number-one
-
సఫారీ... మళ్లీ నంబర్‌వన్
శ్రీలంకపై వన్డే సిరీస్ 5–0తో క్లీన్‌స్వీప్ • 26 నెలల తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి • చివరి వన్డేలో 88 పరుగులతో గెలుపు • ఆమ్లా, డి కాక్ సెంచరీలు సెంచూరియన్: ఒకే విజయంతో దక్షిణాఫ్రికా జట్టు రెండు లక్ష్యాలను అధిగమించింది. శ్రీలంకతో శుక్రవారం రాత్రి జరిగిన చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 88 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 26 నెలల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 384 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (87 బంతుల్లో 109; 16 ఫోర్లు), హషీమ్ ఆమ్లా (134 బంతుల్లో 154; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 187 పరుగులు జోడించారు. డు ప్లెసిస్ (34 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బెహర్దీన్ (20 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. లంక బౌలర్లలో సురంగ లక్మల్ మూడు, లాహిరు మధుశంక రెండు వికెట్లు పడగొట్టారు. 385 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసి ఓటమి పాలైంది. అసేలా గుణరత్నె (117 బంతుల్లో 114 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్‌ల) అజేయ సెంచరీ చేయగా... సచిత్ పతిరాణా (62 బంతుల్లో 56; 6 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను గుణరత్నె, పతిరాణా ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం వెంటవెంటనే శ్రీలంక మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లక్మల్ (28 బంతుల్లో 20 నాటౌట్)తో కలిసి గుణరత్నె తొమ్మిదో వికెట్‌కు 97 పరుగులు జత చేసి లంకను ఆలౌట్ కాకుండా చేశాడు. కానీ పరాజయాన్ని మాత్రం తప్పించలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు తీయగా, పార్నెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించగా... డు ప్లెసిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్‌కు ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తాజా సిరీస్ విజయంతో 119 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ చేతిలో 0–2తో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో, 112 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో, 107 పాయింట్లతో ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉన్నాయి. చివరిసారి దక్షిణాఫ్రికా 2014 నవంబరులో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. అదే నెలలో భారత్ 5–0తో శ్రీలంకను ఓడించి టాప్ ర్యాంక్ పొందింది. అదే నెల చివర్లో ఆస్ట్రేలియా 4–1తో దక్షిణాఫ్రికాపై గెలిచి భారత్ నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. గత 26 నెలలుగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా... దక్షిణాఫ్రికా ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. 2002లో ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టాక దక్షిణాఫ్రికా నంబర్‌వన్‌గా నిలువడం ఇది ఐదోసారి. ఈనెల 19న న్యూజిలాండ్‌తో మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెల్చుకుంటే టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆస్ట్రేలియాకు టాప్ ర్యాంక్ దక్కుతుంది. 24.వన్డే మ్యాచ్‌ల్లో 350 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం దక్షిణాఫ్రికాకిది 24వ సారి. గతంలో భారత్ 23 సార్లు ఇలా చేసింది. 14.సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకిది వరుసగా 14వ విజయం. 50.అంతర్జాతీయ క్రికెట్లో ఆమ్లా 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడుగురు క్రికెటర్లలో ఆమ్లా ఒక్కడే తక్కువ (348) ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. 6.దక్షిణాఫ్రికా ఆరుసార్లు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. -
నంబర్‌వన్ మా లక్ష్యం కాదు
* మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యం * టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బెంగళూరు: నిరంతరం మారే ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడదని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అలాగే రానున్న రోజుల్లో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు తామెలా సన్నద్ధమయ్యామో వెస్టిండీస్ పర్యటన తేలుస్తుందని అన్నాడు. తమ లక్ష్యం నంబర్‌వన్‌కు చేరడం కాదని, మంచి క్రికెట్ ఆడడమే తమకు ముఖ్యమని తేల్చాడు. కరీబియన్ టూర్‌కు వెళ్లే ముందు కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి చిన్నస్వామి స్టేడియంలో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. విండీస్‌తో ఈనెల 21 నుంచి భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేస్తే భారత్ నంబర్‌వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. ‘ఓ టెస్టు జట్టుగా మాకు మేము సవాల్‌ను ఎదుర్కొంటూ ఓ అంచనాకు రావడానికి ఇదే సరైన అవకాశం. భవిష్యత్‌లో మేమెలా ఆడతామో కొన్ని నెలల్లో తేలుతుంది. ఈ ఫార్మాట్లో నంబర్‌వన్ ర్యాంకును పొందడం మా లక్ష్యం కాదు. మా ప్రధాన లక్ష్యం మంచి క్రికెట్ ఆడడమే. ఒక్కో టెస్టుపై దృష్టి పెడుతూ ముందుకు సాగుతాం’ అని కోహ్లి అన్నాడు. టెస్టు జట్టులో కేఎల్ రాహుల్ ఉన్నా కీపర్‌గా తమ తొలి ప్రాధాన్యం వృద్ధిమాన్ సాహాకేనని తేల్చాడు. దాదాపు 15 నెలలు భారత జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ నాణ్యమైన బౌలర్ అని కొనియాడాడు. టెస్టు మ్యాచ్‌లకు అతడి లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా సరిపోతుందని, విండీస్ పిచ్‌లపై అతడు రాణించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. విరాట్ దూకుడును అడ్డుకోను: కుంబ్లే మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడును తాను అడ్డుకోనని కోచ్ కుంబ్లే తెలిపారు. అయితే తామంతా భారత రాయబారులమనే విషయాన్ని కూడా క్రికెటర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని గుర్తుచేశారు. ఏ ఆటగాడి సహజసిద్ధమైన దూకుడును తాను అడ్డుకోనని, కానీ క్రికెట్ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం కూడా వారిపైనే ఉందని అన్నారు. రానున్న 17 టెస్టుల్లో నిలకడగా ఆడి వీలైనన్ని మ్యాచ్‌లను గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆటను ఆస్వాదించండి: ధోని బిజీ షెడ్యూల్ ముందుండడంతో మైదానం వెలుపలా, లోపలా సరదాగా ఉండడం ఎంతో ముఖ్యమని వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆటగాళ్లకు తెలిపాడు. ఆదివారం జరిగిన డ్రమ్ సర్కిల్లో పాల్గొన్న అనంతరం కొద్దిసేపు క్రికెటర్లతో సంభాషించాడు. తొలిసారిగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కలిగిన అనుభూతే క్రికెట్లోనూ చూపించాలని అన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన టెస్టు జట్టు ఇక సత్తా నిరూపించుకుని భవిష్యత్‌పై భరోసా కల్పించేలా ఆడాల్సిన తరుణం ఇదేనని వారికి హితబోధ చేశాడు. -
రియల్టీలో నంబర్‌వన్‌గా హైదరాబాద్
♦ ఆ దిశగా నిర్మాణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ♦ మార్చి తర్వాత నగరంలో రియల్‘బూమ్’ ♦ రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్ ఆశాభావం సాక్షి, హైదరాబాద్: ఐటీతో పాటు నిర్మాణ, స్థిరాస్థి రంగాల్లోనూ హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. స్థిరాస్తి, నిర్మాణ రంగాల అభివృద్ధి కోసం విప్లవాత్మక సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మార్చి తర్వాత హైదరాబాద్‌లో రియల్ బూమ్ మరింత ఊపందుకుంటుందని జోస్యం చెప్పారు. నిర్మాణ రంగానికి చెందిన నాలుగు సంస్థలు సంయుక్తంగా మంగళవారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ‘రియల్ ఎస్టేట్ సమ్మిట్’లో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దశాబ్దకాలంగా నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న 40 సమస్యల్లో 31 సమస్యలను ఏకకాలంలో పరిష్కరించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ‘‘అవినీతికి తావులే కుండా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డింగ్ పర్మిషన్లు, లే అవుట్ల అనుమతులు నిర్దేశిత సమయంలో లభించేలా టీఎస్ ఐపాస్ తరహాలో ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తాం. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా అనుమతులు రాకుంటే వచ్చినట్లుగానే పరిగణించేలా చర్యలు చేపడతాం. బాధ్యులైన అధికారులకు గడువు తర్వాత రోజుకు రూ.500 చొప్పున జరిమా నా విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ కంపెనీలు జాతీయ స్థాయిలో పోటీలో నిలదొక్కుకునేలా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తాం. హైదరాబాద్‌లో సగటు మనిషి ప్రధానంగా రహదారులు, నిరంతర విద్యుత్, విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కోరుకుంటారు. ఇవన్నీ కల్పించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు’’ అని వివరించారు. అపోహలు తొలగిపోయాయ్.. తెలంగాణ ఏర్పడక ముందు నగర ప్రజల్లో ఎన్నో అనుమానాలు, అపోహలు నెలకొన్నాయని కేటీఆర్ అన్నారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రులతో పాటు ఇతర రాష్ట్రాల వారిని కట్టుబట్టలతో పంపేస్తారని నాడు ప్రచారం జరిగింది. గత 19 నెలల్లో ఏ ఒక్కరికీ శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందుకోసం పోలీసులకు రూ.350 కోట్లతో అధునాతన వాహనాలను సమకూర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ప్రత్యేక రాష్ట్రంలో కరెంటుండదని, చిమ్మచీకట్లు అలముకుంటాయని అపోహలొచ్చాయి. కానీ సీఎం కృషి ఫలితంగా నగరవాసులకు ప్రస్తుతం నిరంతర విద్యుత్ అందుతోంది. రాష్ట్రం విడిపోతే పెట్టుబడులు రావనీ సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రభుత్వం తెచ్చిన టీఎస్ఐపాస్తో గత 8 నెలల్లో ఏకంగా 1,000 కంపెనీలకు అనుమతులిచ్చాం. రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. ఆయా కంపెనీల్లో దాదాపు లక్షమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. హైదరాబాద్ జనాభా ఏకంగా 10 కోట్లు దాటినా తాగునీటి ఇబ్బందులు ఉండకుండా శామీర్‌పేట్, రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంతాల్లో రూ.7,600 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నాం. నగరంలో 55 జంక్షన్లను ఆధునీకరిస్తున్నాం. రూ.11 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వేలు, మూసీ తీరం వెంబడి 8 వేల కోట్లతో 42 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి ఏర్పాటు చేస్తాం’’ అని వివరించారు. గతేడాది నగరంలో కమర్షియల్ స్పేస్ పెరిగినంతగా గృహ నిర్మాణం పెరగలేదన్నారు. అయినా దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో జీవన వ్యయం అత్యంత తక్కువన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్ అధ్యక్షుడు రామిరెడ్డి, బీడీఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ట్రెడా అధ్యక్షుడు దశరథరెడ్డి, టీబీఏ అధ్యక్షుడు జీవీ రావు, నెరెడ్కో అధ్యక్షుడు చలపతిరావు, ప్రదీప్ కన్సట్రక్షన్స్ చైర్మన్ ప్రదీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రకాశ్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గౌతమ్‌తో కలిసి నటించాలనుంది!
సరిగ్గా యాభై ఏళ్ల క్రితం ఈ రోజే సూపర్‌స్టార్ కృష్ణ తొలి చిత్రం ‘తేనె మనసులు’ విడుదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన చేసిన సినిమాలు... ప్రయోగాలు... సాహసాలు తెలుగు తెరను సుసంపన్నం చేశాయి. తన స్వర్ణోత్సవ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ కృష్ణ పత్రికల వారితో ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు. ఈ 50 ఏళ్లల్లో విజయాలూ చూశాను, అపజయాలూ చూశాను. విజయాలకు పొంగిపోలేదు... అపజయాలకు కుంగిపోలేదు. రెంటినీ సమానంగా తీసుకున్నా. పనిలోనే ఆస్వాదన పొందా. ఖాళీగా ఉండటం నాకస్సలు ఇష్టం ఉండేది కాదు. తొలి పదేళ్లల్లో రోజుకు మూడు షిఫ్టులు పని చేశా. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ పని చేశా. ఇలా చేసినా మళ్లీ ఉదయం 7 గంటలకు ఠంచనుగా షూటింగ్‌కి వెళ్లిపోయేవాణ్ణి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా, పంపిణీదారునిగా, ప్రదర్శకునిగా, ఎడిటర్‌గా... ఇలా సినిమా పరిశ్రమతో నాది విడదీయలేని బంధం. అన్ని రకాల పాత్రలూ చేశాను. కానీ ‘ఛత్రపతి శివాజి’ సినిమా చేయాలనే కోరిక మాత్రం మిగిలిపోయింది. అప్పటికీ ‘డాక్టర్-సినీ యాక్టర్’, ‘నంబర్‌వన్’ సినిమాల్లో శివాజీ గెటప్‌లో కొద్దిసేపు కనిపించి ముచ్చట తీర్చుకున్నా. మహేశ్ నా పేరు నిలబెట్టాడు. తనకు నేను సలహాలు ఇవ్వడం అంటూ ఉండదు. నిర్ణయాలన్నీ అతనే తీసుకుంటాడు. మహేశ్‌ని జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో చూడాలని నా కోరిక.‘ప్రేమకథా చిత్రమ్’ను హిందీలో పద్మాలయా బేనర్లో త్వరలో రీమేక్ చేయబోతున్నాం. మారుతి డెరైక్ట్ చేస్తాడు. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని ఆ మధ్య కొన్ని సినిమాలు చేశాను. నేను అలాంటి సినిమాలు చేయడం అభిమానులకు ఇష్టం లేదు. అందుకే ఇకపై మంచి పాత్ర అయితేనే, అదీ పెద్ద సినిమా అయితేనే నటిస్తా. కథ కుదిరితే నా మనవడు గౌతమ్‌తో కలిసి నటించాలనుంది.