నెలల్లో నాలుగోసారి పెంపు.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచడంతోపాటు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. తాజా పెంపుతో సుమారు 40వేల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. డిసెంబర్ నెలాఖరుకల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
రాష్ట్రమంతటా ‘జగనన్న పాలవెల్లువ’
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ రాష్ట్రమంతా విస్తరించనుంది. మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహకార రంగంలో పాల డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో అంతర్జాతీయంగా పేరొందిన అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్లో జగనన్న పాలవెల్లువకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలుత రెండు ఉమ్మడి జిల్లాలతో ప్రారంభమై దశలవారీగా ఏడు జిల్లాలకు విస్తరించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం 16 జిల్లాల్లో అమలవుతోంది. మిగిలిన పది జిల్లాలకుగానూ కాకినాడ, కోనసీమలో జూలై నాలుగో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిత్యం లక్ష లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 2,651 గ్రామాల్లో పాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 2.27 లక్షల మంది పాడిరైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 45,456 మంది రోజూ పాలు పోస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ లక్ష లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. అమూల్ తరపున రాయలసీమ జిల్లాల్లో కేరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇప్పటి వరకు అమూల్ కేంద్రాల ద్వారా 1,53,92,363 లీటర్ల ఆవుపాలు, 1,93,74,139 లీటర్ల గేదె పాలు సేకరించారు. పాడి రైతులకు రూ.149.29 కోట్లు చెల్లించారు. ఇటీవలే పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్‌కు గేదె పాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 మేర రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. 11 శాతం కొవ్వు, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) కలిగిన గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.79.20 చెల్లిస్తున్నారు. 5.4 శాతం కొవ్వు, 8.7 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్) కలిగిన ఆవుపాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.35.78 చొప్పున చెల్లిస్తున్నారు. అమూల్ రాకముందు లీటర్‌కు రూ.30–31కి మించి లభించేది కాదు. ప్రస్తుతం సగటున లీటర్‌కు గేదె పాలకు రూ.53.50, ఆవుపాలకు రూ.30.24 వరకు ధర లభిస్తోంది. ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు రైతులకు అదనంగా లబ్ధి చేకూరుతోంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు గత్యంతరం లేక పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్లలో లీటర్‌కు పాలసేకరణ ధరలను రూ.10–12 వరకు పెంచాయి. ప్రాసెసింగ్ యూనిట్లు, అవుట్‌లెట్స్ రెండు జిల్లాల్లో 100 గ్రామాల్లో మొదలైన పాల సేకరణ దశలవారీగా ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో 2,651 గ్రామాలకు విస్తరించింది. పునర్విభజన తర్వాత రాజమహేంద్రవరం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాలకు విస్తరించింది. కర్నూలు, నంద్యాలతో పాటు కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభించాల్సి ఉంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా అన్ని జిల్లాలకు విస్తరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుల నుంచి సేకరించే పాలను ప్రాసెస్ చేసేందుకు మదనపల్లి, విజయవాడ, విశాఖలో అమూల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో కంటైనర్ తరహాలో అమూల్ అవుట్‌లెట్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వచ్చే 3 నెలల్లో విస్తరణ జగనన్న పాల వెల్లువ పథకాన్ని మరో మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జూలై నెలాఖరులోగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చేపడతాం. మిగిలిన జిల్లాల్లో కూడా సెప్టెంబర్ కల్లా విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దశలవారీగా పాల సేకరణ గ్రామాలను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
పాడి రైతుకు లాభాల పంట
సాక్షి, అమరావతి: లాభాల వెల్లువతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా ఇప్పటికే ఏడు ఉమ్మడి జిల్లాల్లో పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా పాలసేకరణ ధరను మూడోసారి పెంచింది. లీటర్ గేదె పాలపై రూ.4.42, ఆవు పాలపై రూ.2.12 చొప్పున పెంచడంతో పాడి రైతన్నలకు మరింత లాభం చేకూరుతోంది. పెంచిన సేకరణ ధరలు అమూల్ ప్రస్తుతం పాలను సేకరిస్తున్న పది జిల్లాల్లో ఆదివారం నుంచే అమలులోకి రాగా మరో నాలుగు జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో వర్తించనున్నాయి. ప్రైవేట్ డెయిరీల ఇష్టారాజ్యంతో ఇన్నేళ్లూ తీవ్రంగా నష్టపోయిన పాడి రైతులకు ‘అమూల్’ రాకతో సాంత్వన లభిస్తోంది. 14 జిల్లాల్లో అమూల్.. ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి 2020 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం ఏడు జిల్లాలకు (పునర్విభజన అనంతరం 14 జిల్లాలు) విస్తరించింది. దీని ద్వారా అమూల్ సంస్థ ప్రారంభంలో పాల సేకరణకు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్ కలిగిన ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతులకు చెల్లించింది. అయితే గత 17 నెలల్లో రెండుసార్లు సేకరణ ధరలను అమూల్ పెంచడంతో రైతులకు లాభం చేకూరింది. తాజాగా మూడోసారి సేకరణ ధరలను పెంచింది. తాజాగా మరోసారి.. ఇప్పటివరకు లీటర్ గేదె పాలకు రూ.74.78, ఆవుపాలకు రూ.35.78 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరపున జగనన్న పాల వెల్లువ ద్వారా పాలను సేకరిస్తోన్న సబర్కంత్ జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు గరిష్టంగా గేదెపాలపై రూ.4.42, ఆవుపాలపై రూ.2.12 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా గేదె పాలకు రూ.79.20, ఆవు పాలపై రూ.37.90 చొప్పున పాడి రైతులకు సేకరణ ధర లభిస్తోంది. వెన్నపై కిలోకు రూ.40, ఎస్‌ఎన్‌ఎఫ్‌పై కిలోకు రూ.15 చొప్పున పెంచడంతో వెన్న రూ.720, ఘన పదార్థాలపై రూ.269 చొప్పున పాడిరైతులకు చెల్లిస్తున్నారు. దళారులు లేకుండా నేరుగా డబ్బులు.. తాజాగా సేకరణ ధరల పెంపుతో 1,94,377 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 28,763 మంది పాల ఉత్పత్తిదారులు రోజూ 96 వేల లీటర్ల చొప్పున అమూల్’కు పాలు పోస్తున్నారు. ఇప్పటి వరకు 2.91 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రైతులకు రూ.124.48 కోట్లు చెల్లించారు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే జగనన్న పాల వెల్లువ కేంద్రాల్లో పాలు పోసే రైతులు అదనంగా రూ.21.13 కోట్ల మేర లబ్ధి పొందారు. దళారీలకు తావు లేకుండా రైతుల నుంచి నేరుగా పాలు సేకరించడమే కాకుండా పది రోజులకోసారి వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు పాలు పోసిన పాడి రైతులకు ప్రోత్సాహకంగా లీటర్ పాలకు అర్ధ రూపాయి చొప్పున లాయల్టీ ఇన్సెంటివ్ చెల్లిస్తుండటంతో పాల వెల్లువపై ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. గతంతో పోలిస్తే ఎంతో లాభం.. నాకు మూడు పాడి గేదెలున్నాయి. రోజూ ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నా. గతంలో లీటర్‌కు రూ.40–50కి మించి ఇచ్చేవారు కాదు. ఈ రోజు 8.8 శాతం వెన్న, 9.2 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో 10.7 లీటర్లు పాలు పోస్తే లీటర్‌కు రూ.63.36 చొప్పున ఏకంగా రూ.677.95 ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కుసుం నాగమల్లేశ్వరి, నంబూరు, గుంటూరు పాల వెల్లువతో మంచి రోజులు నాకు రెండు పాడిగేదెలున్నాయి. ఈరోజు (ఆదివారం) ఉదయం 6.50 లీటర్లు, సాయంత్రం 5.38 లీటర్లు పాలు పోశా. 8.8 వెన్న శాతం, 8.7 ఎస్ఎన్ఎఫ్ ఆధారంగా లీటర్‌కు రూ.59.86 చొప్పున ఇచ్చారు. నిన్నటితో పోలిస్తే లీటర్‌కు రూ.3.53 చొప్పున అదనంగా లాభం వచ్చింది. జగనన్న పాల వెల్లువతో మంచి రోజులు వచ్చాయి. – బొంతు వరలక్ష్మి, కోటపాడు, ఏలూరు జిల్లా త్వరలో మరో ఐదు జిల్లాల్లో.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ సంస్థ సేకరణ ధరను మూడోసారి పెంచింది. తాజా పెంపుతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతోంది. త్వరలో విశాఖ, తూర్పు గోదావరిలో (పునర్విభజన అనంతరం ఐదు జిల్లాలు) కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
ఏపీ ప్రభుత్వ చొరవ.. అమూల్ రాకతో పాలకు మంచి ధర
3 లీటర్లకే రూ.200 వస్తోంది గతంలో పూటకు 8 లీటర్లు పోసేవాళ్లం. రూ.200 కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అమూల్ కేంద్రంలో 3 లీటర్లు పోస్తే రూ.200కు పైగా వస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటైన తర్వాతే మిగిలిన కేంద్రాల్లో కూడా రేటు పెంచారు. పాడి గేదెల కొనుగోలు కోసం లోన్ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నాం. – ఎస్కే.అసాబి, పెదకాకాని, గుంటూరు జిల్లా రైతులకు ఒక్క వ్యవసాయం ద్వారా మాత్రమే కాకుండా, ఇతరత్రా అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా సహకార డెయిరీ దిగ్గజం అమూల్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రైవేట్ డెయిరీల దోపిడీకి ముకుతాడు వేస్తోంది. తద్వారా పాల సేకరణలో స్పష్టమైన మార్పు కళ్లెదుటే కనిపిస్తోంది. పాల ధర పెరిగింది. చెల్లింపుల్లో పారదర్శకత వచ్చింది. పాడి ఇక బరువు కానేకాదని, నాలుగు డబ్బులు కళ్లజూడొచ్చనే భరోసా కలిగింది. సాక్షి, అమరావతి : జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుకు భద్రత, ఆర్థిక భరోసా లభిస్తోంది. ప్రైవేటు డెయిరీల అడ్డగోలు దోపిడీకి కళ్లెం పడింది. ఇదివరకు పాలల్లో వెన్న శాతమెంతో.. ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్ – ఘన పదార్థాలు) శాతమెంతో రైతులకు తెలిసేది కాదు. కేంద్రంలో ఎంత చెబితే అంతే. ఆ లెక్కలే పుస్తకాల్లో రాసుకొని 15 రోజులకో నెలకో డబ్బులు ఇచ్చేవారు. ఎక్కువ పాలు పోసే వారికి ఒక ధర.. తక్కువ పాలు పోసే వారికి మరో ధర.. సీజన్లో ఓ ధర.. అన్ సీజన్లో మరో ధర చెల్లిస్తూ అందినకాడికి దోచుకునే వారు. వెన్న శాతాన్ని పరిగణనలోకి తీసుకొని పాలు సేకరించే ప్రైవేట్ డెయిరీలు నాణ్యతను గాలికొదిలేసేవి. దీంతో వెన్న శాతం పెంచి చూపేందుకు రైతుల నుంచి సేకరించే పాలల్లో నాసిరకం నూనెలు, హానికరమైన కొవ్వు పదార్థాలు కలిపి కృత్రిమంగా కల్తీ చేసిన పాలనమ్మి సొమ్ము చేసుకునే వారు. కొలతల్లో మోసాలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలో సహకార రంగంలోని డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. అనంతరం 2020 డిసెంబర్లో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలుత 3 జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించింది. ప్రతి రోజు సగటున లక్ష లీటర్ల చొప్పున ఇప్పటి వరకు 2.46 కోట్ల లీటర్ల పాలు సేకరించింది. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.104.89 కోట్లు జమ అయింది. ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన జిల్లాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్పు ఇలా.. ► 2020 అక్టోబర్ వరకు పది శాతం వెన్న కలిగిన లీటరు గేదె పాలకు సంగం డెయిరీ కేవలం రూ.56 ఇచ్చేది. ప్రారంభంలోనే అమూల్ లీటరుకు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో సేకరించే గేదె పాలకు రూ.71.47.. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున రైతుల ఖాతాలకు నేరుగా జమ చేసింది. ► అమూల్.. సీజన్‌తో సంబంధం లేకుండా ఎస్ఎన్ఎఫ్, వెన్న శాతం ప్రామాణికంగా అన్ని సీజన్లలోనూ ఒకే రీతిలో చెల్లిస్తోంది. గతంలో ఏటా లీటరుపై రూ.2 – రూ.5కు మించి పెంచేవారు కాదు. అలాంటిది జగనన్న పాల వెల్లువ మొదలైన 15 నెలల్లోనే లీటరుపై రూ.12 పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అమూల్ వరుసగా రెండుసార్లు ధర పెంచింది. ► ప్రస్తుతం గరిష్టంగా లీటరు ఆవు పాలకు రూ.35.78, గేదె పాలకు రూ.74.78 చొప్పున చెల్లిస్తుంటే ఆ స్థాయిలో ప్రైవేట్ డెయిరీలు చెల్లించలేకపోతున్నాయి. గతంలో కనీస నాణ్యత లేని దాణా (16 శాతం ప్రొటీన్)ను కేవలం 8 నెలలు మాత్రమే రైతులకు సరఫరా చేసే వారు. కానీ అమూల్ మాత్రం 20 – 22 శాతం ప్రొటీన్ కల్గిన దాణా 50 కేజీల బస్తా రూ.1,100 చొప్పున ఏడాది పాటు ఇస్తోంది. ► ఏడాదిలో కనీసం 180 రోజులు పాలు పోసే ఆదర్శ రైతులకు లీటర్‌కు 50 పైసల చొప్పున ఇన్సెంటివ్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. పాడి రైతులకే కాకుండా సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లిస్తోంది. ► ఎలాంటి ఇన్సెంటివ్‌లు చెల్లించని హెరిటేజ్, సంగం లాంటి ప్రైవేట్ డెయిరీలు సొసైటీల నిర్వహణ ఖర్చు కింద లీటర్‌కు 50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నాయి. మరో పక్క గేదెలపై రూ.30 వేలు, ఆవులపై రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తోన్న ప్రభుత్వం.. కొత్త పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. కొలతల్లో మోసాలకు అడ్డుకట్ట ► కొలతల్లో మోసాలకు చెక్ పెట్టేందుకు తూనికలు – కొలతల శాఖకున్న అధికారాలతో పశు వైద్యులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో ప్రైవేటు డెయిరీలకు చెందిన పాల కేంద్రాల్లో జరిగే మోసాలు వెలుగు చూస్తున్నాయి. ► అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ ప్రైవేటు డెయిరీకి పాలు పోస్తున్న అమ్మా డెయిరీ పాల కేంద్రంలో రోజుకు 1,200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. అయితే, కిలోకి 970 ఎంఎల్ చూపించాల్సిన మిషన్‌లో 930 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు. అంటే ఒక్కో రైతు నుంచి 40 ఎంఎల్ చొప్పున రోజుకు 48 లీటర్ల పాలు అధికంగా కాజేస్తున్నట్టుగా గుర్తించారు. పలు కేంద్రాల్లో లైసెన్సుల్లేని వేయింగ్ మిషన్లు వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ బలోపేతం ► వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాల లభ్యతపై భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో సహకార పాల డెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీలను ప్రభుత్వం బలోపేతం చేసింది. వీటి ద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఎస్ఎన్ఏఎఫ్ వంటి వాటితో పాటు 24 పారా మీటర్స్‌లో కల్తీ పదార్థాలను గుర్తించి సరిచేస్తుంది. ఆకస్మిక తనిఖీల్లో సేకరించిన మిల్క్‌ను ఎనలైజర్స్ ద్వారా పరిశీలించి, కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ► జగనన్న పాల కేంద్రాలు లేని చోట మాత్రం కొన్ని ప్రైవేటు డెయిరీలు పాల సేకరణలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నాయి. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను బట్టి జరిగే చెల్లింపులను పరిశీలిస్తే అమూల్ చెల్లిస్తున్న పాల ధర కంటే తక్కువ ధర చెల్లిస్తున్నట్లు అనంతపురం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో వెలుగు చూసింది. ► అమూల్ కేంద్రాల కంటే ప్రైవేట్ కేంద్రాల్లో వెన్న, ఎస్ఎన్ఎఫ్ 0.2 నుంచి 0.5 శాతం తక్కువగా చూపి, అంటే లీటర్‌కు రూ.4 చొప్పున తక్కువ చెల్లించేందుకు యత్నిస్తుండగా, నిరంతర తనిఖీలతో అడ్డుకట్ట వేస్తున్నారు. కల్తీకి అడ్డుకట్ట వేసిన అమూల్ ► కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఎన్ఎఫ్ కనీసం 8.7 శాతం ఉంటేనే గేదె పాలు, 8.5 శాతం ఉంటేనే ఆవుపాలు కొనుగోలు చేస్తామన్న నిబంధన అమూల్ పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో హెరిటేజ్, సంగం వంటి ప్రైవేటు డెయిరీలు సైతం ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచి 2021 మార్చి నుంచి పాలు సేకరిస్తున్నాయి. ► నాణ్యతకు పెద్ద పీట వేసేందుకు ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్’ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం సొసైటీలకు అందించడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు తమ కేంద్రాల్లో కొద్దిపాటి యంత్ర పరికరాలైనా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమూల్ రాకతో పాల నాణ్యత విషయంలో పాడి రైతులకు అవగాహన పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట పడింది. జగనన్న పాలవెల్లువతో ఎంతో మేలు 15 ఏళ్లుగా పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాం. గతంలో లీటరుకు రూ.43 ఇచ్చేవారు. పాలలో వెన్న శాతాన్ని తక్కువ చేసి చూపించి, మాకు రావాల్సిన ఆదాయాన్ని వారి జేబుల్లో వేసుకునే వారు. జగనన్న పాల వెల్లువ ప్రారంభమైన తర్వాత లీటరు పాలకు రూ.66కు పైగా చెల్లిస్తున్నారు. కచ్చితమైన కొలత, వెన్న శాతం ఉంటోంది. పాలు పోసిన వెంటనే మా మొబైల్‌కు ఆ వివరాలతో కూడిన మెసేజ్ వస్తోంది. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి 10 రోజులకొకసారి పాల బిల్లు చెల్లిస్తోంది. – కుడుముల సుజాత, నల్లపురెడ్డిపల్లె, పులివెందుల, వైఎస్సార్ జిల్లా -
పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్
కనీసం ఒక లీటర్ మంచి నీళ్ల సీసా ధర కూడా పాలకు రావడం లేదని, ఇలాగైతే ఎలా బతకాలని అక్కచెల్లెమ్మలు నా పాదయాత్ర సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి రేటు వచ్చేట్టుగా, ఎటువంటి మోసం, దళారులు లేని పరిస్థితిని అమూల్ ద్వారా తీసుకువచ్చాం. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అమూల్ పాల సేకరణ చేస్తోంది. ఇప్పుడు ఏడవ జిల్లాగా అనంతపురంలో అడుగుపెట్టింది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్‌తో పోటీ వల్లే ప్రైవేట్ డెయిరీలు కూడా పాల రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, వాళ్లకేదైనా అదనపు ఆదాయం గ్రామంలోనే ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావడంతో పాటు మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో జగనన్న పాల వెల్లువ శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అమూల్ రంగ ప్రవేశం వల్ల పాడి ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ, రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కేవలం దానిమీదే ఆధారపడితే సరిపోని పరిస్థితుల్లో పాడిని తోడుగా చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తికి, పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అక్క చెల్లెమ్మలే యజమానులు ► అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్ యాజమానులు. అందుకే మార్కెట్లో ఏ ఇతర ప్రైవేటు డెయిరీ కంటే అమూల్ ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ► పాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రాసెసింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉంది. పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్థాయికి అమూల్ ఎదిగింది. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోంది. అందువల్లే ఎలాంటి మోసాలు, కల్తీ, దళారుల డెడద లేకుండా అక్కచెల్లెమ్మలకు మంచి రేటు ఇస్తోంది. వచ్చిన లాభాలను కూడా బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అక్కచెల్లెమ్మలకు వెనక్కు ఇస్తోంది. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా చూడలేం. ► మన రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరుగార్చిన నేపథ్యంలో అక్కడో, ఇక్కడో ఉన్న కొద్దొ గొప్పో డెయిరీలు సహకార రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో ఉన్నాయి. వాస్తవానికి సహకార రంగంలో ఉండటం అంటే ఇలా.. అని చూపించిన పరిస్థితి దేశం మొత్తం మీద అమూల్‌లోనే ఉంది. లాభాలు పాలు పోసే అక్కచెల్లెమ్మలకే వస్తాయి అని అమూల్ చూపించింది. అందుకే అమూల్‌కు అంత ప్రాధాన్యత. అమూల్ రాకతో పోటీతో పాటు మార్పు ►నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాలు పోసే అక్కచెల్లెమ్మలు, రైతులు వచ్చి వాటర్ బాటిల్ చూపించే వారు. మార్కెట్లో వాటర్ బాటిల్ ధర రూ.23 అయితే, లీటరు పాలు అంత కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే మేం ఎలా బతకాలని అడిగే వారు. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ► అమూల్ రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా పోటీలో లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకు పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడే ఎందుకు రేటు పెరిగిందంటే.. గతంలో గ్రామ స్థాయిలో మోసాలే కారణం. పాలు పోసిన వెంటనే గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు అనే పరిస్థితులు ఉండేవి. ► రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీయూ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. దాదాపు 4,900 బీఎంసీయూలు, 11,690 ఏఎంసీయూ (ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్)లను ఏర్పాటు చేస్తోంది. ► అమూల్ విస్తరించే కొద్దీ, ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తాం. వీటి వల్ల అక్కచెల్లెమ్మలు పాలు పోసేటప్పుడు అక్కడికక్కడే.. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు.. ఎంత ధర వస్తుందని వివరిస్తూ రశీదు ఇస్తారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. మీ కళ్ల ముందే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ జరుగుతుంది. మోసాల నివారణకు చర్యలు ► పాల సేకరణలో జరిగే మోసాలను నివారించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధ్యాస పెట్టింది. తనిఖీలు విస్తృతంగా చేపట్టింది. దీనివల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుబడిన కేసుల్లో ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ► ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో బాలమృతం, అంగన్వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్‌తో అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అమూల్ ఎండీ ఆర్ఎస్ సోథీ, కైరా మిల్క్ యూనియన్ ఎండీ అమిత్ వ్యాస్, బనస్కాంత మిల్క్ యూనియన్ ఎండీ సంగ్రామ్ చౌదరి, సబర్కాంత మిల్క్ యూనియన్ ఎండీ అనిల్ బయాతీలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయతో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. -
ఇక పాలు, బాలామృతం మనవే
సాక్షి, అమరావతి: సహకార డెయిరీ రంగంలో అంతర్జాతీయ కీర్తినార్జించిన ‘అమూల్’ సంస్థ ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇకపై ఏపీలోనే తయారైన పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నేడు (శుక్రవారం) అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోంది. అనంతపురం జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకానికీ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిద్వారా ఆర్నెల్ల నుంచి మూడేళ్ల్లలోపు ఉన్న చిన్నారులు 22.50 లక్షల మంది.. గర్భిణీ స్త్రీలు 7.50 లక్షల మంది ఉన్నారు. వీరికి పౌష్టికాహారం రూపంలో గర్భిణీలకు 200 గ్రా. పాలతో పాటు పిల్లలకు రోజూ 100 గ్రా. పాలు, నెలకు 2.5 కేజీల చొప్పున బాలామృతం కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజే స్తోంది. ఇప్పటివరకు వీటిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ«ధ్వర్యంలో బెంగళూరు నుంచి నెలకోసారి టెట్రా ప్యాకింగ్ రూపంలో 1.07 కోట్ల లీటర్ల చొప్పున ఏటా 12.84 కోట్ల లీటర్ల పాలు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సొసైటీ నుంచి ఏటా 48,692 మెట్రిక్ టన్నుల బాలామృతాన్ని అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారు. పాలు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. రాష్ట్రంలో మన పాడి నుంచి ఉత్పత్తి అయ్యే తాజా పాలతో పాటు రాష్ట్ర పరిధిలోనే ప్రొసెస్ చేసిన బాలామృతాన్ని అంగన్వాడీలకు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల మన పాడి రైతులకు మేలు జరగడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోనుంది. -
Jagananna Pala Velluva: సాధికారతకు ఊతం
అమ్మే వారు అనేక మంది ఉన్నప్పుడు.. కొనేవాడు ఒక్కడే ఉంటే అతడు ఎంత ధర చెబితే అంతే. దాన్నే బయ్యర్స్ మోనోపలీ అంటారు. కొనేవాళ్లు ఇద్దరు ముగ్గురున్నా గ్రూపుగా ఏర్పడతారు. అప్పుడు అమ్మే వారంతా కట్టకట్టుకుని అదే రేటుకు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇలాగైతే అమ్మే వారికి అన్యాయమే జరుగుతుంది. మన రాష్ట్రంలో పాడి రైతుల విషయంలో ఈ పరిస్థితి చూస్తున్నాం. దీన్ని మార్చడానికి మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుని ‘ఏపీ పాల వెల్లువ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తద్వారా పోటీ వాతావరణం కల్పించి పాలు విక్రయించే అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాడి రైతులకు ముఖ్యంగా పాలు పోసే అక్క చెల్లెమ్మలకు అదనపు ఆదాయం కల్పించడానికే అమూల్‌ను తీసుకువచ్చామని, వారి ఆర్థిక చైతన్యానికి ఈ పాలవెల్లువ కార్యక్రమం ఊతమిస్తోందని చెప్పారు. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ కార్యక్రమం కింద పాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అమూల్‌ను ఎదుర్కోవడానికి మిగిలిన డెయిరీలు కూడా రేట్లు పెంచుతుండటం మంచి పరిణామం అని, కారణం ఏదైనా పాడి రైతులకు మేలు జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ కృష్ణా జిల్లాలో శ్రీకారం చుడుతున్న పాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సబర్ కాంత మిల్క్ యూనియన్ ఎండీ డాక్టర్ బీఎం పటేల్‌కు అభినందనలు తెలుపుతున్నానని, నేటి నుంచి కృష్ణా జిల్లా రైతులకు, అక్కచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభించబోతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ పాలవెల్లువ కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పక్కన మంత్రులు సీదిరి అప్పలరాజు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబన ► మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మనది. ఏపీ అమూల్ పాల వెల్లువ పథకం ద్వారా గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబనకు, ప్రత్యేకంగా మహిళా సాధికారతకు ఇది ఊతమిస్తుంది. కృష్ణా జిల్లాలో పాల సేకరణకు 264 గ్రామాలను ఈ దశలో ఎంపిక చేయగా, ఆయా గ్రామాల్లో 37,474 మంది పాడి రైతులను గుర్తించాం. ► కృష్ణా జిల్లాలో ఇటీవల లాంఛనంగా 51 కేంద్రాల్లో పాల సేకరణను ప్రారంభిస్తే.. వారం రోజుల్లోనే 18,414 లీటర్ల పాలు సేకరించాం. 941 మంది పాడి రైతులకు రూ.8.15 లక్షల బిల్లు కూడా చెల్లించాం. రైతులకు ప్రతి లీటరుకు అదనంగా రూ.20కి పైగా లాభం వచ్చింది. ► ఉదాహరణకు చాట్రాయి మండలం సోమవరానికి చెందిన పి.వెంకటనర్మమ్మ అనే సోదరి గతంలో కృష్ణా మిల్క్ యూనియన్‌కు పాలు పోయగా, లీటరుకు రూ.44.80 వచ్చింది. ఇప్పుడు అమూల్ పాల వెల్లువ కేంద్రంలో పాలు పోయగా, లీటరుకు రూ.74.78 వచ్చింది. అంటే లీటరు పాలపై ఆమె దాదాపు రూ.30 అదనంగా సంపాదించింది. సెప్టెంబర్‌కు 17,629 గ్రామాలు లక్ష్యం ► ప్రకాశం జిల్లాలో 245 గ్రామాల్లో, చిత్తూరులో 275 గ్రామాల్లో, వైఎస్సార్‌లో 149 గ్రామాల్లో, గుంటూరులో 203 గ్రామాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి.. మొత్తంగా 1,046 గ్రామాల నుంచి అమూల్ ఇప్పటికే పాల సేకరణ చేస్తోంది. 2022 సెప్టెంబర్ నాటికి 17,629 గ్రామాల నుంచి పాల సేకరణకు ప్రణాళికలు రచించాం. ► ఏడాది కాలంలో ఐదు జిల్లాల్లో అమూల్ పాల సేకరణ ప్రారంభమవ్వగా, ఇవాళ ఆరవ జిల్లాలో మొదలైంది. మిగిలిన ఏడు జిల్లాలకూ విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ► గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు 30,951 మంది మహిళా పాడి రైతుల నుంచి అమూల్ 168.50 లక్షల లీటర్లు పాల సేకరణ చేసింది. దాదాపు రూ.71 కోట్లు చెల్లించాం. ఇది పెద్ద విషయం కాదు. ఇతర డెయిరీలకు పాల సరఫరా చేస్తే వచ్చే దానికంటే దాదాపు రూ.10 కోట్లు అదనంగా వచ్చిందన్నది మనం గమనించాలి. ఇదే అక్కచెల్లెమ్మలు గతంలో వాళ్లకే పాలు పోసి ఉంటే రూ.61 కోట్లే వచ్చేవి. పాలు పోసేవారే యజమానులు ► రైతులకు అత్యధిక రేటు ఇస్తారు. వాళ్ల దగ్గరున్న ప్రాసెసింగ్ మరెవ్వరి దగ్గరా లేదు. పాల నుంచి చాక్లెట్స్, ఇతర ఉత్పత్తులు తయారు చేసే స్థాయికి ఎదిగిన సంస్థ అమూల్. ► మిల్క్ ప్రాసెసింగ్‌లో దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. పాలు పోసే రైతులే అమూల్ యజమానులు. ► ఈ కంపెనీలో వాటాదారులు అంతా మీరే. లాభాపేక్ష అనేది అమూల్‌కు లేదు. సంస్థ గడించే లాభాలను ఏడాదికి ఒకసారి బోనస్ రూపంలో తిరిగి అక్కచెల్లెమ్మలకు వెనక్కి ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్‌లోనే ఉంది. ► పాల బిల్లును కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా మరింత మేలు జరుగుతుంది. అమూల్‌తో ఇబ్బంది పడే పరిస్థితి రాదు, ఉండదు. సంస్థ బాగే రైతుల బాగు ► ఇదొక సహకార రంగ సంస్థ. సంస్థ బాగుంటే రైతులు బాగుంటారు. సంవత్సరంలో కనీసం 182 రోజులు అంటే ఆరు నెలలు సొసైటీకి పాలు పోసిన మహిళా పాడి రైతులకు అమూల్ ద్వారా ఏడాది చివరిలో ప్రతి లీటరుపై 50 పైసలు బోనస్‌గా కూడా చెల్లిస్తున్నారు. ► ఈ సంస్థ నాణ్యమైన పశుదాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. ఎంసీయూ, ఏఎంసీయూలలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో డెయిరీలు ► సహకార రంగ డెయిరీలలో బాగున్న వాటిలో కొన్నింటిని.. దురదృష్టవశాత్తు కొంత మంది ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా ఆక్రమించుకున్నారు. అవి వాళ్ల ప్రైవేటు ఆస్తుల కింద మారిపోయాయి. ► ప్రభుత్వానికి ఇది ఒక సమస్య అయితే.. రెండోది ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో వాటాలు ఉండటం వల్ల, పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి ధర ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఉండేది కాదు. ఈ పరిస్థితి ఎందుకు? ► మన రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అమూల్ వస్తే తప్ప మన రైతులకు, మన అక్కచెల్లెమ్మలకు మెరుగైన రేటు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపై అందరూ ఆలోచించాలి. ► నా పాదయాత్రలో ప్రతి జిల్లాలో పాలుపోసే రైతులు, అక్కచెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి కలిసేవారు. ‘ఒక లీటరు మినరల్ వాటర్ ధర రూ.23 అయితే, ఒక లీటరు పాలు ధర కూడా రూ.23. ఇలాగైతే ఏ రకంగా బతకగలుగుతాం?’ అని ప్రతి జిల్లాలో బాధపడేవాళ్లు. నేను కూడా ఇదే ప్రస్తావించేవాడిని. ► అందుకే అధికారంలోకి రాగానే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని, పాల సేకరణ చేపట్టాం. అమూల్‌కు, మిగిలిన సంస్థలకు ఉన్న తేడా ఏంటన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. అమూల్ అనేది కంపెనీ కాదు.. మనలాంటి వాళ్లు కలిసికట్టుగా ఒక్కటైతే అమూల్ అవుతుంది. ఈ పరిస్థితిని మారుస్తున్నాం ► ఈ పరిస్థితిని మార్చాలని మన ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా కట్టుబడి రకరకాల కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4,796 గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ► ప్రతి మహిళా డెయిరీ సహకార సంఘానికి అనుబంధ గ్రామాల్లో కూడా పాల సేకరణ చేయడానికి ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.979 కోట్లతో బీఎంసీయూలు, 12,883 ఏఎంసీయూల నిర్మాణం కోసం మరో రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ► వీటి ద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా వస్తుంది. మోసం ఉండదు. ఎంత ఎస్ఎన్ఎఫ్ ఉందని వాళ్లే మీటర్ పెట్టి చూసుకోగలుగుతారు. ఎవరి ప్రమేయం లేకుండా బిల్లు వస్తుంది. ఇంత ధర వస్తుందనేది తెలుస్తుంది. ► ప్రభుత్వ చర్యలతో అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి దోచుకున్న డెయిరీలకు, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారికి దిక్కుతోచడం లేదు. అమూల్ రావడంతో వాళ్లు కూడా రేట్లు పెంచుతున్నారు. మనకు కావల్సింది అదే. ► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అమూల్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీ ఎం పటేల్ హాజరయ్యారు. రైతులకు అండగా ప్రభుత్వం ► మన రైతులు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.. అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టే.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ప్రభుత్వమే మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ.. రైతులకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే దళారులను సవాల్ చేసింది. ► ఈ రేటు కంటే తక్కువకు అమ్మాల్సిన పనిలేదని, ఆ ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడంతో.. దళారులు అంతకన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండున్నరేళ్లుగా అనేక ఉత్పత్తులను ధరల స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడగలిగాం. ► ధాన్యం, కూరగాయలు, పండ్లతో పాటు పాడి రైతులకు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనతోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా అడుగులు వేశాం. -
పాలు పోసే రైతులే అమూల్ సంస్థ యజమానులు: సీఎం జగన్