Justice laxman reddy
-
లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణరెడ్డి ప్రమాణం
-
15న ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఈనెల 15న ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం జరుగనుంది.రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించింది. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఐదేళ్ల పాటు లక్ష్మణ్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. -
టీఆర్ఎస్కే మా మద్దతు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని రాయలసీమ వాసులు డిసెంబర్ 7న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే తమ ఓటేసి గెలిపించుకోవాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (గ్రాట్) ఆధ్వర్యంలో ‘ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. తెలంగాణలో స్థిరపడిన రాయలసీమ వాసుల నేటి కర్తవ్యం’పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన హైదరాబాద్‌లో నివసిస్తున్న రాయలసీమ ప్రజల అవసరాలు, అభీష్టాలకు పెద్దపీట వేసేలా సాగిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ వాసుల పట్ల ఎలాంటి వివక్షా చూపలేదన్నారు. టీఎస్ఎస్ సింగిల్ పార్టీ అని, నిర్ణయాలు కూడా కేసీఆర్ వెంటనే తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. టీఆర్ఎస్కు ఒక ఎజెండా ఉంటుందని తెలిపారు. అదే మహాకూటమిలో ఎవరు సీఎం అవుతారో తెలియదన్నారు. కాంగ్రెస్‌ది అంతా సీల్డ్ కవర్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వారు ఓటుకు కోట్లు కేసులో దొరికిన వారిని సీఎంగా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్కే తమ మద్దతు అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిపై దృష్టిసారించారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అధికార వికేంద్రీకరణ అంటూ ప్రకటించి ఆచరణలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. చివరికి హైకోర్టు కూడా అమరావతికి తరలిస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇవ్వాలని జీవోలో ఎక్కడా లేదన్నారు. ప్రాజెక్టులను దివంగత సీఎం వైఎస్సార్ పరుగులు పెట్టించారన్నారు. వైఎస్ఆర్ మరణంతో ఆగిన గుండెలను పరామర్శించేందుకు వెళ్తానన్న వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. గాలేరు – నగరి ప్రాజెక్టులను చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు కుట్రలో భాగమే మహాకూటమి అని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన టీడీపీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మహాకూటమి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. మన తీర్పు చంద్రబాబుకు ఒక హెచ్చరికగా ఉండాలని చెప్పారు. గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ.హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్షనేతకే రక్షణ కల్పించలేని చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటున్న రాయలసీమ వాసులకు అండగా ఉంటానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఏదిఏమైనా అందరం ఏకమై మహాకూటమి అభ్యర్థులను ఓడిద్దామన్నారు. కార్యక్రమంలో గ్రాట్ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు శ్యామలారెడ్డి, గ్రాట్ అధ్యక్షుడు ఎం ఓబుళరెడ్డి, సభ్యులు బి రాఘవేంద్రరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారు
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తన హిట్లర్ మాదిరి ఉండటమేగాక డిక్టేటర్లా వ్యవహరిస్తున్నందువల్లే రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందట్లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విమర్శించారు. చట్టంలో పొందుపరచిన అంశాల్ని అమలు చేయాలని రెండేళ్ల తర్వాత కూడా మేధావులు కోరాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ పునర్విభజన చట్టం, హామీల అమలు అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని విషయమై ఇటు కేంద్రప్రభుత్వం, అటు ప్రతిపక్షపార్టీలతో మాటమాత్రంగానైనా సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ర్టప్రభుత్వమే చట్టాన్ని అతిక్రమించిందని విమర్శించారు. అబద్ధాలతో పాలన..: తొమ్మిది క్యాంపు ఆఫీసులకు సీఎం రూ.80 కోట్లు ఖర్చుచేసి రాజధానికోసం ఇటుకలను విరాళాలుగా సేకరించడం విడ్డూరంగా ఉందని సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. రెవెన్యూ లోటు ఉందంటూనే వేలకోట్లు రుణమాఫీ ఏవిధంగా చేశారో చెప్పాల్సిన అవసరముందన్నారు. కాగా ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానం ఆమోదించింది. -
ప్రత్యేక హోదా ప్రజల హక్కు
వైవీయూ : ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, అందుకు ఉద్యమించడమే మార్గమని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌రెడ్డి అధ్యక్షతన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా - రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ’ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశంతో కలిసి 8 జిల్లాలకు తొలుత ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే విజయవాడ, విశాఖపట్టణం లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలకే ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు తరలిపోతాయన్నారు. దీని వలన మళ్లీ కోస్తా ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది తప్ప రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, పీసీసీ అధ్యక్షుడు ఇలా అందరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులే ఉన్నప్పటికీ రాయలసీమకు న్యాయం జరగడం లేదన్నారు. అధికారం వద్దు.. అభివృద్ధి కావాలన్నది కోస్తా ప్రాంతం వారి నినాదమన్నారు. సీమ ప్రాంతం నాయకులు మాత్రం అధికారం కోసం అభివృద్ధి అక్కడే చేస్తామంటుండటం శోచనీయమన్నారు. కోస్తాంధ్రతో సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం అత్యంత వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్నారు. ఈ ప్రాంతాలు అభివృద్ధి అయ్యేవరకు ఈ ప్రాంతాలకే నిధులు కేటాయించాలన్నారు. ఇతర విద్యాసంస్థలు, వైద్యశాలలతో పాటు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని, ఎయిమ్స్‌తో పాటు అన్ని రకాల సంస్థలను కోస్తా ప్రాంతానికే పరిమితం చేస్తున్నారన్నారు. రాజధాని అవసరాల కోసం పట్టిసీమను నిర్మిస్తున్నారన్నారు. బయటకు మాత్రం సీమకు నీటిని అందించేందుకు అని చెబుతున్నా అందులో కోస్తా వారి ప్రయోజనాలే దాగి ఉన్నాయన్నారు. పట్టిసీమ జీఓలో ఎక్కడా రాయలసీమకు సంబంధించిన అంశం లేదన్నారు. రాత పూర్వకంగా హక్కు లేకుంటే రాబోయే రోజుల్లో ఏవిధంగా పట్టిసీమపై హక్కు ఉంటుందన్నారు. పట్టిసీమ నిర్మాణంరాయలసీమ ప్రజల నోట్లో దుమ్ముకొట్టడానికేనని విమర్శించారు. రాయలసీమను ఎందుకు అభివృద్ధి చేయాలి.. ఓట్లు వేసిన కోస్తా ప్రాంతానికే మేలు చేస్తానని ముఖ్యమంత్రి అనడం దుర్మార్గమన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని, పాలకులు ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్‌లో చేసిన తప్పును పునరావృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా పోరాడింది రాయలసీమ ప్రాంతవాసులైతే.. ఫలాలు పొందింది మాత్రం కోస్తావారన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులని మళ్లీ అభివృద్ధి చెందిన తర్వాత రాయలసీమ వారిని వెనక్కి వెళ్లమంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉన్న విశాఖలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి తెచ్చామన్నారు. నేడు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేయాలన్నారు. యువత సైతం పదవులు ఆశించకుండా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని దీనికి యువత ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది రాష్ర్ట ప్రజల హక్కు అని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన నలుగురు నేతలు సీఎంగా పని చేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పాలక, ప్రతిపక్షం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఉద్యమం గురించి పట్టించుకోకుండా ఉంటే తనకు ఇప్పటికే పదవి వచ్చి ఉండేదని, దానిని కాదనుకుని ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజల్లో చైతన్యం నింపడానికి పోరుబాట పట్టానన్నారు. ఆర్థిక లోటు, రాజధాని లేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రత్యేక హోదాపై అఖిల పక్షం ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఏడాది గడిచినా ఇపుడు దాని గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటుచేసి ఢిల్లీకి పంపి ప్రత్యేకహోదాను సాధించాలన్నారు. దీనికి అవసరమైతే పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి సాధించుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదాపై లక్ష్మణ్‌రెడ్డి వ్యాఖ్యలపై సినీనటుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా స్థానిక బీజేపీ నాయకుడు సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి అడ్డుచెప్పారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని లక్ష్మణ్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండించడం తగదని వాగ్వాదానికి దిగారు. దీంతో సినీనటుడు శివాజీ తనకు ప్రాంతీయ భేదాలు లేవని చెప్పారు. తాను పుట్టింది గుంటూరులో అని ఇల్లు తిరుపతిలో కట్టుకున్నానన్నారు. హైదరాబాద్‌లో సైతం తనను ఆదరిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి, ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్, వైఎస్ఆర్ సీపీ నాయకుడు పి. ప్రతాప్‌రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు శివనాయక్, రంగనాథరెడ్డి, ఆర్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఆర్ఎస్యూ, ఆటోయూనియన్ నాయకులు జాకీర్, షరీఫ్, ఐఎస్ఎఫ్ నాయకులు గంగిరెడ్డి, తరుణ్‌కుమార్, రాజ, సిద్ధయ్య, శ్రీనివాసులు, సందీప్, అజీమ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకహోదాపై మహానాడులో ఎందుకు తీర్మానం చేయలేదు? రాష్ట్ర విభజనకు సీపీఎం తప్ప అన్ని పార్టీలు ఏదో ఒక రకంగా అంగీకరించాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై మీనమేషాలు తగదు. చిత్తశుద్ధి వుంటే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రత్యేకహోదాపై ఎందుకు తీర్మానం చేయలేదు? ప్రత్యేకహోదా వస్తేనే అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివదిృ చెందుతుంది. 90 శాతం గ్రాంట్ల రూపంలో నిధులు వచ్చే అవకాశం ఉంది కనుక విభజన చట్టంలోని అన్ని అంశాలను ఐక్యంగా సాధించుకోవాలి. - రవిశంకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజ్యాంగ సవరణ చేసైనా ప్రత్యేకహోదా కల్పించాలి ప్రత్యేకహోదా విషయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే రాజ్యాంగ సవరణ చేసైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి. వందల సార్లు రాజ్యాంగ సవరణ చేసిన నాయకులు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే సవరణ చేసి హోదాను ఇవ్వాలి. ప్రస్తుతం కేవలం స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయన్నాయి. శివరామకృ్ణన్ కమిటీ చెప్పిన విధంగా అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలి. - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, కడప -
'పవన్.. భూసేకరణ చట్టంపై మీ వైఖరేంటి?'
గుంటూరు: భూసేకరణ సవరణ చట్టంపై సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వైఖరి స్పష్టం చేయాలని జనచైతన్య వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఏడాదికి నాలుగు పంటలు పండే భూములను ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ధ్వంసం చేయడంపై పవన్ స్పందించాలని పేర్కొన్నారు. ఆ తర్వాతనే పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించాలని అన్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఆ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి స్పందించారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే భూసేకరణ చట్టాన్ని టీడీపీ మినహా అన్ని పార్టీలు ఖండిస్తున్నాయని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, బిల్డర్ మాఫియాను ప్రోత్సహించడంపై పవన్ స్పందించాలని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. -
భూ సేకరణే రైతులకు లాభం
* రైతు చైతన్యయాత్రలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి * సీఆర్డీఏ బిల్లును చూసి అన్నదాతలెవరూ భయపడొద్దు * డబ్బుల్లేకుండా వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకట? * బడాబాబులకు దోచిపెట్టేందుకు సర్కారు కుట్ర * రైతులకు న్యాయ సహాయానికి తుళ్లూరు కేంద్రంగా త్వరలో లీగల్ సెల్ సాక్షి, విజయవాడ బ్యూరో: భూ సమీకరణకంటే భూ సేకరణే రాజధాని రైతులకు ప్రయోజనకరమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. సీఆర్డీఏ బిల్లును చూసి ఎవరూ భయపడాల్సిన పని లేదని రైతులకు ధైర్యం చె ప్పారు. సమీకరణ, సేకరణల్లోని తేడాలను రైతులకు వివరించి వారిని చైతన్యపరిచేం దుకే రాజధాని గ్రామాల్లో చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం శుక్రవారం రాజ ధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటిం చింది. ఉండవల్లి నుంచి బయల్దేరిన ఈ బృందం పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తుళ్లూరు, రాయపూడి, నవులూరు గ్రామాల్లోని పొలాలను పరిశీలించింది. రైతులతో మాట్లాడింది. సర్కారుకు భూమలివ్వబోమని అక్కడి రైతులు స్పష్టం చేశారు. అనంతరం రైతు నాయకులు అనుమో లు గాంధీ అధ్యక్షతన మందడంలో రైతులతో జరిగిన సమావేశంలో జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రసంగించారు. రైతులు ఇష్టపడితేనే ప్రభుత్వం భూ సమీకరణ జరపాల్సి ఉంటుందని చెప్పారు. ఒక వేళ భూ సేకరణ జరిపినా రైతులకు లాభమేనని తెలిపారు. భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం సేకరించిన భూమిని మూడో వ్యక్తి అమ్మితే ఆ రోజు ధర ఎంత వస్తుందో.., ఆ ధరకు, మొదట రైతుకు చెల్లించిన రేటుకు మధ్య ఉన్న వ్యత్యాసంలో 40 శాతాన్ని రైతులకు చెల్లించాలని తెలిపారు. భూములిచ్చిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగమివ్వాల్సిన బాధ్యత కూడా సర్కారుపై ఉందన్నారు. ఈ విషయాలను రైతులకు చెప్పకుండా ప్రభుత్వం భూ సమీకరణ పేరిట బడాబాబులకు ఏజెంటుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అస లు డబ్బుల్లేకుండా వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకని ప్రశ్నించారు. రియల్టర్లు, డెవలపర్ల కోసం ఎందుకు ఏజెంటుగా వ్యవహరించాలని పరోక్షంగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు న్యాయపరమైన సలహాలి చ్చేందుకు త్వరలో తుళ్లూరు కేంద్రంగా లీగల్ సెల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. భూ సమీకరణ, భూ సేకరణల్లోని తేడాలపై త్వరలో విస్తృత ప్రచారం చేస్తామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష్యుడు వి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ కుట్రను ఎదుర్కొనేందుకు పార్టీలకు అతీతంగా రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీజేపీ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాదులు జగన్మోహన్రెడ్డి, శ్యామసుందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మందడం, లింగాయపాలెం, వెంకటపాలెం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులకు కోర్టులపరంగా లభించే న్యాయాన్ని వివరించారు. ఏ సమస్యకు ఏ విధంగా కోర్టును ఆశ్రయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చెప్పారు. ఈ సందర్భంగా లింగాయపాలెం వాసి అనుమోలు హరి లేచి ఎక్కువ మంది భూములివ్వడానికి సుముఖంగా ఉన్నామ ని, తామేం చేయాలో చెప్పాలని ప్రశ్నించా రు. దీంతో అక్కడున్న రైతులు హరిపై మం డిపడ్డారు. రైతులందరి పక్షాన భూములిస్తామని చెప్పడానికి నువ్వెవరంటూ నిలదీశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. -
కృష్ణా నదిని రెండో మూసీగా మారుస్తారా?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లు గురించి భయపడాల్సిన పనిలేదని, న్యాయస్థానాలు రైతులకు అండగా ఉంటాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. 'రైతు చైతన్య యాత్ర'లో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెరుమాక గ్రామంలో పలువురితో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధానికి భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. 95 శాతం భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని ఏర్పాటుకానున్న గ్రామాల్లో ఉన్న పంట పొలాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించిన దాఖలు కనబడడం లేదని ఆరోపించారు. కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలకు ఇక్కడున్న పరిస్థితులూ పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కృష్ణా నదిని రెండో మూసీ నదిగా మారుస్తారా అని లక్ష్మణ్‌రెడ్డి ప్రశ్నించారు. -
పచ్చని పొలాలను నాశనం చేస్తారా..?!
-
రియల్టర్ల కోసమే ‘విజయవాడ’
హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి.లక్ష్మణరెడ్డి మండిపాటు హైదరాబాద్: రియల్ఎస్టేట్ వ్యాపారుల కోసమే విజయవాడ కేంద్రంగా రాజధానిని ఏర్పాటు చేస్తున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి.లక్ష్మణ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే తెలుగు ప్రజలు మరోసారి విడిపోవాల్సి వస్తుందన్నారు. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జీఆర్‌ఏటీ) ఆధ్వర్వంలో ఆదివారం భెల్ నర్సరీలో ఏర్పా టు చేసిన కార్తీక మాస వన భోజనాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతం ఎన్నో విధాలుగా నష్టపోయిందన్నారు. తమిళ ప్రజల సం స్కృతి, సంప్రదాయాలతో కలసిపోయే రాయలసీమ వాసులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంత సుముఖత వ్యక్తం చేయలేదని, దీంతో ఆంధ్రా ప్రాంత నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు రాయలసీమ వాసుల సహకారం లేనిదే సాధ్యం కాదని గ్రహించి శ్రీ భాగ్ ఒప్పం దం చేశారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు పార్లమెంటు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినప్పటికీ వాటి గురించి మాట్లాడకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీ విషయమే చర్చిస్తున్నారని పేర్కొన్నారు. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థను కూడా గుంటూరులోనే పెట్టేందుకు యోచిస్తున్నారని, దాన్ని రాయలసీమలో ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సంఘటితంగా పోరాడి రాయలసీమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎ.హనుమంత రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం ఎప్పుడూ నష్టపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జీఆర్ రెడ్డి, పారిశ్రామిక వేత్త వీఎల్ఎన్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు ఓబుల్‌రెడ్డి, రాధాకృష్ణారావు, శ్యామలా రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని కోసం ఏకం కావాలి
రాజధాని సాధన కమిటీ సమావేశంలో వక్తల పిలుపు సాక్షి ప్రతినిధి,కడప: రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ సాధన కోసం పార్టీలకతీతంగా రాజకీయ జేఏసీగా ఏర్పడాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి కోరారు. మంగళవారం కడపలో రాయలసీమ రాజధాని సాధన కమిటీ ఆధ్వర్యంలో విసృ్తత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ సీమ వాసులు నాడు మద్రాసును, కర్నూలు రాజధానిని, నేడు హైదరాబాదును త్యాగం చేశారని వివరించారు. ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో ఇంకా అట్టడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే విలువైన ఎర్రచందనం వైఎస్సార్ జిల్లాలో ఉందని, దీనిని ఈ ప్రాంతం అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘సీమ’ ప్రాంతానికి చెందిన 52 మంది శాసనసభ్యులతోపాటు నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు చెందిన వారు తమ భవిష్యత్తు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ‘సీమ’లో రాజధాని సాధన కోసం తమవంతు కృషి ఉంటుందన్నారు. కాగా, విజయవాడను తాత్కాలిక రాజ ధానిగా చంద్రబాబు ప్రకటించడం వెనక కుట్ర దాగి ఉందని లక్ష్మణ్‌రెడ్డి ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
'విజయవాడ-గుంటూరులో భూముల ధరలకు రెక్కలు'
-
'విజయవాడ-గుంటూరులో భూముల ధరలకు రెక్కలు'
హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాయలసీమ రాజధాని సాధన సమితి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కంపెనీలు వచ్చాకే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. విశాఖ కూడా స్టీల్ ప్లాంట్ వచ్చాకే అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. మూడు ప్రాంతాల్లో అత్యధికంగా వెనుకబడింది రాయలసీమేనని చెప్పారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. విజయవాడ-గుంటూరులో ఇప్పటికే భూముల రేట్లు ఆకాశానంటుతున్నాయని తెలిపారు. రాజధాని ఇక్కడే ఏర్పాటు చేస్తారని ప్రచారం చేస్తూ పంటపొలాలను కూడా రియల్టర్లు వెంచర్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. అక్కడ రాజధాని నిర్మించాలంటే రూ.కోట్లు పెట్టి ప్రభుత్వం భూములు కొనాలని, దానికి బదులు రాయలసీమలో రాజధాని నిర్మాణం చేపడితే బాగుంటుందని లక్ష్మణ్ రెడ్డి సూచించారు. -
'రాజధానికి శ్రీబాగ్ ఒప్పందాన్నిఅమలు చేయండి'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాయలసీమ రాజధాని సాధన సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి సహా ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయని లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీరు, విద్య, అభివృద్ధిలో రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉందన్నారు. అప్పటి ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటం సమయంలో రాయలసీమ ప్రజలు పాల్గొనకపోవడంతో పెద్దమనుషుల ఒప్పందం కుదిరిందన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అంటూ ఒకటి ఏర్పడితే రాజధాని రాయలసీమ జిల్లాల్లోనూ ఉండాలని ఒప్పందం కుదిరిందన్నారు.హైకోర్టును కోస్తా జిల్లాల్లో పెట్టాలని కూడా అప్పుడే ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ఒప్పందం కుదిరిన తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నారని,అప్పటి ఒప్పందం ప్రకారమే కర్నూలును రాజధానిగా పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు కూడా ఆ ఒప్పందం ప్రకారమే నడుచుకోవాలన్నారు. -
సీమలోనే రాజధానిని నిర్మించాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన రాయలసీమలో రాజధాని నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణ ఖర్చును భరిస్తానని కేంద్రం హామీ ఇచ్చినందున సీమలో రాజధాని నిర్మిస్తే అక్కడ రైల్వే, విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వాణిజ్య పన్నులశాఖ మాజీ కమిషనర్ జి.ఆర్.రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమలో ఎందుకూ పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయని, కోస్తాలోని వ్యవసాయ భూములను నాశనం చేసి నిర్మాణాలు చేపట్టేకంటే ఇక్కడ రాజధానిని నిర్మిస్తే కోస్తా ప్రాంత భూములు ప్రజలందరికీ అందుబాటు ధరలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం, రాజధానిని అక్కడే నిర్మిస్తామని చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేసుకునేందుకు ఇదే సువర్ణావకాశమన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. విజయవాడ, గుంటూరు ఇప్పటికే పెద్ద నగరాలని, అక్కడ రాజధానికి తగినవిధంగా మౌలిక సదుపాయాలు లేవని, ప్రజలు తిరిగి హైదరాబాద్ మాదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాయలసీమ అభివృద్ధి వేదిక ఏర్పాటు రాయలసీమలో రాజధాని ఏర్పాటు అవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం ‘రాయలసీమ అభివృద్ధి వేదిక ’ను ఏర్పాటు చేసినట్లు లక్ష్మణరెడ్డి తెలిపారు. తమ వేదిక ఆధ్వర్యంలో 22న అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి రాజకీయాలకతీతంగా భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభ ద్వారా ఈ డిమాండును ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామనిచెప్పారు. -
ఆ రెండూ విభజన పార్టీలే: లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నైజం బయటపడిందని, ఈ రెండు పార్టీలు విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనేది స్పష్టమైందని జస్టిస్ లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు రెండు ప్రాంతాల్లో ఓట్లు, సీట్ల కోసం నాటకమాడుతున్నాయని దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర కోరుకునే వాళ్లంతా తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరుపై ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ విమర్శించారు. ఆయన ప్రస్తావించిన అంశాల్లోని ముఖ్యాంశాలు... విభజనకు వ్యతిరేకమా, అనుకూలమా అన్నదానిపై ఓటింగ్ అడగడంలేదు. చివరిదాకా చర్చలతో కాలయాపన చేసి, చివరి దశలో విభజనవాదులతో రచ్చ చేయించి బిల్లును కేంద్రానికి పంపించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి సమైక్యంపై మాట్లాడకుండా ఎప్పుడో వైఎస్ చెప్పారు.. టీడీపీ లేఖ ఇచ్చిందంటూ అసందర్భోచితంగా మాట్లాడుతూ ప్రజలు విరక్తి చెందేలా చేశారు. అన్ని రాష్ట్రాల విభజనలనూ చూశానని చెబుతున్న సభాపతి, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడులు ఓటింగ్‌పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టం. రెండు ప్రాంతాల్లో పార్టీని బతికించుకోవడం కోసం అసెంబ్లీలో డ్రామాలు ఆడుతున్నారు. ఓ వైపు పయ్యావుల కేశవ్ ఓటింగ్ గురించి అడుగుతారు కానీ.. ఎప్పుడు పెట్టాలో అడగరు. సమైక్య తీర్మానం చేయాలని గతంలో డిమాండ్ చేసిన ముద్దుకృష్ణమనాయుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇది దేనికి సంకేతం? ఓటింగ్ పెడితే విభజనకు వ్యతిరేకంగా వేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘంటాపథంగా చెబుతుంటే... వాళ్లను టార్గెట్ చేయడం ఘోరం. -
రాష్ట్ర విభజన అశాస్త్రీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్రనేత జస్టిస్ లక్ష్మణరెడ్డి పదిమంది మెప్పుకోసం తెలుగుజాతికి ద్రోహం చేస్తున్నారు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న పార్టీలకు మద్దతు తెలపాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయం, అసంబద్ధం... దీనిని మనమందరం తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పరిరక్షణ వేదిక రాష్ట్రనేత జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. ‘వంద రోజుల సమైక్యాంధ్ర ఉద్యమంపై సమీక్ష ’ అనే అంశంపై శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. వంద రోజుల ఉద్యమం, భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ విభజన రాజకీయ విభజనే తప్ప శాస్త్రీయమైన విభజన కాదని ధ్వజమెత్తారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలని భావిస్తే ముందుగా దానిపై చర్చ జరగాలని, అసెంబ్లీ, పార్లమెంట్లలో తీర్మానాలు జరగాలని తెలిపారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఫజల్ అలీ కమిషన్ వేసి, ఆ కమిషన్ ప్రతిపాదించిన మొదటి ఎస్ఆర్సీకి అనుగుణంగా రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. ఆర్టికల్-3 ప్రకారం చట్టబద్ధంగా సాగిందన్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి విదర్భను వేరుచేయాలని ఉద్యమం వచ్చిన సందర్భం లో 2001లో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ వేశారని, శాస్త్రీయ అధ్యయనం జరిపారని గుర్తుచేశారు. ప్రస్తుతం మన రాష్ట్ర విభజన విషయంలో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ను ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానం మేరకు రాష్ట్రాన్ని విడదీయడం ఎంతవరకు సమంజసమన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి శాస్త్రీయతకానీ, చట్టబద్ధత కానీ లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడమే ఉత్తమమని శ్రీకృష్ణకమిటీ తేల్చిందని గుర్తుచేశారు. దానిని పట్టించుకోకుండా జీవోఎంను వేసి దీని సూచనల అనుగుణంగా విడదీయాలని చూడడం బాధాకరమన్నారు. కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్రకోసంగాక ప్యాకేజీల కోసం పాకులాడడం హాస్యాస్పదమన్నారు. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోబో మన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని కేంద్ర కేబినెట్లో ఆమోదం తెల్పి రాష్ట్ర విభజన ప్రక్రియను తలకెత్తుకోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. పది మంది తెలంగాణ ప్రజాప్రతినిధుల మెప్పుకోసం ఆరు కోట్ల సీమాంధ్రులకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీమాం ధ్ర మంత్రులు, ఎంపీలకు రాష్ట్ర విభజన అడ్డుకోవడం చేతకాకపోతే మౌనంగా ఉండిపోవాలని సూచించారు. తాము ప్యాకేజీలకోసం పాకులాడట్లేదని, రాష్ట్ర్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని చెప్పారు. సమైక్యాంధ్రకోసం పోరాడుతున్న పార్టీలకు మద్దతు తెలపాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రధాని, రాష్ట్రపతి, యూపీఏ చైర్‌పర్సన్‌కు సీమాంధ్రులంతా పోస్టుకార్డులు పంపాలన్నారు. సదస్సుకు సీమాంధ్ర యూనివర్సిటీల కన్వీనర్ ప్రొఫెసర్ రవి, నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. -
‘ఆరో ఆప్షన్’ అమలుకు ఒత్తిడి తెండి
రాజకీయ పార్టీలకు జస్టిస్ లక్ష్మణరెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కారించాలనే చిత్తశుద్ధి కేంద్రానికి ఉంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ఆప్షన్లో పొందుపరిచిన సూచనలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందులో సూచించిన అత్యుత్తమ పరిష్కార మార్గాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, సభ్యులు రాంబాబు, సూర్యనారాయణలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు సొంత ఎజెండాను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శ్రీ కృష్ణ కమిటీ సూచించిన ఆ ఆప్షన్‌ను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, మజ్లిస్ పార్టీలు స్పష్టం చేయటాన్ని అభినందిస్తున్నట్టు వెల్లడించారు. మిగతా రాజకీయపార్టీలు కూడా విభజనకు వ్యతిరేకమంటూ కేంద్ర హోంశాఖకు లేఖల రూపంలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈనెల 7న భేటీ అవుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో సమైక్య ఉద్యమ తీవ్రతను తెలిపేలా ఆరు, ఏడు తేదీల్లో రహదారులను దిగ్బంధించాలని వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఈనెల 8న ‘వంద రోజుల సమైక్య ఉద్యమ’సమీక్షను నిర్వహించి అన్ని ఉద్యమ కమిటీలు, వేదిక జిల్లా కమిటీలు భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనకు తోడ్పడే కేంద్ర మంత్రుల బృందాన్ని, అఖిల పక్ష సమావేశాలను బహిష్కరించాలని కోరారు.