malikipuram
-
మా పొట్ట కొట్టొద్దు
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్‌మెన్, నైట్ వాచ్మెన్, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్‌మెన్, సూపర్వైజర్లు, నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించండి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
Konaseema: ‘ఏపీలో సామాజిక విప్లవం.. సీఎం జగన్ చేతల్లో చూపించారు’
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో బస్సు యాత్ర సాగింది. మలికిపురంలోని కేఎస్‌ఎన్‌రాజు నివాసంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభమైంది. మలికిపురం ప్రధాన సెంటర్లో నిర్వహించిన బహిరంగలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరయ్యారు. మలికిపురంలో సామాజిక సాధికార సభ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం జగన్: మంత్రి విశ్వరూప్ సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేర్చారన్నారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని, రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తోందని మంత్రి అన్నారు. 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. అభివృద్ధి చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు. బీసీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన వ్యక్తి జగన్’’ అని మంత్రి కొనియాడారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణు మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గం నాకు పుట్టిల్లు. ఇక్కడ నేతలు కృష్ణంరాజు, జక్కంపూడిల సహకారంతో ఎదిగాను. వైఎస్సార్, సీఎం జగన్ నాకు రాజకీయంగా గుర్తింపునిచ్చారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆత్మగౌరవం గుర్తించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. అబద్ధం 14 ఏళ్ల పాటు పాలించింది.. జగన్ అనే నిజం వెలుగులోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. వారు తలెత్తుకుని జీవించగలుగుతున్నారు: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ, పేదల సమస్యల గురించి మాట్లాడే నాయకులను మాత్రమే గతంలో చూశాం.. సమస్యలను పరిష్కరించి, చేతల్లో అభివృద్ధిని చూపిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే. అంబేద్కర్ ఆలోచన విధానాలను అక్షరాల అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. చిన్న వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చెందిన అనేక మందికి సీఎం జగన్ మార్కెట్ చైర్మన్లుగా, దేవాలయాలు చైర్మన్లుగా పదవులిచ్చి సమాజంలో గౌరవం కల్పించారు’’ అని ఎంపీ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు తలెత్తుకుని జీవించగలుగుతున్నారంటే అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమైంది. ఈ వర్గాలకు నిజమైన సాధికారత చేకూరింది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు వాళ్ల కాళ్లపై వాళ్లు జీవించగలిగే పరిస్థితిని జగన్ కల్పించారు. దేశంలోని అత్యున్నతమైన రాజ్యసభ పదవులు నలుగురు బీసీలకు జగన్ కట్టబెట్టారు. చంద్రబాబు తన పార్టీలో డబ్బున్న వారికి రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు చిన్నపాటి రాజకీయ హోదా కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయాడు. 2024లో కూడా సీఎంగా జగనే రావాలి’’ అని మోపిదేవి పేర్కొన్నారు. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
అందాల పోటీల్లో కేశనపల్లి గిత్తకు ప్రథమ స్థానం
మలికిపురం: రాష్ట్ర స్థాయిలో జరిగిన అందాల పోటీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం అడబాల లక్ష్మీనారాయణ (నాని)కి చెందిన పుంగనూరు గిత్త ప్రథమ స్థానం పొందింది. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెదతాడేపల్లిలో జరిగిన ఈ పోటీలలో ఈ గిత్తకు రూ.30 వేల బహుమతి లభించింది. మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్‌రాజు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతుల మీదుగా లక్ష్మీనారాయణ బహుమతి అందుకున్నారు. దేశీయ గోజాతి సంవర్ధక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఎత్తు 13 అంగుళాలు.. పొడవు 19 అంగుళాలు మలికిపురం మండలంలోని పడమటిపాలెం గ్రామంలో సోమవారం అరుదైన పుంగనూరు గిత్త దూడ జన్మించింది. పెద్దిరెడ్డి సత్యనారాయణ మూర్తికి చెందిన పుంగనూరు ఆవుకు ఈ దూడ జన్మించింది. దీని ఎత్తు 13 అంగుళాలు, పొడవు 19 అంగుళాలు ఉంది. పుంగనూరు దూడలన్నీ సాదారణంగా ఇదే సైజులో జన్మిస్తాయి. (క్లిక్ చేయండి: మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!) -
ఉద్యోగంలో చేరిన పది రోజులకే యువతి మృతి.. ఏం జరిగిందంటే?
