Oil Up Stream Companies
-
ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
ప్రభుత్వ ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 6శాతం, నాన్ మేనేజిరియల్ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి. -
భారత ఆర్థిక వ్యవస్థకు చమురు సెగ!
లండన్: అంతర్జాతీయ మార్కెట్ బ్రెంట్ ధర బేరల్‌కు గురువారం మూడేళ్ల గరిష్టస్థాయి 77.75 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9.30 గంటల సమయంలో ఇదే రేటు వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా 74.75 వద్ద గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోంది. మధ్య ప్రాశ్చ్య దేశాల్లో ఉద్రిక్తతలు, అమెరికాలో పెరిగిన క్రూడ్ డిమాండ్, క్రూడ్ 100 డాలర్లకు చేరాలని సౌదీ అరేబియా భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఈ కమోడిటీ పరుగుకు దారితీస్తున్నాయి. తన చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులపై ఆధారపడే భారత్ ఆర్థిక వ్యవస్థపై క్రూడ్ ధరల పెరుగుదల తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు, తద్వారా క్యాడ్ (ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) ప్రతికూలతలు, ఈ నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి బలహీనతలు, స్టాక్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి పరిస్థితులు భారత్ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే కనబడుతున్న సంగతి తెలిసిందే. చతికిలపడిన చమురు షేర్లు... చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ 4–7 శాతం రేంజ్లో పతనమయ్యాయి. ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎమ్ఆర్పీఎల్ షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. -
సబ్సిడీ తోడ్పాటుతో బీపీసీఎల్‌కు లాభాలు
నికర లాభం రూ.551 కోట్లు న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.551 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇంధన అమ్మకాలపై వచ్చిన నష్టాలకు పూర్తి పరిహారం లభించడమే దీనికి కారణమని వివరించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో నిల్వ నష్టాలు రూ.1,600 కోట్లుగా ఉన్నప్పటికీ ఈ స్థాయి నికర లాభం సాధించామని బీపీసీఎల్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,080 కోట్ల నగదు సబ్సిడీని, ఓఎన్జీసీ వంటి అయిల్ అప్‌స్ట్రీమ్ కంపెనీలు రూ.2,333 కోట్లు చెల్లించాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,089 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ3లో రూ.64,768 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ క్యూ3లో రూ.57,915 కోట్లకు, స్థూల రిఫైనింగ్ మార్జిన్ 1.76 డాలర్ల నుంచి 1.54 డాలర్లకు తగ్గిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 2.7 శాతం వృద్ధితో రూ.725కు పెరిగింది.