new medical Method
-
జూలియట్ మళ్లీ ఆడుకుంది!
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఏమిటీ సమస్య? ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్‌కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్‌ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్‌ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది. ఈ తరహాలో 80 శాతం మరణాలు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది. -
కొత్త పరిశోధనలు పేదవారికి చేరాలి
సాక్షి, విశాఖపట్నం : వైద్య రంగానికి సవాల్ విసురుతున్న కొత్త కొత్త వ్యాధులు... ఆరోగ్యపరమైన రుగ్మతలను ఎదుర్కొనేందుకు మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ పరిశోధనలు నిరుపేదలకు చేరినప్పుడే వాటి సార్ధకత చేకూరుతుందన్నారు. విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఎండోకాన్-2015 జాతీయ సదస్సు శుక్రవారం నోవోటల్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ సదస్సులో గౌరవ అతిథిగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైద్యరంగంలో కొత్త కొత్త పరిశోధనలు నిరంతరం జరగాల్సి ఉందన్నారు. కొత్త వైద్య విధానం కూడా అందుబాటులోకి రావాలన్నారు. ఈ రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత విద్యా విధానం అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రపంచంలో ఏమూలనుంచైనా ఏ వైద్య రంగ నిపుణుడి అనుభవాన్నైనా క్షణాల్లో ఇక్కడి వైద్య విద్యార్థులు తెలుసుకునేందుకు వీలుగా టెక్నాలజీ అభివృద్ధి చెందాలన్నారు. ఎస్‌జీఈఐ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎండోస్కోపీ రంగంలో ఎంతో అధునాతన వైద్య విధానం అందుబాటులోకి వ చ్చిందన్నారు. వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వైద్య విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ఎస్‌జీఈఐ కార్యదర్శి పంకజ్ కె.గోయంకా మాట్లాడుతూ సొసైటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎండోస్కోపీ నిపుణులను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు ఏడేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. ఐదేళ్ల క్రితం 700 మంది సభ్యులతో ఉండే సొసైటీ నేడు 1413కు చేరుకుందన్నారు. రాజస్థాన్, వెస్ట్‌బెంగాల్, మహారాష్ర్టలలో చాప్టర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఎండోస్కోపీ విభాగంలో వైద్యసేవలందిస్తున్న అంథనికాలు, ప్రసాద్ అయ్యర్, కె.ఫళని స్వామి, గౌరవ్ బాత్రా, యాసిన్ ముజూ, డేవిడ్కార్ల్, మార్క్బ్రోనీ, పెట్రోన్అకలో, నోరియా నిడియా, శ్రీరామ్ పారుపూడి, నళిని గుడాలతో పాటు సొసైటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న షౌకత్ అలీ ఇజాగర్ను సీఎం చంద్రబాబు మెమెంటోలతో సత్కరించారు. ఎస్‌జీఈఐ గుర్తింపు పొందిన నాలుగు ఆస్పత్రుల యాజమాన్యాలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.