million units
-
దూసుకుపోతున్న షావోమి: న్యూ రికార్డ్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ మేకర్ షావోమి దూసుకుపోతోంది. కొత్త సంవత్సరంలో కొత్త రికార్డులతో ఇండియాలో తన సత్తా చాటుతోంది. అమెజాన్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా షావోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ట్విటర్లో ప్రకటించారు. అమెజాన్‌లో సేల్ అవుతున్న 6 టాప్ స్మార్ట్ఫోన్లలో 5 తమవే(షావోమి) అని ట్వీట్ చేశారు. మరోవైపు రెడ్ మి 5 ఎ విక్రయాల్లో దుమ్ము రేపుతోంది. షావోమి పాపులర్ మోడల్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరిట రెడ్మీ 5ఎ భారీ సేల్స్‌ను నమోదు చేసింది. లాంచ్ అయిన నెలరోజులలోపే తమ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ భారత్‌లో మిలియన్‌కు పైగా విక్రయాలను సాధించిందని జైన్ వెల్లడించారు. లాంచ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే అన్ని మాధ్యమాల్లోనూ కలిపి ఏకంగా 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడైనట్టు జైన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ లభ్యం. గతేడాది డిసెంబర్ 7వ తేదీన 5ఎ స్మార్ట్‌ఫోన్‌ను 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల చేసింది. మరోవైపు 2జీబీ ర్యామ్ వేరియెంట్‌పై మొదటి 50 లక్షల యూనిట్లకు రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తున్న నేపథ్యంలో రెడ్మీ 5ఎ స్మార్ట్‌ఫోన్ రూ.4,999 లకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రెడ్మీ 5ఎ పీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 2/3 జీబీ ర్యామ్ 16/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ New year, newer records! Once again, 5 out of the top 6 selling smartphones on @AmazonIN are all @XiaomiIndia phones! Which one of these do you use? 😉#1SmartphoneBrandXiaomi pic.twitter.com/QsxDMjiczu — Manu Kumar Jain (@manukumarjain) January 11, 2018 -
టార్గెట్ 140 మిలియన్ యూనిట్లు
వేసవి అవసరాలకు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయండి ట్రాన్స్‌కోను కోరిన తెలంగాణ సీఎం కార్యాలయం సాక్షి, హైదరాబాద్: రబీ, రానున్న వేసవి అవసరాల దృష్ట్యా తెలంగాణలో విద్యుత్తు కొరతను అధిగమించే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జెన్కోకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులుగా రాష్ట్రంలో సగటున రోజుకు మూడు మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్తు కొరత నెలకొంది. చలి తీవ్రతతో విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్నందున ప్రస్తుతానికి ఇబ్బంది లేదని క్రమంగా పెరిగిపోనున్న అవసరాలకు అనుగుణంగా రోజుకు 140 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే వివిధ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయాలని.. టెండర్లకు ముందుకొచ్చిన కంపెనీల నుంచి విద్యుత్తును సమకూర్చుకోవాలని.. ఇటీవల పలు సమీక్ష సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆర్ జెన్కో, ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. కోతలు మితిమీరకుండా రబీకి విద్యుత్తు సరఫరా చేసేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళిక వివరాలను పంపాలని సీఎం కార్యాలయం ఇప్పటికే ట్రాన్స్‌కో, డిస్కంలకు లేఖ రాసింది. అప్పట్నుంచీ జెన్కో, ట్రాన్స్‌కో అధికారులు అంతమేరకు విద్యుత్తును సమకూర్చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం రోజుకు 128 ఎంయూల విద్యుత్తు అందుబాటులో ఉంది. రోజువారీ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా నివేదికల ప్రకారం జనవరి 13న తెలంగాణ జెన్కో ద్వారా 40.53 ఎంయూల థర్మల్ విద్యుత్తు, 2.82 ఎంయూల జల విద్యుత్తు తెలంగాణకు సరఫరా అవుతోంది. మొత్తంగా 128.05 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో లోటును పూడ్చుకునేందుకు ట్రాన్స్‌కో కసరత్తు ముమ్మరం చేసింది. ప్రాజెక్టుల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోవటంతో జల