Manmadhudu 2
-
ఆ ఆశ ఉంది కానీ..!
చిత్రం విచిత్రం అన్నట్టుగా సినిమా రంగం కూడా విచిత్రమే. ఇక్కడ రాత్రికి రాత్రే అందలం ఎక్కేవారూ ఉంటారు. సుధీర్ఘకాలంగా విజయం కోసం పోరాడుతున్న వారూ ఉన్నారు. ఎవరు? ఎలా? ఎప్పుడు విజయబాట పడతారో ఎవరికీ తెలియదు. నటి రకుల్ ప్రీత్ సింగ్ నట జీవితం అంతే. ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో, టాలీవుడ్లో తను ఏం మారిందని సక్సెస్ అయ్యిందో తనకే తెలిసుండదు. వచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, డిమాండ్ అండ్ సప్లై అన్న సామెత మాదిరి పారితోషికాన్ని పెంచుకుని చకచకా ఒక డజను చిత్రాలకు పైగా నటించేసింది. అంతే అక్కడ వరుస ఫ్లాప్‌లతో అవకాశాలు ముఖం చాటేశాయి. అలాంటి నటినిప్పుడు కోలీవుడ్ ఆదుకుంటోంది. ఇక్కడ ఒకే ఒక్క హిట్‌ను చవి చూసింది. అయినా శివకార్తికేయన్‌తో ఒక చిత్రం, తాజాగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఒక చిత్రంలోనూ నటిస్తోంది. దీంతో ఇటీవల కాస్త హడావుడి తగ్గించిన రకుల్‌ప్రీత్‌సింగ్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో కనిపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ బ్యూటీ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికలను, భావాలనూ బయటపెట్టింది. నాకు కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లో నటించడం ఇష్టం. అలాగని అలాంటి అవకాశాలు వచ్చే వరకూ కమర్శియల్ కథా చిత్రాల్లో నటించడానికి నిరాకరించను. అదే విధంగా కథానాయకికి ప్రాధాన్యత అంటే కథ అంతా ఆ పాత్ర చుట్టూనే తిరగాలని అర్థం కాదు. నేను ఇంతకు ముందు నటించిన చిత్రాల్లో కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉంది. అలాంటి చిత్రాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న నమ్మకంతో నిర్మాతలు చిత్రాలు చేశారు. నిర్మాతలకు లాభం వస్తేనే వారు మళ్లీ చిత్రాలు చేయగలరు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు అవార్డు కోసం నిర్మించే కథా చిత్రాలు కమర్శియల్ అంశాలతో కూడి ఉండాలని భావిస్తున్నారు. నాకు అవార్డులు పొందాలన్న కోరిక ఉంది. అయితే అలాంటి చిత్రాల్లో ఇప్పుడే నటించాల్సిన అవసరం లేదు. నా సినీ జీవితం ఇంకా చాలా కాలం కొనసాగుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి సమయం వచ్చినప్పుడు అవార్డు కథా చిత్రాల్లో నటిస్తాను. ప్రస్తుతం నేను సినిమాలో కొనసాగడమే ముఖ్యం అని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. అయితే ఇప్పటి వరకూ అందాలను నమ్ముకునే నటించిన ఈ అమ్మడికి ఇప్పుడు అవార్డులు సాధించాలనే ఆశ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కాని విషయం. -
కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా
‘‘ఒకసారి సక్సెస్ అయిన తర్వాత దాన్నే పట్టుకొని ఎక్కువ సమయం గడపాలనుకోను. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలను ప్రయత్నించాలి. ఈ ఆలోచనే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నాన్నగారికి(అక్కినేని నాగేశ్వరరావు) అంత లాంగ్ కెరీర్, విభిన్నమైన పాత్రలు వచ్చాయంటే కారణం ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుండటమే. ఆయన చేసిన సినిమాలు గమనిస్తే న్యూ ఏజ్ సినిమాలే ఎక్కువగా ఉంటాయి. కొత్తగా ప్రయత్నించడాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను’’ అని నాగార్జున అన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ –‘‘నాలోని కొత్తదనం కోసం ‘మన్మథుడు 2’ సినిమా తీశాను. ఇండస్ట్రీలో డివైడ్ టాక్ ఉందంటున్నారు. ప్రేక్షకుల్లో మాత్రం సినిమా గురించి పాజిటివ్ టాక్ నడుస్తోంది. మౌత్ టాక్ బాగుంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజంగా మా సినిమా ఆడియన్స్‌కు నచ్చకపోతే కలెక్షన్స్ రావు. నా కెరీర్లో మంచి విజయాలు సాధించిన ‘గీతాంజలి, అన్నమయ్య, నిర్ణయం, మన్మథుడు’ సినిమాలు రిలీజ్ తర్వాత కాస్త నెమ్మదిగా పుంజుకున్నాయి. ఈ చిత్రం కూడా అలానే ఉండొచ్చు. అలాగని ఆ సినిమాలతో ‘మన్మథుడు 2’ కి పోలిక లేదు. ‘మన్మథుడు 2’ మంచి న్యూ ఏజ్ మూవీ అంటూ ఫోన్లు చేస్తున్నారు. రొమాన్స్ సన్నివేశాలు మరీ ఇబ్బందికరంగా లేవు. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ప్రేక్షకులు మెచ్చే రొమాంటిక్ సినిమాలు చేయడం ఆసక్తి. ‘మన్మథుడు’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల టైటిల్స్‌ను ఉపయోగించడం వల్ల ప్లస్లతో పాటు మైనస్లూ ఉంటాయి. ‘బిగ్‌బాస్ 3’ కొత్త అనుభూతి. తెలుగు సినిమాలకు (మహానటి, రంగస్థలం, అ!, చి!ల!సౌ’) ఏడు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా సినిమా చూసి నవ్వుతూ, చప్పట్లు కొడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సైలెంట్‌గా క్లైమాక్స్‌ను చూసి థియేటర్స్ నుంచి నవ్వుతూ బయటకు వస్తున్నారు’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘సినిమాకు తొలిరోజు మిక్డ్స్ టాక్ వచ్చినా థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు పి. కిరణ్. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, రచయిత–నటుడు కిట్టు, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ మాట్లాడారు. -
హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..
సినిమా: మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తోంది అంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. అందాలారబోత కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సై అనే ఈ అమ్మడికి ఇంతకు ముందు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు తగ్గిందని చెప్పక తప్పుదు. ఎందుకుంటే అమ్మడికిప్పుడు అవకాశాలు పెద్దగా లేవు. తెలుగులో చేసిన మన్మథుడు 2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రంలో అమ్మడి నటన గురించే చర్చ అంతా. నాగార్జునకు జంటగా నటించిన మన్మథుడు 2లో రకుల్‌ప్రీత్‌సింగ్ నటించింది. ఇందులో ఈ జాణ సిగరెట్ కాల్చే సన్నివేశం చేసింది. ఆ ఫొటోలు బయటకు రావడంతో నటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ విషయమై రకుల్‌ప్రీత్‌సింగ్ ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా ఆమెపై విమర్శల పర్వం కొనసాగడంతో చిరెత్తుకొచ్చినట్లుంది. అంతే ఎదురు దాడికి దిగింది. ఇంతకీ ఈ అమ్మడు ఏం అంటుందో చూద్దాం. ‘అవును నేను సిగరెట్ తాగే సన్నివేశంలో నటించాను.అయితే ఉంటీ? చిత్రాల్లో హీరోలు సిగరెట్లు తాగితే ఎవరూ ఏమీ అనడం లేదు. ఒక నటి సిగరెట్ తాగితే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటివన్నీ విశాల దృక్పథంతో చూడాలి. అయినా కథా పాత్రకు అవసరం అవ్వడంతోనే నేనలా నటించాను. మరో విషయం ఏమిటంటే మనం అనుకుంటున్న దానికంటే నిజ జీవితంలో సమాజంలో ఇంకా దారుణంగా జరుగుతున్నాయి. సినిమాల్లో చూసే సన్నివేశాలు వాటి కంటే ఎంతే బెటర్. సినిమాల వల్ల సమాజం పాడైపోతోందనే వారిని చూస్తుంటే పాపం అనిపిస్తోంది’ అని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. మొత్తం మీద సినిమాకు ముందే ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీతో భాగానే వార్తల్లో నానుతోంది. అయితే కొత్త అవకాశాలే రావడం లేదు. తెలుగులోనే కాదు తమిళంలోనూ అమ్మడికి అంతకంటే దారణంగా ఉంది. ఇక్కడ హిట్ చూసి చాలా కాలమే అయ్యింది. తాజాగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ముగ్గురు భామల్లో ఒకరిగా నటించే అవకాశం వరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా వెల్లడికాలేదు. ఇక తెలుగులో మన్మథుడు 2 చిత్రం విజయంపై రకుల్‌ప్రీత్‌సింగ్ జాతకం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. -
‘మన్మథుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్ : మన్మథుడు 2 జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్ సంగీతం : చైతన్ భరద్వాజ దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్ నిర్మాత : నాగార్జున, పి. కిరణ్ వయసు పెరుగుతున్న కొద్ది మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్ నాగార్జున. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే కింగ్, తాజాగా ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీని తెలుగులో రీమేక్ చేశాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు నాగ్. మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? రాహుల్ దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడా..? కథ : సామ్ అలియాస్ సాంబశివ రావు (నాగార్జున అక్కినేని) పోర్చుగల్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. తను ప్రేమించిన అమ్మాయి దూరం కావటంతో ప్రేమంటేనే అబద్ధమని కేవలం తన ఆనందం కోసం మాత్రమే బతకాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి చేసుకోవాలని విసిగిస్తున్నారని కుటుంబానికి కూడా దూరంగా ఉంటుంటాడు. వయసు మీద పడటంతో సామ్ తల్లి (లక్ష్మీ).. కొడుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. కుటుంబమంతా కలిసి మూడు నెలలో పెళ్లి చేయాలని తీర్మానం చేస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయిని తన ప్రియురాలిగా కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. సరిగ్గా పెళ్లి రోజున చెప్పకుండా వెళ్లిపోవాలని అవంతికతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. తన సమస్యల కారణంగా అవంతిక కూడా అగ్రిమెంట్‌కు అంగీకరిస్తుంది. అలా ఇంటికి వచ్చిన అవంతిక, సామ్ కుటుంబ సభ్యులకు దగ్గరవుతుంది. మరి అవంతిక అగ్రిమెంట్ ప్రకారం సామ్ ఫ్యామిలీని వదిలి వెళ్లిపోయిందా..? ప్లేబాయ్ లా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సామ్ మారాడా.. లేదా? అన్నదే మిగతా కథ. నటీనటులు : తన వయసును అంగీకరిస్తూ చేసిన సామ్ పాత్రలో నాగ్ సూపర్బ్ అనిపించాడు. లవర్ బాయ్‌లా కనిపిస్తూనే తన ఏజ్‌ను కూడా గుర్తు చేశాడు. తన మార్క్ రొమాంటిక్ సీన్స్‌లో వావ్ అనిపించిన నాగ్, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడిపెట్టించాడు. ఇప్పటికీ తాను మన్మథుడినే అంటూ ప్రూవ్ చేసుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. ఇండిపెండెంట్ అమ్మాయిగా కనిపిస్తూనే ప్రేమ, బాధ, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించింది. వెన్నెల కిశోర్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టాడు. సినిమా అంతా హీరో వెంటే కనిపించే పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన రావూ రమేష్ తన మార్క్ చూపించాడు. ఇతర పాత్రలో లక్ష్మీ, ఝూన్సీ, దేవ దర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేష్, సమంతలు తళుక్కుమన్నారు. విశ్లేషణ : ‘చిలసౌ’ సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ రెండో సినిమానే మన్మథుడు 2 లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ సాధించాడు. అక్కినేని అభిమానులు నాగార్జునను ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించాడు రాహుల్. నాగార్జున లోని కామెడీ యాంగిల్‌ను చాలా బాగా ఎలివేట్ చేశాడు. అక్కడక్కడ మసాలా డైలాగ్స్ కాస్త శ్రుతిమించినట్టుగా అనిపించినా కథలో భాగంగా ఓకే అనిపిస్తాయి. భారీ ఎమోషనల్ సీన్స్, పిండేసే సెంటిమెంట్స్ లేకుండా సినిమా అంతా ఓ ఫన్ రైడ్‌లో నడిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగానే వర్క్ అవుట్ అయినా కొన్ని బోరింగ్ సీన్స్ ఇబ్బంది పెడతాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్ప్లస్ పాయింట్. నాగ్‌ను మన్మథుడిలా చూపించిన ఎమ్ సుకుమార్.. పోర్చుగల్ అందాలను అద్భుతంగా కెమెరాల్లో బందించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగార్జున కామెడీ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
డబుల్ మీనింగ్ కాదు.. సింగిల్ మీనింగ్‌లోనే రాశాను
‘‘నేను నటుడిగా చేసినప్పుడు దర్శకుడు ఏది చెబితే అది చేసేవాడిని. దర్శకుడిగా మారాక నాలో మానసిక ఆందోళన పెరిగింది. తర్వాతి రోజు షూటింగ్ ఉందంటే నాకు నిద్రపట్టదు. దర్శకుడిగా నేను నిద్రపోవడం నేర్చుకోవాలి’’ అన్నారు నటుడు–దర్శకుడు రాహుల్ రవీంద్రన్. నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ చెప్పిన విశేషాలు. ► నాలుగు తరాలుగా పోర్చుగల్‌లో నివాసం ఉంటున్న ఓ తెలుగు కుటుంబానికి చెందిన కథ ఇది. ఇందులో నాగార్జునగారి క్యారెక్టర్‌కు డబుల్ లైఫ్ ఉంటుంది. అమ్మాయిలపై గౌరవం ఉంటుంది. కానీ కొన్ని సంఘటనల వల్ల వారితో ఎమోషనల్ ఎటాచ్‌మెంట్‌ను ఇష్టపడరు. నా సెకండ్ సినిమాకే నాగార్జున వంటి స్టార్ హీరోతో చేయడం లక్కీ అనిపించింది. ► మా సినిమాలో కొన్ని డబుల్æమీనింగ్ డైలాగ్స్ ఉన్నాయంటున్నారు. కానీ నేను వాటిని సింగిల్ మీనింగ్‌లోనే రాశాను. అవి నాటీగా ఉంటాయి కానీ ఇబ్బందిగా ఉండవు. హై రొమాంటిక్ సీన్‌తో టిక్కెట్లు అమ్మాలని ఒక్క షాట్ కూడా తీయలేదు. ‘పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్‌కు దిగుతావా?’ అని రావు రమేష్‌గారు ట్రైలర్లో చెప్పిన డైలాగ్ కూడా చాలా నార్మల్‌గా రాసిందే. హీరో వయసు గురించి పంచ్ వేద్దామని రాసిన డైలాగ్ అది. ఓ సీన్‌ని డెవలప్ చేస్తున్నప్పుడు సమంత అతిథి పాత్రలో అయితే బాగుంటుందనిపించింది. నాగార్జునగారు కూడా అదే అన్నారు. ► యాక్టర్‌గా నార్మల్ సినిమాల్లో నటించను. నా దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినిమా చేయబోతున్నాడనే వార్తల్లో నిజం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. చిన్మయి (రాహుల్ భార్య) నాకు మంచి ఎమోషనల్ సపోర్టింగ్ సిస్టమ్. తన సపోర్ట్ లేకుండా నేను లేను. సంగీతమే ఆమె ప్రపంచం. సోషల్ మీడియాలో చిన్మయి ప్రస్తావించిన అంశాలు కొందరికి అర్థం కానప్పుడు స్పందిస్తాను. ప్రతి విషయానికీ స్పందించను. -
నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్
‘‘ఇతర భాషల్లో నా మార్కెట్‌ను పెంచుకోవాలనే ఆలోచన నాకూ ఉంది. కానీ నాకు ద్విభాషా చిత్రాలు కలిసి రాలేదు. నా కెరీర్లో నాలుగు ద్విభాషా చిత్రాలు చేశాను. సరైన ప్రేక్షకాదరణ లభించలేదు. ఈ విషయంలో నా పాఠాలు నేను నేర్చుకున్నాను. గీతాంజలి, శివ చిత్రాలను డబ్ చేశాం. బైలింగ్వల్‌గా తీయలేదు. ‘బాహుబలి’ కూడా తెలుగులోనే తీశారు. ఆ తర్వాత మిగతా భాషల్లోకి డబ్ చేసినా, మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అందరూ అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు’’ అని నాగార్జున అన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటించారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు. ► ‘మన్మథుడు 2’ని చాలా కష్టపడి చేశాం. మేం పడిన కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించాలని కోరుకుంటున్నాను. అమ్మ, ముగ్గురు చెల్లెళ్లు, ఓ అమ్మాయి వల్ల బ్యాచిలర్ అయిన ఓ మధ్య వయస్కుడి జీవితం ఎలా ప్రభావితం అవుతుందన్నదే సినిమా కథ. ఈ సినిమా రొమాన్స్, ప్రేమ గురించి కాదు. పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. విజయనగరం నుంచి వెళ్లి పోర్చుగల్‌లో సెటిలైన ఓ కుటుంబానికి చెందిన ఫోర్త్ జనరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ కథ ఇది. వీళ్లు ఉండే ప్రాంతం పేరు కసాండ్ర అయితే ఆంధ్రా భోజనాలు, వంటకాలతో అది కాస్తా కసాంధ్రగా మారుతుంది (నవ్వుతూ). ► హీరోకి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ మాటను కాదనలేడు. అలాగని మనస్సాక్షిని వదులుకోలేడు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన హీరోది కాదు. వాళ్ల అమ్మది. అలా తప్పని పరిస్థితుల్లో డబుల్ లైఫ్‌ని లీడ్ చేయాల్సిన పరిస్థితి. ఆ సమయంలో ఓ కుర్ర అమ్మాయి హీరో జీవితంలోకి వస్తుంది? అప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి? అనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ట్రైలర్లో కొన్ని జోక్సే చూపించాం. సినిమా నిండా జోక్స్ ఉన్నాయి. ► రాహుల్ దర్శకత్వంలో వచ్చిన ‘చిలసౌ’ బాగా నచ్చింది. ఫ్రెంచ్ సినిమా బేస్ లైన్ తీసుకుని మన తెలుగు నేటివీటికి తగ్గట్లు మార్చాలని రాహుల్‌తో చెప్పాను. రాహుల్‌కి ఆర్టిస్టులతో పెర్ఫార్మ్ చేయించుకోవడం బాగా తెలుసు. ఏడాది ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చేశాం. అంతా పర్ఫెక్ట్గా జరిగింది. ► సినిమా స్టార్టింగ్‌లో నాకూ, రకుల్‌కు ఏవో విభేదాలు వచ్చాయనే వార్తల్లో నిజం లేదు. రకుల్ మంచి నటి. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా తర్వాత లక్ష్మీగారు నాకు మళ్లీ తల్లిగా ఈ సినిమాలోనే నటించారు. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా సంగీతం నచ్చి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా చేతన్ భరద్వాజ్‌ను ఎంపిక చేశాం. సమంత, కీర్తీ సురేష్లవి ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలు. ► నిర్మాత పి. కిరణ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. ఎప్పట్నుంచో మా కాంబినేషన్లో సినిమా అనుకుంటున్నాం. ఇప్పటికీ కుదిరింది. వయాకామ్వారు కూడా తెలుగులో సినిమాలు చేయాలనుకుంటున్నారు. వారు మా బ్యానర్‌తో అసోసియేట్ అవ్వడం హ్యాపీ. ‘మన్మథుడు 2’ ఆడితే ‘మన్మథుడు 3’ ఉండొచ్చు. ► సెన్సార్ వారు యూఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఏ క్యారెక్టర్ చెప్పిన పదాలను సెన్సార్‌వాళ్లు మ్యూట్ చేశారనేది సినిమాలో చూడండి. సినిమాలోని పాత్రలను బట్టి ఆ డైలాగులు వస్తాయి. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ అంత స్వచ్ఛమైన తెలుగు ఈ సినిమాలోనే వాడాం. ‘మన్మథుడు’తో పోల్చితే ఈ సినిమాలో రొమాన్స్ తక్కువ. అయినా నేటితరం పిల్లలకు ముద్దులు తెలియదు అనుకుంటే మన అమాయకత్వమే. ► కొత్త దర్శకులతో చేస్తే నాలోని కొత్తదనాన్ని వారు వెలికి తీస్తారు. యంగ్ టీమ్‌తో వర్క్ చేయడం నాకు ఫుల్ ఫన్‌గా ఉంటుంది. నా కెరీర్లో గమనిస్తే ఎక్కువగా నేను అప్పటి తరం యంగ్ డైరెక్టర్స్‌తో చేసిన సినిమాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. నా మిగతా సినిమాల్లో కూడా సెకండ్ న్యూ డైరెక్టర్ లేదా బ్రాండ్ న్యూ డైరెక్టర్స్ ఉంటారు. బహుశా... నేను స్టార్‌ని కావడానికి ఇదొక కారణం కావొచ్చు. ► సీరియస్ సినిమాలు నాకు అంతగా నచ్చవు. సినిమాలోని క్యారెక్టర్స్ నవ్వించేలా లేదా స్ఫూర్తి పొందేలా ఉండాలనుకుంటాను. ఒకవేళ మనం ఏడిస్తే సంతోషంగా ఏడ్వాలి. డిప్రెషన్‌తో కాదు. కొన్ని సీరియస్ పాత్రలు చేశాను. వాటిలో కొన్నింటి నుంచి నా తప్పులు నేను తెలుసుకున్నాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. సినిమా సక్సెస్ ఒక్కరిదే కాదు. టీమ్ అందరిదీ. అయితే దురదృష్టవశాత్తు సక్సెస్ క్రెడిట్‌ను హీరో, దర్శకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త కొత్త కథలు వస్తున్నాయి. సీనియర్ హీరోలకు కథల కొరత ఉంది. మంచి కథను పట్టుకోవడం కోసం కష్టపడతాం. ► ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ షోలో లైఫ్ స్టోరీస్ విన్నాను. కానీ బిగ్‌బాస్ షోలో వారానికి వారం మారిపోతున్నారు. డిఫరెంట్‌గా ఉంటున్నారు. షో పాపులారిటీ కూడా పెరిగిపోతోంది. ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకే హౌస్‌లో అయితే నేను ఎక్కువగా ఉండను. ఈ షోకు మంచి వ్యూయర్షిప్ రావడం హ్యాపీ. ఈ ఏడాది నా బర్త్‌డే (ఆగస్టు 29)కి స్పెషల్ ప్లాన్స్ ఏమీ లేవు. నా ఫ్యామిలీతో ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నాను (సరదాగా). వాళ్లతో కొంచెం టైమ్ గడపాలని ఉంది. ధనుష్‌తో నేను చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయింది. బాలీవుడ్లో నేను చేస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా మంచి ఎగై్జటింగ్ ప్రాజెక్ట్. నా వంతు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. బాగా గ్రాఫిక్స్ ఉన్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ స్టార్ట్ చేయాల్సి ఉంది. -
ఆ వార్తపై రకుల్ ప్రీత్ అసహనం
‘నేను ధూమపానం, మద్యపానం చేయను. కేవలం అవి అవంతిక(మన్మథుడు 2లో తన పాత్ర) అలవాట్లు! ఇది నటనలో భాగం. అవి రెండు ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. అటువంటి అలవాట్లను మన్మథుడు 2 ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. నా ఇంటర్వ్యూలో ఉన్న అసలు విషయాన్ని వదిలేసి వేరే విషయాలు ఎందుకు రాస్తారో నాకు అస్సలు అర్థం కాదు’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఇంటర్వ్యూలో కొంతభాగాన్ని హైలెట్ చేస్తున్నారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక క్లిప్పింగ్‌ను ట్విటర్లో చేశారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రకుల్.. అవంతిక అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రకుల్ పోషించిన అవంతిక పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన టీజర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సిగరెట్ కాలుస్తూ బోల్డ్ డైలాగ్స్ చెప్పిన రకుల్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో తాజాగా రకుల్ మాట్లాడుతూ...‘ సినిమాను సినిమాలా చూసే ఆలోచనా ధోరణి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘మన్మథుడు 2’ సినిమాలో సిగరెట్ కాల్చింది నేను కాదు.. అవంతిక (ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరు). సిగరెట్ కాల్చడం అవంతికకు ఉన్న అలవాటు. సినిమాలో కూడా ఇవి రెండు మూడు షాట్స్ మాత్రమే ఉంటాయి. నా నిజ జీవితంలో నేను సిగరెట్ కాల్చను. అయినా హీరోలు కాల్చితే ఏ ప్రాబ్లమూ ఉండదు. అదే సినిమాలో హీరోయిన్ సిగరెట్ కాల్చితే అదో పెద్ద టాపిక్. సినిమాలో ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే క్యాషన్ కూడా వేస్తుంటాం కదా’’ అని పేర్కొన్నారు. అదే విధంగా సినిమాలో తన క్యారెక్టర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో...‘ సిగరెట్ కాల్చడం చాలా సాధారణ విషయం. మనం రోడ్డు మీద వెళ్తున్నపుడు కొంతమంది ఇలాంటి పనులు చేస్తే అస్సలు పట్టించుకోము. అదే తెరపై నటులు చేస్తే మాత్రం తప్పుగా చూస్తాం’ అని రకుల్ అన్నట్లుగా సదరు పత్రిక రాయడంతో ట్విటర్ వేదికగా ఆమె అసహనం వ్యక్తం చేశారు. -
సినిమా కోసమే కాల్చాను!
సినిమా ఇండస్ట్రీ మారుతోంది. విభిన్నమైన సినిమాలు వస్తున్నాయి. సినిమాను సినిమాలా చూసే ఆలోచనాధోరణి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘మన్మథుడు 2’ సినిమాలో సిగరెట్ కాల్చింది నేను కాదు.. అవంతిక (ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరు). సిగరెట్ కాల్చడం అవంతికకు ఉన్న అలవాటు. సినిమాలో కూడా ఇవి రెండు మూడు షాట్స్ మాత్రమే ఉంటాయి. నా నిజజీవితంలో నేను సిగరెట్ కాల్చను. అయినా హీరోలు కాల్చితే ఏ ప్రాబ్లమూ ఉండదు. అదే సినిమాలో హీరోయిన్ సిగరెట్ కాల్చితే అదో పెద్ద టాపిక్. సినిమాలో ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే క్యాషన్ కూడా వేస్తుంటాం కదా’’ అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్ చెప్పిన విశేషాలు. ► అల్లరి, చిలిపితనం, కోపం, బాధ ఇలా అన్నిరకాల భావోద్వేగాలతో నేను చేసిన అవంతిక పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర. అవంతికకు కొన్ని పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆడియన్స్‌కు తను తప్పకుండా నచ్చుతుంది. ► నాగార్జున సార్ మంచి కో–స్టార్. హీరోయిజమ్ అని కాకుండా కథలోని హీరో పాత్రకు తగ్గట్లు నటించారు. ఓ పాట చిత్రీకరణ కోసం మేం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు నాకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ వద్దు.. యూనిట్ మెంబర్స్‌కు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో నాకూ అలాగే ఏర్పాటు చేయండి అన్నారు. అందుకే ఆయన కింగ్ అనిపించింది. లక్ష్మీగారు, ‘వెన్నెల’ కిశోర్ ఇలా అందరి పాత్రలు కథలో భాగంగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. హ్యాపీ హ్యాపీగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాను. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనిపించింది. ► రాహుల్ రవీంద్రన్ నాకు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా నుంచే తెలుసు. చాలా ప్రతిభ ఉన్న రైటర్. యాక్టర్ కూడా. రాహుల్‌ను నేను బడే భయ్యా అని పిలుస్తాను. సెట్లో ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్‌తోనే ఉంటాడు. బౌండ్ స్క్రిప్ట్ ముందే ఇవ్వడం వల్ల ఏ టెన్షన్ లేకుండా షూటింగ్ చేయగలిగాను. రాహుల్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిలసౌ’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా. కానీ ‘చిలసౌ’ లోని అంజలి పాత్రకు ‘మన్మథుడు 2’ లోని అవంతిక పాత్రకు పోలిక పెట్టలేం. ► నేను హిందీలో చేసిన ‘దేదే ప్యార్ దే’ సినిమాకు, ‘మన్మథుడు 2’ చిత్రకథకు సంబంధం లేదు. ఉన్న కామన్ పాయింట్ ఒకటే... అతని కన్నా కాస్త తక్కువ వయసున్న అమ్మాయి హీరో లైఫ్‌లోకి వస్తుంది. ‘దేదే ప్యార్ దే’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారన్న వార్త నేను విన్నాను. అయితే రీమేక్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అయినా చేసిన పాత్రనే మళ్లీ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. సేమ్ రోల్ అయితే ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతారు. నాకు పెద్ద కిక్ ఉండదు. ► సినిమాలో అవంతిక పాత్రకు వివాహం జరుగుతుందా? లేక లివింగ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్‌ను ప్రస్తావించామా? అనే అంశాలను ఇప్పుడు చెప్పలేను. సినిమా చూసి ఆడియన్స్ తెలుసుకోవాల్సిందే. ఇక లివింగ్ రిలేషన్షిప్ గురించి నా అభిప్రాయం చెప్పడానికి నేను ఏ రిలేషన్‌లోనూ లేను (నవ్వుతూ). పెళ్లి విధానంపై నాకు మంచి నమ్మకం ఉంది. ► నాగార్జునగారి ‘మన్మథుడు’ (2002) సినిమా చూశాను. ‘మన్మథుడు 2’ ఓ ఫ్రెంచ్ సినిమాకు తెలుగు రీమేక్. అయితే ఆ ఫ్రెంచ్ సినిమాను నేను చూడలేదు. ఒకవేళ చూస్తే మనకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో ఆ సినిమాలోని హీరోయిన్లా చేయడానికి ట్రై చేస్తానేమో అని డౌట్. ► ‘దే దే ప్యార్ దే’లో అజయ్ దేవగన్, ‘మన్మథుడు 2’లో నాగార్జునగారు ఇలా సీనియర్ యాక్టర్స్తోనే నేను సినిమాలు చేస్తున్నాను కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో క్రిమినల్ లాయర్‌గా చేస్తున్నాను. ‘ఇండియన్ 2’ లో సిద్ధార్థ్ సరసన నటిస్తున్నాను. సినిమా కథ, అందులోని నా పాత్రే ఇంపార్టెంట్ నాకు. ఏవేవో ఆలోచించి మంచి పాత్రలను వదులుకోవాలనుకోను. హిందీలో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్ చేస్తాను. -
'మన్మథుడు 2' ప్రీ రిలీజ్ వేడుక
-
ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు
‘‘నాకు వయసు గురించి మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు.. ఇప్పుడు నేను ఓ ప్రేమకథ చేయడం ఏంటని చాలామంది అడిగారు. ఏడాది క్రితం ఓ ఫ్రెంచ్ సినిమా చూపించారు. నిజంగా ఇప్పుడు నా వయసుకు తగ్గ సినిమా, నాకు బాగా సరిపోతుందనిపించింది. ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు.. రొమాన్స్ చేయొచ్చని చూపించే సినిమా ఇది. ఏ వయసులోనైనా ముద్దు పెట్టుకోవచ్చు కూడా.. నో ప్రాబ్లమ్.. అలా ‘మన్మథుడు 2’ మొదలైంది. నాకు ఇద్దరు పిల్లలున్నారు అంటున్నారు. కానీ, వాళ్లు నాకు బ్రదర్స్.. నో సన్స్’’ అని నాగార్జున అన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ‘మన్మథుడు 2 డైరీస్’ పేరుతో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాకు చాలా ఇష్టమైన నెల ఈ ఆగస్టు. మొన్ననే ‘బిగ్‌బాస్ 3’ స్టార్ట్ అయింది. 9న ‘మన్మథుడు 2’ విడుదలవుతోంది. ఈ నెలాఖరుకు నాకు 30ఏళ్లు నిండుతాయి(నవ్వుతూ). ముప్పై ఏళ్లే కదా! ఈ సినిమాకి ‘మన్మథుడు 2’ టైటిల్ ఎందుకు పెట్టామంటే.. ఒరిజినల్ ‘మన్మథుడు’.. హి హేట్స్ ఉమన్.. మరి ఆ సర్కిల్‌ని పూర్తి చేయాలి కదా.. హి లవ్స్ ఉమెన్ ‘మన్మథుడు 2’.. అందుకే పెట్టాం. ‘మన్మథుడు’ నాకు, మీకు ఎంతో ఇష్టమైన సినిమా. దాని అసలైన సృష్టికర్త విజయ్భాస్కర్గారు ఇక్కడే ఉన్నారు. ‘మన్మథుడు 2’ ఫంక్షన్‌కి రమ్మని ఆయనకి ఫోన్ చేసినప్పుడు భార్యతో కలిసి బ్యాంకాక్‌లో ఉన్నట్టున్నారు.. వస్తున్నానని చెబుతూనే, ‘మన్మథుడు 2’ టీజర్ చూశా.. చాలా వేడివేడిగా ఉందన్నారు. ఇక్కడికొచ్చినందుకు దేవిశ్రీకి థ్యాంక్స్. నన్ను అందంగా చూపించినందుకు సుకుమార్‌కి థ్యాంక్స్. రకుల్‌తో పనిచేయడం చాలా సులభం.. తనలో చాలా ప్రతిభ ఉంది.. బాగా కష్టపడుతుంది. ఆరోగ్యం గురించి తనవద్ద చాలా నేర్చుకోవచ్చు. రాహుల్ అద్భుతమైన దర్శకుడు.. నేను మీకు ఈరోజు మాట ఇస్తున్నా. సినిమా మొదలైనప్పటి నుంచి లాస్ట్ వరకూ పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంటారు.. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి ‘మన్మథుడు’ లా నవ్వుకుని వెళ్లొచ్చు.. ఇందుకు నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఈ వేసవికి మా పెద్దబ్బాయి (నాగచైతన్య) ‘మజిలీ’ సినిమాతో మీ ముందుకొచ్చాడు. మొన్న ‘ఓ బేబీ’ అంటూ నా కోడలు (సమంత) వచ్చింది. ఆగస్టు 9న ఆ రెండూ ఔట్... నేను వస్తున్నా (నవ్వుతూ)’’ అన్నారు. డైరెక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘మన్మథుడు’ నాకు మరచిపోలేని అనుభూతినిచ్చింది. అన్నపూర్ణలో పనిచేయాలంటే అదృష్టం ఉండాలి. ‘మన్మథుడు’ వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ ఆ సినిమా ఫ్రెష్ లవ్‌స్టోరీగానే అనిపిస్తోంది ’’ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిజంగా చెప్పాలంటే ఈ మధ్య నాన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందేమో అందరూ మీరు బ్రదర్స్‌లా ఉన్నారని కామెంట్ చేసేవాళ్లు. సరే బ్రదర్సే కదా లుక్స్‌తో ఏదో మేనేజ్ చేయొచ్చులే అనిపించింది. కానీ, ఇప్పుడు కథలు కూడా అలాంటివే ఎంచుకుంటున్నారు నాన్న. ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీ కెరీర్లో ఒక ప్రేమకథని ఫ్రెష్‌గా చూపిస్తున్నారంటే రియల్లీ అమేజింగ్. మాకు ఒక్క హిట్ వస్తే అదే జోనర్లో మరో రెండు సినిమాలు సేఫ్‌గా చేద్దామనుకుంటాం.. ఫ్లాప్ వచ్చిందంటే ఇంకొంచెం జాగ్రత్తగా కథలు ఎంచుకోవాలనుకుంటాం. కానీ, నాన్నగారు అలాకాదు.. హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ప్రతి అడుగు ధైర్యంగా వేస్తారు.. అందుకే ఆయన ‘కింగ్’ అయ్యారు.. అందుకే మాకు ఆయన చాలా స్ఫూర్తి. ‘చి.ల.సౌ’ చూడగానే అన్నపూర్ణలో రాహుల్‌తో ఓ సినిమా చేద్దామని నాన్నకు చెప్పాను.. తనతో త్వరలోనే పనిచేయాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘నాగేశ్వరరావుగారితో, నాగార్జున గారితో, నాగ్ అబ్బాయి నాగచైతన్యతో నటించాను. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఈ మూడు జనరేషన్స్తో పనిచేశా’’ అన్నారు సీనియర్ నటి లక్ష్మి . ‘‘చి.ల.సౌ’ సినిమా విడుదలకు వారం రోజుల ముందు నాగ్‌సార్ ఇంటికి పిలిచారు. ఓ ఫ్రెంచ్ సినిమా చూశా.. రీమేక్ చేద్దామనుకుంటున్నా. నవ్వు కరెక్ట్ అనిపించింది.. నాతో సినిమా చేస్తావా? అనగానే షాక్ అయిపోయా.. చాలా సంతోషంగా ఫీలై చేస్తాను సర్ అన్నాను’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ‘‘తెలుగులో నాకు ఇప్పటి వరకూ అవంతిక లాంటి పాత్ర చేసే అవకాశం రాలేదు. ఇందుకు రాహుల్‌కి థ్యాంక్స్’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. నిర్మాత పి.కిరణ్, కెమెరామేన్ సుకుమార్, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, నటి అమల, హీరో సుశాంత్, నిర్మాత నాగసుశీల, నటీనటులు ఝాన్సీ, దేవదర్శిని, ‘వెన్నెల’ కిశోర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయని చిన్మయి తదితరులు పాల్గొన్నారు. -
సంపూ ట్వీట్.. నవ్వులే నవ్వులు
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం కొబ్బరి మట్ట. రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల చేస్తున్నట్టు సంపూ ప్రకటించారు. ఆగస్ట్ 9న కింగ్ నాగార్జున ‘మన్మథుడు-2’విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్‌లను ట్యాగ్ చేస్తూ సంపూ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మా సినిమా ఆగస్ట్ 10న విడుదల కాబోతుంది. నాగార్జున సర్, రాహుల్ సర్, రకుల్ గారు, వెన్నెల కిశోర్ గార్ల ఆశీర్వాదాలు కావాలి. మీ సినిమా హౌస్‌ఫుల్ అయి, టికెట్లు దొరకక మా సినిమాకు రావాలని కోరుకుంటున్నాము. మీ సంపూర్ణేష్ బాబు’అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెడీగా స్పందిస్తున్నారు. ఇక సంపూ ట్వీట్‌పై దర్శకుడు రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్‌లు తమదైన రీతిలో స్పందించారు. ‘హహహ తథాస్తు సంపూ గారు, ఆల్ ద బెస్ట్’అంటూ రాహుల్ పేర్కొనగా.. ‘ఐదు వేళ్లలాంటి మనకు నాలుగు బ్రష్‌లు అవసరం లేనప్పుడు, మన రెండు సినిమాలకు ఏంటన్నా. లవ్ అండ్ కేరింగ్‌కు లవ్ యూ’అంటూ వెన్నెల కిశోర్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా ఎపుడో విడుదల కావాల్సి ఉన్న ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్‌తో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కున్న అడ్డంకులు తొలగడంతో ఆగస్ట్ 10న విడుదల చేస్తున్నారు. We are releasing on August 10th. Need blessings from King @iamnagarjuna sir, @23_rahulr sir, @Rakulpreet garu and @vennelakishore anna garu. Mee cinema housefulls ayi, tickets dorakka maa cinema ki ravalani korukuntunnanu. Mee Sampoornesh babu#KobbariMattaOnAug10 pic.twitter.com/O8hl8SgrIC — Sampoornesh Babu (@sampoornesh) July 26, 2019 -
కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు
‘అద్భుతం.. అమోఘం.. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు’ అంటూ నాగార్జున డైలాగ్‌తో ‘మన్మథుడు 2’ ట్రైలర్ విడుదలైంది. నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 9న విడుదల కానుంది. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘వయాకామ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి. ఏ సమస్యా లేకుండా సినిమా చాలా స్మూత్‌గా పూర్తయింది. వయాకామ్ ప్రతినిధి అజిత్ మాకు కొండంత ధైర్యం ఇచ్చారు. నిర్మాతలతోపాటు డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరూ సంతోషంగా ఉండాలని ముందు నుంచి ప్రణాళికతో ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. త్వరలో జరగనున్న ‘మన్మథుడు జర్నీ’ ప్రోగ్రామ్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడతాం’’ అన్నారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాగార్జున సమాధానం ఇస్తూ – ‘‘మన్మథుడు’ సినిమా వచ్చి 17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ‘మన్మథుడు 2’ వస్తోంది. ఈ రెండిటిలో ఏది ఎక్కువగా ఎంజాయ్ చేశానంటే చెప్పలేను. విజయ్ భాస్కర్‌గారితో చేసిన ‘మన్మథుడు’ చాలా ఈజీగా, హ్యాపీగా ఎలా సాగిందో ఈ సినిమాకు కూడా అంతే ఎంజాయ్ చేశాం. ఈ చిత్రంలో సమంత నటిస్తుందని రాహుల్ చెప్పేవరకు నాకు తెలియదు. తనతో ‘మనం, రాజుగారి గది 2’ సినిమాలు చేశాను. తను నా కోడలైన తర్వాత మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇది ‘మన్మథుడు’ సీక్వెల్ కాదు. ఆ పాత్రలకు, కథకు ఎక్కడా సంబంధం లేదు. అందులో, ఇందులో నేనే హీరో కాబట్టి టైటిల్ మాత్రం వాడుకున్నాం. ‘అన్‌టచ్‌బుల్స్’ అనే ఫ్రెంచ్ సినిమా హక్కులు కొని ‘ఊపిరి’గా రీమేక్ చేశాం. స్టూడియో కెనాల్లో వారు నిర్మించిన ఓ ఫ్రెంచ్ సినిమా హక్కులు కొని ‘మన్మథుడు 2’ చేశాం. అంతేకానీ, ఎవరి కష్టాన్నో కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు. 90 శాతం వినోదాత్మకంగా ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన్మథుడు 2’. ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు.. అందుకు నాది గ్యారంటీ. ‘బంగార్రాజు’ కథ దాదాపు పూర్తి కావొచ్చింది. కల్యాణ్ కృష్ణ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు. బిగ్ బాస్ చేయడం హ్యాపీ ‘బిగ్ బాస్’ షో చేయడం చాలా బాగుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేస్తున్నప్పుడు బిగుసుకుని కూర్చొని, కొంచెం హుందాగా ప్రవర్తించాల్సి వచ్చేది. కానీ ‘బిగ్ బాస్’ మాత్రం చాలా సరదాగా ఉంది. ఈ షో 15 దేశాల్లో జరుగుతోంది. వివాదాలు అనేవి గాల్లో కూడా పుట్టించొచ్చు. ‘బిగ్ బాస్ 3’ సీజన్‌పై కొందరు వివాదాలు చేశారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ పోలీసులు నిజాయతీగా విచారణ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు ‘మన్మథుడు’ కరెక్ట్ టైటిల్. కానీ, నాగ్ సార్ హీరోగా చేస్తున్నారు కాబట్టి ‘మన్మథుడు 2’ అని పెట్టాం. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే టైటిల్ ఫిక్స్ చేశాం. మూడు తరాలుగా పోర్చుగల్‌లో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబం కథ ఇది. కుటుంబ ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇందులో సమంత అతిథి పాత్ర చేశారు’’ అన్నారు. వయాకామ్ ప్రతినిధి అజిత్ మాట్లాడుతూ– ‘‘హాలీవుడ్ సినిమాలు తీసే మీరు తెలుగు చిత్రాలు చేస్తున్నారేంటి? అని కొందరన్నారు. ఇక్కడ ఎందుకు తీయకూడదు? అనిపించింది. ఈ ఏడాది బాలీవుడ్లో హిట్ అయిన చిత్రం ఓ తెలుగు రీమేకే. మరో తెలుగు సినిమా కూడా త్వరలోనే హిందీలో పెద్ద మూవీగా నిలవబోతోంది. ఇక్కడి ప్రేక్షకులు సినిమా స్టార్స్‌ని, సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే టాలీవుడ్లో అడుగుపెట్టాం. అన్నపూర్ణ సంస్థలో నాగార్జునగారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ బంధం భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. కథ నచ్చితే ఇతర సంస్థలతోనూ కలిసి చేస్తాం’’ అన్నారు. -
మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మథుడు-2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. కామెడీ ఎంటర్టైర్గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకు ప్రేక్షకుల్లో హైప్ క్రియెట్ అవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా హాలీవుడ్ ‘వాట్ వుమెన్ వాంట్’ సినిమాకు రీమెక్ అంటూ రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో నాగార్జున స్పష్టత ఇచ్చాడు. ‘మన్మథుడు-2 ఏ సినిమాకు సీక్వెల్ కాదు. కేవలం 2006లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ (ప్రీట్ మొయి ట మెయిన్)కి రీమెక్. అయితే మన్మథుడు సినిమా నుంచి ప్రధాన పాత్రను తీసుకొన్నామ’ని నాగ్ క్లారిటీ ఇచ్చాడు . అంతేగాక ముందుగానే స్టూడియో కెనాల్ నుంచి రీమెక్ రైట్స్ తీసుకున్నామని తెలిపారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఏజ్ బార్ మన్మథుడి పెళ్లి గోల
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో నాగ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌తో కలిసి నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. -
మన్మథుడు క్రేజ్ మామూలుగా లేదు!
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది. గతంలో సూపర్ హిట్ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడయినట్టుగా తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ 7కోట్లకు పైగా ఆఫర్ చేసి దక్కించుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ 6 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకోగా శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. -
కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు
ఇంట్లో ఏమీ తెలియని అమాయకుడిలా ఉంటూ బయట మాత్రం మన్మథుడి వేషాలు వేసే ఓ అబ్బాయి.. ఇంట్లో పూజలు చేస్తూ బయట సిగరెట్ కాల్చే ఓ అమ్మాయి. ఇలాంటి కొంటె పిల్లాడి జీవితంలోకి వచ్చిన గడసరి అమ్మాయి చేసిన అల్లరి ఏంటి? వీరిద్దరి జీవితాల్లో ప్రేమ చిగురించిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి?... వంటి అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను, రకుల్ పోషించిన అవంతిక పాత్ర టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలోని ‘హే మానియా’ పాటను ఆదివారం విడుదల చేశారు. సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు. -
జూలై 25న ‘మన్మథుడు 2’ ట్రైలర్
నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మన్మథుడు 2’. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, అవంతిక స్పెషల్ టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 9న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘బిగ్‌బాస్’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్!
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత నాగార్జున దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో ఓ ప్రాంక్ వీడియో చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రాహుల్‌ను ఓ రెస్టారెంట్‌కు పంపించి రకరకాల టాస్క్‌లతో ఇబ్బంది పెట్టాడు. ఈ ఆదివారం నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్ రియాలిటీ షోకో హోస్ట్‌గా వ్యవహరించనున్న నాగ్, రాహుల్‌లో రియల్ లైఫ్‌లోనే అలాంటి టాస్క్‌లు చేయించాడు. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్‌లు అతిథి పాత్రల్లో అలరించనున్నారు. వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్, ఝాన్సీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?
‘‘సినిమాలో పాత్ర ఏ విధంగా ఉంటే అలా మేం నటిస్తాం. అంతే కానీ సినిమాలో మేం పోషించే పాత్ర ఏదైనా చెడు చేస్తే దాన్ని మేం ప్రమోట్ చేసినట్టు కాదు. నిజ జీవితంలో మేం వాటిని అనుసరిస్తున్నట్టూ కాదు. ఆ సన్నివేశాలను చూసి నన్ను విమర్శించేవాళ్లను పట్టించుకోను కూడా’’ అన్నారు రకుల్ ప్రీత్ సింగ్. తన లేటెస్ట్ చిత్రం ‘మన్మథుడు 2’ టీజర్లో రకుల్ పొగ తాగుతూ కనిపించారు. ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పలువురు రకుల్‌ని విమర్శించారు. ఈ విషయానికి రకుల్ స్పందించారు. ‘‘నిజజీవితంలో నేను పొగ తాగను. అంతెందుకు నాకు చీట్ డే (వారంలో నచ్చినవన్నీ తినడానికి ప్రత్యేకంగా పెట్టుకునే రోజు) కూడా ఉండదు. నా చుట్టూ ఉండేవాళ్లకు తెలుసు.. నేను ఫిట్నెస్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తానో. ‘కబీర్ సింగ్’లోనూ షాహిద్ సిగిరెట్ తాగాడు. అతను పొగతాగడాన్ని ప్రోత్సహిస్తున్నట్టా? కానే కాదు. సినిమాలో స్మోక్ చేసినంత మాత్రాన అవి మా నిజజీవితంలో చేస్తామని కాదు. సినిమాకు, నిజజీవితానికి తేడాను అర్థం చేసుకోవాలి. విమర్శలకు రియాక్ట్ అయితే ప్రతీది పట్టించుకోవాలి. నాకంత ఆసక్తి లేదు. నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవడం ముఖ్యం’’ అన్నారు రకుల్. నాగార్జున, రకుల్ జంటగా నటించిన ‘మన్మథుడు 2’ ఆగస్ట్ 9న రిలీజ్ కానుంది. -
క్యారెక్టర్ కోసమే స్మోక్ చేశా..
ముంబై : మన్మధుడు 2 టీజర్లో రకుల్ ప్రీత్ సింగ్ విన్యాసాలను చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జునతో ఈ మూవీలో స్ర్కీన్‌ను షేర్ చేసుకుంటున్న రకుల్ హైఎండ్ యాటిట్యూడ్‌తో కనిపించారు. పొగతాగుతూ రకుల్ కనిపించిన సీన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రకుల్‌నే కాకుండా మూవీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్, ఆయన భార్య, గాయని చిన్మయి శ్రీపాదపైనా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. రిలేషన్షిప్లో ఒకరినొకరు కొట్టుకోవడం కామన్ అంటూ కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ వంగా వ్యాఖ్యలను చిన్మయి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. స్మోకింగ్‌ను ప్రోత్సహించేలా తన భర్త తీసిన సినిమాను చిన్మయి ఎలా సమర్ధిస్తారంటూ నెటిజన్లు నిలదీశారు. ట్రోలింగ్‌పై రకుల్ స్పందిస్తూ ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని, కబీర్‌సింగ్‌లో షాహిద్ కపూర్ సిగరెట్లు తాగినట్టే తాను పాత్ర స్వభావానికి అనుగుణంగా స్మోక్ చేశానని ఆమె సమర్ధించుకున్నారు. నిజజీవితంలో షాహిద్ శాకాహారి అని అందరికీ తెలుసునని, రీల్‌లైఫ్..రియల్‌లైఫ్‌కు ముడిపెట్టడం సరికాదని రకుల్ క్లాస్ తీసుకున్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన కథను మాత్రమే తాము చెబుతున్నామని, యువతులంతా ఇలానే ఉంటారని కాదని చెప్పుకొచ్చారు. దీన్ని కేవలం ఒక క్యారెక్టర్‌గానే చూడాలని అన్నారు. -
డబ్బింగ్ కార్యక్రమాల్లో ‘మన్మథుడు 2’
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘మన్మథుడు 2’. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డబ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే అవంతికగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు సంబంధించిన టీజీర్‌ను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల, ట్రైలర్ రిలీజ్ డేట్లను త్వరలోనే వెల్లడించనున్నారు. -
నువ్వు నీతులు చెప్పకు..!
సాక్షి, హైదరాబాద్: అవంతిక పాత్రలో సిగరెట్ తాగింది రకుల్ ప్రీత్ సింగ్ అయితే విమర్శలపాలవుతోంది మాత్రం గాయని చిన్మయి శ్రీపాద. కొన్ని రోజులుగా వేధింపులపై పోరాడుతున్న చిన్మయి.. మన్మథుడు 2 సినిమాలోని రకుల్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను షేర్ చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సిగరెట్ సీన్‌కు అర్థం ఏంటంటూ ఆమెను పలువురు ప్రశ్నిస్తున్నారు. మీ భర్త చేస్తే ఒప్పు, మిగతావారు చేస్తే మాత్రం తప్పా? అంటూ నిలదీస్తున్నారు. ఈ విమర్శలకు కారణం లేకపోలేదు. మొన్నటివరకు కబీర్ సింగ్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగను ‘సినిమా తీసే పద్దతి ఇదేనా? ఆడవారిని అలా చూపించొచ్చా’ అంటూ దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ఇప్పుడేమో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తన సినిమాలో హీరోయిన్‌తో సిగరెట్ తాగించాడు. అంతేకాక బోల్డ్ డైలాగ్స్ కూడా చెప్పించడంతో నెటిజన్లు చిన్మయికి చుక్కలు చూపిస్తున్నారు. ఇల్లు చక్కబెట్టుకోలేదు కానీ, అందరికీ నీతులు చెబుతోంది అంటూ చిన్మయిపై విరుచుకుపడుతున్నారు. చి.ల.సౌ. చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అవంతిక పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తోంది. జూలై 9న విడుదలైన టీజర్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ గోడకు ఏటవాలుగా నిలబడి గుప్పుగుప్పుమంటూ సిగరెట్ పొగను గాల్లోకి వదలడం, హీరో నాగార్జునతో ఆమె డైలాగులు చర్చకు దారితీశాయి. కొందరేమో టీజర్ అద్భుతంగా వచ్చిందంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరేమో రకుల్ సిగరెట్ తాగే సీన్‌ను తప్పు పడుతున్నారు. ఎటొచ్చీ రాహుల్, చిన్మయిలకు మాత్రం ట్రోల్స్ తప్పట్లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. -
లవ్ ఫెయిల్యూర్స్ తట్టుకోలేవ్!
అవంతిక... పేరు చాలా సంప్రదాయబద్ధ్దంగా ఉన్నప్పటికీ అమ్మాయి మాత్రం వేరేలా అన్నమాట. మొహమాటం లేకుండా సిగరెట్ కాల్చేస్తుంది. అలాంటి అవంతిక పద్ధతి గల అమ్మాయిలా కలరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అవంతిక అసలు రంగును మన్మథుడు ఇట్టే పసిగడతాడు? ఎలా? అనే అంశాలను వెండితెరపై చూసి తెలుసుకోవాలి. నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన్మథుడు 2’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల ఈ సినిమాలోని నాగార్జున క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా రకుల్‌ప్రీత్ చేసిన అవంతిక పాత్రకు చెందిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో ‘ఇప్పటిదాకా యు – సర్టిఫికేట్‌ను ప్రయత్నించాను. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా’, ‘ ఈ వయసులో నువ్వు లవ్ ఫెయిల్యూర్స్ తట్టుకోలేవ్’ అని రకుల్ పలికిన డైలాగ్స్ ఆడియన్స్‌కు కిక్ ఇస్తున్నాయ్. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది. -
అవంతిక.. డేంజరస్ పిల్ల
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పోషించిన అవంతిక పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రకుల్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. సమంత, కీర్తి సురేష్‌లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతమందిస్తున్నాడు. -
‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. 2002లో రిలీజ్ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఫ్రెంచ్ సినిమా ఫ్రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. 2006లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ మూవీ ‘ప్రీట్-మోయి టా మెయిన్’ లైన్‌తోనే మన్మథుడు 2ను తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 43 ఏళ్ల వ్యక్తిని కుటుంబం సభ్యులు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంటారు. అతను మాత్రం ప్రేమ, పెళ్లి లాంటి కమిట్మెంట్స్ ఏవీ లేకుండా అమ్మాయిలతో సరదాగా గడిపేస్తుంటాడు. మన్మథుడు 2 టీజర్ లోనూ ఇదే కాన్సెప్ట్ కనిపించటంతో ఈ సినిమా రీమేక్‌గా ప్రచారానికి మరింత బలం చేకూరినట్టైంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.