Mobile Banking
-
బంగారం ఆయనతోనే కొనిపిస్తుంటా..
శ్రీనగర్‌కాలనీ: ‘మా ఆయనకు బంగారం కొనడం ఇష్టం లేకున్నా ప్రతిసారీ నేను నచ్చిన బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ పేరుతో కొనిపిస్తుంటాను’ అని సినీ నటి అనసూయ అన్నారు. వాల్యూగోల్డ్ సంస్థ మొబైల్ గోల్డ్ బయ్యింగ్ సర్వీస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అనసూయ వాహనాన్ని ప్రారంభించారు. అమీర్‌పేట్‌లోని సారథి స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు గోల్డ్‌ను అమ్మడం నామోషీగా ఫీలయ్యేవారని, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్గా మారిందని అన్నారు. చాలా మంది గోల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వారికి నగదు అవసరమైనప్పుడు వాటిని అమ్ముకుంటున్నారన్నారు. తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ అమ్ముకోవాలనుకునే వారి కోసం మొబైల్ గోల్డ్ బయ్యింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన సంస్థ ప్రతినిధులు అభిషేక్ చందాను ఆమె అభినందించారు. -
కోటక్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.అయితే, క్రెడిట్ కార్డు కస్టమర్లు సహా ప్రస్తుతమున్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకు ఎక్స్టర్నల్ ఆడిట్‌ను నిర్వహించి, అందులో బయటపడే సమస్యలను, తాము గు ర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది. పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్న కారణంగా 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐటీ సంబంధ తనిఖీలో కీలకాంశాలు2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధ తనిఖీల్లో తీవ్ర ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నిబంధనలను పాటించకపోవడం మొదలైన వాటిని గుర్తించాం‘ అని వివరించింది. వాటిని సమగ్రంగా, సకాలంలో పరిష్కరించడంలో బ్యాంకు నిరంతరం వైఫల్యం చెందుతున్న కారణంగా తాజా చర్యలు తీసుకోవాల్సి వచి్చందని ఆర్బీఐ తెలిపింది. పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కోర్ బ్యాంకింగ్ సిస్టం (సీబీఎస్), ఆన్లైన్ .. డిజిటల్ బ్యాంకింగ్ మాధ్యమాలు గత రెండేళ్లుగా తరచూ మొరాయిస్తూ, కస్టమర్లను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట వ్యాపార విభాగాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
ఈ యాప్స్ యమా డేంజర్
-
కేంద్రం వార్నింగ్.. భారత్‌లోకి కొత్త రకం బ్యాంకింగ్ వైరస్ ఎంట్రీ!
బనశంకరి: నేరాలు దాని స్వరూపాన్ని మార్చుకుంటోంది. క్రెడిట్ కార్డులు బకాయిలు చెల్లించలేదని, ఏటీఎం కార్డు గడువు ముగిసిందని ఫోన్ చేసి ఓటీపీలు అడిగి డబ్బులు కాజేసేవారు. ఇప్పుడు కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు కన్నం వేసేందుకు సోవా అనే మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ అడుగు పెట్టింది. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్, స్మార్ట్ఫోన్లలో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్లను టార్గెట్‌గా చేసుకుని ఈ వైరస్ దాడి చేస్తుంది. అమెరికా, రష్యా, స్పెయిన్ అనంతరం భారత్ బ్యాంకింగ్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుంది. జూలైలో ఈ వైరస్ భారత్‌లో కనబడగా ప్రస్తుతం మరింత అప్డేట్ కాబడి తన హవా కొనసాగిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తుంది. మొబైల్లో ప్రవేశించే ఈ వైరస్‌ను తొలగించడం (అన్ ఇన్స్టాల్) చాలాకష్టం. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ యాప్‌ల్లో దాగి ఉంటుంది. వివిధ రూపాల్లో.. పేమెంట్ యాప్ రూపంలో సోవా మీ మొబైల్లో చేరవచ్చు. బ్యాంకింగ్ ఇ–కామర్స్ యాప్‌లు రూపంలో కనబడవచ్చు. వాటిని వినియోగించినప్పుడు కస్టమర్లు వ్యక్తిగత వివరాలు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురి అవుతుందని జాతీయ కంప్యూటర్ భద్రతా అత్యవసర బృందం (సర్ట్స్ ఇన్) హెచ్చరించింది. గూగుల్‌క్రోమ్, అమెజాన్, ఎఫ్ఎఫ్టీ రూపంలో స్మార్ట్స్ ఫోన్‌లోనికి దొంగలా వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. అనంతరం వినియోగదారులకు తెలియకుండా పాస్వర్డ్ లాగిన్ వివరాలు చోరీ చేస్తుంది. ఇది ప్రమాదకరం సోవా–0.5 సోవా కానీ లేదా మరో వైరస్ కానీ సైబర్‌స్పేస్‌లో కస్టమర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి సోవా అనేది కొత్తది కాదు. విదేశాల్లో ఇది చాలా వరకు దెబ్బతీసింది. ప్రస్తుతం భారత్‌లో ప్రవేశించిన సోవా 5.0 మరింత ప్రమాదకారి అని సైబర్ నిపుణుడు జీ.అనంతప్రభు తెలిపారు. మొబైల్ లేదా కంప్యూటర్లో రారయండ్ సమ్వేర్లో చేరుకుని మీ అకౌంట్‌ను లాక్ చేస్తుంది. అన్‌లాక్ చేయడానికి సైబర్ వంచకులు డబ్బు అడుగుతారు. ఈ ఫ్యూచర్ సైతం సోవాకు చేరుతుంది. కస్టమర్లు జాగ్రత్త వహించాలి. గూగుల్, ఫేస్బుక్, జీ మెయిల్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తుంది. బ్యాకింగ్ వ్యవహారాలకు కన్నం వేస్తుంది. 200కు పైగా యాప్‌లు బ్యాంకింగ్ అప్లికేషన్లు, క్రిప్టో ఎక్సేంజీలు, వ్యాలెట్లతో పాటు 200కు పైగా మొబైల్ అప్లికేషన్లను కొత్త వైరస్ టార్గెట్ చేసుకుంటుందని భద్రతా సంస్థ తెలిపింది. వినియోగదారులు తమ నెట్‌బ్యాకింగ్ అప్లికేషన్లకు లాక్ ఇన్ చేయగా, బ్యాంక్ అకౌంట్లలో ప్రవేశించినప్పుడు ఈ సోవా మాల్వేర్ డేటాను కాజేస్తుంది. సైబర్ సాక్షరత సమస్యకు పరిహారమని ఐటీ నిపుణుడు వినాయక్ పీఎస్, తెలిపారు. ఇలా జాగ్రత పడాలి : - మొబైల్ బ్యాంకింగ్ వ్యవహారాలు చేసేవారు తమ అకౌంట్‌ను రెండు దశల్లో ధ్రువీకరణ (ఐడెంటీఫికేషన్) వ్యవస్థ వినియోగించాలి. - బ్యాంకింగ్ యాప్‌లను నిత్యం అప్డేట్ చేయాలి - కచ్చితంగా ఉత్తమమైన యాంటీ వైరస్ మొబైల్ వినియోగించాలి - మొబైల్స్‌కు వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయరాదు - యాప్‌లు, ఓపెన్, బ్రౌజర్లు నిత్యం అప్డేట్ చేసి అధికారిక యాప్ స్టోర్ నుచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్లును మాత్రమే వినియోగించాలి. - పబ్లిక్ వైఫైను వినియోగించడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. -
హమ్మయ్యా..ఎస్బీఐ ఖాతాదారులకు భారీ ఊరట!
ఖాతాదారులకు ఎస్బీఐ భారీ ఊరట కల్పించింది. మొబైల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే మనీ ట్రాన్స్ ఫర్పై వసూలు చేసే ఎస్ఎంఎస్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉచితంగా వినియోగించుకోవడంపై ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా యూఎస్ఎస్డీ సేవల్ని ఉపయోగించుకోవచ్చని ఎస్బీఐ ట్వీట్ చేసింది. *99# డయల్ చేసి బ్యాంకింగ్ సేవల్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చని ట్వీట్లో పేర్కొంది. SMS charges now waived off on mobile fund transfers! Users can now conveniently transact without any additional charges.#SBI #StateBankOfIndia #AmritMahotsav #FundTransfer pic.twitter.com/MRN1ysqjZU — State Bank of India (@TheOfficialSBI) September 17, 2022 "మొబైల్ ఫండ్ ట్రాన్స్ఫర్లపై ఎస్ఎమ్ఎస్ ఛార్జీలు రద్దు చేయబడ్డాయి! వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు జరుపుకోవచ్చని చెప్పింది. యూఎస్ఎస్డీ సర్వీస్ అంటే యూఎస్ఎస్డీ అంటే అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అని అర్ధం. మొబైల్ నుంచి మనీ ట్రాన్స్ ఫర్, బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేయడం, బ్యాంక్ స్టేట్ మెంట్ జనరేట్ చేయడంతో పాటు ఇతర సేవల్ని ఈ యూఎస్ఎస్డీ ద్వారా వినియోగించుకోచ్చు. ఈ సర్వీస్ ఫీచర్ ఫోన్లపై పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూజర్లు బ్యాంకింగ్ పొందవచ్చు. *99# కోడ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించడం ద్వారా స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫండ్ ట్రాన్స్ ఫర్ లేదా అకౌంట్ స్టేట్ మెంట్‌తో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునేందుకు ఖాతాదారులకు ఎస్బీఐ అనుమతిస్తుంది. చదవండి👉 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్! -
కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌పై ఫిర్యాదులు ఎక్కువ: ఆర్బీఐ
ముంబై: బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం, డెబిట్‌కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులకు సంబంధించి ఎక్కువగా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తున్నారు. 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వీటిపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. పారదర్శక విధానాలు పాటించకపోవడం, ఇచ్చిన హామీలను నిలుపుకోకపోవడంపై ఖాతాదారులు ఫిర్యాదు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2020-21 వార్షిక నివేదికను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. 2020 జూలై 1 నుంచి 2021 మార్చి 31 వరకు తొమ్మిది నెలల గణాంకాలు ఇందులో ఉన్నాయి. 2020 జూలై నుంచి ఆర్బీఐ సైతం ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా (ఏప్రిల్-మార్చి) తన వార్షిక సంవత్సరాన్ని కూడా సవరించుకుంది. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006 (బీవోఎస్), ద అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018(ఓఎస్ఎన్బీఎఫ్సీ), ద అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 (ఓఎస్డీటీ) పథకాల కింద గణాంకాలను ఆర్బీఐ ఈ నివేదికలో పేర్కొంది. వీటి నుంచి ఎక్కువ.. ఈ మూడు పథకాల కింద ఫిర్యాదులు 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్య కాలంలో 22 శాతం పెరిగి 3,03,107కు చేరాయి. మొత్తం ఫిర్యాదుల్లో ఏటీఎం/డెబిట్‌కార్డుల నుంచి 17.40 శాతం, మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలపై 12.98 శాతం, క్రెడిట్ కార్డులపై 12.36 శాతం చొప్పన వచ్చాయి. ఓఎస్డీటీ పథకం కింద ఫండ్ ట్రాన్స్ఫర్/యూపీఐ/ బీబీపీఎస్/ భారత్ క్యూఆర్కోడ్కు సంబంధించి 51 శాతం,, మొబైల్/ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి 22.57 శాతం, తప్పుడు బెనిఫీషియరీ కారణంతో లావాదేవీ మొత్తాన్ని తిరిగి జమ చేయకపోవడంపై 8 శాతం చొప్పున ఫిర్యాదులు దాఖలయ్యాయి. (చదవండి: కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!) -
యూఎస్ఎస్డీ చార్జీల తొలగింపుపై ట్రాయ్ దృష్టి
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగా మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపు సర్వీసులకు సంబంధించి యూఎస్ఎస్డీ మెసేజీలపై చార్జీలను తొలగించాలని భావిస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ విషయంలో ఒకో యూఎస్ఎస్డీ సెషన్‌కు టెలికం సంస్థలు విధిస్తున్న టారిఫ్‌లు .. ఒక నిమిషం అవుట్గోయింగ్ వాయిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ సగటు కన్నా అనేక రెట్లు అధికంగా ఉంటున్నాయని ట్రాయ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనపై డిసెంబర్ 8లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుందని వివరించింది. ఉదాహరణకు, కాల్ చేసినప్పుడు లేదా ఎస్ఎంఎస్ పంపినప్పుడు మొబైల్ బ్యాలెన్స్ నుంచి ఎంత ఖర్చయ్యింది అన్నది స్క్రీన్‌పై కొంత సేపు చూపించి మాయమయ్యే మెసేజీలను యూఎస్‌ఎస్‌డీగా వ్యవహరిస్తారు. ఇవి ఎస్ఎంఎస్ల తరహాలో ఫోన్లో సేవ్ కావు. ప్రస్తుతం ఒకో యూఎస్ఎస్డీ సెషన్‌కు చార్జీలు గరిష్టంగా 50 పైసలుగా ఉన్నాయి. ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపు సేవలకు మాత్రం చార్జీలు ఉండవు, కానీ ఇతర సర్వీసులకు మాత్రం అమల్లోనే ఉంటాయి. చదవండి: శాటిలైట్ ఆపరేటర్ల నిబంధనలు సరళతరం కావాలి -
ఆంధ్రప్రదేశ్‌లో మోడరన్ బ్యాం‘కింగ్
సాక్షి, అమరావతి: ఒకప్పుడు నగదు విత్ డ్రా చేయాలన్నా.. నగదు జమ చేయాలన్నా గంటల కొద్దీ బ్యాంకుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. పనులన్నీ మానుకొని.. టోకెన్ నంబర్ ఎప్పుడు పిలుస్తారో అని కాచుకొని కూర్చోవాల్సి వచ్చేది. అదే ఏ అర్ధరాత్రో, అపరాత్రో డబ్బులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే.. పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల స్థానాన్ని వెనక్కి నెడుతూ.. పనులు వేగంగా, సులువుగా, సజావుగా జరిగేలా మోడరన్ బ్యాంకింగ్ దూసుకువచ్చింది. వీధివీధికి ఏటీఎంలు వెలిశాయి. యాప్‌ల రూపంలో చేతుల్లోకే బ్యాంకు సేవలు వచ్చేశాయి. చిటికెలో పనులు పూర్తయిపోతున్నాయి. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు ఈ సేవలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఏటీఎం, క్యూఆర్ కోడ్ తదితరాల ద్వారా పొందే ఆధునిక బ్యాంకింగ్ సేవలను రాష్ట్ర గ్రామీణ ప్రజలు అధికంగా వినియోగిస్తున్నారు. ఈ విషయం నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే(ఎన్ఏఎఫ్ఐఎస్)లో వెల్లడైంది. మోడరన్ బ్యాంకింగ్, సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంతో పాటు ఎన్‌ఏఎఫ్ ఇండెక్స్‌లో దేశీయ సగటు కంటే మెరుగైన పనితీరును ఆంధ్రప్రదేశ్ కనబరిచింది. రూపే కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో ముందుకు.. ఎన్‌ఏఎఫ్ ఇండెక్స్‌లో దేశవ్యాప్త సగటు 0.337 పాయింట్లుగా ఉంటే ఏపీ మాత్రం 0.473 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. మోడరన్ బ్యాంకింగ్ సేవల వినియోగంలో 0.703 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ విభాగాల్లో 1, 2, 3 స్థానాల్లో ఉన్నది గోవా, మణిపూర్, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలే. పెద్ద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టేనని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ లేదా, పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభించడంతో పాటు రూపే కార్డులు, ఆధార్‌తో అనుసంధానం, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు కల్పించారు. వారంతా ఇంటి వద్ద నుంచే బ్యాంకింగ్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,92,293 జన్‌ధన్ ఖాతాలుండగా.. అందులో 79 శాతం ఖాతాలకు రూపే కార్డులిచ్చారు. 89.15 శాతం ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇక సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంలో ఏపీ 0.424 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, గోవా, హిమాచల్ప్రదేశ్లున్నాయి. పూర్తి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలో మార్చాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలుత వైఎస్సార్ జిల్లాను 100 శాతం డిజిటల్ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంది. వైఎస్సార్ జిల్లాలో మొత్తం 31,83,960 సేవింగ్ ఖాతాలుండగా.. అందులో ఇప్పటి వరకు 88 శాతం ఖాతాలకు రూపే కార్డులు మంజూరు చేశారు. 24 శాతం మందికి నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందించగా.. 38 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. -
హెచ్డీఎఫ్సీ మొబైల్ యాప్ క్రాష్.. కస్టమర్ల గగ్గోలు
హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ నేడు క్రాష్ అయ్యింది. దీంతో చాలా మంది అసహనానికి లోను అయ్యారు. యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను రాజీవ్ బెనర్జీ కోరారు. హెచ్డీఎఫ్సీ ప్రతినిధి రాజీవ్ బెనర్జీ దీనిపై ట్విటర్ లో స్పందించారు. "మేము మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాము, ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాము. అప్పటి వరకు వినియోగదారులు తమ లావాదేవీల కోసం నెట్‌బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు. మీకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము, ధన్యవాదాలు" అని తెలిపారు. హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ వాడటానికి ప్రయత్నించినప్పుడు బ్యాంక్ వినియోగదారులకు స్క్రీన్‌పై ఒక మెసేజ్ ఫ్లాష్ అయినట్లు చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై ట్విటర్ వేదికగా బ్యాంక్ అధికారులకు పిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో సమస్య తలెత్తింది. కొంత మంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది దాని గురుంచి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. చదవండి: గల్వాన్ ఎఫెక్ట్: చైనా ఉత్పత్తులపై భారీ దెబ్బ -
ఫేస్/ఐరిస్‌తోనే ఇక మొబైల్ బ్యాంకింగ్!
సాక్షి, అమరావతి: మొబైల్ బ్యాంకింగ్ విధానంలో సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కేంద్రం నడుం బిగించింది. వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానానికి బదులు.. ఫేస్/ఐరిస్ గుర్తింపు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు సైబర్ భద్రత విధానాన్ని రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓటీపీ ఆధారంగా నిర్వహిస్తున్న మొబైల్ బ్యాంకింగ్‌లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్లు, బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. క్షణాల్లోనే నగదును మరో ఖాతాకు బదిలీ చేస్తున్నారు. మొబైల్ బ్యాంకింగ్ ఖాతాదారులు ఈ విషయాన్ని గ్రహించే లోగానే అకౌంట్లలో నగదు మాయమైపోతోంది. త్వరలో జాతీయ సైబర్ భద్రత విధానం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో సైబర్ ఆర్థిక నేరాలను సత్వరం అరికట్టాల్సిన అవసరముందని సైబర్ పోలీస్, ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ బ్యాంకింగ్‌లో సైబర్ నేరాలను అరికట్టేందుకు కార్యాచరణకు సన్నద్ధమైంది. సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు ప్రధాన సాధనంగా చేసుకుంటున్న ఓటీపీ నంబర్ విధానాన్ని తొలగించాలని భావిస్తోంది. ఆ స్థానంలో ఖాతాదారుల ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్), ఐరిస్ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత ఖాతాదారుడి ముఖం/ఐరిస్ గుర్తింపును సరిచూశాకే ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగే విధానాన్ని అమలు చేయనున్నారు. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే రూపొందించి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ విధానంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని సైబర్ పోలీసింగ్ నిపుణులు నిర్ధారించారు. దాంతో ఈ విధానాన్ని అధికారికంగా దేశమంతా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుతో చర్చించింది. మొబైల్ బ్యాంకింగ్ విధానంలో ఫేస్ /ఐరిస్ గుర్తింపు ప్రక్రియను సైబర్ భద్రత విధానంలో పొందుపరచాల్సి ఉంది. అందుకు అవసరమైన జాతీయ సైబర్ భద్రత విధానం–2020ను కేంద్ర హోంశాఖ ఇప్పటికే రూపొందించింది. త్వరలోనే దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుందని అధికారవర్గాలు తెలిపాయి. అనంతరం బ్యాంకులతో సమావేశం నిర్వహించి ఫేస్/ఐరిస్ గుర్తింపుతోనే మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయిస్తారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఈ కొత్త విధానంతో మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టొచ్చని సైబర్ క్రైం పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆందోళనకర స్థాయిలో ఆర్థిక నేరాల పెరుగుదల గత ఐదేళ్లలో దేశంలో సైబర్ ఆర్థిక నేరాలు దాదాపు 300శాతం పెరగడం ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా 2016 నుంచి ఈ నేరాల తీవ్రత అమాంతంగా పెరుగుతోంది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, ప్రజలు మొబైల్ బ్యాంకింగ్ వైపు మొగ్గుచూపుతుండటంతో అదే స్థాయిలో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో సైబర్ ఆర్థిక నేరాల గణాంకాలిలా ఉన్నాయి.. -
నెలాఖరుకల్లా అన్ని బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే దిశగా ఈ నెలాఖరు నాటికి (మార్చి 31) మొబైల్ బ్యాంకింగ్ (ఎం–బ్యాంకింగ్) సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని బ్యాంకులన్నింటినీ కేంద్రం ఆదేశించింది. మొబైల్ ఫోన్ గల ప్రతీ ఖాతాదారు ఎం–బ్యాంకింగ్‌ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. గతంలో మొబైల్ బ్యాంకింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవడంతో అత్యధిక శాతం కస్టమర్లు దీనిపై ఆసక్తి చూపేవారు కాదని, ప్రస్తుతం చాలా మంది ఎం–బ్యాంకింగ్ కోరుకుంటున్న నేపథ్యంలో మార్చి 31లోగా అన్ని బ్యాంకులు తమ తమ ఖాతాదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని పేర్కొన్నట్లు ఆమె వివరించారు. యూపీఐ లేదా భీమ్ యాప్ ఉపయోగిస్తున్న ఖాతాదారులకు ఆటోమేటిక్‌గా మొబైల్ బ్యాంకింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
‘అన్ని బ్యాంకులు 31లోగా పూర్తి చేయాలి’
న్యూఢిల్లీ: తమ బ్యాంకుల్లోని ఖాతాదారులకు మార్చి 31లోగా మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందించాలని అన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలకు మరింత ఊపునిచ్చే ఉద్దేశంతో ఈ పనిని సత్వరంగా వేగిరం చేయాలని స్పష్టం చేసింది. ‘మొబైల్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడికి మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందించాలి. ఇందుకోసం మార్చి 31వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి’ అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సెక్రటరీ అరుణా సుందరరాజన్ బుధవారం విలేకరులకు చెప్పారు. ‘వాస్తవానికి ప్రారంభ సమయంలో మొబైల్ బ్యాంకింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ, తర్వాత పలువురు కస్టమర్లు తమకు మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాలు కావాలని, ఆ మేరకు బ్యాంకులను ఆదేశించాలంటూ మాకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అది తప్పకుండా చేయాల్సిన పని. ఇది ఇప్పటికే ప్రారంభమైనా పెద్దగా బ్యాంకులు స్పందించడం లేదని తెలిసింది. అందుకే మార్చి 31లోగా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడికి అందించాలి’ అని ఆమె ఆదేశించారు. -
బ్యాంకు ‘నెట్’లోకి వెళ్లాల్సిందే!
► ఇక బ్రాంచిలో జరిపే లావాదేవీలకు పరిమితులు ► నెలకు నాలుగైదు దాటితే ప్రతి లావాదేవీకి భారీ చార్జీలు ► డిజిటల్ బ్యాంకింగ్‌ను తప్పనిసరి చేస్తున్న బ్యాంకులు ► ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌లో నగదు బదిలీకి పలు మార్గాలు ► నెఫ్ట్ నుంచి యూపీఐ దాకా... అన్నిటికీ చార్జీలు; వాటి మధ్య తేడాలు రెండ్రోజుల కిందట హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒక ప్రకటన చేసింది. ‘మీరు బ్యాంకు బ్రాంచికి వచ్చి గనక లావాదేవీలు జరిపితే... నెలకు నాలుగు మాత్రమే ఉచితం. అది దాటితే లావాదేవీకి రూ.150 చొప్పున వసూలు చేస్తాం’ అనేది దాని సారాంశం. అంటే బ్యాంకుకు నగదు డిపాజిట్ చెయ్యటానికి వెళ్లినా, విత్‌డ్రా చెయ్యటానికి వెళ్లినా... ఇవన్నీ లావాదేవీలే కనక నెలకు నాలుగు మాత్రమే ఉచితం. అది దాటితే బాదుడే. దీనర్థం ఒక్కటే. ‘‘మీరు బ్యాంకుకు రాకండి. కావాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఎన్ని లావాదేవీలైనా చేసుకోండి’’ అంతే. కేంద్ర ప్రభుత్వం మెల్లగా క్యాష్‌లెస్... అంటూ అందరినీ డిజిటల్ వైపు మళ్లిస్తోంది. దానికి అనుగుణంగా బ్యాంకులు బలవంతంగా అందరినీ డిజిటల్ వైపు నడిపించటానికి కంకణం కట్టుకున్నట్లున్నాయి. ఈ ప్రకటనను కూడా దాన్లో భాగంగానే భావించాలి. సరే! మరి ఇంటర్నెట్ బ్యాంకింగో, మొబైల్ బ్యాంకింగో చెయ్యాలంటే కావాల్సిందేంటి? అసలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒక ఖాతా నుంచి వేరొకరి ఖాతాకు నగదు బదిలీ చేయటానికి ఏఏ పద్ధతులున్నాయి? ఇంకా ప్రభుత్వం తెచ్చిన భీమ్ యాప్ వంటివి ఎలా పనిచేస్తాయి? ఇలా బదిలీ చేసేటపుడు చార్జీలేమైనా వసూలు చేస్తారా? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ చేయటానికి మొట్టమొదట కావాల్సింది నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్. దీనికోసం మీ బ్యాంకు బ్రాంచిని సంప్రదిస్తే యూజర్ ఐడీ వారే ఇస్తారు. పాస్‌వర్డ్‌ను కొన్ని పోస్టల్లో పంపిస్తుండగా... మీ పుట్టినతేదీ, ఓటీపీ సాయంతో మీ పాస్‌వర్డ్‌ను మీరే ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని మరికొన్ని బ్యాంకులిస్తున్నాయి. దీనికోసం మీ మొబైల్ నంబర్‌ను మీ ఖాతాతో బ్యాంకు ద్వారా అనుసంధానం చేయటం మాత్రం తప్పనిసరి. మున్ముందు మీ ఆధార్‌ను బ్యాంకులో అనుసంధానం చేసి... మొబైల్, నెట్ బ్యాంకింగ్ ఏవీ లేకున్నా కూడా వేలిముద్ర సాయంతో చెల్లింపులు జరిపే అవకాశం కూడా రాబోతోంది. అయితే దీనికి ముందుగా మీ ఆధార్‌ను మీ బ్యాంకుతో అనుసంధానం చేయటం తప్పనిసరి. ఇక వేరొకరి ఖాతాలోకి ఆన్లైన్లో నగదు బదిలీ చేయటానికిపుడు రకరకాల పద్ధతులున్నాయి. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ, భీమ్ యాప్ వంటివన్నీ నేరుగా బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీకి వీలు కల్పించేవే. కాకపోతే చార్జీల విషయంలో తేడాలతో పాటు దేని పరిమితులు దానికున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఐఎంపీఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) అనేది వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటలూ అందుబాటులో ఉండే విధానం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ దీన్ని 2010లో ఆవిష్కరించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ విధానంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ మాదిరిగానే ఇదీ. ఈ సౌకర్యానికి బ్యాంకు వద్ద పత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన పనిలేదు. నెట్ బ్యాంకింగ్‌లో నగదు బదిలీ చేసే చోటే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఏది కావాలన్నది ఖాతాదారుడి ఇష్టం. లావాదేవీ ఇలా... ఐఎంపీఎస్ విధానంలో బెనిఫీషియరీకి నగ దు పంపించాలనుకుంటే సంబంధిత వ్యక్తి ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంకు శాఖ వివరాలతో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్‌కు మాత్రం ఈ ఇబ్బంది లేదు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఐఎంపీఎస్ విధానంలో నగదు పంపాలనుకుంటే బెనిఫీషియరీ నంబర్, మొబైల్ మనీ ఐడెంటిఫయర్ (ఎంఎంఐడీ) కోడ్ ఉంటే సరిపోతుంది. రూ.లక్ష వరకు లావాదేవీలపై రూ.5 చార్జీ ఉంటుంది. ఆపై రూ.2 లక్షల వరకు చార్జీ రూ.15 ఉంటుంది. దీనికి సర్వీస్ ట్యాక్స్ అదనం. ఈ చార్జీలు కూడా బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఈ విధానంలో గరిష్టంగా రూ.2 లక్షల వరకే నగదు బదిలీకి వీలుంటుంది. ఆర్టీజీఎస్ రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) అనేది అధిక విలువ గల లావాదేవీలకు ఉద్దేశించిన విధానం. కనీ సం రూ.2 లక్షలు ఆపైనే నగదు బదిలీ చేసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. లావాదేవీ పూర్తయిన అరగంటలోపు బెనిఫిషియరీ ఖాతాకు జమ అయిపోతుంది. పనిదినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు, శనివారాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఆర్టీజీఎస్ విండో తెరిచి ఉంటుంది. ఈ సమయం తర్వాత చేసిన లావాదేవీ మరుసటి పని దినం ప్రారంభ సమయంలో పూర్తవుతుంది. మిగతా ప్రక్రియంతా ఎన్ఈఎఫ్టీ మాదిరే ఉంటుంది. లావాదేవీ చార్జీలు బ్యాంకులను బట్టి మారుతాయి. రూ. 2–5 లక్షల వరకు రూ.30, రూ.5 లక్షల పైన రూ.55 వరకు చార్జీ ఉంది. పరిమితులు లావాదేవీకి గాను నగదు పంపే వ్యక్తి, అందుకునే వ్యక్తి బ్యాంకు శాఖల్లో ఆర్టీజీఎస్ సదుపాయం ఉండాలి. ఆర్టీజీఎస్ సదుపాయం ఉన్న శాఖల వివరాలను ఆర్బీఐ వెబ్సైట్లో చూడొచ్చు. సెలవు రోజులు, ఆదివారాల్లో ఈ సదుపాయం ఉండదు. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అనేది ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన సరికొత్త విధానం. ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ల యుగం కనకే దీన్ని తేవటం జరిగింది. స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ ఆధారిత బ్యాంకు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సులభంగా, సత్వరమే నగదు చెల్లింపులు, నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏడాది పొడవునా, రోజులో అన్ని వేళలా ఈ విధానం పనిచేస్తుంది. బ్యాంకు పేరు, ఖాతాదారుడి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలాంటి వివరాలేం అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. ఖాతా నంబర్ ఇవ్వడం ద్వారా వర్చువల్ పేమెంట్ అడ్రస్‌ను క్రియేట్ చేసుకోవాలి. వర్చువల్ పేమెంట్ అడ్రస్ అంటే ఉదాహరణకు టటజీఃటbజీ ఇలా. నగదు బదిలీ యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయాలనుకుంటే యాప్‌ను ఓపెన్ చేశాక ఆరు అంకెల పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత యూపీఐ ఆప్షన్ ఎంచుకుని ‘పే టూ వర్చువల్ పేమెంట్ అడ్రస్’ను క్లిక్ చేయాలి. నగదు అందుకోవాల్సిన వ్యక్తి వర్చువల్ ఐడీ ఒక్కటి ఉంటే చాలు అర నిమిషం లోపే నగదు పంపించేయవచ్చు. బెనిఫీషియరీ వర్చువల్ ఐడీని ఎంటర్ చేసి, ఎంత మొత్తం పంపదలిచినదీ నమోదు చేయాలి. ఓకే చేసిన తర్వాత అవే వివరాలను మరోసారి ధ్రువీకరించటం ఆలస్యం... లావాదేవీ జరిగిపోతుంది. దుకాణదారుడికి నగదు చెల్లించాలన్నా, వ్యక్తులకు నగదు బదిలీ చేయాలన్నా ఇలానే. యూపీఐ యాప్ ద్వారా వ్యక్తుల మధ్య జరిగే నగదు బదిలీ సేవలపై చార్జీల్లేవు. దుకాణాల్లో చెల్లింపులపై మాత్రం రూ.15 వరకు చార్జీ ఉంటుంది. దీన్ని కూడా వ్యాపారే చెల్లించాలి. డీమోనిటైజేషన్ తర్వాత ఈ ఛార్జీల్ని కూడా రద్దు చేశారు. పరిమితులు యూపీఐ మార్గదర్శకాల ప్రకారమైతే రోజుకు రూ.లక్ష వరకు నగదు బదిలీ లేదా చెల్లింపుల పరిమితి ఉంది. కొన్ని బ్యాంకులు సొంతంగా పరిమితులు విధిస్తున్నాయి. ఎన్ఈఎఫ్టీ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. చాన్నాళ్లుగా అందుబాటులో ఉంది. డిఫర్డ్ సెటిల్మెంట్ విధానంలో పనిచేస్తుంది. అంటే లావాదేవీలు తక్షణమే పూర్తి కావు. బ్యాచ్‌ల వారీగా నిర్ణీత సమయానికి ఓసారి జరుగుతాయి. సోమవారం– శుక్రవారం మధ్య రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 సెటిల్మెంట్లు... శనివారం మాత్రం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరు సెటిల్మెంట్లు జరుగుతాయి. నగదు బదిలీపై పరిమితి లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం పరిమితులు విధించాయి. ఉదాహరణకు ఎస్బీఐ రిటైల్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఎన్ఈఎఫ్టీ గరిష్ఠ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. లావాదేవీ జరిపేదిలా... నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉండాలి. మొబైల్ నంబర్‌ను బ్యాంకులో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఎవరికైతే నగదు పంపాలని అనుకుంటున్నామో సంబంధిత వ్యక్తి పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ లేదా బ్యాంకు శాఖ పేరును ముందుగానే తెలుసుకుని ‘పేయీ’గా యాడ్ చేసుకోవాలి. పేయీ వివరాల్ని బ్యాంకు ధ్రువపరచి, యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేషన్‌కు ఎంత సమయం పడుతుందన్నది బ్యాంకును బట్టి మారుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు అయితే బెనిఫీషియరీని యాడ్ చేసిన అర గంటకు నగదు పంపుకునేందుకు అనుమతిస్తోంది. ఎస్బీఐ అయితే నాలుగు గంటలు. అదీ కూడా పని వేళల్లోనే ఈ సమయపాలన వర్తిస్తుంది. వివరాల్ని బ్యాంకు ధ్రువపరిచాక నెట్‌బ్యాంకింగ్‌లో లాగిన్ అయి... ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఆప్షన్ ఎం చుకోవాలి. పేయీని ఓకే చేసి, ఎంత నగదు పంపాలంటే అంత పంపొచ్చు. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తదుపరి సెటిల్మెంట్లో నగదు బెనిఫీషియరీ ఖాతాకు జమ అయిపోతుంది. లావాదేవీ చార్జీ రూ.2.50 నుంచి రూ.25 వరకు, అదనంగా సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతికూలతలు నగదు బదిలీ సత్వరమే జరగదు. సెలవుదినాల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. పనిదినం వరకు వేచి చూడాల్సిందే. యూఎస్ఎస్డీ 99# అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్డీ) సాధారణ మొబైల్ ఫోన్ల సాయంతో నగదు బదిలీలకు వీలు కల్పించే సులభ విధానమిది. మొబైల్ కీప్యాడ్‌పై ూ99# డయల్ చేసి నగదు బదిలీ, నగదు నిల్వల సమాచారం, మినీ స్టేట్మెంట్ వంటి సేవలు ఏడాది పొడవునా రోజులో ఎప్పుడైనా పొందొచ్చు. జీఎస్ఎం ఫోన్ ఉండి, మొబైల్ నంబర్‌ను బ్యాంకులో నమోదు చేసుకుని ఉంటే చాలు. అలాగే, బ్యాంకు జారీ చేసే ఏడంకెల ఎంఎంఐడీ కోడ్ కూడా అవసరం. నగదు అందుకోవాలనుకునే వ్యక్తి ఐఎఫ్ఎస్సీ కోడ్, ఖాతా నంబర్ తెలుసుకోవాలి. లేదా ఆధార్ నంబర్ ఉన్నా సరిపోతుంది. యూఎస్ఎస్డీ ఇలా... మొబైల్ నుంచి 99# డయల్ చేయాలి. తర్వాత వచ్చే వెల్కమ్ స్క్రీన్‌లో బ్యాంకు పేరులోని మొదటి మూడు అక్షరాలు లేదా బ్యాంకు శాఖ ఐఎఫ్ఎస్సీ నంబర్లోని మొదటి నాలుగు అంకెలు నమోదు చేయాలి. ఆ తర్వాత సేవల చిట్టా కనిపిస్తుంది. ఖాతాలో నగదు బ్యాలన్స్ తెలుసుకునేందుకు (1), మినీ స్టేట్మెంట్ (2), ఎంఎంఐడీ, మొబైల్ నంబర్ ద్వారా నగదు బదిలీకి (3), ఐఎఫ్ఎస్సీ, ఖాతా నంబర్‌తో నగదు బదిలీకి(4), బెనిఫీషియరీ ఆధార్ నంబర్ సాయంతో నగదు బదిలీకి(5), ఎంఎంఐడీ తెలుసుకునేందుకు(6) ఇలా ఆప్షన్ ఎంపిక చేసుకుని సంబంధిత సేవలను పొందవచ్చు. చార్జీలు ఒక లావాదేవీకి గరిష్టంగా రూ.1.50 పరిమితిని ట్రాయ్ విధించింది. ఆపరేటర్‌ను బట్టి ఇది కొంచెం మారొచ్చు. ఇతరత్రా ఎటువంటి చార్జీల్లేవు. రోమింగ్‌లో ఈ సేవను వాడుకున్నా అదనపు చార్జీలు ఉండవు. పరిమితులు నెట్వర్క్ సిగ్నల్ అందుబాటులో ఉండాలి. రోజుకు రూ.5వేలకు మించి పంపేందుకు అవకాశం లేదు. భీమ్ యాప్ నేషనల్పేమెంట్స్ కార్పొరేషన్ ఆవిష్కరించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ను ఆధారం చేసుకుని భీమ్(భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ)యాప్ పనిచేస్తుంది. డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు ప్రభుత్వం డీమోనిటైజేషన్ తరవాత దీన్ని తీసుకొచ్చింది. మొబైల్ వాలెట్ మాదిరిగా పనిచేస్తుంది కానీ, వ్యాలెట్ కాదు. నేరుగా బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. ఈ యాప్ సాయంతో రెండు బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీలు, దుకాణాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు. ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఎంఐడీ కోడ్, క్యూఆర్ మార్గాల్లోనూ నగదు చెల్లింపులు చేయవచ్చు. మీ కంటూ క్యూఆర్ కోడ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దుకాణంలో నగదు చెల్లించాలనుకున్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ చూపించినట్టయితే దాన్ని స్కాన్ చేసుకుంటారు. అనంతరం మీ ఖాతా నుంచి దుకాణదారుడి ఖాతాకు నగదు వెళ్లిపోతుంది. దాదాపు అన్ని బ్యాంకులు భీమ్ యాప్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాక ఫోన్ నంబర్ ఇవ్వడం ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రక్రియ ముగిశాక నాలుగంకెల పాస్ కోడ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖాతా కలిగిన బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. దాంతో యాప్ తనంతట తానే మొబైల్ నంబర్ ఆధారంగా ఖాతా వివరాలను సేకరిస్తుంది. అన్ని లావాదేవీలకు ప్రైమరీ ఖాతా ఏదన్నది పేర్కొనాలి. సెండ్, రిక్వెస్ట్, స్కాన్/పే అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవరికైనా నగదు పంపాలనుకుంటే వారి ఫోన్ నంబర్, నగదు మొత్తాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఎం–పిన్ ఇవ్వడం ఆలస్యం లావాదేవీ జరుగుతుంది. ఖాతాకు యూపీఐ యాక్టివేషన్ అయి ఉండకపోతే డెబిట్ కార్డు వివరాలను ఇవ్వడం ద్వారా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. యూపీఐ యాప్‌లో వర్చువల్ ఐడీ క్రియేట్ చేసుకుంటే అది ఇందులోనూ ఉపయోగపడుతుంది. చెల్లింపుదారుడికి యూపీఐ సదుపాయం లేకపోతే యాప్‌లో సెండ్ మనీ ఆప్షన్ పై భాగంలో మూడు డాట్లను ట్యాప్ చేస్తే అకౌంట్+ఐఎఫ్ఎస్సీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా నగదు పంపుకోవచ్చు. ప్రస్తుతానికైతే భీమ్ యాప్ ద్వారా చేసే లావాదేవీలపై చార్జీల్లేవు. అయితే, యూపీఐ, ఐఎంపీఎస్ లావాదేవీలపై బ్యాంకులు స్వల్ప చార్జీలు విధించొచ్చు. ప్రతికూలతలు ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఒక మొబైల్ నంబర్‌పై ఒక్క ఖాతా అనుసంధానానికే వీలుంది. ఒకవేళ మీ నంబర్ రెండు ఖాతాలకు అనుసంధానమై ఉంటే ఒకదాన్ని యాప్‌లో డిసేబుల్ చేసుకోవాలి. రోజులో రూ.20వేల వరకే గరిష్టంగా నగదు బదిలీకి వీలుంది. ఒక లావాదేవీ విలువ గరిష్ట పరిమితి రూ.10వేలు మాత్రమే. ఏది అనుకూలం...? స్మార్ట్‌ఫోన్ ఉన్న వారికి యూపీఐ యాప్ ద్వారా నగదు బదిలీ చాలా సులభం. రోజులో, సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా లావాదేవీ చేసుకోవచ్చు. దుకాణాల్లోనూ చెల్లింపులను నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లించొచ్చు. డెబిట్ కార్డులు అవసరం లేదు. చెల్లింపులకే మాత్రమే అనుకుంటే భీమ్ అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార సంస్థలైతే పెద్ద మొత్తాల్లో నగదు బదిలీలకు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ విధానాలు అనుకూలం. -
నగదు రహిత లావాదేవీలతో ఆర్థికాభివృద్ధి
– కలెక్టర్ కేవీ సత్యనారాయణ ముద్దనూరు: నగదు రహిత లావాదేవీలతో ఆర్థికాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు.సిండికేట్ బ్యాంకు దత్తత గ్రామమైన యామవరంను నగదు రహిత లావాదేవీల గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రసంగిస్తూ నోట్ల రద్దుతో ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుంచి కోలుకోవడానికి నగదు రహిత లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ లిటరసీలో శిక్షణ, రూపే కార్డుల వినియోగం,స్వైప్మిషన్ల ఏర్పాటు తదితర మార్గాలను అనుసరిస్తున్నామన్నారు. జిల్లాలో 3,89,000 జన్‌ధన్ ఖాతాలున్నాయని, రూపే కార్డులు మంజూరు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. యామవరం గ్రామాభివృద్ధిలో భాగంగా చెరువు మరమ్మతులు , శ్మశాన వాటికల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, సిమెంటు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తాని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దుతో అవినీతి తగ్గుతుందన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సిండికేట్ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఆర్డీవో వినాయకం, సిండికే ట్ బ్యాంకు జనరల్ మేనేజరు మోహన్‌రెడ్డి, డీజీఎం ఆశీర్వాదం, ఎఫ్జీఎంవో శర్మ, ఏజీఎంలు పాణిగ్రాహి, విశ్వనాథరెడ్డి, బ్రాంచి మేనేజరు ఓబులేసు, తహసీల్దారు రమ, ఎంపీడీవో మనోహర్‌రాజు, సర్పంచ్ లక్ష్మీకాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ లేకుండా USSD మొబైల్ బ్యాంకింగ్
-
ఇంటర్నెట్ లేకుండా యూఎస్ఎస్డీ మొబైల్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ ప్రకటనతో్ దేశం క్యాష్ లెస్ ఎకానమీవైపు పరుగులు పెడుతోంది. మరోవైపు కరెన్సీ కష్టాల నేపథ్యంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు డిజిటల్ వాలెట్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తూ, రోజువారి అవసరాలను తీర్చకుంటున్నారు. మరి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోని వారి పరిస్థితి ఏంటి? ఈ నేపపథ్యంలో ఇంటర్నెట్ లేకుండానే , మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందటం ఎలా అనేది ఒకసారి చూద్దాం. సాధారణ మొబైల్‌ఫోన్ యూజర్లకు కూడా యుఎస్ఎస్‌డిల (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డివైస్) ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు అందుబాటులో ఉంది. బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేతో పనిచేసే బేసిక్ ఫోన్లు మొదలుకుని టాప్ఎండ్ స్మార్ట్ఫోన్ల వరకు ఈయుఎస్ఎస్డి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులను సపోర్ట్ చేస్తాయి.నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్డి ప్లాట్‌ఫామ్‌చే అభివృద్థిచేయబడిన ఈ ఇంటర్ఫేస్, మిమ్మల్ని మీ టెలికం ఆపరేటర్ ద్వారా మీ బ్యాంకర్‌కు కనెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. జీఎస్ఎం నెట్ వర్క్ చానల్స్ ద్వారా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనికి గాను నిర్దేశించిన షార్ట్ కోడ్స్ ను మొబైల్ కీప్యాడ్ లో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగుకోసం *99*24# అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ కీప్యాడ్ షార్ట్ కోడ్స్: తమిళం కోసం (*99*23#), హిందీ కోసం (*99*22#), మరాఠీ కోసం (*99*28#), బెంగాలీ కోసం (*99*29#), పంజాబీ కోసం (*99*30#), కన్నడ కోసం (*99*26#), గుజరాతీ కోసం (*99*27#), మళయాళం కోసం (*99*25#), ఒరియా కోసం (*99*32#), అస్సామీస్ కోసం (*99*31#) ట్రాన్సాక్షన్ లిమిట్, చార్జీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, ఈ యూ ఎస్ఎస్ డీ చెల్లింపు విధానం ద్వారా ఒక్కో ట్రాన్సాక్షన్ లో రూ.1 నుంచి రూ.5,000 వరకు నగదును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి రూ.50 పైసలు ఛార్జ్ చేయబడుతుంది. ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ 24/7 అందుబాటులో ఉంటుంది. ఇవి మీ మొబైల్ బిల్లుకు జోడించబడతాయి. అయితే డిశెంబర్ 31 వరకు ఈ సేవలు ఉచితం. కీలకమైన ఎంఎంఐడీ నెంబర్ యుఎస్ఎస్డీ మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలో ప్రాథమికంగా మనకి ఒక మొబైల్ ఉండాలి. ఆ మొబైల్ నెంబరును మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్ నెంబర్, మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ కాని పక్షంలో వెంటనే మీ బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను ఫిల్ చేసి బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైన వెంటనే మీకో 7 అంకెల మొబైల్ మనీ ఐడెంటీఫైర్ (ఎంఎంఐడీ) నెంబర్ అందుతుంది. ఈ నెంబరును బ్యాంక్ వారు ఇష్యూ చేస్తారు. కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా, మరికొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ నెంబర్ ను కేటాయిస్తున్నాయి ఎంపిన్ నెంబర్ యూఎస్ఎస్ డీమొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలోఈ ఎంఎంఐడీ నెంబర్ కీలకం. దీంతోపాటుగా 4 డిజట్ల డీఫాల్ట్ ఎంపిన్ నెంబర్ బ్యాంకు ద్వారా మనకు అందుతుంది. మామూలు పిన్ నంబర్లలాగానే దీన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవాలి. అలాగే దీన్ని తక్షణమే దీన్ని మార్చుకోవాలి కూడా. సో... మొబైల్ బ్యాంకింగ్ సేవలకు మన మొబైల్ ఇపుడు రడీ. తెలుగులో సేవలకు *99*24# ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి తెలుగుకోసం *99*24#కు డయల్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే వెల్కమ్ స్ర్కీన్‌లో మూడు అక్షరాలతో కూడిన బ్యాంక్ షార్ట్ నేమ్ కాని, ఐఎఫ్ఎస్సీ కోడ్‌కు సంబంధించి మొదటి నాలుగు అక్షరాలు గాని, రెండు డిజిట్ల బ్యాంక్ న్యూమరిక్ కోడ్‌ను గాని ఎంటర్ చేసి 'సెండ్' బటన్ పై క్లిక్ చేయాలి.(ఉదాహరణకు ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఇండియాలో అకౌంట్ ఉన్నట్లయితే ఎస్ బీఐ అనీ, ఐఎఫ్ఎస్సీ కోడ్ క్రింద ఎస్ బీఐఎన్ అని టైప్ చేస్తే సరిపోతుంది.) అనంతరం మొబైల్ నెంబర్ , బ్యాంక్ అకౌంట్ వివరాలు వెరిఫై కాబడి ఓ ప్రత్యేకమైన సబ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటం, మినీ స్టేట్మెంట్ను చెక్ చేసుకోవటం, మనీ ట్రాన్స్ఫర్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు ఒకటి (1) ని, మినీ స్టేట్మెంట్ను పొందేందుకు 2 ను ఎంటర్ చేయాలి. అయితే నగదు ట్రాన్స్ ఫర్ కు మాత్రం ఎంఎంఐడీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. నగదు ట్రాన్స్ఫర్ చేసే విధానం స్టెప్ 1: నగదును పంపాల్సిన మొబైల్ నంబరు టైప్ చేయాలి. స్టెప్ 2: నగుదును పంపుతున్న వ్యక్తికి సంబంధించిన ఎంఎంఐడీ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ( నగదును స్వీకరించే వ్యక్తి కూడా ఈ నెంబర్ పొంది ఉండాలి. అది నగదు పంపుతున్న వ్యక్తికి కచ్చితంగా తెలిసి వుండాలి) స్టెప్ 3: ఇక ఇపుడు మనం పంపుతున్న నగదు వివరాలు జత చేయాలి. ఉదాహరణకు రూ.500 అయితే 500 టైప్ చేసి.. సెండ్ బటన్ ప్రెస్ చేయాలి. స్టెప్ 4: ఇక చివరిగా బ్యాంకు మనకు కేటాయించిన ఎంపీఐఎన్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, అకౌంట్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలు టైప్ చేయాలి. దీంతో టాన్సాక్షన్ పూర్తవుతుంది. ఈ మొత్త విధానం అర్థమయ్యి, అలవాటయ్యేంతరకు వరకు కొంత క్లిష్టమైన ప్రక్రియ. ఒకసారి ప్రాసెస్ మొదలుపెట్టిన వెంటనే వేగంగా స్పందించాలి. మొబైల్ లో వస్తున్నసూచనల ఆధారంగా సుమారు 10 సెకన్లలో స్పందించాలి. ఏ మాత్రం తాత్సారం చేసినా ఎక్స్టర్నల్ అప్లికేషన్ డౌన్ అనే ఎర్రర్ ప్రత్యక్షమై మొత్తం ప్రక్రియ క్యాన్సిల్ అవుతుంది. సో..బీ కేర్ ఫుల్...మరింత సౌలభ్యంకోసం వీడియోను గమనించగలరు. -
మోదీ మరో సరికొత్త సూచన
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోదీ అసలు నోట్లతో పనిలేకుండా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని ఉపయోగించుకుంటూ ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా దేశమంతా ముందుకెళ్లాలని ఆశిస్తున్నారు. ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ను అందిపుచ్చుకునే సమయం వచ్చిందంటూ ప్రధాని మోదీ సందేశమిచ్చారు. ఆదివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా యువతకు మంచి సమయం అని, ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వైపు యువత మళ్లితే బాగుంటుందని అన్నారు. డబ్బు అవసరం లేకుండా నేరుగా బ్యాంకింగ్ సహాయంతో అయితే అవినీతికి అవకాశం ఉండదని, లంఛాలు ఇచ్చే అవసరం ఉండదని, పారదర్శకతతో ప్రతి చర్య ఉంటుందని ఆయన భావిస్తున్నారు. -
సర్దుకునే చాన్సివ్వలేదని బాధ!
నోట్ల రద్దుకు గడువు ఇచ్చి ఉంటే పొగిడేవారు విపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజం ► ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు ► మొబైల్ బ్యాంకింగ్‌ను అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచన న్యూఢిల్లీ/బఠిండా: నోట్లరద్దుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ తొలిసారి నోరువిప్పారు. ఈ విషయాన్ని ముందుగానే చెప్పి, కాస్త సమయం ఇచ్చి పెద్దనోట్లను రద్దుచేసి ఉంటే.. విపక్షాలన్నీ తనను ప్రశంసించి ఉండేవన్నారు. ఢిల్లీలో జరిగిన ‘అప్డేటెడ్ ఎడిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మేకింగ్ ద కాన్స్టిట్యూషన్’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరగకుండా విపక్షాలు ఆందోళన చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘ప్రభుత్వం సరైన సన్నద్ధత లేకుండానే నోట్లరద్దు నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. అది అసలు విషయమే కాదు. వారు అన్నీ సర్దుకునేందుకు ప్రభుత్వం సరిపోయేంత సమయం ఇవ్వలేదని బాధపడుతున్నారు’ అని అన్నారు. విమర్శిస్తున్న వారందరికీ నోట్ల రద్దు చేసేముందు 72 గంటల సమయం ఇచ్చుంటే.. ఇవాళ తన నిర్ణయాన్ని ప్రశంసించి ఉండేవారన్నారు. దేశం నల్లధనం, అవినీతిపై చేస్తున్న పోరాటంలో ప్రతి సామాన్య భారతీయుడూ సైనికుడేనన్నారు. ప్రపంచ అవినీతి సూచీలో భారత్ పేరు ప్రముఖంగా కనిపించటం గర్వపడాల్సిన విషయం కాదన్నారు. దేశ హితానికి కొన్ని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు. నోట్లరద్దు నిర్ణయం వల్ల స్థానిక సంస్థలకు చాలా లాభం జరిగిందన్నారు. ‘దేశంలోని పలు నగరాల కార్పొరేషన్ల వివరాలందారుు. ఆ నగరాల్లో గతంలో 3-3.5 వేల కోట్ల పన్ను వసూలయ్యేది. కానీ ఈ పదిహేను రోజుల్లోనే రూ.13 వేల కోట్లు పన్ను రూపేణా వచ్చింది. ఈ నిధులు రోడ్లు, విద్యుత్ వంటి అభివృద్ధి పనులకు వాడొచ్చు’ అని పేర్కొన్నారు. నోట్లకు ‘మొబైల్’ పరిష్కారం పంజాబ్‌లోని బఠిండాలో ఎరుుమ్స్కు మోదీ శంకుస్థాపన చేశారు. రూ.925 కోట్లతో 750 పడకల ఎరుుమ్స్ ఆస్పత్రిని 177 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మోదీ పాల్గొన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. నిజారుుతీకి అండగా నిలుస్తున్నారన్నారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నోట్ల రద్దుతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారాల్లో మొబైల్ బ్యాంకు ఓ పరిష్కారమని తెలిపారు. నల్లధనం, అవినీతిని తరిమికొట్టే ప్రయత్నంలో మొబైల్ ఫోన్లనే బ్యాంకు బ్రాంచీలుగా మార్చుకోవాలన్నారు. ‘పేమెంట్ల కోసం బ్యాంకులకు వెళ్లకుండా మొబైల్ యాప్‌లనే వినియోగించాలి. సాంకేతికతను అందిపుచ్చుకోండి’ అని సూచించారు. నల్లధనం, అవినీతిని తరిమేస్తే.. పేదలకు వారి హక్కులు అందుతాయన్నారు. అనంతరం, ఆనంద్పూర్లోకి కేశ్‌గఢ్ సాహిబ్‌లో గురుగోవింద్ సింగ్ 350వ ప్రకాశ్ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. బీజేపీ పంజాబ్ ఇంన్చార్జ్గా పనిచేసినపుడు ఆనంద్ నగర్‌లోని కేశ్‌గఢ్ సాహిబ్‌ను తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్నారు. పంట వ్యర్థాలను కాల్చొద్దు.. పంజాబ్, హరియాణాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చటాన్ని ఆపేసేలా ప్రతిజ్ఞ చేయాలని మోదీ సూచించారు. దీని వల్ల తీవ్రస్థారుులో కాలుష్యం జరుగుతుందన్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నందున రైతులకు ఇలాంటి సూచనలు ఇస్తున్నారు. మోదీకి రాజకీయాలు తెలియవని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాకు ఎన్నికల ఫలితాలు ముఖ్యం కాదు. నా రైతు సోదర, సోదరీమణుల సంక్షేమమే ముఖ్యం. వ్యర్థాలను కాల్చటం ద్వారా కాలుష్యం పెరుగుతుంది. కానీ పంట వ్యర్థాల ద్వారా భూసారం పెరుగుతుందని కొత్త పరిశోధనలు చెబుతున్నారుు’ అని మోదీ తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో.. ‘బాబా సాహెబ్ అంటేనే రాజ్యాంగం, రాజ్యాంగం అంటేనే బాబాసాహెబ్’ అని మోదీ అన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని తమ హక్కులను తెలుసుకోవాలనుకుంటున్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రజల బాధ్యత చాలా ఎక్కువగా ఉండేది. రాను రానూ పరిస్థితులు మారటం వల్ల బాధ్యత అనేది.. హక్కుల కోసం పోరాడటంగా మాత్రమే మారింది. స్కూళ్లు, కాలేజీల్లో రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేయాలి’ అని అన్నారు. బాగా తెలివైన వారు రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని దుర్వినియోగం చేస్తున్నారని దీని వల్ల అరాచకం పెరిగిపోతోందన్నారు. పాక్‌ది స్వీయ దహనం భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులనుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదని.. భారత్‌తో పోరాడటం ద్వారా తనను తాను కాల్చుకుంటోందని మోదీ బఠిండాలో అన్నారు. ‘గతంలో భారత జవాన్లకు తమ సత్తాను చూపేందుకు అధికారాలిచ్చేవారు కాదు. కానీ సర్జికల్ దాడుల తర్వాత పాక్ మనోళ్ల ధైర్యసాహసాలను రుచిచూసింది’ అని అన్నారు. పాకిస్తానీలను ఉద్దేశించి ‘పెషావర్‌లో స్కూలు పిల్లలను చంపినపుడు 125 కోట్ల మంది భారతీయులు కన్నీళ్లు కార్చారు. మీరూ పేదరికంపై పోరాటం చేయాలంటున్నారు. కానీ మీ ప్రభుత్వం భారత్‌పై దాడి చేస్తోంది. ఈ దాడుల ద్వారా మిమ్మల్ని మీరు దహించుకోకండి. మీ ప్రభుత్వాన్ని అవినీతి, నల్లధనం నుంచి కాపాడమని అడగండి’ అని అన్నారు. సింధు, సట్లేజ్, బియాస్, రావి నదుల నీరు భారత్ హక్కు అని.. ఈ నీరు వ్యర్థంగా సముద్రంలో కలిసేబదులు ఇక్కడి రైతులకు ఉపయోగపడాలన్నారు. ‘చర్చల ద్వారానే నీటి సమస్యలు పరిష్కారం అవుతారుు. కేంద్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు నీటిని అలాగే వదిలేయటం ద్వారా భారత రైతులకు నష్టం జరిగింద’న్నారు. -
మొబైల్ బ్యాంకింగ్‌పై దృష్టి పెట్టండి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం ఒంగోలు టౌన్ : జిల్లాలో బ్యాంకు ఖాతాదారులంతా మొబైల్ బ్యాంకింగ్‌లో రిజిస్టర్ చేసుకుని ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే నగదు రహిత లావాదేవీలు జరిపేలా చూడాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. మిషన్ మోడ్‌లో మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేపట్టాలని సూచించారు. గురువారం సాయంత్రం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బ్యాంకర్లు, ఏపీఓలు, ఏపీఎంలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విసృ్తతంగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసిన కారణంగా చిన్ననోట్లు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడేలా వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ సౌకర్యంతో, ఈ పాస్ విధానం, ఏటీఎంల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు. మండల స్థారుులో ఎంపీడీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు మొబైల్ బ్యాంకింగ్ సేవలపై శిక్షణ ఇప్పించి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు, డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మొబైల్ బ్యాంకింగ్ వినియోగించే విధానం గురించి అవగాహన కలిగించాలని సూచించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు, ఉపాధి కూలీలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుందన్నారు. 30 నాటికి ప్రభుత్వ ఉద్యోగులంతా రిజిస్టర్ చేయాలి... జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ నెల 30వ తేదీ నాటికి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్నారు. ఇన్ యాక్టివ్‌లో ఉన్న ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని, బ్యాంకు ఖాతా నంబర్లకు ఆధార్ అనుసంధానం చేయాలని వివరించారు. జన్‌ధన్ ఖాతా కలిగిన లబ్ధిదారులకు రూపే కార్డు ఉండాలని, బ్యాంకులో పంపిణీ చేయకుండా మిగిలిపోరుున రూపే కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జారుుంట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలోని చౌకధరల దుకాణదారులంతా బ్యాంకు ఖాతాలు తెరవాలని తెలిపారు. వారంతా బిజినెస్ కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలతో సంబంధం కలిగిన వ్యాపార సంస్థలన్నీ ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సలో జారుుంట్ కలెక్టర్-2 ఐ.ప్రకాష్‌కుమార్, ఇన్చార్జి డీఆర్ఓ భక్తవత్సలరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉచితంగా షార్ట్ కోడ్ మెసేజ్‌లు
వచ్చే నెల 31 వరకూ ఇవ్వాలని ఆపరేటర్ల నిర్ణయం న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్, నగదు రహిత సేవల జోరు పెంచడానికి టెలికం కంపెనీలు షార్ట్ కోడ్ మెసేజ్‌లు ఉచితంగా ఇవ్వనున్నారుు. ఖాతాలో నగదు ఎంత ఉందో చెక్ చేసుకోవడం, విత్‌డ్రాయల్స్, డిపాజిట్లు, నగదు బదిలీలు వంటి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుల కోసం ఈ షార్ట్ కోడ్ మెసేజ్‌లను ఫీచర్ ఫోన్లలో వినియోగిస్తారు. బ్యాంకింగ్ సర్వీస్‌లకు ప్రధానంగా వినియోగించే ఈ షార్ట్ కోడ్ మెసేజ్‌లను వచ్చే నెల 31 వరకూ ఉచితంగా ఇవ్వాలని టెలికం సంస్థలు నిర్ణరుుంచారుు. ఈ షార్ట్ కోడ్ మెసేజ్‌ల చార్జీలను టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్ రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గించిన నేపథ్యంలో టెలికం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నారుు. నగదు కొరత పరిస్థితులను ఎదుర్కొనడానికి డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ప్రస్తుతం టెలికం కంపెనీలు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుల కోసం కొంత చార్జీ(యూఎస్ఎస్డీ చార్జీ)ను వసూలు చేస్తున్నాయని టెలికం మంత్రి మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. సగటు మనిషి ఇక్కట్లను తగ్గించడానికి, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యాలను వినియోగించుకోవడానికి వీలుగా టెలికం కంపెనీలు ఈ చార్జీలను రద్దు చేశాయని వివరించారు. ఫీచర్ ఫోన్లు ఉపయోగించే పలువురు ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని వచ్చే నెల 31 వరకూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. -
ఇకపై నగదు రహిత లావాదేవీలు
- బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు - పింఛన్లు సహా లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే - రాబోయే రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్‌కు మళ్లాలి సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీనికోసం విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, నరేగా సూపర్వైజర్లను వినియోగించుకోవాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలను పెంచేందుకు ఆర్బీఐకి, కేంద్రానికి ఐదు సూచనలతో లేఖ రాయనున్నట్లు తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ (ఎస్ఎల్బీసీ)తో సోమవారం సీఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ బ్యాంకు అధికారుల నుంచి వాస్తవ సమాచారం రావడం లేదన్నారు. ఆన్లైన్, కార్డులపై వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలను డిసెంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులే చార్జీలు తగ్గించాలన్నారు. ఫిజికల్ కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ వినియోగంపై చార్జీలు తక్కువ ఉండాలని, ఇందుకు అనుగుణంగా బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల నుంచి ఖాతాల్లోనే పెన్షన్లు వచ్చే నెల నుంచి వృద్ధాప్య, వింతతు పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందరికీ రూపే కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. త్వరలో రైతుబజార్లు, పెట్రోల్‌బంకులు, సినిమాహాళ్లు వంటి వాటిల్లో కూడా కార్డుల ద్వారానే లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మరింత నగదు వస్తుందన్న నమ్మకం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని సీఎం అన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌వైపు మళ్లండి రాబోయే రోజుల్లో ప్రజలు మొబైల్ బ్యాంకింగ్‌వైపు మొగ్గుచూపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై ఏపీ జెన్కో నెలకొల్పిన ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 వేల నోటు వల్ల ప్రయోజనం లేదన్నారు. వ్యవసాయంవల్ల ఎక్కువ ఆదాయం రాదని, అందువల్ల అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం దుకాణాల్లో స్వైప్ యంత్రాలు.. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లోనూ స్వైప్ యంత్రాలను అందుబాటులో ఉంచుతామని బాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు ఇబ్బందులు ఎదుర్కొనేందుకు క్యాష్, రూపీ, మొబైల్ బ్యాంకింగ్ వంటి మూడు విధానాలను అమలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ 10న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు పనులను ప్రారంభించనున్నామని చెప్పారు. కాగా, బ్యాంకుల పరిమితులు, ఏటీఎంలలో నగదు లేక జనం ఇబ్బంది పడుతుంటే.. పింఛన్లు సహా అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా నిర్వహిస్తామని సీఎం చెప్పడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
‘మొబైల్ బ్యాంకింగ్’పై ట్రాయ్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ బ్యాంకింగ్ వినియోగాన్ని పెంచే చర్యలపై ట్రాయ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా యూఎస్ఎస్డీ మెస్సేజీ ఆధారిత బ్యాకింగ్ సేవల టారిఫ్‌తోపాటు, ఈ చార్జీలను ఎవరు చెల్లించాలి...? కస్టమర్లా... లేక బ్యాంకులా? అన్న అంశాలపై ఆగస్ట్ 31లోపు ప్రజలు తమ అభిప్రాయం తెలియజేయాలని ట్రాయ్ కోరింది. దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన0్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు సేవలు అంతగా విస్తరించని ప్రాంతాల్లో యూఎస్ఎస్డీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవలకు మంచి ఆదరణ లభిస్తుందని ట్రాయ్ అంచనా వేస్తోంది. -
మొబైల్ బ్యాంకింగ్‌లోకి ఏపీ గ్రామీణ వీకాస్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఆవిష్కరించింది. నెఫ్ట్ విధానంలో ఖాతాదారులు ఇతర బ్యాంకు ఖాతాకు సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. ఖాతా బ్యాలెన్స్, అయిదు లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ సేవలను 2016 సెప్టెంబర్ నాటికి 2 లక్షల మంది కస్టమర్లకు చేరువ చేయాలని ఏపీజీవీబీ లక్ష్యంగా చేసుకుంది. అలాగే ఈ సంఖ్యను వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షలకు చేర్చాలని కృతనిశ్చయంతో ఉంది. శనివారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్బీఐ రూరల్ బిజినెస్ సీజీఎం కె.ఎం.త్రివేది, ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
గతవారం బిజినెస్
మొబైల్ బ్యాంకింగ్‌లో ఎస్బీఐ టాప్ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల మార్కెట్లో 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. గతేడాది డిసెంబర్‌కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం పరిమాణంపరంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో 38.44 శాతం, విలువ పరంగా సుమారు 36 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొంది. డిసెంబర్లో రూ. 17,636 కోట్ల విలువ చేసే 151.83 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఎస్బీఐ వివరించింది. డిసెంబర్ త్రైమాసికం క్యాడ్ 1.3 శాతం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రై మాసికంలో (అక్టోబర్- డిసెంబర్) 1.3 శాతంగా నమోదయ్యింది. 2014-15లో ఈ రేటు 1.5 శాతం. ఇటీవల నెలల్లో దిగుమతులు తగ్గి వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం) తక్కువగా నమోదవుతుండడం కరెంట్ అకౌంట్ లోటు తగ్గడానికి ప్రధాన కారణం. దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ మారక నిధులు, దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకపు నిధుల మధ్య నికర వ్యత్యాసమే (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) కరెంట్ అకౌంట్ లోటు. ఎలక్ట్రానిక్స్ తయారీలోకి రూ.లక్ష కోట్లు భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. 2014 వరకూ రూ.11,700 కోట్లుగా ఉన్న ఈ రంగంలో పెట్టుబడులు ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.28 లక్షల కోట్లకు పైగా పెరిగాయని తెలిపారు. వాల్‌మార్ట్‌ను దాటనున్న అలీబాబా ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న అమెరికా సంస్థ వాల్‌మార్ట్‌ను.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా త్వరలోనే అధిగమించగలదనే అంచనాలు నెలకొన్నాయి. మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 463.3 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ పరిమాణం సాధిస్తామని ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ తెలిపింది. జనవరి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాల్‌మార్ట్ నమోదు చేసిన 478.6 బిలియన్ డాలర్ల నికర అమ్మకాలకు ఇది దాదాపు సమీపంలో ఉండటం గమనార్హం. ప్రభుత్వ రుణ భారం రూ.55 లక్షల కోట్లు ప్రభుత్వ రుణ భారం డిసెం బర్ నాటికి రూ.55.26 లక్షల కోట్లకు చేరింది. త్రైమాసికంగా చూస్తే 3 శాతం పెరిగింది. రుణ నిర్వహణకు సంబంధించి ఆర్థిక శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటన ఈ వివరాలను తెలియజేసింది. మొత్తం రుణంలో అంతర్గత రుణ భారం వాటా త్రైమాసికంగా చూస్తే... 92 శాతం నుంచి 92.2 శాతానికి ఎగసింది. మహీంద్రా నుంచి ‘సబోరో’ పాలు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) గ్రూప్ తాజాగా డెయిరీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. గ్రూప్‌లో భాగమైన వ్యవసాయోత్పత్తుల విభాగం ‘సబోరో’ బ్రాండ్ కింద పాల ప్యాకెట్లను ఆవిష్కరించింది. ఇవి నాలుగు వేరియంట్లలో (క్రీమ్ రిచ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, ప్రొటీన్ రిచ్ మిల్క్) లభిస్తాయని ఎంఅండ్ఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఈ పాల విక్రయాలను ముందుగా ఇండోర్‌లో ప్రారంభిస్తున్నామని వివరించారు. మన కరెన్సీ నోటుకు మన కాగితమే మన కరెన్సీ నోటుకు అవసరమైన కాగితాన్ని ఇకపై మనమే తయారు చేసుకోనున్నాం. దీని వల్ల ప్రతి ఏడాది వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగలనుంది. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఎన్ఎంఎల్) మైసూరులోని మేటగళ్లి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో కరెన్సీ ప్రింటింగ్‌కు ఉపయోగించే కాగిత తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఏడాదికి 12వేల మెట్రిక్ టన్నుల కాగితం ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమ వల్ల ప్రతి ఏడాది రూ.1,280 కోట్ల విదేశీ మారక ం మిగులుతుందని బీఆర్బీఎన్ఎంఎల్ పేర్కొంది. ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయం! నష్టాల్లో కూరుకుపోయిన ప్రభు త్వ రంగ సంస్థ ఎయిరిండియాలో 49 శాతం దాకా వాటాలను విక్రయించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇందుకోసం నలుగురైదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా చిట్టచివరిసారిగా 2007లో లాభాలు చూసింది. ఇన్ఫీబీమ్ ఐపీఓకు 1.1 రెట్లు సబ్స్క్రిప్షన్ ఇన్ఫీబీమ్ ఇన్కార్పొరేషన్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 1.1 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. భారత్‌లో ఐపీఓకు వచ్చిన తొలి ఈ కామర్స్ కంపెనీ ఇది. ఈ ఐపీఓ ద్వారా రూ.450కోట్లు సమీకరించాలని ఇన్ఫీబీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓకు రూ.360-432 ను ధరల శ్రేణిగా కంపెనీ నిర్ణయించింది. 1.25 కోట్ల షేర్లకు గాను 1.37 కోట్ల షేర్ల బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల(క్విబ్)లకు కేటాయించిన వాటా 86 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. సంస్థాగేతర ఇన్వెస్టర్ల కేటగిరి వాటా 2.23 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆల్ టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు దేశంలో విదేశీ మారక నిల్వలు గరిష్ట స్థాయికి పెరిగాయి. ఈ నెల 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 2.53 బిలియన్ డాలర్లమేర పెరిగి 355.94 బిలియన్ డాలర్లకు ఎగశాయి. విదేశీ కరెన్సీ ఎసెట్స్ (ఎఫ్సీఏ) పెరుగుదల ఫారెక్స్ నిల్వల వృద్ధే ప్రధాన కారణమని ఆర్బీఐ తెలిపింది. పసిడి రూపంలోనే రీపేమెంటూ : టీటీడీ దీర్ఘకాలానికి తాము గోల్డ్ డిపాజిట్ పథకం కింద దీర్ఘకాలానికి తాము జమ చేసే పసిడిని బ్యాంకులు తిరిగి అదే రూపంలో ఇవ్వాలని, నగదు రూపంలో తమకొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంటోంది. ఇందుకోసం నిబంధనల్లో తగు మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. మధ్యకాలిక, దీర్ఘకాలిక బంగారం డిపాజిట్లపై అసలు, వడ్డీని పసిడి రూపంలోనే ఇచ్చేలా సంబంధిత స్కీములో సవరణలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి రాసినట్లు టీటీడీ ఈడీ డి. సాంబశివరావు తెలిపారు. మళ్లీ పెరగనున్న హోండా కార్ల ధరలు! హోండా కార్ ఇండియా కంపెనీ తన కార్ల ధరలను రూ.6,000 వరకూ పెంచాలని యోచిస్తోంది. ప్రతికూలమైన ఎక్స్ఛేంజ్ రేటు ప్రభావం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ధరలను పెంచాలని హోండా కార్ ఇండియా భావిస్తోంది. వచ్చే నెల నుంచి ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఏఏ మోడల్ ధరలను ఎంతెంత పెంచాలన్న విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఐపీఓ ప్రణాళికల్లో టాటా స్కై డీటీహెచ్ సర్వీసులు అందించే టాటా స్కై దాదాపు రూ. 2,000 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సన్నద్ధమవుతోంది. వచ్చే వారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు కంపెనీ ఇన్వెస్టర్లు, యాజమాన్యం తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం.టాటా స్కైలో టాటా సన్స్‌కు 51 శాతం, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కి చెందిన ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు 30 శాతం, సింగపూర్‌కి చెందిన టెమాసెక్‌కు 10%, టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌కు 9 శాతం వాటాలు ఉన్నాయి. డీల్స్.. ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌కు భారత్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఎడెల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.110 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. శ్రీలంకకు చెందిన బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో 60 శాతం వాటాను హీరో సైకిల్స్ కొనుగోలు చేసింది. దీంతో హీరో సైకిల్స్ కంపెనీ ఆరు నెలల్లో మూడు కంపెనీలను కొనుగోలు చేసినట్లయింది. దీనికి ముందు హీరో సైకిల్స్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన అవోసెట్ స్పోర్ట్స్, ఫైర్ఫాక్స్ బైక్స్ కంపెనీలను కొనుగోలు చేసింది. బయోటెక్నాలజీ వ్యాపార సంస్థ అయిన టెక్నికో ఆగ్రి సెన్సైస్ ఇండియా(టెక్నికో ఇండియా) కంపెనీని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కొనుగోలు చేసింది. టెక్నికో ఆగ్రి సెన్సైస్‌కు చెందిన పూర్తి ఈక్విటీ వాటాను ఆస్ట్రేలియాకు చెందిన టెక్నికో పీటీవై లిమిటెడ్ నుంచి రూ.121 కోట్లకు కొనుగోలు చేశామని బీఎస్ఈకి ఐటీసీ నివేదించింది. వాహన విడిభాగాల స్టార్టప్ ‘సెడెమ్యాక్ మెక్‌ట్రానిక్స్’లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని దాదాపు రూ.50 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. టాటా స్టీల్ కంపెనీ స్కాట్లాండ్లో ఉన్న రెండు ప్లాంట్లను ఆ దేశ ప్రభుత్వానికి విక్రయించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. క్లేడ్బ్రిడ్జి, డాల్జెల్ స్టీల్ ప్లాంట్లను స్కాట్లాండ్ ప్రభుత్వానికి విక్రయించడానికి ఒప్పందం కుదిరిందని టాటా స్టీల్ తెలిపింది. విండ్ ఎనర్జీ సర్వీస్ ప్రొవైడర్ ఐనాక్స్ విండ్ అనుబంధ కంపెనీ ఐనాక్స్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ తాజాగా ఏపీలోని కొండాపురంలో ఉన్న సరయూ విండ్ పవర్‌ను కొనుగోలు చేసింది. -
మొబైల్ బ్యాంకింగ్‌లో ఎస్బీఐ టాప్
ముంబై: మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల మార్కెట్లో 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. గతేడాది డిసెంబర్‌కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం పరిమాణంపరంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో 38.44 శాతం, విలువ పరంగా సుమారు 36 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొంది. డిసెంబర్లో రూ. 17,636 కోట్ల విలువ చేసే 151.83 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఎస్బీఐ వివరించింది. ఎస్బీఐతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో పోటీ సంస్థలైన ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ లావాదేవీలు పరిమాణంపరంగా 70 లక్షలకు, యాక్సిస్ బ్యాంక్ 60 లక్షలకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లావాదేవీలు 39 లక్షలకు పరిమితమయ్యాయి. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి 2015 ఏప్రిల్ నుంచీ తాము అగ్రస్థానంలో కొనసాగుతున్నామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. -
మొబైల్ బ్యాంకింగ్.. పోటాపోటీ!
అగ్రస్థానం కోసం ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వ్యూహాలు - ఈ ఏడాది ఎస్బీఐ 250 ఇన్ టచ్ లైట్ డిజిటల్ శాఖలు - కోటి మంది ఖాతాదారులపై ఐసీఐసీఐ బ్యాంక్ దృష్టి - స్మార్ట్ వాచీల్లోనూ అందుబాటులోకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకులో డబ్బులు వెయ్యాలంటే లైను. తియ్యాలంటే లైను. డీడీ తియ్యాలన్నా... ఇంకే సర్వీసు కోసమైనా లైను కట్టాల్సిందే. కాకపోతే ఇదంతా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి రాక ముందటి మాట. ఇపుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందరికీ అందుబాటులోకి రావటమే కాదు... కొత్త కొత్త అడుగులు వేస్తూ మొబైల్‌లోకి కూడా యాప్ రూపంలో దూరిపోయింది. అందరూ కాకపోయినా మెజారిటీ ఖాతాదారులిపుడు బ్యాంకింగ్ పనులన్నీ కంప్యూటర్, మొబైల్‌తోనే కానిచ్చేస్తున్నారు. ఆన్లైన్ కస్టమర్లు, లావాదేవీలు పెరుగుతుండటంతో ఇదిగో... ఇక్కడా పోటీ మొదలైంది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ డిజిటల్లో అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్‌లో ప్రస్తుతం ఎవరు టాప్ అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే లావాదేవీల సంఖ్య చూస్తే ఎస్బీఐదే అగ్రస్థానం. కానీ ఆ లావాదేవీల విలువను చూస్తే హెచ్‌డీఎఫ్‌సీయే టాపర్. అందుకే... లావాదేవీల విలువలోనూ మొదటి స్థానానికి చేరేందుకు ఎస్బీఐ, రెండింట్లోనూ నంబర్-1 కావటానికి ఐసీఐసీఐ పలు వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ఈ పోటీని తట్టుకొని ఎలాగైనా తొలి స్థానం కాపాడుకోవటానికి హెచ్డీఎఫ్సీ ఇటీవలే దేశంలోనే తొలిసారిగా ‘స్మార్ట్ వాచీ’ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టింది. ఇవికాక పేజాప్, చిల్లర్ వంటి యాప్స్‌తో పాటు కేవలం నిమిష్లాల్లోనే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను మంజూరు చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దీనికి పోటీగా ఐసీఐసీఐ బ్యాంక్ తన మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు మొబైల్ యాప్‌లో 55 లావాదేవీలను అందిస్తున్న ఐసీఐసీఐ ఇప్పుడు ఈ సంఖ్యను రెట్టింపు... అంటే 110కి చేర్చింది. దీంతో అత్యధికంగా 80 వరకు సేవలను అందిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను ఈ విషయంలో అధిగమించినట్లయింది. త్వరలోనే ఫోన్ ద్వారా సుమారు 200 లావాదేవీలను నిర్వహించుకునేలా తీర్చిదిద్దనున్నట్లు ఐసీఐసీఐ చెబుతోంది. వచ్చే 9 నెలల్లో మొబైల్ బ్యాంకింగ్‌లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను 50 లక్షల నుంచి కోటికి చేర్చడం ద్వారా ఈ రంగంలో టాప్కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఐసీఐ ఈడీ రాజీవ్ సబర్వాల్ చెప్పారు. రివార్డు పాయింట్లతో ఎస్బీఐ... ఎస్బీఐ కూడా డిజిటల్ బ్యాంకింగ్‌పై మరింత దృష్టిపెట్టింది. ఇంటర్నెట్, మొబైల్, కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై రివార్డు పాయింట్లను అందిస్తోంది. అంతేకాక ఇన్టచ్ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ శాఖలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదిలో కొత్తగా 250 డిజిటల్ బ్యాంకింగ్ శాఖలను ఏర్పాటు చేయాలనేది బ్యాంక్ లక్ష్యం. భారీగా పెరుగుతున్న లావాదేవీలు... స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. గతేడాదితో పోలిస్తే మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల సంఖ్య పలు రెట్లు పెరిగినట్లు ఆర్బీఐ తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో 10 లక్షలుగా ఉన్న లావాదేవీల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 1.9 కోట్లకు చేరింది. ఇందులో 78.48 లక్షల లావాదేవీలతో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉండగా, 17.46 లక్షల లావాదేవీలతో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. అదే విలువ పరంగా చూస్తే మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల పరిమాణం రూ.3,296 కోట్ల నుంచి రూ. 18,869 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆన్లైన్, కార్డులు సహా వివిధ డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగిన లావాదేవీల పరిమాణం రూ.6 లక్షల కోట్లుగా ఉంది. రెండేళ్లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను మొబైల్ బ్యాంకింగ్ అధిగమిస్తుందని హెచ్డీఎఫ్సీ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. మొబైల్స్ వాడేవారిలో 70% మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో మొబైల్ బ్యాంకింగ్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. -
మొబైల్ బ్యాంకింగ్‌లోకి యునినార్..
ఆగస్టుకల్లా సేవలు ప్రారంభం - 4జీ సర్వీసుల్లోకి వస్తున్నాం - సాక్షితో యునినార్ సీఈవో వివేక్ సూద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్ మొబైల్ బ్యాంకింగ్ సేవల్లోకి అడుగు పెడుతోంది. యునినార్ ప్రమోటర్ అయిన టెలినార్ ఇటీవలే ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్‌సీతో కలిసి పేమెంట్స్ బ్యాంకింగ్ లెసైన్స్ కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ నుంచి అనుమతులు, కంపెనీ పరంగా సాంకేతిక ఏర్పాట్లు ముగియడానికి నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని యునినార్ సీఈవో వివేక్ సూద్ తెలిపారు. యునినార్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆగస్టుకల్లా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టెలినార్ ఇతర దేశాల్లో అందిస్తున్న సేవలనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోసహా దేశంలో ఆరు సర్కిళ్లలో పరిచయం చేస్తామని వెల్లడించారు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ ఫోన్ నుంచే బిల్లులు చెల్లించొచ్చు. ఆన్లైన్లో వస్తువులను కొనుక్కోవచ్చు. దేశంలో ఎక్కడి నుంచైనా మొబైల్ ఫోన్‌కుగానీ, బ్యాంకు ఖాతాకుగానీ నగదు బదిలీ చేయవచ్చు. టెలినార్ అనుభవంతో: మొబైల్ బ్యాంకింగ్ రంగంలో టెలినార్‌కు అపార అనుభవం ఉందని వివేక్ సూద్ తెలిపారు. ‘సైబీరియాలో టెలినార్ ఒక బ్యాంకును నిర్వహిస్తోంది. హంగేరీలో మొబైల్ చెల్లింపులు, మలేసియా, థాయిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మొబైల్ బ్యాంకింగ్ సేవలందిస్తోంది. టెలినార్‌కు ఉన్న అనుభవం నేపథ్యంలో ఆర్బీఐ నుంచి లెసైన్స్ త్వరలోనే వస్తుందని విశ్వసిస్తున్నాం. ఈ సేవల కోసం భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. సబ్సే సస్తా పేరుతో తక్కువ ధరకే 2జీ సేవలను అందించడంతో సామాన్యులకు చేరువయ్యామన్నారు. కస్టమర్లలో అత్యధికులకు బ్యాంకు ఖాతాలు లేవని, ఉపాధికోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వారందరూ మొబైల్ బ్యాంకింగ్‌తో ప్రయోజనం పొందుతారని తెలిపారు. స్పెక్ట్రం వేలంలో: యునినార్‌కు ప్రస్తుతం ఉన్న స్పెక్ట్రం 4జీ సేవలు అందించేందుకు సరిపోదని, 4జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొంటామని సీఈవో చెప్పారు. ఆరు సర్కిళ్లలో ఈ సేవలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. విస్తరణకు ఈ ఏడాది రూ.500 కోట్ల దాకా వ్యయం చేస్తున్నట్టు తెలిపారు. యునినార్‌కు తెలుగు రాష్ల్రాల్లో 45 లక్షల మంది కస్టమర్లున్నారు. వీరిలో 29% మంది ఇంటర్నెట్ వాడుతున్నారని సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కన్నన్ తెలిపారు. ఆరు సర్కిళ్లలో 2014లో 5 వేల టవర్లు ఏర్పాటైతే, వీటిలో 624 టవర్లు ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కు కేటాయించారని వివరించారు. కాగా, భారత్‌లో యునినార్‌కు 4.2 కోట్ల మంది యూజర్లున్నారు. 2015లో ఈ సంఖ్య 5 కోట్ల కు చేరుకుంటుందని కంపెనీ విశ్వసిస్తోంది. కంపెనీ ఇప్పటి వరకు రూ.18,000 కోట్లు ఖర్చు చేసింది. -
స్మార్ట్ బ్యాం‘కింగ్’ ఎస్బీఐ..
మొబైల్ లావాదేవీల సంఖ్యలో ఫస్ట్ విలువలో మాత్రం హెచ్‌డీఎఫ్‌సీదే మొదటి స్థానం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్లతో పాటు మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలూ మంచి జోరుమీదున్నాయి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. జూన్‌తో పోలిస్తే అక్టోబర్ నాటికి హెచ్డీఎఫ్సీ లావాదేవీల్లో ఐదు రెట్ల వృద్ధి నమోదు కావడమే కాకుండా, ఐసీఐసీఐ బ్యాంక్‌ని తోసిరాజని మొదటి స్థానాన్ని ఆక్రమించింది. జూన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లావాదేవీలు రూ.795 కోట్లు కాగా అక్టోబర్ నాటికి రూ. 3,540 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,021 కోట్ల నుంచి రూ.1,416 కోట్ల మార్కును అందుకుంది. ఇంతకాలం లావాదేవీల సంఖ్యలో ఐసీఐసీఐ బ్యాంక్ మొదటి స్థానంలో ఉండేది. అక్టోబర్‌లో యాక్సిస్ బ్యాంక్‌లో రూ.1,036 కోట్ల విలువైన మొబైల్ లావాదేవీలు జరిగాయి. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్సిడ్, రికరింగ్ డిపాజిట్లు, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుకుని బీమా, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన 75 రకాల సేవలను అందిస్తున్నామని, ఈ సంఖ్యను త్వరలోనే 90కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ లావాదేవీల్లో 55 శాతం డిజిటల్ చానల్స్ ద్వారానే జరుగుతున్నాయి. వెనుకబడ్డ పీఎస్‌బీలు: మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు బాగా వెనుకబడి ఉన్నాయి. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప మిగిలిన పీఎస్బీల్లో చెప్పుకోదగ్గ లావాదేవీలు జరగడం లేదు. ఈ సమీక్షా కాలంలో ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు విలువ రూ.546 కోట్ల నుంచి రూ.877 కోట్లకు పెరిగింది. కానీ లావాదేవీల సంఖ్యలో మాత్రం ఎస్బీఐదే మొదటి స్థానం. గడిచిన 12 నెలల్లో లావాదేవీల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 46%వృద్ధితో 86 లక్షల నుంచి 1.25 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ద్వారా పరిమితమైన లావాదేవీలనే అందిస్తున్నామని, త్వరలోనే పేమెంట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం సగటు లావాదేవీ విలువ రూ.7,052గా ఉందని, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారామె. ప్రస్తుతం దేశంలో 90 కోట్ల మందికి మొబైల్ ఫోన్లుండగా అందులో 4 కోట్ల మందే మొబైల్ బ్యాంకింగ్‌ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 1.62 కోట్లమంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండగా, ఈ సంఖ్య 2020 నాటికి 6.25 కోట్లకు చేరుతుందని అంచనా. 2014లో మొబైల్ బ్యాంకింగ్ ఇలా... బ్యాంక్ పేరు జూన్ అక్టోబర్ హెచ్డీఎఫ్సీ 795 3,540 ఐసీఐసీఐ బ్యాంక్ 1,021 1,416 యాక్సిస్ బ్యాంక్ 586 1,036 ఎస్బీఐ 546 877 -
చోటా ఏటీఎంలు భలే!
వంగర: వంగర మండలంలోని భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) శాఖ ద్వారా రెండు మినీ ఏటీఎంలను గురువారం ప్రారంభించారు. వంగరలో తంగుడు వెంకటరమణ, ఎం.సీతారాంపురంలో పట్నాన గోపాలరావు వీటిని నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఏ బ్యాంకు ఖాతాదారుడైనా ఏటీఎం ఉంటే రోజూ రూ. వంద నుంచి రూ.వెయ్యి వరకు నగదు డ్రా చేసుకునే అవకాశముంది. ఇదో రకమైన మొబైల్ బ్యాంకింగ్ విశాఖపట్నానికి చెందిన పొర్లాస్ ఈ-కామర్స్ సంస్థ మినీ ఏటీఎంల ద్వారా మొబైల్ బ్యాంకింగ్‌ను నిర్వహిస్తోంది. నిర్వాహకులు రూ.3 వేలు చెల్లిస్తే ఒక స్వైపింగ్ మెషీన్‌ను మంజూరు చేస్తారు. దీన్ని నిర్వాహకుడు వినియోగించే సెల్‌ఫోన్‌కు అనుసంధానిస్తారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సెల్ఫోన్లో పొందుపరిచి స్వైపింగ్ మిషన్, సెల్‌ఫోన్ ఆధారంగా నగదు బదిలీ చేస్తారు. ఖాతాదారుడు విత్‌డ్రా చేసిన డబ్బును నిర్వాహకుడు చెల్లిస్తే.. తర్వాతి రోజు ఎస్బీఐ చెల్లించే కమీషన్‌తోపాటు విత్‌డ్రా చేసిన డబ్బును నిర్వాహకుని ఖాతాలోకి మళ్లిస్తారు. ఇలాంటి సదుపాయం కల్పించడంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భవిష్యత్ మొబైల్ బ్యాంకింగ్‌దే..
ప్రాంతీయ భాషల్లోనూ యాప్స్, సేవలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్ మరింత ప్రాచుర్యంలోకి వస్తుందంటున్నారు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నితిన్ చుగ్. ఇటీవల వారణాసిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ భాషల్లో కూడా యాప్స్, సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఆయన మాటల్లోనే మిగతా వివరాలు.. అరచేతిలో బ్యాంకు గురించి .. ప్రస్తుతం దేశీయంగా 90 కోట్ల పైచిలుకు మొబైల్ యూజర్లలో .. 4 కోట్ల మంది మాత్రమే మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా సర్వీసులను మరింత మందికి అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నాం. బ్యాంకు శాఖలో లభ్యమయ్యే సేవలన్నీ ఇరవై నాలుగ్గంటలూ ఖాతాదారుకి అందుబాటులో ఉండేలా చూడాలన్నది మా ఉద్దేశం. అందుకే, అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ ద్వారా ఏకంగా 75 రకాల లావాదేవీలను నిర్వహించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాం. ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుకుని బీమా, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ దాకా మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ లావాదేవీల సంఖ్యను వంద దాకా పెంచబోతున్నాం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ యాప్ ద్వారా స్టాక్స్‌లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ వీలునామా సర్వీసులు కూడా పొందవచ్చు. ఇలా ఫీచర్ ఫోన్లు మొదలుకుని.. స్మార్ట్‌ఫోన్స్ దాకా అన్ని రకాల హ్యాండ్‌సెట్స్‌లో పనిచేసేలా మా మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌ను తీర్చిదిద్దుతున్నాం. 55 శాతం మేర వినియోగం.. 1999లో నెట్‌బ్యాంకింగ్ సర్వీసులు, 2000లో మొబైల్ సర్వీసులు ప్రారంభించాం. 2001లో మా రిటైల్ ఖాతాదారుల్లో ఈ సర్వీసులను వినియోగించుకునే వారి సంఖ్య సుమారు 3 శాతమే ఉండేది. ప్రస్తుతం ఇది ఏకంగా 55 శాతానికి పెరిగింది. ఫీచర్ ఫోన్ల యూజర్లు, గ్రామీణ ప్రాంతాల వారి కోసం ఉచిత టోల్ ఫ్రీ సేవలు గతేడాది ప్రవేశపెట్టాం. ఇంగ్లిష్తో పాటు హిందీలోనూ ఎస్ఎంఎస్ సర్వీసులు, యాప్స్‌ను అందిస్తున్నాం. త్వరలో 6-7 ప్రాంతీయ భాషల్లోనూ వీటిని ప్రవేశపెట్టబోతున్నాం. ఏ టెక్నాలజీనైనా అందిపుచ్చుకోవడంలో దక్షిణాది వారు అందరికన్నా ముందుంటున్నారు. ఎంత వరకూ సురక్షితం.. మొబైల్ ద్వారా జరిపే బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. మా అధికారిక వెబ్‌సైట్‌నే ఉపయోగిస్తున్నారన్న భరోసా కల్పించేందుకు ప్రత్యేకమైన ఇమేజి, సెక్యూరిటీ మెసేజీ మొదలైనవి పొందుపర్చడం ఇందులో భాగమే. పైగా లావాదేవీలకు సంబంధించిన వివరాలు, పిన్ నంబరు మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాండ్‌సెట్‌లో స్టోర్ కావు. కాబట్టి ఫోను పోయినా, డేటాకి వచ్చే సమస్యేమీ ఉండదు. మొబైల్ బ్యాంకింగ్‌పైనా పరిమితులు.. బ్యాంకుల్లోనూ, ఏటీఎంలలోనూ జరిపే లావాదేవీలపై చార్జీలు, పరిమితులు వచ్చినట్లే.. మొబైల్ బ్యాంకింగ్ పైనా వస్తాయా అంటే అదంతా నియంత్రణ సంస్థ విధానాలపైనే ఆధారపడి ఉంటుంది. అది అనుమతిస్తేనే మేం చార్జీలు విధించేందుకు వీలుంటుంది. ప్రస్తుతానికి విధించవచ్చని, విధించకూడదనీ ఏమీ లేదు. కానీ అంతిమంగా ఖాతాదారుల ప్రయోజనాలను, సౌలభ్యాన్నీ దృష్టిలో ఉంచుకునే పనిచేస్తున్నాం. బ్యాంకు శాఖల విస్తరణ.. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు శాఖల విస్తరణను నిలిపివేయాలన్న యోచనేమీ లేదు. మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. అయితే, ఒకసారి ఖాతా తెరిచాక వారు బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరంగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించేందుకే ఈ డిజిటల్ సర్వీసులను ప్రోత్సహిస్తున్నాం. -
బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు
బ్యాంకింగ్ సేవల తీరుతెన్నులు గణనీయంగా మారిపోతున్నాయి. గతంలో డిపాజిట్ చేయాలన్నా, తీయాలన్నా ప్రతి దానికీ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏటీఎంలు వచ్చిన తర్వాత అది తగ్గింది. అలాగే ఇటీవలి కాలంలో మరికొన్ని మార్గాలూ అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులకు వెళ్లకుండానే సేవలను పొందే మార్గాల్లో కొన్ని ఇవి.. మిస్డ్ కాల్ సర్వీస్.. కొన్ని నగదు రహిత లావాదేవీల కోసం బ్యాంకులు ఈ టోల్ ఫ్రీ సర్వీసును అందిస్తున్నారు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, చెక్ బుక్ రిక్వెస్టులు, అకౌంటు స్టేట్మెంట్స్ మొదలైన వాటికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. కస్టమరు కోరిన సర్వీసుకు సంబంధించి ఫోనుకు అప్పటికప్పుడు ఎస్ఎంఎస్ అలర్ట్ రూపంలో సమాచారం వస్తుంది. బేసిక్ ఫోన్లతో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. దీన్ని ఉచితంగానే బ్యాంకులు అందిస్తున్నాయి. డెబిట్ కార్డుల వాడకం.. షాపింగ్‌కి బయలుదేరేటప్పుడు నగదును విత్‌డ్రా చేసుకోవడం, వెంట తీసుకెళ్లడం కాస్త రిస్కు కావొచ్చు. కాబట్టి సాధ్యమైన చోట్ల డెబిట్ కార్డులను ఉపయోగిస్తే నగదును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్లో కార్డ్ స్వైప్ చేసి పిన్ నంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది సురక్షితం, సౌకర్యవంతమైన సాధనం. పెపైచ్చు ప్రస్తుతం డెబిట్ కార్డు లావాదేవీలపై ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్..నెట్ బ్యాంకింగ్.. ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే వీలుంది. బిల్లులు కట్టాలన్నా, రుణాల ఈఎంఐలు చెల్లించాలన్నా, లేదా ఇతరులకు నగదు బదిలీ చేయాలన్నా ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్ వంటి సదుపాయాలను ఫోన్లు, నెట్ ద్వారా చేసే సదుపాయం ఉంది. నాలుగైదు రోజులకోసారి ఏటీఎంకు.. ఏటీఎం లావాదేవీలపై పరిమితులు విధించిన నేపథ్యంలో వీటి వాడకం కూడా భారంగా మారనుంది. కాబట్టి ప్రతిరోజూ ఏటీఎంలకు వెళ్లకుండా నాలుగైదు రోజులకోసారి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. ఈలోగా మరీ అత్యవసరమైతే తప్ప వెళ్లకండి. సాధ్యమైనంత వరకూ ఏటీఎంలను నగదు విత్‌డ్రాయల్స్‌కే ఉపయోగించండి. సొంత బ్యాంకు ఏటీఎంలలో 5 లావాదేవీలను ఉచితంగా ఇస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. మీ మొబైల్ ఫోనులో బ్యాంకు యాప్‌తో సమీపంలోని ఏటీఎం సమాచారం తెలుసుకోవచ్చు. -
మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎస్బీఐ టాప్
విలువపరంగా అగ్రస్థానంలో ఐసీఐసీఐ ముంబై: మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)దే అగ్రస్థానం. విలువ పరంగా చూస్తే ఐసీఐసీఐ మొదటి స్థానంలో ఉంది. భవిష్యత్తులో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జోరుగా ఉంటాయని నిపుణులంటున్నారు. జూన్‌లో జరిగిన మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఎస్బీఐ వాటా 50 శాతం మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటా 50 శాతం వరకూ ఉందని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. తమ మొత్తం రిటైల్ ఖాతాదారుల్లో 4.5 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్ యూజర్లున్నారని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి 1.15 కోట్ల మంది నమోదైన యూజర్లున్నారని వివరించారు. రెండేళ్లలో ఈ సంఖ్య 10-12 శాతానికి, ఐదేళ్లలో 30-35 శాతానికి పెరుగుతుందని అంచనాలున్నాయన్నారు. ఇటీవలనే మెస్సేజ్-బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభమయ్యాయని, ప్రజలకు ఇది పూర్తిగా అర్థమైన పక్షంలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో విప్లవం సంభవిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. జూన్‌లో జరిగిన మొత్తం మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో తమవే అధికమని భట్టాచార్య వివరించారు. రూ.1,000 కోట్లు దాటిన ఐసీఐసీఐ జూన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ మొత్తం రూ.1,000 కోట్లను దాటింది. ఒక నెలలో రూ.1,000 కోట్లకు పైబడిన మొబైల్ లావాదేవీలు నిర్వహించిన తొలి బ్యాంక్ తమదేనని ఐసీఐసీఐ పేర్కొంది. ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారుల్లో ఐదో వంతు మంది వినియోగదారులతోనే తాము ఈ ఘనతను సాధించామని వివరించింది. దాదాపు 20 లక్షల మంది ఐసీఐసీఐ యాక్టివ్ మొబైల్ యూజర్లున్నారని సమాచారం. -
బ్యాంకింగ్.. ‘సెల్’చల్!
దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం భారీగా పెరుగుతుండటంతో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు రెండు రెట్లు పెరగడం విశేషం. 2013-14 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ రూ. 3,190 కోట్లుగా ఉంటే అది ఈ ఏడాది రూ. 10,118 కోట్లు దాటింది. గతేడాది మొత్తం మీద జరిగిన లావాదేవీల విలువ రూ. 37,698 కోట్లు మాత్రమే. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన వృద్ధి కొనసాగితే ఈ ఏడాది టాప్ 10 బ్యాంకుల మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సమీక్షా కాలంలో లావాదేవీల సంఖ్యలో కూడా భారీ వృద్ధి నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో 63 లక్షల లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 1.11 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో సగటు లావాదేవీ విలువ రూ. 5,145 నుంచి రూ. 9,198కి పెరగడం విశేషం. ప్రైవేటు బ్యాంకులే టాప్ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకులే ముందున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్బీఐ తప్ప మిగిలిన వాటిల్లో నామమాత్రపు లావాదేవీలే జరుగుతున్నట్లు ఆర్బీఐ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. ఇక ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. జూలై నెలలో రూ. 1,000 కోట్ల లావాదేవీలను నమోదు చేయడం ద్వారా ఈ మార్కును అందుకొన్న తొలి బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ రికార్డులకు ఎక్కింది. గతేడాది మొత్తం మీద రూ. 5,741 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రూ. 2,635 కోట్ల లావాదేవీలను నమోదు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ చానల్స్ హెడ్ అబాంటీ బెనర్జీ తెలిపారు. గతేడాది మొదటి మూడు నెలల్లో రూ. 941 కోట్ల లావాదేవీలను ఐసీఐసీఐ బ్యాంక్ నమోదు చేసింది. ఈ ఏడాది మూడు నెలల కాలంలో హెచ్డీఎఫ్సీ రూ. 2,269 కోట్లు, యాక్సిస్ రూ.1,826 కోట్లు, ఎస్బీఐ రూ.1,535 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి. బిల్లు చెల్లింపులే అధికం... మొబైల్ బ్యాంక్ ద్వారా జరుగుతున్న లావాదేవీల్లో ప్రధానంగా యుటిలిటీ బిల్లులు, మొబైల్ ఫోన్ రీ-చార్జ్, ఆన్లైన్ టికెట్ బుకింగ్సే ప్రధానంగా నమోదవుతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకు ప్రతినిధి ఒకరు చెప్పారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో పాటు, ఖాళీ సమయంలో లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండటం కూడా లావాదేవీలు పెరగడానికి కారణంగా బెనర్జీ పేర్కొన్నారు. రానున్న కాలంలో మొబైల్ బ్యాంక్ లావాదేవీలు భారీగా పెరిగే అవకాశం ఉందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 15.5 కోట్ల మంది మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని, ఈ సంఖ్య 2017 నాటికి 48 కోట్లు దాటుతుందని గూగుల్ తాజా సర్వే వెల్లడించింది. -
మొబైల్ బ్యాంకింగ్ సురక్షితమే..
దేశీయంగా మొబైల్ ఫోన్ల వాడకం భారీగా పెరుగుతోంది. 2009-10 నాటితో పోలిస్తే కనెక్షన్ల సంఖ్య 50 శాతం పైచిలుకు పెరిగి ప్రస్తుతం 90 కోట్ల స్థాయిలో ఉంది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారి సంఖ్య 8.6 కోట్ల స్థాయిలో ఉంది. వివిధ రేట్లలో స్మార్ట్ఫోన్లు లభిస్తున్న నేపథ్యంలో ఇది వార్షిక ప్రాతిపదికన 200 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2015 నాటికి మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరుతుందని అంచనా. ఫలితంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ వల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాంకింగ్ సేవలను పొందడం సాధ్యపడుతోంది. దీని వల్ల బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరం అవ్వడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఉదాహరణకు .. సూపర్ మార్కెట్లోనో, షాపింగ్ మాల్స్‌లోనో ఏదైనా కొన్నారనుకోండి. చెల్లించడానికి మీ అకౌంట్లో తగినంత డబ్బు ఉందో లేదోనని సందేహం వస్తే.. లైన్లో నుంచునే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా డెబిట్ కార్డుతో కొనాలా క్రెడిట్ కార్డును ఉపయోగించాలా అన్నది నిర్ణయించుకోవచ్చు. అలాగే, కరెంటు, వాటరు మొదలైన బిల్లులను ఆఖరు రోజున కూడా అప్పటికప్పుడు, సురక్షితంగా కట్టేసేందుకు మొబైల్ బ్యాంకింగ్ తోడ్పడుతుంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఖాతాల మధ్య నగదును బదిలీ చేసుకోవచ్చు, డిపాజిట్ అయ్యిందా లేదా చూసుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మీకు బ్యాంకులో ఏయే సేవలు లభిస్తాయో.. దాదాపు వాటన్నింటినీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొందవచ్చు. ఈ లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు బ్యాంకులు మొబైల్ అప్లికేషన్స్ (యాప్స్)ని అందిస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్‌తో ప్రయోజనాలు.. ఇతర మార్గాలతో పోలిస్తే మొబైల్ బ్యాంకింగ్ అనేక ప్రయోజనాలు కల్పిస్తుండటంతో.. దీని వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇంకా పెరుగుతుంది. సౌకర్యం: ఖాతా వివరాలు ఎక్కడైనా, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. వ్యక్తిగతమైన సేవలు: మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఆయా కస్టమర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఆఫర్లు, పర్సనలైజ్డ్ మెనూ తదితర ఫీచర్స్‌తో సమగ్రమైన సేవలు అందించగలవు. సురక్షితం: మొబైల్ బ్యాంకింగ్ క్లయింట్ యాప్స్‌కి వెబ్ బ్రౌజర్లతో పనిలేదు. కాబట్టి ఫిషింగ్ స్కాములు ఇతరత్రా సమస్యలకు ఆస్కారం లేదు. పెపైచ్చు ఎంపిన్ (మొబైల్ పిన్ నంబర్), ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) ఫీచర్లతో లావాదేవీలు సురక్షితంగా జరుపుకోవచ్చు. ఇతర ఉపయోగాలు: మనకు దగ్గర్లో ఉండే ఏటీఎంలు, బ్యాంకు శాఖల వివరాలు.. సమీపంలో షాప్‌లు, మాల్స్ ఇస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్ల సమాచారాన్ని ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అందిస్తుంటాయి. మరింత సురక్షితంగా ఉండాలంటే.. పాస్వర్డ్ టైప్ చేస్తేనే హ్యాండ్సెట్ ఆన్ అయ్యేలా సెట్ చేసి ఉంచాలి. మీ పాస్వర్డ్, అకౌంటు నంబరు, పిన్ నంబరు, సీక్రెట్ ప్రశ్నలకు జవాబుల సమాచారాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండటమే కాకుండా హ్యాండ్‌సెట్‌లో భద్రపర్చొద్దు. ఫోన్ పోయిన పక్షంలో వెంటనే బ్యాంకుకు లేదా మొబైల్ ఆపరేటరుకు సమాచారం ఇవ్వాలి. ఫోన్ పోగొట్టుకున్నా, లేదా అది దొంగతనానికి గురైనా మొబైల్ ఆపరేటరు.. అది పనిచేయకుండా డిసేబుల్ చేయవచ్చు. అలాగే, దాన్నుంచి మీ ఖాతాలను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా బ్యాంకు కూడా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఫోన్లో మాల్వేర్ (వైరస్లు) చొరబడకుండా ముందే గుర్తించి, నివారించే సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఫోన్ పోయిన పక్షంలో .. ఎక్కణ్నుంచైనా లాక్ చేయడానికి, డేటాను డిలీట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్లు ఉపయోగపడతాయి. పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లో ఎప్పుడూ కూడా స్మార్ట్‌ఫోన్‌తో బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ లావాదేవీలు జరపకుండా ఉండటం మంచిది. అలాగే యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారాన్ని టైప్ చేయాల్సి వచ్చే అవసరమున్న లావాదేవీల జోలికి కూడా పోకుండా ఉంటే ఉత్తమం. మొబైల్లో బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్నప్పుడు.. అవి పూర్తి కాకుండా ఫోన్‌ను పక్కన పెట్టేసి వెళ్లిపోవద్దు. మొబైల్ బ్యాంకింగ్ క్రమంగా ఊపందుకుంటున్నా.. ఇప్పటికీ ఇంటర్నెట్ లేదా బ్యాంకుకు స్వయంగా వెళ్లడంతో పోలిస్తే ఇది సురక్షితమేనా అనే సందేహాలున్నాయి. వాస్తవమేమిటంటే.. ఇది కూడా సురక్షితమైనదే. పైగా లావాదేవీలు నిర్వహించాలంటే రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. కస్టమరు మొబైల్ నంబరుతో పాటు వారి మొబైల్ పిన్ నంబరు కూడా అవసరం అవుతుంది. కాబట్టి, ఫోన్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. లాగిన్ అయ్యి, ఆథరైజ్ చేసే దాకా ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్ యాప్‌లో ఇవ్వాల్సిన అవసరం లేనందున హ్యాకర్ల నుంచి సమస్యలు కూడా ఉండవు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టోల్-ఫ్రీ సేవలు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీసులో ఆరు ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను ఖాతాదారులు నిర్వహించుకోవచ్చని బ్యాంక్ హెడ్(డిజిటల్ బ్యాంకింగ్) నితిన్ చుగ్ చెప్పారు. మినీ స్టేట్మెంట్, బ్యా లెన్స్ ఎంక్వైరీ సమాచారాన్ని ఎస్ఎం ఎస్‌ల ద్వారా ఖాతాదారులకు అందిస్తామని చెప్పారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్, చెక్‌బుక్ రిక్వెస్ట్, అకౌంట్ స్టేట్మెంట్, ఈ మెయిల్ స్టేట్మెంట్ వంటి మరో 4 సర్వీసులను పొందవచ్చన్నారు. ఈ సర్వీస్ ఉచితమని, ఎలాంటి చార్జీలు లేవని చెప్పారు. బేసిక్ మొబైల్ హ్యాండ్సెట్ ద్వారానైనా ఈ సర్వీసును రాత్రీ, పగలు ఎప్పుడైనా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా లేదా సమీపంలోని బ్యాంక్ బ్రాం చీలో నమోదు చేసుకోవడం ద్వారా కానీ ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను పొందవచ్చని తెలిపారు. -
సైబర్ నేరగాళ్ల అరెస్టు
తాడిపత్రి, న్యూస్‌లైన్ : పట్టణంలో ఇటీవల మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎంల నుంచి నగదును తస్కరిస్తున్న సైబర్ నేరస్తులు మధుసూదన్‌రెడ్డి, శివకంచిరెడ్డి బుధవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40,150 నగదు, 4 సెల్ఫోన్లు, 8 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసు స్టేషన్లో తాడిపత్రి డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మినారాయణతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన నిందితులు ఇద్దరూ కంప్యూటర్ డిప్లొమో కోర్సు చేశారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో కొత్తగా వచ్చిన ఎయిర్టెల్ మనీ ట్రాన్స్ఫర్ సైట్‌ను ఉపయోగించడంతో పాటు నకిలీ సిమ్‌కార్డుల సహాయంతో ఇతరుల బ్యాంకు ఖాతాల్లోని నగదును ఇంటర్నెట్ ద్వారా వారి ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు. చోరీ చేసేది ఇలా.. ఈ బ్యాంకింగ్ వ్యవస్థపై పట్టు సాధించిన వీరు... ఓటర్ల ఐడీ నంబరు సేకరించి, ముందుగా వారి పేరున మీ సేవా కేంద్రాల్లో ఓటరు కార్డును సంపాదిస్తున్నారు. వాటి ద్వారా కొత్త సిమ్‌కార్డులు పొందుతున్నారు. అనంతరం బ్యాంకుల ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేస్తున్న వారి వెనుక వినియోగదారుల తరహాలో వీరిద్దరూ నిలుచుని, వారి కార్డు పిన్, కార్డు నెంబరు, ఖాతాదారుని పేరు వంటి వివరాలను అనుమానం రాకుండా సేకరించేవారు. తర్వాత ఎయిర్టెల్ మనీ ట్రాన్స్ఫర్ సైట్లో లాగిన్ అయి సేకరించిన వివరాలను నమోదు చేసి, వారి ఖాతాల్లో నిల్వ ఉన్న నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుని డ్రా చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలపై తాడిపత్రిలో 8 మంది బ్యాంకు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారులు నగదు డ్రా చేస్తున్న సమయంలో నిఘా పెంచామని, కొంతమంది అజ్ఞాత వ్యక్తులు వారిని గమనిస్తున్నట్లు తేలిందని డీఎస్పీ తెలిపారు. బాధితులున్న ప్రతిచోటా మధుసూదన్‌రెడ్డి, శివకంచిరెడ్డి ఉండటాన్ని పసిగ ట్టి దర్యాప్తు అధికారిగా పట్టణ సీఐ.లక్ష్మినారాయణను నియమించామన్నారు. ఈ క్రమంలో నిందితులు పట్టుబడ్డారన్నారు. వీరు పులివేందుల, అనంతపురము ప్రాంతాల్లో ఏటీఎం చోరీల్లో నిందితులని, గతంలో వీరిపై కేసులు కూడా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేసుకునే సమయంలో తమ వెనుక వైపు ఏవరూ లేకుండా జాగ్రత్త పడాలని, వివరాలను నమోదు చేసేటపుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఖాతాదారులను కోరారు. నిందితులను పట్టుకున్న సీఐని, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
కస్టమర్లకు ఎస్బిఐ మొబైల్ బ్యాంకింగ్ సేవలు