Mukul Roy
-
టీఎంసీ నేత ముకుల్ రాయ్ పరిస్థితి విషమం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్(70) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్‌కతాలోని తన నివాసంలోని బాత్రూంలో ఈ నెల 4న ముకుల్ రాయ్ జారిపడ్డారు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. శనివారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఆ యన డిమెన్షియా(మతిమరుపు వ్యాధి)తో బాధపడుతున్నట్లు కుటుంబస భ్యులు తెలిపారు. ముకుల్ రాయ్ టీఎంసీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. -
హాస్పిటల్లో చేరిన టీఎంసీ సీనియర్ నేత
కోల్‌కతా: టీఎంసీ సీనియర్‌నేత ముకుల్ రాయ్ గురువారం ఆస్పత్రిలో చేరారు. తన నివాసంలోని బాత్రూంలో జారిపడి స్పృహ కోల్పోవటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల ముకుల్ స్పృహ కోల్పోయే ముందు వాంతులు చేసుకున్నారని కుటంబసభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన బాత్రూంలో జారిపడటంతో తలకు గాయం అయింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ పలు టెస్ట్‌ల రిపోర్టుల కోసం ఎదురు చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.టీఎంసీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్.. 2017లో బీజేపీలో చేరిన ఆయన 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ కృష్ణానగర్‌లో గెలుపొందారు.అనంతరం ఆయన మళ్లీ టీఎంసీలో చేరారు. -
మిస్ అయిన మాజీ రైల్వే మంత్రి.. హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై..
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్‌కి అత్యంత విచిత్రమైన పరిణామం ఎదురైంది. ఒక పక్క కుటుంబ సభ్యులు ఆయన కనిపించటం లేదని హైరానా పడుతుంటే అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ షాక్‌కి గురి చేశారు. ఈ మేరకు ఆయన హఠాత్తుగా ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కార్ట్‌తో సహా కనిపించాడు. ఎయిర్‌పోర్టులో ఆయన చుట్టూ రక్షణగా కొందరు వ్యక్తులు ఉండి తరలించడం కనిపించింది. ఈ దృశ్యాలను బట్టి 69 ఏళ్ల ముకుల్ రాయ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన సోమవారం ఢిల్లీ బయలుదేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కుటుంబంతో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ముకుల్ చుట్టూ చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఒక్కసారిగా ప్రత్యక్షమైన ఆయన్నుచూసిన మీడియా పలు ప్రశ్నలు సంధించగా..తాను ముఖ్యమైన పనిపై ఇక్కడకు వచ్చానని చెప్పారు. తాను ఎంపీనని తనకు ఢిల్లీలో పని ఉందని చెప్పారు. చికిత్స కోసం రాలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు ముకుల్ జాడ లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ మేరకు ఆయన కుమారుడు సుభ్రాగ్షు మాట్లాడుతూ..తన తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని, కొందరూ వ్యక్తులు ఆయన్ను తీసుకువెళ్లినట్లు తెలిపారు. అతని మానసిక స్థితి బాగోలేదని, కొన్ని పార్టీలు ముకుల్ రాయ్‌తో డర్టీ పాలిటిక్స్ ఆడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆయన్ను తీసుకువెళ్లిపోవడంతోనే తాను ఆయన్ని కనుగొనలేకపోయానని తెలిపారు. ముకుల్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలను కొట్టిపారేశారు. ఆయన ఇప్పుడూ బీజేపీలో ఉన్నా ఆయన మానసిక స్థితిలో ఎలాంటి మార్పు లేదని, అందువల్ల ముందు ఆయనకి చికిత్స అందించడమే ముఖ్యం అని చెప్పారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ 2017లో తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీతో విభేదాలు రావడంతో బీజేపీలో చేరారు. ఆయన్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించిది. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచి మళ్లీ కొద్ది రోజులకే సొంత గూటికే వెళ్లిపోయారు. ఆయన గతంలో యూపీఏ హయాంలలో రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. (చదవండి: ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!) -
కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్ రాయ్ ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు ముకుల్ రాయ్ మండిపడ్డారు. తాను పార్టీ మారడంపై సువేందు అధికారి కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్.. ఆ పార్టీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన తిరిగి టీఎంసీ గూటికి చేరారు. అయినప్పటికీ ఆయన బీజేపీ శాసనసభ్యుడిగానే కొనసాగుతున్నారు. Why only court? He can go wherever he wishes to go: TMC leader Mukul Roy on Leader of Opposition Suvendu Adhikari's statement that BJP will approach Calcutta High Court for enforcing anti-defection law in West Bengal pic.twitter.com/9AIxVrl9Bx— ANI (@ANI) July 16, 2021 ఈ నేపథ్యంలో ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై ప్రతిపక్ష నేత సువేందు అధికారి బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకు ఫిర్యాదు చేయగా, ఇవాళ ఐదు నిమిషాల పాటు విచారణ జరిపించారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు. సువేందు చేసిన ఈ ప్రకటనపై మండిపడిన ముకుల్ రాయ్.. కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ముకుల్ రాయ్ ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన కృష్ణానగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. -
ముకుల్ రాయ్‌కు జెడ్ కేటగిరి భద్రత తొలగింపు
కోల్‌కతా: టీఎంసీ నాయకుడు ముకుల్ రాయ్‌కు కేటాయించిన జెడ్ కేటగిరీ భద్రతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఉపసంహరించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముకుల్ రాయ్ భద్రత విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ ఉదయం నుంచి విధులకు హాజరు కాలేదు. నాలుగు రోజుల క్రితం ముకుల్ రాయ్ తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. టీఎంసీలో చేరిన ఒక రోజు తర్వాత ముకుల్ రాయ్ ఈ అభ్యర్థన చేశారు. Security of TMC leader Mukul Roy has been withdrawn by Ministry of Home Affairs (MHA), order has been issued: Govt Sources (File photo) pic.twitter.com/RcLInrbaLl — ANI (@ANI) June 17, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021 ముందు, రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలువురు బీజేపీ నాయకుల భద్రతను పెంచింది. మార్చి 2021 లో, బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ముకుల్ రాయ్ భద్రతను 'వై-ప్లస్' నుంచి 'జెడ్ కేటగిరీ'కి పెంచింది. ఈ క్రమంలో ఆయన తిరిగి టీఎంసీకి చేరడంతో, ముకుల్ రాయ్ తన జెడ్ సెక్యూరిటీ కేటగిరీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. చదవండి: సొంత గూటికి ముకుల్ రాయ్ -
సువేందును భయపెడుతున్న ఆ 24 మంది..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీకి షాకుల మీద షాకుల తగులుతున్నాయి. బీజేపీ తరఫున గెలిచిన ముకుల్ రాయ్ తృణమూల్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలో మరి కొందరు పయణించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరు తమతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి, గవర్నర్ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ సంఘటనతో మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి తిరుగుపయనం కానున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. సువేందు అధికారి సోమవారం సాయంత్రం గవర్నర్ జగ్దీప్ ధన్కర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనుచిత సంఘటనలు, వాటి పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. దాంతో వారంతా తిరిగి టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలకపోతున్నారు. సువేందు నాయకత్వాన్ని అంగీకరించడానికి వారు సుముఖంగా లేరు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ముకుల్ రాయ్ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు బీజేపీని వీడి తృణమూల్‌లో చేరతారని భావిస్తున్నారు. 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ టీఎంసీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి -
ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
కోల్‌కతా: ఇటీవలే అధికార తృణమూల్ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన ముకుల్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి (బీజేపీ) సోమవారం డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజీనామా చేయకపోతే ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నాలుగేళ్ల కిందట తృణమూల్‌ను వీడి... బీజేపీలో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ కమలం పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తన సీనియారిటీని పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవిని కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దాంతో కొద్దిరోజుల కిందట తృణమూల్ కాంగ్రెస్‌లోకి తిరిగివచ్చారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై ఉత్తర క్రిష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ‘ఉత్తర క్రిష్ణానగర్ ఎమ్మెల్యే ఇటీవలే పార్టీ మారారు. ఆయన 24 గంటల్లోగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే బుధవారం స్పీకర్‌కు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేస్తాం’ అని ముకుల్ రాయ్ పేరు ఎత్తకుండానే సువేందు అన్నారు. కాగా మరోవైపు సువేందు నేతృత్వంలో 50 మంది పైచిలుకు ఎమ్మెల్యేలు సోమవారం రాజ్‌భవన్‌లో బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, అరాచకం రాజ్యమేలుతోందని బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దాడులు జరగొచ్చనే భయంతో 17 వేల మంది బీజేపీ కార్యకర్తలు ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని సువేందు అన్నారు. చదవండి: సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా! చదవండి: Coronavirus: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత -
సొంత గూటికి ముకుల్ రాయ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. నాలుగేళ్ల క్రితమే బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ మళ్లీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ముకుల్ రాయ్ తన కుమారుడు సుభ్రంగ్షు రాయ్‌తో కలిసి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమైన తర్వాత తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. 2017లో టీఎంసీని వీడిన ముకుల్‌రాయ్.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బీజేపీ గురువారం నిర్వహించిన సమావేశానికి ముకుల్ రాయ్ హాజరు కాలేదు. ఇక ముకుల్ రాయ్ 2017 లో టిఎంసి నుంచి వైదొలిగిన తరువాత, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముకుల్ రాయ్ ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయన సతీమణి కూడా కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో అభిషేక్ బెనర్జీ ఆసుపత్రిలో వీరిద్దరిని కలిసి అండగా నిలిచారని సుభ్రాంగ్షు ఇటీవల మీడియాతో చెప్పారు. ముకుల్ రాయ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర్ (ఉత్తర) నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో రాజ్యసభ సభ్యునిగా, రైల్వే మంత్రిగా పని చేశారు. చదవండి:‘పెళ్లి కాలేదంటున్నావ్.. గర్భవతివి ఎలా అయ్యావ్?’ -
టీఎంసీలోకి ముకుల్ రాయ్.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత
కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నాయకుడు ముకుల్‌రాయ్ తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు. శుక్రవారం బీజేపీ శాసనసభ్యులు నిర్వహించిన కీలకమైన సమావేశానికి ముకుల్ రాయ్ హాజరుకాలేదు. దీంతో అతను తిరిగి టీఎంసీలో చేరవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారానికి తెరదించుతూ శనివారం ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. బీజేపీని వీడి తిరిగి తృణముల్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామన్ని పునరుద్ధరించేందుకు బీజేపీ సైనికుడిగా తన పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ‘మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు బీజేపీ సైనికుడిగా నా పోరాటం కొనసాగుతుంది. అందరూ తమ కల్పనలకు, ఊహాగానాలకు తెర దించాలని కోరుతున్నాను. నేను నా రాజకీయ మార్గంలో దృఢ నిశ్చయంతో ఉన్నాను’ అని ముకుల్ రాయ్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాలు గెలవగా.. కృష్ణా నగర్(ఉత్తర) నియోజకవర్గం నుంచి ముకుల్ రాయ్ గెలిచారు. కానీ శుక్రవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన హాజరు కాలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ప్రస్తుతం వీటికి తెరపడింది, 2017లో టీఎంసీ నుంచి ముకుల్ రాయ్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: నేనెప్పుడూ హింసకు మద్దతివ్వలేదు: మమతా బెనర్జీ వారి ముందు చూపు వల్లే ఈ రోజు దేశం మనుగడ: శివసేన -
ఎమ్మెల్యే హత్య.. వివాదంలో బీజేపీ కీలక నేత
కోల్కత్తా : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్య కేసులో బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీఐడీ దాఖలు చేసిన అభియోపత్రాల్లో అతని పేరును చేర్చింది. సత్యజిత్ హత్య కేసులో ముకుల్ పాత్ర ఉన్నట్లు ఆనుమానిస్తున్నామని, దీనిపై మరింత లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. ఇతనితో పాటు మరికొందరు బీజేపీ స్థానిక నేతల పేర్లుకూడా సీఐడీ నమోదు చేయడం బెంగాల్లో కలకలం రేపింది. ఈ విషయంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగుతోంది. టీఎంసీ ఎమ్మెల్యే హత్య కేసులో తనను తన పేరును ప్రస్తావించడాన్ని ముకుల్ తీవ్రంగా ఖండించారు. (హిందువులు చర్చికెళ్తే ఖబడ్దార్..) రాజకీయంగా కక్షసారింపులో భాగంగానే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు తనపై అక్రమంగా 41 కేసులు నమోదు చేశారని, తానేంటో బెంగాల్ ప్రజలకు తెలుసిన స్పష్టం చేశారు. టీఎంసీలో ఉన్న వరకు తనపై ఎలాంటి కేసులు లేవని, బీజేపీలో చేరిన అనంతరమే ఇన్ని కేసులు బనాయించారని మండిపడ్డారు. కాగా ఇదే కేసులో బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ పేరును కూడా సీఐడీ నమోదు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో సర్వసతి పూజ సందర్భంగా టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బీజేపీ నేతల హస్తం ఉందని మమత తొలినుంచీ ఆరోపిస్తున్నారు. (10 లక్షల లంచం: బీజేపీ కౌన్సిలర్ సస్పెండ్) -
అమిత్ షా పర్యటన.. టార్గెట్ బెంగాల్
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ రాజకీయం వేడెక్కుతుంది. త్వరలోనే అసెంభ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆలోగా పార్టీకి బలం చేకూర్చడాని ఇప్పటి నుంచే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెటింది. దీనిలో భాగంగానే పార్టీ ముఖ్య నేతలు బెంగాల్లో పర్యటిస్తున్నారు. 2021 ఏఫిల్-మే మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో పర్యటించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాస్తవాని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రావల్సి ఉండగా దాన్ని ఆపి మరీ అమిత్ షా పర్యటన ఖరారు చేశారు. లాక్ డౌన్ తర్వాత షా బెంగాల్ రావడం ఇదే తొలిసారి. చివరగా ఈ ఏడాది మార్చి 1న బెంగాలో పర్యటించారు. రాష్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని గవర్నర్ జగధీశ్ ధన్కర్ మమత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నఈ సమయంలో అమిత్ షా పర్యటించడం చర్చనీయాంశం అయింది. రాబోయే ఎన్నికలకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపి, గెలుపుకు వ్యూహ రచన చేస్తూ ఎన్నికలు వచ్చే లోగా పార్టీని సంసిద్ధం చేయాలని షా భావిస్తున్నారు. వివిధ ప్రాంతాలల్లో పర్యటించే సందర్భంలో షా కార్యకర్తల ఇంట్లో భోజనం చేస్తుంటారు. ఈ పర్యటనలో కూడా గురువారం గిరిజన బీజేపీ కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్‌లు షాతో పాటు పాల్గోన్నారు. బిభీషన్ ఇంట్లో నేలమీద కూర్చుని అరటి ఆకులో బెగాలీ సాంప్రదాయ శాఖాహార వంటకాలను హారగించారు. అమిత్ షా అన్నం, రోటీ, పప్పు,పొట్లకాయ వేపుడు, గసగసాలతో వండిన బంగాళదుంప, అప్పడాలతో భోజనం చేశారు. రసగుల్లా, మిష్తీ దోయ్ వంటి స్వీట్స ఉన్నప్పటికీ బీజేపీ నాయకులు వీటిని తినలేకపొయారు. భోజనం అనంతరం అమిత్ షా బిబీషన్ కుటుంబ సభ్యలతో, స్థానిక ప్రజతో కూలంకుశంగా చర్చించారు. అంతకు ముందు బిబీషన్ ఇంటికి చేరుకోడాకి అమిత్ షా బుడద దారి గుండా రావాల్సి వచ్చింది. షా కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. శంఖం ఉదుతూ, టపాకాయలు పేల్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా పచ్చిమ బెంగాల్ వచ్చారు. గురువారం ఉదయం పార్టీ స్థితిగతులు తెలుసుకోడానికి బంకురా చేరుకునన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సంస్థాగత సమావేశాలు నిర్వహించి, వివిధ వర్గాల, సామాజిక సమూహ ప్రతినిధులను కలుసుకోని మాట్లాడారు. కొన్ని దశాబ్ధాలు బెంగాల్లో ఎలాంటి గుర్తింపు లేని బీజేపీ, తృనమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 42 లోక్‌సభ సీట్లలో 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దశాబ్ధా కాలం నుంచి అధికారంలో ఉన్న మమత బెనర్జీని గద్దె దించాలని బీజేపీ వ్యూహ రచన చేస్తుంది. గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారు అధికంగా ఉన్న బంకురా , 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలం చేకూర్చిన అనేక జిల్లాల్లో ఒకటి. ఇక్కడి నుంచి రెండు లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. -
బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు
కోల్‌కతా: బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని పలువురు టీఎంసీ నేతలు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారని, ఆ పార్టీ విధానాలతో వారు విసుగుచెందారని శనివారం ఆయన విలేకరులకు తెలిపారు. పలువురు టీఎంసీ కౌన్సిలర్లు బీజేపీలోకి వచ్చి, వెంటనే తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ముకుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున బీజేపీలో చేరారు. -
బాంబ్ పేల్చిన సీనియర్ నేత..
కోల్‌కతా: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ ‘ఆపరేషన్ ఆకర్ష’కు పదునుపెట్టింది. ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మొదలుకొని సీనియర్ నేతలు, చిన్నాచితక నాయకుల్ని సైతం కమలం గూటికి రప్పించుకుంటోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలోకి జోరుగా వలసలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక, పక్కన ఉన్న కర్ణాటకలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. 15మంది రెబెల్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని.. రాజీనామా అస్త్రలతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు కమల దళం ఎసరు తెచ్చింది. అటు గోవాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలాన్ని విసిరి.. ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని తమలో విలీనంచేసుకొని.. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీజేపీ మంత్రి పదవులు ఇచ్చింది. ఇక, త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ ‘ఆపరేషన్ ఆకర్ష’ను ముమ్మరం చేసి.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిర పరచాలన్నది కమలనాథుల వ్యూహమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా లోటస్ పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష’ ఏ ఒక్క రాష్ట్రానికీ పరిమితం కావడం లేదు. బెంగాల్లోనూ ఇది ముమ్మరంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తోపాటు సీపీఎం ఎమ్మెల్యేలు పలువురు కమలం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత పెద్దసంఖ్యలో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు కూడా.. ఈ నేపథ్యంలో బీజేపీ బెంగాల్ సీనియర్ నేత ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో త్వరలో ఏకంగా 107 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారని బాంబ్ పేల్చారు. సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీకి చెందిన 107మంది ఎమ్మెల్యేలు కమలం కండువా కప్పుకోనున్నారని, ప్రస్తుతం వీరి జాబితా సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ఈ చేరికలు ఉంటాయని ముకుల్ రాయ్ శనివారం కోల్‌కతాలో మీడియాతో తెలిపారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో ఏకంగా 17 ఎంపీ స్థానాలు గెలుపొంది.. బీజేపీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కంచుకోటల్ని బద్దలుకొడుతూ.. గణనీయమైనరీతిలో బీజేపీ అక్కడ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరింత గట్టి సవాలు విసిరేందుకు పెద్ద ఎత్తున ఆ పార్టీ వలసల్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. -
జూడాల సమ్మెకు సోషల్ మీడియా ఆజ్యం!
సాక్షి, న్యూఢిల్లీ : అగ్నికి ఆజ్యం పోయడం అంటే ఇదే మరి! పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు గత నాలుగు రోజులుగా సమ్మె చేయడానికి కారణం ముస్లింలని, వారు దాడి చేయడం వల్ల నీల్ రతన్ సర్కార్ ఆస్పటల్ డాక్టర్ పరిబా ముఖోపాధ్యాయ్ కోమాలోకి వెళ్లారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. డాక్టర్ ముఖోపాధ్యాయ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా సేథ్ సుఖ్లాల్ కర్నాని మెమోరియల్ ఆస్పత్రిలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందక పలువురు రోగులు మరణిస్తున్నారు. నీల్ రతన్ సర్కార్ ఆస్పత్రిలో మంగళవారం నాడు ఓ 75 ఏళ్ల వృద్ధుడు మరణించడంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆయన మరణించారని ఆరోపిస్తూ ఆయన బంధువులు ఇద్దరు జూనియర్ డాక్టర్లు, అక్కడి సిబ్బందిపై దాడి చేశారు. ఒక రోజు ఆ ఆస్పత్రికే పరిమితమైన జూనియర్ డాక్టర్ల సమ్మె రాజకీయం వల్ల రాష్ట్రమంతటా వ్యాపించి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. సమస్యను పరిష్కరించడంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెన ర్జీ అనసరించిన వైశరే ఈ పరిస్థితికి కారణం. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇలాంటిదే మరి. ముస్లిం వర్గానికి చెందిన వారు దాడిచేశారంటూ రాష్ట్ర బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ వ్యాఖ్యానించడం ద్వారా ఈ అంశాన్ని మొదట రాజకీయం చేశారు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని, నాలుగు గంటల్లో సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానంటూ మమతా బెనర్జీ హెచ్చరించి డాక్టర్లను రెచ్చగొట్టారు. బీజేపీ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ముస్లింలకు, ఇతర రోగులకు చికిత్స చేయవద్దు, ఒక్క బీజేపీకి చెందిన రోగులకే వైద్యం చేయాలన్నది వారి అభిమతం అంటూ మమతా బెనర్జీ కూడా రాజకీయ రంగు పులుముతున్నారు. విధి నిర్వహణలో డాక్టర్లకు భద్రత కల్పించే విషయమై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా డాక్టర్లు సోమవారం నాడు సమ్మె చేయాలంటూ ‘ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ పిలుపునిచ్చే స్థాయికి పరిస్థితిని తీసుకెళ్లారు. -
‘మా పార్టీలో ఊపిరాడటంలేదు.. బీజేపీలో చేరతా’
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుభ్రాంగ్షు రాయ్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కొద్ది రోజులకే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాంగ్షు రాయ్.. గర ఎన్నికల్లో టీఎంసీ తరఫున బిజ్పూర్ నుంచి గెలుపొందాడు. కానీ కొన్ని రోజుల క్రితం పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో.. ఆరేళ్ల పాటు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు సుభ్రాంగ్షు రాయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీఎంసీలో చేరుతున్నప్పుడే మా నాన్న నన్ను జాగ్రత్తగా ఉండు. నీ మీద దాడి చేయవచ్చు.. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించవచ్చు అని హెచ్చరించారు. టీఎంసీలో ఉన్నన్ని రోజులు నాకు ఊపిరాడనట్లు అనిపించింది. పార్టీ నుంచి బయటకు వచ్చాక స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాను. త్వరలోనే కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను. రెండు మూడు రోజుల్లో బీజేపీలో చేరతాను. టీఎంసీలో చాలా మంది నాయకులు నాలానే భావిస్తున్నారు’ అని తెలిపారు. సుభ్రాంగ్షు రాయ్ బిజ్పూర్ నుంచి రెండు సార్లు టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. -
బెంగాల్లో చల్లారని మంటలు..!
కోల్కత్తా: ప్రచారం ముగిసినప్పటికీ బెంగాల్లో పలుచోట్ల హింస కొనసాగుతూనే ఉంది. అమిత్ షా ర్యాలీతో మొదలైన దాడులు ఇంకా ఆగలేదు. తాజాగా బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. గురువారం రాత్రి పదిగంటల సమయంలో స్థానిక నేతలతో సమావేశం నిమిత్తం డమ్‌డమ్ వెళ్లిన ముకుల్ రాయ్.. కారు అద్ధాలను పగలగొట్టారు. మరోఘటనలో బీజేపీ డమ్‌డమ్ ఎంపీ అభ్యర్థి సామిక్ భట్టాచార్యపై కూడా కొందరు వ్యక్తుల దాడికి పాల్పడ్డారు. 24 పరగనాల జిల్లాలోని నగీర్‌బజార్‌లో మొదట ఆయనపై దాడి చేసి అనంతరం కారును ధ్వసం చేశారు. ఈరెండు ఘటనలు టీఎంసీ కార్యకర్తలు చేశారని భట్టాచార్య ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేసిన ఘటన స్థానిక సీసీ కెమెరాలో రికార్డయిందని, దాడి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గురువారమే ప్రచారాన్ని ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్ జరగనుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో దానిని పశ్చిమ బెంగాల్లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
బెంగాల్లో ప్రచారానికి ఇమ్రాన్‌ఖాన్!
న్యూఢిల్లీ : బంగ్లాదేశీ నటులు ఫెర్దోస్ అహ్మద్, నూర్ ఘాజీలను రప్పించి.. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ తరఫున తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, ఒకప్పటి మమతా బెనర్జీ కుడిభుజం ముకుల్ రాయ్ ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో ప్రచారానికి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను పిలువాలని టీఎంసీ ప్లాన్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్‌ను బెంగాల్లో ప్రచారానికి టీఎంసీ ఆహ్వానించింది. ఈ విషయమై నాకు సమాచారముంది. అందుకే ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాను’ అని ముకుల్ రాయ్ సోమవారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ విషయం మీకు ఎలా తెలుసు అని మీడియా ప్రశ్నించగా.. ‘ఫెర్దోస్ అహ్మద్, నూర్ ఘాజీలను ప్రచారానికి పిలుస్తున్న విషయాన్ని ముందు ప్రకటించారా? అదేవిధంగా ఇది కూడా జరగనుందని మాకు వినిపిస్తోంది. అందుకే ఈసీని అలర్ట్ చేశాం’ అని ఆయన చెప్పుకొచ్చారు. -
ఎమ్మెల్యే హత్య: బీజేపీ నేతపై కేసు నమోదు
-
ఎమ్మెల్యే హత్య: బీజేపీ నేతపై కేసు నమోదు
కోల్కత్తా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్యకేసులో బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ముకుల్ రాయ్‌పై కేసు నమోదు అయినట్లు నదియా పోలీసులు తెలిపారు. కృష్ణగంజ్ శాసన సభ్యుడైన బిశ్వాస్‌ను శనివారం రాత్రి దుండుగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. బిశ్వాస్ హత్యపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వెనుక ముకుల్ హస్తం ఉందని ఆపార్టీ నేత శివశంకర్ ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతల ఫిర్యాదు మేరకు ముకుల్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇదివరకే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ముఖుల్ రాయ్ గత ఏడాదే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీకి విధేయుడిగా ఉన్న ముకుల్ ఆమెతో విభేదించి బీజేపీ గూటికి చేరారు. -
ముకుల్ రాయ్ బావమరిది అరెస్ట్
సాక్షి, కోల్‌కతా : రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన బీజేపీ నేత ముకుల్ రాయ్ బావమరిది సృజన్ రాయ్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆదివారం ఢిల్లీలో అరెస్ట్ చేశారు. సృజన్ రాయ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లా బిజ్పూర్ పీఎస్‌కు చెందిన పోలీసు బృందం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసింది. ఆరేళ్ల కింద బాధితులు ఇచ్ని ఫిర్యాదుపై ఆయనను అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మోసం, నేరపూరిత కుట్ర వంటి పలు సెక్షన్ల కింద రాయ్‌పై కేసునమోదైందని చెప్పారు. జిల్లా కోర్టులో నిందితుడిని హాజరుపరచగా, 12 రోజుల పోలీసు కస్టడీకి మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారని చెప్పారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, 2012లో కేంద్ర రైల్వే మంత్రిగా వ్యవహరించిన ముకుల్ రాయ్ దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తన బావమరిదిపై కేసులు నమోదు చేసినా పాలకులు తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. తనపై, తన కుటుంబ సభ్యులపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కత్తిగట్టినట్టు వ్యవహరిస్తూ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. బీజేపీ ఎదుగుదలతో భయపడుతున్నందకే మమతా బెనర్జీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.రాజకీయంగానే ఇలాంటి కుట్రలను ఎదుర్కొంటానని ముకుల్ రాయ్ పేర్కొన్నారు. -
బీజేపీలో చేరిన వెంటనే బంపరాఫర్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ మధ్యే తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన ముకుల్ రాయ్ బంపరాఫర్ కొట్టారు. బీజేపీలో చేరి ఇంకా 24 గంటలు గడవకముందే.. ఆయనకు కేంద్రప్రభుత్వం వై-ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది. ఇప్పటికే రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేసిన ముకుల్ రాయ్.. ప్రస్తుతం ఎటువంటి అధికారికి పదవుల్లో లేరు. యూపీఏ హయాంలో రైల్వేశాఖ మంత్రిగా పని చేసిన ముకుల్ రాయ్‌కి ఇప్పటివరకూ.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు వై-ప్లస్ సెక్యూరిటీని కేటాయించడంతో.. సీఆర్పీఎఫ్ ఆర్మీ కమాండోలు సెక్యూరిటీ విధులు నిర్వహించనున్నారు. ముకుల్ రాయ్‌కి ఉగ్రవాదులనుంచి ప్రాణహాని ఉందన్న నిఘా వర్గాల నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సీఆర్పీఎఫ్ ఆర్మ్డ్ కమాండోలు ప్రస్తుతం దేశంలోని 70 మంది వీఐపీలకు భద్రతను ఇస్తున్నాయి. ఎటువంటి అధికారిక పదవిలో లేని ముకుల్ రాయ్‌కి వై-ప్లస్ భద్రతను కల్పించడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు సైనిక బలగాలను అవమానించేలా ఉన్నాయని తృణమూల్ వ్యాఖ్యానించింది. -
ముకుల్ రాయ్ (బీజేపీ) రాయని డైరీ
పొమ్మనక ముందే వచ్చేయాలి. రమ్మనక ముందే వెళ్లిపోవాలి. అదే గౌరవం. గౌరవనీయులు మనల్ని గౌరవించేందుకు ఇబ్బంది పడుతున్నప్పుడు మన మెడలోని కండువా తీసి మడతపెట్టి ఇచ్చేసి, మనం వచ్చేయాలి. గౌరవాన్ని కోరుకున్న చోటనైనా, గౌరవాన్ని కండువాలా లాగేసుకుని మెడ చుట్టూ వేసుకో కూడదు. గౌరవాన్ని మెడ చుట్టూ వేసే అవకాశాన్ని గౌరవనీయులకు మనమే కల్పించాలి. ఇరవై ఏళ్లు కలిసి పని చేశాం నేను, మమతాజీ. జనవరి 1 వస్తే సరిగ్గా ఇరవై ఏళ్లవుతాయి తృణమూల్ పార్టీకి. మమతాజీ.. తట్టలో ఇటుకలు పేర్చి పెడితే, ఆ ఇటుకల తట్టను తలపై మోశాను నేను. ఇటుకలు మోసినప్పటి గౌరవం, ఇప్పుడు స్కాములు మోస్తున్నప్పుడు లేదు. ‘‘స్కాములు లేకపోతే ప్రజలకు స్కీములెలా పెడతాం మమతాజీ’’ అన్నాను. ఆమె మౌనంగా ఉండిపోయారు. సీబీఐ వాళ్లొచ్చి నా గురించి అడిగినా అదే మౌనం. నాపై ఎఫ్.ఐ.ఆర్. రాసినా అదే మౌనం! పొమ్మనకుండానే పార్టీ నుంచి బయటికి వచ్చేసి నన్ను నేను గౌరవించుకున్నానని బీజేపీ వాళ్లు అంటున్నారు కానీ, అది నన్ను నేను గౌరవించు కోవడం కాదు. మమతాజీని గౌరవించడం. ‘‘బీజేపీలో చేరాక కూడా మీరు మీ మమతాజీని ఇలాగే గౌరవిస్తూ ఉంటారా ఏంటీ?’’ అని అమిత్‌షా అడిగారు నన్ను, నేనింకా బీజేపీలో చేరకముందే! నాకు అర్థమైంది. నన్ను గౌరవించడానికి అమిత్‌షా త్వరపడుతున్నారని! ఎవరైనా తొందరపడుతున్న ప్పుడు మనం ఆలస్యం చెయ్యడం గౌరవం కాదు. వెంటనే ఢిల్లీ వెళ్లాను. బాగా చలిగా ఉంది. ‘‘కప్పుకోడానికి ఏమైనా ఉందా?’’ అని బీజేపీ ఆఫీస్‌లో అడిగాను. ‘‘తయారౌతోంది’’ అన్నారు! ‘‘ఏం తయారౌతోంది?’’ అన్నాను. ‘‘మీకోసం గొర్రె ఊలుతో స్పెషల్‌గా కండువా చేస్తున్నారు. మెడలో వేసుకుని చెవులు కప్పుకుంటే చాలు, చలిలో కూడా చెమటలు పోసేస్తాయి’’ అన్నారు! వార్మ్ వెల్కమ్ అన్నమాట! తెల్లారగానే.. లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జనరల్ సెక్రెటరీ కైలాష్ విజయ్‌వర్గీయ.. ఇద్దరూ కలిసి నా భుజాల చుట్టూ కండువా వేశారు. ‘‘అమిత్‌షా రాలేదా?’’ అని అడిగాను. ‘‘ఈ కండువా ఆయన పంపిందే’’ అన్నారు. ‘‘ఆయన ఎక్కడికి వెళ్లారు?’’ అని అడిగాను. ‘‘ఎవరికైనా, పార్టీలో చేరేముందు మాత్రమే అమిత్‌షా కనిపిస్తారు. చేరుతున్నప్పుడు, చేరిపోయాక కనిపించరు’’ అన్నారు. ‘‘మరి ఎవరికి కనిపిస్తారు?’’ అని అడిగాను. ‘‘బీజేపీ ఏ స్టేట్‌లో అయితే పవర్లో లేదో ఆ స్టేట్‌లో రూలింగ్ పార్టీల లీడర్లకు కనిపించే పనిలో ఉంటారు’’ అన్నారు స్వపన్‌దాస్ గుప్తా! సీనియర్ జర్నలిస్టు ఆయన. బీజేపీ వింతగా ఉంటుంది. పార్టీలో లేని స్వపన్‌దాస్ లాంటివాళ్లు పార్టీ లోపల కనిపిస్తుంటారు. పార్టీలో ఉన్న అమిత్‌షాలు పార్టీ బయట తిరుగుతుంటారు! వ్యాసకర్త ---- మాధవ్ శింగరాజు -
బీజేపీలోకి ముకుల్ రాయ్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు, ఆ పార్టీ విస్తరణలో కీలకంగా వ్యవహరించిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ చీఫ్ అమిత్ షా నేతృత్వంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమబెంగాల్ ప్రజలు మమతకు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నారని ఆయన బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై విమర్శలుచేశారు. బీజేపీ మద్దతు లేకుండా తృణమూల్ ఈ స్థాయిలో ఎదిగి ఉండేది కాదన్నారు. ‘బీజేపీ మతతత్వ పార్టీ కాదు. అసలు సిసలు లౌకిక పార్టీ. పశ్చిమబెంగాల్ ప్రజలు మమత పాలనతో సంతృప్తికరంగా లేరు. అందుకే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. త్వరలోనే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది’ అని రాయ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల నాయకత్వంలో పనిచేయటానికి గర్వపడుతున్నానన్నారు. సీపీఎం ప్రభుత్వ అత్యాచారాలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటాన్ని కూడా నడిపిన రాయ్.. పశ్చిమబెంగాల్లో తృణమూల్ ప్రభుత్వం ఏర్పాటు కావటంలో విశేష కృషిచేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశంసించారు. షరతులేమీ లేకుండానే బీజేపీలో చేరేందుకు రాయ్ ముందుకొచ్చారని పేర్కొన్నారు. -
బీజేపీ గూటికి ముకుల్ రాయ్
-
బీజేపీ గూటికి ముకుల్ రాయ్
సాక్షి,న్యూఢిల్లీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తృణమూల్ మాజీ ఎంపీ ముకుల్ రాయ్ శుక్రవారం బీజేపీలో చేరారు. ముకుల్ రాయ్ బీజేపీలో చేరారని, ఆయన చేరికను తాము సాదరంగా స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ముకుల్ రాయ్ అక్టోబర్ 11న రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ నుంచి వైదొలగిన వెంటనే ముకుల్ రాయ్ బెంగాల్ బీజేపీ ఇన్ఛార్జ్ కైలాష్ విజయ్‌వర్గియ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో భేటీ కావడంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. అంతకుముందు సెప్టెంబర్ 25న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ముకుల్ రాయ్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. శారదా స్కామ్‌లో రాయ్ పాత్రపై ఆరోపణల నేపథ్యంలో రాయ్‌ను 2015లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తృణమూల్ తొలగించింది.