Jhansi City
-
యూపీ ఆస్పత్రి ఘటన.. దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం -
‘దెయ్యాల పనే అంటారా?!’
లక్నో: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూస్తే.. ఒక్క క్షణం మనకు కూడా నిజంగానే దెయ్యాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతుంది. దాని చుట్టూ చేరిన పోలీసులు ఈ అసాధరణ విషయాన్ని వీడియో తీయడంలో నిమగ్నమయ్యారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. నెటిజనులు దీని గురించి రకరకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఎక్కువ మంది మాత్రం ‘మానవ ప్రయత్నం లేకుండా ఈ పరికరం కదులుతుంది అంటే ఖచ్చితంగా ఇది దెయ్యాల పనే’ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ వార్తలు జోరుగా షికారు చేస్తుండటంతో ఝాన్సీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా జరగడానికి గల కారణాన్ని వివరించారు. Fitness freak ghost 👻?@jhansipolice got a tip off about an open gym being used by ghosts!Team laid seige & soon found t real ghosts-Some mischievous person made video of moving swing & shared on #socialmedia. Miscreants will b hosted in a ‘haunted’ lockup soon #NoHostForGhost pic.twitter.com/JUaYt4IJMS — RAHUL SRIVASTAV (@upcoprahul) June 12, 2020 ‘ఓ పార్కులోని జిమ్ పరికరం దానంతట అదే కదులుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఝాన్సీ పోలీసులు ఇందుకు గల కారణాన్ని కనుగొన్నారు. గ్రీజు ఎక్కువ కావడంతో ఆ పరికరం దానంతట అదే కదులుతుంది. ఇది దెయ్యాల పని కాదు. దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి ’అంటూ ఝాన్సీ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు కారణం తెలియడంతో జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. तेजी से वायरल हो रहे वीडियो जिसमें झूला अपने आप झूलता हुआ दिखाई दे रहा है, सत्यता की जाँच @COCityjhansi द्वारा मौके पर जाकर की गयी तो झूले में अधिक ग्रीस लगे होने से एक बार हिला देने पर कुछ समय तक हिलता रहता है। आप सभी से अपील है कि भूत आदि होने की अफ़वाह न फैलाएं #FakeNewsAlert pic.twitter.com/kvqpQCMCSv — Jhansi Police (@jhansipolice) June 13, 2020 -
స్నేహితులతో భార్యను చంపించిన భర్త
ఝాన్సీ: తన స్మార్ట్ ఫోన్ చూడనీయకుండా లాక్ కోడ్ పెట్టుకుందన్న అక్కసుతో భార్యను అంతమొందిచాడో భర్త. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూనమ్ వర్మ అనే మహిళ ఆగస్టు 29న హత్యకు గురైంది. పూనమ్ భర్త వినీత్ కుమార్ స్నేహితులు ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వినీత్ కుమార్ ను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయడంతో అసలు విషయం వెల్లడించాడు. తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. కాన్పూర్ కు చెందిన వినీత్, పూనం.. ఝాన్సీ నగరంలో నివసిస్తున్నారు. మొదట్లో చిన్న ఉద్యోగం చేసిన వినీత్ తర్వాత వ్యాపారంలోకి ప్రవేశించాడు. దీంతో కాన్పూర్-ఝాన్సీ మధ్య తిరుగుతుండేవాడు. గత నెలలో స్మార్ట్‌ఫోన్ కొనిచ్చినప్పటి నుంచి తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని పోలీసులతో వినీత్ చెప్పాడు. తనను, తమ నాలుగేళ్ల కుమార్తెను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టిందన్నాడు. ఎవరూ తనఫోన్ ఓపెన్ చేయకుండా లాక్ కోడ్ పెట్టుకుందని వెల్లడించాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వినీత్.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు లక్ష్మణ్, కమల్ లకు రూ. 80 వేలు ఇచ్చి పూనమ్ ను హత్య చేయించాడు. ఆ సమయంలో కాన్పూర్ లో ఉండడంతో భార్య హత్యతో తనకు సంబంధం లేదని నమ్మబలికాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు.