పూరీ 'లోఫర్' వర్మకి నచ్చలేదట..! | varma suggested for loffer title change | Sakshi
Sakshi News home page

పూరీ 'లోఫర్' వర్మకి నచ్చలేదట..!

Published Tue, Sep 29 2015 9:04 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరీ 'లోఫర్' వర్మకి నచ్చలేదట..! - Sakshi

పూరీ 'లోఫర్' వర్మకి నచ్చలేదట..!

జెట్ స్పీడుతో సినిమాలు పూర్తి చేసే పూరీ జగన్నాథ్, వరుణ్ హీరోగా 'లోఫర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేసే పూరీ ఈ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. వరుణ్ లాంటి యంగ్ హీరోకి 'లోఫర్' అనే రిస్కీ టైటిల్ సెలెక్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

తన సినిమా విషయంలో ఎవరి మాటా వినకుండా అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుపోయే పూరీ జగన్నాథ్, ఈసారి మాత్రం మనసు మార్చుకున్నాడట. మామూలుగా ఎవరైనా సలహా ఇచ్చినా పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో గానీ, సలహా ఇచ్చింది తన గురువు రామ్గోపాల్ వర్మ కావటంతో కాదలేకపోయాడు. అందుకే తన తదుపరి సినిమా విషయంలో భారీ మార్పులకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల వరణ్, పూరీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రషెస్ చూసిన వర్మ, సెంటిమెంట్ సీన్లకు ఫ్లాట్ అయిపోయాడు. ఇంత మంచి కథకు లోఫర్ అన్న టైటిల్ బాగోదని, టైటిల్ మార్చాలని పూరీకి సూచించాడు. దీంతో ఆలోచనలో పడ్డ పూరీ.. తన టేస్ట్కు తగ్గ మరో టైటిల్ కోసం వేట ప్రారంభించాడు. త్వరలోనే ఈ సినిమాకు మరో టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నాడు పూరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement