Nell ore
-
AP: నెల్లూరులో టీడీపీకి షాక్.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు
సాక్షి,నెల్లూరు: మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ముత్తుకూరు మండల కేంద్రంలో 200 మంది యువకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. యువకులందరికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రెండు నెలల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కనుమరుగై పోతాడని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు శుభం కార్డ్ అయితే సోమిరెడ్డికి ఎండ్ కార్డు పడుతుందని కాకాణి అన్నారు. ఇదీచదవండి.. ఓం ప్రథమం.. ఎదురైంది దుశ్శకునం -
ఎల్లో మీడియాపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
-
నెల్లూరు: సర్వేపల్లి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కాకాని
-
గన్ షాట్ : ప్రాణం ఖరీదు
-
నెల్లూరు: కోవూరులో చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్
-
కందుకూరు సంఘటన దురదృష్టకరం : నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
-
చంద్రబాబుకు మైండ్ చెడిపోయింది: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
-
మూడు రాజధానులకు మద్దతుగా నెల్లూరులో విద్యార్థుల భారీ ర్యాలీ
-
మహిళా కాలేజీకి మంచిరోజులు..
-
నాన్న తిరిగొచ్చాడు..! నెల్లూరు చిన్నారుల ఆనందం..
సాక్షి, అమరావతి బ్యూరో: మద్యం మత్తులో విజయవాడ రైల్వేస్టేషన్లో పిల్లలను వదిలివెళ్లిన తండ్రి తిరిగి వారి చెంతకు చేరాడు. తండ్రిని చూసిన ఆ చిన్నారులు నాన్నా! అంటూ ఆనందంతో ఉప్పొంగారు. పిల్లలను చూడగానే తండ్రి, నాన్నను చూసిన ఆనందంలో పిల్లలు ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్లకు చెందిన తాపీ మేస్త్రి చప్పిడి ప్రసాద్ విజయవాడ రామవరప్పాడులో కొన్నాళ్లుగా తన ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. ప్రసాద్ భార్య ఇదివరకే అతడిని వదలి వెళ్లిపోయింది. నాలుగు రోజుల క్రితం సొంతూరు వెళ్దామంటూ ప్రసాద్ పిల్లలతో కలిసి బెజవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. పిల్లలను అక్కడే వదిలి ఎటో వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా రైల్వేస్టేషన్లోనే ఏడుస్తూ ఎదురు చూసిన పిల్లలను చైల్డ్‌లైన్ ప్రతినిధులు చేరదీసి ఆశ్రయం కల్పించారు. తండ్రి కోసం ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో శనివారం ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. ఇంతలో తండ్రి ప్రసాద్ తాను పనిచేసే నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధిని వెంటబెట్టుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన బిడ్డల గురించి వాకబు చేశాడు. జీఆర్పీ సిబ్బంది సూచనలతో చైల్డ్‌లైన్ ప్రతినిధుల వద్దకు వెళ్లాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణలో ఉన్న పిల్లల వద్దకు ప్రసాద్‌ను తీసుకెళ్లారు. అక్కడ తండ్రిని చూడగానే పిల్లలు ఒక్కసారిగా నాన్నా.. అంటూ భోరుమన్నారు. ప్రసాద్ పరుగున వారి వద్దకు వెళ్లి గట్టిగా హత్తుకుని రోదించారు. తండ్రి కూడా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారూ కన్నీరొలికారు. తండ్రికి తాత్కాలికంగా అప్పగింత.. సీడబ్ల్యూసీ ప్రతినిధులు విజయవాడలో ప్రసాద్ ఉంటున్న పరిసరాల్లో విచారణకు సామాజిక కార్యకర్తను పంపారు. అక్కడ ప్రసాద్ వ్యవహారశైలి, తదితర అంశాలను తెలుసుకుని మంగళవారం సోషల్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు సమర్పిస్తారు. అప్పటి వరకు నిర్మాణ సంస్థ ప్రతినిధి నుంచి హామీ తీసుకుని పిల్లలను తండ్రికి తాత్కాలికంగా అప్పగించినట్టు సీడబ్ల్యూసీ చైర్మన్ సువార్త ‘సాక్షి’కి చెప్పారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రసాద్ తల్లి వృద్ధాప్యంతో ఉన్నందున పిల్లలను తురిమెర్లకు పంపేకంటే కౌన్సెలింగ్ ఇచ్చి తండ్రి వద్దనే ఉంచాలని యోచిస్తున్నారు. నాలుగు రోజుల ఎదురు చూపుల అనంతరం తండ్రి చెంతకు చేరడంతో పసివాళ్ల కథ సుఖాంతమైంది. చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు -
విహార యాత్రలో విషాదం..
కమలాపురం/ఇందుకూరుపేట(నెల్లూరు జిల్లా): స్నేహితులతో కలిసి సరదాగా సేదతీరేందుకు వచ్చి యువకుడు సముద్రంలో గల్లంతయిన సంఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వైఎస్సార్ జిల్లా కమలాపురం టౌన్‌కు చెందిన సయ్యద్ బిలాల్ (20) స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం మైపాడు బీచ్‌కు వచ్చారు. అందరూ కలసి సంతోషంగా సముద్రంలో నీటిలో దిగి స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అలల ఉధృతి ఎక్కువై సయ్యద్ బిలాల్ నీటిలో కొట్టుకుపోయాడు. తీరం వెంబడి ఎంత వెతికినా ఇతని జాడ తెలియలేదు. అంతవరకు కళ్ల ఎదుటే ఉన్న స్నేహితుడు గల్లంతవడంతో వెంట వచ్చిన మిత్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పండుగ మరుసటిరోజే.. కమలాపురం పట్టణంలోని దర్గా వీధికి చెందిన బాషామోదీన్, గౌసియా దంపతులకు ఏకైక కుమారుడు బిలాల్. ఇద్దరు కుమార్తెల అనంతరం పుట్టడంతో గారాబంగా పెంచుకున్నారు. తండ్రి హోటల్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. తండ్రికి తోడుగా ఉండాలని ఇటీవల బిలాల్ కూడా స్కూటర్ మెకానిక్ షెడ్డుకు వెళ్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు దూరమయ్యాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.ముందు రోజు బక్రీద్ పండుగను బిలాల్ ఆనందంగా జరుపుకున్నాడు.ఆ ఆనందం అంతలోనే అవిరైంది. రెండేళ్ల క్రితం బక్రీద్ పండుగ అనంతరం ఇదే వీధికి చెందిన ముగ్గురు చిన్నారులు, ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మరువక ముందే బిలాల్ గల్లంతు కావడం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. -
టీడీపీ హయాంలో ఫైబర్ చెక్ డ్యామ్‌ల్లో భారీ దోపిడీ
జిల్లా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులను అవినీతి పాపం వెంటాడుతోంది. టీడీపీ హయాంలో ఉదయగిరి నియోజకవర్గంలో నీరు–చెట్టు పేరుతో చేపట్టిన ఫైబర్ చెక్ డ్యామ్‌లు తెలుగు తమ్ముళ్ల దోపిడీ అడ్డాగా నిలిచాయి. అవినీతిని అడ్డుకోవాల్సిన అధికారులు ఆ ఊబిలో కూరుకుపోయారు. తిలాపాపం.. తలా పిడికెడు చందంగా అధికార యంత్రాంగం అవినీతిలో భాగస్వామ్యం అయింది. రూ.కోట్ల వెచ్చించి చేపట్టిన చెక్ డ్యామ్‌లతో ప్రజోపయోగం లేకపోగా, నాసిరకంగా మిగిలిపోయాయి. ఆ నాటి అవినీతి పాపాల చిట్టా బయటకొస్తోంది సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ ఐదేళ్లు అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకున్నారు. జిల్లాలో చెక్ డ్యామ్‌ల్లో అవినీతి వరద పారించారు. ఆ అవినీతిలో భాగస్వామ్యం అయిన జిల్లాలో 21 మంది ఇంజినీరింగ్ అధికారుల మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.కోట్ల దోపిడీకి బాధ్యులై యంత్రాంగంపై చర్యలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా అధునాతన టెక్నాలజీ ఫైబర్ చెక్ డ్యామ్‌లు అంటూ అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతలు హడావుడి చేశారు. అయితే పూర్తిగా నాసిరకం మెటీరియల్ వినియోగించిన తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు కొల్లగొట్టారు. ఓ పక్క నిర్మాణం పూర్తికాకుండానే వాటి డొల్లతనం బహిర్గతమైంది. మరో పక్క దెబ్బతిన్న డ్యామ్‌లు పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. నిర్మించిన కొద్ది నెలలకే నీటి ఉధృతిని తట్టుకోలేక కొన్ని కొట్టుకుపోతే.. మరికొన్ని చోట్ల లీకేజీలతో నీటిని నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది. వెరసి ఫైబర్ చెక్ డ్యామ్‌లు నిర్మించి ఉపయోగం లేని విధంగా మారింది. జిల్లాలో ఇరిగేషన్ శాఖలో రూ.818 కోట్ల విలువైన దాదాపు 9 వేల పనులు చేపట్టారు. అత్యధికంగా ఉదయగిరి నియోజకవర్గంలో రూ.68 కోట్లు విలువైన 208 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. నీరు–చెట్టు పథకం ద్వారా చెక్ డ్యామ్‌లన్నీ కూడా అప్పటి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, టీడీపీ నేతలే కాంట్రాక్టర్లుగా పనులు మొత్తం నిర్వహించారు. అప్పట్లో నేతలు స్థాయి, హోదాను బట్టి అందిన మేరకు దండుకున్నారు. ఫైబర్ చెక్‌డ్యామ్.. అదో మాయ జిల్లాలో ఫైబర్ చెక్‌డ్యామ్‌ల పేరిట యథేచ్ఛగా దోపిడీ కొనసాగింది. నీరు–చెట్టు దోపిడీ ఒక ఎత్తు అయితే ఫైబర్ చెక్ డ్యామ్‌ల అవినీతి మరో ఎత్తు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఫైబర్ చెక్ డ్యాంలు నిర్మించారు. వాస్తవానికి రూ.2 లక్షల నుంచి రూ.45 లక్షలు విలువ చేసే ఫైబర్ చెక్ డ్యామ్‌లకు రూ.70 లక్షలపైనే వెచ్చించారు. అవసరమైన చోట్లతో పాటు అవసరం లేని చోట్ల కూడా కేవలం బిల్లుల కోసం వీటిని నిర్మించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో నీరు–చెట్టు కింద 8 మండలాల్లో రూ. 39 కోట్లతో 126 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. 2017–18లో రూ.29 కోట్లతో 78 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. ఉదయగిరి, కలిగిరి, వరికుంటపాడు మండలాల్లో నిర్మించిన చెక్ డ్యామ్‌ల్లో కేవలం నెలల్లోనే వాల్వ్‌ల లీకేజీలు, పైప్‌లు లీకులతో నిరుపయోగంగా మారాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఫైబర్ చెక్ డ్యామ్‌లు ఎక్కడా లేవు. కేవలం ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రమే ఉన్నాయి. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన అప్పటి ఎమ్మెల్యే తన సన్నిహితులకు చెందిన కంపెనీల నుంచి మెటీరియల్ దిగుమతి చేసుకోని ఫైబర్ చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ నిధులు భారీగా స్వాహాకు ఆస్కారం ఏర్పడినట్లు గుర్తించారు. విజిలెన్స్ విచారణలో బహిర్గతం జిల్లాలో నీరు–చెట్టు పథకంలో అవినీతి వరద పారిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేటతెల్లమైంది. ఫైబర్ చెక్‌డ్యామ్‌ల నాణ్యత, వాటి పనితీరు, కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న వైనం, వాస్తవ విలువ, ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీన వైఖరి తదితర అంశాలపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పూడిక తీత పనులు చేయకుండానే చెక్‌డ్యాంల నిర్మాణం, అవసరం లేని చోట్ల ఏర్పాటు, చేపట్టినవి కూడా నాసిరకంగా ఉన్నాయని నిర్ధారించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనులు చేపట్టినట్లు రుజువైంది. ఆ మేరకు జిల్లాలో 21 మంది అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో 13 మంది ఏఈలు, నలుగురు డీఈలు, ఇద్దరు ఈఈలు, ఎస్ఈ, సీఈలను బాధ్యులను చేస్తూ తాఖీదులు జారీ చేస్తున్నట్లు సమాచారం. -
పుత్తడి బొమ్మలకు పుస్తెల బంధం..
బడికెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన అమ్మాయిలు పుస్తెలతాడుతో అత్తారింటి బాట పడుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకుండానే భార్యగా, తల్లిగా బాధ్యతలను మోస్తున్నారు. సంసార మధురిమలు తెలియకుండానే జీవితాన్ని మోస్తున్నారు. పేదరికం ఒక వైపు, ఆడపిల్ల భారం తీరుతుందని కన్నోళ్లే సంసార సాగరంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. సాక్షి, నెల్లూరు: సాంకేతికత రోజు రోజుకూ పెరుగుతున్నా, ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా జిల్లాలో మాత్రం బాల్య వివాహాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్‌కు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడ పిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీట లెక్కిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా.. బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంలో బందీ చేస్తున్నారు. ఎక్కువగా గిరిజన, మత్స్యకార కుటుంబాల్లో ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్ల లోపే వివాహాలు జరిపిస్తున్నారు. పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో మరి కొందరు ఇలా చేస్తున్నారు. అడ్డుకట్టకు మార్గాలు గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో సూపర్వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు బాల్యవివాహాలు అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా 1098 ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఇప్పటికే సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తల మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో 18 ఏళ్లు నిండుకుండానే పెళ్లిళ్లు చేయకూడదనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ తప్పని సరి బాల్యవివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. జిల్లాలోని అన్ని, రెవెన్యూ డివిజనల్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సీడీపీఓలు వివాహ రిజిస్ట్రేషన్ చట్టం -2002 అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జీఓ జారీ చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో మహిళ సంరక్షణ కార్యదర్శి ద్వారా తప్పక వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్ని ఆదేశాలిచ్చారు. పెళ్లికి ముందే వరుడు, వధువు, ఇద్దరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్ , రెండు పాస్‌ఫొటో సైజు ఫొటోలు, వివాహ పత్రికలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఇకపై జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు కఠినంగా చర్యలు చేపడుతాం. – రోజ్‌మాండ్, ఐసీడీఎస్ పీడీ -
పేదల కళ్లలో సొంతింటి వెలుగులు : అనిల్‌కుమార్‌యాదవ్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ప్రైవేట్ లేఅవుట్ల కంటే మిన్నగా అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు తమ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే వారి కళ్లల్లో సంతోషం, ఆనందం కనిపిస్తోందని, ఏక కాలంలో ఇలా శంకుస్థాపనలు చేయడం పండగ వాతావరణాన్ని తలపిస్తోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లూరు నగర నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండ్లపూడి వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం చరిత్ర అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయంలో భాగంగా తొలి విడతగా 17 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. నగర నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన దాదాపు 14,500 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అందులో మొదటి విడతగా 7,600 ఇళ్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లు నిర్మిస్తూ మంచి ఆశయంతో ముందుకు వెళుతున్నారన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు ఆరు అంకణాలు మాత్రమేనని ఇచ్చారని, విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన టిడ్కో ఇళ్లు కేవలం నాలుగు అంకణాలు మాత్రమేనని గుర్తు చేశారు. పేదలకు సొంతిల్లు నిర్మించాలనే ఆలోచనతో అందుబాటులో ఉన్న స్థలాలను అభివృద్ధి చేసి ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. పట్టణ పరిధిలో తక్కువ భూమి అందుబాటులో ఉండడంతో వీలైనంత వరకు సేకరించి గత ప్రభుత్వం కంటే ఎంతో గొప్పగా పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన దాఖాలు లేవన్నారు. గతంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఇచ్చే క్రమంలో పేదలపై రూ.3 లక్షల భారం మోపారన్నారు. ఆ రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేసి ఉచితంగా ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తునామన్నారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్), అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. పేద వారికి అండగా ఉండేది జగనన్న ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్, ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్, వైఎస్సార్సీపీ నాయకులు కొణిదల సుధీర్, ఎండీ ఖలీల్ అహ్మద్, వేలూరు మహేష్, ఇంతియాజ్, గోగుల నాగరాజు, కుంచాల శ్రీనివాసులు, వందవాశి రంగా పాల్గొన్నారు. -
మాస్క్ మస్ట్‌గా ధరించాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
తిరుపతి ఎన్నికల ప్రచారం వైఎస్ జగన్ ప్రతిష్టను నిలబెడుతాయి
-
‘రుణమాఫి పేరుతో చంద్రబాబు రైతులను దోచుకున్నాడు’
నెల్లురు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. వైఎస్సార్ సీపీ 20 నెలల పాలనకాలంలో 90 శాతానికిపైగా హమీలను నెరవెర్చిందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోపిడి చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం నాడు-నేడు పథకంలో భాగంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్ది.. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటిదాక అర్హులైన సుమారు 63 లక్షల మందికి రూ. 2,350 చొప్పున పింఛన్ అందిస్తున్నామని అన్నారు. ఏపీలో సుమారు 2,434 రోగాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చామని పేర్కొన్నారు. వైద్యం ఖర్చులు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తూ ఏడాదికి రూ. 13,500 అందిస్తుందని స్పష్టం చేశారు. చదవండి: రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
నెల్లూరు: భారీ వర్షాలు
-
హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం
-
అలాంటి వ్యక్తికి మాట్లాడే అర్హత కూడా లేదు
-
నెల్లూరు: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
-
నెల్లూరు జిల్లా విడవలూరు రైతుల ఔదార్యం
-
ఎలాంటి సమస్య ఉన్న కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలి: మంత్రి అనిల్
-
నెల్లూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
-
ప్రజల కోసం రంగంలోకి..