Moderate rainfall
-
20 వరకు వర్షాలే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు వడగాడ్పులకు విరామం లభించనుంది. ఇప్పటికే ఐదారు రోజుల నుంచి ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించడం లేదు. ఫలితంగా వడగాడ్పులు వీయడం లేదు. ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అప్పటివరకు వడగాడ్పులకు ఆస్కారం ఉండదని పేర్కొంటున్నారు. 20వ తేదీ తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయంటున్నారు. మరోవైపు దక్షిణ అంతర్భాగ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కేరళ నుంచి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ద్రోణితో విలీనమైంది. అదే సమయంలో రాష్ట్రంపై ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న ఐదు రోజులు (20వ తేదీ వరకు) కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో తెలిపింది. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కాగా.. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు గోగులదిన్నె (ప్రకాశం)లో 4.1, గవరవరం (ఏలూరు)లో 3.9, పైడిమెట్ల (తూర్పు గోదావరి)లో, ఫిరంగిపురం (గుంటూరు)లో 3.4 సెం.మీ. చొప్పున, జీకే వీధి (అల్లూరి సీతారామరాజు) 3, ఆత్మకూరు (నంద్యాల)లో 2.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు.. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సంభవించాయి. కాగా.. ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడింది. మరోవైపు పశ్చిమ విదర్భ వరకు విస్తరించిన ద్రోణి బుధవారం కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతూ ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో గురువారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రాయలసీమలో మాత్రం వేడితో కూడిన పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా బుధవారం అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజాం (అనకాపల్లి)లో 5.9 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. చొల్లంగి (కాకినాడ)లో 5.4, జగ్గంపేట (కాకినాడ)లో 5.2, కొత్తకోట (అనకాపల్లి)లో 4.7, కిర్లంపూడి (కాకినాడ) 3.5, రాజానగరం (తూర్పు గోదావరి) 3.4, పెదగంట్యాడలో (విశాఖ) 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
తీవ్ర తుపానుగా మిచాంగ్
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొన సాగుతున్న మిచాంగ్ తుపాను సోమవారం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా కొనసాగుతోంది. క్రమంగా బలపడుతూ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ.. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాని ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశా యని తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. పలుచోట్ల భారీ వర్షాలు మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు, గంటకు 30 నుండి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు లు వీస్తాయని తెలి పింది. ఇక బుధవారం రోజున పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ తాయని.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వివరించింది. ఉష్ణోగ్రతలు తగ్గే చాన్స్ సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా రామగుండంలో 33.1 డిగ్రీల గరిష్టఉష్ణోగ్రత.. అత్యల్పంగా మెదక్, ఆదిలాబాద్‌లలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంఉందని తెలిపింది. -
రాష్ట్రంలో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శనివారం తీవ్ర వాయగుండంగా మారింది. ఇది గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి నైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 440 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు–ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, నెల్లూరుకు దక్షిణ–ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, బాపట్లకు దక్షిణ–ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, మచిలీపట్ననికి ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతం వద్ద తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 4వ తేదీ తెల్లవారుజాము వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖతం వరకు చేరుకుంటుందని వివరించింది. ఆ తర్వాత, ఉత్తరం వైపు కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు సమాంతరంగా కదులుతూ డిసెంబర్ 5వ తేదీ ఉదయానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటు తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదు రు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరింతగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనూ రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తా యని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపు లతో కూడిన వానలు కూడా కురిసే అవకాశం ఉన్న ట్లు సూచించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీ సెల్సియస్ మేర గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత హన్మకొండలో 33.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడురోజులు పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యాయి. ప్రస్తుతం సాధారణస్థితిలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న మూడురోజులు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 32 డిగ్రీ సెల్సీయస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
15న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అది వాయుగుండంగా బలపడే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. మరోవైపు 14వ తేదీ నుంచి ఈశాన్య, తూర్పు గాలులు బలోపేతం కానున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంతలో 15న అల్పపీడనం ఏర్పడడం, ఈశాన్య, తూర్పు గాలులు తోడవడం వంటి కారణంతో వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే నెలకొంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. -
నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్ర సరిహద్దు నుంచి విదర్భ మీదుగా దక్షిణ, మధ్య మహారాష్ట్ర వరకు, జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల జల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రానికి తూర్పు, ఉత్తర జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని సూచించింది. -
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్రపై ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. ఈ అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల వైపు పయనిస్తూ బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. ప్రస్తుతం ఈ ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రెండురోజులు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సరుబుజ్జిలిలో 12 సెంటీమీటర్లు, చిలకలపల్లిలో 10.8, దేవరాపల్లిలో 8.7, డుంబ్రిగుడలో 4.3, పెందుర్తిలో 4, రేచర్లలో 3.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మళ్లీ అల్పపీడనంగానీ, ఉపరితల ఆవర్తనం/ద్రోణిగానీ ఏర్పడితే వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా మూడు రోజులపాటు నెమ్మదిగా పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో తెలిపింది. ఫలితంగా ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జనవరి మొదటి వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనాలు అరుదుగా ఏర్పడుతుంటాయి. అంతకుముందే ఈశాన్య రుతుపవనాలు కూడా నిష్క్రమిస్తాయి. దీంతో వర్షాలకు ఆస్కారం ఉండదు. కానీ, ప్రస్తుతం సముద్రంపై తేమ అధికంగా ఉండడం వల్ల ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడడానికి దోహదపడుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. క్షీణిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల నుంచి ఏజెన్సీ ఏరియాతోపాటు రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు (ఏఎస్సార్), శ్రీకాకుళం, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. అక్కడ 4 నుంచి 12 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రాష్ట్రంలో గురువారం వేకువజామున అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న రెండు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. -
తెలంగాణలో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీన పడి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే కనిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 17.0 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 31.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోపక్క చలి కాలం కావడం.. తుపాను ప్రభావంతో చలి తీవ్రత అధికంగా ఉండొచ్చని వాతావరణ నిపుణులకు చెప్తున్నారు. -
9న అల్పపీడనం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో 9న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమపై కొద్దిపాటి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అధికారుల అంచనా. శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం.. వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. 48 గంటల్లోనే బలహీనపడి పుదుచ్చేరి, చెన్నై మధ్య 11, 12 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం తమిళనాడు చెన్నై పైనే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఏపీలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కెల్లా కర్నూలులో అత్యధికంగా 33.8(+2.2) డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. -
రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/వాకాడు (తిరుపతి): కోస్తా, తమిళనాడు, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలోని నెల్లూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నెల్లూరుజిల్లా తోటపల్లి గూడూరులో 4.3, తిరుపతి జిల్లా కోటలో 3.6, అనంతపురం జిల్లా గుంతకల్లులో 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. తీరంలో రెడ్ అలర్ట్ రెండు రోజులుగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు సముద్ర తీరంలో వర్షాలతోపాటు చలి గాలులు, అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాలకు చెందిన రెవెన్యూ, పోలీసు, మెరైన్ అధికారులు ఇప్పటికే తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అలాగే లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు తమ వేట నిలిపేసి సామాగ్రిని ఒడ్డున భద్రపరిచారు. మెరైన్ పోలీసులు తీరంలో నిఘా ఉంచారు. -
మూడురోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుప వనాల ఉపసంహరణ పూర్తికాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కూడా రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న మూడురోజులు మెజార్టీ ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ పూర్తయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణస్థితిలోనే ఉంటాయని వివరించింది. -
రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు (ఆది, సోమ) పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రానికి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
మూడు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలు మంగళవారం నుంచి విస్తారంగా కురవనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరిలో 7.7 సెంటీమీటర్లు, ఎచ్చెర్లలో 7.6, మనుబోలులో 7.4, మారేడుమిల్లిలో 6.1, బాలాయపల్లిలో 5.8, విజయవాడ, గుడివాడల్లో 5.3, రావికమతంలో 4.6, పెదకూరపాడులో 4.6, మామిడికుదురు, బుక్కపట్నం, నూజివీడుల్లో 4.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. శనివారం నాటికి...
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారంనాటికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలకు చేరువలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి వెల్లడించింది. శుక్రవారం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. శనివారం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. పిడుగులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. -
Rain Alert: 9న అల్పపీడనం! రాష్ట్రంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల అనంతరం అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈనెల 8 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే వీలుందని వివరించింది. అదే సమయంలో గంటకు 45 – 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని ఐఎండీ తెలిపింది. -
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం (నేడు) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోతగా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అలాగే ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. కాగా 7న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. ఫలితంగా 7, 8 తేదీల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా, కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కాగా అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇది మూడో అల్పపీడనం.. నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభమయ్యాక ఇప్పటివరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. కానీ అవి అల్పపీడనాలకే పరిమితమయ్యాయి తప్ప వాయుగుండంగా బలపడలేదు. జూలై 9న వాయవ్య బంగాళాఖాతంలో, 16న అదే ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 7న ఏర్పడబోయే అల్పపీడనం మూడోది. -
బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి శుక్రవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి 360 కి.మీ., తమిళనాడులోని నాగపట్నంకు 700 కి..మీ., పుదుచ్చేరికి 760 కి.మీ., చెన్నైకు 840 కి..మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతోందని.. రాగల 48 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చిలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడిచిన 200 సంవత్సరాల కాలంలో కేవలం 11 సార్లు మాత్రమే ఈ తరహా వాతావరణం ఏర్పడిందని.. చివరిసారిగా 1994లో బంగాళాఖాతంలో స్వల్ప తుపాను వచ్చినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుత వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తక్కువగా ఉంటుందన్నారు. దీని ప్రభావంవల్ల దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 50–60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. ఈ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మత్స్యకారులెవ్వరూ 6వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. -
ఎడతెరిపిలేని వర్షాలతో వణుకు
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఆయా జిల్లాల్లోని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. ఆది, సోమవారాలు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాగులు, వంకలు, పొంగి ప్రవహించాయి. కైవల్యా, స్వర్ణముఖి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నై– కోల్‌కతా ఏషియన్ హైవేపై గూడూరు వద్ద నీరు పొంగి ప్రవహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను దారి మళ్లించారు. జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. ఎక్కడా ప్రాణనష్టం లేకుండా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు. కండలేరు డ్యామ్ కట్టకు ఎలాంటి ప్రమాదంలేదని అధికారులు తేల్చి చెప్పారు. నెల్లూరు నగరంలోని కస్తూర్బా స్కూల్ ఎదురుగా జీఎన్టీ రోడ్డులో వర్షపు నీరు ముసురుకున్న ‘చిత్తూరు’ ఎడతెరిపిలేని జల్లులతో చిత్తూరు జిల్లా ముసురేసింది. ఆదివారం రాత్రి తూర్పు మండలాల్లో భారీవర్షం కురవగా మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 30.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా తొట్టంబేడు మండలంలో 110.6 , బీఎన్ కండ్రిగలో 100.4 మిల్లీ మీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. తూర్పు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు, నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు కాజ్‌వేలు, చెక్ డ్యామ్‌లకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 2 వేల మందికి ఆశ్రయం కల్పించారు. 34,682 మందికి నిత్యావసరాలతో పాటు రూ.2 వేల చొప్పున ప్రభుత్వ సాయాన్ని అందించారు. పశువులకు పశుగ్రాసాన్ని తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు. తిరుపతిలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో రీచార్జ్ కావడంతో నిండ్ర మండలం కచ్చరవేడు గ్రామంలోని బోరుబావి కేసింగ్ పైపు 32 అడుగుల మేర పైకి వచ్చింది. మదనపల్లె మండలం వేంపల్లి వద్ద కొండమీదతండా చెరువుకు గండిపడింది. దీంతో అధికారులు మరమ్మతు పనులను చేపడుతున్నారు. ‘ప్రకాశం’లో పొంగుతున్న వాగులు ఇక ప్రకాశం జిల్లాలోనూ రెండ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాళ్లపాడు ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం చేరుతుండడంతో దిగువనున్న మన్నేరుకు సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. దీంతో మన్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొమరోలు మండలంలోని పులివాగు, గుడ్లూరు మండలంలోని ఉప్పుటేరు, ఎలికేరులు పొంగిపొర్లుతున్నాయి. దీనితో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ జిల్లాలోనూ.. వైఎస్సార్ జిల్లాలోని కాశినాయన మండలంలో సోమవారం 8.5 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, పోరుమామిళ్లలో 8 సెం.మీ. కురిసింది. బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు, బి.మఠం, బి.కోడూరు, కడప తదితర ప్రాంతాల్లో 5 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న దిగువ సగిలేరు ప్రాజెక్టు నుంచి దిగువన పెన్నాకు నీటిని విడుదల చేశారు. -
రెండ్రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో స్వల్ప అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలహీనపడి నెల్లూరు, తమిళనాడు వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 12న దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఈ నెల 13 నుంచి మొదలయ్యే సూచనలున్నాయని వెల్లడించారు. విజయవాడలో అత్యధిక వర్షపాతం 2021లో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా విజయవాడ రికార్డు సృష్టించింది. తర్వాత స్థానంలో కడప ఉండటం విశేషం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాల్ని పరిశీలిస్తే.. విజయవాడలో అత్యధికంగా 1,548 మి.మీ. వర్షపాతం నమోదైంది. కడపలో 1,342, విజయనగరంలో 1,331 మి.మీ. వర్షం కురిసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నగరాల జాబితాలో అట్టడుగున నెల్లూరు 440 మి.మీ. వర్షపాతంతో ఉండగా, కర్నూలులో 461, కావలిలో 552, ఒంగోలులో 698 మి.మీ. వర్షపాతం నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ ఏజెన్సీలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సూర్యోదయం అయ్యే వరకు చలి తీవ్రత నెలకొంది. అతిశీతల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన కాఫీ తోటల ఏరియాల్లో మాత్రం చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిశీతల ప్రాంతం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నెల 3న 17 డిగ్రీలు, 4వ తేదీన 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం ఉదయం 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం 14.4, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయంలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లా బి.నిడమానూరులో అత్యధికంగా 275 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. చింతవరంలో 57, వై.రామవరంలో 54.5, నూజివీడులో 32.5, పెదబయలులో 31.5 మి.మీ. నమోదైంది. (చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం) -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారే అవకాశం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరణ స్ధిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా రాగల 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం భారత ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ఈశాన్య రుతు పవనాల రాక ప్రారంభమైంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి రాష్ట్రం వైపు తేమ వస్తోంది. -
నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య గాలుల ప్రభావం, తేమ గాలులు వీస్తుండడం వల్ల నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా..రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణం క్రమంగా ప్రారంభమయ్యింది. ఈ నెల 23 నాటికి సగానికిపైగా ప్రాంతాల నుంచి, 26న పూర్తిగా నైరుతి ఉపసంహరణ ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో 26వ తేదీన ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. -
నెలాఖరున బంగాళాఖాతంలో అల్పపీడనం?
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రెండు రోజులపాటు భిన్న వాతావరణం ఏర్పడనుంది. రాజస్థాన్ నుంచి పొడి గాలులు వీస్తుండటం.. అదే సమయంలో సముద్రం నుంచి తేమ గాలులు రావడంతో బుధ, ఆదివారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పగలు ఎండలు, సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గాలిలో తేమ పెరుగుతూ పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోందని, వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో 28వ తేదీ తర్వాత నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు. గడచిన 24 గంటల్లో బొబ్బిలిలో 55.75 మి.మీ., పరవాడలో 49, లేమర్తిలో 46.25, నాగులుప్పాలపాడులో 44, ఆరిలోవలో 39.25, పరవాడ ఫార్మాసిటీ, మల్లంపేట, నర్సీపట్నంలో 39, దర్శిలో 36 మి.మీ. వర్షపాతం నమోదైంది.