శోభానాగిరెడ్డికి ఘన నివాళి
ఆళ్లగడ్డ: దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి సంవత్సరికం సోమవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభఘాట్ను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శోభానాగిరెడ్డి కుమారుడు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, కుమార్తె మౌనికారెడ్డి, భూమా మహేశ్వరరెడ్డి, భూమా బ్రహ్మనందరెడ్డి, కిశోర్‌రెడ్డి, జగన్నాధరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీవీ రామిరెడ్డి, కుమార్‌రెడ్డి తదితర నేతలు శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు.
పట్టణంలోని భూమా నివాస గృహంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ నగర పంచాయతీ కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించారు. శోభానాగిరెడ్డి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు శోభానాగిరెడ్డి తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతిని ఏప్రిల్ 24వ తేదీన ఘనంగా నిర్వహిస్తామని పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి తలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు.