M.J. Akbar
-
ఆధారాల ఆట ఆగేదెన్నడు?
బైలైన్ పశ్చిమ యూరప్ నుంచి ప్రత్యేకించి ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల నుంచి కార్యకర్తలను ఎక్కువగా ఆకర్షించడం ఐఎస్ఐఎస్ ప్రత్యేకత. ట్రోజన్ హార్స్‌ను రహస్యంగా లోపలకు తేవాల్సిన అవసరమేమీ లేదు. లక్ష్యంగా ఎంచుకున్న నగరంలోనే అది (ఉగ్రవాది) చడీచప్పుడు లేకుండా నివసిస్తుంటుంది. దీని పర్యవసానాలు యూరప్‌వ్యాప్తంగా ఉంటాయి. దీని ప్రభావం ముందు ముందు జరిగే ఎన్నికల్లో మరింత ప్రబలంగా కనిపించి, ఉదార వాదుల అవకాశాలు మరింతగా కుంచించుకుపోయేలా చేస్తుంది. నగరాలపై ఉగ్రవాద దాడులు ప్రార ంభమైంది ముంబైతోనే. అదీ 2008లో కాదు, 1993లోనే మొదలైంది. 1993 ఫిబ్రవరిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ప్రభావం ఓ అరడజను భవనాల విధ్వంసంకంటే ప్రబలమైనది. అసాధారణ స్థాయి పెద్ద నగరాలు ఉగ్రవాద దాడులకు సంబంధించి అత్యంత బలహీనమైన ప్రాంతాలనే సిద్ధాంతం 1993 నుంచి చాలాసార్లే ప్రపంచవ్యాప్తంగా రుజువైంది. మహా నగరంలోకి చొరబడటానికి ఎన్నో కంతలుంటాయి. కాబట్టి ఎక్కడబడితే అక్కడ దొరికే అమాయకులను హతమార్చడం ద్వారా బీభత్సాన్ని సృష్టించడమే ఏకైక లక్ష్యంగా కలిగిన వారి దాడులకు మహానగరం అనువైనది. పాఠశాల, ఆసుపత్రి, రైల్వేస్టేషన్, స్టేడియం, సంగీత సభ ఏదీ ఉగ్రవాదులకు పవిత్రమైనది కాదు. ఉగ్రవాదులు సామూహిక హంతకులు. పట్టణీకరణ వారి వేటకు అనువైన మైదానాన్ని సమకూరుస్తుంది. ఒకప్పుడు నగరాలను ధ్వంసం చేయడానికి పెద్ద సేనలు కావాల్సి వచ్చేవి. సాంకేతిక పరిజ్ఞానం దాడి, రక్షణల మధ్య సమీకరణాన్ని మార్చింది. భయబీభత్సాలను సృష్టించడానికి ఒకప్పుడు సైనిక దుస్తులు ధరించినవారు చాలా మంది అవసరమయ్యేవారు. ఇప్పుడు ఆ పని చేయడానికి గుప్పెడు మంది చాలు. న్యూయార్క్ నగరం మీద జరిగిన ఉగ్రవాద దాడి 9/11గా సుప్రసిద్ధం. బహుశా అదే అత్యంత నాటకీయమైన దాడి కావచ్చు. అలా అనిపించడానికి కారణం నమ్మశక్యంకాని ఆ దృశ్యాలు ఇంకా సజీవంగా నిలిచి ఉండటం మాత్రమే కాదు. అంతే సుప్రసిద్ధమైన ఇతర పాశ్చాత్య నగరాలు కూడా దాడులకు గురయ్యాయి, గాయపడ్డాయి. ప్రతి దాడీ హాహాకారాలను, ఆగ్రహాన్ని, భయోత్పాతాన్ని, బాధను మిగిల్చింది. నేటి వరకు జరిగిన అన్ని దాడులూ... ఆ విషమ సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం ఇంకా గుడ్డిగా అన్వేషిస్తూనే ఉన్నాయి. దేశాలు తమ నగరాల ఎత్తుగడలపరమైన రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాయి. కానీ ఉగ్రవాద దాడుల అసలు సూత్రధారులను బోనెక్కించడానికి అవసరమైన సమైక్య ప్రతిదాడి వ్యూహం విషయంలో అంగీకారం సాధించలేకపోయాయి. ఈ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన వినాశనానికి వనరు. ఉగ్రవాదులు తమ ప్రాబల్యాన్ని విస్తరింపజేసుకోగలిగారు, ఆయుధాలను మెరుగుపరచుకున్నారు, రిక్రూట్‌మెంట్‌ను పెంచుకున్నారు. అణుకాలుష్యం బారిన పడే ముప్పుకు అవకాశాన్ని ఇకనెంత మాత్రమూ తోసిపుచ్చలేం. అది వారికి అందుబాటులోకి వచ్చేంత సమీపంగానే ఉండి ఉండొచ్చు. సంప్రదాయక ఆయుధాలతో వారు సాగించే దాడులనే ఎదుర్కోలేని దుస్థితిలో ఉన్న మనం, వారు సంప్రదాయేతర ఆయుధాలను ప్రయోగిస్తే ఏం చేయగలం? ఆత్మాహుతి దాడికి సిద్ధమైనవారికి తాము ఎలా చస్తామనే విషయంలో ఎలాంటి పట్టింపూ ఉండదు. ఎంత మందిని తమతో పాటూ తీసుకుపోగలమనేది ఒక్కటే వారికి పడుతుంది. తప్పించుకు తిరిగే మిలీషియాల కోసం వెతుకులాడుతూ దేశాలను విధ్వంసానికి గురిచేయలేమని బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు ఇప్పుడు గుర్తించాయి. ఇరాక్ భారీ మూల్యం చెల్లించాల్సిన మూఢత్వం అయింది. కొందరు ముస్లింలు చేసే తప్పులకు మొత్తంగా ఒక మతాన్నే- ఇస్లాంను తప్పు పట్టలేమని బాధ్యతగల నేతలు గుర్తిస్తారు. కాకతాళీయంగానే అయినా, పారిస్ గుండె కోత మన అంతరాత్మలను తాకడానికి కొన్ని గంటల ముందే ప్రధాని నరేంద్ర మోదీ తుపాకులకు, ఉగ్రవాదానికి విరుగుడు ఇస్లాంలోని సూఫీయిజమేనని పేర్కొన్నారు. ఈ విధమైన అవ గాహన పటిష్టం కావడం అవసరం. అయితే ఇంతకూ తదుపరి చేయాల్సింది ఏమిటి? అత్యంత సరళమైన ఒక వాస్తవాన్ని మనం నిరాకరించలేం. ఉగ్రవాదం వల్ల బాగా దెబ్బతిన్న దేశాలు అసలు సూత్రధారులను వేటాడే విషయంలో అనిశ్చిత వైఖరిని అవలంభిస్తున్నాయి. వారిని బోనెక్కించే సమస్యను సూత్రబద్ధమైనదిగా గాక, తమకు అనువైనది అనుకున్నప్పుడే పట్టించుకుంటున్నాయి. విషాదం సంభవించిన రోజున మాత్రమే ఆ సూక్తులను వల్లె వేయడం వినిపిస్తుంది. ఒక్కసారి ఆ జ్ఞాపకం మరుగున పడిందంటే, రాజకీయాలు, భౌగోళిక వ్యూహా త్మక అవకాశాలే పైచేయి సాధిస్తాయి. పారిస్ హంతకులు కేవలం ఆటబొమ్మ లు మాత్రమే. ఆ బొమ్మలను ఆడించేవాడు మరెక్కడో సురక్షిత స్థావరంలో కూచుని ఉంటాడు. ఏ శిక్షకూ గురికాకుండా ఉన్నంత కాలం, స్వార్థపరశక్తుల రక్షణ లభిస్తున్నంత కాలం వాడు నిశ్చింతగా ఉంటాడు. వాడికి రక్షణ కల్పించే స్వార్థపర శక్తులలో స్థానిక ప్రభుత్వాలు సైతం ఉంటాయి. దీంతో ఈ దుష్ట క్రీడ ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది తప్ప, క్షీ ణించదు. పారిస్ బీభత్సకాండ వెనుక ఉన్నది ఐఎస్ఐఎస్ అని తొలి వార్తలను బట్టి తెలుస్తోంది. కాగితం మీదైనె తే ఇది దోషుల అన్వేషణను తేలిక చేస్తుంది. కానీ వాస్తవ జీవితంలో ఇది ఆ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుంది. పశ్చిమ యూరప్ నుంచి ప్రత్యేకించి ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల నుంచి కార్యకర్తలను ఎక్కువగా ఆకర్షించడం ఐఎస్ఐఎస్ ప్రత్యేకత. ట్రోజన్ హార్స్‌ను (ప్రాచీన ట్రాయ్ నగరాన్ని లోపలి నుంచి ముట్టడించడానికి తయారుచేసిన వంచనాత్మకమైన కొయ్యగుర్రం) రహస్యంగా నగర ద్వారాల గుండా లోపలకు లాక్కురావాల్సిన అవసరమేమీ లేదు. లక్ష్యంగా ఎంచుకున్న నగరంలోనే ఆ గుర్రం చడీచప్పుడు లేకుండా నివసిస్తుంటుంది. క్రమబద్ధమైన ఉద్యోగం లేకపోయినా, కనీసం సామాజిక భద్రతతోనైనా అది గడిపేస్తుంటుంది. దీని పర్యవసానాలు యూరప్‌వ్యాప్తంగా ఉంటాయి. తదుపరి దఫా ఎన్నికల్లో దీని ప్రభావం మరింత ప్రబలంగా కనిపించి, ఉదార వాదుల అవకాశాలు మరింతగా కుంచించుకుపోయేలా చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు అందుకు తమను తాము తప్పు పట్టుకోవాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితికి ఆమోదనీయమైన విధంగా ఉగ్రవాదాన్ని నిర్వచించే విషయంలో అవి ఇప్పటికైనా ఒక అంగీకారానికి రాలేకపోతే పెద్దగా ఆశంటూ ఏమీ మిగలదు. సమస్య భాషకు సంబంధించినది కాదు. ‘నీ తుపాకీ పట్టినవాడు ఉగ్రవాది, నా తుపాకీ పట్టినవాడు స్వాతంత్య్ర యోధుడు’ అనే విషపు కలుపును అగ్రశక్తుల ఆశ్రీతులు పలువురు ఇంకా ప్రచారంలో పెడుతూనే ఉన్నారు. వారి సంరక్షణలో పెరిగినవారు ఈ కుతర్కాన్ని విశ్వసిస్తూనే ఉన్నారు. అయినాగానీ ముందుకు సాగ డానికి ఒక ప్రారంభం అంటూ ఉండాలి. బహుశా అది, ఇదంతా మొదలైన ముంబైకే తార్కికంగా తిరిగి చేరుస్తుంది. 1993 ముంబై ఉగ్రవాద దాడులను నిర్వహించినది దావూద్ ఇబ్రహీం అని మనం దశాబ్దాలుగా గుర్తిస్తున్నాం. 2008 ముంబై దాడులకు పాల్పడ్డ లష్కరే తోయిబా అధిపతి హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించే కష్టభరితమైన పనిలో అమెరికా మనకు గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష సహాయాన్ని అందించింది. భారత్‌తో కలిసి చేసిన సంయుక్త ప్రకటనల్లో కూడా ఆ విష యాన్ని అది అంగీకరించింది. దావూద్ ఇబ్రహీం తానొక మాఫియా కార్య కలాపాల ముఠాకు అధిపతిననే విషయాన్ని ఖండించడమైనా చేయడం లేదు. అలాంటి వాడిని కరాచీలోని అతగాడి సురక్షిత నివాసంలోంచి పట్టుకొచ్చి విచారణకు నిలపలేదెందుకు? హఫీజ్ సయీద్ లాహోర్‌లోని తన సురక్షిత నివాసం నుంచి భారత్‌ను, పాశ్చాత్య దేశాలను ఇంకా ఎలా దుమ్మెత్తి పోయగ లుగుతున్నాడు? ముంబై తరహా దాడి మరోదానికి అతగాడు పథకం పన్ను తున్నాడనేది నిస్సంశయం. వారిద్దరినీ బోనెక్కించడానికి బదులు ఇస్లామా బాద్‌లోని వారి సంరక్షకులు వారి భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ ఆధారాల ఆట ముగిసేదెన్నడు? ఆ ఆట సాగుతున్నంత కాలం పారిస్ పునరావృతమవుతూనే ఉంటుంది. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
వృద్ధ నేతలు.. వ్యర్థ సిద్ధాంతాలు
బైలైన్ ఈ విషయం చాలా కాలంపాటే అత్యంత హాస్యభరిత కథనంగా నిలిచి తీరుతుంది. కోల్‌కతాకు ఆనుకుని ఉన్న బిధాన్నగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 3న జరిగాయి. ఇప్పుడు పూజ్యులుగా పిలవాల్సినంత పెద్దవారైన అసిమ్ దాస్‌గుప్తా ఆ ఎన్నికల్లో సీపీఐ(ఎం) మేయర్ అభ్యర్థి. పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వంలో ఆయన పాతికేళ్లపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తికి ఇంత ఘోరంగా పతనం చెందడం ఆషామాషీ విషయం కాదు. వాస్తవానికి ఇది, పార్టీ ఆదేశాలకు వ్యక్తి అహం అడ్డంకి కాకుండా చేయడంలో సీపీఐ(ఎం)కున్న ఖ్యాతికి తగినదే. అంతటి గొప్ప ఆర్థిక మంత్రిని ఒక నగర శివారు మేయరు పదవికి ప్రయత్నించమని పార్టీ ఆదేశిస్తే, శిరసావహించాల్సిందే. అసలు చమత్కారం ఇది కాదు. అది మరో చోటుంది. కామ్రేడ్ దాస్‌గుప్తా పాత పద్ధతిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ‘‘ఓటు వేయడం మరచిపోకండి. ఉదయాన్నే ఓటు వేసే యండి... ఎందుకంటే ఆ సమయంలోనే టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) గూండాల సమస్య, విచ్ఛిన్నకాండ తక్కువగా ఉంటుందని భావిస్తున్నాం’’ అని ఆయన పౌరులకు చెబుతున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం. ‘మీ ఓటును మీరే వేయండి’ అనే కరపత్రాన్ని కూడా ఆయన పంచుతున్నారు. నీవు నేర్పిన విద్యయే... 1977-2011 మధ్య అంతే లేదన్నట్టుగా సాగిన వామపక్ష పాలనలోని పశ్చిమ బెంగాల్లో నివసించిన వారెవరైనాగానీ ఇది చూసి విరగబడి నవ్వాల్సిందే. ప్రతి ఎన్నికలోనూ మార్క్సిస్టులు సరిగ్గా ఈ పద్ధతిలోనే అదనపు ఓట్లను సంపాదించి విజయానికి హామీని సాధించేవారు. రాష్ట్ర పోలీసుల రక్షణతో వారి క్యాడర్లు గూండాలకుండే ఆత్మవిశ్వాసంతో తమ పట్ల వ్యతిరేకత ఉంటుందనుకున్న ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకునే వారు. పోలింగ్ కేంద్రాల్లో విధి నిర్వహణలో ఉన్న అధికారులు తమతో కుమ్మక్కు కాకపోతే వారిని భయపెట్టేవారు, వేధించేవారు. మూలనపడ్డ కుండ, ఉడుకుతున్న కూర దాకను వెక్కిరించడం ఎప్పుడూ తమాషాగానే ఉంటుంది. సీపీఐ(ఎం) ఇతరుల విషయంలో ఏం చేసిందో సరిగ్గా అదే మమతా బెనర్జీ సీపీఐ (ఎం) విషయంలో కూడా చేస్తోంది. ఎన్నికలు న్యాయంగా జరగాలని బెంగాల్ మార్క్సిస్టులు సూచించడం ఊహించడానికి కూడా దాదాపు అసాధ్యం. కానీ ఓటమి అద్భుతాలను చేయగలుగుతుంది. మిమ్మల్నది వివేక వంతులను సైతం చేయవచ్చు. అధికారం కోల్పోయి నాలుగేళ్లయి పోయినా ఇంకా ఎందుకు ఓడిపోయారో బెంగాల్ మార్క్సిస్టులకు అర్థం కాకపోవడమే విచిత్రమైన విషయం. పాత సిద్ధాంతం, వృద్ధ నేతలు.. అని ఒక్క ముక్కలో దాని ఓటమికి కారణం ఏమిటో చెప్పేయొచ్చు. వామపక్షవాదులు యువతకు చేరువయ్యే సమీకరణాన్ని పునరుద్ధరించగలిగే విధంగా తమ తత్వశాస్త్రాన్ని తిరిగి కనిపెట్టలేదు లేదా చెల్లుబాటయ్యే తేదీ ఎన్నడో దాటిపోయిన పాత నేతలను తప్పించనూ లేదు. అసిమ్ దాస్‌గుప్తాకు ఇప్పుడు 69 ఏళ్లు. మరో విధంగా చెప్పాలంటే, ఆర్థిక మంత్రిగా నియమితులయ్యేనాటికి ఆయనకు 40 ఏళ్లు. బిధాన్నగర్ మేయర్ అభ్యర్థిగా ఒక 40 ఏళ్ల నేతను సీపీఐ (ఎం) ఎందుకు నిలపలేకపోయింది? పార్టీలో సమర్థవంతులైన యువ నేతలు ఏమంత మంది లేకపోవడం వల్లనేనా? ఆ పార్టీ ఇంకా ‘‘సోవియెట్ పొలిట్‌బ్యూరో మనస్తత్వం’తో బాధపడుతోందా? అత్యంత ప్రభావశీలుర బృందంలోకి ఒక్కసారి చేరారంటే, ఆ భగవంతుడు తాఖీదులు పంపేవరకు అందులో ఉండాల్సిందేననే ధోరణిని సోవియెట్ పొలిట్‌బ్యూరో మనస్తత్వం అని పిలుస్తారు. మార్క్సిస్టు ఆదర్శ నేత స్టాలిన్ భగవంతుడ్ని నమ్మేవాడు కాదు. క్రమానుగతమైన ప్రక్షాళన ద్వారా ఆయన ఆ సమస్యను పరిష్కరించాడు. కానీ బెంగాల్ స్టాలినిస్టులకు ఆ అవకాశం లేదు. మార్క్సిస్టులకు కాలదోషం పట్టిపోయిందా? స్థానికమైన ఒక మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ప్రస్తుతం అర్ధ అవనతమై కుంటుతున్న ఎర్రజెండా మాత్రం అలసిపోయిన వృద్ధుల నేతృత్వంలో రెపరెపలాడే అవకాశం తక్కువ. భారత ఎన్నికల సమీకరణల్లో వామపక్షవాదులు ఖాళీ చేసిన స్థలాన్ని వారు ఎన్నటికైనా తిరిగి సంపాదించుకోగలరా? మన దేశంలోని బూట కపు మార్క్సిజం, అంతర్జాతీయ మార్కిజం అంతగా కాలదోషం పట్టిపో యిందా? ఇదే ఆసక్తికరమైన ప్రశ్న. చిట్టచివరి కమ్యూనిస్టు స్థావరాలు కూడా కూలిపోయాయి. చైనా కమ్యూనిస్టులకు సమానత్వ సాధన ఉద్దేశాలున్నాయేగానీ, పాత, ఫార్ములా తరహా పరిష్కారాల ద్వారా సౌభా గ్యాన్ని సృష్టించగలమని అది ఇకనెంత మాత్రమూ విశ్వసించడం లేదు. క్యూబాకు చెందిన రావుల్ క్యాస్ట్రో దేదీప్యమానమైన మతం వెలుగును చూడటం ప్రారంభించారు. పోప్ ఫ్రాన్సిస్‌ను ఆయన తమ దేశానికి ఆహ్వానించి, తాను కూడా తిరిగి మత విశ్వాసిగా మారగలననే సంకేతాన్ని చ్చారు. మార్క్సిజం మూలస్తంభాలు కుప్పకూలిపోగా, సదుద్దేశాలు మాత్రం మిగిలాయి. బెంగాల్ మార్క్సిస్టుల దీర్ఘాయుర్దాయం రహస్యం సిద్ధాంతంలో కాదు, పార్టీ యంత్రాంగంలో ఉంది. వారి పాలిటి శని దేవత మమతా బెనర్జీ దీన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఆ పార్టీ యంత్రాంగంలోని తగినన్ని భాగాల ను లాక్కుని, తమ సొంత యంత్రాంగానికి తగిన విధంగా మలచి వాటిలో ఇముడ్చుకున్నారు. అదేసమయంలో, వామపక్షాలతో ఎలాంటి సంబంధ మూలేని రాజకీయ పార్టీలు పేదరికం సవాలును ఎదుర్కొన్నాయి. అవి దాన్ని ఏదో అంతర్జాతీయ విప్లవ పథకంలో భాగంగా గాక జాతీయ కార్య క్రమంగా చూశాయి. బెంగాల్లో పేదల మద్దతు ఉన్నది కాబట్టే మమతా బెనర్జీ గెలిచారు. కూలిన కోట మూడున్నర దశాబ్దాలుగా మార్క్సిస్టులు బెంగాల్‌ను తమ కోటగా చూశారు. అది చాలా పటిష్టమైన కోటే. అయినా, కోట తలుపులు బయటకు తెరుచుకుంటాయి కూడానని వామపక్షవాదులు ఒక్కసారైనా అనుకోకపో వడమే విచిత్రం. సురక్షితమైన ఆ స్థావరం నుంచి తమ రాజ్యం లేదా భావ జాలం విస్తరించగలదని మాత్రమే అనుకున్నారు. అందుకుబదులుగా వారు తమకు తామే తలుపులు మూసేసుకుని, తలపొగరుతో కూడిన స్వీయ సంతృప్తితో ఏకాంతవాసాన్ని గడిపారు. వ్యక్తులలాగే పార్టీలు కూడా చాలా కారణాలతో మంచాన పడతాయి. సమంజసత్వాన్ని కోల్పోవడం వల్ల పలు పార్టీలు అకాల మరణం పాల య్యాయి కూడా. భారత వామపక్షం మరణ వార్తను లిఖించేటప్పుడు అది సంతృప్తితో నిర్లక్షంగా ఉండటం వల్ల చనిపోయిందని రాయాల్సి ఉం టుంది. అది హత్య కాదు, ఆత్మహత్య నిజం. కోలుకోవడానికి దానికి సమ యం మించి పోయిందా? లేదు. కానీ దానికి డాక్టర్ అవసరం లేదు. కావా ల్సిందల్లా అద్భుతం. కానీ అద్భుతాలు జరగాలంటే భగవంతుడు అవస రం. వామపక్షం భగవంతుడ్ని అంగీకరించకపోతే పోనీ, అది కనీసం భగ వంతునికి భిన్నమైన దైవదత్తమైన తండ్రినైనా(గాడ్ ఫాదర్) ఆశ్రయించి అందుకు ప్రయత్నించాలి. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) -
బేడీ వైపు ఢిల్లీవాలా మొగ్గు
ఢిల్లీ మహిళలు కిరణ్‌బేడీ వైపు అధికంగా మొగ్గుతున్నారు. రకరకాల చింతలతో నిత్యం కుతకు తలాడే దేశ రాజధానిలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని ఆమె అయితేనే అర్థం చేసుకోగలరని భావిస్తున్నారు. అవినీతి నిర్మూలన, భద్రత, మెరుగైన జీవితం అనే మూడే ఢిల్లీ ఓటర్ల ప్రాథమిక డిమాండ్లు. మోదీ నాయకత్వం, బేడీ పరిపాలనాధికారం కలసి ఓటర్లకు నమ్మిక కలిగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉద్వేగభరితమైన ఓటర్ల నుంచి లేదా భయం రాజకీయాలతో బాధపడుతున్న వారి నుంచి ప్రధానంగా మద్దతు లభిస్తోంది. శాసనసభ ఎన్నికలకు ముందు ఢిల్లీలోని ఓ గోదాములోకి ఐదు వేల విస్కీ సీసాలను తరలించడానికి ఎంత మంది కావాలి? నిస్సందేహంగా సీసాలతో ప్రభావితం చేయాలనుకునే వారికంటే చాలా తక్కువే. ఎన్నికల కమిషన్ జరిపిన దాడిలో దొరికిన ఆ సీసాలు అక్రమంగా నిల్వచేసినవి. అంటే ఓటర్ల ను ప్రభావితం చేయడానికి దాచినవేననేది స్పష్టమే. చట్టబద్దంగా మద్యాన్ని అమ్ముకునేవారెవరికీ అక్రమంగా నిల్వచేయాల్సిన అవసరం ఉండదు. అవినీతికి కూడా మంచి నిర్వహణా నైపుణ్యాలు కొన్ని ఉండటం అవసరమనడానికి ఇదే ఆధారం. దోషిగా ఆరోపణకు గురైన వ్యక్తి, తనను తాను పవిత్రమూర్తిగా భావించుకునే ఒక పెద్దమనిషి పార్టీకి చెందినవారు. తానేతప్పూ చేసి ఎరుగనని సదరు అభ్యర్థి ఖండిస్తారనడంలో సందేహం లేదు. తప్పును అంగీకరించడమంటే ఎన్నికల కమిషన్ విధించే శిక్షను ఆహ్వానించడమే. ఇలాంటి వ్యవహారాల విచారణకు సమయం పడుతుంది. అది పూర్తయ్యేసరికి ఎన్నికలు జరిగిపోయి చాలా కాలమే అయిపోతుంది. ఆలోగా ఈ పొగమంచులో నిజాన్ని మీడియా నుంచి దాచేసి, నిస్సిగ్గుగా ఎన్నికల ప్రచారం కొనసాగించవచ్చు. అయిచే నిజాన్ని ఎరిగిన బాపతు కూడా ఉన్నారు... వారు ఓటర్లు. ఎంతైనా మందు కొట్టడమమేది మహోత్సాహంగా సాగే వ్యవహారం. తాగుబోతులో లేదా మానసికంగా కుంగిపోయినవాళ్లో మాత్రమే ఒంటరిగానే ఆ పని కానిచ్చేస్తారు. శ్రీమాన్ ఐదు వేల సీసాల వారు కాస్త పాత కాలపు సజ్జు అని ఓ మోస్తరు విచారణ జరిపినా తెలిసిపోతుంది. అదే లక్ష్య సాధన కోసం ఇంతకంటే తెలివైన పద్ధతిని కనిపెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు ప్రత్యక్ష పంపిణీ కిందకు వచ్చే సీసాలను పంపిణీ చేయరు. సంతకాలు, ఆనవాలు లేని చిట్టీలను పంపిణీ చేస్తారు. ఆచూకీ కనిపెట్టడం కష్టమయ్యే ఆ చిట్టీలను పుచ్చుకుని సంబంధిత మద్యం వ్యాపారి మందు సీసా అప్పగించేస్తాడు. ఈ ఘటన ఒకటి రెండు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఇప్పుడు దొరికినది మొత్తం నిల్వ చేసిన దాన్లో ఓ చిన్న భాగమే అనే సమంజసమైన సూత్రాన్ని బట్టి చూద్దాం. శ్రీమాన్ ఐదువేల సీసాల వారి అవసరం పట్టుబడ్డ వాటికంటే తేలికగానే రెండు లేదా మూడున్నర రెట్లు ఉండవచ్చు. కాబట్టి ఆయన రాజకీయ విస్కీ వ్యయం కనీసం రూ. 20 లక్షలు. అంతకంటే ఎక్కువేనని దాదాపు నిశ్చయంగా చెప్పొచ్చు. అంటే ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఆ అభ్యర్థి మొత్తం ఎన్నికల వ్యయం రెండు కోట్ల రూపాయలకు పైనే. ప్రజా జీవితంలోని నిజాయితీయే తమ అత్యంత మౌలిక సూత్రమని చెప్పుకునే పార్టీ అభ్యర్థి ఆయన. అలాంటి నిజాయితీ నుంచి ఢిల్లీని ఆ భగవంతుడే కాపాడాలి. ఇంతకు ఈ లంచం పనిచేస్తుందా? మహా అయితే పాక్షికంగా పనిచేస్తుంది. మన సమాజం స్థిరంగానూ, ప్రగతిశీలంగానూ పరిణామం చెందుతోంది. కులం, మతం ప్రాతిపదికగా కలిగిన సంప్రదాయకమైన గెలుపు లెక్కలకు అతీతంగా ఓటు చేసే వర్గం ఒకటి దేశంలో ఆవిర్భవించిం దని తాజా ఎన్నికల జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. ఇది ఒక ఆరోగ్యకర పరిణామం. సంప్రదాయకమైన పాత లెక్కలూ ఇంకా ఉన్నాయి, ఢిల్లీ ఎన్నికల్లోనూ అవి కనిపిస్తాయి. కానీ ఎన్నికల ప్రక్రియలో వాటికి ఇప్పుడు అంత ప్రాధాన్యం లభించడం లేదు. ఇటీవలి జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించిన గణాంకాలలో ఒక అంశం ప్రత్యేకించి ఆసక్తికరం. శ్రీనగర్ అంచున, దాల్ లేక్ ఒడ్డునున్న హజరత్బల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మసూద్ అల్ హస్సన్‌కు 2,635 మంది కశ్మీరీలోయ ఓటర్లు ఓటు చేశారు. ఇదేమంత పెద్ద సంఖ్య కాదనిపిస్తుంది. కానీ అవి మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 10 శాతం, కాంగ్రెస్‌కు లభించిన వాటికి రెండున్నర రెట్ల కంటే ఎక్కువ. హజరత్బల్ చాలా ప్రత్యేకమైన స్థలం. మొహమ్మద్ ప్రవక్త శిరోజం మె-ఎ ముకద్దాస్ అనే పవిత్ర అవశేషం ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ప్రార్థనా స్థలం. అక్కడ కమలం గుర్తుకు అనుకూలంగా ఓటింగ్ మిషన్ మీటను నొక్కిన ఓటర్లు ఎవరు? వాళ్లదొక కొత్త వర్గం. జాతి లేదా భావోద్వేగాలపరమైన అంశాలకంటే అభివృద్ధి, ఉద్యోగాలను మరింత ముఖ్యమైనవిగా భావించే బాపతు. దేశంలో ఇతర చోట ్లకూడా అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చే ఇలాంటి వర్గం ఓటర్లలో అధిక భాగంగా మారుతోంది. ఈ ఓటర్లలో మహిళలు, యువతదే అగ్రశ్రేణి. రెండు కారణాల వల్ల ఢిల్లీ మహిళలలో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గుతున్నారు. లైంగిక సమానత్వం, మహిళా సాధికారతలను ప్రధాని నరేంద్ర మోదీ తన పరిపాలనలోని విలక్షణ ఇతివృత్తంగా మలచారు. శక్తివంతమైన ఆయన ఉపన్యాసాలలోనూ, ‘‘బేటీ బచావో, బేటీ పడావో’’ ఉద్యమం వంటి విధానాలలోనూ కూడా ఇది కనిపిస్తుంది. అప్పుడే అది ప్రబల స్థాయి సహానుభూతిని కలగజేసింది. ఇక రెండవది, రకరకాల చింతలతో నిత్యం కుతకుతలాడే దేశ రాజధాని నగరంలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని కిరణ్‌బేడీ అర్థం చేసుకోగలరని వారికి నమ్మిక కలిగింది. అనుభవంగల పోలీసు అధికారిణి అయిన ఆమె అయితేనే మాటల హామీలకు మించి మరేమైనా చేస్తారని కూడా వారు విశ్వసిస్తున్నారు. అవినీతి నిర్మూలన, భద్రత, మరింత మెరుగైన జీవితం అనే మూడు అంశాలే ఢిల్లీ ఓటర్ల ప్రాథమిక డిమాండ్లు. నరేంద్ర మోదీ నాయకత్వం, ఢిల్లీలో బేడీ పరిపాలనాధికారం కలసి ఆ మూడు అంశాలకు సంబంధించి ఓటర్లకు తిరిగి నమ్మిక కలిగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఉద్వేగభరితమైన ఓటర్ల నుంచి లేదా భయం రాజకీయాలు సోకి బాధపడుతున్న వారి నుంచి ప్రధానంగా మద్దతు లభిస్తోంది. ఇది క్షేత్రస్థాయి వాస్తవికతను ప్రతిఫలించే అంచనాయే తప్ప తీర్పు కాదు. ఆ అర్థంలో ఆప్ గతించిన కాలానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఢిల్లీ ఓటర్లది అత్యంత మిశ్రమ సంపుటి. ఆ అంశమే దే శంలోని ఇతర ప్రాంతాలకు ఆ నగరం సూక్ష్మ రూపమని వ్యాఖ్యానించేట్టు ప్రేరేపిస్తుంది. అయితే అది కట్టుకథ. ప్రతి ఓటరూ తన తక్షణ ఆవరణంలోని సమస్యల ప్రాతిపదికపైనే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి బిహార్‌లో జనతాదళ్ (యూ) కొంత వరకు పనిచేయవచ్చు. కానీ ఢిల్లీలోని బిహార్ సంతతి ఓటర్లలో సైతం అది పనిచేయదు. మనం కోరుకునే పార్టీయే గెలవాలని అంతా ఆశిస్తాం. శ్రీమాన్ ఐదు వేల సీసాలవారు ఓటమిపాలు కావాలని కూడా అంతగానూ మనం అంగీకరిస్తాం. -
గుడ్ మార్నింగ్... 2015!
బాధ జీవితానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నింటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం కాబట్టే, నర కాన్ని అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహ లోక కాలంలోని కొన్ని రోజులను ఏటా తాత్కాలిక స్వర్గం కోసం కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవ దూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు. మానవుడు భగవంతుని అద్భుత సృష్టి. మనం భగవంతుణ్ణి విశ్వసించడానికి కారణం మాత్రం అది కాదు. నైతికంగా రెండు భిన్న ధ్రువాలుగా చీలిపోయి ఉన్న మానవ జాతి ఇంతవరకు తాను సాధించిన దాని నుండి ఇంకా నేర్చుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. గతంలో సుల్తాన్ మొహ్మద్ గజనీ భారత దేశాన్ని కొల్లగొట్టి వెళ్లాక, సూఫీ శాంతి ప్రబోధకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వచ్చాడు. వర్తమానంలోనైతే నరహంతక తాలిబాన్‌కు ముందటి గాంధేయ వాది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ను అలాగే చెప్పుకోవచ్చు. ఇలాంటి పోలిక తేవడం... ఉద్రిక్తపూరితమైన ఈ భూమి అనే తిరిగే గోళం మీద మంచీచెడు సగం-సగం, ఒకదానికొకటి సరి అనే బూటకపు సమానత్వా న్ని సూచించనూ వచ్చు. హింసను, దాని ఆటవిక చుట్టపట్టాలను చల్లార్చడంతోనే లేదా వ్యవహరించడంతోనే మన సమయంలో చాలా ఖర్చయిపోతోంది. బాధ జీవించడానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నిటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం. కాబట్టే నర కాన్ని మనం అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహలోక కాలంలోని కొన్ని రోజుల భాగాన్ని ఏటా తాత్కాలిక స్వర్గం కోసం విడిగా కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవదూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు. దాతృత్వం అనే పదం దర్పాన్ని సూచించే చికాకైన పదం. అందుకు ఇస్లాం సిద్ధాంతం పరిష్కారాన్ని సూచించింది. చీదర పుట్టించే విధంగా అహంకార ప్రదర్శనకు తావే లేకుండా నిర్మూలించడం కోసం దాతృత్వం గుప్తంగానే జరగాలని శాసించింది. ఇవ్వడానికి తగిన పద్ధతి ఉండేట్టయితే, తీసుకోడానికి కూడా అలాగే తగిన పద్ధతి ఉండాలి. తీసుకునేదాన్ని అది బాల దృష్టితో, హృదయంతో చూసేదిగా ఉండాలి. బాలలు కోరినది కావాలనుకుంటారంతే. డబ్బు విషయం వారికి పట్టదు. అలాంటప్పుడు విలువను లెక్కగట్టేది సంతోషంతోనే తప్ప, వ్యయంతో కాదు. మనకు కనిపించేదానికి భిన్నంగా పిల్లలు వాస్తవికవాదులు. పెద్దవారు దురాశతో లేదా ఆకాంక్షతో లేదా పైకి ఎగబాకడం లేదా కిందికి దిగజారడం వల్ల ప్రేరేపితులై ఉంటారు. కాబట్టి బెలూన్ అవసరమైన చోట అంతరిక్ష నౌక కావలసి వస్తుంది. అదే పిల్లాడైతే బెలూన్‌నే రోదసి నౌకగా మార్చేసుకోగలుగుతాడు. పిల్లవాడికి అతి మంచి కానుక... ఏ చెట్టుకో వేలాడదీసినది, చక్కగా ప్యాకింగ్ చేసి ఉన్నది కానవసరం లేదు. దాన్ని ఇచ్చిన సమయమనేదే ముఖ్యం. క్రిస్మస్కు కేంద్ర బిందువు జీసస్ క్రిస్ట్ జననం. ఆ కథనం స్థానికతను ఎప్పుడో అరుదుగా గానీ ప్రశ్నించరు. ఎందుకంటే పాత నిబంధన దాన్ని ముందుగానే చెప్పింది. రాజులు భగవంతుని పాదాల ముందు బంగారం, సాంబ్రాణి, గుగ్గిలం సమర్పించి కొలవడం ఆ వేడుక పాటలో ఉన్నాయి. ఆ బిడ్డకు తల్లి మేరీ అతను తన ఒడి నుండి శిలువనెక్కేవరకు ఏం ఇచ్చింది? ముగ్గురు జ్ఞానులు లేదా రుషులు లేదా రాజులు సమర్పించిన మూడు ద్రవ్యాలు అప్పటికే చాలా కాలంగా ఏ ఒక్క మతానికో చెందనివి అన్న గుర్తింపును పొందిన సుప్రసిద్ధ కానుకలు. జ్ఞాపకాలన్నిటిలాగే, ఈ విషయంలో కూడా ఒకటికి మించిన కథనాలున్నాయి. ఒక నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు రాజులు బెత్లహామ్‌కు చేరారని సెయింట్ మాథ్యూ నిబంధన తెలుపుతోంది. విశ్వాసాన్ని నిర్దిష్టమైన పుట్టుపూర్వోత్తరాల గొలుసుగా చూపాలని పండితులకు తెగ ఆత్రుత. ఆ ముగ్గురు రుషులు పర్షియాకు చెందినవారని, పవిత్రాగ్నికి కావలిదారులని, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, వైద్యశాస్త్రాలలో ఉద్దండులని వారు భావిస్తున్నారు. పర్షియా లేక భారతదేశం నుండి వారు వచ్చి ఉండాలి. నేడు దేవుడేలేని చైనా, కమ్యూనిస్టు వ్యామోహంతో వెంటబడుతున్న సిల్క్ రూట్ వెంబడే వాళ్లు అక్కడికి చేరి ఉండాలి. ఏదేమైనా వాళ్లు తూర్పు దిక్కు నుంచి వచ్చిన వారేనని అంతా అంగీకరిస్తారు. క్రైస్తవ మతం పాశ్చాత్య విశ్వాసంగా ఎంత ప్రబలంగా విస్తరించిందంటే... అది మనం దాని ఆసియా మూలాలను మరిచిపోయేట్టు చేస్తుంటుంది. ఆ మతానికి చెందిన ప్రథమ కుటుంబాన్ని గోధుమ వర్ణపు ఛాయలతో ప్రాచీన చర్చి మత చిత్రకళ సరిగ్గానే చిత్రించింది. ఆ తదుపరి తొలి పునరుజ్జీవనోద్యమ కాలంనాటి శ్వేత వర్ణ ఛాయలతో కూడిన చిత్రాలకు అవి భిన్నమైనవి. మేరీ తల అప్పుడూ, ఇప్పుడూ నిరాడంబరమైన శిరోవస్త్రాన్ని ధరించి ఉంటుంది. అది ఆమె యుగపు అలవాటు. ఖురాన్లో మేరీ గురించి ఒక అధ్యాయం ఉన్నదని, ముస్లింలు జీసన్‌ను (ఇసాగా పిలుస్తారు) తమ గొప్ప ప్రవక్తలలో ఒకరిగా మన్నిస్తారని కూడా మనం అంతే సులువుగా మరుస్తుంటాం. ఖురాన్, ఇసాను రుహుల్లా లేదా అల్లా ఆత్మగా స్తుతిస్తుంది. జీసస్‌ను శిలువ వేశారని ముస్లింలు అంగీకరించరు. ఆయనను రక్షించి, తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేశారని, ఆ తదుపరి ఆయన రోమన్ సామ్రాజ్యానికి వెలుపల తన బోధనను కొనసాగించడానికి తూర్పు దిశకు వెళ్లాడని చెబుతుంది. క్రిస్మస్ వివాదాలకు సంబంధించినది కాదు. ముస్లిం టర్కీ ఒకప్పటి తమ అత్యంత సుప్రసిద్ధ పూర్వీకులలో ఒకరైన శాంతాక్లాజ్ ఖ్యాతికి సంతోషించనిద్దాం. క్రిస్మస్ కానుకలకు ఉండే దైవాంశను కలిగిన స్లెడ్జిబండిపై పయనించే ముసలాయన నార్డిక్ జాతివాడు కాదు. ఆయన సెయింట్ నికోలస్. 270లో దక్షిణ టర్కీలో, అది ప్రధానంగా క్రైస్తవ ప్రాంతంగా ఉన్న కాలంలో జన్మించి, మైరాకు బిషప్‌గా ఎదిగాడు. నేడు ఆ పట్టణాన్ని దెమ్రెగా అని పిలుస్తారు. స్థానికులు తమ హీరోను ‘‘నోయెల్ బాబా’’గా గౌరవిస్తారు. ఆయన చ ర్చి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. బిషప్ తన మహిమతో తండ్రులు నరికేయగా మరణించిన ముగ్గురు కుమారులను బతికించాడు. అందుకే మరణించిన కొద్దికాలానికే ఆయనను పవిత్ర ప్రబోధకునిగా గుర్తించారు. మరొక గాథ, వరకట్నం చెల్లించలేక బానిసలుగా అమ్మేస్తున్న ముగ్గురు కుమార్తెలకు సంబంధించినది. ఆయన సంచి నిండా బంగారాన్ని వారి ఇంటికి తెచ్చాడు. ఆ తర్వాత అంతా సంతోషంగా గడిపారు. ఆసక్తి ఉన్నవారికి మరొక విశేషం... సెయింట్ నికోలస్ ఎన్నడూ ఎర్ర గౌను వేసుకొని ఎరగడు. అది కోకా కోలా మార్కెటింగ్ శాఖ పాప్ సంస్కృతికి చే సిన చేర్పు. ఎప్పటిలాగే మనమంతా భవిష్యత్తుపట్ల ఆత్రుతతో 2015 కోసం వేచి చూస్తూ, సుహృద్భావాన్ని కోరడం, శాంతి కోసం ప్రార్థించడం మరీ పెద్ద కోరికేమోనని ఎవరైనాగానీ ఆశ్చర్యపోవాల్సిందే. కాబట్టి నేను కూడా ఓ పిల్లవాడిలాగా సాధ్యమైనదానితోనే సరిపెట్టుకుంటాను. భారతదేశంలో శాంతి విలిసిల్లాలని, వచ్చే 51 వారాల్లో భారతీయులందరి మధ్యనా సుహృద్భావం నెలకొనాలని కోరుకుంటాను. ఇక ఆ 52వ వారం సంగతి అదే చూసుకుంటుంది. -
‘మార్పిడి’కి విరుగుడు చట్టమే
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఆగ్రా ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పార్టీలు... ‘మత మార్పిడుల వ్యతిరేక చట్టం’ ప్రతిపాదన వద్దకు వచ్చేసరికి పాక్షికంగా మూగబోయాయి. అలాంటి చట్టం ఆగ్రా త రహా ఘటనలు భవిష్యత్తులో జరిగితే దాన్ని సూటిగా క్రిమినల్ నేరంగా గుర్తిస్తుంది. ప్రలోభాలతో జరిపే మత మార్పిడులు ఎవరు చేసినా... హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధమతాలు ఏవి చేసేవైనా వాటికి అడ్డుకట్ట వేస్తుంది. మతం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంగా ఉండటమే ఆదర్శప్రాయం. వేల ఏళ్ల వివాదాస్పద చరిత్ర గలిగిన సామాజిక సమస్యకు చట్టం ఎల్లవేళలా అత్యుత్తమ పరిష్కార మార్గం కాదు. అయితే ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ఘటనలను నియంత్రించలేవు. కొన్ని సందర్భాలలో, ఘటనలే ప్రభుత్వాలను నియంత్రిస్తాయి. ఆగ్రాలో పేదరికం, వలస రావడం సహా ఎన్నో రూపాలలోని ఒత్తిడుల కింద మనుగడ సాగిస్తున్న కొందరు ముస్లింలను ‘‘పునఃపరివర్తన’’ చెందించాలని కొందరు కరడుగట్టిన మతవాదులు భావించారు. ఈ ఘటన మత సంబంధాల విషయంపై అంతర్గతంగా పెల్లుబుకుతున్న అంతర్వాహినిని బయటకు తెచ్చింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ స్పందన సూటిగానూ, గందరగోళానికి తావులేనివిధంగా, సుస్పష్టంగా ఉంది. అది సమస్యను మూలం నుంచి చర్చించింది. బలవంతపు మత మార్పిడుల నిరోధక చట్టాన్ని చేయడానికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరింది. ఇందులోని క్రియాత్మక పదం ‘బలవంతపు’. దీనితో న్యాయపరంగా గానీ లేదా నైతికపరంగాగానీ ఎలాంటి సమస్యా ఉండకూడదు. ఏ మత విశ్వాసమూ అందుకు అనుమతించదు. బలవంతపు మత మార్పిడి అర్థరహితం ఉదాహరణకు, ఖురాన్ ఈ విషయంలో చాలా విస్పష్టంగా ఉంది. సురా 2 వచనం 256 నిస్సంశయంగానూ, విస్పష్టంగానూ ఇలా చెప్పింది: ‘‘మతం లో ఎలాంటి నిర్బంధమూ ఉండనీయరాదు.’’ అబ్దుల్లా యూసఫ్ తన ప్రామాణిక అనువాదంలో ఆ అంశాన్ని ఇలా వివరించారు. ‘‘బలవంత పెట్టడానికి, మతానికి పొంతన కుదరదు. ఎందుకంటే మతం విశ్వాసంపై, అభీష్టంపై ఆధారపడినది. వాటిని బలవంతంగా ప్రేరేపించడం అర్థరహి తం...’’ గతంలో బలాన్ని ప్రయోగించి ఉంటే అది తప్పు. ఏది ఏమైనా ప్రజాస్వామిక సమాజంలో అందుకు తావులేదు. ఉదారవాద హిం దూ సిద్ధాంత, తత్వశాస్త్రాలలో సైతం బల ప్రయోగానికి సామంజస్యం లేదు. అలాంటి చట్టం తేవాలంటే పార్లమెంటే గాక, ఇతర సంస్థల మద్దతు కూడా కావాలని అనవచ్చు. విశ్వసనీయత గలిగిన మత నేతల వివేచనాయుతమైన అభిప్రాయాలను కోరడానికి వీలుగా ప్రభుత్వం ఈ చర్చ పరిధిని విస్తరించి, నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అప్పుడు మనకు ఎవరు, ఎక్కడ నిలుస్తారనేది తెలుస్తుంది. అయితే అంతిమంగా ఆ బాధ్య త పార్లమెంటుది, అందులో ప్రాతినిధ్యం వహించే పార్టీలది. సభలో మూగబోయిన పార్టీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఆగ్రా ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పార్టీలు ఈ ప్రతిపాదన వద్దకు వచ్చేసరికి పాక్షికంగా మూగబోయాయి. మత మార్పిడి వ్యతిరేక చట్టం ఆగ్రా త రహా ఘటనలు భవిష్యత్తులో జరిగితే దాన్ని సూటిగా క్రిమినల్ నేరాన్ని చేస్తాయి. ప్రలో భాలతో జరిపే మత మార్పిడులు ఎవరు చేసినా... హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధమతాలు ఏవి చేసేవైనా అడ్డుకట్ట వేస్తుంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వివిధ రకాల జనతాదళ్‌లు, మార్క్సిస్టుల లక్ష్యం ఇదేనని ఎవరైనా భావిస్తారు. వాస్తవానికి, మతం పట్ల మార్క్సిస్టుల సంశయాత్మకత వల్ల వారు ఈ అంశంపై ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని ఆశిస్తాం. కానీ అందుకు బదులుగా వారు దాన్ని వెనక్కునెట్టే వైఖరిని నర్మగర్భంగా చేపట్టారు. ఎందుకు? పాలకపక్షం స్పష్టవైఖరి ప్రధాని నరేంద్ర మోదీ నుండి ప్రారంభించి ప్రధానంగా ప్రభుత్వం తరఫున మాట్లాడిన వారంతా... ఎన్నికైన ప్రభుత్వం విధి... మంచి పరిపాలనను అందించడమే తప్ప, ఏ రూపంలోని మతతత్వాన్నీ ప్రోత్సహించడం కాదని స్పష్టంగా చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నాటి ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. వినిపిం చుకునే వారు ఎవరికైనాగానీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదే చెబుతూ వచ్చారు. నేటి భారతావనికి కావలసిందీ, అది డిమాండు చేసేదీ దేశం సౌభాగ్యవంతం కావడానికి రహదారే తప్ప, ఉద్వేగవాద రాజకీయాలు, విరోధాలు కావు. శాంతి లేనిదే సౌభాగ్యం కలగదని, శాంతి మొదలు కావాల్సింది ఇంటి నుంచేనని పామర జ్ఞానం చెబుతుంది. పేదల సంక్షేమమే విధి ప్రతి ప్రభుత్వమూ వచ్చేటప్పుడు తన సొంత పనికిరాని సామాన్ల బరువును మోసుకుంటూనే వస్తుంది. అయితే ఆ బరువు దాని ప్రయాణా నికి ఆటంకంకారాదు. నేటి మన కేంద్ర ప్రభుత్వం ఎక్కడికి పోవాలను కుంటోంది? దాని దృష్టి పథం విస్తృతి ఎంత? 2019లో తిరిగి ప్రజాతీర్పు ను కోరే నాటికి అది ఎక్కడ ఉండాలని కోరుకుంటోంది? సమాధానం విషయంలో గందరగోళానికి తావేలేదు. ప్రధాని తన తొలి లోక్‌సభ ఉప న్యాసంలోనే, పేదల సంక్షేమం కోసం కాకపోతే ప్రభుత్వం అవసరమేమిటి? అని చెప్పనే చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలిచింది ‘అందరికీ అభివృద్ధి’ అనే సామాన్యమైన సందేశంతోనే. ‘అందరికీ’, అందులోనే మైనారిటీలూ ఉన్నారు. భారత ముస్లింలు ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని ఈ సందర్భంగా పదేపదే చెప్పారు. ఆ కేంద్ర సందేశంలోని ఏ భాగాన్నీ రవ్వంతైనా ఆయన మార్చిం ది లేదు. సందేశాన్ని పలచబారేట్టు లేదా గందరగోళపరచేట్టు చేసేవారు ప్రధాని మోదీకి ఏమీ మంచి చేయడం లేదు. మతం వ్యక్తిగతమైనదే కానీ... అసంబద్ధమైన ఈ గోలలో పడి ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో సంస్కరణలకు తిరిగి దిక్సూచిని నెలకొల్పగలిగిందనే విషయం మరుగున పడిపోయింది. సంశయవాదులకు సమాధానం చెప్పడానికి ఇన్సూరెన్స్ నిబంధనల్లో మార్పులు చాలు. జాతీయీకరణను తలకిందులు చేసే చర్య అంటూ వామపక్షం నుండి అలవాటు గా వినవచ్చే శబ్దాలెలా ఉన్నా బొగ్గు బిల్లు ఆమోదం పొందింది. ఇక జీఎస్టీకి సంబంధించి చిట్టచివరి ఆటంకం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుండి వచ్చింది. దీన్ని సైతం వర్షాకాల సమావేశాల నాటికి పరిష్కరించాల్సిందే. బెంగాల్ ముఖ్యమంత్రి ఆందోళన, దేశం గురించో లేదా దేశ ఆర్థిక వ్యవస్థ గురించో కాదు. శారదా కుంభకోణానికి, ఆమె మంత్రివర్గ సహచరుడు మదన్ మిత్రాకు ఉన్న సంబంధాన్ని సీబీఐ కనిపెట్టడమే అందుకు కారణం. కెవ్వున కేకపెట్టడమే అందుకు సమాధానమని ఆమె దురదృష్టవశాత్తూ అనుకుంటున్నారు. కానీ ఓటరు అంతకంటే తెలివైన వాడని గుర్తించాలి. మతం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంగా ఉండటమే ఆదర్శప్రాయం. అదే సమయంలో ప్రజాజీవితానికీ ఓ గ్రంథం ఉంది... అది రాజ్యాంగం. రాజకీయాల ఏకైక కర్తవ్యం ప్రజలకు ఎక్కువ మేలు చేయడమే. -
నాలుగో ప్రపంచ యుద్ధం!
1919లో బ్రిటిష్, ఫ్రెంచ్ వలసవాదులు వదిలి పోయిన తర్వాత అరబ్బు ప్రపంచం ముక్కలు చెక్కలైంది. నయావలసవాద స్వర్గధామమైంది. ఉపయోగించుకోకుండా ఉండే షరతుపై నయావలసవాదం స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ ప్రాంతాల్లోని పాలక కుటుంబ వ్యవస్థలు త్వరలోనే వ్యక్తిగత సంపద కు, జాతీయ వనరులకు మధ్య సరిహద్దు రేఖలను మసకబరిచాయి. ప్రతి ప్రయోగమూ నియంతృత్వాల వైపే దొర్లుకుపోయింది. పాశ్చాత్య దేశాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునే సాధనంగా యుద్ధానికి దిగడం లేదా మరింత హేయమైన పద్ధతుల్లో ప్రభుత్వాలను మార్చడం వల్ల జరిగిన మేలేమీ లేదు. యుద్ధాలు చాలావరకు గందరగోళపు ఉపోద్ఘాతంతో మొదలై, తరచూ చేదు ఉపసంహారంతో ముగుస్తాయి. 1919 నాటి వర్సెయిల్స్కు 1939కి మధ్య ఉన్న పీటముడి నేడు ప్రామాణిక జ్ఞానమే. యుద్ధానంతరం విజేతలు యూరప్‌ను తమలో తాము పంచేసుకొని, గెలుచుకున్న భూభాగాల రక్షణ కోసం మోహరించిన యాల్టాలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. అఫ్ఘానిస్థాన్‌లో సోవియట్ యూనియన్ ఓటమితో ప్రచ్ఛన్న యుద్ధం అంతం కాగా, సరిగ్గా అక్కడే ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం మొదలైంది. అఫ్ఘాన్ పోరులో మిత్రులై నిలిచినవారు దాదాపుగా విజయం సాధించిన వెనువెంటనే ఒకరికొకరు విరోధులయ్యారు. 1945 నాటి విజేతలు చేసింది కూడా చాలా వరకు ఇదే. హఠాత్తుగా ఇస్లామిజం వృద్ధి చెందడంతో అమెరికా, యూరప్‌లు దిగ్భ్రాంతికి గురయ్యాయి. చిట్టచివరి ముస్లిం మహాసామ్రాజ్యమైన అట్టోమన్ ఖలీఫా సామ్రాజ్యాన్ని ఛిన్నాభిన్నంచేసి, వలసీకరణం చెందించిన 1919 నాటి ద్వితీయ కథనాన్ని విస్మరించడమే వారి నివ్వెరపాటుకు కారణం. సమస్యాత్మకమైన ఒక శతాబ్ది గడిచిన తదుపరి... నాలుగవ ప్రపంచ యుద్ధం తో కలగలిసేలా మొదటి ప్రపంచ యుద్ధం మళ్లీ తిరిగి వస్తోంది. ప్రపంచంలోనే ముస్లిం జాతుల ప్రజలు అత్యధికంగా ఉన్న భారత ఉపఖండంలోని మొఘల్ సామ్రాజ్య అవశేషాలను బ్రిటన్ 1919కి దాదాపు ఏడు దశాబ్దాలకంటే ముందుగానే భూస్థాపితం చేసింది. (విక్టోరియా రాణి పాలన కిందనే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారంటూ నాటి చాదస్తపు పొగరుబోతు రాజకీయ వేత్తలు... నిజమైన ఖలీఫా ఆమే అంటూ అట్టోమన్లను వేధించేవారు.) 1919లో ఒక విపరీత పరిణామం జరిగింది: యూరోపియన్ దేశాలు ముస్లిం భూభాగా ల్లో ప్రతి ఒక్కదాన్నీ ఆక్రమించడమో లేక వలసగా మార్చడమో చేశాయి. అది వారికి భరింపశక్యం కానంతటి పెద్ద అవమానం. గంగా నది నుండి నైలు నది వరకు అంతటా ముస్లింలు గత వైభవ పునరుద్ధరణ కోసం అన్వేషించారు, అలా పరితిపించడంలోనే సౌఖ్యాన్ని పొందారు. ఖలీఫా రాజ్యం వాస్తవంగా ఎన్నడూ లేనంతటి ఉజ్వలమైనదిగా జ్ఞాపకాలలో భాసిల్లింది. ఖలీఫా రాజ్యం పట్ల ఈ ఆరాధన ఒక శక్తివంతమైన ప్రేరణ అయింది. ముస్లింలు నిరంతర ముట్టడిలోనున్న యుగంలో ఖలీఫా రాజ్యం ఇస్లాం మత, మత పవిత్ర స్థలాల పరిరక్ష ణకు సంకేతమైంది. గత వైభవానికి ఉద్వేగభరితమైన సంకేతమైంది. తమ సొంత నియంతల నిరంకుశత్వం నుండి ముస్లింలకు రక్షణగా షరియా ఉంటుందన్న భరోసాను వారికి కలిగించింది. భారత దేశంలో మహాత్మా గాంధీ మహాశక్తిని 1919-1922 మధ్య బ్రిటిష్ వ్యతిరేక ప్రజోద్యమంలోకి ముస్లింలను ఆకర్షించడానికి ఉపయోగించుకున్నారు. 1924లో టర్కీ ఖలీఫా వ్యవస్థను నిషేధించడం నాటి ఖిలాఫత్ ఉద్యమానికి పరిహాసోక్తిలాంటి ముగింపు. ముస్తఫా కెమల్ పాషా నేతృత్వంలోని టర్కీ 20వ శతాబ్దంలోకి హేతుబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. హాప్స్బర్గ్లు, జార్లలాగే ఖలీఫాలు కూడా ప్రయోజనాన్ని కోల్పోయినా ఇంకా మిగిలివున్న యుగానికి చెందినవని గుర్తించింది. భారత ముస్లింలలోని ఉన్నతవర్గాలు బ్రిటన్ కత్తితో 1947లో తమకంటూ ప్రత్యేకంగా పాకిస్తాన్‌ను విడిగా కత్తిరించి తీసుకున్నారు. దీంతో వారికి వారి ఆందోళనల నుండి ఉపశమనం లభించింది. భగవంతుని భౌగోళికత పాకిస్తాన్‌ను ఉపఖండానికి రెండు కొసల్లోను ఉండే రెండు భాగాలుగా విడదీసింది. అయినాగానీ మతం వాటిని ఐక్యం చేయగలదని పాకిస్థాన్ వెర్రిగా విశ్వసించింది. నిజానికి పాకిస్థాన్ దక్షిణాసియా టర్కీ కాగలిగేదే. కానీ అందుకు బదులుగా అది మతపరమైన ఉద్వేగాలను, ప్రజాస్వామ్యాన్ని కలగలిపింది. ఆ రెండు ప్రపంచాలలోనూ అది అత్యంత అధమమైన దాన్ని సాధించడంలో సఫలమైంది. వలసవాద అనంతర కాలంలో పాకిస్తాన్ దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి ఇస్లామిక్ దేశం అయింది. ప్రజల్లో సమంజసత్వాన్ని సంపాదించుకోడానికి అనివార్యంగానే అది జిహాద్ జెండాను పట్టిన నానా గోత్రీకులైన ఉగ్రవాదులకు సురక్షిత స్థావరమైంది. 1919లో బ్రిటిష్, ఫ్రెంచ్ వలస యజమానులు వదిలి పోయిన తర్వాత అరబ్బు ప్రపంచం ముక్కలు చెక్కలైంది, చీలికలు పీలికలైంది. నయావలసవాద స్వర్గధామమైంది. ఉపయోగించుకోకుండా ఉండే షరతుపై నయావలసవాదం దేశాలకు, ప్రజలకు స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తుంది. అదైనా ఆర్థిక సాధికారత, ప్రజాస్వామిక స్వేచ్ఛలతో కూడినదై ఉండి ఉంటే అదేమైనా పనికొచ్చి ఉండేదేమో. కానీ నయావలసవాదం అలా ఉండాలనే యోచనే ఒక వైరుధ్యం కావచ్చు. కుటుంబ వ్యవస్థలు త్వరలోనే వ్యక్తిగత సంపదకు, జాతీయ వనరుల కు మధ్య సరిహద్దు రేఖలను మసకబరిచాయి. వామపక్షం నుండి పుట్టుకొచ్చినదైనా లేక మితవాదపక్షం నుండి పుట్టుకొచ్చిందైనాగానీ... ప్రతి ప్రయోగమూ మృదువైన లేదా కఠోర నియంతృత్వం వైపే దొర్లుకుపోయాయి. పాశ్చాత్యదేశాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునే సాధనంగా యుద్ధానికి దిగడం లేదా మరింత హేయమైన పద్ధతుల్లో ప్రభుత్వాలను మార్చడం వల్ల జరిగిన మేలేమీ లేదు. ఆధునికతకు సంబంధించిన వైఫల్యమేదైనాగానీ ఊహాత్మకమైన గతానికి ఆహ్వానం పలికేదే. రాచరిక పితృస్వామ్యం నుండి నాజర్ తరహా జనరంజక విధానాల వరకు, బాతిస్టుల ఉదారవాదం వరకు అన్ని నమూనాలు మిగతావాటిలాగే సైనిక నియంతృత్వానికి దారితీశాయి. చివరకు తాత్కాలిక ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లువెత్తినా... అదీ కుప్పకూలింది, అణచివేతకు గురైంది. కడకు నిలచినది మత విశ్వాసానికి తిరిగి పోవడమనే భావన ఒక్కటే. వర్తమాన నేపథ్యంలో దీనికి అర్థం ఏమిటో ఏ ఒక్కరికీ తెలియదనేది వేరే సంగతి. అది చేసింది ఒక్కటే... మదీనా పట్ల విశ్వాసాన్ని తగ్గించి, అరేబియాలోనూ, భారత్‌లోనూ ఇస్లామిక్ మిలిటెన్సీ పుట్టి పెరిగేలా చేయడం మాత్రమే. ఆ ధోరణి ముస్లింలలో అభద్రతను, తీవ్రవాదాన్ని పెంపొందింపజేసి నిరాశావాదాన్ని రేకెత్తించడానికి తోడ్పడిందే. తద్వారా మన దేశంలో భ్రమాత్మకమైన విముక్తి ముసుగులోని అరాచక పరిస్థితుల అన్వేషణలో వెర్రిగా మారిన జిహాద్‌కు ప్రేరణ లభించింది. ఈ క్షీణత అతి వేగంగా సాగింది. నేడు పాకిస్తాన్ నుండి ఉత్తర ఆఫ్రికా వరకు అల్లకల్లోలంగా ఉంది. ఆ ప్రాంతంలో చాలా ప్రభుత్వాలు ఏకాకులయ్యాయి, దేశాలు అదుపు తప్పి పోతున్నాయి. ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం జిహాద్ అనేది రాజ్యం ప్రకటించేదిగా ఉండటమనేదే మౌలిక ఆవశ్యకత. ఈ సంప్రదాయ విరుద్ధమైన జిహాద్ ప్రమాదకరంగా విస్తరిస్తుండటమే సిద్ధాంతాన్ని వదిలేసిన ఆచరణవల్ల కలిగే ప్రమాదాలకు రుజువు. జిహాద్‌కు లక్ష్యాలుగా ఉన్న ‘సుదూరంలోని శత్రువు’ అంటే ప్రధానంగా అమెరికా, కాగా, ‘సమీప శత్రువు’ అంటే తక్షణ పరిసరాల్లో వారితో వైరం గలవారంతా. ఇక ‘మూడో శత్రువు’ అంటే ఇస్లామిక్ భూభాగాలను ‘ఆక్రమించిన’ దేశాలు. భారత్, చైనాలు (జింజియాంగ్‌లో ముస్లింలు మెజారిటీ కాబట్టి) ఈ చివరి వర్గానికి చెందుతాయి. ఈ యుద్ధం ఎప్పుడు, ఎలా అంతమవుతుందో అంచనా కట్టడం కష్టం. అయితే ఇది మిగతా వారికి నష్టం కలిగించడం కంటే ముందే ముస్లిం ప్రజలకు వినాశనాన్ని కలుగజేస్తుంది. (నవంబర్ 21 నుండి 23 వరకు జరిగిన ‘‘హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్’’ ప్లీనరీ సందర్భంగా చర్చనీయాంశంగా రచించిన వ్యాసమిది.) -
‘బదాయూ’తో భారత్ బద్నాం!
ములాయంకు అత్యాచారం సంఘటన కన్నా ఓట్లు విలువైనవి. ఆయన పురుష దురహంకార ధోరణికీ, లింగపరమైన వివక్షకూ ముమ్మూర్తులా ప్రతీకగా నిలుస్తున్నారు. ములాయం, అఖిలేశ్ యాదవ్‌లు అత్యాచారాన్ని ఒక చిన్న సంఘటనగానే భావిస్తారు. ఇలాంటి రాజకీయాలు నడిపినందుకే ఇటీవల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. సభ్యసమాజం తలదించుకునేలా ఏదైనా అనాగరిక సంఘటన జరిగితే భయాందోళనతో నిశ్చేష్టులు కావడం ప్రజాస్వామ్య స్పందన కాజాలదు. ప్రజల అభిప్రాయాలను విననప్పుడు అది ప్రజాస్వామ్యమే కాదు.ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఇద్దరు దళిత యువతులను గ్యాంగ్‌రేప్ చేసి ఒక చెట్టుకు ఉరివేయడం చాలా ఘోరమైన సంఘటన. ఇది ఆ నేరగాళ్ల విపరీతబుద్ధికి నిదర్శనం. కులతత్వ దురహంకారంతోనే దళిత యువతులపై అఘాయిత్యానికి ఒడిగట్టారని స్పష్టమవుతూనే ఉంది. ఈ సంఘటనలోని సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పోలీసులు, అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. అంతేకాదు స్థానిక పోలీసులు తమను కాపాడతారన్న ధీమా రేపిస్టుల్లోనూ, హంతకుల్లోనూ ఉంది. వెలుగుచూడని కేసులు మరెన్నో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అత్యాచార సంఘటనల్లో ఎంతమంది బాధిత యువతులు అవమానంతో కుంగిపోయారో? గ్రామాల్లో కుల కండకావరంతో రెచ్చిపోయే కీచకుల అఘాయిత్యాలతో ఆ బాధిత యువతుల మౌనంలో ఎన్ని కేసులు వెలుగులోకి రాకుండా మూలనపడ్డాయో ఎవరికి ఎరుక? జీవితంలో ప్రశాంతత కోసం పరుగులు పెట్టే మనలో కొందరు భయంకర వాస్తవాన్ని తెలుసుకోడానికి ఇష్టపడరు. అణచివేత బహు రూపాలుగా సాగుతుంది. దానికి ఎన్ని సాకులైనా చూపించుకోవచ్చు. అణచివేత ఒక జాతిలో వివిధ స్థాయిల్లో కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ అసహ్యకర పరిణామాలను నిలువరించేందుకు ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య సాధనాలు మనకు ఉపయోగపడవు. అందుకే పౌరులు అప్పుడప్పుడు బిగ్గరగా నిరసనలు ప్రకటిస్తారు. దాంతో మీడియా కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ సంఘటనలను ఎలుగెత్తి చాటుతాయి. సమాజం మేలుకోవల్సిందిగా పిలుపిస్తాయి. కాని అధికారంలో ఉన్న వారు నిద్రలేస్తారా? ప్రస్తు తం ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దేశం లో ఇప్పుడు రాజకీయ నాయకుల వయసురీత్యా చూస్తే 40 ఏళ్ల అఖిలేశ్ యువకుడే. ముఖ్యమంత్రి కుర్రాడు కాబట్టి కొంత వివేకంతో ఆలోచిస్తాడని ఎవరైనా భావి స్తారు. అదే ఉద్దేశంతో దళిత యువతుల గ్యాంగ్‌రేప్ సం ఘటన గురించి కాన్పూర్‌లో ఒక మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం అక్కడి వారిని నిశ్చేష్టుల్ని చేసింది. ‘‘మీకేమీ కాలేదు కదా?’’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఒక మహిళా జర్నలిస్టునుద్దేశించి అనడం బట్టి ఎంత సిగ్గుమాలినతనంతో, తెంపరితనంతో ఆయన బదులిచ్చారో అర్థమవుతూనే ఉంది. మహిళా విలేకరులు ఇక అదృష్టంపైనే ఆధారపడాల్సి ఉంది. రాజకీయ నాయకుల్ని ఎక్కువగా ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టకూడదు మరి. తర్వాత ఎవరి వంతో ఎవరికి తెలుసు? ఇదే యూపీ ముఖ్యమంత్రి ప్రజలకిచ్చే సందేశం! పురుష దురహంకార ధోరణి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గ్యాంగ్ రేప్‌లకు సంబంధించి అఖిలేశ్ తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఒక సం చలన వ్యాఖ్య చేశారు. గ్యాంగ్ రేప్ సంఘటనలో దోషులుగా రుజువైన ముంబైకు చెందిన నలుగురు యువకులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నేరానికి పాల్పడిన వారు ఏ వర్గానికి చెందిన వారో ఆ వర్గీయుల ఓట్లపై కన్నేసిన ములాయం సింగ్ యాదవ్ దోషులను వెనకేసుకొచ్చారు. అలాంటి ‘బాల్యచాపల్య’ నేరాలకు అంతటి ఘోర శిక్షలేమిటని నిగ్గదీశారు. దీన్నిబట్టి సై ద్ధాంతికంగా మరణశిక్షను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా భావించనక్కర్లేదు. ములాయంకు అత్యాచారం సంఘటన కన్నా ఓట్లు విలువైనవి. పురుష దురహంకార ధోరణికీ, లింగపరమైన వివక్షకూ ము మ్మూర్తులా ఆయన ప్రతీకగా నిలుస్తున్నారు. యూపీని పాలిస్తున్న సీఎం నుంచి గప్పాలు కొట్టి కాలం వెళ్లదీసే వారూ, నేరగాళ్లూ, సోమరిపోతు పోలీసులూ ఏం తెలుసుకుంటారు? ములాయం, అఖిలేశ్‌ల పాలనలో అత్యాచారం అన్నది ఒక చిన్నపాటి సంఘటన మాత్రమే అని భావి స్తారు. ఇలా ద్వేషంతో రాజకీయాలు నడపడాన్ని ఇటీవల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. అందుకే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. బదాయూకు కొన్ని వేల మైళ్ల పశ్చిమాన పొరుగున పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక హృదయవిదారకరమైన సంఘటన జరిగింది. మే 27న మంగళవారం 25 ఏళ్ల గర్భవతిని ఆమె సన్నిహిత బంధువులే రాళ్లతో కొట్టి చంపారు. ఆమెను అక్షరాలా రాళ్లతో బంధువులే అత్యం త కిరాతకంగా కొట్టి చంపారు. లాహోర్ నగరంలో పట్టపగలు ఒక కోర్టు వెలుపల ఆ యువతి తండ్రి, సోదరులు, బంధువులలో 20 మంది మగవాళ్లు కలిసి రాళ్లతో చంపారు. ఇది పట్టపగలు జరిగిన హత్య, రాత్రి వేళ జరిగింది కాదు. తన అనుమతి లేకుండా తన కూతురు ప్రేమించిన యువకుడిని పెళ్లిచేసుకోవడంతో ఆగ్రహించిన ఆ తండ్రి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాదు, కూతుర్ని రాళ్లతో కొట్టి చంపినందుకు ఆ తండ్రి విచారించలేదు. పైగా అదే తగిన శిక్ష అని సమర్థించుకున్నాడు కూడా. ఈ క్రూరమైన హత్యాకాండకు పాల్పడిన వారి మానసిక ధోరణి ఎన్ని శతాబ్దాలు తిరోగమనంలో ఉందో చెప్పకనే చెపుతోంది. అయితే నాకు చిన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఒక మహిళను పట్టపగలు రాళ్లతో కొట్టి చంపుతుంటే, ఇంతటి ఘోరమైన దురంతం జరుగుతుంటే ఎవరూ ఎందుకు ఆపలేకపోయారు? పాకిస్థాన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లాహోర్‌లో, అదీ... ఒక కోర్టు బయట జరిగింది. సాధారణంగా కోర్టు బయట పెద్ద సంఖ్యలో ప్రజలు తిరుగాడుతుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా పోలీసులు డ్యూటీలో ఉంటారు కూడా. ఒక రాయి విసిరి ఒక అమ్మాయిని చంపలేం. ఆమె ఆటవిక తండ్రి, సోదరులు అనేకసార్లు రాళ్లతో కొట్టి ఉంటారు. అక్కడ రాళ్లు కూడా దొరక్కపోతే పక్కనే నిర్మాణంలో ఉన్న ఇటుకలను కూడా తీసుకువచ్చి రువ్వారు. ప్రజలూ, పోలీసులూ ఆపకుండా చోద్యం చూశారు. ఒక్కరు కూడా ఈ సంఘటనను ఎందుకు ఆపలేకపోయారు? పాక్‌లో ‘పరువు’ హత్యలు ఉజ్వల నాగరికతకూ, గొప్ప జీవన విధానాలకూ లాహో ర్ నగరం పెట్టింది పేరు. ‘పరువు’ హత్యలకు బంధువుల చేతుల్లోనే 2013లో పాక్‌లో 869 మంది మహిళలు ఆహుతి అయినట్లు పాకిస్థాన్ మానవహక్కుల కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. పాక్‌లో మహిళల అణచివేత చెప్పనలవికాదు. అక్కడ అనేక కుటుంబాల్లో స్త్రీలను సేవకులుగా చూడడం, ఇంటి పని మనుషులుగా వాడుకోవడం, వయసు వచ్చాక వారిని అమ్మేయడం కూడా జరుగుతూ ఉంటుంది. పాకిస్థాన్‌లో గత ఏడాది పరువు హత్యలకు 869 మంది మహిళలు బలైన సంఖ్య నా దృష్టిలో అతి తక్కువ అని అంచనా. ఒక ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో పోలీసులు నమోదు చేసే అధికారిక అత్యాచారాల సంఖ్యలో ఎంత ‘పాక్షిక వాస్తవం’ ఉంటుందో, దీనిలో కూడా అంతే నిజం ఉంటుంది! ఈ ఉపఖండంలోని ప్రజల నరనరాల్లో ఈ స్థాయిలో క్రూరత్వం నిండిపోయిందా? (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎం.జె.అక్బర్ -
శరద్ పవార్ నీడలో
ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు గత దశాబ్ద కాలంగా బీజేపీ పవార్‌ను కాంగ్రెస్‌కు దూరం చేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఎలాంటి చర్చలు మొదలు కాకముందే బీజేపీ, శివసేనలు రెండూ పవార్ ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే, కాంగ్రెస్ సరసనే ఉండొచ్చని చెప్పేశాయి. పవార్ ప్రస్తుతం కాంగ్రెస్ కంటే తన సొంత పార్టీ గురించే ఎక్కువగా ఆందోళన చెందుతుండటం సహజమే. ఆయన మోడీని కలిసి ఉండాల్సిందేమో. కథనానికి, దానికి కారణానికి మధ్య చీకటి నీడలు తరచుగా పరుచుకుని ఉంటాయి. శరద్ పవార్, నరేంద్ర మోడీని కలుసుకున్నారంటూ ఒక మరాఠీ వార్తా పత్రికలో వచ్చిన కథనం సరైనది కాదు. కానీ సహేతుకమైనదేనని అనిపిస్తుంది. పరిస్థితుల సంబంధమైన ఆదారాలు ఒప్పించగలిగేవిగా ఉండటంతో ఆ పత్రిక ఆ కథనానికి ఆధారాలను కనుగొనడం కోసం తీవ్రంగా అన్వేషించలేదు. అలా అని ఆ కథనాన్ని ప్రచురించాలని ఆ పత్రిక నిర్ణయం తీసుకోవ డం సముచితం కాజాలదు. కాకపోతే సరైన ఆధారాలు లేకుండానే ఆ కథనాన్ని ఎందుకు ప్రచురిం చాల్సి వచ్చిందో వివరిస్తుంది. పవార్ ఆ కథనాన్ని అస్వాభావికమైన రీతిలో తీవ్రంగా ఖండించారు. ఆయన వైపు నుంచి వినవస్తున్న కథనాన్నే మనం అంగీకరించాల్సి ఉంటుంది. అలా అని పవార్ ఎన్నడూ బీజేపీ నేతలను జనాంతికంగా కలుసుకోలేదని కాదు. కలుసుకున్నారు, కలుసుకునే పూర్తి హక్కు ఆయనకుంది. రాజకీయవేత్తల మధ్య సంభాషణ జరగడానికి వారి మధ్య ఏకాభిప్రాయం అక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన సరళత్వం అదే. టెలివిజన్ కెమెరా ఎప్పుడూ చూస్తూనే ఉండే యుగంలో పవార్, మోడీల వంటి అత్యున్నత స్థాయి నేతలు దృశ్యపరమైన ఆధారాల పరీక్ష నుంచి తప్పించుకోలేరు. ప్రతి పర్యటనలోనూ పాత్రికేయులు మోడీని వెన్నంటే ఉంటారు. ఎన్నికల సమయంలో రాజకీయవేత్తలకు ఎప్పటికీ పూర్తిగా సురక్షితమైనదిగానే ఉండే రక్షిత ప్రదేశం ఉండదు. ప్రతిదీ చిల్లుపడ్డ నీటి ట్యాంకర్లాగా కారిపోతూ ప్రజా విధులను నిర్వహిస్తుంటుంది. ఆ మరాఠీ పత్రిక వర్తమానంలోని వాస్తవాలపై గాక గత చరిత్రపైనే ఆధారపడింది. కాబట్టే ఆ కథనాన్ని ప్రచురించింది. ఏది గెలవబోతున్న పక్షమనే విషయాన్ని పసిగట్టడంలో పవార్ ఎప్పుడూ సూక్ష్మగ్రాహే. సంతృప్తికరమైన తన సొంత వ్యక్తిగత భారమితిని క్షేత్ర స్థాయి వాతావరణ నివేదికలతో సరిచూసుకొని కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రతిపక్షాల మధ్య ఆయన అటూ ఇటూ దుంకుతూ ఉంటారు. కోపతాపాలు లేదా ఇష్టాయిష్టాలు వంటి అంశాలు రాజకీయ నిర్ణయాలలో జోక్యం చేసుకోడాన్ని ఆయన అనుమతించరు. విమర్శకులు దీన్ని అనైతికత అంటుంటారు. అలాంటి తీర్పులన్నీ ఓడిపోయేవారి విశేష హక్కులంటూ పవార్ ఆ విమర్శలను దులిపేసుకుంటారు. పవార్ గెలుస్తున్నంత కాలం పోయేది ఏదీ లేదు. ఎన్డీఏ హయాంలో ఆయన ఉండకూడని పక్షాన ఉన్నారు. అయినా ఎన్డీఏ నేత, ప్రధాని అటల్ బిహారీ వాజపేయితో తన వ్యక్తిగత సంబంధాలు అద్భుతంగా ఉండేలా చూసుకున్నారు. విలేకరులు బయట తిరిగి వివిధ కథనాలను, ధోరణులను తెలుసుకుంటారు. కాంగ్రెస్ ఈ ఏడాది ఇబ్బందుల్లో ఉందని వారికి తెలుసు. మహారాష్ట్రలో కూటములు ఇంకా పూర్తిగా కొలిక్కి రాక ముందే పవార్ ఉండకూడని పక్షంలో ఉండి తన ప్రతిష్టకు మచ్చ తెచ్చుకుంటారని నమ్మడానికి వాళ్లు విముఖంగా ఉంటారు. అయితే ఈలోగా పరిస్థితులపరమైన ఆధారాలు పోగుబడుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై పవార్ అధికారిక ప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు సాగించారు. మోడీని కోర్టులు నిర్దోషిగా తేల్చాయి కాబట్టి ఆయనపై ఉన్న గుజరాత్ అల్లర్ల కేసును మూసివేసినదిగానే పరిగణించాలని ప్రఫుల్ పటేల్ సూచించారు. ఆయన కేంద్ర మంత్రివర్గంలో పవార్‌కు సహచరుడు. కూటముల విషయంలో అవకాశాలు తెరుచుకునే ఉన్నాయని పవార్ ఇతర అనుయాయులు చెప్పారు. అక్కడి నుంచి ఇ పవార్. మోడీని కలుసుకున్నారనే కథనానికి చేరడానికి మిగిలింది ఒకే ఒక్క గంతు. అది వాస్తవంగాక పోయినా కనీసం కవితాత్మక వాస్తవం అవుతుంది. సంప్రదాయకమైన పాత్రలు తారుమారు కావడమే ఈ కథలోని మలుపు. ఇంతవరకు మహారాష్ట్రకు సంబంధించి ఆటలోని నిబంధనలను అన్నిటినీ పవారే రాసేవారు. అయితే సీట్ల పంపిణీలో తను ఏం చెబితే అదే జరిగేటంత ఎక్కువగా తన పాత్రను అంచనా వేసేటంత వెర్రివాడు మాత్రం ఎప్పుడూ కాలేదు. కాంగ్రెస్‌తో సఖ్యతను కాపాడుకోవడం కోసం 2004 తర్వాత ఆయన ఢిల్లీలో తనకు హోదా తగ్గించడాన్ని ఆంగీకరించారు. కానీ పవార్ బలం లేనిదే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నటికీ అధికారంలోకి రాగలిగేది కాదని ఆయనకూ తెలుసు, కాంగ్రెస్‌కూ తెలుసు. ఈ క్రమానికి మోడీ గండికొట్టారని పవార్ శిబిరంలోని పునరాలోచనను బట్టి తెలుస్తోంది. విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల్లోనూ, ముంబై నుంచి పుణే వరకు ఉన్న ప్రాంతంలోనూ మోడీ దుమారం చెలరేగే అవకాశం గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. అలాంటి సమయంలో మోడీ అనుకూల ఓటర్లను తనకు వ్యతిరేకం చేసుకోకూడదనైనా కనీసం పవార్ భావిస్తారు. అయితే వినవస్తున్న వార్తలను బట్టి ఆయన పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. బీజేపీ, శివసేనలు కూడా పునరాలోచనలో పడ్డాయి. గత దశాబ్ద కాలంగా బీజేపీ పవార్‌ను కాంగ్రెస్‌కు దూరం చేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఎలాంటి చర్చలు మొదలు కాకముందే బీజేపీ, శివసేనలు రెండూ... పవార్ ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే, కాంగ్రెస్ సరసనే ఉండొచ్చని చెప్పేశాయి. కాషాయ భాగస్వాములు పెరిగిన తమ ఓట్ల శాతానికి కొన్ని కీలకమైన చేర్పులను చేయగలిగారు. అట్టడుగు స్థాయిలోని ఆ చిన్న చిన్న పార్టీలు మట్టిలో నాటుకున్న గడ్డి వాసనను వేళ్ల దగ్గరే అత్యుత్తమంగా గ్రహించగలుగుతాయి. తమంతట తాము అధికారంలోకి రాలేమని వాటికి తెలుసు. ముందుకు తీసుకుపోగల పెద్ద వాహనంలోకి ఎక్కి పయనించడం అవసరమని కామన్సైన్స్ సూచిస్తుంది. ఇందుకు సంబంధించి సంబంధించి వ్యక్తిగతమైనది ఏదీ లేదని దేశంలోని మరే ఇతర రాజకీయవేత్త కంటే ఎక్కువగా పవార్‌కు తెలుసు. ఇది రాజకీయం, అంతే గాలిలోని గడ్డిపోచలు ముంచుకొస్తున్న తుపానును సూచిస్తాయి. మహారాష్ట్ర గత దశాబ్ద కాలంగా యూపీఏకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా ఉన్నందువల్ల ఈ తుపానుకు ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ తనకున్న ఎంపీలను గెలిపించుకోలేక పోతే... దేశంలోని అత్యధికభాగంలో వీస్తున్న పెనుతుపానుకు అది కూకటివేళ్లతో పెకలించుకుపోయే ప్రమాదం ఉంది. మోడీ గెలవలేని పశ్చిమబెంగాల్, ఒడిశాలలో సైతం కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉంది. పవార్ ప్రస్తుతం కాంగ్రెస్ కంటే తన సొంతపార్టీ గురించే ఎక్కువగా ఆందోళన చెందుతుండటం సహజమే. బహుశా ఆయన మోడీని కలిసి ఉండాల్సిందేమో. -
హృదయగత ప్రపంచం
సుచిత్ర సన్నటి, కొంటె నవ్వుకు మించి కాల్పనిక ప్రపంచాన్ని భగ్గున వెలిగించేయగలిగేది మరేదీ ఉండేదీ కాదు. సుచిత్ర విజయవంతమైన హిందీ సినిమాల్లో ఆమె సహ తార కాదు, ఏకైక తార. ఆమె అద్భుత నటనను కనబరిచిన మమత చూసి ఉండకపోతే వెంటనే ఒక కాపీ అర్డర్ ఇవ్వండి. 1960లలో ఉద్యోగమనేది కనుచూపు మేరలో కనబడేది కాదు. ఆ దశాబ్దం తిరుగుబాటుకు, హింసకు సంకేతం కావడంలో ఆశ్చర్యం లేదు. కొందరిది మావోయిస్టు ఉద్యమం కాగా, మిగతావారివి జాతి లేదా మత పరమైన కారణాలు. ఆ పరిస్థితుల్లో సుచిత్రాసేన్ సహవాసం అత్యంత సౌఖ్యవంతమైనదిగా ఉండేది. గతాన్ని తలబోస్తూ గడిపేవారికి జ్ఞాపకాల కలబోత ఏమంత మంచి వార్త కాదు. వయసు విషాద గీతిక ఉపరితలానికి దిగువన ఉండే పొరలాగా కనబడకుండా దాక్కోవాలని ఎంత గట్టిగా ప్రయత్నించినా విఫలవుతుంటుంది. వర్తమానం భవిత దిశగా ఎప్పటిలాగే పరుగులు తీస్తూ పోతుంటే గతానికి ఉండే ఆకర్షణ విముక్తం కాని ఆత్మలను ఆచరణాత్మక ప్రయోజనమేమీ లేని ఆలోచనల్లో మునిగిపోయేలా చేస్తుం ది. అలా అని జ్ఞాపకాల కలబోతంటే అంతానికి సంబంధించిన విచారమేమీ కాదు. అది ఒక అన్వేషణ. బహుశా విషాదకరమైన అన్వేషణ. కాలం చెత్త కుప్పలో బంగారం ఇటుకలను వెతుక్కునే అన్వేషణ. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో సుచిత్రాసేన్ తన జీవితం చివ రి రోజులను గడుపుతుండటం ఇక ఎంత మాత్రమూ వార్త కాదు. 1950లు, 1960లలో సమ్మోహన మూర్తి సుచిత్రాసేన్ గురించి తప్ప... ప్రత్యేకించి ఆమె తన ప్రియుడు, నట జీవిత భాగస్వామి ఉత్తమ్‌కుమార్‌తో కలిసి వెండితెరపై కనిపించడం గురించి తప్ప... బెంగాల్‌కు సంబంధించిన మరే వార్తా పట్టించుకోదగినది కాదనిపిస్తుండేది. సుచిత్ర ఎవరికీ తెలియని వారినెవరినో పెళ్లి చేసుకుంది. అతగాడినెవరూ పట్టించుకోలేదు. సుచిత్ర, ఉత్తమ్‌ల మధ్య రసాయనిక శాస్త్రానికి అందని రసాయనిక బంధం ఏదో ఉండేది. దాని ముందు వివాహం అర్థరహితమైనదని అనిపించేది. ఈనాటికి భిన్నంగా అప్పట్లో... నేడు బలహీనపడుతున్న శ క్తులైన తల్లిదండ్రులే అందరి పెళ్లిళ్లు చేసేవారు. అయినాగానీ ఎందరు కళ్లు మిరుమిట్లు గొలిపే అందగత్తెలు, అందగాళ్లు ప్రమాదకరమైన, పాపిష్టి ప్రేమలో పడలేదు? హృదయం ఇరుసు మీదే ప్రపంచం అల్లుకుంది. మీసం మొలవక ముందు తొలిసారిగా నేను వారిద్దరినీ జ్యోతి సినిమా థియేటర్ వెండితెరపై చూశాను. నల్లులను మంచం పురుగులని తప్పుగా పిలుస్తున్నారనే నా అభిప్రాయం సరైనదేనని ఆ హాల్లో రుజువైంది. మంచానికి వెలుపల కూడా నల్లులకు చాలా జీవితం ఉంది. అప్పట్లో మేం ఒంపులు తిరుగుతూ పోయే హుగ్లీ నదికి అభిముఖంగా, నది ఒడ్డునే ఉన్న ఒక జనపనార మిల్లుకు శివారు గ్రామంలో ఉండేవాళ్లం. ఊహాగానం సదా సరిహద్దుల బంధనాలకు అతీతంగా ఒకదానితో ఒకటి కలగలిసిపోయిన కలల కలగూర గంపలోకి జారిపోతూ ఉంటుంది. సుచిత్ర సన్నటి, కొంటె నవ్వుకు మించి కాల్పనిక ప్రపంచాన్ని భగ్గున వెలిగించేయగలిగేది మరేదీ ఉండేదీ కాదు. ఉత్తమ్‌కుమార్ సంతోషంగా ఆ దేవత ముందు పెద్ద పిల్లాడైపోయేవాడు. ఆ సినిమా పేరేమిటో గుర్తుకు రావడం లేదు. బహుశా సప్తపది కావొచ్చు, కాకపోవచ్చు. ఆధునిక ఇంటర్నెట్ వినువీధుల్లో ఆ పేరును అతి సునాయసంగా తెలుసుకోవచ్చు. అది తెలుపు-నలుపు సినిమాల కాలం. ముకమల్ శకం. ముకమల్ మెరుపు దానికదే ఒక ప్రత్యేకమైన రంగులా కనిపించేది. జ్ఞాపకం వ్యక్తిగతమైనదిగా కంటే వ్యాప్తి చెందినప్పుడే ఎక్కువ ఉపయోగపడుతుంది. 1960ల కాలం ముళ్ల గొంగళిని కప్పుకుని ఉండేది. ఉద్యోగం కనుచూపు మేరలో కనబడేది కాదు, అవకాశాలు ఉండేవి కావు. ఆకాంక్షలకులాగే ఆర్థికవ్యవస్థకు కూడా ఆదరణ కరువై ఉండేది. ఆ దశాబ్దం తిరుగుబాటుకు, హింసకు సంకేతం కావడంలో ఆశ్చర్యం లేదు. కొందరిది మావోయిస్టు ఉద్యమం కాగా, మిగతా వారివి జాతి లేదా మతపరమైన కారణాలు. ఆ పరిస్థితుల్లో సుచిత్రాసేన్ సహవాసం అత్యంత సౌఖ్యవంతమైనదిగా ఉండేది. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి... ఉత్తమ్‌కుమార్ సాంగత్యం కూడా అలాంటిదే. నిజమే, అలాంటి కులాసా కాలాక్షేపం అదొక్కటే కాదు. దేవానంద్ కూడా తోడు ఉండేవాడు. అతి చురుకైన సామాన్యునిగా దేవానంద్ చిల్లర మల్లర నేరాల దారుల్లో అడ్డదిడ్డంగా సంచరించడమే (బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లమ్మడం, జేబులు కత్తిరించడం, జూదగృహంలో ధైర్యాన్ని ప్రద ర్శించడం) అతని మనుగడకు ఏకైక ఆధారం. అది కూడా సుచిత్ర అంతగానూ ఆకట్టుకునేది. దేవానంద్, సుచిత్ర కలిసి నటించిన సినిమా బొంబయ్ కా బాబు ఒక్కటే. అందులో వారిద్దరూ ఒకరికొకరు అంత దూరంగా ఎందుకున్నారో నా కెప్పుడూ అర్థం కాలేదు. ఆ చిత్ర నిర్మాణమంతా లోపరహితంగానే జరిగింది. హీరో, హీరోయిన్లు ఇద్దరూ తారస్థాయిలోనే న టించారు. సంగీతం దివ్యం. ఇక కథ... అవలింతలు తెప్పించే అర్థరాహిత్యానికి భిన్నమైనది. సుచిత్ర, దేవానంద్‌ల మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యా లేదు. అయినా వారిద్దరూ ఉదాసీనంగా కనిపించారు. బెంగాలీ సినిమా గురించి తెలిసిన మాలాంటి వారికి అది ఉపశమనాన్ని కలిగించింది. ఉంటే సుచిత్ర, ఉత్తమ్ ఉండాలి లేదా సుచిత్ర ఒక్కరే ఉంటారు లేదా ఎవరూ ఉండరు. సుచిత్ర, ఉత్తమ్‌లు బెంగాలీ ఒథెల్లోలో నటించారు. సుచిత్ర హిందీ సినిమాకు అలవాటు పడలేకపోయారు. అలాగే ఉత్తమ్‌కుమార్ కూడానూ. ఉత్తమ్ స్థానంలో మరొకరు అవసరం కానప్పుడే సుచిత్ర హిందీ సినిమాల్లో విజయవంతమయ్యారు. అలాంటి సినిమాల్లో ఆమె సహ తార కాదు, ఏకైక తార. ఆమె అద్భుత నటనను కనబరిచిన మమత మీరు చూసి ఉండకపోతే వెంటనే ఒక కాపీ అర్డర్ ఇవ్వండి. అది భగ్న ప్రేమ, వంచిత జీవితం సినిమా. అందులో లతా మంగేష్కర్ పాడిన రహతే థే కభీ జిన్కే దిల్ మే హమ్ జాన్ సే బీ ప్యారో కీ తరా / బైతే హై ఉన్హీ కే మెహ్ఫిల్ మై హమ్ ఆజ్ గునాగారోంకి తరా, హేమంత్‌కుమార్ అజరామార గీతం చుపాలో యే దిల్ మే ప్యార్ మెరా అనే రెండు పాటలూ క్లాసిక్స్. హిందీలో సుచిత్ర రెండో విజయవంతమైన సినిమా ఆంథీ. ఆ సినిమాలో సుచిత్ర ఇందిరాగాంధీ లాంటి రాజకీయవేత్త పాత్రను పోషించింది. సుచిత్ర బెంగాలుకు చె ందినది, బెంగాలీయే. ఉత్తమ్‌కుమార్ హఠాత్తుగా మరణించి మూడు దశాబ్దాలకు పైగానే అయింది. అప్పుడు నేను సండే వార్తా వారపత్రికకు సంపాదకుణ్ణి. ఉత్తమ్ సంస్మరణ సంచిక... ఒక్క కలకత్తాలోనే కాదు ప్రతి చోటా దుకాణాలకు చేరిన మరుక్షణమే అమ్ముడై పోయింది. ఉత్తమ్ అమితంగా ప్రేమించిన కలకత్తా నగర వీధుల గుండా అతడు అంతిమ యాత్ర సాగిస్తుండగా... యువ అభిమానులు తమ ఆరాధ్య నటుడ్ని తాకాలని ఉన్మాదంతో కుమ్ములాడారు. అప్పుడు సుచిత్ర మనతోనే ఉన్నారు. అనివార్యమైనదాన్ని విధి అతి ఉదారంగా వీలయినంత ఎక్కువ అలస్యం చేస్తుందని ఆశిద్దాం. ఆమె పట్ల ఆరాధనాభావం సజీవంగా ఉన్నంత కాలం ఆమె జ్ఞాపకానికి మరణం లేదు. - ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
అతని జ్ఞాపకాలు మనవే
క్రికెట్ సారాన్ని, సంస్కృతిని, చరిత్రను మార్చిన క్రీడాకారుని ఖ్యాతి ఒక్కరికే. క్రికెట్‌ను భారత ఊహాశక్తి మహానగరంగా, పచ్చని స్టేడియంగా, వాస్తవికతగానూ, భ్రమాత్మక వాస్తవికతగానూ భాసించే టెలివిజన్‌గా మార్చేసిన వాస్తుశిల్పి సచిన్. ‘సచిన్’ అనే అద్భుత స్వప్నాన్ని వీక్షించిన అభిమానులకు ఆ జ్ఞాపకాలను తిరిగి కచ్చితంగా చెప్పడం ఎలాగో తెలియదు. వాస్తవం అతిశయోక్తిగా మారక తప్పదు. 60 ఏళ్లు దాటాక సచిన్... పదిమందీ చెప్పుకునే కథల్లో తనను గుర్తించవచ్చు. సచిన్ టెండూల్కర్‌కు అప్పుడు పదేళ్లు. 1983లో భారత క్రికెట్ హఠాత్తుగా ఎవరూ ఊహించని రీతిన రివ్వున రోదసికి ఎగసే సీతాకోక చిలుకగా మారిపోయింది. బ్రిటిష్ వాళ్లు మొదట బ్యాటు, బంతి పట్టినది మొదలుకొని అంత వరకు మన క్రికెట్ గొంగళి పురుగులాగా కాళ్లీడ్చుకుంటూ గడిపింది. కపిల్‌దేవ్ ఆ ఏడు ఇంగ్లండ్‌కు తీసుకుపోయిన టీంలో ఎలాంటి ప్రత్యేకతా లేదు. కపిల్ ఒక్కడే అందుకు మినహాయింపు. అప్పుడప్పుడే తనలో దాగిన ఆత్మవిశ్వాసాన్ని గుర్తిస్తున్న నూతన భారతావని నుంచి బయటకు తొంగి చూస్తున్న క్రికెటర్లలో అతడే అత్యంత ఉత్కృష్ట క్రీడాకారుడు. పరిమితమైన తన ఇంగ్లిషు భాషా పరిజ్ఞానాన్ని కపిల్ తన విలక్షణమైన నవ్వుతో విదిల్చి పారేసేవాడు. అ నవ్వు ఎదుటివారిని నొప్పించే తుంటరితనంతో కూడినదీ కాదు, అణకువతో ముడుచుపోయి ఆత్మన్యూనతా భావానికి గురయ్యేలా చేసేదీ కాదు. ప్రపంచం తన భాషను అర్థం చేసుకునే వరకు కపిల్ బ్యాట్, బంతితోనే మాట్లాడాడు. తన కాలం రాక ముందే ఏ ప్రవక్తా జన్మించడు. 1983 ప్రపంచ కప్పు... భారత క్రికెట్ ఆధిక్యతా శిఖరాలను అందుకునే సాహస యాత్రకు ప్రారంభ స్థానం. క్రికెట్ క్రీడలోని మన శకి ్తసామర్థ్యాలు, సంపదలు గగనానికి దూసుకుపోవడం ప్రారంభించిన సమయానికే... సచిన్ సరిగ్గా తన టీనేజ్‌లోకి ప్రవేశించాడు. క్రికెట్లో అలాంటి శక్తిసామర్థ్యాలు, సంపదలను అంతకు ముందయితే అర్థరహితంగా, జానపద కథల్లాంటి కల్పనగా కొట్టిపారేసేవారే. నివ్వెరపోయి చూస్తున్న వెస్ట్ ఇండీస్‌ను ఓడించి భారత్ 1983 ప్రపంచ క్రికెట్ కప్‌ను గెలుచుకునే వరకు అంతర్జాతీయ క్రికెట్ దుర హంకార పూరితమైన కుల విభజనతో నడుస్తుండేది. బ్రాహ్మణులు, ఇంగ్లండూ, ఠాకూర్లు, ఆస్ట్రేలియా క్రీడను శాసిస్తుండేవారు. కొన్నిసార్లు వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు మెరుపుల్లాగా కళ్లు మిరిమిట్లు గొలిపింపజేసేవారు. గ్యారీ సోబర్స్, రోహాన్ కన్హాయ్, వెస్ హాల్, చార్లీ గ్రిఫిత్‌లను ఎవరు మరిచిపోగలరు? క్లైవ్ లాయడ్ ఒక టీమ్‌గా వారందరినీ గుదిగుచ్చే వరకు వారంతా 11 మంది ఆటగాళ్లు మాత్రమే. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు బడుగు ప్రపంచం. దక్షిణ ఆఫ్రికా అయితే విందుకు వచ్చిన దెయ్యమే (వారి ఆటను రేడియోలో వినడమే తప్ప చూసింది లేదు). గవాస్కర్ పాత ప్రపంచపు అత్యంత విశిష్ట క్రీడా నైపుణ్యం. సచిన్, మన మెరుగని ఖండఖండాతరాలను జయించడానికి బయల్దేరిన నౌకకు కెప్టెన్. వీక్షకుల విస్ఫోటనం బ్యాంకు ఖాతాల్లో ప్రతిధ్వనిస్తుండేది. సచిన్ మొట్టమొదటి వ్యాపార ప్రకటన ఒప్పందపు మొత్తం... భారీ పరిశ్రమను ప్రారంభించడానికి అవసరమయ్యే మూల ధనం అంత పెద్దది. అసాధారణమైన ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సాహసికుడు మార్క్ మాస్కరెనాస్. అది అతి మంచి వ్యాపార నిర్ణయమని అతనికి తెలుసు. యువ సచిన్‌కు సైతం ఆ విషయంలో ఎలాంటి సందేహాలూ లేవు. సచిన్‌కు ముందు కూడా క్రికెట్ మేధో దిగ్గజాల తారా తోరణం ఉండేది. సచిన్ రిటైరైన తర్వాత కూడా మరింత ఎక్కువ నైపుణ్యం ఉంటుంది. అయితే క్రికెట్ క్రీడ సారాన్ని, సంస్కృతిని, పరిధులను, చరిత్రను మార్చేసిన క్రీడాకారునిగా ఆ ఖ్యాతి దక్కేది మాత్రం శతాబ్దికి ఒక్కరికే. అక్కడక్కడా నలుసుల్లాగా ఒయాసిస్లున్న విశాలమైన బీడు భూమిని భారత ఊహాశక్తి మహానగరంగా, అవధులు లేని పచ్చని స్టేడియంగా, వాస్తవికతగానూ, వాస్తవమనిపించే భ్రమాత్మక వాస్తవికతగానూ కూడా భాసించే టెలివిజన్‌గా మార్చేసిన వాస్తుశిల్పి సచిన్. వివశులను చేసే సచిన్ సొగసరి క్రీడా నైపుణ్యానికి బ్యాట్ ఓ క్షణం శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తిగా మారితే, మరో క్షణం నగల వర్తకుని పనిముట్టుగా మారేది, ఇక సచిన్ పిడుగులు కురిపించే మూడ్‌లో ఉన్నాడంటే అది నార్డిక్ ప్రజల దేవుడు ‘థోర్’ సమ్మెటగా మారిపోయేది. ఆ వశీకరణ శక్తిని గురించి చర్చించాల్సిన పని లేదు. దాన్ని కళ్లారా చూసి, చెవులారా విని పసందైన విందుగా ఆస్వాదించగలిగే శాశ్వత టెలివిజన్ యుగంలో మనం ఉన్నాం. ప్రతి వీక్షుకుడు తనంతకు తానే ఒక నెవిల్లె కార్డస్ (సుప్రసిద్ధ ఇంగ్లిషు క్రికెట్ విమర్శకుడు, రచయిత). సచిన్‌కు, అతని అభిమానుల విలక్షణ విశ్వంలో వెలుగుతుండే ప్రతి అభిమానికి మధ్యన అంతుపట్టని అనుబంధం ఉంది. కాబట్టి సచిన్ క్రీడా నైపుణ్యం గురించి చెప్పడమంటే ఆ అనుబంధంలోకి తలదూర్చడమే అవుతుంది. ఇది ఆరాధనే తప్ప మెచ్చుకోలు కాదు. సచిన్ కనీసం రెండు తరాలకు జీవితాంతం మాట్లాడుకోడానికి సరిపడా తన గొప్పదనం జ్ఞాపకాలను మిగిల్చాడు. సచిన్ గురించి డొంక తిరుగుడుగా మాట్లాడుకోవడం ముగిసింది. సూటి గా మాట్లాడుకోవడం ఇప్పుడే మొదలైంది. రెండు దశాబ్దాలు గడిచేసరికి జ్ఞాప కం ఎప్పటిలాగా తన పని తాను చేసుకుపోతుంది... వాస్తవాన్ని అతిశయించి చెబుతుంది. రోజువారీ జీవితం పంజరానికి వెలుపల తమ జీవిత కాలంలోనే అద్భుత స్వప్నాన్ని వీక్షించే విశేషావకాశం లభించిన సచిన్ అభిమానులకు ఆ జ్ఞాపకాలను తిరిగి కచ్చితంగా చెప్పడం ఎలాగో తెలియదు. వాస్తవం అతిశయోక్తిగా మారడం అనివార్యం. 60 ఏళ్లు దాటాక సచిన్... ఏ బార్లోనో లేదా ఏ డ్రాయింగ్ రూంలోనో పదిమందీ చేరి కాస్త ఉల్లాసంగా గడిపేటప్పుడు చెప్పుకునే కథల్లో తనను గుర్తించవచ్చు. ఆ నక్షత్ర ధూళి వ్యాపనంలో గణాంకాలను లేదా యదార్ధాలను చెబుతూ సచిన్ ఏ మాత్రం జోక్యం చేసుకోకూడదు. సచిన్ ‘తన’ జీవిత కాలంలోని పౌరాణిక నాయకుడు కాడు. మన జీవితాల్లోని పురాణ పురుషుడు. సచిన్ జీవితం సచిన్‌దే. అతని జ్ఞాపకాలు మాత్రం మనవే. - ఎం. జె. అక్బర్, సీనియర్ సంపాదకులు -
‘గతం’ గెలిపించలేదు
మోడీ ఆకర్షణకు కారణం ఆయన పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తుండటం కాదు. ఇందిరను లేదా పటేల్‌ను వాడుకుని గతాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే వారు అంతకంటే చాలా పెద్ద అంశాన్ని గుర్తించడంలేదు. ఆర్థికవృద్ధిపై ప్రజలలో ఉన్న విశ్వాసం పుటుక్కున తెగిపోయింది. పెరిగే ధరలు, పడిపోతున్న ఆదాయాలు అథోగతికి పయనిస్తున్న ఆర్థికవ్యవస్థకు కొట్టొచ్చినట్టుగా కనిపించే సూచనలు. భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరాగాంధీలను గుర్తుకు తెచ్చుకున్న గత వారం రోజులూ ఒక ప్రశ్న నా మెదడును తొలిచేస్తూ వచ్చింది. బ్రిటన్ వలస పాలననాటి సంస్థానాలను మహనీ యుడు పటేల్ భారత యూని యన్‌లో విలీనం చేసినది ‘భారత్ రాజ్’ అనే మరో రాచరిక పాలనను నెలకొల్పడాని కేనా? అనేదే ఆ ప్రశ్న. పటేల్, ఇందిరలు నికార్సయిన జాతీయవాదులు. పటేల్ జాతీయవాదం తప్ప మరే ఇజం పరిమితీ లేని వారు. ఇందిర అలా కాదు. ఎన్నికల విజయావకాశాల తాప మానినిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న 1969లో ఆమె అడ్డదిడ్డపు సోషలిజాన్ని రక్షణగా కప్పుకున్నారు. ఆమె ఎంచుకున్న బలహీనమైన గులాబీ సోషలిజం శాలువా తాత్కాలిక వెచ్చదనమనే బూటకపు సౌఖ్యాన్ని కలుగ జేసింది. సంస్థానాధీశులు తమకు బ్రిటన్ నుంచి లభిం చిన హక్కులను వదులుకొని 1947లో భారత యూనియన్‌లో విలీనానికి అంగీకరించారు. అందుకుగానూ పటేల్ వారికి కొన్ని హామీలను ఇచ్చారు. వాటిని రద్దు చేయడమే (రాజభరణాల రద్దు) నాటి ఇందిర కార్యక్రమంలోని ప్రధానాంశం. అటుపిమ్మట 1975, 1976లలోని అత్యవసర పరి స్థితి కాలంలో గడ్డకట్టించే శీతల రాజకీయ వాతావరణం కమ్ముకుంది. ఆ సమయంలో ఇందిర వంశపారంపర్య పాలనను ఎంచుకున్నారు. సొంత పార్టీనే రాచరిక వ్యవస్థగా మార్చేశారు. ఒకప్పుడు నెహ్రూ, ఇందిరాగాంధీలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారుగా ఉండేవారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినదిగా మారిపోయింది. వంశపారంపర్య పాలన అనే భావన ఎంత ప్రబలమైనదంటే అరుదైన వైరస్ వ్యాధిలాగా అది భారతదేశంలోన్ని అన్ని రకాల సోషలిజాలకు సోకిపోయింది. దేవుని కంటే పార్టీ భావజాలానికే ఒకప్పుడు అధిక ప్రాధాన్యం ఇచ్చిన రామ్మనోహర్ లోహి యా సోషలిస్టు వర్గానికి ప్రత్యేకించి అది బలంగా సోకిం ది. ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్‌ల నేతృత్వంలోని పార్టీలలో ఆ రెండూ తలకిందులు కావడం అందుకు దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ. వారిద్దరి విన్యాసాలు వారిపైనే గాక మరింత విశాలమైన ఉత్తర భారత రాజకీయాలపైన కూడా గణనీయమైన పర్యవసానాలను కలుగజేసాయి. ఉత్తర భారతంలో సోషలిస్టుల ప్రతిష్టకు పదే పదే తూట్లు పడుతుండటంతో కాంగ్రేసేతర శక్తుల స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ల రాజకీయ క్రీడలో సోషలిస్టులు మొదట్లోనే ఓడిపోయారు. ఆ మీదట ఉత్తరప్రదేశ్, బీహార్లలో కూడా ప్రాధాన్యాన్ని కోల్పోయారు. సిద్ధాంతరీత్యా ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాల ప్రాతిపదకను సమకూరుస్తుంది. తద్వారా అది ప్రతిభ వికసించడానికి, ప్రతిభారాహిత్యం క్షీణించిపోవ డానికి తోడ్పడుతుంది. వంశపారంపర్య పాలన ప్రజాస్వామ్యానికి పరిమితిని విధిస్తుంది. ఎలాగైనా వంశపారంపర్య పాలనను అమలుచేయాలని ప్రయత్నించేటప్పుడు భావోద్వేగపూరితమైన చరిత్ర ద్వారా సమంజసత్వాన్ని సంపాదించాలనే వాంఛ పెరుగుతుంది. నాయనమ్మ ఇం దిర, తండ్రి రాజీవ్ హత్యల ద్వారా రాహుల్ తన వ్యక్తిగత ఆకాంక్షకు సమంజసత్వాన్ని కోరుకుంటున్నారు. పూర్వీకుల త్యాగాలతోనే ఎవరైనాగానీ అధికారం అందలం ఎక్కగలిగేట్టయితే మహాత్మాగాంధీ మునిమనుమడైన గోపాల్గాంధీ ఆ అన్వేషణకు దిగడం కచ్చితంగా ఉత్తమం కాదా? ఇందిరను లేదా పటేల్‌ను వాడుకుని గతాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే వారు అంతకంటే చాలా పెద్ద అం శాన్ని గుర్తించడంలేదు. ఆర్థికవృద్ధిపై ప్రజలలో ఉన్న విశ్వా సం పుటుక్కున తెగిపోయింది. పెరిగే ధరలు, పడిపోతున్న ఆదాయాలు అథోగతికి పయనిస్తున్న ఆర్థికవ్యవస్థకు కొట్టొచ్చినట్టుగా కనిపించే సూచనలు. తల్లిదండ్రులు నిస్సహాయులమని భావిస్తుండటంతో యువత నిరాశానిస్పృహలకు గురికావడం మొదలైంది. అయినా వాళ్లు దేశం పట్ల నమ్మకం ఉంచాలనే భావిస్తున్నారు. అందుకే స్పష్టంగా కనిపిస్తున్న నిర్లక్ష్యంతో కూడిన యూపీఏ ప్రభుత్వపు ఉదాసీన వైఖరిపట్ల వాళ్లు అంత తీవ్రంగా ఆగ్రహం చెందుతున్నారు. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలోని ధగధగలాడే పంజరాల్లో ఉన్నవారికి తప్ప ప్రతి ఒక్కరికీ దేశవ్యాప్తంగా యువత ఆగ్రహం కనబడుతూనే ఉంది. నేడు నరేంద్రమోడీ ఆకర్షణగా మారడానికి కారణం ఆయన పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తుండటం కాదు. ఢిల్లీ దర్బారులో తిష్టవేసినవారి కోవకు చెందని పరాయివాడు కాబట్టి. మోడీ నేటి యువతలోని ఆగ్రహపు గొంతుక, లబ్ధిదారు కూడా. ఒక కేంద్ర కాబినెట్ మంత్రి మోడీని ‘చాయ్‌వాలా’ అంటూ తీసిపారేశారు. ఢిల్లీ దర్బారులోని తల బిరుసు ఉన్నతవర్గాలు ఇలా అవమానకరమైన ధూషణలకు దిగినప్పుడల్లా మోడీ మద్దతుదార్ల బలం పెరగడం మాత్రమే జరుగుతోంది. దేశంలో టీ కప్పులు అందిస్తూ పొట్ట పోషించుకుంటున్న వారి సంఖ్య నేడు అధికారంలో ఉన్న కాలంచెల్లిన ఉన్నత వర్గపు కుమారుల కంటే చాలా ఎక్కువ. యూపీఏ సృష్టించిన పరిపాలనాపరమైన శూన్యంలోకి మోడీ ప్రవేశించారు. ఆయన ఎంత భర్తీ చేయగలిగితే అంత చోటు ఖాళీగా ఉంది. పటేల్, జవహర్లాల్ నెహ్రూలపై ఈ గొడవ గురించి ఎవరైనాగానీ చెప్పగలిగేది ఒక్కటే... ఇది ఒక నాగరికమైన అంశంపై జరుగుతున్న గొడవనే మార్పే. 1947లో ఎవరు ఉత్తమ ప్రధాని అయి ఉండేవారు? అనే అంశంపై 2014 ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఓటు వేయబోవడం లేదు. 2014లో ఎవరు ఉత్తమ ప్రధాని కాగలుగుతారనే దానిపైనే ఓటింగ్ జరగబోతుంది. మోడీ అదృష్టవంతుడు. ఆయనకు రెండు శూన్యాలు లభించాయి. మన్మోహన్సింగ్ కనుమరుగైపోతున్నారు. కానీ రాహుల్‌ను వెలుగులోకి రావడానికి అనుమతించడం లేదు. రాహుల్, మోడీలు ఎదురూబొదురుగా నిలవగా ఇద్దరినీ పోల్చి బేరీజు వేసే పరిస్థితి ఏర్పడటం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయంలో కాం గ్రెస్ నాయకత్వం ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. ప్రజాభిమానపు పతనం అంచున నిలవగా, ఉత్సాహోత్తేజాలు నిట్టనిలువునా మునిగిపోయిన ఏ రాజకీయపార్టీయైనాగానీ గడ్డి పరకను పట్టుకొని గట్టెక్కాలని యత్నించడం పూర్తిగా సహేతుకమే. అందుకే మోడీ చాలా త్వరగానే అత్యంత ఉచ్ఛ స్థాయికి చేరిపోయారని, ఎన్నికలు ఇంకా ఆరునెలలు ఉన్నాయని ప్రచారం సాగిస్తున్నారు. దీపావళికి దుకాణాల్లో స్పష్టంగానే కనిపించిన మాంద్యమే ఈ వాదనకు తిరుగులేని సమాధానాన్ని చెబుతోంది. ఒక తాజా జనాభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారిలో 57 శాతం మంది ఇది అత్యంత అధ్వానమైన దీపావళి అని పేర్కొన్నారు. ఇక రాబోయే ఆరు నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్నంత అధ్వానంగానే ఉంటుందని లేదా మరింత అధ్వానంగా మారుతుందని అనుకుంటే... అప్పుడు ఆర్థికవ్యవస్థ అధ్వానంగా ఉందని అనుకునేవారు 77 శాతం అవుతారు. ఈ ధోరణి కాస్త సడలుతుందేమోగానీ మటుమాయమైపోదు. భారతదేశం నేడు సంతోషంగా లేదు. ఏ అధికారపార్టీకైనా గానీ ఇది తీవ్ర విచారాన్ని కలుగజేయక మానదు. -ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు -
‘ముప్పు’తిప్పల భారతం
బైలైన్: మనమంతా శాంతినే కోరుకుంటాం. పిచ్చివాళ్లు మాత్రమే యుద్ధాన్ని కాంక్షిస్తారు. శాంతి సాధనకు బలం తప్పనిసరి. పాక్‌కు నేడు మనకంటే చాలా ఉత్తమమైన ఎత్తుగడల ప్రాధాన్యమున్న అణ్వస్త్రాలున్నాయి. నేరుగా యుద్ధరంగంలోనే వాటిని మోహరింపజేయవచ్చు. పేద దేశానికి సాయుధ బలగాలు ఒక విలాసం అని 1962 వరకు మనం భావించాం. ఆ తదుపరి కోలుకోవడం జరుగుతున్నా అది అప్పుడప్పుడు హఠాత్తుగా సాగే విస్తర ణగానే సాగుతోంది. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సురక్షితమైన మార్గానికి హామీని కల్పిం చడం కోసం బరాక్ ఒబామా పాకిస్థాన్‌కు పలు వ్యూహాత్మక, ఆర్థిక నజరానాలు సమర్పించుకున్నారు. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్‌నే ఖంగు తినిపించిన ఒబామా ఈ నజరానాలపై భారత్ ఎలా స్పందిస్తుందోనని నిద్రను కరువు చేసుకోవాల్సిన అవసరమేముంటుంది గనుక. ఒబామా సెప్టెంబర్‌లో మన్మోహన్‌సింగ్‌కు వీడ్కోలు విందు ఇచ్చి చక్కటి చిరునవ్వుతో సాగనంపారు. అక్టోబర్‌లో నవాజ్ షరీఫ్‌కు ఆయన అందించిన వంటకాల జాబితా భారత ప్రభుత్వానికి ఏ మాత్రం మింగుడు పడేది కాదు. పాక్ అణు పాటవాన్ని, భారత అణు పాటవాన్ని ఒకే గాటన కట్టి ఆయన దక్షిణ ఆసియా సుస్థిరతను చాటారు. అంతా సజావుగా సాగితే ఇది అమెరికా, పాక్‌ల మధ్య అణు ఒప్పందానికి కూడా దారితీయవచ్చు. పాక్‌ను మన్మోహన్ ‘ఉగ్రవాద భూకంప కేంద్రం’గా పేర్కొన్నారు. అయితే అదేమీ ఒబామా చెవికెక్కలేదు. సరికదా భారత్ ఇంకా ఎదగాలని, కాశ్మీర్ సమస్యపై చర్చలు జరపాలని నవాజ్‌తో కలిసి సంయుక్త ప్రకటన జారీ చేశారు. కాకతాళీయంగా అదేసమయానికి నాకు ‘ఇండియా ఎట్ రిస్క్: మిస్టేక్స్, మిస్కన్సెప్షన్స్ అండ్ మిస్ఎడ్వెంచర్స్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీ’ అనే జస్వంత్‌సింగ్ కొత్త పుస్తకం అందింది. లోతైన అవగాహనతోనూ, విశ్వసనీయంగానూ జస్వంత్ ఆ పుస్తకాన్ని రచించారు. అదే వారంలో నవాజ్ వాషింగ్టన్లో ఉండగా, జస్వంత్ చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్నారు. రష్యా రాజధాని మాస్కో నుంచి ఆయన అక్కడికి వెళ్లారు. జస్వంత్‌సింగ్ ఉన్నత సైనికాధికారే కాదు పెద్ద మనిషి. ఆయన ట్రిగ్గర్‌పై వేలు వేశారూ అంటే ఎప్పుడోగానీ గురి తప్పదు. భారత్ వ్యూహాత్మక సంస్కృతిని పెంపొందింపజేయలేదు. కాబట్టే మన దేశ భద్రత ముప్పును ఎదుర్కొంటోంది. ఒక సమగ్ర భావజాలంగా అభివృద్ధి చెందకుండానే నిలిచిపోయిన కొన్ని సమున్నతైనైతిక భావాలపై ఆధారపడి జవహర్లాల్ నెహ్రూ ఒక మూసలాంటి విధానాన్ని తయారు చేశారు. వాస్తవికత తన సదుద్దేశాలకు వ్యతిరేకంగా నిలిచినప్పుడలా ఆయన వాస్తవికతను తిరస్కరించారు. దేశ విభజన శాంతిని నెలకొల్పుతుందని ఆయన విశ్వాసించారు. కాబట్టే పాకిస్థాన్ ఏర్పాటును సమర్థించారు. స్వతంత్రం తదుపరి కొన్ని వారాల్లోనే కాశ్మీర్ కోసం పాక్ నిష్కారణంగా యుద్ధం ప్రారంభించింది. దీంతో ఆయన విధానాలు మతి మాలినవిగా మారాయి. శాంతి మంచిది అని ఆయన భావించారు కాబట్టే భారత సైన్యాన్ని దాని యుద్ధ లక్ష్యాలను పరిపూర్తి చేయకుండా నివారించారు. పాక్‌కు కాశ్మీర్ గేట్ అయిన ముజఫరాబాద్ వరకు మన సేనలు కదం తొక్కకుండా వారించారు. అందుకు బదులు ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరారు. నాటి కాల్పుల విరమణ ఫలితంగా నేటికీ మన దేశం నెత్తురోడుతూనే ఉంది. చైనా కథ స్వల్పంగా భిన్నమైనదేగానీ అంతటి నషాన్ని కలుగజేసింది. చైనా తన మార్గాన్ని అనుసరించి అలీనోద్యమంలో భాగస్వామి అవుతుందని, శాంతి ప్రవక్తగా తన హోదాను ధృవీకరిస్తుందని నెహ్రూ ఆశించారు. కాబట్టే టిబెట్‌ను వ దిలి పెట్టేశారు. మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా 1950లో టిబె ట్ను దురాక్రమించింది. ఆ సమయంలో నెహ్రూ ‘జన చైనా రిపబ్లిక్‌తో సంబంధాలకు భారత్ చాలా విలువనిస్తుంది’ అంటూ బీజింగ్‌లోని భారత రాయబారి కేఎమ్ ఫణిక్కర్కు సలహా ఇచ్చారు. ఆ సూచను ఫణిక్కర్ గ్రహించారు. నెహ్రూ అతి తరచుగా చైనా ముందు మోకరిల్లుతున్నారని ఢిల్లీలోని మన విదేశాంగ శాఖ సైతం భావించింది. ఆచరణ ప్రాధాన్యమైన వాస్తవిక దృష్టిగల సర్దార్ పటేల్ భవిష్యత్తును స్పష్టంగా గ్రహించగలిగారు. టిబెట్‌పై నెహ్రూ వైఖరిపట్ల తన అసమ్మతిని తెలుపుతూ ఆయన ఒక సుదీర్ఘ లేఖను రాసారు. చైనా ప్రభుత్వం పంపిన ఒక టెలిగ్రాం ‘పూర్తి అమర్యాదకరంగా ఉంది. చైనా సైన్యం టిబెట్‌లో ప్రవేశించడం పట్ల మన నిరసనను లెక్కలేనట్టుగా అది తోసిపుచ్చిన తీరే కాదు, విదేశీ శక్తుల ప్రభావాలే మన వైఖరిని నిర్ణయించాయనే నిరాధారమైన ఆరోపణతో అది తన చర్యను సమర్థించుకోవడం కూడా అమర్యాదకరమైనదే. చైనా మాట్లాడుతున్న భాష ఒక మిత్ర దేశం మాట్లాడుతున్నట్టు గాక శత్రువుగా మారగల దేశం మాట్లాడుతున్నట్టుంది’ అని ఆయన ఆ లేఖలో అన్నారు. 1962 నాటి హిమాలయ యుద్ధ పరాజయం తదుపరి నెహ్రూలోని భవిష్యత్తును దర్శించగల ద్రష్ట వెయ్యిసార్లు మరణించారు. అమెరికా పెట్టిన షరతులన్నిటికీ తలొగ్గి ఆయుధాల కోసం ఆయన దాన్ని అర్థించ వలసి వచ్చింది. పాక్ సరిహద్దుల్లోని భారత బలగాలను బాగా తగ్గించి, కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలనేది ఆనాడు అమెరికా విధించిన షరతుల్లో ఒకటి. ఆ విషయం ఒబామాకు కూడా బాగానే తెలుసు. మనమంతా శాంతినే కోరుకుంటాం. పిచ్చివాళ్లు మాత్రమే యుద్ధాన్ని కాంక్షిస్తారు. కానీ శాంతి సాధనకు బలం కలిగి ఉండటం తప్పనిసరి. మిగులు సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమనే బ్రిటన్ విధానాన్ని స్వతంత్ర భారతం విడిచిపెట్టేసింది. కాగా పాక్, చైనాలు మిగులు సైనిక సామర్థ్యం విలువను గుర్తించాయి. పాక్‌కు నేడు మన కంటే చాలా ఉత్తమమైన ఎత్తుగడల ప్రాధాన్యమున్న అణ్వస్త్రాలున్నాయి. నేరుగా యుద్ధరంగంలోనే వాటిని మోహరింపజేయవచ్చు. అలాగే అవి ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశాలు కూడా ఎక్కువ. పేద దేశానికి సాయుధ బలగాలు ఒక విలాసం అంటూ 1962 వరకు భారత్ సైన్యం ప్రాధాన్యాన్ని దాదాపు పూర్తిగా తోసిపుచ్చింది. ఆ తదుపరి కోలుకోవడం జరుగుతున్నా అది అప్పుడప్పుడు హఠాత్తుగా సాగే విస్తర ణగానే సాగుతోంది. గత ఆరు దశాబ్దాలుగా భారత్, పాక్, చైనా, రష్యా, అమెరికాల మధ్య వ్యూహాత్మక అనుసంధానాలు నిలకడగా నిలిచినవీ కావు, సరళ రేఖలుగా సాగుతున్నవీ కావు. ఏ దేశం బలహీనమైన లింకు అనేదే అన్ని కాలాల్లోనూ పెద్ద ప్రశ్నగా ఉంటోందనేది స్పష్టమే. వ్యూహాత్మకమైన కథనం అంటే నీతి కథ కాదు. ద్వంద్వవాదం అంటే వంచన కాదు ప్రతి దేశమూ ప్రతి అనుబంధపు బలాన్నీ ఎప్పటికప్పుడు తిరిగి కొలవాలని చూస్తూనే ఉంటుంది. ఆధునిక భారతదేశం ఒక విలక్షణమైన జన్యువును పెంచి పోషించుకుంటూ వచ్చింది. అది ఏదో ఒక సమున్నత ఆశయాన్ని సాధించాలనే తపనతో మన ప్రభుత్వం నిర్వీర్యమైపోయేలా చేస్తోంది. మన్మోహన్ ఒక దశాబ్దమంతా పాక్‌తో శాంతి కోసం పాకులాడారు. అయితే బలహీనంగా వణికే కాళ్లతో మనం ఎవరితోనూ కరచాలనం చేయలేం. వాస్తవ ప్రపంచం ఉదాసీనంగా భుజాలెగరేసి ఇతరత్రా తన ఏర్పాట్లేవో తాను చేసుకుంటుంది. - ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
స్వప్న భారతంలో మాయా స్వర్ణం
బైలైన్ ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు భయానక కాల్పనిక సాహిత్యం మన దేశంలో జనాదరణ పొందకపోవడానికి కారణం ఏమిటి? ఆ విషయంలో వార్తా పత్రికల నుంచి పోటీ మరీ ఎక్కువగా ఉండటమే. అతి క్రూరమైన, అసంభవాలను సృష్టించే కాల్పనిక శక్తిలో దైనందిన వార్తలతో పోటీపడగలిగిన వైపరీత్యపు బుర్ర ఏ రచయితకైనా ఉండటం సాధ్యమేనా? స్వామీజీలుగా చెలామణి అవుతూ జలగల్లాగా నొప్పి తెలియకుండా నెత్తురును పీల్చేసే కొందరు తుచ్ఛుల దుష్ట పన్నాగాలు ఎల్లెడలా వ్యాపించి ఉన్న దేశం మనది. పదునైన కోర పళ్లతో ఆడవాళ్ల మెడ నుంచి నెత్తురును పీల్చేసే రక్త పిశాచి ‘డ్రాక్యులా’గానీ, ఆ పాత్రను సృష్టించిన బ్రామ్ స్టోకర్గానీ మనకు అవసరం లేదు. అలాంటి మోసకారి స్వాముల భక్తులు కోట్లలో ఉన్నారు. ఆ తుచ్ఛులు ఆక్రమించిన భూములు వేల ఎకరాల్లో విస్తరించాయి. మనవాళ్లు ఎంత మూర్ఖంగా ఉండగలరు? ఎంతైనా మూర్ఖంగా ఉండగలరని రుజువవుతూనే ఉన్నది, నిజమే. సామూహిక వెర్రి కథ అతి సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది. ఉత్తరప్రదేశ్‌లోని దౌండియా ఖేరా అనే ప్రాంతంలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నదని సాగి స్తున్న అన్వేషణకు సాటిరాగ ల సామూహిక వెర్రి మరొకటి ఉండక పోవచ్చు. 150 ఏళ్ల క్రితం రాజా రామ్‌బక్ష్ ఆ బంగారాన్ని అక్కడ పాతర వేసినట్టు స్వామి శోభన్ సర్కార్ అనే వ్యక్తి ఇటీవల కలగన్నారు. ఆ కల ఆధారంగానే నిధి కోసం అన్వేషణ సాగుతోంది! ఆయన ఆ కలగనడానికి ముందు ఎవరూ విని ఉండని ఆ రాజా హఠాత్తుగా బాలీవుడ్ చిత్ర కథనాయకుడై పోయాడు. మన బంగారంపై తెల్లవాళ్ల చేతులు పడకుండా కాపాడటానికి ఆ అనామకపు రాజు ఈ నిధిని 1857కు ముందే పాతర వేసి ఉండాలి. భారత సాంస్కృతిక, పురావస్తు సంస్థ ఉన్నతాధికారులు సైతం ఈ నిధి గురించి పెదాలు తడుపుకుంటున్నారు. మూకుమ్మడిగా జనం అత్యుత్సాహాన్ని ప్రదర్శించడాన్ని తప్పు పట్టడానికి లేదు. కంప్యూటర్ యుగపు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సదరు పూజ్యనీయులైన స్వామీజీ వద్దకు దూతను పంపి,.. ప్రజల మనిషినైన తాను ఆ నిధిని అభివృద్ధి కోసం ఉపయోగించడాన్ని దైవ స్వరూపుడైన ఆ మనిషి అనుమతిస్తారో లేదో వాకబు చేసినట్లు తెలుస్తోంది. అద్భుతమైన ఈ బంగారం ఎన్నటికైనా బయటపడితే... దాన్ని దయనీయ స్థితిలో ఉన్న ప్రజల కోసం గాక రాజకీయవేత్తల సంక్షేమం కోసమే బహుశా వినియోగిస్తారు. అది వేరే కథ. వ్యక్తిగతంగా నా మటుకు నేను ఆ బంగారాన్ని కనుగొనాలనే ఆశిస్తాను. అందులోంచి ఓ పిడికెడు బంగారాన్ని ప్యాంటు జేబులోకి తోసేయగలగడం కాదుకదా దాని వాసన చూడటానికి కూడా నన్ను అనుమతించరు. ఆ నిధితో అఖిలేష్‌యాదవ్ పంచిపెట్టిన కంప్యూటర్లకు డబ్బు చెల్లించగలుగుతారు. బహుళజాతి సంస్థలకు అది ఆనందదాయకమైన వార్త అవుతుంది. అయితే కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలు నా ఖాళీ బుర్రను తొలిచేస్తున్నాయి. ‘శాస్త్రీయమైన ఆధారాలు’ దొరికాయి కాబట్టే ఈ స్వర్ణ నిధి కోసం తవ్వకాలు సాగిస్తున్నామని భారత ప్రభు త్వ మేధావులు వివరించారు. మనం మాట్లాడుతున్నది పుడమితల్లి కడుపున దాగి ఉన్న అపార బంగారు నిధి కుం భకోణం గురించి కాదు. రాజా రామ్ బక్ష్‌కు ఆయన సల హాదారులు ఆ బంగారాన్ని ఎలా దాచాలని చెప్పి ఉంటారనేదాన్ని బట్టి... ఆ నిధిని మట్టి లేదా ఇనుప కుండల్లో పాతరవేసి ఉండాలి. ఈ కుండల లేదా బిందెల గురించి మన మేధావులకు శాస్త్రీయ ఆధారాలు ఎలా లభించాయి? భూగర్భంలో ధగధగలాడుతున్న ఆ బంగారాన్ని కుశాగ్ర బుద్ధియైన ఓ లేజర్ కిరణం కళ్లారా చూసి,.. మెరిసేదంతా బంగారమేనని తేల్చేసిందా? నాకు తెలిసినంతలో వాసన చూడటం ద్వారా బంగారం ఉనికిని కనిపెట్టలేం. కాబట్టి ఢిల్లీలోని కొందరు ‘పెద్దలు’ ఈ పండుగ సెలవుల్లో సుప్రసిద్ధ సాహసిక నవల ‘ట్రెజర్ ఐలాండ్’ (స్వర్ణ ద్వీపం) చదివి ఉంటారని భావించడం సమంజసం. ఈ వెర్రితో మొట్టమొదట నశించేది వివేకం. రాజా రామ్ బక్ష్ ఎంతటి గొప్ప సంపన్నుడు? అతగాడు అవధ్ నవాబుగానీ, మరాఠా పీష్వాగానీ కాదు, బెనారస్ రాజానో, ఝాన్సీ రాణీనో కానే కాదు. అసలు అలాంటి వారి సరసన నిలిచేవాడే కాడు. లేకపోతే పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో ఒక చోట అతని గురించి ఓ ముక్క మనకు వినిపించి ఉండేదే. ఆ రాజు కల్పన కాదు, నిజంగానే ఉండేవాడు. ఇంతకూ ఆ అనామకపు రాజు వెయ్యి టన్నుల బంగారాన్ని ఎలా కూడబెట్టగలిగి ఉంటాడు? ఆ కాలంలో అతి సంపన్న వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. దాని వద్ద సైతం అంత బంగారం ఉన్నట్టు చెప్పగా వినలేదు. ఢిల్లీ మొగలాయి చక్రవర్తుల ఖజనాలో అంత బంగారం ఉండి ఉండేదేమో. ఉంటే దాన్ని 1739లోనే నాదిర్ షా ఖాళీ చేసేసి ఉంటాడు. అదీ పరిస్థితి. ఆ కాలంలో అందుబాటులో ఉన్న భారీ తవ్వకం సాధనం పార మాత్రమే. అయినాగానీ అంత బంగారాన్ని ఎలా పాతిపెట్టి ఉండాలి? చాలా మంది శ్రామికులే పనిచేసి ఉంటారని అనుకోవాలి. గత రెండు శతాబ్దాలుగా అక్కడి రైతులు, వారి సంతతి అత్యంత నిజాయితీపరులుగా ఉండి ఉండాలి. రహస్యాలను దాచి పెట్టడంలో మన దేశానిది అధమస్థానమే తప్ప అత్యుత్తమ స్థానం కాదు. 1867లో లేదా 1877లో లేదా 1887లో ఎవరూ తిరిగి ఆ నిధి జోలికి వెళ్లకుండా ఉండి ఉండాలి. బ్రిటిష్‌వాళ్ల చెవిలో ఓ మాట వేయకుండా ఉండాలి. ఏమైనా అది అద్భుతమే. మూఢ నమ్మకానికి, శాస్త్రీయ వివేచనకు మధ్యన జరిగే ఏ సంఘర్షణలోనైనా మూఢ నమ్మకమే కళ్లు మూసుకుని విజయం సాధిస్తుంది. ఆ బాబాకు నిధి గురించి కల వచ్చింది, సరే. ఈ సాయం సంధ్యా సమయపు నిగూఢ రహస్యాలను సవాలు చేసే సాహసం కూడా ఎవరూ చేయలేరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మన దేశానికి వచ్చి ఉంటే మనోవిశ్లేషణ, కలల అంతరార్థ వివరణ బతికి బట్టగలిగి ఉండేవి కావు. మనదేమైనా కలలు నిజమయ్యే దేశమా? దేశవ్యాప్త పేదరికం నుంచి ఢిల్లీ గతుకుల రోడ్లపై ప్రయాణం వరకు ప్రతి ఒక్కటీ కాదని రుజువుచేస్తూనే ఉన్నాయి. కలల తయారీని కూడా స్థూల జాతీయోత్పత్తికి కలిపితే మన జీడీపీ మిగతా ఆసియా దేశాలన్నిటి జీడీపీని మించిపోతుంది. ఇందులో పొరపాటు పడటానికి ఏమీ లేదు. కలల తయారీ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. రిక్తహస్తాలను మాత్రమే మిగిల్చే కలలపై పెట్టుబడులు పెట్టేవారు మోసగాళ్లు మాత్రమే. -
నియంతలకు నీడ కరువు
బైలైన్ ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు గత వారంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాల్సిన పదహారేళ్ల బాలిక మలాలా యూసఫ్‌జాయ్ ఏదో ఒక రోజున పాకిస్థాన్ ప్రధాని కావాలని కోరుకుంటోంది. నోబెల్‌తో పోలిస్తే ఆ రెండోదే ఆమెకు మంచి భవిత. అర్హులైన ప్రముఖులకు... వారు విస్మృతులైన తర్వాత మాత్రమే సాధారణంగా నోబెల్ బహుమతి లభిస్తుంది. అగ్రరాజ్యం కోటాకు ఏ మాత్రం తగ్గకుండా అంతర్జాతీయస్థాయి హింసాకాండకు కారకులైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత! నోబెల్తోపాటూ ఉండే జయజయ ధ్వానాలు, భారీ నగదు మొత్తమూ మలాలాకు చాలా ఉపయోగపడేవని అనడంలో సందేహం లేదు. ఇక బాగా అమ్ముడుపోయే పతాక శీర్షికల పట్ల ఆత్రుతతో ఉండే మీడియాకు మరింత ఉపయోగపడేవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఆమె రాజకీయాలను వ్యాపకంగా ఎంచుకోవడమే పాకిస్థాన్‌కు ఉపయోగకరం. సాహస బాలిక మలాలా బస్సులో స్కూలుకు పోతుండగా పాక్‌ను విచ్ఛిన్నం చేస్తున్నవారు ఆమె తలలో తూటాను దించారు. అందుకు తగినట్టే ఆమె అంత మంచి భవితవ్యం కోసం ఎన్నో కలలను కనాల్సి ఉంది. పాక్ తీవ్రవాదుల డీఎన్ఏలో కేంద్ర స్థానంలో ఉన్నది అత్యంత అథమమైన లైంగిక అణచివేత. నిర్హేతుక దురభిమానం లేదా అజ్ఞానం నిండిన కాలానికి వారు దేశాన్ని వెనక్కు తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇస్లాం పూర్వ సంచార తెగల అరేబియా ఎడారులను అలాగే వర్ణించేవారు. ఇస్లాం ఆడ శిశువుల హత్యల వంటి పలు దురాచారాలను నిషేధించి మహిళల హృదయాలను జయించింది. పాక్ తాలిబన్లు గతించిన ఆ ఆరవ శతాబ్దపు అవశేషాలు. వారు ఏ మతానికి అనుయాయులమని చెప్పుకుంటారో ఆ ఇస్లాం ప్రతిష్టకే భంగకరం. అలా అని ఈ వాస్తవం అట్టడుగు వర్గాల్లో వారి ప్రాబల్యం విస్తరించడాన్ని క్షీణింప చేయలేదు. లేదా తాలిబన్‌తో ‘చర్చల ద్వారా పరిష్కారం’ కోరుతూ పాక్ ఉన్నత వర్గాలు గగ్గోలు చేయడాన్ని బలహీనపరచలేదు. తాలిబన్లతో బేరసారాలు సాగించడానికి అసలు ఏం ఉంటుంది? అనే సరళమైన ప్రశ్నను ఎప్పుడో గానీ అడగరు, సమాధానం అసలు ఎన్నడూ చెప్పనే చెప్పరు. ఎవరిని బడితే వారిని హత్య చేయడమే ప్రధాన ఎత్తుగడగా, బహుశా భావజాలపు కేంద్ర సూత్రంగా ఉండే ఒంటెత్తువాదులతో చర్చలకు అజెండా ఏమిటి? నాజూకైన మాటల మాటున తాలిబన్లు, వారి ప్రాపకందార్లు తమ అధికార వాంఛను కప్పిపుచ్చుకోలేరు. పాక్ రాజకీయ వేత్తలు వారికి ఇవ్వజూపాల్సింది అదేగా? సింధ్ వాయవ్య ప్రాంతాల్లో అధికార భాగస్వామ్యం ఇచ్చి వారిని సంతృప్తి పరచాలని ఎవరైనా కోరుకుంటారా? అప్పుడే వారి ప్రభావం ప్రమాదకర స్థాయిలో చట్టాల్లోకి చొరబడిపోయింది. కొన్ని మసీదులు, ప్రదర్శనల నుంచి బహిరంగ ప్రదేశాల్లో మారుమోగే వారి ఉన్మత్త ప్రేలాపనలను ఎవరూ నిరోధించలేరు. పోనీ వారిని డబ్బుతో కొనడం సాధ్యమా? బహుశా అసంభవం. అంతర్గత, బహిర్గత వనరుల ద్వారా లభిస్తున్న నిధులు తగినన్ని వారికి ఉన్నాయి. ఉన్న అత్యంత సున్నితమైన సమస్య ఇది: పాక్ కోవర్టు ప్రయోజనాలకు అనుగుణంగా అఫ్ఘానిస్థాన్ లేదా భారత్ వంటి ప్రాంతాలపైకి మాత్రమే తమ తుపాకులను ఎక్కుపెట్టి, పెషావర్, క్వెట్టాల వంటి పాక్ నగరాలను సురక్షితంగా వదిలివేయడానికి వారు ఎన్నటికైనా అంగీకరిస్తారా? ఇబ్బందికరమైన వాస్తవాలు అవి అసలు లేనే లేవన్నట్టు న టించడం ద్వారా అంతరించిపోవు. మలాలా ఇప్పుడు బ్రిటిష్ స్కూల్లో చదువుకుంటోందంటే అది తాలిబన్ల కారణంగానే. ప్రజలు ఎన్నుకున్న పదవి ద్వారా ఆమె వారి కబంద హస్తాల పట్టును సవాలు చేయాలని ఆశిస్తోంది. తమ దేశ స్వస్థతకు వారు ఎంత ముప్పో ఆమె గ్రహించింది. మలాలా కౌమారంలో ఉన్నది. కలలు కనడానికి ఆమెకు సకల హక్కులూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆమెకిది రెండో జన్మ కాబట్టి ఆ హక్కు మరింత ఎక్కువగా ఉంటుంది. ఊగుతూ, తూగుతూ గమ్యం లేకుండా సాగే జనరల్ ముష్రాఫ్ లాంటి డైబ్బయ్యేళ్ల ముసలోడి అభూత కాల్పనికతల కంటే ఆమె కలలు ఖచ్చితంగా మరింత అర్థవంతమైనవై ఉంటాయి. ముష్రాఫ్ అలసిపోయినమాట నిజమే, అయినా ఎన్నటికీ రాజకీయ విరమణ చేయరు. దేశ ‘రక్షకుని’ వేషం గట్టి అధికారం కోసం వెంపర్లాడటానికి బదులు ఆయన దుబాయ్ లేదా ఆమెరికా లేదా ఇంకెక్కడ మరిన్ని ఎక్కువ డాలర్లను రాబట్టుకోగలిగితే అక్కడికి తప్పించుకు పోగలరు, బహుశా తప్పించుకు పోవచ్చు కూడా. ఇతరత్రా పలు విధాలుగా వెనుకడుగు వేసినా పాక్ చాలా విధాలుగా ఆయనను దాటి ముందుకు వెళ్లిపోయింది. అది ఇక ఎంత మాత్రమూ పాత నియంతలకు పట్టం కట్టే దేశం కాదు. పాక్‌ను నిజంగానే ‘రక్షించాల్సి’ ఉంటే, అది ఆయన కంటే చాలా చిన్నవారైన యువతీయువకులు పదవుల్లో ఉండే దేశం కావాల్సి ఉంటుంది. ఇటీవలి చరిత్ర భారాన్ని మోయాల్సిన అవసరం లేని కొత్త నాయకుల బృందం అందుకు కావాలి. మలాలా తిరిగి స్వస్థలానికి తిరిగి రాగలిగిన దేశం కావాలి. మలాలాకు ఇప్పుడు విద్య, భవిష్యత్తులతో పాటూ ప్రశంసాపూర్వకమైన బ్రిటన్ మీడియా ఆసక్తి కూడా ఉంది. ఆమె శ్రేయోభిలాషులకు మించి ఆ ఆసక్తే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభిస్తుందన్న అంచనాలను రేకెత్తింపజేసింది. మలాలాకు ఈ వయసులో ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. అయినాగానీ ఆమె బ్రిటన్‌లో గాక పాక్‌లో శాంతిని నెలకొల్పాలని కోరుకుంటోంది. బ్రాడ్ఫోర్డ్ లేదా బ్రిమింగ్‌హామ్ యువతి కావాలని గాక లాహోర్ లేదా పెషావర్ యువతి కావాలని కోరుకుంటోంది. అక్కడి వీధుల్లో రాజ్యమేలే స్త్రీ ద్వేషం, మతోన్మాదాలను సవాలు చేయాలని భావిస్తోంది. ఆమె లక్ష్య సాఫల్యతను పొందే అవకాశాలు ఎలా ఉన్నాయి? నిజాయితీగా చెప్పాలంటే ఏమంత బాగా లేవు. ఉద్రిక్తతల అంచున నిలిచి ఉన్న దేశంలో నవాజ్ షరీఫ్ ప్రశాంతతను నెలకొల్పగలరని, మానసిక శాంతి భగ్నమైన వోటర్లు విశ్వసించారు. అందుకే సుస్థిర ప్రభుత్వానికి ప్రధానిని చేశారు. ఇంతవరకు అయితే నవాజ్ గమ్యం లేకుండా మెల్లగా పెళ్లి నడక సాగిస్తున్నారు. అయినా ఆయనకు ఇంకా సమయం ఉంది. షరీఫ్ విఫలమైతే మాత్రం మలాలా ఆమె తరం మరో ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా గానీ ఏమైనా చేయగలిగేది ఉన్నదా? ఆ బాలిక దాదాపుగా ప్రాణాలను కోల్పోయినా, ఆశను మాత్రం ఎన్నడూ వీడలేదు. నిరాశావహమైన సలహాలు ఆమెకు అక్కర్లేదు. కలలు తప్పనిసరిగా నిజం కావాలని ఏమీ లేదు. ఎందరికి మాత్రం మరో జన్మ లభిస్తుందని? -
మన్మోహన దౌత్య విషాదం
బైలైన్: ఏదైనా దేశంతో సమస్య ఉంటేనే భారత్ దాన్ని పట్టించుకుంటుంది, అంతేగానీ స్నేహ హస్తాన్ని చాపితే మాత్రం కాదు. దక్షిణాసియా అంతటా భారత్‌పట్ల కనిపించే మూతి విరుపు ధోరణికి కారణం ఇదే. ఈ వ్యవహారం చూసి లోతుగా ఆలోచించే చైనా, భారత ప్రభుత్వం నుంచి తాను రాబట్టగలిగినదంతా రాబట్టుకుంటుంది, కోరుకున్నప్పుడల్లా అవమానిస్తుంటుంది. అది చూసి పాకిస్థాన్ సంతోషంతో నవ్వుకుంటుంది. ప్రతి దేశానికి దాని సొంత ఇరుగుపొరుగులు ఉండనే ఉంటా రు. దేశ భూభాగంతో పాటే దానికి ఆ ఇరుగుపొరుగులు కూడా సంక్రమిస్తారు. భౌగోళిక రాజకీయాలు ముడిపడి ఉన్నప్పుడు ఒక దేశపు ఇరుగుపొరుగులు మరొక దేశానికి ఆత్మీయులు కావడం జరుగుతుం టుంది. అలాంటప్పుడే సమస్య సంక్లిష్టంగా మారుతుంది. శత్రుత్వమే వాస్తవానికి అత్యంత సూటిగా ఉంటుంది. రెచ్చగొట్టడమనే దానికి స్పష్టమైన కొలబద్దలు ఉంటాయి. దానికి ప్రతిస్పందన కూడా సాధారణంగా ఊహించదగినదిగానే ఉంటుంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ. ఇంతపాటి అతిక్రమణకు ఈ మోతాదు మందుగుండు అంటూ రెండు దేశాల విదేశాంగశాఖల కార్యాలయాలు, సైన్యాలు కచ్చితమైన కొలమానాలతో కూడిన సూత్రాలను రూపొందించుకున్నాయి. ఖడ్గం ఖంగున మోగుతుంది, ఒక్కోసారి ఓ వేటును కూడా వేస్తుంది. అయితే గాటు మాత్రం ఎప్పుడూ ముందుగా నిర్ణయించుకున్న మేరకు మాత్రమే పడుతుంది. తప్పు ఎవరిదైనా గానీ అంతకు మించిన గాయం మాత్రం చేయరు. విరామచిహ్నాల్లాగా అప్పుడప్పుడూ మృత్యువు దర్శనమిస్తున్నా జీవితం సాగిపోతూనే ఉంటుంది. అధిక సందర్భాల్లో బాధిత దేశంగా ఉండే భారత్ గతి తప్పిన గడియారపు లోలకం డోలనాలను పరిగణనలోకి తీసుకుంటుంది. శాంతి ప్రయత్నాల వల్ల నెలకొనే సానుకూల వాతావరణం కంటే భారత పటాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నవారు ప్రేరేపించే సంఘర్షణ ఎక్కువ కావడం జరుగుతూనే ఉంటుంది. అలా అని ఇరు దేశాల మధ్య వైషమ్య భావన ప్రబలంగా ఉండటానికి అది కారణం కాదు. ఇరువైపులా ఉండే బాధ్యతాయుత ప్రభుత్వాలు ఆత్మవిశ్వాసంతోనే ఉంటాయి. అయినాగానీ ఏ పరిస్థితిలోనైనాగానీ తిరుగులేని విజయంతో ఆటకట్టింపు జరగదని ఇరుపక్షాలు గుర్తిస్తాయి. కాబట్టే ప్రతిష్టంభన ప్రమాదకర యుద్ధంగా దిగజారిపోకుండా జాగ్రత్తవహిం చటానికి అవి బాధ్యత వహిస్తాయి. మిత్రులతో అనుబంధం విషయంలోనే ఊహాశక్తి, కఠోర శ్రమ రెండూ ఎక్కువగా అవసరమవుతాయి. మన దౌత్యవేత్తలు ఉపఖండంలోని ఉన్నతాధికారుల నుంచి ఆశించదగినంత స్థాయిలో వళ్లు వంచి పనిచేసేవారే. అయినాగానీ గత ఐదేళ్ల కాలంలో వాళ్లు ఎలాంటి ప్రయోజనమూ లేకుండానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రయోజనం అనేది ఎప్పుడూ విధానపు పర్యవసానమే. భారత ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని దాటుళ్లు, గెంతులు, దుంకుళ్ల క్రీడగా మార్చింది. ఫలితాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. మనకు మిత్రులు కాదగినవాళ్లలో లేదా కావాల్సినవాళ్లలో కలవరపాటును లేదా సంశయం కలగడం కనిపిస్తూనే ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అందుకు కొట్టవచ్చినట్టుగా కనిపించే రెండు ఉదాహరణలు. ఆ రెండు పొరుగు దేశాలతో ఒకప్పుడు మన సంబంధాలు చరిత్రలోనే అత్యంత అధ్వాన్న స్థితిలో ఉండేవి. అలాంటిది ఐదేళ్ల క్రితం ఆ దేశాలతో సంబంధాలు మునుపెన్నడూ ఎరుగనంతటి స్నేహపూర్వకమైనవిగా మారడానికి చేరువయ్యాయి. రాజీవ్‌గాంధీ ఆదేశాలపై అరకొర సన్నాహాలతో మన దేశం శ్రీలంకలో చేపట్టిన సైనిక జోక్యంతో రెండు దేశాల మధ్య సంబంధాలు అథఃపాతాళానికి దిగజారాయి. ఇంది రాగాంధీ ప్రభుత్వం ప్రభాకరన్ నేతృత్వంలోని తమిళ వేర్పాటువాద ఉద్యమానికి ఆయుధాలను, శిక్షణను అం దించినప్పటి లక్ష్యానికి పూర్తిగా విరుద్ధమైన లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ఆ సైనిక చర్యను చేపట్టారు. ఆ విరోదాభాసాత్మకత తారస్థాయికి చేరి భారత్ భయానకమైన ఉచ్చు లో ఇరుక్కుపోయింది. అటు సింహళులు, ఇటు తమిళులు కూడా భారత్‌ను ద్వేషించారు. ఆ విషమ పరిస్థితి నుంచి 2009లో నాటి విదేశాంగ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ మార్గదర్శకత్వంలో మనం బయటపడగలిగాం. తమిళ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన చివరి నిర్ణయాత్మకమైన పోరాటానికి ప్రణబ్ దృఢంగా, సుస్పష్టంగా, పూర్తిగా మద్దతును తెలిపారు. ఏ ప్రచారార్భాటం లేకుండానే అది జరిగింది. శ్రీలంక సైన్యం ఎల్టీటీఈని ఓడిస్తున్నా, ప్రభాకరన్‌ను హతమారుస్తున్నా యూపీఏ ప్రభుత్వం మౌనం వహించింది. తన ముఖ్య మిత్రపక్షమై న డీఎంకే ఎంతగా వత్తిడి తెస్తున్నా అది పట్టించుకోలేదు. ఆనాడు మనం శ్రీలంక ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు రెండు దేశాల మధ్య పరస్పరం లాభసాటియైన సంబంధాలను విస్తరింపజేసుకోడానికి గొప్ప పెట్టుబడిగా ఉపయోగపడాల్సింది. అందుకు బదులుగా దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని మన్మోహన్సింగ్ నవంబర్‌లో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల సమావేశానికి హాజరుకాకుండా ఉండాలేమో అనిపించేంత దుస్థితి నెలకొంది. కారణం? శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘన చర్చకు వచ్చే ఆ సమావేశానికి ప్రధాని హాజరుకావడం తమిళనాడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యూపీఏ ఆందోళన చెందుతుండటమేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎల్టీటీఈపై యుద్ధంలో లంక సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణల విషయమై తమిళనాట భావోద్వేగాలు వ్యాపించి ఉన్నాయి. మన్మోహన్ వైఖరి ఏమంత అర్థవంతమైనది కాదు అనిపిస్తుంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, లంక యుద్ధం చివరి దశలో ఏమైతే జరిగిందో ఆ విషయంలో భారత్‌కు భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఏమి జరుగుతుందో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే మన ప్రభుత్వం ఏమీ చేయరాదని నిర్ణయించింది. రెండోది, దేశంలోని ఎన్నికల లెక్కలకు విదేశాంగ విధానం బందీ అయ్యేట్టయితే ఓటర్లకు లేదా జాతీయ ప్రయోజనాలను ఎన్నటికీ మేలు కలగదు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తిరిగి ప్రధానిగా ఎన్నిక కావడం కూడా అంతే నాటకీయమైన విస్తృతిగల అవకాశాలను కల్పించింది. బంగ్లాదేశ్‌లో మనకు షేక్ హసీనా కంటే ఉత్తమమైన మిత్రులు దొరకరు. ఎందుకంటే ఆమె 1971 బంగ్లాదేశ్ విముక్తి నేత ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. అయినాగానీ అవకాశాల నుంచి అనర్థాలను రాబట్టడం ఎలాగనే పాఠ్యపుస్తకంలోని పాఠంలాగా మన ప్రభుత్వం సున్నితమైన నదీ జలాల సమస్యపై హసీనాను వంచించింది. మన్మోహన్ ఏమి వాగ్దానం చేశారనేదే తప్ప షేక్ హసీనా ఏం కావాలని కోరారు అనేది ఇక్కడ గీటురాయి కానేకాదు, అటు ఢాకాలోనూ, ఇటు కోల్‌కతాలోనూ కూడా భారత ప్రభుత్వ నిర్వహణ నైపుణ్యం దయనీయమైనంత అధ్వాన్నంగా ఉండటం వల్లనే మన్మోహన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి భారత్ పట్ల శ్రీలంక ఆందోళనకు, బంగ్లాదేశ్ సంశయానికి తగిన కారణమే ఉంది. అయితే అవి భారత్‌పట్ల ఆగ్రహంతో లేకపోవచ్చుననేది వేరే సంగతి. భారత్ అనుసరిస్తున్నది తుపాకీని ఎటుబడితే అటు విచక్షణారహితంగా గురిపెట్టే వైఖరి. భారత్‌కు సర్వకాల సర్వావస్థల మిత్ర దేశం ఏదైనా ఉందంటే అది భూటానే. ఆ దేశంతో సంబంధాలలోని శాశ్వతమైన వసంతం కాస్తా ఎప్పుడూ ఉరుములతో భయపెట్టే తుఫానుల వానాకాలంగా దిగజారిపోయింది. అయితే అది ఇంతవరకు ఎప్పుడూ కుంభవృష్టిగా మారింది లేదనే మాట నిజమే. ఏదేమైనా భూటాన్‌తో సంబంధాలను చెడగొట్టుకోడానికి అసాధారణమైన నేర్పు ఎంతో అవసరం. గత కొన్నేళ్లుగా మనం దాన్ని సైతం సాధించగలిగాం. మన్మోహన్ ప్రభుత్వం ఏ పొరుగు దేశం కోసమైనా సమయం వెచ్చించగలుగుతోందంటే అంటే అది అమిత్ర వైఖరిగల పాకిస్థాన్ లేదా నిరాశావహమైన చైనాల కోసం మాత్రమే. మిగతా దేశాలకు మన ప్రభుత్వం పంపే సందేశం సరళమైనది: ఏదైనా సమస్య ఉంటేనే భారత్ దాన్ని పట్టించుకుంటుంది, అంతేగానీ స్నేహ హస్తాన్ని చాపితే మాత్రం కాదు. దక్షిణ ఆసియా అంతటా భారత్‌పట్ల కనిపించే మూతి విరుపు ధోరణికి కారణాలను ఇది విశదం చేయగలుగుతుంది. ఈ వ్యవహారం చూసి లోతుగా ఆలోచించే చైనా, భారత ప్రభుత్వం నుంచి తాను రాబట్టగలిగినదంతా రాబట్టుకుంటుంది, కోరుకున్నప్పుడల్లా అవమానిస్తుంటుంది. అది చూసి సంతోషించే పాకిస్థాన్ నవ్వుకుంటూ సార్క్ దేశాల సౌహార్ద్రతను కూడగట్టుకుంటుంది. -
నరేంద్ర మోడీకి భజనపరుల బెడద
బీజేపీ ఢిల్లీ పంజరాల్లోని పెంపుడు చిలకల మాటను కాక పార్టీ క్యాడర్ల మాటనే పట్టించుకుంది. అందుకే మోడీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. ఆ ఉత్సాహం ఆయనలో తొణికిసలాడటం కనిపిస్తూనే ఉంది. మోడీ ఆందోళన చెందాల్సిన అంశం ఒకటి ఇంకా మిగిలి ఉంది. ఇంతవరకు మద్దతుదారులే ఆయన చుట్టూ ఉన్నారు. ఇక భజనపరులు వెంటపడతారు. నోటికి చేతికి మధ్య ఎన్నో అగడ్తలున్న రాజకీయ క్రీడలో అది పొంచి ఉన్న ముప్పు కాగలుగుతుంది. యూరప్ లేదా అమెరికాల లోని గొప్ప పురాతన భవనాల పైకప్పు మీద వాతావరణ సూచి క ఉండేది. భవనానికి పైన అదేమీ శోభనిచ్చేది కాదు. అయితే దాని ప్రయోజనం సౌందర్య శాస్త్ర ప్రమాణాలతో కొలవగలిగింది కాదు. మానవ కార్యకలాపాలపై ప్రకృతి నేటి కంటే చాలా ఎక్కువ నియంత్రణను కలిగి ఉండిన రోజుల్లో అది గాలివాటపు దిశను సూచించేది. బ్రిటిష్ వాళ్లు కలకత్తా, మద్రాసు, బొంబాయి, 20వ శతాబ్దపు కొత్త ఢిల్లీ వంటి వైభవోపేతమైన మహా నగరాలను నిర్మించారు. ఆ నగరాలలో వాతావరణ సూచికలు ఉండే వి కావు. అందుకు కారణం ఊహించగలిగేదే. భారతదేశంలో ప్రకృతి ముందస్తుగా అంచనా క ట్టడానికి వీలుగా ఉంటుంది. తుఫానులు వచ్చే ముందు ఆకాశంలో కారు మేఘాలు సుడులు తిరుగుతూ అగ్రగామి సైనిక శ్రేణుల్లాగా కదంతొక్కుకుంటూ వస్తాయి. ఇంటిలో ఉక్కబోస్తుండగా బయల్దేరి, వర్షంలో తడిచి గజగజలాడుతూ జలుబుతో ఇంటికి చేరడానికి ఢిల్లీ నగరం లండన్ కాదు. వాతావరణ సూచికల్లాంటి బాహిరమైన ఇంద్రియాలను కోల్పోయినందుకు బదులుగా ఢిల్లీకి అంతకంటే మిన్నయైన అంతర్గత ఆంటెనాలు లభించాయి. ఢిల్లీలో ఆందోళన చెందవలసినది మానవ ప్రకృతి గురించేగానీ ప్రకృతి గురించి కాదు, రాజధానిలో పాలక వర్గానికి చెం దిన నానా గోత్రీకులు ఉండే ప్రత్యేక భాగంలోని ప్రతి చెవికీ శక్తివంతమైన ఆంటెనా ఉంటుంది. రాజకీయ గాలి నాటకీయంగా ఎటు వీస్తోందనే విషయాన్ని ఆ ఆంటెనా ఎప్పటికప్పుడు దిశను సరిచేసుకుంటూ నిరంతరం గ్రహిస్తుంటుంది. సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు సాగుతుండగా కూడా ఢిల్లీలోని అధికార దళారుల దొంతరలు బతికిబట్టగలిగాయి. సాధ్యమైనది వాస్తవం కాకపోవడమే కాదు, సంభావ్యం కూడా కాకుండా పోయే పరిస్థితులలో ఎవరు పైకి ఎగబాకుతున్నారో పసిగట్టి వారికి దండప్రమాణాలు ఆచరించనిదే అవి మనగలిగేవి కావు. ఘనమైన మన దేశ రాజధానిలో గత ఐదేళ్లలో రాజకీయ చర్చ ఎలా మారుతూ వచ్చిందనేదాన్ని నమోదు చేయడం చరిత్రకారులు మాత్రమే చేయగలిగిన పని. కాంగ్రెస్, దానికి నేతృత్వం వహిస్తున్న నెహ్రూ కుటుంబం కనీసం వచ్చే ఇరవై ఏళ్లు దేశాన్ని ఎలా పరిపాలిస్తుంద నేది తప్ప మరే విషయమూ 2009 నాటి ఢిల్లీలో చర్చకు వచ్చేది కాదు. అందుకే ప్రధాని మన్మోహన్సింగ్ సైతం ఆ ఏడాది చివర్లో జరిగిన తన సుప్రసిద్ధమైన పత్రికా సమావేశంలో ఆ విషయాన్ని లాంఛనంగా ప్రతి ధ్వనించారు. రాహుల్‌గాంధీ ఎప్పుడు ప్రధాని కావాలని నిర్ణయించుకుంటే అప్పుడు ఆ పదవి చేపట్టవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినా గానీ రాహుల్ వేచి ఉండే గదినే ఎంచుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసాభావం వ్యక్తమయ్యేది. 2010 శీతాకాలానికల్లా అవినీతిపై కొంత ఆందోళన వ్యక్తమైనా, మొత్తంగా ఈ కథనం పెద్దగా మారింది లేదు. తదుపరి దర్బారులో అధికార చక్రం తిప్పేవారుగా రాహుల్ బృందానికి విందు వినోదాల్లో మన్నన లభించేది, ఆ బృందాన్ని ఆకట్టుకోడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నించేవారు. ఇక అప్పుడు అన్నా హజారే, ఆయన్ను వెన్నంటి బాబా రాందేవ్ రంగప్రవేశం చేశారు. అయినా తలలు భయభక్తులతో ఊగుతూనే ఉన్నాయి. కొందరు తెలివిమంతులు జరగబోయేదంతా చూడగలిగారు. క్రమానుగతంగా సంభవించే ఆ కుదుపు బ్రహ్మాండంగా సాగుతున్న కాంగ్రెస్ ఊరేగింపునకు విఘాతం కలిగించడం అనివార్యమని గుర్తించగలిగారు. ఆ ‘ఈగ’ను తోలడానికి నియమితులైన మంత్రులంతా... అది ఎలా వచ్చిందో అలాగే అదృశ్యమైపోతుందన్నారు. ప్రజల జ్ఞాపకం ఎలాంటిదో వినలేదూ? స్వల్పమైనది, స్వల్పమైనది, స్వల్పమైనది. అందుకే వారి ముఖాల్లో నవ్వులు విప్పారుతూనే ఉన్నాయి. అంతలో 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో 80 సీట్లను గెలుచుకుంటే కాంగ్రెస్ దాన్ని తన గెలుపుగా ప్రకటిస్తుందనీ, రాహుల్ ప్రధాన మంత్రి కుర్చీని చేరడానికి ఆ గెలుపే ద్వార తోరణం కాగలదని ఆనాటి కథనం. యూపీ ఓటమితో ఆ కథనంపై అనుమానపు తొలి ఛాయలు పొడచూపాయి. ఆ తదుపరి అదే ఏడాది గుజరాత్లో నరేంద్ర మోడీ తిరిగి గెలుపొందారు. అది పరిస్థితిని మార్చడం ప్రారంభించింది. విచిత్రంగా మోడీ ఇటు అనుమానాన్నీ, అటు ఆశనూ రేకెత్తింపజేశారు. రాజకీయ శక్తియుక్తులు, పరిపాలనాపరమైన రికార్డు ఆయనకు గట్టి సానుకూలాంశాలయ్యాయి. అయినా గానీ కాంగ్రెస్ గుజరాత్ అల్లర్లను మోడీ వ్యతిరేక సమీకరణగా మార్చగలుగుతుందా? బీజేపీ మోడీ బొమ్మను పెట్టుకుని ముందుకు సాగాలనే ఎంచుకుంటే చేజేతులా ఓటమిని కొనితెచ్చుకోవడమే అవుతుందంటూ వందలాదిగా వ్యాసాలు, వార్తా కథనాలు మీడియాను ముంచెత్తాయి. అయితే బీజేపీ ఢిల్లీ పంజరాల్లోని పెంపుడు చిలకల మాటను పెడచెవిన పెట్టి, వీధుల్లోని తమ పార్టీ క్యాడర్ల మాటనే పట్టించుకుంది. అందుకే మోడీ ఇప్పుడు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. ఆ ఉత్సాహం ఆయనలో తొణికిసలాడటం కనిపిస్తూనే ఉంది. అయితే మోడీ ఆందోళన చెందాల్సిన అంశం ఒకటి ఇంకా మిగిలి ఉంది. ఇంతవరకు ఆయన మద్దతుదారులే ఆయన చుట్టూ ఉన్నారు. ఇక భజనపరులు ఆయన వెంటపడతారు. నోటికి చేతికి మధ్య ఎన్నో అగడ్తలున్న రాజకీయ క్రీడలో అది పొంచి ఉన్న ముప్పు కాగలుగుతుంది. ఢిల్లీకి మోడీ గురించి ఉన్న ఆందోళనకు కారణం ఆయన తమ కోవకు చెందని బయటి వ్యక్తి కావడమే. అంతేగానీ ఆయన పార్టీ గురించి కాదు. ఢిల్లీ ఉన్నత వర్గాలు తమకు అందించాల్సిన సేవల గురించి నిర్భయంగా నిలదీయగల బాపతు. అందుకు వీలుగా వారికి ఇంగ్లిషు ప్రేరితమైన విద్యాబుద్ధులు, సంస్కృతులతో కూడిన నాజూకు సంస్కారం కావాలి. అది లేని మోడీ వారికి బయటివాడే. ఆయన తన సోదరుని టీ దుకాణంలో కస్టమర్లకు టీ అందించేవాడు. ఆయన కుటుంబానికి నేటికీ తమ మూలాలతో బలమైన అనుబంధం ఉంది. మోడీ ఇంగ్లిషు భాష ఇంగ్లండు రాణిని ఆకట్టుకోలేక పోవచ్చు. అయితే అన్నిట్లోకి ఎక్కువగా ఢిల్లీ ఆందోళన చెందేది మాత్రం పెళుసు స్వభావం గల వ్యక్తిగా మోడీకి ఉన్న పేరు గురించే. ఢిల్లీకి అంగీకారయోగ్యమైనది రాజీయే గానీ జవాబుదారీతనం కాదు. దశాబ్దాల తరబడి తాము కూడబెట్టుకున్న విలువైన పింగాణి వస్తువులను కుమ్ముకుంటూ పోయే పోట్ల గిత్తను వారు కోరుకోరు. వివిధ స్థాయిలలో అధికారం నెరపిన బయటివారితో ఢిల్లీకి ఇంతకు ముందు కూడా అనుభవం ఉంది. అయితే వారిలో చాలా వరకు... ఢిల్లీ అంటే అసమర్థులకు అత్యం త ప్రియమైన నగరమని రుజువు చేసినవారే. ఒక్క లాల్‌బహదూర్ శాస్త్రి మాత్రమే ఆ నగరపు గతిని మార్చగలిగిన బయటి వ్యక్తి కాగలిగేవారు. అయితే ఆయన అందుకు తగినంత కాలం జీవించలేదు. పాకిస్థాన్‌తో తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకోవడానికి చేసిన కృషి ఆయనపై తీవ్ర ప్రభావం చూపి ఉండాలి. ఢిల్లీ తన ఒక ముఖంతో జనాం తికంగా మోడీని ప్రతిఘటిస్తుంది, మరో బహిరంగ ముఖంతో ఆనందాన్ని కనబరుస్తుంది. ఆ రెండు ముఖాల మధ్య ముఖాముఖి ఎన్నికలకు ముందు ఇంకా మిగిలి ఉన్న ఈ ఆరు నెలల కాలాన్ని ఆసక్తికరం చేయనుంది. - ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు