Kushaiguda
-
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడి
-
హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ ముఖ్య సమాచారం అందించింది. కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా బుధవారం (ఆగస్టు 16) నుంచి పునరిద్దరించినట్లు తెలిపింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపిందని పేర్కొంది.అయితే తాజాగా ఆ రూట్లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలి కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపింది. కాగా ఈ 3 నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ మేరకు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. చదవండి: వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే హైదరాబాద్ లోని ప్రయాణికులకు గమనిక! కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి #TSRTC పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది.… pic.twitter.com/FiJZjyxUiy — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 16, 2023 -
తండ్రి అనుమానమే నిజమైంది.. ప్రియుడి మోజులో కన్నకూతుర్ని..
సాక్షి, హైదరాబాద్: ప్రియుడిపై మోజుతో కన్నబిడ్డనే కడతేర్చిందో కసాయి తల్లి. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందినట్టు చిత్రీకరించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయింది. కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు. ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడకు చెందిన నాయక్వడి రమేష్ (30) కల్యాణి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల కూతురు తన్విత సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లి, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. కల్యాణి కుషాయిగూడ మార్కెట్లో పని చేస్తూ.. సమీపంలో కూతురు తన్వితతో కలిసి ఉంటోంది. ఈ నెల 1న కల్యాణి కూతురు తన్వితకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అంతా కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే వైద్యులు తన్విత చనిపోయినట్లు ప్రకటించారు. రోజూ మాదిరిగానే స్కూల్‌కు వెళ్లి వచ్చిన కూతురు భోజనం చేసి పడుకుందని, నిద్రలోనే ఇలా జరిగిందని కల్యాణి అందరినీ నమ్మించింది. అనుమానంతో ఫిర్యాదు... భార్య తీరుపై అనుమానం కలిగిన తండ్రి రమేష్ తన కూతురు చనిపోలేదని, చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఊపిరాడకపోవడంతో చిన్నారి చనిపోయినట్టు వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా వాస్తవం వెలుగులోకి వచ్చింది. అడ్డు తొలగించుకోవాలని... కల్యాణికి జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన ఇండ్ల నవీన్‌కుమార్ (19) అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. కుషాయిగూడలో కూతురుతో కలిసి ఉంటున్న కల్యాణి వద్దను అతను తరచూ వచ్చేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. కల్యాణి భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. విడాకులు సాధ్యం కాకపోవడంతో కూతురు తన్వితను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 1న స్కూల్ కు వెళ్లి వచ్చిన తన్విత నిద్రలో ఉండగా ముందే వేసుకున్న ఫ్లాన్ ప్రకారం ముఖంపై బెడ్‌షీట్ కప్పి దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. నిందితులు కల్యాణి, నవీన్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చిన్నారి హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ షేక్ షఫీలను డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్‌రెడ్డి అభినందించారు. -
Hyderabad: విద్యార్థినితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థిని పట్ల ఓ ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టీచర్స్‌కాలనీకి చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఓ కార్పొరేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శివసాయినగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ యాకయ్య ఆ విద్యార్థినితో పాటు మరో ముగ్గురిని రోజూ ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకువస్తాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ వదిలిన తర్వాత అందరినీ ఆటోలో ఎక్కించుకొని బయలుదేరాడు. మిగతా ముగ్గురిని వారి వారి ఇళ్ల వద్ద వదిలి ఆ విద్యార్తిని ఇంటికి తీసుకెళ్లకుండా వేరే చోటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 1:20 గంటల వరకు ఇంటికి చేరుకునే కూతురు 1:30 గంటల వరకు రాకపోవడంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆటో డ్రైవర్ మిగతా పిల్లలను వదులుతున్నాను సార్.. మా ఇంటికి వెళ్లే క్రమంలో మీ పాపను వదిలి వెళ్తానని సమాధానం చెప్పి పది నిమిషాల్లో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన విద్యార్థిని ఆటో డ్రైవర్ తనను ఇంటికి తీసుకురాకుండా మరో చోటికి తీసుకెళ్లి నా పట్ల అసభ్యంగా వ్యవహరించాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. జరిగిన విషయంపై నిలదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. -
'కొడుకు పోయిన బాధ ఎలా ఉంటదో తెలుసు.. హాత్విక్‌ను దత్తత తీసుకుంటా'
సాక్షి, నల్గొండ: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన నరేశ్, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్ మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. నరేశ్ స్వగ్రామం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయిన నరేశ్ పెద్ద కుమారుడు హాత్విక్‌ను దత్తత తీసు కుంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ఆయన తన పీఏ సైదులుతో హాత్విక్ పేరిట బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్ చేయించారు. ఖర్చుల నిమిత్తం నరేశ్ తల్లిదండ్రులకు రూ.25వేలను అందజేయించారు. నరేశ్ తల్లిదండ్రులను ఫోన్లో ఓదార్చారు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, అధైర్య పడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నరేశ్ కొడుకును ఇంటర్నేషనల్ స్కూ ల్లో చదివిస్తానని, పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని, ఢిల్లీ నుంచి రాగానే, గ్రామానికొచ్చి కలుస్తానని నరేష్ కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. చదవండి: బీఆర్ఎస్తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు -
కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం
-
కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మేడ్చల్: కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మృతులంతా వరంగల్ జిల్లా ఒకే కుటుంబానికి చెందిన నరేష్, సుమ, బాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చదవండి: సవాల్ విసురుతున్న గుండెపోట్లు.. -
కుషాయిగూడలో వెంకటేశ్వర ఆలయంలో దారుణం
-
Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుడిలో చోరీకి యత్నించిన దొంగపై వాచ్మెన్ దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు చోరీ కోసం గుడిలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి వచ్చిన దుండగుడు గర్భగుడిలోని హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతను వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునేందుకు వాచ్మెన్ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు మృతుడిని పరిశీలించగా.. అతని ఫోన్ దొరికింది. ఫోన్లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిగా తెలిపారు. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీకి యత్నించిన దొంగపై వాచ్ మెన్ దాడి.. అక్కడికక్కడే మృతిచెందిన దొంగ
-
అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో అమనుష ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కమలానగర్లో గుర్తు వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. రెండ్ అపార్టమెంట్ల మధ్య ఆవరణలో కేవలం ఒకరోజు వయసున్న శిశువును వదిలి వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు.. పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందజేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ వద్ద పసికందును చూసి చలించిపోయిన ఎస్సై స్వయంగా తన చేతుల్లోకి తీసుకొని వైద్యం నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందుకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువు పట్ల మానవాత్వం చాటుకున్న ఎస్సైని స్థానికులు కొనియాడారు. చదవండి: పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ ధోబీఘాట్ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమోహన్ వర్గాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో రెండు వర్గాలు విడిపోయి తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా బలాలను ప్రదర్శించుకుంటూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చాటుతున్నారు. ఈ క్రమంలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేక నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం కుషాయిగూడలో ఆధునిక యాంత్రిక ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగా తనకు అవమానం జరిగిందని స్థానిక కార్పొరేటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకోగా.. ప్రొటోకాల్ తనకు సంబంధించిన అంశం కాదని అది అధికారుల చూసుకుంటారంటూ ఎమ్మెల్యే చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మహిళా కార్పొరేటర్నైన తనను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అడుగడుగునా అవమానపరుస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. ఒక మహిళనని చూడకుండా గడిచిన మూడేళ్లుగా అనేక అవమానాలకు గురిచేస్తూ వస్తున్నారని ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో లేని విధంగా ఎమ్మెల్యే చర్లపల్లి డివిజన్లో కార్పొరేటర్ ప్రమేయం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’ ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి చేస్తూ ప్రొటోకాల్ సమస్యకు తెరలేపుతూ తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళనైన తనను అంతటా అవమానపరుస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అధిష్టానానికి అందజేస్తానన్నారు. తాజాగా కుషాయిగూడ ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగానూ తనను అగౌరవపరిచినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు ధోబీఘాట్ వద్దే తాను ఉన్నానని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి రావడం మరో అరగంట సమయం ఉందని నిర్వాహకులు చెప్పడంతో పూలే వర్ధంతి సభలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చేలోపు మంత్రి, ఎమ్మెల్యే ధోబీఘాట్ యంత్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ప్రస్తావన లేకుండా నిమిషాల వ్యవధిలో ప్రారంభించి వెళ్లి తనను అవమానపరిచారని ఆవేదన చెందారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తనపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అవి పూర్తి అసత్యాలని కొట్టి పడేశారు. -
రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా..
సాక్షి, హైదరాబాద్: బైక్ అదుపుతప్పి డివైడన్‌రు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ మారుతీనగర్ కాలనీకి చెందిన దంతులూరి అభిసాయిరామ్‌రాజు (22) హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. గత శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అభి సిద్దిపేట నుంచి వచ్చిన మిత్రుడు రమేష్‌నును కలిశాడు. ఇద్దరు కలిసి నాగారంలోని మరో మిత్రుడి ఇంటికి వెళ్లారు. రాత్రి ఇంటికి రావడం లేదని మరుసటి రోజు ఉదయం వస్తానని తన తల్లికి ఫోన్ చేసి చెప్పిన అభి రాత్రంతా మిత్రులతో కలిసి సరదాగా గడిపారు. ఆదివారం తెల్లవారుజామున రమేష్‌ను జేబీఎస్లో డ్రాప్ చేయడానికి మరో మిత్రుడి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో ఈసీఐఎల్ చౌరస్తా నుంచి రాధిక వైపుగా వెళ్తుండగా సోనీ సెంటర్ మూలమలుపు వద్ద అదుపు తప్పిన బైక్ డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అభిసాయిరామ్‌రాజు తల పగిలి అక్కడిక్కడే మృతిచెందగా రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. చదవండి: విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి -
432 ఖరీదైన సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగలు
-
డేట్స్ ప్యాకెట్లో పురుగులు.. కుషాయిగూడ డీ మార్ట్‌లో ఘటన
సాక్షి, హైదరాబాద్: డేట్స్ (కర్జూర) ప్యాకెట్లో పురుగులు రావడంతో అవాక్కైన వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టిన అధికారులు నిర్వాహకులకు జరిమాన విధించిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ డీ మార్ట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే.. న్యూ వాసవి శివనగర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ శుక్రవారం డీ మార్ట్‌లో డేట్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. సరుకుల కొనుగోలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అతడి కుమారుడు డీ మార్ట్ ఆవరణలోనే తినేందుకు డేట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకోగా మూతిపై పురుగులు పారడాన్ని తండ్రి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన అతను ప్యాకెట్‌ను చూడగా కుళ్లిపోయి ఉంది. దీంతో అవాకైన చంద్రశేఖర్ డీ మార్ట్ సిబ్బందిని నిలదీయడమేగాక అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి తన సిబ్బందితో కలిసి సరుకులను తనిఖీ చేశారు. పూర్తిగా కుల్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్న డేట్స్ ఫ్యాకెట్‌ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఎంహెచ్ఓ డీ మార్ట్ నిర్వాహకులకు రూ.30 వేలు జరిమానా విధించారు. చదవండి: ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు -
కుషాయిగూడ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీ
-
ఇష్టం లేని స్కూల్‌కు వెళ్లలేను.. పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం
కుషాయిగూడ: తల్లిదండ్రులు తనకిష్టం లేని స్కూల్‌కు వెళ్లామంటున్నారని మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా దోరదేవరపాడు గ్రామానికి చెందిన నాగళ్ల రవి, రాధ దంపతులు. 17 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. కాప్రా కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని శ్రీహన్స్ వజ్రం అపార్టుమెంట్లో ఉంటున్నారు. రవి వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. వీరి కూతురు కావ్య (15) సైనిక్‌పురి గోకుల్‌నగర్‌లోని సిటీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. సాకేత్‌లోని విద్యాభారతి స్కూల్లో 9వ తరగతి చదివిన కావ్యను.. ఆ పాఠశాల దూరం అవుతుందన్న ఉద్దేశంతో అపార్టుమెంట్‌కు సమీంలోని సిటీ హైస్కూల్లో చేర్పించారు. కొత్తగా చేరిన స్కూల్లో చదువుకోవడం తనకు ఇష్టం లేదని తిరిగి పాత పాఠశాలలోనే తనను చేర్పించాలని తల్లిదండ్రులతో చెప్పింది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనే ఉంది. స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి ప్రశ్నించాచు. సదరు స్కూల్‌కు వెళ్లడం తనకు ఇష్టం లేదని కావ్య సమాధానం ఇవ్వడంతో కూతురును రవి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. అదే సమయంలో అపార్టుమెంట్ ఎదుట పెద్ద శబ్దం రావడంతో అందరూ బయటకు వచ్చారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కావ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని -
భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో..
సాక్షి, కుషాయిగూడ: అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక బీదర్‌కు చెందిన మచ్ఛీంద్రా రాథోడ్, కుటుంబ సభ్యులతో కలిసి ఏడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఏఎస్‌రావునగర్, సాయినాథపురంలో నివాసముంటూ స్వీట్‌కాన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ప్రియాంక జాదవ్ (20)ఉన్నారు. కూతురికి 2020 మార్చిలో ఏఎస్‌రావునగర్‌లోనే ఉంటున్న సచిన్‌జాదవ్‌తో వివాహం జరిగింది. వారికి 13 నెలల పాప ఉంది. కొంత కాలం సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ భార్యను అనుమానించడం, వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టాడు. భర్త వేధింపులు భరించలేని ప్రియాంక, తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా పలుమార్లు సర్ధి చెప్పినా అ తని తీరు మారలేదు. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఈ నెల 20న ప్రియాంక వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. కూ తురుకి మళ్లీ సర్ధిచెప్పి మరుసటి రోజు సోదరుడు సంతోష్‌తో కలిసి ప్రియాంకను అత్తరింటికి పంపించారు. వారిని చూసిన సచిన్ దురుసుగా ప్రవర్తించాడు. కాసేపటి తర్వాత సంతోష్ ఇంటికెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఒంటరిగా ఎందుకు వదిలివచ్చావని, చిన్న కొడుకు సందీప్‌ను కూతురు ఇంటికి పంపించాడు. సందీప్ అక్కడికి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎంతకీ తీయకపోవడంతో కిటికీ లోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమ.. మరొకరిని ప్రేమిస్తోందని తెలిసి.. మనోవేదనకు గురై.. అల్వాల్: మానసిక ఒత్తిడి, మనోవేదనకు గురై గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ గంగాధర్ వివరాల ప్రకారం.. భూదేవినగర్‌కు చెందిన రేవతి (28) మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్‌కు చెందిన కిరణ్‌తో గతేడాది వివాహం జరిగింది. గత కొంతకాలంగా రేవతి తల్లి లత తలకు తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతోంది. ఇటీవల రేవతి భూదేవినగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి మానసికంగా కుంగిపోయి ఒత్తిడి గురైంది. ఈ నెల 20న రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో లోపలికెళ్లి చూడగా రేవతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
ఏడేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి
సాక్షి, కుషాయిగూడ: వేర్వేరు ఘటనల్లో పలువురు అదృశ్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఓ ఘటనలో ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యం కాగా, మరో ఘటనలో స్నేహితుడితో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగి రాలేదు. పిల్లలతో కలిసి.. కాప్రా, శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన పులి భాస్కర్‌రాజు ప్రైవేటు ఉద్యోగి. అతడికి ఏడేళ్ల క్రితం హైమవతి (26)తో వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల హన్షిత్రాజ్, మూడున్నరేళ్ల గ్రీష్మ సంతానం. ఈ నెల 11న పిల్లలతో కలిసి అందరూ లాలాపేట్‌లో హైమవతి అక్క ఇంటికి వెళ్లి 13న వచ్చారు. 14న ఉదయం భాస్కర్‌రాజు ఆఫీసుకు వెళ్లాడు. అదే రోజు హైమవతి ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమలగిరి నాగదేవత ఆలయానికి వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విహారయాత్రకు వెళ్లి.. కాప్రా, సైనిక్‌పురి, లేక్‌వ్యూ రెసిడెన్సీలో నివసించే షేక్ ప్రద్న్య సులేమాన్ (23), భర్త షేక్ సులేమాన్ ఇద్దరూ ఐటీ ఉద్యోగులే. వారికి ఓ పాప ఉంది. పుణెకు చెందిన తన భర్త స్నేహితుడు అవినాష్ శర్మతో కలిసి తమ కారులో గత నెల 28న టూర్‌కు బయలుదేరి కర్ణాటక చేరుకున్నారు. 30న అక్కడి నుంచి గోవాకు వెళ్లారు. అక్కడ జూమైకా కాబో వాబో బీచ్‌లోని ఓ రెస్టారెంట్లో బస చేశారు.ఈ నెల 4న అవినాష్ అక్కడి నుంచి వెళ్లిపోగా సులేమాన్ 7న రెస్టారెంట్ ఖాళీ చేశాడు. తిరిగి వస్తున్నట్లు భార్యకు ఫోన్లో చెప్పిన సులేమాన్ ఇంటికి చేరుకోలేదు. చివరగా ఈ నెల 8న తన భర్తతో ఫోన్లో మాట్లాడినట్లు భార్య పోలీసులకు తెలిపింది. ఈ నెల 14 ఆన్లైన్ మీటింగ్‌లో హాజరు కావాల్సిన సులేమాన్ మీటింగ్‌లో పాల్గొనక పోవడంతో ఆరా తీసింది. ఎంతకి తన భర్త అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.హైమవతి, ఇద్దరు పిల్లలుహైమవతి, ఇద్దరు పిల్లలు -
Hyderabad: మసాజ్ సెంటర్ పేరుతో చీకటి బాగోతాలు
సాక్షి, కుషాయిగూడ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మసాజ్ సెంటర్‌పై బుధవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి సెంటర్‌ను సీజ్ చేశారు. ఏఎస్‌రావునగర్‌లో గ్లోవిష్ బ్యూటీ కేర్ పేరుతో కొంత కాలంగా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మాదిపల్లి మహేశ్ అనే వ్యక్తితో పాటు, మరో ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) -
పక్కస్కెచ్ వేసి తండ్రిని చంపిన కూతురు
-
కన్న తండ్రిని కూతురే కడతేర్చింది
కుషాయిగూడ(హైదరాబాద్): తమ ప్రేమకు అడ్డు చెప్తున్నాడని ఓ కూతురు ప్రియుడితో కలసి తండ్రిని హత్య చేసింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జూలైలో జరిగిన ఈ ఘటనపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఈ దర్యాప్తులో అసలు కథ బయటపడింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. రామకృష్ణ (ఫైల్) గత జూలై 20న తలకు బలమైన గాయాలతో రామకృష్ణ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో పెద్దాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇంట్లో జారిపడి తలకు గాయమైందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఆశ్చర్యపర్చిన పోస్టుమార్టం నివేదిక.. అయితే, రామకృష్ణ పోస్టుమార్టం నివేదికలో ఆశ్యర్యపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి గొంతు నులిమినట్లుగా, బలంగా కొట్టినట్లుగా గాయాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో అనుమా నం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. మృతుడి భార్య, కుటుంబసభ్యులను విచారించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో నారాయణగూడలోని ఓ అపార్ట్మెంట్లో వీరు ఉండేవారు. రామకృష్ణ కూతురు (మైనర్ బాలిక) అపార్ట్మెంట్ వాచ్‌మన్ కొడుకు చెట్టి భూపాల్ (20)తో ప్రేమలో పడింది. విషయం తెలిసిన బాలిక తండ్రి పలుమార్లు మందలించారు. ఈ క్రమంలో భూపాల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి.. రామకృష్ణ ఇంట్లో రూ.1.75 లక్షలు చోరీ చేశాడు. ఖరీదైన బైక్, సెల్‌ఫోన్, బట్టలు కొనుక్కొని మైనర్ బాలికతో జల్సాలు చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భూపాల్‌ను రిమాండ్ తరలించారు. కూతురి ప్రేమ వ్యవహారం బయటపడుతుందని... అనంతరం రామకృష్ణ కాప్రాకు మకాం మార్చాడు. గత జూలైలో జైలు నుంచి విడుదలైన భూపాల్ తిరిగి బాలికతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడినే పెళ్లి చేసుకోవాలని బాలిక కూడా నిర్ణయించుకుంది. దీంతో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న రామకృష్ణను హత్యచేయాలని భావించారు. భూపాల్ తన ఇద్దరు మిత్రులతో కలసి రామకృష్ణ హత్యకు పథకం వేశాడు. తినే ఆహారంలో మత్తు మందు కలిపితే హత్య చేయడం సులువుగా ఉంటుందని ఆలోచించారు. జూలై 19 సాయంత్రం వీరు మత్తుగోలీల పౌడర్‌ను కూతురుకు అందజేశారు. తల్లిదండ్రులు తినే ఆహారంలో ఆ పౌడర్‌ను ఆమె కలపడంతో వారు నిద్రలోకి వెళ్లిపోయారు. భూపాల్ తన మిత్రులతో రాత్రి ఒంటి గంట సమయంలో కాప్రాకు చేరుకున్నాడు. నిద్రలో ఉన్న రామకృష్ణ ముఖంపై భూపాల్, గణేష్ బ్లాంకెట్ వేసి అదిమిపట్టుకోగా, ప్రశాంత్ కత్తితో తలపై బలంగా పొడిచాడు. నొప్పితో మేల్కొన్న రామకృష్ణను చూసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తేరుకున్న కుటుంబసభ్యులు రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. కూతురి ప్రేమ విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పకుండా దాచారు. అయితే, పోస్టుమార్టం నివేదికతో దర్యాప్తు జరిపిన పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు. తండ్రి హత్యకు ఫ్లాన్ చేసిన కూతురు, భూపాల్, గణేష్, ప్రశాంత్‌తో పాటుగా ప్రశాంత్‌ను రక్షించాలనే ప్రయత్నం చేసిన అతడి తండ్రి విజయ్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
హత్యా.. ఆత్మహత్యా! ముఖంపై గాయాలు.. పరారీలో భర్త
సాక్షి, కుషాయిగూడ: హెచ్‌బీకాలనీ, రాజీవ్‌నగర్‌లో మహిళ మృతిచెందిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి ముఖంపై గాయాలు, మెడకు తాడు బిగించినట్లు కనిపిస్తున్న గుర్తులు చూస్తుంటే ఆమెది హత్యా.. ఆత్మహత్యా.. అనే సందేహం వస్తోంది. సోమవారం రాత్రి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో లక్ష్మీ అనే గృహిణి అనుమానాస్పదంగ మృతిచెందిన విషయం తెలిసిందే. భర్త పరుశరాం పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చదవండి: మణికొండ: యువతితో క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన పరుశరాం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూలీ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి కంటే వయసులో పెద్దదైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మితో ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకు దారితీసింది. మృతురాలు లక్ష్మీది రెండో వివాహం అని తెలుస్తోంది. గత ఐదు నెలల క్రితమే హెచ్‌బీ కాలనీ, రాజీవ్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని కొత్తగా సంసారం పెట్టారు. ఇద్దరూ కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. నిత్యం మద్యం తాగే అలవాటున్న వీరు రోజూ తాగి ఇంటికి వచ్చి గొడవ పడటం తరచుగా జరిగేదని ఇంటి యజమాని తెలిపారు. చదవండి: మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం, ప్రాణం తీసింది ఈ క్రమంలోనే పరుశరాం భార్యను హత్య చేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతురాలి ముఖంపై గాయాలు, చెవి, ముక్కు, నోరు, కళ్లలోంచి కారుతున్న రక్తం మరకలు, గొంతుపై కనిపిస్తున్న చారలను బట్టి ఆమెది హత్యేనన్న అనుమానాలకు బలం చేకురుస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. పరారీలో ఉన్న భర్త పరుశరాంను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు. -
ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం
సాక్షి, కుషాయిగూడ: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ గుట్టును కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకురాలితో పాటుగా విటుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని అరెస్టు చేసిన ఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ వాసవీశివనగర్ పార్కు సమీపంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న సునీతా మండల్ (40) అనే మహిళ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. విషయం తెలిసిన కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్ కలెక్టర్ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్రూంలో ఉండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలు సునీతా మండల్, విటుడు మహదేవ్‌తో పాటుగా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు. గతంలో ఆమెపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు. గురువారం కేసు నమోదు చేసి నిందితులను మేజిస్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వివరించారు. చదవండి: KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి.. -
‘బ్లాక్ మ్యాజిక్ పేరుతో బ్లాక్ మెయిల్, రూ.30 లక్షలకు డీల్’
కుషాయిగూడ: గుప్తనిధులు తీసే ముందు చేసే క్షుద్రపూజలు (బ్లాక్ మ్యాజిక్ పవర్) కోసం చేసుకున్న డీల్ కాస్తా బెడిసికొట్టింది. బ్లాక్ మెయిల్‌కు పాల్పడి అడిగిన సొమ్ము ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. వివరాలను ఆదివారం కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ వెల్లడించారు. నాగార్జునగర్ కాలనీకి చెందిన ఆంటోనీ మోసిస్ లారెన్స్ ఆలియాస్ శ్రీకాంత్ ప్యాబ్రికేషన్ పనిచేస్తూ స్థానికంగా చెగోడిల బట్టీ నిర్వహిస్తున్నాడు. గుప్తనిధులు తవ్వకాలు చేసే క్రమంలో క్షుద్రపూజలు నిర్వహించడం ప్రవృత్తిగా పెట్టుకొని పూజల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. రూ.30 లక్షలకు డీల్ ఆల్విన్‌కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ కొట్రా శ్రీనివాస్‌రెడ్డి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బిల్డింగ్ కాంట్రాక్టరు రాంమూర్తి (61) మిత్రులు. ప్రకాశం జిల్లాలో తనకు కొంత వ్యవసాయ భూమి ఉందని, అందులో గుప్తనిధులు వెలికి తీయాలంటే క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని రాంమూర్తి శ్రీనివాస్‌రెడ్డితో అన్నాడు. దీంతో తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని, ఈ నెల 5న రాంమూర్తిని కుషాయిగూడ, నాగర్జుననగర్ కాలనీలో నివసించే ఆంటోనీ లారెన్స్ ఇంటికి తీసుకెళ్లాడు. భూమికి సంబంధించిన పత్రాలు, ఫొటోలను ఆంటోనీకి చూపిన రాంమూర్తి రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ నెల 11న అమావాస్య రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 10న సాయంత్రం శ్రీనివాస్‌రెడ్డి, రాంమూర్తి బైక్‌పై కూకట్పల్లి నుంచి బయలుదేరి ఆంటోనీ ఇంటికి చేరుకున్నారు. ఆంటోనీ కొత్త నాటకానికి తెర తీశాడు. (చదవండి: ‘మాకు నచ్చిందే చెబుతాం, అది అంతే, మేమింతే’) కాళభైరవ శక్తుల పేరుతో.. భూమి పత్రాలు, ఫొటోలకు పూజలు చేసే క్రమంలో కాళభైరవ శక్తులు నా కుటుంబ సభ్యులపై పడి వారు అనారోగ్యానికి గురయ్యారని, రూ.30 లక్షల వరకు ఖర్చు అయ్యిందని, ఆ డబ్బులు ఇవ్వాలని రాంమూర్తిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. రూ.7 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. రాంమూర్తి డబ్బులు సమకూర్చే ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో కర్రలతో కొట్టారు. ఈ నెల 12న అతడిని బట్టీ వద్దకు తీసుకెళ్లారు. చెరువులో మృతదేహాన్ని పడేసి.. డబ్బులు రాకపోవడంతో రాంమూర్తిని చంపేసి అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, రూ.56 వేల నగదు తీసుకొని సమీపంలో నాగారం, అన్నారం చెరువులో మృతదేహాన్ని పడేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఆంటోనీ, శ్రీనివాస్‌రెడ్డితో పాటు వారికి సహకరించిన శాగంటి వాణిసాగర్, జిత్తుసింగ్, మనోజ్సింగ్, ఆంటోనీ భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మూడు బైక్‌లు, బంగారు గొలుసు, ఆరు సెల్ఫోన్లు, గోల్డ్ రింగ్, రూ.7 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై చిలకలగూడ, అంబర్పేట్, నాచారం పోలీస్స్టేషన్ల పరిధిలో ఆరు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. (చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..)