Loffer
-
పూరీ 'లోఫర్' వర్మకి నచ్చలేదట..!
జెట్ స్పీడుతో సినిమాలు పూర్తి చేసే పూరీ జగన్నాథ్, వరుణ్ హీరోగా 'లోఫర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేసే పూరీ ఈ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. వరుణ్ లాంటి యంగ్ హీరోకి 'లోఫర్' అనే రిస్కీ టైటిల్ సెలెక్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన సినిమా విషయంలో ఎవరి మాటా వినకుండా అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుపోయే పూరీ జగన్నాథ్, ఈసారి మాత్రం మనసు మార్చుకున్నాడట. మామూలుగా ఎవరైనా సలహా ఇచ్చినా పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో గానీ, సలహా ఇచ్చింది తన గురువు రామ్‌గోపాల్ వర్మ కావటంతో కాదలేకపోయాడు. అందుకే తన తదుపరి సినిమా విషయంలో భారీ మార్పులకు రెడీ అవుతున్నాడు. ఇటీవల వరణ్, పూరీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రషెస్ చూసిన వర్మ, సెంటిమెంట్ సీన్లకు ఫ్లాట్ అయిపోయాడు. ఇంత మంచి కథకు లోఫర్ అన్న టైటిల్ బాగోదని, టైటిల్ మార్చాలని పూరీకి సూచించాడు. దీంతో ఆలోచనలో పడ్డ పూరీ.. తన టేస్ట్‌కు తగ్గ మరో టైటిల్ కోసం వేట ప్రారంభించాడు. త్వరలోనే ఈ సినిమాకు మరో టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నాడు పూరీ. -
'లోఫర్'కూ అదే స్ట్రాటజీ
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా సినిమా చేసే ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. స్టార్ హీరోతో సినిమా అయినా కేవలం రెండు, మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయటం పూరి స్టైల్. ఈ స్పీడ్ కొన్ని సందర్బాల్లో బాగానే ఉన్నా, క్వాలిటీ పరంగా మాత్రం కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. అయితే ఇలాంటి అపవాదులు ఎన్ని వస్తున్నా, పూరి మాత్రం స్పీడు తగ్గించటం లేదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' లో కూడా అదే ఫార్ములాను పూరి జగన్నాథ్ ఫాలో అయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావటానికి ముందే రిలీజ్ డేట్ ప్రకటించటంతో మరింత వేగంగా సినిమా చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మేకింగ్‌లో ఓ డిఫరెంట్ స్టైల్‌ను ఫాలో అయ్యాడు. ఏ రోజు షూట్ చేసిన సన్నివేశాలను అదే రోజు ఎడిటింగ్ చేసి షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ఒకేసారి పూర్తి చేశాడు. దీంతో అనుకున్న సమయానికి ఎలాంటి వాయిదాలు లేకుండా టెంపర్ రిలీజ్ చేయగలిగాడు. వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం తను చేస్తున్న 'లోఫర్' విషయంలోనూ పూరి అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు సంబంధించిన కథ రెడీ చేయాల్సి ఉండటంతో, ప్రొడక్షన్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఒకేసారి ముగించేస్తున్నాడు. మరి ఈ వేగం పూరి ప్రాడక్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో తెలియాలంటే లోహర్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.