అల్లు అర్జున్‌ను గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు
తాడేపల్లిగూడెం రూరల్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ మండలంలోని మాధవరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో అల్లు అర్జున్‌ను వీక్షించేందుకు ఆదివారం ఉదయం నుంచే అభిమానులు గ్రామానికి క్యూ కట్టారు.
సాయంత్రం 4 గంటలకే అర్జున్ గ్రామానికి రావలసి ఉంది. దీంతో ఆయన రాకకు మూడు గంటలు ముందుగానే అభిమానులు నిరీక్షించారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటలకు తమ హీరో గ్రామానికి చేరుకోవడంతో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment