Madhavaram
-
AP: ఆ ఊరే ఒక సైన్యం.. వీరుల పురిటిగడ్డ అది..
తాడేపల్లిగూడెం: అక్కడి తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని రంగరించి పోస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊరు ఊరంతా ఒక సైన్యమే అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో అందివస్తున్న జాబ్‌లెన్నో ఉన్నా.. తమ మొగ్గు మాత్రం దేశమాత సేవకే అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో ఈ ఊరి నుంచి 1,650 మంది పనిచేస్తున్నారు. వీరిలో కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ ఉండటం విశేషం. భారత సైన్యంలో చేరాలనుకునే తమ ఊరి యువతకు ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా భారత సైన్యంలోకి చేరికలు ఉండటంతో యువత సులువుగా ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామని ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్ బాధ్యులు ప్రత్తి రామకృష్ణ, బొల్లం వీరయ్య చెబుతున్నారు. దేశంలోనే రెండో స్థానం.. మాధవరం గ్రామస్తులు స్వాతంత్య్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించారు. దేశంలోనే అత్యధికంగా సైన్యంలోకి యువకులను పంపిస్తున్న ప్రాంతంగా మాధవరం రెండో స్థానం పొందడం విశేషం. గ్రామస్తులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, దేశ స్వాతంత్య్ర పోరాటం, పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లో ప్రతిభ చూపారు. సిపాయి, హవల్దార్, సుబేదార్, సుబేదార్ మేజర్, నాయక్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్ వంటి హోదాల్లో సేవలను అందించారు. భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో 1,850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటడం విశేషం. వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉండగా రెండోది మాధవరంలో మాత్రమే ఉంది. ఇది కూడా చదవండి: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు -
మాధవరంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, చెన్నై: మాధవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ అగ్నిజ్వాల పక్కనే ఉన్న మరో గోడౌన్‌ను సైతం చుట్టుముట్టింది. ఆ పరిసరాల్లో ఆగి ఉన్న పది లారీలు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో ఆ పరిసరాలు నిండడంతో శ్వాస సమస్యతో జనం తల్లడిల్లాల్సిన పరిస్థితి. ఈ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమిస్తున్నారు. చెన్నై శివార్లలోని మాధవరం పరిసరాలు గోడౌన్లు, పలు చిన్న తరహా పరిశ్రమతో నిండి ఉంటాయి. ఇక్కడే ఇటీవల సబర్బన్ బస్ టెర్మినల్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వెళ్లే అన్ని బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. మాధవరం జంక్షన్లో సబర్బన్ బస్ టెర్మినల్ ఉండగా, దానికి వెనుక కూత వేటు దూరంలో ఉన్న రసాయన పరిశ్రమలో హఠాత్తుగా శనివారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడడంతో ఆ పరిసర వాసుల్లో ఆందోళన బయలు దేరింది. సమచారం అందుకున్న మాధవరం, తిరువొత్తియూరు, చెన్నై, తిరువళ్లూరుల నుంచి పదికి పైగా అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే పనిలో పడ్డాయి. ఐదు వందల మంది మేరకు అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమిస్తున్నారు. నీళ్లు ఎంతగా చల్లుతున్నా, మంటలు అదుపులోకి రాక పోవగా, ఉవ్వెత్తున ఎగసి పడతుండడంతో ఆందోళన తప్పలేదు. ఆ గోడౌన్‌కు రెండు వందల మీటర్ల వరకు వేడి సెగ తాకడంతో సమీపంలోకి వెళ్లలేని పరిస్థితిల్లో అగ్నిమాపక సిబ్బంది వెనక్కి రావాల్సిన వచ్చింది. చివరకు మెట్రో వాటర్ బోర్డుకు చెందిన పది లారీల ద్వారా నీటిని తరలించారు. ఆ పరిసరాల్లో వేడిసెగ మరింతగా బయలుదేరకుండా, పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయినా, ఆ గోడౌన్‌కు పక్కనే ఉన్న మరో గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అక్కడున్న పది లారీలు దగ్ధమయ్యాయి. ఆ గోడౌన్లో ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ రసాయన పరిశ్రమలో ఎంతకు మంటలు అదుపులోకి రాక పోవడంతో రెస్క్యూ కొనసాగుతోంది. ఓ దశలో మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి వేయాల్సిన అవశ్యం తప్పదన్నట్టుగా పరిస్థితి మారింది. అయితే, అందుకు అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నారు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుడు; నలుగురికి గాయాలు వంద కోట్ల విలువగల రసాయనాలు... మాధవరంలో అగ్ని ప్రమాదం జరిగిన గోడౌన్లో వంద కోట్లు విలువగల రసాయనలు ఉన్నట్టు తేలింది. ఈ రసాయనాల మూడి పదార్థాలు వైద్య సంబంధిత మందుల తయారీలో ఉపయోగించనున్నారు. ఇక్కడ మూడు గోడౌన్లు ఉండగా, తొలి గోడౌన్, రెండో గోడౌన్లలో తొమ్మిదిన్నర గంటల సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చారు. అయితే, మూడో గోడౌన్లోనేఅ త్యధికంగా మందులు ఉండటంతో, మంటల్ని అదుపు చేయడానికి తీ›వ్రంగా శ్రమిస్తున్నారు. ఆ గౌడౌన్ యజమాని రంజిత్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆయన వద్ద పోలీసులు విచారిస్తున్నారు. కమిషనర్ ఏకే విశ్వనాథన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టెట్రా కార్బన్, డై సల్పయిడ్ వంటి 24 రకాల రసాయానాలు వందలాది బేరల్స్‌లో ఇక్కడ ఉన్నట్టు విచారనలో తేలిందని అగ్నిమాపక శాఖ డీజీపీ శైలేంద్ర బాబు తెలిపారు. అందుకే మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నట్టు తెలిపారు. స్కై లిఫ్ట్ వాహనాల్ని రంగంలోకి దించడం ద్వారా రెండు గోడౌన్లలో మంటలు అదుపులోకి వచ్చాయని, మరో గోడౌన్లో మంటలు అర్థరాత్రి లేదా ఆదివారం వేకువ జామున అదుపులోకి తెస్తామన్నారు. ఎల్ఈడీ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి, అగ్ని జ్వాల ఎక్కడి నుంచి ఎ గసి పడుతున్నదో గుర్తించి, దానిని ఆర్పే యత్నం చేస్తున్నామన్నారు. చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..! జనం అవస్థలు... ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలకు తోడుగా, దట్టమైన పొగ ఆ పరిసరాల్ని చుట్టుముట్టింది. దీంతో ఆ గౌడౌన్‌కు సమీపంలో ఉన్న వాళ్లందర్నీ ఖాళీచేయించారు. అయినా, పొగ క్రమంగా వ్యాపించడంతో ఆ పరిసర వాసులు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాగే, కళ్లు మంటలు పెరగడంతో ఆందోళన తప్పలేదు. ఆగమేఘాలమీద వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను సైతం సిద్ధం చేశారు. ఈ ప్రమాదం కారణంగా సమీపంలో ఉన్న బస్ టెర్మినల్ ఉన్న బస్సుల్ని అక్కడి నుంచి అప్రమత్తం చేశారు. ప్రయాణికుల్లో సైతం ఆందోళన బయలుదేరడంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అలాగే, ఆపరిసర మార్గాలన్నీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ డీజీపీ శైలేంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ మంటల్ని ఆర్పేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నారు. అదే సమయంలో ప్రమాద జరిగినప్పుడు ఆ రసాయన గోడౌన్లో ఎవరైనా ఉన్నారా అన్న ఆందోళన బయలుదేరడంతో ఉత్కంఠ తప్పడం లేదు. #WATCH Tamil Nadu: Fire breaks out at an oil warehouse in Madhavaram area in Chennai. 12 fire tenders present at the spot. Fire-fighting operation is underway. pic.twitter.com/kHKmM0LBXY — ANI (@ANI) February 29, 2020 -
మాధవరంలో అల్లు అర్జున్ సందడి
తాడేపల్లిగూడెం రూరల్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ మండలంలోని మాధవరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో అల్లు అర్జున్ను వీక్షించేందుకు ఆదివారం ఉదయం నుంచే అభిమానులు గ్రామానికి క్యూ కట్టారు. సాయంత్రం 4 గంటలకే అర్జున్ గ్రామానికి రావలసి ఉంది. దీంతో ఆయన రాకకు మూడు గంటలు ముందుగానే అభిమానులు నిరీక్షించారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటలకు తమ హీరో గ్రామానికి చేరుకోవడంతో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
మాధవరం,(మునగాల): మండలంలోని మాధవరం గ్రామ శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గొర్రెల కాపరి మృతిచెందాడు. పోలీ సులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దాసరి వీరయ్య(53) గొర్రెలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమం లో శనివారం రాత్రి పొలం వద్ద ఉన్న గొర్రెల దగ్గరకు వెళ్లేందుకు జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు అతన్ని ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో వీరయ్య తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా మృతుని భార్య మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందడంతో వీరయ్య స్వగ్రామంలోనే ఉన్న తన కూతురు మంగమ్మ వద్ద ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గంట క్రితం ఇంటకి వచ్చి భోజనం చేసి గొర్రెల వద్దకు వెళుతున్నానని చెప్పిన తండ్రి ఇంతలోనే మృత్యువాత పడటంతో అతని కూతురు నాగమ్మ బోరున విలపించింది. సంఘటన స్థలంలో స్పృహ కోల్పోయింది. మునగాల హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రహదారిపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని గూడూరు(మిర్యాలగూడ రూరల్): గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టాపురంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం జాన్పాడ్కు చెందిన కోట్ల కృష్ణప్రసాద్(35) స్వగ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. కిరాణ సామాను కోసం మిర్యాలగూడకు బైక్‌పై వస్తున్నాడు. కిష్టాపురం సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టడంతో కృష్ణప్రసాద్ అక్కడికక్కడే మృతి చెం దాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాహుల్‌దేవ్ తెలిపారు. కోదాడలో... కోదాడఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం బేతవోలుకు చెందిన రెమిడాల దుర్గప్రసాద్ కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు శనివారం ఉదయం కోదాడ బస్టాండ్ ఎదురుగా కొబ్బరి బొండాలు తీసుకెళ్లేందుకు వచ్చాడు. సమీపంలోని హోటల్లో టిఫిన్ చేసి బయటకు వచ్చాడు. రోడ్డు దాటుతుండగా కోదాడ నుంచి ఖ మ్మం వైపు సాధిక్‌బాబా (19) అనే యువకుడు మోటార్ సైకిల్‌పై వెళ్తూ అతన్ని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో దుర్గప్రసాద్‌కు, సాధిక్బాబాకు తీవ్రగాయాలయ్యాయి. దుర్గప్రసాద్‌ను ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాధిక్బాబాను హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మృతి చెందాడు. దుర్గప్రసాద్ బంధువు ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్రావు తెలిపారు. దైవదర్శనానికి వెళ్తొస్తూ... నార్కట్‌పల్లి: యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లొస్తున్న ఒ వ్యక్తిని బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేతపల్లి మండలం బీమారం గ్రామనికి చెందిన పురం పాండయ్య(52), అతని భార్య సోమలక్ష్మి శనివారం ఉదయం యాదగిరిగుట్టకు వెళ్లారు. దైవదర్శనం అంతనం స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో నార్కట్‌పల్లి బస్టాండ్‌లో దిగారు. పాండయ్య వస్తువు కొనడానికి బస్టాండ్ నుంచి బయటకు వెళ్తుండగా నార్కట్‌పల్లి డిపోకు చెందిన బస్సు బస్టాండ్ లోపలికి వస్తూ అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలైన పాండయ్యను స్థానిక కామినేని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ ప్రణీత్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ఆంధ్రాబ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన
- బ్యాంక్ కార్యకలాపాలను స్తంభింపచేసిన వైనం - ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో నిర్లక్ష్యంపై మండిపాటు - 15 రోజుల్లో చెల్లిస్తామన్నా అంగీకరించని రైతులు - శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించాలని నిర్ణయం మాధవరం (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్ : ఇన్పుట్ సబ్సిడీ అందజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మాధవరం, జగన్నాథపురం, అప్పారావుపేట గ్రామాల రైతులు గురువారం మాధవరం ఆంధ్రాబ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగి బ్యాంక్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 2012-13 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు బ్యాంక్ పరిధిలోని రైతులకు అందలేదు. దీనిపై గతంలో రైతులు మూడు నెలల క్రితం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులతో చర్చలు జరిగిన సందర్బంలో బ్యాంక్ మేనేజర్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామని రూరల్ ఎస్సై కఠారి రామారావు సమక్షంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బ్యాంక్ అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం బ్యాంక్ వద్దకు చేరుకున్న రైతులు మేనేజర్ యువరాజు, సిబ్బందిని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. బ్యాంక్ కార్యకపాలు సాగకుండా బైఠాయించారు. దీంతో బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బ్యాంక్ ఏజీఎం త్రిపాల్బ్యాంక్ వద్దకు వచ్చి రైతులతో చర్చించారు. తమకు 15 రోజులు గడువు ఇవ్వాలని కోరారు. దీనికి రైతులు అంగీకరించలేదు. 15 రోజుల పాటు బ్యాంక్ కార్యకలాపాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఖాతాదారులను ఇబ్బందులు పెట్టవద్దని, సమస్యను త్వరగా పరిష్కరిస్తానని ఏజీఎం రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. గురువారం రాత్రి వరకు దఫదఫాలుగా ఏజీఎం రైతులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. శుక్ర వారం కూడా ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. మాజీ సర్పంచ్ గంధం బసవయ్య, తమ్మిశెట్టి ఆదినారాయణ, పత్తి రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గోవింద్, కొండేటి రామకృష్ణ, పోసిన నిరంజన్‌కుమార్, బట్రెడ్డి రాజారావు, పత్తి రాజబాబు పాల్గొన్నారు. ఆందోళన ఉధృతం కాకుండా రూరల్ ఎస్సై క ఠారి రామారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.