మలికిపురం(కోనసీమ జిల్లా): ఆ యువతి పట్టుదలతో చదివింది. ఎంఎల్‌హెచ్‌పీ పూర్తి చేసింది. ఆరోగ్య శాఖలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. అనుకున్నది సాధించింది. అంతలోనే విధి వక్రీకరించింది. స్వల్ప అనారోగ్యం తీవ్ర రూపం దాల్చి ఆ యువతిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. మలికిపురం మండలం గొల్లపాలెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఏఎన్ఎం నల్లి విజయకుమారి (21) ఆకస్మిక మృతి చెందింది. ఇటీవలే ఆమెకు ఏఎన్ఎంగా ఉద్యోగం రావడంతో పి.గన్నవరం మండలం ఏనుగుపల్లి పీహెచ్సీలో విధులలో చేరారు. చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ.. మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి.. విధులలో చేరి పది రోజులు కూడా కాలేదు. ఇటీవల ఆమెకు స్వల్ప అనారోగ్యం రావడంతో రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు బుధవారం విజయకుమారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె తండ్రి ఎంపీటీసీ మాజీ సభ్యుడు నల్లిదాసును పరామర్శించారు. ఎంపీపీ కేతా శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు మట్ట అనంత లక్ష్మి, సర్పంచ్‌లు మందపాటి నాగేశ్వరావు యెనుముల నాగు, రాపాక ఆనందకుమార్ పరామర్శించిన వారిలో ఉన్నారు. -
Director Sukumar: తండ్రిని తలచుకొని భావోద్వేగానికి లోనైన సుక్కూ
మలికిపురం: ఉద్యోగాన్ని వదిలి సినీ పరిశ్రమకు వెళుతున్నప్పుడు తన తండ్రి ఎంతో ప్రోత్సహించి ధైర్యం చెప్పారని సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని స్వగ్రామం మట్టపర్రులో పాఠశాల భవనం అదనపు గదుల నిర్మాణానికి తన తండ్రి తిరుపతినాయుడు పేరిట సుకుమార్ గతంలో రూ.18 లక్షల విరాళం అందించారు. ఆ నిధులతో నిర్మించిన భవనాన్ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పాఠశాలలోనే తాను చదివానని.. తన తండ్రి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్టు తెలిపారు. ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ స్వగ్రామానికి సుకుమార్ చేస్తున్న సేవలను కొనియాడారు. -
ఐస్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్
మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా గ్యాస్ భారీగా లీకయింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఓఎన్జీసీ రెస్క్యూ టీం సహకారంతో కొద్ది సేపట్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఫ్యాక్టరీ లోంచి గ్యాస్ లీక్ కాగానే ఫ్యాక్టరీలోని సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్యాస్ కమ్ముకోవడంతో జనం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తహసీల్దారు నరసింహరావు, ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లకు దూరంగా పంపించారు. ఓఎన్జీసీ రెస్క్యూ టీం సహకారంతో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పెనుముప్పును నివారించారు. రాత్రి 9.30 గంటలకు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. -
రాపాక అరెస్ట్.. రాజోలులో హైడ్రామా
సాక్షి, రాజోలు(తూర్పు గోదావరి): జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాక రాజోలులో హైడ్రామా నెలకొంది. రాపాక పోలీసులకు లొంగిపోయిన వెంటనే జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యే మద్దతుదారులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ బయట బైఠాయించారు. అనంతరం రాపాకను రాజోలు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. పోలీసులు ఎంత వారించినా వారు వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాపక తన మద్దతుదారులతో కలిసి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు . దీంతో కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు చివరికి ఎమ్మెల్యేను కోర్టుకు తరలించారు. ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: ‘బాధ్యతా రహితంగా జనసేన ఎమ్మెల్యే తీరు’ పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే -
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే
సాక్షి, తూర్పు గోదావరి : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. రాజోలు నియోజకర్గం మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో రాపాకతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాపాక ఏ1గా ఉన్నారు. మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి : పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే ‘బాధ్యతా రహితంగా జనసేన ఎమ్మెల్యే తీరు’ -
జనసేన ఎమ్మెల్యేపై డీఐజీ ధ్వజం
సాక్షి, రాజోలు : జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యలు సమాజంలో యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయొచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్ళతాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడిన వీడియో ఆధారంగా, పీఎస్ ముట్టడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఒక మండల స్థాయి అధికారి అయిన ఎస్ఐను బాధ్యత గల ప్రజాప్రతినిధి దూషిస్తూ.. దాడికి పాల్పడటం సమంజసం కాదన్నారు. ఎస్ఐ తప్పు చేసి ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకునే వాళ్లమని తెలిపారు. (చదవండి: పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే) -
ఒకే బైక్‌పై ఐదుగురు.. ముగ్గురి మృతి
మోటారుసైకిల్‌పై ముగ్గురి ప్రయాణమే ప్రమాదకరం.. అలాంటిది ఐదుగురు ప్రయాణిస్తే.. వాహనం అదుపులో ఉండడం కష్టం. అదే జరిగింది వారి విషయంలో. చిన్నారులకు వచ్చిన సర్పికి వైద్యం చేయించేందుకు మోటారుసైకిల్‌పై ఐదుగురు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో కాలువలోకి దూసుకుపోగా ఇద్దరు బాలికలు, ఓ మహిళ మరణించారు. సాక్షి, మలికిపురం (తూర్పు గోదావరి): ప్రజల ప్రాణరక్షణ కోసమే ట్రాఫిక్ నిబంధనలు.. ఏం పర్లేదని వాటిని ఉల్లంఘిస్తే.. జరిగే దారుణం అంతా ఇంతా కాదు. ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి. వాహనంపై ముగ్గురి ప్రయాణం ప్రమాదకరం.. ఇలా నిబంధనలు చెబుతాయి. కానీ వాటిని చాలామంది పట్టించుకోరు. అదే ముప్పును తెచ్చిపెడుతుంది. అదే జరిగింది ఈ సంఘటనలో.. మోటారు సైకిల్‌పై ఐదుగురు ప్రయాణిస్తుండడంతో దాన్ని అదుపు చేయడం వాహనదారుకు సాధ్యం కాలేదు. దాంతో అది కాలువలోకి దూసుకుపోగా ఓ మహిళ, ఇద్దరు బాలికలు మరణించారు. పిల్లల శరీరంపై వచ్చిన సర్పి వ్యాధికి మంత్రం వేయిద్దామని వారితో బయల్దేరిన తల్లికి కడుపుకోతే మిగిలింది. తమకు సాయంగా వచ్చిన తోబట్టువు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె దుఃఖానికి అంతేలేదు. మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదం సఖినేటిపల్లి మండలం మోరి పోడు గ్రామంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇద్దరు పిల్లలు మరణించడంతో తండ్రి బ్రహ్మాజీ, తాత మేడూరి గంగాధర్ వేదనకు అంతేలేదు. మోరిపోడు గ్రామంలో వడ్రంగి పని చేసుకొనే మేడూరి బ్రహ్మాజీకి పాలకొల్లు గ్రామానికి చెందిన సుగుణతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వారికి భార్గవి (5), కిరణ్మయి (4) సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొన్ని నెలలుగా వారు విడిగా ఉంటున్నారు. సుగుణ తన ఇద్దరు పిల్లలతో పాలకొల్లులోని పుట్టింట్లో ఉంటోంది. పిల్లలు భార్గవి, కిరణ్మయిలకు శరీరంపై సర్పి వచ్చింది. అది మంత్రం ద్వారా నయం అవుతుందని, సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో ఉన్న మంత్రగాడితో మంత్రం వేయించేందుకు మంగళవారం ఉదయమే బయలుదేరారు. పిల్లల మేనత్త భర్త అయిన పాలకొల్లు సమీపంలోని కాజ గ్రామానికి చెందిన వడ్లమాని శివ నాగేశ్వరరావు హోండా ప్లెజర్ వాహనంపై చిన్నారులు భార్గవి, కిరణ్మయిలతో పాటు వారి తల్లి సుగుణ, సుగుణ అక్క కృప (పాలకొల్లు)లతో బయల్దేరారు. వారు గుడిమెళ్లంక– రామరాజులంక సరిహద్దులకు వచ్చే సరికి ప్రధాన పంట కాలువపై గల వంతెన వద్ద వాహనం మలుపు తిరగడం కష్టమైంది. దాంతో కాలువలోకి దూసుకుపోయింది. అప్పుడు సమయం తెల్లవారు ఝామున 4.30 గంటలైంది. అంతా చీకటిగా ఉండడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారు కాలువలో ప్రవాహానికి కొట్టుకు పోసాగారు. శివ నాగేశ్వరరావు, సుగుణ ఈదుకుంటూ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. మోటార్ సైకిల్‌తో పాటు కృప, భార్గవి, కిరణ్మయి గల్లంతయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మలికిపురం ఎస్సై కేవీ రామారావు తమ సిబ్బందితో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాజోలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈత గాళ్లను రప్పించారు. ఉదయం 7 గంటలకు తొలుత కిరణ్మయి (4) మృత దేహం లభించింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో కృప మృత దేహం లభించింది. భార్గవి మృత దేహం కోసం తీవ్రంగా గాలించగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సంఘటన స్థలానికి సమీపంలోనే లభించింది. అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా, రాజోలు సీఐ కె.నాగ మోహన రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. -
పద్మజ థియేటర్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని ఓ సినిమా థియేటర్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మలికిపురంలోని పద్మజ థియేటర్లో మధ్యాహ్నం షో ప్రారంభం అవుతున్న సమయంలో షార్ట్ సర్క్యట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే థియేటర్లోని ప్రేక్షకులను ముందుగానే బయటకు పంపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు భయాందోళకు గురయ్యారు. థియేటర్లోని ఫర్నీచర్ అగ్నికి అహుతి అవ్వగా.. పై కప్పు పూర్తిగా కాలిపోయింది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
మల్కిపురం బహిరంగ సభలో వైఎస్ షర్మిల
-
రోడ్డు ప్రమాదంలో మామా అల్లుళ్ల దుర్మరణం
మలికిపురం (రాజోలు): మండలంలోని గుడిమెళ్లంక గ్రామంలో ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కటికదల సుబ్రహ్మణ్యం (38), దుండి సురేష్(27) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ సొంత మామా అల్లుళ్లు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని సార్వా. మలికిపురంలోని బంధువుల ఇంటికి వీరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న వీరు ఎదురుగా వస్తున్న పంగిడికి చెందిన కంకర లారీని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మలికిపురంలోని బంధువుల ఇంట్లో సోమవారం ఓ కార్యక్రమం ఉండటంతో ఇప్పటికే సుబ్రహ్మణ్యం కుమార్తె రాణి, చిన్న కుమార్తె సుష్మ మలికిపురం చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం, సురేష్ శనివారం మలికిపురం వస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే మలికిపురంలోనే ఉన్న కుమార్తెలు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలపై పడి బోరున విలపించారు. ఒకే సారి తండ్రి, భర్తను కోల్పోయిన రాణి, తండ్రిని, బావను కోల్పోయిన సుష్మ విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. రాణికి ఏడాది పాప ఉంది. మలికిపురం, సఖినేటిపల్లి ఎస్సైలు పవన్‌కుమార్, చైతన్యకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పండు‘గొప్పే’
ఆరు వేలకు అమ్ముడుపోయిన చేప చేపల్లో రారాజు పండుగొప్ప అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ చేప ఆదివారం మలికిపురం చేపల మార్కెట్లో గొప్ప ధర పలికింది. ఒక్కొక్కటి ఏకంగా రూ.ఆరు వేలకు అమ్ముడు పోయింది. దాదాపు పది కేజీల బరువున్న రెండు పండుగొప్పలు ఈ ధరకు అమ్ముడయ్యాయి. కరవాక వైనతేయ నదిలో వలలకు ఈ చేపలు చిక్కినట్టు మత్స్యకారులు తెలిపారు. – మలికిపురం -
పేలిన నిర్లక్ష్యం
పైపులైన్ పేలుడుతో మరోసారి బయటపడిన వైనం చమురుతో నిండిపోయిన రోడ్లు, బోదెలు గొల్లపాలెం గ్రామంలో ఘటన శిథిల లైన్లు.. నాసిరకం పనుల వల్లే..! ముడి చమురు సరఫరాకు కీలకమైన పైపులైన్లు అవి. వాటిని ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నాయి. నాసిరకమైన పైపులు కావడంతో తరచూ పగిలిపోతున్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు. కేవలం మరమ్మతులతో సరిపుచ్చుతున్న ఓఎన్జీసీ.. వాటిని పటిష్టపరచడంలో నిర్లక్ష్యం చూపుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. – మలికిపురం మలికిపురం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం సంభ వించిన పైపులై¯ŒS పేలుడుతో ఓఎన్జీసీ నిర్లక్ష్యం, నాసిరకం లైన్ల ఉదంతం మరోసారి బయటపడింది. గ్రామంలోని కరవాక సరిహద్దులో కేడబ్ల్యూఏఏ బావి నుంచి తూర్పుపాలెం జీసీఎస్‌కు క్రూడాయిల్ సరఫరా చేస్తున్న ఈ పైపులై¯ŒS ఉదయం 7.30కు భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు తీవ్రతకు రోడ్డుపై గోతులు పడ్డాయి. క్రూడాయిల్ ఎగసి సరుగుడు చెట్లపై పడడంతో అవి విరిగిపోయాయి. రోడ్లు, సరుగుడు తోటల్లోని బోదెలు చమురుతో నిండిపోయాయి. నాసిరకం వల్లే.. సుమారు పదేళ్ల క్రితమే ఈ పైపులైన్లు వేసినట్టు చెబుతున్నారు. అప్పట్లో నాసిరకంగా వేయడం వల్ల అవి తరచూ పేలిపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారు గంటకు పైగా చమురు ఎగసిపడిందని చెప్పారు. ఎట్టకేలకు జీసీఎస్ సిబ్బంది బావి వద్దకు చేరుకుని.. చమురు సరఫరా నిలిపివేయడంతో ఎగసిపడడం తగ్గుముఖం పట్టింది. తోటలకు తీవ్ర నష్టం సుమారు 25 ఎకరాలకు పైగా సరుగుడు తోటలు చనిపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర తీరంలోని ప్రధాన రహదారి పైనే ఈ ప్రమాదం జరిగింది. పేలుడు జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ వెళ్లకపోవడం, రైతులు కూడా ఇంకా పొలాల్లోకి రాకపోవడంతో పెను ముప్పు తప్పింది. సముద్ర తీరంలో సుమారు 50కి పైగా చమురు బావులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పైపులను మార్చకపోవడం, మరమ్మతుల్లో ఓఎన్జీసీ పూర్తి నిర్లక్ష్యధోరణి అవలంబించడం వల్లే ఈ ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
భవనంపై నుంచి పడి చిన్నారి మృతి
మలికిపురం : పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మరణించిన సంఘటన ఇది. ఈ సంఘటనలో గాయపడిన మట్టపర్రు గ్రామానికి చెందిన తాడి యోగిత(4) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఎస్సై విజయబాబు మంగళవారం తెలిపారు. సోమవారం ఉదయం భవనంపై కొందరి పిల్లలతో కలిసి ఆటలు ఆడుకుంటుండగా, ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయినట్టు పేర్కొన్నారు. బాలిక తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
'సాంస్కృతిక దాడి మరీ ప్రమాదకరం'
మలికిపురం (తూర్పుగోదావరి) : భౌతిక దాడుల కంటే సాంస్కృతిక దాడులు అత్యంత ప్రమాదకరమైనవని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. రికార్డు సృష్టించే లక్ష్యంతో 30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో శనివారం నాటికి 1620 మంది కవులు పేర్లు నమోదు చేయించుకున్నారు. కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సాంస్కృతిక దాడులు ఎక్కువయ్యాయని తెలిపారు. శత్రువు ఎక్కడో లేడని.. టీవీలు, సెల్ ఫోన్ల రూపంలో మనింట్లోనే ఉన్నాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఒకే చోట కూర్చొని మాట్లాడుకునే పూర్వ సంప్రదాయం ఇప్పుడు కనుమరుగైందని, విడాకుల సంస్కృతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కవులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మాటలు చలి వల్ల చావలేవని, ధైర్యం లేకనే చనిపోతాయని ఒక హిందీ రచయిత చెప్పిన మాటలు కవులు గుర్తుంచుకోవాలన్నారు. రచయితలకు హద్దులు ఉండకూడదని, రాసేవారు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచి రచనలు వస్తాయన్నారు. కొత్త తరాలను రచనా రంగంలోనికి ఆహ్వానించకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రచయిత కత్తిమండ ప్రతాప్, కలిదిండి వర్మ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల 30 సెకన్ల వరకూ జరుగుతుంది. -
అడుగు తడబడి అనంతలోకాలకు...
* మంచంపై నుంచి లేవబోతూ కిందపడ్డ గర్భిణి * గర్భస్థ శిశువు సహా కన్నుమూత మలికిపురం : కొద్దిరోజుల్లోనే మంచం మీద తన పక్కనే పొత్తిళ్లలో వెచ్చగా ఒదిగి ఉండే బిడ్డను అపురూపంగా చూసుకుంటూ మురిసిపోవలసిన ఆ తల్లి.. ఆ ముచ్చట తీరకుండానే ఈ లోకాన్ని వీడింది.మంచం మీద నుంచి లేచే ప్రయత్నంలో అడుగు తడబడి, తూలి కిందపడి, తలకు తీవ్రగాయమై ఆమె కన్నుమూసింది. కడుపులోని బిడ్డా కన్ను తెరవకుండానే కడతేరిపోరుుంది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో జరిగిన ఈ విషాదఘటన వివరాలు ఎస్సై విజయబాబు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నారుు.గ్రామానికి చెందిన బుడితి సత్యవతి (24)కి ఏడాది కిందట పెద కందాలపాలెంకు చెందిన యువకునితో పెళ్లరుుంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. గర్భం ధరించిన సత్యవతి పురుడు పోసుకునేందుకు శంకరగుప్తానికే చెందిన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు 9వ నెల. గురువారం ఉదయమే ఆమె ప్రసవం నిమిత్తం లక్కవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి దాటాక సత్యవతి బాత్రూమ్కు వెళ్లేందుకు మంచం నుంచి లేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడింది. దాంతో తలకు తీవ్రగాయమై ముక్కు నుంచి రక్తస్రావమైంది. ఆమెను తొలుత లక్కవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రాజోలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించమన్నారు.అక్కడికి చేరుకునే సరికే సత్యవతి కడుపులోని బిడ్డతో సహా కన్నుమూసింది. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రతిక్షణం భక్తపరవశం
12 రోజుల పుష్కరపర్వంలో ఆదివారం నాటికి అర్ధభాగం పూర్తయింది. సెలవు దినం కావడంతో ప్రతి స్నానఘట్టమూ భక్తులతో కిటకిటలాడింది. రత్నగిరి భక్తజనఝరి: సత్యదేవుని ఆదివారం 1.20 లక్షల మంది దర్శించారు. రద్దీ తట్టుకోలేక రూ.100 దర్శనాలను నిలిపివేసి ఆ క్యూ ద్వారా భక్తులను పంపించారు. అయినా భక్తులు అంతకంతకూ పెరిగారు. ఒకదశలో క్యూలో తోపులాట జరిగింది. దీంతోవాహనాలను రెండు గంటలు కొండదిగువన నిలిపివేశారు. సాయంత్రం వరకూ రూ.51.15 లక్షలు ఆదాయం సమకూరింది. - అన్నవరం సమైక్య సన్నిధి అంతర్వేది: తమిళనాడు, కర్నాటక, తెలంగాణల నుంచీ భక్తులు రావడంతో అంతర్వేదిలో పుష్కర ఘాట్ రోడ్డు కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచి రద్దీ కొనసాగింది. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. నరసన్నను 2లక్షల మందికి పైగా దర్శించారు. -మలికిపురం భీమేశ్వరా ! కావగ రారా...: మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి దర్శనాలు రాత్రి 12 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 2లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. ఆలయానికి రూ.మూడు లక్షల ఆదాయం సమకూరింది. - ద్రాక్షారామ (రామచంద్రపురం) బాలాజీకి రూ.5.80 లక్షల ఆదాయం: శ్రీబాల బాలాజీని 1.25 లక్షల మంది దర్శించారు. వివిధ సేవల ద్వారా రూ.5.80 లక్షల లభించాయి. 25 వేల లడ్డూలు విక్రయించారు. అన్నదానం ట్రస్టుకు రూ.2.60 లక్షల విరాళాలు వచ్చాయి. - అప్పనపల్లి (మామిడికుదురు) వీరేశ్వరుని సన్నిధికి భక్తుల తాకిడి: మురమళ్ల శ్రీభధ్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని ఆదివారం సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకొన్నారు. భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఆదివారం ఆలయానికి సుమారు రూ.లక్ష ఆదాయం లభించింది. -ఐ.పోలవరం కోటిపల్లి కిటకిట: కోటిపల్లిలోని ఘాట్లలో ఆదివారం సాయంత్రానికి రెండు లక్షల మంది పుష్కర పుణ్య స్నానాలు చేశారు. శనివారం రాత్రి వర్షం పడడంతో ఘాట్ల పరిసరాలు బురదమయమయ్యాయి. బురదనీటిలో స్నానం చేసేందుకు ఇబ్బంది పడ్డ పలువురు భక్తులు జల్లుఘట్టం వద్ద స్నానానికి మొగ్గు చూపారు. పిండ ప్రదానాల ఘాట్‌లో కాసింత చోటు దొరికితే అదే పదివేలు అన్నట్లుగా పరిస్థితి ఉంది. పలుచోట్ల బురదలోనే కూర్చుని పిండ ప్రదానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. -కోటిపల్లి (కె.గంగవరం) -
ఎమ్మెల్యే గొల్లపల్లి తీరుపై రాపాక ఆగ్రహం
మలికిపురం : రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు తీరుపై అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాపాక వర పసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురంలో గురువారం ఆయన విలేకరులతోమాట్లాడుతూ ఇటీవల తన స్వగ్రామం చింతలమోరిలో రూ.38 కోట్లతో మంజూరైన ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని వేరే గ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శంకరగుప్తం సర్పంచ్ ఉల్లూరు గోపాలరావు సూచనల మేరకు పూర్తి ఉప్పనీరు కల శంకరగుప్తంలో ఈ పథకం ఏర్పాటుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నారని పేర్కొన్నారు. చింతలమోరి ఎత్తిపోతల పథకాన్ని తన హయాంలో ప్రతిపాదించి నిధుల కోసం కృషి చేస్తే, గొల్లపల్లి ఇలా చేయడం దారుణమన్నారు. గొల్లపల్లి చర్యలపై కలెక్టరు అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తానని, నియోజకవర్గంలో ఆయన అక్రమాలపై పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ఇసుక రీచ్ నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా సాగించి దండుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గానికి స్థానికేతరులైన గొల్లపల్లి పాలనపై అవగాహన లేక ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచ్ కారుపల్లి విజయమోహన్, నాయకులు రాపా క యోహన్, రాపాక వాల్మీకి పాల్గొన్నారు. రాపాక ఆరోపణల్లో వాస్తవం లేదు : ఎమ్మెల్యే గొల్లపల్లి రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు చెప్పారు. రాపాక ఆరోపణల సంగతి తెలిసిన వెంటనే ఆయన రావులపాలెం నుంచి మలికిపురం విలేకరులతో ఫోన్ చేసి మాట్లాడారు. రాపాక హయాంలోనే ప్రతిపాదించిన చింతలమోరి లిప్ట్ ఇరిగేషన్ పథకం మూలన పడి ఉంటే తాను నీటిపారుదల శాఖ మంత్రి చుట్టూ తిరిగి మంజూరు చేయించానని, చింతలమోరిలోనే ఆ పథకం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. రాపాక ఎటువంటి అపోహలు పడనవసరం లేదని పేర్కొన్నారు. -
గోపేష్... ఓ గాజుబొమ్మ!
మలికిపురం: ఏ తల్లైనా.. తొమ్మిది నెలలు తన కడుపున పదిలంగా మోసి, పేగుసారం పోసి కన్న బిడ్డ చకచకా ఎదగాలని తపిస్తుంది. కానీ.. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరానికి చెందిన గుబ్బల ఓగిరాణికి ఆ అవకాశమే లేకుండా పోయింది. కారణం.. ఆమె బిడ్డ ఎముకలు గాలి గట్టిగా వీస్తే పూచికపుల్లల్లా విరిగిపోయేంత బలహీనమైనవి కావడమే. ఓగి రాణి, విజయకుమార్ దంపతుల బిడ్డ గోపేష్ నాగసాయి మణికంఠ.. మూడో నెల వయసప్పుడు మంచంలో గుక్కపట్టి ఏడుస్తుండగా వెళ్లి చూశారు. పరీక్షగా చూస్తే కాలు విరిగినట్టు తేలింది. కారణమేమిటో అంతుపట్టని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కట్టుకట్టారు. తర్వాత గోపేష్ ఛాతీ ఎముకలు తరచు వాటంతటవే విరిగిపోనారంభించాయి. అమలాపురం, కాకినాడల్లో వైద్యులకు చూపారు. ఆ వైద్యులు గోపేష్ స్థితిని ముంబయిలోని నిపుణులకు వివరించగా.. అది అరుదైన సమస్య అని, అమెరికాలాంటి దేశాల్లో తప్ప చికిత్స లభ్యం కాదని, అదిన్నీ రూ.కోట్లలో వ్యయమవుతుందని చెప్పారు. కూలి పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చే విజయకుమార్ దంపతులు కలలో కూడా కంటచూడని అంత మొత్తాలు కూడబెట్టటం తమవల్ల కాదని, బిడ్డ భవిష్యత్తును భగవంతునికి వదిలివేశారు. మధ్యమధ్యలో విరిగే ఎముకలకు కట్లుకట్టిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం గోపేష్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి సోకిన వ్యాధిని ‘ఆస్టియో క్లీరోసిస్’ అంటారని, ఇది నయం కాని వ్యాధి అని మలికిపురంలోని వైద్యులు చెప్పారు. -
‘చంద్రబాబు సింగపూర్ ఏజెంట్’
మలికిపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ఏజెంట్‌గా అవతారమెత్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పేర్కొన్నారు. మంగళవారం మలికిపురంలో జరిగిన సీపీఐ రాజోలు ఏరియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు తక్షణం నిర్మించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అంశంలో బాబు రైతులను, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసగించారన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో మలికిపురంలో నిర్వహిస్తామన్నారు. మీసాల సత్యనారాయణ, దేవ ముసలయ్య. కె.మధు, కేశవశెట్టి, దేవ రాజేంద్ర ప్రసాద్, పంపన ప్రసాదరావు, గెడ్డం ప్రభాకరరావు, కొండా సత్తిబాబు, పిచ్చిక గంగాధరరావు పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ ఏర్పాటు : మలికిపురంలో జరిగే సీపీఐ రాష్ట్ర మహా సభల ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షులుగా దేవ ముసలయ్య, అధ్యక్షులుగా చెల్లుబోయిన కేశవశెట్టి, కార్యదర్శిగా దేవ రాజేంద్రప్రసాద్, సభ్యులను ఎన్నకున్నారు. -
నిశ్చింతకు నోచేదెన్నడు?
సఖినేటిపల్లి/ మలికిపురం :కోనసీమ గుండెల్లో గుబులు కొనసాగుతూనే ఉంది. కలుగుల్లోని కాల సర్పాల్లా.. అంతటా పరుచుకుని ఉన్న చమురు, సహజవాయువుల పైపులైన్ల ‘బుసబుసలు’ ఆ గడ్డ చెవుల్లో కఠోరంగా మార్మోగుతూనే ఉన్నాయి. ఆ బుసబుసలు శాశ్వతంగా సద్దుమణగాలని, కాలయముని క్రోధాగ్ని లాంటి కీలలు మరోసారి తమ సీమలో రగలరాదని కోనసీమవాసులు గాఢంగా కోరుతున్నారు. నగరం గ్రామంలో 22 మందిని పొట్టన పెట్టుకున్న గెయిల్ ప్రధాన పైపులైన్ విస్ఫోటం అనంతరం కొంత కాలం గ్యాస్ ఉత్పత్తి, సరఫరా నిలిపి వేశారు. కోనసీమలో 300కి పైగా బావులుండగా ప్రస్తుతం మోరి జీసీఎస్ పరిధిలోని 30 బావుల్లో గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. విస్ఫోటం అనంతరమూ పలు చోట్ల గ్యాస్ లీక్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి నిలిపివేసిన బావుల్లో ఒత్తిడి కారణంగా లీకవుతున్నాయి. బావుల క్యాప్‌లు శిథిలస్థితికి చేరడంతో బావి నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాయి. బావుల నుంచి గ్యాస్ సరఫరా అవుతున్న చోట పైపులైన్లు శిథిలావస్థకు చేరడం వల్ల లీకేజీలు సంభవిస్తున్నాయి. అలాగే చమురు బావులు, పైపులైన్ల లీకేజీ సంఘనలు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. నగరం పైప్‌లైన్ విస్ఫోటం అనంతరం కేశనపల్లి, మోరి, అడవిపాలెం, తాటిపాక జీసీఎస్ల పరిధిలో సుమారు ఆరు ప్రాంతాల్లో గ్యాస్, ఆయిల్ లీకేజీ సంఘటనలు జరిగాయి. పలు చోట్ల ఇవి తక్కువస్థాయికే పరిమితమయ్యాయి. మరో ఘోరం జరక్క ముందే మేలుకోండి.. కోనసీమ ఎన్నటికీ మరిచిపోలేని పీడకలలాంటి నగరం విస్ఫోటం అనంతరం కూడా ఓఎన్జీసీ అధికారులు ఈ ప్రాంత ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బావుల పర్యవేక్షణ సరిగా ఉండడం లేదని, వెల్ క్యాప్‌లు, ఇతర పరికరాలు, పైపులైన్లు శిథిలస్థితికి చేరాయని, అయినా వాటిని తక్షణం మార్చే పూనిక కానరావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జరగరానిది మరోసారి జరగకముందే.. ఓఎన్జీసీతో పాటు ప్రభుత్వాధికారులూ మేలుకోవాలంటున్నారు. కంటికి కునుకును, మనసుకు నిశ్చింతనూ కరువు చేస్తున్న లీకేజీలను వెంటనే అరికట్టాలని, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇద్దరు మహిళలు దుర్మరణం
మలికిపురం : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మండల పరిధిలోని విశ్వేశ్వరాయపురంలో బుధవారం ఆర్టీసీ బస్సు కిందపడి పడమటిపాలేనికి చెందిన ఓదూరి సూర్యకుమారి(35) అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు సతీష్‌ను పోలీసులు రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏఎస్సై భుజంగరావు కథనం ప్రకారం.. రాజోలు నుంచి మలికిపురం వైపు మోటార్ బైక్‌పై సతీష్, అతడి తల్లి సూర్యకుమారి వస్తున్నారు. అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఓవర్టేక్ చేసింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో తల్లీకుమారుడు బస్సు వెనుకచక్రం కిందపడ్డారు. సూర్యకుమారి తలపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సతీష్‌ను ఆస్పత్రికి తరలించగా, అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ కిందపడి.. రాజోలు : బంధువుల పరామర్శకు వెళ్లి మోటార్ బైక్‌పై స్వగ్రామానికి తిరిగివస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో భార్య తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించగా, భర్తకు గాయాలయ్యాయి. ఎస్సై అప్పన్న కథనం ప్రకారం.. మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన గిడుగు సత్యనారాయణ, పద్మ దంపతులు బుధవారం మోటార్ బైక్‌పై పి.గన్నవరంలో బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లారు. కేశనపల్లికి తిరిగి వస్తుండగా రాజోలు మండలం కడలి గమళ్లపాలెం వద్దకు చేరుకునేసరికి.. ములికిపల్లి వైపు వెళ్తున్న సిమెంటు లోడు లారీని ఓవర్టేక్ చేసేందుకు సత్యనారాయణ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో పద్మ రోడ్డుపై పడిపోయింది. ఆమె తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోగా, రోడ్డు పక్కన పడిన సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. పద్మ తమ్ముడు బొలిశెట్టి సాయిరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఎంత ఘోరం తప్పింది..
మలికిపురం : దేశ చమురు సంస్థల చరిత్రలోనే నెత్తుటి ఘట్టంగా.. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో 20 మందిని పైగా బలిగొన్న గెయిల్ పైపులైన్ విస్ఫోటపు గురుతులు ఇంకా జిల్లాను ఉలికిపాటుకు గురి చేస్తూనే ఉన్నాయి. కలుగుల్లోని పాముల్లా.. పచ్చని కోనసీమ కడుపులా దాగిన చమురు, సహజవాయు పైపులైన్లు ఇంకెక్కడ, ఇంకెంత ఉత్పాతాన్ని సృష్టిస్తాయోనన్న భయం.. నగరంలో గత 27 వేకువన అభాగ్యులను తరిమిన అగ్నికీలల్లా.. ఆ సీమవాసులను వెన్నాడుతూనే ఉంది. అయినా.. మృత్యువు చేసిన పెనుహెచ్చరికలాంటి ఆ దుర్ఘటన నుంచి చమురు సంస్థలు పాఠాలు నేర్చుకోలేదు. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఓఎన్జీసీకి చెందిన గ్రూప్ గేదరింగ్ స్టేషన్ (జీజీఎస్) ప్రహరీకి చేర్చి ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సోమవారం పేలి, మంటలు చెలరేగాయి. అయితే.. అదృష్టవశాత్తు మహావిపత్తు తప్పింది. జీజీఎస్‌కు చమురును తీసుకువెళ్లే పైపులైన్ల చుట్టూ మంటలు వ్యాపించినా, జీజీఎస్‌లో లక్షలాది లీటర్ల ముడిచమురుతో నిండిన భారీ ట్యాంకుకు చేరువలోనే ఈ దుర్ఘటన జరిగినా ..ఎలాంటి ముప్పూ లేకుండానే ప్రమాదం సమసిపోయింది. ఒక పీచు ఫ్యాక్టరీకి చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ జీజీఎస్ ప్రహరీకి చేర్చి ఉంది. సోమవారం ఉదయం విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగి ట్రాన్స్ ఫార్మర్పై పడ్డాయి. దాంతో అది పేలి మంటలు మరింత విజృంభించాయి. పక్కనే ఉన్న పీచు ఫ్యాక్టరీలోని పీచూ తగలబడింది. అన్నింటికీ మించి.. జీజీఎస్‌కు ముడిచమురును తీసుకు వెళ్లే పైపులైన్ల చుట్టూ పోగుపడ్డ చెత్త, ఎండుగడ్డి అంటుకోవడంతో అవి కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఈ పైపు లైన్లు అటు బావులకు, ఇటు చమురు నిల్వ చేసే ట్యాంకులకు అనుసంధానమై ఉంటాయి. అయితే పైపులైన్ల చుట్టూ వ్యాపించిన మంటలు, ఎలాంటి ఉత్పాతం జరగక ముందే ఆరిపోయాయి. ఈలోగా స్థానికులు ప్రాణాలు అరచేత పెట్టుకున్నట్టు బిక్కుబిక్కుమన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, పైపులైన్లు పేలి, నగరం దారుణం లాంటిది జరుగుతుందో లేక మంటలు ముడిచమురు నిల్వ ఉన్న ట్యాంకులకూ సోకి అంతకు ఎన్నోరెట్ల ఘోరం సంభవిస్తుందోనని నిలువునా వణికిపోయారు. అలాంటివేమీ జరగకుండానే ప్రమాదం సమసిపోవడంతో ‘బతుకుజీవుడా’ అని ఊపిరి పీల్చుకున్నారు. కాగా తాటిపాక, నర్సాపురంల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేయడానికి కృషి చేశాయి. కాగా ఈ ప్రమాదంపై జీజీఎస్ సైట్ ఇన్చార్జి బిపిన్ ప్రసాద్ మాట్లాడుతూ అక్కడ పీచు ఫ్యాక్టరీ వద్దని తాము అభ్యంతరం చెప్పినా వినకుండా ఏర్పాటు చేశారన్నారు. నిబంధనలకు నిప్పు.. పొంచి ఉన్న ముప్పు ఓఎన్జీసీ తూర్పుపాలెంలో జీజీఎస్ ఏర్పాటు చేసి సుమారు 25 ఏళ్లు కావస్తోంది. నిబంధనల ప్రకారం దీని పరిసరాల్లో విద్యుత్ వాహకాలు, తేలికగా మండే స్వభావం గల పీచు వంటి వాటితో ఏర్పాటయ్యే ఎలాంటి సంస్థలూ ఉండ కూడదు. అంతవరకూ.. ఎందుకు ఎక్కడ షార్ట్సర్క్యూట్లు అవుతాయోనన్న జంకుతో ఓఎన్జీసీ తన సైట్లలో ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్‌ను కూడా వినియోగించదు. విద్యుత్ అవసరాల కోసం ఆయిల్ జనరేటర్లనే వాడుతుంది. అయితే తూర్పుపాలెం జీజీఎస్‌కు చేర్చి, ఏకంగా విద్యుత్ సబ్స్టేషనే ఉంది. దానికి తోడు చిన్నపాటి నిప్పురవ్వలకు సైతం మంటలు రగులుకునే పీచు ఫ్యాక్టరీ కూడా పక్కనే ఉంది. సుమారు 40 ఎకరాల్లో విస్తరించిన జీజీఎస్‌కు.. సమీపంలోని దాదాపు 30 బావుల నుంచి ఆయిల్, గ్యాస్ పైపులైన్లు అనుసంధానమై ఉంటాయి. ఇక్కడి భారీ ఆయిల్ ట్యాంకుల నుంచి ప్రతి రోజూ 30 ట్యాంకర్లకు పైగా చమురును రిఫైనరీకి తరలిస్తారు. మారణహోమం సృష్టించిన నగరం దుర్ఘటన నుంచి, అలాంటిదేమీ లేకుండా కరుణించి, విడిచిపెట్టినా.. విలయం పొంచి ఉందన్న హెచ్చరికలా మిగిలిన తూర్పుపాలెం ఘటన నుంచీ చమురు సంస్థలు తక్షణం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడి సిరిని తరలించుకుపోవడానికే కాక.. ఎంత సిరి పెట్టినా కొనలేని ప్రాణాలకు రక్షణ కల్పించడానికీ నడుం బిగించాలి. లాభాపేక్షే కాక జనక్షేమం పట్ల కూడా తమకు నిబద్ధత ఉందని నిరూపించుకోవాలి. ప్రతి పనినీ, ప్రతి కార్యస్థానాన్నీ నూరుశాతం నిబంధనలకు అనువుగా నిర్వహించాలి.