organs dontate
-
అవయవదానంతో ముగ్గురికి పునర్జన్మ!
విజయవాడ (లబ్బీపేట): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడు అవయవదానంతో ముగ్గురిని పునర్జన్మనివ్వగా, ఇద్దరికి చూపు ప్రసాదించారు. విజయవాడ పటమట పంటకాలువ రోడ్డులో నివసించే రేగాని భవానీప్రసాద్(27) ఈ నెల నాలుగో తేదీ అర్ధరాత్రి ఏలూరురోడ్డుపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా, అప్పటి నుంచి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 12వ తేదీన బ్రెయిన్‌డెడ్ అయింది. వైద్యులు అవయవదానంపై భవానీప్రసాద్ తల్లి లక్ష్మీనారాయణమ్మ, సోదరుడు రమణలకు వివరించగా వారు అంగీకరించారు. జీవన్‌దాన్ ట్రస్టుకు సమాచారం అందచేశారు. అనంతరం బ్రెయిన్‌డెడ్‌కు గురైన భవానీప్రసాద్‌ను సూర్యారావుపేటలోని అరుణ్ కిడ్నీకేర్ సెంటర్‌కు తరలించి రెండు కిడ్నీలు, రెండు కళ్లు, లివర్‌ను సేకరించారు. ఒక కిడ్నీని అక్కడే ఒకరికి అమర్చగా, మరో కిడ్నీని ఆయుష్ హాస్పిటల్‌కు, లివర్‌ను మణిపాల్ ఆస్పత్రికి, కళ్లను వాసన్ ఐకేర్‌కు తరలించారు. డాక్టర్ అమ్మన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదానికి గురైన భవానీ ప్రసాద్ తలకు బలమైన గాయమైందని, శరీరంపై మరెక్కడా గాయాలు లేవన్నారు. -
ముగ్గిరికి ప్రాణమిచ్చాడు
తిరుపతి సిటీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ స్థితిలో ఉన్న యువకుడు బుధవారం మరో ముగ్గురి ప్రాణాలను ఆదుకున్నాడు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం దిన్నెమీదపల్లికి చెందిన రెడ్డెప్పరెడ్డి ఈనెల 21న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతిలోని స్విమ్స్‌కు తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి రెడ్డెప్పరెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్టు నిర్ధారించారు. స్విమ్స్ వైద్యులు విజయవాడలోని జీవన్‌ధాన్ ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మురళీకృష్ణకు సమాచారం అందించారు. వెంటనే రెడ్డెప్పరెడ్డి భార్య మాలతి, కుటుంబ సభ్యులతో సంప్రదించి అవయవ దానానికి అనుమతించాలని కోరారు. వారు అంగీకరించడంతో వైద్యులు బుధవారం రాత్రి గుండెను, రెండు కిడ్నీలను తీసుకున్నారు. గుండెను చెన్నై మిషన్ హాస్పిటల్‌కు తరలించారు. ఒక కిడ్నీని తిరుపతి స్విమ్స్‌లోని చిన్నబ్బ అనే రోగికి అమర్చనున్నట్టు వైద్యులు తెలిపారు. మరో కిడ్నీని నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలకు తరలించారు. రెడ్డెప్ప రెడ్డి భార్య మాలతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. వారికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది.