malakpet
-
కన్సల్టెన్సీ ఆఫీస్‌లో లా విద్యార్థిని ఆత్మహత్య
మలక్‌పేట: ఎల్ఎల్బీ చదువుతున్న ఓ గిరిజన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్‌పేట పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం తక్రాజ్‌గూడ తండాకు చెందిన ఇస్లావత్ రమేశ్– కంసీ దంపతులకు శ్రావ్య(20), శ్రుతి, సాయికిరణ్ సంతానం. శ్రావ్య ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఎన్టీఆర్నగర్ మహాత్మాగాంధీ లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. మలక్‌పేటలోని నందిని రెసిడెన్సీలో నవీన్, విజయ్‌లు జయదుర్గా ఎడ్యుకేషన్స్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శ్రావ్య మూడు నెలలుగా నవీన్ వద్ద పనిచేస్తోంది. ఆదివారం కన్సల్టెన్సీకి వెళ్లిన శ్రావ్య సాయంత్రం తన తమ్ముడు సాయికిరణ్‌కు ఫోన్ చేసి రూ.20 వేలు ఫోన్ పే చేయాలని కోరింది. సాయికిరణ్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత శ్రావ్యకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు.దీంతో అతను హాస్టల్లో శ్రావ్యతోపాటు ఉంటున్న శిరీషకు ఫోన్ చేశాడు. దీంతో శిరీష తన స్నేహితురాలైన సోనికి విషయం చెప్పింది. దీంతో సోనీ తన స్నేహితుడైన కార్తీక్‌తో కలిసి కన్సల్టెన్సీకి వెళ్లింది. పక్క ఫ్లాట్‌లో ఉన్న రవీందర్, గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న మరో మహిళతో కలిసి ఆఫీస్‌రూమ్ వద్దకు వెళ్లారు. ఆఫీసురూమ్ బయట శ్రావ్య చెప్పులు ఉండటం గమనించారు. వారు తలుపులు తీసి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో అది సాధ్యం కాలేదు. కిటికీలో నుంచి చూడగా శ్రావ్య సీలింగ్ ఫ్యాన్‌కు స్కార్ఫ్‌తో ఉరేసుకొని కనిపించింది.దీంతో తలుపులు పగులగొట్టి శ్రావ్యను కిందకు దించారు. రవీందర్ కారులో మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, శ్రావ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎస్సై సురేశ్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆందోళనకు దిగిన గిరిజన సంఘాలు శ్రావ్య మరణవార్త తెలుసుకున్న గిరిజన సంఘాలు, మృతురాలి బంధువులు సోమవారం పెద్ద సంఖ్యలో మలక్‌పేట పీఎస్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. అనంతరం కన్సల్టెన్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివారం సెలవురోజు కన్సల్టెన్సీ నిర్వాహకుడు నవీన్ కార్యాలయానికి శ్రావ్యను ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. శ్రావ్యపై అత్యాచారం చేసి హత్య చేశారని, చున్నీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారన్నారు. కన్సల్టెన్సీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ కొనసాగుతోంది గిరిజన విద్యార్థి మృతి చెందిన విషయంపై ఆదివారం రాత్రి మలక్‌పేట పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఇన్స్పెక్టర్ నరేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు నవీన్, విజయ్‌ని అదుపులోకి తీసుకున్నాం. శ్రావ్యను ఆస్పత్రికి తరలించిన కార్తీక్, సోనిలను కూడా విచారిస్తాం. క్లూస్ టీమ్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది.నిçష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుంది. – శ్యామ్‌సుందర్, మలక్‌పేట ఏసీపీ -
రెడ్ రోజ్ బేకరిలో అగ్ని ప్రమాదం
-
ఫ్రీ హలీమ్ ఎఫెక్ట్: భారీ జనంతో గందరగోళం
హైదరాబాద్: మలక్పెట్లో ఫ్రీగా హలీమ్ అంటూ హోటల్ ప్రకటించడంతో వందలాదిగా జనాలు రావటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భారీ జనాలతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మలక్‌పేటలో ఓ హోటల్లో హలీమ్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో వందలాదిగా జనాలు ఎగబడ్డారు. ఒకేసారి వందలాదిగా జనాలు తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వందలాదిమందిని అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక.. హోటల్ వద్దకు భారీగా జనం గుమిగూడటంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. Chaos over free #Haleem in #Hyderabad, police used mild force to disperse the crowd. Marking the first roza of holy #Ramadan month, a famous eatery announced #FreeHaleem for 1 hour today. Hundreds of people gathered outside their outlet, which led to #TrafficJam.#Ramadan2024 pic.twitter.com/NlFYSkSkPL — Surya Reddy (@jsuryareddy) March 12, 2024 -
ట్రోల్ బంక్ పక్కనే పేలిన విద్యుత్ ట్రాన్సఫార్మెర్
-
ఢిల్లీ లీడర్లకు కేసీఆర్ భయం
సాక్షి, కామారెడ్డి/అబిడ్స్/మలక్‌పేట: ‘కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్‌లోని గోషామహల్, మలక్‌పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గల్ఫ్ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. రేవంత్ కొడంగల్‌లో చెల్లని రూపాయి... ‘2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. హైదరాబాద్ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్‌లు జరిగేవని... కానీ కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్‌పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ధూల్‌పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. ‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్ అర్హత కటాఫ్ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు. -
వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మదలంగి సురేష్ (50) వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన సురేష్ 2000 సంవత్సరం బ్యాచ్ కానిస్టేబుల్. నగరంలోని సంతో‹Ùనగర్ ఈస్ట్‌మారుతినగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు వాకింగ్ చేస్తున్న సురేష్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి వాకర్స్ వెంటనే కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కోవిడ్ నుంచి ఆయన రెండుసార్లు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న సౌత్ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగం చంద్రశేఖర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్
మలక్‌పేట: బీఆర్ఎస్ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలోనే ఉందని, ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలోనే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం వ్యాపారవేత్త అదానీ చేతిలో ఉందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. ప్రధాని మోదీ చేతుల్లో ఏమీ లేదని, అదానీ చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు. మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మలక్‌పేటలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్‌ను నిర్మించనున్నామని, దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో తొలి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో 21 అంతస్తులతో 15లక్షల చదరపు అడుగుల ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. ఒకప్పుడు మలక్‌పేట అంటే టీవీ టవర్ గుర్తుకువచ్చేదని.. ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్ మారుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోందని, వరుసగా రెండేళ్లపాటు బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలను కల్పిస్తోందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నాయన్నారు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారని.. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి అద్దం పట్టారని పేర్కొన్నారు. కాగా.. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన సారథ్యంలో తెలంగాణ, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని ఎంపీ అసదుద్దీన్ చెప్పారు. -
మలక్‌పేట అనురాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట అనురాధ మృతి కేసు మరో మలుపు తిరిగింది. అనురాధ మృతి కేసు రాచకొండ పోలీసులకు బదిలీ అయింది. చంద్రమోహన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 15 ఏళ్లుగా చంద్రమోహన్, అనురాధల సహజీవనం చేస్తున్నారు. చంద్రమోహన్‌తో అనురాధకు గత కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. విభేదాల కారణంగా పెళ్లి చేసుకోవాలని అనురాధ ప్లాన్ చేసింది. పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోబోతున్నానని డబ్బు, నగలు తిరిగివ్వాలని చంద్రమోహన్‌ని డిమాండ్ చేసింది. రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగివ్వాలన్న అనురాధను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని హత్య చేసినట్లు తేలింది. అనురాధతో గొడవపడి 15 కత్తిపోట్లు పొడిచి చంపిన చంద్రమోహన్.. ఒక రోజు పాటు మృతదేహాన్ని బయటే పెట్టాడు.. అనురాధ గది పక్కన అద్దెకు ఉన్నవారు ఊరికెళ్లాక ముక్కలు చేశాడు. మరుసటిరోజు స్టోన్ కట్టర్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో దాచాడు. 5 రోజుల తర్వాత తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. చదవండి: ఆరుగురు పిల్లల తల్లి ఎంతటి దారుణానికి పాల్పడిందంటే... యూట్యూబ్‌లో చూసి మృతదేహాన్ని ముక్కలు చేసిన చంద్రమోహన్.. మృతదేహం నుంచి వాసన రాకుండా కెమికల్స్ వాడాడు. కూతురితోపాటు బంధువులెవరితోనూ అనురాధకు సంబంధాలు లేకపోవడంతో ఆమెను చంపితే బంధువులెవరూ రారని గుర్తించిన చంద్రమోహన్.. అనురాధ చార్ధామ్ యాత్రకు వెళ్తున్నట్లు సృష్టించాడు. అనుమానం రాకుండా అనురాధ కూతురుతో చంద్రమోహన్ చాటింగ్ చేశాడు. అనురాధ సెల్‌ఫోన్‌ను చార్‌ధామ్‌కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని చంద్రమోహన్ ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
Hyderabad: మొండెం లేని మహిళ తల ఎవరిదో తెలిసింది..
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ పరిధిలో మహిళ హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు. నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతుకుడు ఫ్రిడ్జ్‌లో దాచాడు. చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. కాగా, మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు మృతురాలిని గుర్తించడంతో హత్య కేసును ఛేదించారు. చదవండి: ‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’ -
హైదరాబాద్ మలక్ పేట్ పీఎస్ పరిధిలో దారుణం
-
HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్యాడ్తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎక్కడో హత్య చేసి, ఇక్కడ తల తెచ్చి పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమీర్‌పేటలో దారుణం.. భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య -
గైనకాలజిస్ట్‌గా నాకు ఎన్నో ప్రశ్నలున్నాయి: గవర్నర్ తమిళి సై
-
మలక్‌పేట ఘటనపై స్పందించిన తమిళిసై.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్!
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతి బాధాకరమని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తనకు ప్రశ్నలు ఉన్నాయంటూ ట్విస్ట్ ఇచ్చారు. కాగా, రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతి బాధాకరమన్నారు. గైనకాలజిస్ట్‌గా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వైద్య రంగంలో వసతులు మరింత మెరుగుపరచాలి. బిల్లులు పెండింగ్ కాదు.. పరిశీలనలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలి. వైద్యరంగం మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు.. కానీ ఇంకా మెరుగు పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. వివాదాలతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. యూజీసీ కొన్ని అంశాలను ప్రస్తావించింది, న్యాయ చిక్కులు లేకుండా చూసుకోవాలి అని అన్నారు. -
Hyderabad: మలక్‌పేట హోటల్లో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేటలోని అక్బర్‌బాగ్ డివిజన్ నల్గొండ చౌరస్తాలోని సొహైల్ హోటల్లో శుక్రవారం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈఘటనలో హోటల్లో పనిచేస్తున్న కారి్మకుడు మృతిచెందాడు. చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హోటల్ వంటగదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న షాబుద్దీన్ అనే కారి్మకుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని రాజకీయ ఒత్తిళ్లతో లీజుకు తీసుకొని హోటల్ ఏర్పాటు చేయడమే కాకుండా...నిర్లక్షంగా వ్యవహరించడం వల్లే ఓ నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హోటల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. గతంలో హోటల్ లీజు అగ్రిమెంట్‌ను రద్దు చేసి ఒక భవనం నిర్మించి ఆసుపత్రి రోగులకు బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు అనుకున్నారు. తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు హోటల్ భవనాన్ని ఖాళీ చేయించలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక హోటల్ లీజును పొడిగించారు. ఇక హోటల్‌కు దగ్గరలోనే అగ్నిమాపక కేంద్రం ఉండటం వల్ల పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
హైదరాబాద్: మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసులో డాక్టర్ శ్రావణి మృతి
-
హిట్&రన్ కేసు: డాక్టర్ శ్రావణి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ.. మూడు రోజులుగా ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. ఇక నిందితుడిని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. అంతేకాదు.. నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు సైతం లేవని వెల్లడించారు పోలీసులు. శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్‌గా విధులు నిర్వహించేవారు. ఇదిలా ఉంటే.. నెల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇది రెండో విషాదం. సుమారు 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండెపోటుతో కన్నుమూయడం గమనార్హం. దీంతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. సెప్టెంబర్ 21వ తేదీన ఓలా బైక్ బుక్ చేస్కొని శ్రావణి వెళ్తుండగా.. గుర్తు తెలియని కారు ఒకటి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, శ్రావణి గాయపడగా.. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆమె తుది శ్వాస విడిచింది. ఇక సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఇబ్రహీంను గుర్తించారు పోలీసులు. ఇదీ చదవండి: న్యూడ్ కాల్స్‌తో ఆమె నన్ను వేధిస్తోంది సార్.. -
హైదరాబాద్ మలక్ పేటలో దారుణం
-
బాయ్‌ఫ్రెండ్ అని పొరపాటు.. నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులివ్వాలని..
సాక్షి, హైదరాబాద్: నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ యువకుడ్ని షీటీమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. గురువారం ఇన్స్పెక్టర్ కసపరాజు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శివరామ్పల్లికి చెందిన మహమ్మద్ మోసిన్(22) పెయింటర్. దిల్సుఖ్నగర్ హాస్టల్లో ఉంటూ ఎమ్మెస్సీ చదువుతున్న ఓ యువతికి తన సెల్‌ఫోన్ నుంచి కాల్ చేసి తన పేరు రాజు అని పరిచయం చేసుకున్నాడు. అయితే కొంత కాలం క్రితం తనతో విడిపోయిన తన బాయ్‌ఫ్రెండ్ రాజు అని నమ్మిన ఆమె అతనితో సంభాషించడం మొదలు పెట్టింది. అతని అభ్యర్థన మేరకు తన నగ్న చిత్రాలను పంచుకుంది. అయితే ఇద్దరు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు అతడు బాయ్ ఫ్రెండ్ రాజు కాదని తెలిసి షాక్‌కు గురైంది. తన చిత్రాలు తొలగించాలని అతడిని కోరింది. ఫొటోలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వాటిని వైరల్ చేస్తానని బెరింపులకు దిగాడు. దీంతో యువతి షీటీమ్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన షీటీమ్ పోలీసులు అతడిని పట్టుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. చదవండి: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు -
Hyderabad: మలక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరహత్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో భవనంలోకి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. చదవండి: (పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ) -
ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’
గచ్చిబౌలి: ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం లాల్గాడి మలక్‌పేట్‌లోని జినోమ్ వ్యాలీ, ఫార్మా లైఫ్ సైన్సెస్ నుంచి అల్వాల్ వరకు ఎస్సీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చిన 3వ షీ షటిల్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే భద్రత వ్యవస్థలో మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం అల్వాల్ నుంచి లాల్‌గడీ మలక్‌పేట్, తుర్కపల్లి నుంచి జనోమ్ వ్యాలీ వరకు నడుస్తుందన్నారు. ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ... ఐటీ, ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇప్పటి వరకు 12 షీ షటిల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరంలోని మలక్ పెట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చంపా పేట్, ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్, జూపార్క్, ఫలక్‌నూమా, బహదూర్ పురా, పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నగర శివారులోని దుండిగల్, సూరారం, దూలపల్లి, బహదూర్ పల్లి, పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో నగరవాసులకు ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగింది. -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతిపై రగడ
Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్‌నగర్ రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మలక్‌పేట్ మెట్రోస్టేషన్ పైనుంచి దూకి..
సాక్షి, మలక్‌పేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి మెట్రోస్టేషన్ పైనుంచి దూకిన ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చత్తీస్ఘడ్, కువకొండ, పుల్పహడ్, దంతేవాడకు చెందిన భీమా(45) ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్నాడు. దిల్సుఖ్నగర్ బస్టాప్ వైపు నుంచి మెట్రో స్టేషన్ మొదటి ఫ్లోర్ ఎక్కి అక్కడ నుంచి దూకాడు. చదవండి: అత్యాచార ఘటన చాలా బాధాకరం: ఎమ్మెల్సీ కవిత అతడి తల, ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీఫుటేజ్‌లు పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
3.46లక్షల ఫాలోవర్స్..‘మీ డై హార్ట్ ఫ్యాన్’ అంటూ
సాక్షి, హిమాయత్‌నగర్: ఇన్ఫ్లూ్యన్సెర్కు మీ డై హార్ట్ ఫ్యాన్ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడు. మలక్‌పేటకు చెందిన ప్రియారెడ్డికి ఇన్‌స్ట్రాగామ్‌లో 3.46లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే వీడియోలు, డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్ వంటి వీడియోస్‌కు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి ఇటీవల ‘మీ డైహార్ట్ ఫ్యాన్’ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో కొన్ని ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత నుంచి ప్రియారెడ్డిని డబ్బు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఫ్యాన్ అని ఇలా బ్లాక్మెయిల్ చేస్తావా అని ప్రశ్నించినందుకు ఆమె వీడియోస్‌కు పోర్న్‌స్టార్స్ బాడీని ఎటాచ్ చేసి యూట్యూబ్, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేశాడు. తన కుమారుడు, కుటుంబ సభ్యులపై కూడా అశ్లీల మెసేజ్‌లను ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లోని అందరికీ పంపించాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ప్రియారెడ్డి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. ఈ వ్యవహారంపై మే 16వ తేదీన సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కొన్ని వీడియోస్‌ను, అకౌంట్స్‌ని డిలీట్ చేయడం జరిగింది. మరికొన్ని వెబ్‌సైట్స్, ఇన్‌స్టా, యూట్యూబ్‌ల్లో అసభ్యకర రీతిలో పోస్టులు, కామెంట్స్ పెట్టిన వారిపై సైతం చర్యలు తీసుకోవాలని మంగళవారం మరోమారు ప్రియారెడ్డి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బ్లేడుతో గొంతుకోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
మలక్‌పేట: ఓ కానిస్టేబుల్ బ్లేడుతో గొంతుకోసుకుని ఆతహ్మత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం, బాలాజీనగర్‌కు చెందిన బానోత్ భిక్షం, రేణుక దంపతులకు అభిలాష్ నాయక్(33), ప్రభునాయక్ ఇద్దరు కుమారులు. భిక్షం ఆటోడ్రైవర్. 40 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మూసారంబాగ్ డివిజన్ బాలదానమ్మబస్తీలో స్థిరపడ్డారు. గవర్నమెంట్ క్వార్టర్స్‌లో కింది పోర్షన్లో అభిలాష్ భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఉంటుండగా.. రెండో ఫ్లోర్లో చిన్నకుమారుడు ప్రభునాయక్ ఉంటున్నాడు. అభిలాష్ నాయక్‌కు 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. భార్య ఇంద్రజ్యోతి, ధీరజ్, హేమంత్ ఇద్దరు సంతానం. ఆరేళ్లుగా మాదన్నపేట పీఎస్‌లో విధులు నిర్వహిస్తుండగా.. చిన్నకుమారుడు ప్రభునాయక్ జీహెచ్ఎంసీ డిజాస్టర్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిలాష్ తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలను శుక్రవారం కోదాడకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. పడుకుంటానని చెప్పి.. సోమవారం ఉదయం విధులకు వెళ్లి మధ్యాçహ్నం 3 గంటలకే ఇంటికి వచ్చాడు. అన్నం తిన్న తర్వాత పడుకుంటానని చెప్పి రెండోఫ్లోర్ ఉన్న గదికి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. సాయంత్రం తల్లిదండ్రులు పిలిచినా పలకలేదు. నిద్రపోయాడని వారు భావించారు. రాత్రి 10 గంటలకు ప్రభునాయక్ ఇంటికి వచ్చాడు. అభిలాష్‌ను తీసుకువచ్చేందుకు పైకి వెళ్లాడు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో పక్కంటి వారి సహాయంతో ఇంటి తలుపు పగులగొట్టి చూడగా రక్తం మడుగులో మంచం పక్కన పడిఉన్నాడు. మిత్రుడి లోన్ కోసం ష్యూరిటీ.. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని చూడగా బ్లేడుతో గొంతు, చేతి మణికట్టు కోసుకున్నాడు. అభిలాష్ నాయక్ తన మిత్రుడి లోన్ కోసం ష్యూరిటీ ఇచ్చిన కారణంగా చేతికి జీతం రావడం లేదు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నాడు. దీంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నట్లు పోలీసులు తెలిపారు. అభిలాష్ గొంతుపై మూడుగాట్లు, ఎడమ చేతి మణికట్టుపై రెండు గాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సుభాష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అంత్యక్రియల కోసం తల్లిదండ్రులు అభిలాష్ మృతదేహాన్ని సొంతూరు కోదాడకు తీసుకెళ్లారు. చదవండి: సీఎం వీడియో మార్ఫింగ్ ట్యాబ్‌పై స్పష్టత ఇవ్వని ఉమా