Nicolas Sarkozy
-
ఎన్నికల్లో అధిక ఖర్చు: సర్కోజీని దోషిగా తేల్చిన కోర్టు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ దేశంలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ఎన్నికల ప్రచారంలో నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం ద్వారా ఆయన నేరానికి పాల్పడినట్లు తేల్చింది. శిక్షగా ఏడాదిపాటు గృహ నిర్బంధంలోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఎల్రక్టానిక్ మానిటరింగ్ బ్రేస్లెట్ ధరించి ఇంట్లో ఉండాలని తీర్పు చెప్పింది. ఈ శిక్షను ఆయన తిరిగి అప్పీల్ చేసే అవకాశం ఉంది. 2007 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేసిన సర్కోజీ, 2012 ఎన్నికల్లో నిర్ణయించిన ఆర్థిక మొత్తం కన్నా రెండింతలు ఎక్కువ ఖర్చు చేశారని కోర్టు తేలి్చంది. -
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీ అరెస్టు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 2007 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సర్కోజీకి నాటి లిబియా నియంత గడాఫీ నుంచి ధన సహాయం లభించిందన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను విచారించ నున్నారు. 2013 నుంచి దర్యాప్తు సాగుతున్న ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా సర్కోజీకి నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు. దీంతో పోలీసులు సర్కోజీని అరెస్టు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార ఖర్చుల కోసం గడాఫీ నుంచి డబ్బు తీసుకెళ్లి సర్కోజీ మనుషులకు ఇచ్చానని ఓ వ్యాపారవేత్త గతేడాది నవంబరులో చెప్పడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. సర్కోజీకి ఎన్నికల ఖర్చులకు డబ్బు పంపించామని గతంలో గడాఫీతోపాటు ఆయన కొడుకు సీఫ్ అల్–ఇస్లాం కూడా చెప్పారు. అయితే అమెరికా సైన్యంతో కలసి లిబియాలో 41 ఏళ్ల గడాఫీ పాలనను ముగించినందుకే తనపై వారు ఆరోపణలు చేశారని సర్కోజీ వాదిస్తున్నారు. -
ట్రంప్‌కు ప్రజాదరణ పెరగడం ప్రమాదకరం: సర్కోజి
లండన్ : అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ప్రజాదరణ పెరగడం ప్రమాదకరమని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజి అన్నారు. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, అమెరికా పరిస్థితిని తలచుకుని తాను భయకంపితుడనయ్యానని పేర్కొన్నాను. తన ప్రచారంలో జనాకర్షక, మొరటు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్‌పై సర్కోజి విమర్శించారు. ముస్లింల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ట్రంప్ అభ్యర్థిత్వం కోసం రియల్ ఎస్టేట్‌దారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే, 2017లో ఫ్రాన్స్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై సర్కోజి మరోసారి కన్ను వేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రంప్ ప్రచారతీరుతెన్నులపై వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఫ్రెంచి రాజకీయాల్లోకి మళ్లీ సర్కోజీ!
ప్లేబోయ్‌గా ప్రసిద్ధి చెందిన ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. మరోసారి ఫ్రాన్సుకు అధ్యక్షుడిని అవుదామని ఆయన ఆశపడుతున్నారు. తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలో అంతర్జాతీయ మోడల్ కార్లా బ్రూనీతో సరసాలు.. ఆ తర్వాత పెళ్లి లాంటి విషయాలతో మీడియాలో ఎప్పుడూ నానుతూ వచ్చిన సర్కోజీ ఇప్పుడు మరోసారి సందడి చేయడానికి సిద్ధం అయిపోతున్నారు. యూనియన్ ఫర్ ఎ పాపులర్ మూవ్మెంట్ (యూఎంపీ) తరఫున ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్నారు. అయితే.. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా సర్కోజీ మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడగలనని సర్కోజీ ఇప్పుడు ఆశిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు హోలండ్‌కు మరోసారి అవకాశం వచ్చేలా మాత్రం లేదు. కేవలం 13 శాతం మంది మాత్రమే ఆయన మళ్లీ పోటీ పడాలని అనుకుంటున్నారు. ఫ్రాన్సు అధ్యక్ష ఎన్నికలు 2017లో జరగనున్నాయి.