nodal officers
-
TS: అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నోడల్ అధికారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి పది జిల్లాలకు నోడల్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించనున్నారు. కరీంనగర్ - శ్రీదేవసేన వరంగల్ - వాకాటి కరుణ హైదరాబాద్ - కె.నిర్మల వరంగల్ - వాకాటి కరుణ మహబూబ్‌నగర్ - టి.కె.శ్రీదేవి. ఖమ్మం - రఘునందన్‌రావు. రంగారెడ్డి - శ్రీధర్. మెదక్ - ఎస్.సంగీత. ఆదిలాబాద్ - ఎం. ప్రశాంతి. నల్గొండ - ఆర్.వి.కర్ణన్. నిజామాబాద్ - క్రిస్టినా -
ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లలో అధికారులకు క్షణం తీరిక దొరకడం లేదు..!
సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. కలెక్టరేట్లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. రోజూ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారారు. కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు కమిటీలు.. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టర్ ఎస్. వెంకట్రావు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా విధులు కేటాయించారు. ఇందులో మోడల్ కోడ్ అమలు, ఈవీఎం, వీవీ ప్యాట్ల పర్యవేక్షణ, ఉద్యోగులకు విధుల కేటాయింపు, అభ్యర్థి తరఫున ఏజెంట్లకు లైసెన్స్ ఇవ్వడానికి, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటరు నమోదుపై అవగాహన, ఎన్నికల వ్యయ నిర్ధారణ, మీడియా కమ్యూనికేషన్, పోస్టల్ బ్యాలెట్– ఈవీఎం బ్యాలెట్ కమిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, గెస్ట్ హౌస్‌ల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్, హెల్ప్‌లైన్ అండ్ కంట్రోల్ యూనిట్, ఎంసీఎంసీఏ, పోలీస్ కోఆర్డినేషన్, హెలిపాడ్ కోఆర్డినేషన్ వంటి వాటికి వివిధ శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇటు శాఖా పరమైన విధులు.. అటు ఎన్నికల పనులు కలెక్టరేట్లో ఎన్నికల విభాగం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎన్నికల సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కాగా మరో నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ అటు ఎన్నికల ఏర్పాట్లపై తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్ర పర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే కేటాయించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గానికి జగదీశ్వర్‌రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారి, కోదాడ నియోజకవర్గానికి కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణలను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అదే విధంగా నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. అదే విధంగా అభ్యర్థుల వ్యయ నిర్ధారణ, ఫిర్యాదులు, చర్యలు వంటివి రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 12 వేల మంది పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని కేటాయించే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ఇతర శాఖల ఉద్యోగులను పోలింగ్ నిర్వహణకు వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడక పోతే ప్రైవేట్ ఉపాధ్యాయులను విధులకు వాడనున్నారు. జిల్లాలో 1,201 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇద్దరు, లేదా ముగ్గురు పోలింగ్ సిబ్బందిని కేటాయించనున్నారు. దీని ప్రకారం 1,201 మంది పోలింగ్ అధికారులు, 1,201 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు , ఇద్దరు సిబ్బందిని వాడితే 2,402 మంది, లేదా ముగ్గురిని కేటాయిస్తే 3,603 మంది ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు విశేష స్పందన
కడప: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని జిల్లా నోడల్ అధికారి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పనితీరుపై తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాలకు నోడల్ అధికారులను నియమించిందన్నారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులను అడిగి.. అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బీపీ చెకప్ చేయించుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ స్టాల్స్‌ను పరిశీలించి అక్కడి గర్భవతులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ అర్జున్ రావు, ఎంపీడీఓ విజయరాఘవరెడ్డి, తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, సర్పంచ్ గంగరాజు, వైద్యులు పాల్గొన్నారు. -
Scholarship Scam: మైనారిటీ స్కాలర్షిప్.. భారీ కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీల్లోని పేద కుటుంబాల పిల్లలకు అందాల్సిన ఉపకార వేతనాలు భారీగా పక్కదారి పట్టాయి. అనర్హులు వాటిని కాజేశారు. ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దందాకు వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులు కొమ్ముకాశారు. స్కాలర్షిప్ పథకానికి ఆమోదం పొందిన విద్యా సంస్థల్లో 53 శాతం నకిలీవని తాజాగా తేలింది. అయిదేళ్లలో రూ.144.83 కోట్లు అనర్థులు జేబుల్లో వేసినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ అక్రమాలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ జూలై 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ శాఖ అంతర్గత విచారణ జరిపిన 1,572 విద్యా సంస్థల్లో 830 వరకు బోగస్‌వేనని గుర్తించారు. ప్రస్తుతానికి 830 విద్యాసంస్థల బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, కేవైసీ పత్రాలతో లబ్ధిదారులకు బోగస్ అకౌంట్లను బ్యాంకులు ఎలా ఇచ్చాయనే దానిపైనా దృష్టి సారించనుంది. రాష్ట్రాల వారీగా అక్రమాలు.. ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని పరిశీలన జరిపిన మొత్తం 62 విద్యాసంస్థలూ బోగస్‌వే. రాజస్తాన్: పరిశీలన జరిపిన 128 విద్యాసంస్థల్లో 99 నకిలీవి. అస్సాం: రాష్ట్రంలోని స్కాలర్షిప్ అందుకుంటున్న మొత్తం విద్యా సంస్థల్లో 68శాతం ఉత్తుత్తివే. కర్ణాటక: కర్ణాటకలోని 64 శాతం విద్యాసంస్థలు బోగస్‌వి. ఉత్తరప్రదేశ్: 44 శాతం విద్యాసంస్థలు నకిలీవి. పశ్చిమబెంగాల్: 39 శాతం సంస్థలు నకిలీవి. పక్కదారి పలు విధాలు ► కేరళలోని మలప్పురంలో ఒక బ్యాంకు శాఖలో 66 వేల స్కాలర్షిప్పులు పంపిణీ అయ్యాయి. ఇక్కడ రిజిస్టరయిన మైనారిటీ విద్యార్థుల కంటే ఉపకారవేతనాలు తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువ. ► జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన ఒక కాలేజీలో 5 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7 వేల మంది స్కాలర్షిప్పులు అందుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న 22 మంది విద్యార్థులకు ఒకే మొబైల్ నంబర్ ఒక్క తండ్రి పేరుతోనే రిజిస్టరయి ఉంది. మరో విద్యాసంస్థకు అనుబంధంగా హాస్టల్ లేకున్నా విద్యార్థులందరూ స్కాలర్షిప్ పొందారు. ► అస్సాంలో.. ఒక బ్యాంక్ బ్రాంచిలో 66 వేల మంది స్కాలర్షిప్ లబ్ధిదారులున్నారు. సంబంధిత మదర్సాకు వెళ్లి పరిశీలనకు యత్నించగా నిర్వాహకులు అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ► పంజాబ్‌లో.. స్కూల్లో పేరు నమోదు చేయించుకోని మైనారిటీ విద్యార్థులు సైతం ఉపకారవేతనాలు అందుకున్నారు. -
కరోనా: నెలకో నోడల్ ఆఫీసర్
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ కోవిడ్ విభాగానికి సంబంధించి నెలకో నోడల్ అధికారి మారుతున్నాడు. దీంతో ఆ విభాగంలో సేవలకు కొంత అంతరా యం ఏర్పడుతుంది. కొత్తగా వచ్చే నోడల్ అధికారి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జనరల్ మెడిసిన్‌కు సంబంధించి ఐదుగురు వైద్యులు ఉండగా, ప్రస్తుతం ఇద్దరు నోడల్ అధికారులు మారారు. మంగళవారం మ రో ఎండీకి బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇ టు వైద్యారోగ్య శాఖాధికారులకు కూడా ఈ మా ర్పుల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమాచారం. నోడల్ అధికారి పోస్టు మార్పు చేయకుండా చూడాల్సిన రిమ్స్ డైరెక్టర్ నెలకోసారి ఇలా మార్పు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇతర వైద్యులకు ఇస్తే ప్రయోజనం నోడల్ అధికారి పోస్టును జనరల్ మెడిసిన్ వైద్యులకు కాకుండా ఈఎన్టీ, అప్తాల్మిక్, సివిల్ సర్జన్, ఇతర వైద్యులకు అప్పగిస్తే ఎండీల ద్వారా కోవిడ్ బాధితులకు మరింతగా వైద్యసేవలు అందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నోడల్ అధికారిగా ఉన్న వ్యక్తి రోజుకు ఎన్ని టెస్టులు జరిగాయి, ఎంతమందికి పాజిటివ్, ఎంతమందికి నెగిటివ్, ఎంతమంది డిశ్చార్జి అయ్యారు, ఎవరైనా మరణించారా.. కిట్స్, గ్లౌజులు, తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయా.. లేవా అనే విషయాన్ని తెలుసుకుంటారు. అయితే ఎవరైతే నోడల్ అధికారిగా ఉంటారో వారు కోవిడ్ బాధితులకు వైద్యసేవలు చేయకుండానే ఈ పోస్టులో ఉంటారని పలువురు వైద్యులు చెబుతున్నారు. అయితే జనరల్ మెడిసిన్‌లో ఐదుగురు మాత్రమే వైద్యులు ఉన్నారు. వీరికి ఐదు రోజులు విధులు కేటాయిస్తారు. వీరితో పాటు జూనియర్ డాక్టర్లే కోవిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులే కీలకం కావడంతో పనిభారం పెరుగుతుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. ఇతర డిపార్ట్మెంట్లకు చెందినవారికి నోడల్ అధికారి బాధ్యతలు అప్పగిస్తే కొంత పనిభారం తగ్గే అవకాశం ఉండటంతో పాటు కోవిడ్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని భావిస్తున్నారు. అయితే కోవిడ్ విభాగం ఏర్పాటు చేసినప్పుడు మొదట డాక్టర్ సందీప్ జాదవ్, ఆ తర్వాత డాక్టర్ తానాజీ నోడల్ అధికారులుగా వ్యవహరించగా, ప్రస్తుతం డాక్టర్ శ్రీనివాస్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఉన్నా.. నిరుపయోగమే రిమ్స్‌లో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆర్టీపీసీఆర్ యంత్రం గత కొన్ని నెలలుగా నిరుపయోగంగా మూలన పడి ఉంది. ఈ యంత్రం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు టెక్నీషియన్ లేకపోవడంతో మూలన పడింది. ప్రస్తుతం ట్రూనాట్, సీబీనాట్ ద్వారానే కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 50 నుంచి 60 వరకు మాత్రమే ఫలితాలు వస్తున్నాయి. ఆర్టీసీపీఆర్ ద్వారా రోజుకు వందకు పైగా టెస్టులు చేయొచ్చు. ప్రస్తుతం రిమ్స్‌లో ఐదుగురు టెక్నీషియన్లు ఉండగా, ఇద్దరు కోవిడ్ బారినపడ్డారు. ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఈ కోవిడ్ పరీక్షలతో పాటు ఇతర రక్త నమూనాలను కూడా చేస్తుండటంతో పనిభారం పెరుగుతుందని చెబుతున్నారు. నెలకొకరికి బాధ్యతలు అప్పగిస్తున్నాం నోడల్ అధికారిగా నెలకొకరికి బాధ్యతలు అప్పగిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో ఎవరికీ పనిభారం కలగకుండా చూస్తున్నాం. జనరల్ మెడిసిన్ వారికి బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఆర్టీపీసీఆర్ యంత్రం ద్వారా కోవిడ్ టెస్టులు చేసేలా టెక్నీషియన్‌ను నియమిస్తాం. – బలరాం, రిమ్స్ డైరెక్టర్ -
కోడ్ వేళ ‘దేశం’ ఫుడ్ బకెట్స్
సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల ఆరోగ్యం..సంక్షేమం కోసం గడచిన ఐదేళ్లలో ఏనాడు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఎన్నడూ లేని ప్రేమ ఒలకబోస్తుంది. మాతా, శిశు మరణాల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందంటూ జాతీయ ఆరోగ్య సంస్థలు ఘోషిస్తున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే ఎస్టీ కుటుంబాల ఓట్లపై కన్నేసిన ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఫుడ్ బకెట్ (గిరి ఆహారభద్రత)పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆరు రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు కేజీల చోడి(రాగి)పిండి, రెండు కేజీల కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కేజీ చొప్పున ఉప్పు, వేరుశెనగ, బెల్లం పంపిణీ చేయాలని నిర్ణయిస్తూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పైగా కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పాత తేదీతో ఈ ఉత్తర్వులు (సర్క్యులర్ నం.ఎంకేటీజీ/ఎం6/ఫుడ్ బాస్కెట్ /2009, డేట్: 27–02–2019) జారీ చేయడం వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చిత్తూరు, కేఆర్ పురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోని 77 మండలాల్లో రెండులక్షల 668 ఎస్టీ కుటుంబాలకు ఫుడ్‌బాస్కెట్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటలు తిరక్కుండానే ఆ సంఖ్యను రెట్టింపు చేస్తూ 4,24,335 ఎస్టీ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ మేరకు సరుకులను ఆయా మండలాలకు కేటాయిస్తూ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఉత్తర్వులు (ఆర్సీ నం.ఎస్‌వోడబ్ల్యూ 03–21021(32)/1/2018–జీ, సెక్షన్–సీవోటీడబ్ల్యూ, డేటెడ్: 28–02–2019) జారీచేసింది. అయితే 25–02–2019నుంచి 28–03–2019 వరకు ఈ సరుకులను పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీచేయడం విస్మయం కలిగిస్తోంది. ఆగమేఘాలపై పంపిణీకి కసరత్తు.. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు పౌర సరఫరాల శాఖ డెప్యూటీ తహసీల్దార్లు, రేషన్ డీలర్లతో సమావేశాలు నిర్వహించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రకాల నిత్యావసరాలను చంద్రన్న సంక్రాంతి కానుక సంచి మాదిరిగా నాన్ వోవెన్ కారీ బ్యాగ్‌లలో పెట్టి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొంతమంది అధికారులు ఎన్నికల నిబంధనల కారణంగా పంపిణీ ప్రక్రియకు అభ్యంతరం వ్యక్తం చేయగా.. పాలకులు ఆదేశించారని, అమలు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే.. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ పాత తేదీలతో ఆదేశాలు జారీ చేస్తూ అధికార ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది. ఎస్టీ కుటుంబాల పౌష్టికాహారం, సంక్షేమం ముసుగులో ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాలకులు పాల్పడుతున్నారు. ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించి పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేయాలి. –కాండ్రేగుల వెంకటరమణ, సమాచార హక్కు ఉద్యమకర్త, విశాఖపట్నం -
ఎన్నికల తాయిలాలపై నిఘా పెంచండి
సాక్షి, అమరావతి: ‘‘గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మద్యం సరఫరా, నగదు పంపిణీ, బహుమతుల రూపంలో వివిధ వస్తువులను ఇవ్వడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశమున్నట్టు గుర్తించాం. వీటిని నియంత్రించే విధంగా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయండి’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులతో ఎన్నికల నిఘాపై ద్వివేది సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. మద్యం, నగదుకు సంబంధించి అత్యంత ప్రభావితం చేసే రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రతీ విషయాన్నీ తీవ్రంగా పరిగణించాలన్నారు. వివిధ శాఖలు దాడులు చేపట్టే సమయంలో పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు భారీస్థాయిలో లావాదేవీలు నిర్వహిస్తున్నవారిపై నిఘా పెట్టాలన్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి ఈ సీజన్లో గడిచిన ఐదేళ్లలో సాధారణంగా జరిగే కొనుగోళ్లు, అమ్మకాలపై నివేదికలను రూపొందించుకుని వీటి ఆధారంగా నిఘా పెంచాలని సూచించారు. అనుమానాస్పద కదలికలుంటే డేగ కన్ను వేయాలని కోరారు. సమావేశంలో అదనపు సీఈవో వివేక్ యాదవ్, జాయింట్ సీఈవో డి.మార్కండేయులు, అదనపు డీజీ ఐ.రవిశంకర్, రాష్ట్ర పోలీసు అధికారులు కె.వి.వి.గోపాలరావు, సీహెచ్ శ్రీకాంత్, ఎన్.ఎస్.జె.లక్ష్మీ, రాష్ట్ర ఎక్సైజ్ అధికారి కె.ఎల్.భాస్కర్, కమర్షియల్ ట్యాక్స్ అధికారి మధుబాబు, రవాణా శాఖ అధికారి ఎమ్.పురేంద్ర, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారి ఎమ్.లక్ష్మీకాంతరెడ్డి, ఐటీ శాఖ అధికారి కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు. నలుగురితో మీడియా కమిటీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వివిధ పత్రికలు, మాధ్యమాలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తల పరిశీలనకోసం నలుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్, పర్యవేక్షణ కమిటీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్¬గా అదనపు సీఈవో వివేక్‌యాదవ్, సభ్యులుగా జాయింట్ సీఈవో డి. మార్కండేయులు, దూరదర్శన్ డైరెక్టర్ డి.సురేష్‌కుమార్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్¬లను నియమించారు. సహాయకులుగా కందుల రమేష్, విజయకుమార్‌లు వ్యవహరిస్తారు. వీరిద్దరూ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి కమిటీకి నివేదిస్తారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాల అనుమతులకోసం రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ కమిటీకి రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ద్వివేది ఈ సందర్భంగా తెలిపారు. సాధారణంగా జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో అనుమతులను జారీచేస్తుందని, జిల్లాస్థాయి పరిధిలోకి రానివి రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ప్రచార అనుమతులకోసం న్యూ సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. -
నోడల్ అధికారులుగా ఇద్దరు ఐఏఎస్‌లు
అనంతపురం అర్బన్ : నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు డిజిటల్ అక్షరాస్యతపై జిల్లాలో శుక్రవారం నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమాల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి జీఓ 2449ను ఈ నెల ఒకటిన ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాకు నోడల్ అధికారులగా 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్, 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌ని నియమించింది. జిల్లాలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలను వీరు పర్యవేక్షిస్తారు. -
కొత్త జిల్లాలకు నోడల్ ఆఫీసర్లు
-
కొత్త జిల్లాలకు నోడల్ ఆఫీసర్లు
పాలనాపర ఇబ్బందులు తలెత్తకుండా సర్కారు నిర్ణయం ప్రస్తుత జిల్లా అధికారులకే బాధ్యతలు పరిపాలన గాడిలో పడేంత వరకు కొనసాగింపు అన్ని విభాగాల్లో ఉద్యోగులకు కొత్త జాబ్ చార్ట్‌లు డివిజన్ స్థాయి పోస్టుల పునర్వ్యవస్థీకరణకు యోచన ప్రమోషన్లు, కొత్త పోస్టులకు డీపీసీ సమావేశాలు నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జిల్లా స్థాయిలో 20 విభాగాల విలీనానికి పచ్చజెండా రాష్ట్రస్థాయిలో మాత్రం ప్రస్తుత విధానమే అమలు సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కొత్త జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జిల్లాలో ఉన్న అధికారులు తమ పరిధిలోని కొత్త జిల్లాల్లో సంబంధిత విభాగాలకు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలని ఆదేశించింది. పరిపాలన గాడిలో పడేంత వరకు ఈ విధానాన్ని కొనసాగించే అవకాశముంది. ఇక అన్ని విభాగాలకు కొత్త జాబ్ చార్ట్‌లను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. కొత్త జిల్లాల పాలనకు వీలుగా అధికారులు, ఉద్యోగుల హోదాలు, పాలనా స్వరూపంలో మార్పులు చేస్తున్న నేపథ్యంలో జాబ్‌చార్ట్‌లను మార్చుతున్నారు. ఈ మేరకు అన్ని శాఖలు ఈ జాబ్ చార్టులను తయారు చేసేందుకు విభాగపరమైన వర్క్‌షాప్‌లు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక కొన్ని జిల్లా స్థాయి పోస్టులను రెండు, మూడు జిల్లాల పరిధికి విస్తరించేలా రీజినల్ స్థాయిగా మార్చే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. న్యాయ, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతమున్న డివిజినల్ స్థాయి పోస్టులను పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనలను సైతం రూపొందించింది. డీపీసీ భేటీలకు ఆదేశం... కొత్త జిల్లాల్లో సీనియర్ అధికారులు, ఉద్యోగుల అవసరం దృష్ట్యా ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త పోస్టుల నియామకాలకు వీలుగా అన్ని విభాగాలు డిపార్టుమెంటల్ ప్రమోషన్ కౌన్సిల్ (డీపీసీ) సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను జీఏడీ సర్వీస్ విభాగానికి, ఆర్థిక శాఖకు అందజేయాలనే మార్గదర్శకాలను రూపొందించింది. వీటితో పాటు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మరిన్ని కొత్త డివిజన్లు, మండలాలు! కొత్తగా మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నోటిఫై చేసిన వాటికి అదనంగా ప్రజల డిమాండ్లకు అనుగుణంగా మరిన్ని డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే ఆమోదం తెలిపారు. ఈ మేరకు రెండు రోజుల కింద జరిగిన కలెక్టర్ల సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ప్రతిపాదనలపై శుక్రవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కేటాయింపు, సర్దుబాట్లపైనా సమీక్ష కొత్త జిల్లాలలో ఉద్యోగుల కేటాయింపు, సర్దుబాటుకు తుది రూపమిచ్చే అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చిస్తారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో పరిపాలనా యూనిట్లు, ప్రతిపాదిత ఉద్యోగుల సంఖ్య, సిబ్బంది నమూనా వివరాలపై సమీక్షించనున్నారు. వీటితోపాటు విభాగాల విలీనానికి అనుగుణంగా కొత్త జిల్లాల్లో నిర్ణీత అధికారులు, ఉద్యోగుల నమూనాను రూపొందిస్తారు. ఇక కార్యాలయాలకు అవసరమైన ఫర్నీచర్, మౌలిక సదుపాయాల వివరాలనూ పరిశీలించనున్నారు. మొత్తంగా దాదాపు పన్నెండు అంశాలపై చర్చించేలా ఎజెండాను రూపొందించారు. ఆ వివరాలన్నింటితో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని సాధారణ పరిపాలన విభాగం (రాజకీయ) ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిచ్చారు. 20 విభాగాల విలీనం కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏర్పడే అధికారులు, ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు దాదాపు ఇరవై విభాగాల విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పనితీరు ఒకే విధంగా ఉన్న విభాగాలను జిల్లా స్థాయిలో ఒకే పరిధిలోకి తెస్తోంది. రాష్ట్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా.. జిల్లా, ఆ కింది స్థాయిలోనే విభాగాలను విలీనం చేసే నమూనాను రూపొందిస్తోంది. అంతేగాకుండా జిల్లాస్థాయిలో ఉండే అధికారుల పోస్టులకు ఇప్పుడున్న పేర్లకు బదులుగా ఒకే తరహాలో నామకరణం చేయాలని నిర్ణయించింది. మొత్తంగా జిల్లా స్థాయి అధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నా... వారిని మొత్తం 27 జిల్లాలకు సర్దుబాటు చేయవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫారసు చేసింది. ఒకే అధికారి పరిధిలోకి.. ప్రస్తుతం జిల్లాస్థాయిలో డీఆర్డీఏ, డ్వామా, సెర్ప్ విభాగాలు వేర్వేరుగా ఉన్నాయి. అన్నింటికీ ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) హోదాలో జిల్లా అధికారులు ఉన్నారు. ఈ మూడింటినీ కలిపి ఒకే ప్రాజెక్టు డెరైక్టర్ పరిధిలో ఉంచుతారు. దీంతో ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న మిగతా పీడీలు, ఏపీడీలను కొత్తగా ఏర్పడే 17 జిల్లాలకు పీడీలుగా నియమించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖలు వేర్వేరుగా ఉన్నాయి. ఇకపై జిల్లాస్థాయిలో ఈ మూడు విభాగాలు ఒకే అధికారి పరిధిలో ఉంటాయి. జాయింట్ డెరైక్టర్లు, డిప్యూటీ డెరైక్టర్ హోదాలేమీ లేకుండా.. ఈ మూడు విభాగాలను పర్యవేక్షించే జిల్లా స్థాయి అధికారిని జిల్లా వ్యవసాయ అధికారిగా పిలుస్తారు. ఇక ఇప్పుడు జిల్లాల్లో ఉన్న మెప్మా పీడీలను తొలగించి... జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లనే మెప్మా పీడీలుగా నోటిఫై చేస్తారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి జిల్లా స్థాయిలో ఈఈలు అధికారులుగా ఉన్నారు. కొత్త జిల్లాల్లో సర్దుబాటు చేసేందుకు ఈఈలు, డిప్యూటీ ఈఈలను ఆయా పోస్టుల్లో నియమిస్తారు. హోదాల తారతమ్యం లేకుండా వారిని అన్ని జిల్లాల్లో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్‌గా పిలుస్తారు. ప్రస్తుతం జిల్లాల్లో డెరైక్టర్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లున్నారు. మున్సిపాలిటీల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లకు హోదా పెంచి ఈ పోస్టుల్లో సర్దుబాటు చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ విభాగాలకు ప్రస్తుతం జిల్లాల్లో వేర్వేరుగా అధికారులున్నారు. ఆ పోస్టులన్నింటినీ జిల్లా సంక్షేమ శాఖ అధికారి పరిధిలోకి తీసుకువస్తారు. ఒకే అధికారి కింద నాలుగు యూనిట్లుగా సేవలు అందిస్తాయి. దీంతో ఒకే అధికారి పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండదు. జిల్లాల్లో వేర్వేరుగా ఉన్న సర్వశిక్షా అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, విద్యాశాఖలు జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలోనే పనిచేస్తాయి. అటవీశాఖ, సామాజిక వనసంరక్షణ, వన్యప్రాణి విభాగాలన్నీ ఒకే జిల్లా అటవీ శాఖ అధికారి పరిధిలో చేర్చారు. -
పనితీరు మార్చుకోండి
అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు నేర సమీక్షలో ఎస్పీ విశాల్ గున్నీ నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోనేది లేదు. పని తీరు మెరుగు పరచుకుని ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించండి. అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని ఎస్పీ విశాల్‌గున్నీ సిబ్బందిని హెచ్చరించారు. స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో గురువారం ఆయన నేరసమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్ కేసులు ఉండటంపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. వీలైనంత త్వరితగతిన కేసులను పరిష్కరించి పెండెన్సీని తగ్గించాలన్నారు. జిల్లాలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి వెంబడి గస్తీని ముమ్మరం చేసి నేర నియంత్రణతో పాటు ప్రమాదాల జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నార. గొలుసు, ఇంటి, గుళ్లలో రోజూ దొంగతనాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు పాతనేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. రాత్రి, పగలు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే అందుకు సంబంధిత పోలీసు అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇకపై ప్రతి పోలీసుస్టేషన్ పనితీరును నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు బి. శరత్‌బాబు, కె.సూరిబాబు, క్రైం ఓఎస్డి విఠలేశ్వర్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నోడల్ అధికారుల నియామకం సిబ్బంది పని తీరును మెరుగు పరచడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా వివిధ విభాగాలను ఏర్పాటు చేసి డీఎస్పీలను నోడల్ అధికారులుగా నియమించారు. ఇకపై నోడల్ అధికారులు తమకు కేటాయించిన విభాగాలను పర్యవేక్షించి నివేదికను తనకు అందజేయాలని సూచించారు. -
‘స్వచ్ఛ’ టీం రెడీ!
- ముఖ్యులకు బాధ్యతల అప్పగింత - ప్యాట్రన్లు, మెంటర్ల పేర్లు వెల్లడి ‘స్వచ్ఛ హైదరాబాద్’కు సన్నాహాలు ఊపందుకున్నాయి. విశ్వనగరమే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పరిశుభ్ర నగర బాధ్యతల్ని ముఖ్యులందరికీ అప్పజెబుతోంది. ముఖ్యమంత్రి నుంచి ఐఏఎస్ అధికారి వరకు పలువురు వీవీఐపీలు ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగం పంచుకుంటారు. ఏరియాలు, బాధ్యతలు, ముఖ్యులెవరో ప్రభుత్వం ప్రకటించింది. 400పైగాయూనిట్లలో ఈ నెల 16 నుంచి ‘యజ్ఞం’ మొదలవనుంది. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రప్రభుత్వం ఈ నెల 16 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ మహాయజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈమేరకు ఆయా విభాగాల బాధ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమం కోసం జీహెచ్ఎంసీని 400 యూనిట్లకు పైగా విభజించారు. ఒక్కో విభాగానికి ఒక్కొక్క వీవీఐపీ బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరిని పాట్రన్/మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి పర్యవేక్షణలో జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. నోడ ల్ అధికారి సమన్వయంతో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కేవలం పారిశుధ్య కార్యక్రమాలపైనే కాక ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలనూ వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారు. జీహెచ్ఎంసీలోని కొన్ని సర్కిళ్లకు ఒకరి కంటే ఎక్కువ మంది బాధ్యతలు నిర్వహించనున్నారు. కొన్ని సర్కిళ్లకు ఒక్కరే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా స్వచ్ఛ హైదరాబాద్‌పై చర్చించేందుకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. -
బస్తీల బాగుకు ‘బాధ్యులు’
- 330 మందికి బాధ్యతలు - సీఎం, మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు సైతం.. - పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనే ధ్యేయం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బస్తీలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సీఎం ఆలోచన మేరకు బస్తీల రూపురేఖలు మారేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీలోని 330 డివిజన్లకు ప్రత్యేక బాధ్యులను నియమించనున్నారు. ఈ బాధ్యుల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు ఆయన మంత్రి మండలి సభ్యులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్లు, ఇతరత్రా సివిల్‌సర్వీస్ అధికారులుండనున్నారు. తాము బాధ్యత వహించే డివిజన్లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పిస్తారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే 330 డివిజన్ల ముసాయిదాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్లు చేసే బిల్కలెక్టర్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాల వారీగా ఈ 330 డివిజన్లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్‌కు ఒక్కో మంత్రి/ ఉన్నతాధికారి బాధ్యత వహించనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సమన్వయ బాధ్యతలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీలు కాగా ఒక్కో అధికారి దాదాపు 2 చ.కి.మీల పరిధిలో పారిశుధ్యం, పరిశుభ్రత, పచ్చదనం పెంపు వంటి చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి నగరాన్ని క్లీన్ సిటీగా మార్చనున్నారు. ఒక్కో అధికారి పరిధిలో దాదాపు 4 వేల ఇళ్ల వరకు ఉండే వీలుంది. సంబంధిత డివిజన్లోని కాలనీసంఘాలు, అసోసియేషన్ల నాయకులతోనూ తరచూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. జీహెచ్ఎంసీకి చెందిన సంబంధిత అధికారులతోనూ సమీక్షలు నిర్వహించి చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరిస్తారు. ప్రగతినగర్ తరహాలో కాలనీలు, బస్తీలను తీర్చిదిద్దేందుకు ఇక మంత్రులు, అధికారులు తమవంతు బాధ్యతగా ఈ పనులు నిర్వహించనున్నారు. త్వరలోనే ఏయే డివిజన్‌కు ఎవరెవరు బాధ్యత వహిస్తారో ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 కార్పొరేటర్ల డివిజన్లున్నాయి. 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నగరాన్ని ఎలా విభజించాలా అనేదానిపై గందరగోళం, సందేహాల్లేకుండా ఉండేందుకు ఒక్కో బిల్ కలెక్టర్ పరిధిలోకి వచ్చే ప్రదేశాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి 330 డివిజన్లతో ముసాయిదా రూపొందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ 330 ప్రాంతాలకు 330 మంది బిల్కలెక్టర్లు, 330 మంది నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో 330 మంది మంత్రులు/ ఉన్నతాధికారులు తమ బాధ్యతలు నిర్వహించనున్నారు. వీటిని 330 డాకెట్లుగా పరిగణిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో డాకెట్ బాధ్యతలప్పగిస్తారు. అవసరాన్ని బట్టి కొందరికి రెండు, మూడు డాకెట్లు అప్పగించే అవకాశాలున్నాయి. -
కూలిలోనూ కక్కుర్తి !
విజయనగరం మున్సిపాలిటీ: పదిహేను రోజులుగా ఇల్లూ వాకిలి వదిలి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన విద్యుత్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నారు. హుదూద్ తుపాను అనంతరం జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థను సరి చేయటంలో వారు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు కూడా. అయితే పలువురు అధికారులు ఈ కష్టజీవుల పొట్ట కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందికి ఇవ్వాల్సిన వేతనంలో చేతివాటం ప్రదర్శించి తక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా వారికి చెల్లించవలసిన రూ.50 లక్షల రూపాయలను అధికారులు తమ జేబులో వేసుకున్నట్టు సమాచారం. ఇదే విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విచారణకు ప్రత్యేక కమిటీని వేశారు. హుదూద్ బీభత్సంతో జిల్లాలో విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది. ప్రజలంతా చాలాకాలం పాటు అంధకారంలోనే గడిపారు. ఇలాంటి సమయంలో జిల్లాలో వెలుగులు నింపేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు మనరాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. వారి కష్టం ఫలితంగానే జిల్లాలో చీకట్లు తొలిగాయి. పనులు చేపడుతున్న సిబ్బంది వేతనాలు, భోజనాలతో పాటు పనుల్లో వినియోగిస్తున్న యంత్రాల కోసం ఇప్పటి వరకు రూ.5.09 కోట్లు ఖర్చు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా కష్టించి పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాల్సిన రోజు వారీ వేతనాల విషయంలో కొందరు అధికారులు కక్కుర్తి పడుతున్నారు. మాయమాటలు చెప్పి ఇవ్వాల్సిన వేతనం కన్నా రూ. రెండు వందలు తక్కువగా చెల్లిస్తున్నారు. జిల్లాలో 83 సబ్స్టేషన్ల పరిధిలో ఆయా ఏఈలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులను నోడల్ అధికారులుగా నియమించి పనులు నిర్వహిస్తున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పనులను దగ్గరుండి పరిశీలించటంతో పాటు పని చేసే కూలీలకు వేతనాలు, భోజనాలు సమకూర్చాల్సి ఉంది. ఇందులో భాగంగా శాఖాపరంగా ఒక్కో కూలికి రూ.650 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇందులో సిబ్బంది భోజనానికి రూ.150 చెల్లిస్తుండగా... వేతనం కింద రూ.500 ఇస్తున్నారు. అయితే ఈ వేతనాల చెల్లింపుల్లో సబ్‌స్టేషన్ పరిధిలోని నోడల్ అధికారులు, ఏఈలు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణ పనులకు తొలుత 2,200 మంది హాజరుకాగా ఇప్పుడా సంఖ్య 3,297కు పెరిగింది. ఒడిశా రాష్ట్రంతో పాటు ఏపీడీసీఎల్, విజయవాడ, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి సిబ్బంది వచ్చి జిల్లాలో పనులు చేపడుతున్నారు. ఇందులో ఒడిశాకు సంబంధించిన సిబ్బందికి మన వంటకాలు పడకపోవటంతో వారే స్వయంగా పని ప్రదేశంలో వంటలు చేసుకుని భోజనాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి అధికారులు నిర్దేశించిన ప్రకారం రూ.650 చెల్లించాల్సి ఉంది. అదే భోజనాలు అధికారులు పెడితే రూ.500 చొప్పున చెల్లించాలి. కానీ ఒడిశా వాసులకు భోజనం పెట్టకుండానే రూ.450, భోజనాలు పెడుతున్న ఇతర ప్రాంత వాసులకు రూ.300 చొప్పున ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయంపై పలువురు సిబ్బంది జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకు వస్తే తమకు ఇచ్చే కూలిని దోచుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఇదే విషయమైన జిల్లాలో పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న విశ్రాంత సీఎండీ రంగనాథం వద్ద సాక్షి ప్రస్తావించగా... ఈ విషయంపై తమ వరకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపై నలుగురు అధికారుల కమిటీగా ఏర్పాటు చేసిన విచారణ చేస్తున్నామని తెలిపారు. బృందం మంగళవారం నుంచి వేతనాల చెల్లింపులపై ఆరా తీస్తోందని, కూలీలకు అన్యాయం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలా కానీ జరిగితే విజెలెన్స్ విచారణ వేయిస్తామన్నారు. -
జిల్లా వెబ్సైట్లో సమగ్ర వివరాలుండాలి
ఏలూరు : ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు రూపొందించిన జిల్లా ప్రత్యేక వెబ్సైట్లో పూర్తి వివరాలను ఉంచాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెబ్సైట్ నిర్వహణపై నోడల్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రతి శాఖ సమగ్ర సమాచారంతో పాటు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు, లబ్ధిదారుల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపర్చాలన్నారు. ప్రతి 15 రోజులకొకసారి తా జా సమాచారాన్ని పొందుపర్చి ప్రజలు మెరుగైన సమాచారం పొందేలా పర్యవేక్షించాలన్నారు. ప్రతి శాఖకు యూజర్ ఐడీ, పాస్వ ర్డను కేటాయించామన్నారు. ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు వివిధ శాఖల జిల్లా అధికారులు, నోడల్ అధికారులతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేశామని అప్పటిలోగా ఆయాశాఖలకు చెందిన పూర్తి సమాచారాన్ని ఠీఠీఠీ.ఠ్ఛీట్టజౌఛ్చీఠ్చిటజీ.్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో పొందుపర్చాలన్నారు. అసంపూర్తిగా సమాచారం ఉంటే అటువంటి వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదే విధంగా శుక్రవారం సమావేశం హాజరుకాని నోడల్ అధికారులకు మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశాలకు గైర్హాజరైతే సహించేది లేదని, నిర్దేశించిన సమయానికి విధిగా హాజరు కావాలని కలెక్టర్ అన్నారు. లేకపోతే అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిక్నెట్ అధికారి శర్మ, ప్రవీణ్ వె బ్సైట్ నిర్వహణ, సమాచారాన్ని అప్లోడ్ చేసే విధానాన్ని సమగ్రంగా వివరించారు. -
ఎన్నికల విధుల్లో వివక్ష వద్దు
ఒంగోలు, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల నిర్వహణలో ఎటువంటి వివక్షకు తావుండరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ్‌కుమార్ సంబంధిత అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు సంబంధించి ఏమైనా ఆరోపణలు వస్తే వారిపై విచారణ తప్పదని హెచ్చరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ అధికారులతో స్థానిక రంగాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులతోగానీ, రాజకీయ పార్టీలతోగానీ ఒప్పందా లు చేసుకుని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ)ను అమలు చేసే సమయంలో పూర్తిస్థాయిలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా అధికారులు, ఉద్యోగులు ఒక పార్టీకిగానీ, ఒక అభ్యర్థికిగానీ అనుకూలంగా వ్యవహరిస్తే విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. స్వతంత్ర దర్యాప్తులో ఆరోపణ వాస్తవమని తేలితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. జిల్లాలో 2,881 పోలింగ్ కేంద్రాలు... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాలో 2,805 పోలింగ్ కేంద్రాలు, వాటికి అనుబంధంగా మరో 76 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఒక సమస్యాత్మక పోలింగ్ స్టేషనున్న గ్రామాలు 1,278, రెండు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లున్న గ్రామాలు 380, ఐదు, అంతకంటే ఎక్కువ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లున్న గ్రామాలు 18 ఉన్నాయని వివరించారు. అయితే, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకుగానూ 35 పారామిలటరీ బలగాలు జిల్లాకు రానున్నాయన్నారు. ఒక్కో కంపెనీలో 3 ప్లటూన్లు ఉంటాయని, ఒక్కో ప్లటూన్‌లో 3 సెక్షన్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి సెక్షన్‌లోనూ ఒక అధికారి, మరో 8 మంది సాయుధ సిబ్బంది ఉంటారని వెల్లడించారు. వారంతా స్థానికంగా ఉన్న పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పనిచేస్తారన్నారు. అయితే, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను ముందుగానే గుర్తించి సంబంధిత గ్రామాల్లో ఎంపీడీవో, తహసీల్దారు, పోలీసు అధికారులు కలిసి సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగా పోలీసు కవాతు నిర్వహించి హెచ్చరికలు జారీచేయాలని చెప్పారు. గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన వారిని బైండోవర్ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నగదు, మద్యం పంపిణీపై దృష్టిపెట్టాలి... రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే నగదు, మద్యం నిల్వల సీజ్ విషయంలో మనజిల్లా వెనుకబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 6, 11 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టికల్ సర్వైవలెన్స్ కమిటీలు పకడ్బందీగా వ్యవహరించి నగదు, మద్యం పంపిణీ, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ రెండు కమిటీల్లో నిత్యం వీడియో గ్రాఫర్ అందుబాటులో ఉండాలన్నారు. తనిఖీల సమయంలో పూర్తిస్థాయిలో వీడియో తీయించాలన్నారు. కేవలం నగదు, మద్యం కోసమే కాకుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద యూనిఫాం కలిగిన పోలీసు సిబ్బంది ఒకరుంటారని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఒక అధికారి, మరో ఇద్దరు సిబ్బంది, అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద ఒక అధికారి, నలుగురు సాయుధ సిబ్బంది ఉంటారని కలెక్టర్ వివరించారు. ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ దేవకుమార్ మాట్లాడుతూ తమశాఖ ఇప్పటికే దాడులను తీవ్రం చేసిందని తెలిపారు. గట్టి నిఘా కూడా పెట్టినట్లు తెలిపారు. గత నెలలో లక్ష్యం కన్నా తక్కువ శాతం మద్యం విక్రయాలు జరిగాయన్నారు. యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో నాటుసారా తయారుచేసే అవకాశం ఉందని, అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, డీఆర్వో గంగాధర్‌గౌడ్, జిల్లా పరిషత్ ఏవో ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లోక్‌సభ ఎన్నికలకు నోడల్ అధికారులు.
ఏలూరు, న్యూస్‌లైన్ : రాబోయే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు 15 మంది నోడల్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ సిద్ధార్థజైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావును ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణకు, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ వి.సత్యనారాయణను ఈవీఎంల నిర్వహణకు, ఉప రవాణా కమిషనర్ పి.శ్రీదేవిని రవాణా ఏర్పాట్లకు, డీసీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్‌ను ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణకు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.త్రిమూర్తులును ఎన్నికల సామగ్రికి, డ్వామా పీడీ నరాల రామచంద్రారెడ్డిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు కోసం నోడల్ అధికారులుగా నియమించారు. జిల్లా ఆడిట్ అధికారి సీహెచ్ నారయ్య ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ నాయుడు ఎన్నికల పరిశీలనకు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. శాంతిభద్రతలు, విజిలెన్స్ అండ్ మోనిటరింగ్, రక్షణ ప్రణాళిక అమలుకు సంబంధించి నోడల్ అధికారిగా జిల్లా ఎస్పీ ఎన్.హరికృష్ణ వ్యవహరిస్తారు. సెట్వెల్ సీఈవో పి.సుబ్బారావును బ్యాలెట్ పేపర్ల పర్యవేక్షణ, సమాచార శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎన్.భాస్కర నరసింహం, డీపీఆర్వో ఆర్వీఎస్ రామచంద్రరావు మీడియా కమ్యూనికేషన్, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కె.సత్యనారాయణ కంప్యూటరీకరణ, సోషల్ వెల్ఫేర్ జాయింట్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు, ఎస్వీఈఈపీ, ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలకు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ డి.జ్ఞానేశ్వరరావు హెల్ప్‌లైన్, ఫిర్యాదుల విభాగం నిర్వహణ, జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ ఎం.గంగాధరరావును ఎఫ్ఎంఎస్ పర్యవేక్షణ, కమ్యూనికేషన్ ప్లాన్ నిర్వహణకు నోడల్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఎన్నికల టీం’పై కసరత్తు
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సజావుగా ఎన్నికలు జరపడానికి సమర్థ అధికారులను రంగంలోకి దించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసేందుకు వీలుగా జిల్లా స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తోంది. ఇందులో భాగంగా గురువారం నోడల్ అధికారులతో కలెక్టర్ బి.శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ వెలువడింది మొదలు.. ఫలితాలు ప్రకటించేవరకు ఈ అధికారులు పూర్తిస్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నం కావాల్సివుంటుంది. మరో వారం రోజుల్లో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ ముగియనుండడంతో అప్పటిలోగా కొత్త టీమ్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ భావిస్తున్నారు. నోడల్ ఆఫీసర్లకు సహా యకులుగా కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లను నియమించనున్నారు. నిబంధనలు కఠినం ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేసింది. నియమావళిని తూ.చ. తప్పకుండా పాటించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా.. అమలుకు మరింత మంది అఖిల భారత సర్వీసుల అధికారులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలను సమర్థవంతగా నిర్వహించేందుకు వివిధ స్థాయిల్లో అధికారుల బృందాలను నియమిస్తోంది. ఇప్పటివరకు అభ్యర్థులు సమర్పించే ఎన్నికల ఖర్చుపై నిఘా వహించే పరిశీలకులు ఈసారి మాత్రం వ్యయంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. అభ్యర్థులు ఇచ్చే కాకిలెక్కలే కాకుండా ‘షాడో’ రిజిస్టర్‌ను నిర్వహించనున్నారు. ప్రతిరోజు మండలాల నుంచి వచ్చే వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా అభ్యర్థుల ఖర్చుపై అంచనాలు రూపొందించేందుకు జిల్లా/అసెంబ్లీ స్థాయిలో వీడియో వ్యూయింగ్ టీంను ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందం అభ్యర్థుల వ్యయాన్ని లెక్కగట్టనుంది. ఈ వివరాలను ‘షాడో’ రిజిస్టర్లో పొందుపరుస్తారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల వ్యయంపై ఒక నిర్ధిష్ట అభిప్రాయానికి వస్తారు. పరిశీలకుడికి సహకరించేందుకు వీడి యో వ్యూయింగ్ టీం, అకౌంటింగ్ టీం, కంట్రో ల్ రూమ్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి నిఘాను పెంచేందుకు రెట్టింపు స్థాయిలో ఉద్యోగులను ఎన్నికల విధులకు ఉపయోగించుకోవాలని ఈసీ నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కొత్త నియమావళిని రూపొందించింది. దీనిపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులకు అవగాహన కల్పించేం దుకు ఫిబ్రవరి 5న జూబ్లీహాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ హాజరుకానున్నారు. ఈసీ నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సమర్థ అధికారులతో కూడిన కొత్త జట్టు ఎంపికపై జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ కసరత్తు చేస్తున్నారు.