విద్యుదుత్పత్తి అవకాశాలు అడుగంటాయి. నాగార్జునసాగర్ నుంచి గత నెల 8 నుంచే విద్యుదుత్పత్తి ఆగిపోయింది. కృష్ణా జలాలపై ఏపీ అభ్యంతరం తెలిపినప్పటికీ శ్రీశైలం ఎడమగట్టు నుంచి వీలైనంత విద్యుత్తు ఉత్పత్తి చేసింది. నీటి మట్టం తగ్గకుండా రివర్స్ పంపింగ్‌ను విద్యుదుత్పత్తికి వినియోగించింది. ప్రస్తుతం అక్కడ రోజువారీ ఉత్పత్తి రెండు ఎంయూలకు మించటం లేదు. అత్యవసర సందర్భాల్లో తప్ప శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో వేసవి ముగిసేంత వరకు థర్మల్, సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే సౌర, థర్మల్ విద్యుత్తు కొనుగోలు టెండర్లపై ట్రాన్స్‌కో ఆశలు పెంచుకుంది. వీలైనంత తొందరగా విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని యోచిస్తోంది. -
కరెంట్ కట కట
డిమాండ్‌కు సరఫరాకు భారీ వ్యత్యాసం సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరెంట్ సరఫరా పరిస్థితి దయనీయంగా మారింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో అన్నివర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. జిల్లాకు ప్రతిరోజూ 15మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా 11 నుంచి 13 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో వ్యవసాయరంగం, పరిశ్రమలు, గృహాలు అన్న తేడా లేకుండా ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రెండు మూడు గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. మరోవైపు ఓవర్‌లోడ్‌తో పదేపదే కరెంట్ ట్రిప్ అవుతోంది. దీంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కొన్నిచోట్ల రైతన్నలు రోడ్డెక్కుతుంటే, మరికొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోలుకోలేకపోతున్న రైతన్న జిల్లాలో విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం 2,19,000 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. అనధికారికం గా మరో 40వేల కనెక్షన్లు ఉంటాయని అంచనా. వీ టికి విద్యుత్ సరఫరా నిమిత్తం త్రీపేజ్ ట్రాన్స్ఫార్మ ర్లు 36,176 ఉన్నాయి. వ్యవసాయరంగానికి రెండు విడతల్లో కచ్చితంగా ఆరు గంటల పాటు కరెంటు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అ నుగుణంగా జిల్లా మొత్తాన్ని ఎ, బి గ్రూపులుగా విభజించారు. ఎ గ్రూపు ప్రాంతాలకు ఉదయం 9 నుంచి 12గంటల వరకు, తిరిగి రాత్రి 9 నుంచి 12 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా బి గ్రూపుగా ఉన్న ప్రాంతాలకు సాయంత్రం 3నుంచి 6గంటల వరకు, తిరిగి అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ రెండు గ్రూపులకు కేటాయించిన సమయాల్లో జిల్లాకు కరెంట్ సరఫరా లేకపోతే అంతే సంగతులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయరంగానికి రోజూ మూడు గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. అలాగే ఓవర్‌లోడ్ పుణ్యమా అని పదే పదే కరెంట్ ట్రిప్ అవుతోంది. దీంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, ఫీజులు ఎగిరిపోతున్నాయి. ఫీజులు సరిచేసేటప్పుడు షాక్ గురై పదుల సంఖ్యలో రైతులు మరణించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయంటే అవి బాగు చేయడం కోసం రెండుమూడు రోజులు పడుతోంది. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కొన్ని చోట్ల రైతన్నలు రోడ్డెక్కుతుంటే, మరికొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరిశ్రమల పరిస్థితి అంతే..! రాజధాని నగరానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో ఉండడం వల్ల జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో చిన్న పరిశ్రమలు 7,664, కాటేజీ పరిశ్రమలు 614, పెద్ద పరిశ్రమలు 593 ఉన్నాయి. అన్ని పరిశ్రమల్లో కలిపి దాదాపు 40వేల మందికి ఉపాధి లభిస్తోంది. కరెంట్ కొరత నేపథ్యంలో వీటన్నింటికీ కూడా వారంలో రెండు రోజుల పాటు మంగళ, బుధవారాలు కోత విధిస్తున్నారు. జనరేటర్ల ఉపయోగించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో చిన్న పరిశ్రమలు ఆ సాహసం చేయడంలేదు. అయితే పెద్ద పరిశ్రమలది మరో వింత పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. పెద్ద పరిశ్రమలు కొనసాగాలంటే హైటె న్షన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జనరేటర్లు లభించకపోవడంతో వారు మూతవేస్తున్నారు. దీంతో పరిశ్రమలు వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేక యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ వినియోగం ఇలా.. వ్యవసాయ కనెక్షన్లు 2,19,000 (అధికారికంగా) చిన్న పరిశ్రమలు 7,664 కాటేజీ పరిశ్రమలు 614 పెద్ద పరిశ్రమలు 593 అవసరమైన విద్యుత్ (మి.యూ) 15 సరఫరా అవుతున్నది (మి.యూ) 11 సాగుకు సరఫరా చేయాల్సింది ఇలా.. ఎ గ్రూపు కింద ఉదయం: 9 నుంచి 12గంటల వరకు రాత్రి: 9 నుంచి 12గంటల వరకు బి గ్రూపునకు... సాయంత్రం: 3 నుంచి 6గంటల వరకు అర్ధరాత్రి: 12నుంచి 3గంటల వరకు -
మూతపడిన ఎన్టీటీపీఎస్
విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రం సిబ్బంది సమ్మెతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ప్లాంట్‌లోని ఏడు యూనిట్లూ మూత ఒక్కరోజులో 42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయిన వైనం విద్యుత్ సంక్షోభం సోమవారం మరింత తీవ్రమైంది. ఎన్టీటీపీఎస్ సిబ్బంది సమ్మెతో ప్లాంట్‌లోని ఏడు యూనిట్లూ మూతపడ్డాయి. దీంతో ఒక్కరోజులోనే 42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రభావం దక్షిణాది గ్రిడ్‌పైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలోనే ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం రాత్రికి యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలించటంతో ఉద్యోగుల సమ్మె విరమించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి, విజయవాడ : నిత్యం విద్యుత్ వెలుగులను విరజిమ్మే ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) సోమవారం ఉదయం మూతపడింది. వేతన సవరణ (పీఆర్సీ) అమలుపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్టీటీపీఎస్లోని ఇంజినీర్లు, సిబ్బంది ఆదివారం ఉదయం మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఎన్టీటీపీఎస్లో ఏడు యూనిట్లు ఉన్నాయి. సిబ్బంది సమ్మెకు దిగడంతో ఆదివారమంతా అధికారులు ఏదోక విధంగా నెట్టుకొచ్చారు. మధ్యాహ్నం నుంచి ఒక్కొక్క యూనిట్ మూతపడుతూ వచ్చింది. సోమవారం ఉదయానికి ఏడు యూనిట్లు మొరాయించడంతో ఇంజినీర్లు చేతులెత్తేశారు. అంతకుముందు చీఫ్ ఇంజినీర్ సమ్మయ్య కార్మిక సంఘాల నేతలతో చ ర్చలు జరిపి విద్యుత్ ఉత్పత్తికి సహకరించాలని కోరినప్పటికీ వారు ససేమిరా అన్నారు. బొగ్గు కొరతతో సమస్యలు ఉత్పన్నం.. ప్లాంట్‌లో ఏడు యూనిట్లు పనిచేయడానికి రోజుకు 25 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. ఈ బొగ్గు రైల్వే వ్యాగన్ల ద్వారా ఒడిశా, తెలంగాణలోని సింగరేణి నుంచి దిగుమతి అవుతుంది. ప్రస్తుతానికి ఆయా ప్రాంతాల నుంచి వ్యాగన్ల ద్వారా వచ్చిన బొగ్గును టిప్పర్లలో ప్లాంట్‌లోని కన్వేయర్ బెల్ట్ పైకి చేర్చుతారు. ప్రస్తుతం ఇంజినీర్లు, కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఆయిల్ ఫైరింగ్ ద్వారా యూనిట్లను ఆదివారం పనిచేయించినా సోమవారం సాధ్యపడలేదు. అధికారులు ప్లాంట్‌ను మూసివేశారు. తొలుత రెండో యూనిట్ మూతపడగా.. చివరగా నాలుగో యూనిట్ మూతపడింది. రోజుకు 42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి.. ఎన్టీటీపీఎస్లో ఏడు యూనిట్ల ద్వారా 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మొదటి ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 210 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఏడో యూనిట్ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. మొదటి ఆరు యూనిట్లు ఒకరోజు పనిచేయడం వల్ల 30 మిలియన్ యూనిట్లు, ఏడో యూనిట్ పనిచేయడం వల్ల 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్క సోమవారం విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల సుమారు 42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దక్షిణాది గ్రిడ్‌పై ప్రభావం.. ఎన్టీటీపీఎస్లో ఉత్పత్తి అయిన విద్యుత్ రాష్ట్ర గ్రిడ్ ద్వారా దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులంతా సమ్మెకు దిగడంతో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం దక్షిణాది గ్రిడ్‌పై పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గ్రామాలు, పట్టణాల్లో మాత్రమే విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సమ్మె కొనసాగిస్తే విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయి దాని ప్రభావం రైళ్లు, విమాన సర్వీసులపై కూడా పడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుల్లో కూడా విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందని తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు విద్యుత్ సంక్షోభం పెరిగే అవకాశం ఉంది. పునరుద్ధరణకు ఒకటిన్నర రోజులు... ఎన్టీటీపీఎస్లో ఏడు యూనిట్లు ఒకేసారి మూతపడడంతో వీటిని పునరుద్ధరించడం కష్టమే. ఇంజినీర్లు, సిబ్బంది విధులకు హాజరైన తర్వాత ఎన్టీటీపీఎస్ పూర్తిస్థాయి సామర్థ్యంలోకి రావడానికి ఒకటిన్నర రోజులు పడుతుందని ఇంజినీర్లు ‘సాక్షి’కి తెలిపారు. సిబ్బంది అంతా ఒకేసారి విధులకు హాజరయితే ఒకేసారి అన్ని యూనిట్లను ప్రారంభించేందుకు ప్రయత్నించవచ్చు. ఏడాది వ్యవధిలో రెండోసారి.. జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న ఎన్టీటీపీఎస్లోని అన్ని యూనిట్లూ ఒకేసారి మూతపడడం అదుదైన విషయం. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ ఏడున ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడింది. తాజాగా విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సోమవారం రెండోసారి మూతపడింది. యాజమాన్యం దిగివచ్చి తమ పీఆర్సీని అంగీకరించేవరకు ప్లాంట్‌లోకి అడుగుపెట్టేది లేదని నేతలు స్పష్టం చేశారు. -
ఉక్కకోత
ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్.. ఎడాపెడా విద్యుత్ కోత సరఫరా తగ్గి.. పలుచోట్ల ‘కట్’కట సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె సోమవారం నగరవాసులకు పట్టపగలే చుక్కలు చూపింది. ఒకపక్క కరెంట్ కోత.. మరోపక్క ఉక్కపోత ముచ్చెమటలు పట్టించాయి. ఎన్టీపీఎస్, కేటీపీఎస్, రాయలసీమ, శ్రీశైలం తదితర విద్యుత్ కేంద్రాల్లో ఉద్యోగుల సమ్మెతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆయా కేంద్రాల నుంచి నగరానికి సరఫరా కావాల్సిన విద్యుత్‌పై కోత పడింది. ప్రస్తుతం నగరవాసుల అవసరాలకు రోజుకు సగటున 48-50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. ప్రస్తుతం ఇది 42 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. సరఫరా- డిమాండ్ మధ్య భారీ వ్యత్యాసం నమో దు కావడంతో సోమవారం ఎడాపెడా కోతలు విధించారు. పలుచోట్ల ఏకధాటిగా మూడు గంటల పాటు విద్యుత్ జాడలేకుండా పోయిం ది. కొన్నిచోట్ల అరగంటకోసారి వస్తూ, పోతూ ఇబ్బంది పెట్టింది. ఎప్పుడొస్తుందో, పోతుం దో తెలియని విద్యుత్‌తో ఫ్యాన్లు తిరగక, ఏసీలు, కూలర్లు పని చేయక నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కాగా, 1104, 327 యూనియన్ నాయకులు మింట్ కాంపౌండ్‌లోని సీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం సహా, సీజీఎం, ఇతర కార్యాలయాల్లోకి ఉద్యోగులు వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యాలయాల ప్రధాన గేట్లకు తాళాలు వేసి, బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. -
తీవ్రమైన ఇక్కట్లు
విజయనగరం మున్సిపాలిటీ న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ వైపు ఎండ వేడిమితో అల్లాడిపోతున్న జిల్లా వాసులను మరో వైపు విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో విధిస్తున్న కోతలతో నరకం చూస్తున్నారు. ఇన్వెర్టర్లున్నా ప్రయోజనం లేకుండా పోతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు గంట ల పాటు కోత విధించడం ఇందుకు ఉదాహరణ. అదే తరహాలో శ నివారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8. 30 గంటల వరకు కోత విధించారు. అంతేకాకుండా పగటి సమయంలో కూడా కోతలు విధించడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. డిమాండ్‌కు, కేటాయింపులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొనడంతో కోతలు అనివార్యమవుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాకు 6.036 ఎంయూ(మిలియన్ యూనిట్లు) విద్యుత్ అవసరం కాగా కేటాయింపు 5.011 ఎంయూ మాత్రమే ఉంది. సుమారు ఒక ఎంయూ విద్యుత్ డిమాండ్‌కు కోటా వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో కోతలు అనివార్యమవుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు ఎడాపెడా కోతల వాతల పెడుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో, పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలు స్తంభించి, ప్రగతి కుంటుపడుతోంది. విద్యుత్ కోతలతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో 4 నుంచి 5 గంటల పాటు పగటి సమయంలో అధికారిక కోతలు ప్రకటించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఎ-గ్రూప్ కేటగిరికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, బి-గ్రూప్ కేటగిరీకి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు. ఇవి కాకుండా అత్యవసర సమయాల్లో ఈఎల్ఆర్ (ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో కోతలు విధించినున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా పరిశీలిస్తే రూరల్ ఫీడర్పై ఉన్న గృహావసర విద్యుత్ కనెక్షన్లకు రాత్రి, పగలు తేడా లేకుండా కోత విధిస్తున్నారు. రాత్రి వేళలలో 2 నుంచి 5 గంటల పాటు విధిస్తున్న కోత కారణంగా అన్ని వర్గాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక పట్టణాల్లో విధించే కోతలతో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్తంభిస్తున్న కార్యకలాపాలు ... విద్యుత్ కోతల కారణంగా జిల్లా వ్యాప్తంగా కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ప్రైవేటు సంస్థలతో పాటు, ప్రభుత్వ సంస్థల్లో ఇదే పరిస్థితి దాపురించింది. దీంతో జిల్లా ప్రగతి పూర్తిగా కుంటుపడుతోంది. జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్‌కు కూడా కోతలు తప్పకపోవడంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే స్తంభించిపోతున్నాయి. అధికారిక కోతలతో పాటు అనధికారికంగా విధించే ఈఎల్ఆర్తో విద్యుత్ ఆధారిత చిరువ్యాపారులు తీవ్రంగా నష్టాలు పాలవుతున్నారు. -
విద్యుత్ కోతలిక అధికారికం
సాక్షి, విశాఖపట్నం: కోత కష్టాలు మొదలయ్యాయి. వేసవి పూర్తి స్థా యిలో ఆరంభంకాకమునుపే తడా ఖా చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు లోడ్ రిలీఫ్(ఎల్ఆర్) పేరిట అనధికారిక కోతలు అమలవుతున్నాయి. గ్రా మీణ ప్రాంతాల్లో ఈ కోతలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. పట్టణ ప్రాంతాలకు కాస్త మినహాయింపునిచ్చారు. మంగళవారం నుంచి ఈ ప్రాంతాల్ని కూడా కలిపి అధికారిక కోతలకు ఈపీడీసీఎల్ షెడ్యూల్ ఖరారు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 11.05 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇది పెరిగే అవకాశాలున్నాయి. ఆదివారం రాత్రి జిల్లాలో ఏకంగా 423 మెగావాట్లు పీక్ డిమాండ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఇది 500 మెగావాట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. ఆ స్థాయికి డిమాండ్ చేరితే మరింతగా కోతలు తప్పకపోవచ్చని సమాచారం. కోతల వేళలు గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 , మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మూడేసి గంటలు చొప్పున విద్యుత్ సరఫరా నిలిపేస్తారు. మండల కేంద్రాల్లో ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నరపాటు కోత విధిస్తారు..మున్సిపాలిటీల్లో కూడా అటూఇటుగా ఇలాగేఉంటాయి. విద్యుత్ లభ్యత ఆధారంగా మార్పులు చేర్పులుంటాయి. ఆస్పత్రులపై కరుణ.. : ఆస్పత్రుల్లో ఇబ్బందులు కలగకుండా వ్యవహరిఇంచాలని ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు అధికారులకు సూచించారు. ఉదయం కోతల్లో కాస్త మార్పులుండే అవకాశాలున్నాయి. డెడికేటెడ్ ఫీడరున్న కేజీహెచ్‌కు అనివార్య పరిస్థితుల్లో మినహా విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులతోపాటు, పేదలుండే ఫీడర్లలో కూడా వీలున్నమేరకు మినహాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.