MV Soundara Rajan
-
వైఎస్సార్ గుర్తుకు వచ్చారు
-
ఆయన్ని చూస్తుంటే వైఎస్సార్ గుర్తుకు వచ్చారు
సాక్షి, హైదరాబాద్ : బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రవర్తన అచ్చం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పోలి ఉందని చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ అన్నారు. సీఎం జగన్‌ను చూస్తుంటే ఆయన తండ్రి వైఎస్సార్ గుర్తుకు వచ్చారని చెప్పారు. ( సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు) ఈ మేరకు గురువారం ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘‘ వైఎస్సార్ ఇవాళ లేరే అని అనుకున్నాను.. కానీ, ఆయన పోలేదు. ఆయన ఉన్నారనేది ఇప్పుడు వైఎస్ జగన్ రూపంలో ప్రపంచమంతా చూసింది. ప్రపంచవ్యాప్తంగా మీకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం కూడా మీరు తిరుమలలో ఉంటున్నందుకు చాలా సంతోషం. ధార్మిక పరిషత్ అమల్లోకి రావాలి. అందుకు మీ సహకారం అవసరం’’ అని సౌందరరాజన్ పేర్కొన్నారు. -
పొన్నాలకు వ్యతిరేకంగా అర్చకుల సర్పయాగం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వ్యతిరేకంగా బుధవారం ఆ ప్రాంత అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో పాశుపత సహిత మూల మంత్రయుక్త మహా సర్పయాగం నిర్వహించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీ సౌందరరాజన్, కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అర్చక సమస్యలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా ఈ యాగాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. 2007లో సవరించిన చట్టాన్ని అమలు పర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు కొత్త వాగ్దానాలతో తెలంగాణ ప్రాంతంలోని 11,220 దేవాలయాల అర్చక ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వరంగల్ జిల్లా హన్మకొండ పశ్చిమ నియోజవర్గంలో 1952 నుండి బ్రాహ్మణులకు స్థానం ఉండేదని, గత శాసనసభ ఎన్నికల్లో కొండపల్లి దయాసాగర్ బ్రాహ్మణ అభ్యర్థిని ఓడించిన వారికి ఇప్పుడు టికెట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు తమ మేనిఫెస్టోలలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాయని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి తగిన బుద్ది చెప్పేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు.