Pomegranate
-
తేలిగ్గా బరువు తగ్గించే దానిమ్మ!
దానిమ్మ గుండెజబ్బులను నివారిస్తుందన్నది చాలామందికి తెలిసిందే. అయితే అది బరువు పెరగకుండా చూడటం వల్ల ఒబేసిటీ కారణంగా వచ్చే అనేక ఆరోగ్య అనర్థాలను కూడా నివారిస్తుంది. దానిమ్మతో బరువు తగ్గడానికి కారణమూ ఉంది. అదేమిటంటే... ఇందులో 7 గ్రాముల పీచు ఉండటం వల్ల అది కడుపు (స్టమక్) ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుతుంది. అంతేకాదు దానిమ్మపండులో 3 గ్రాముల ప్రోటీన్, విటమిన్ సీ, విటమిన్ కె అనే ప్రధాన విటమిన్లతోపాటు పొటాషియమ్ వంటి హైబీపీని నియంత్రించేందుకు సహాయపడే లవణాలూ ఉన్నాయి. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉన్నందున బరువు తగ్గించడానికి దానిమ్మపండు బాగా ఉపయోగపడుతుంది.(చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!) -
గర్భిణులు దానిమ్మ రసం తాగితే.. పిల్లలకు ఏమవుతుందో తెలుసా?
పిండం మెదడు ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేసే ఓ ఆరోగ్య సమస్యను దానిమ్మ రసంతో నివారించొచ్చని బ్రైగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంట్రాయుటేరియన్ గ్రోత్ రిస్ట్రిక్షన్(ఐయూజీఆర్)అని పిలిచే ఈ సమస్య ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరిని పీడిస్తుంది. పిండానికి ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలను అందించే ఉమ్మనీటిలో తేడాలుంటే వచ్చే ఐయూజీఆర్కు దానిమ్మతో చెక్ పెట్టొచ్చని అధ్యయనంలో రుజువైంది. దానిమ్మలో పుష్కలంగా ఉండే పాలీఫినాల్స్ మెదడు వరకు నేరుగా ప్రవేశించగలవని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. ఐయూజీఆర్ సమస్య ఉన్న 78 మంది గర్భిణులను ఎంచుకుని వారిలో సగం మందికి కాన్పు వరకు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం అందించారు. మిగిలిన వారికి పాలీఫినాల్స్ లేని జ్యూస్ అందించారు. అందరి కాన్పుల తర్వాత పిల్లలను పరిశీలించగా.. దానిమ్మ రసం తీసుకున్న తల్లుల పిల్లల మెదళ్లలోని కనెక్షన్లు బలంగా ఉన్నట్లు తెలిసింది. -
దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్ పెడుతుందో తెలుసా!
దానిమ్మ పండు, పువ్వులు, బెరడు, వేర్లు ఆకులు అనేక వ్యాధులు చికిత్స చేయడానికి ఉపయోగించేలా పాలీఫెనాల్స్ వంటి రసాయనాలను కలిగి ఉంటాయి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నిఇన్ని కావు. ఇది జీర్ణ రుగ్మతలు, చర్మ రుగ్మతలు, పేగు సంబధింత వ్యాధులకు చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద డైటిషన్ శిరీష రాకోటి. ఈ పండును తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి రావో డైటిషన్ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందామా!. ఇందులో వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఒక పోషకమైన పండు దానిమ్మ. ఈ పండ్లను తీసుకోవడం ఏఏ వ్యాధులు దరిదాపుల్లోకి రావంటే.. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ ప్యూనికాలాగిన్స్ ఎలాజిక్ యాసిడ్ వంటి పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మీ శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు. రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల వృద్ధులలో జ్ఞాపకశక్తి పెరిగేలా మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంది. అంతేగాదు కొన్ని అధ్యయనాలు దానిమ్మ సారం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని సూచించాయి, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంమీద, దానిమ్మ, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఆఖరికి వంధ్యత్వాన్ని నయం చేయడానికి కొన్ని దేశాల్లో దానిమ్మపండ్ల రసాన్ని ఉపయోగిస్తారని అధ్యయనాలు తెలిపాయి... ---శిరీష రాకోటి, ఆయుర్వేద డైటిషన్ (చదవండి: మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!) -
ప్రకృతి సేద్యం.. దానిమ్మ తోటతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం అందిస్తున్న మార్గదర్శకత్వంలో ప్రకృతి సేద్యం చేస్తూ దానిమ్మ తోటలో చక్కని దిగుబడిని పొందుతూ శభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నారు రైతు రవి ప్రతాప్ రెడ్డి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం కొత్తలం గ్రామానికి చెందిన రవి ప్రతాప్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తూ.చ. తప్పకుండా పాటిస్తూ 6 ఎకరాల్లో భగువ రకం దానిమ్మ పంటను సాగు చేసి తక్కువ ఖర్చుతోనే అధిక లాభాలు పొందుతున్నారు. 2021 ఫిబ్రవరిలో దానిమ్మ మొక్క రూ.40 చొప్పున కోనుగోలు చేసి, 12“12 అడుగుల దూరంలో ఎకరాకు 350–380 వరకు మొక్కలను నాటి డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. గత ఏడాది మొదటి పంటలో రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ప్రసుత్తం రెండున్నరేళ్ల వయసులో రెండో పంట కోతకు సిద్ధంగా ఉంది. చెట్ల నిండా కాయలు ఉండటంతో కన్నుల పండువగా ఉంది. రైతులు, వ్యాపారులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పాత్రికేయులు, నిపుణులు సైతం ఈ తోటను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆరెకరాల్లో 40–42 టన్నుల దానిమ్మ దిగుబడి వస్తుందని, రూ. 45 లక్షల వరకు ఆదాయం రావచ్చని రవి ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నారు. అదే విధంగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 13 ఎకరాల్లో అల్లనేరేడు పంటను సాగు చేసిన ఆయన రూ.8 లక్షల ఆదాయం పొందారు. ఎకరానికి ఖర్చు రూ. 25 వేలు! రసాయనిక వ్యవసాయం చేసే దానిమ్మ తోటను తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి రోజు మార్చి రోజు ఏదో ఒక మందు కొడుతూనే ఉంటారు. దాంతో ఖర్చు ఎకరానికి ఏడాదికి రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, తన తోటలో జీవామృతం, కషాయాలకు మొత్తంగా రూ. 25 వేలే ఖర్చయ్యిందని రవి ప్రతాప్ రెడ్డి తెలిపారు. చెట్టుకు 2 కేజీల ఘనజీవామృతం వేసిన తర్వాత నామాస్త్రం, సొంఠిపాల కషాయం, జీవామృతం అవసరం మేరకు క్రమం తప్పకుండా శ్రద్ధగా తయారు చేసుకొని అందిస్తున్నారు. నాలుగు నాటు ఆవుల పేడ, మూత్రం వినియోగిస్తున్నారు. కాయ కుళ్లు తెగులు వచ్చిందంటే రసాయనిక సేద్యం చేసే తోటల్లో కంట్రోల్ కాదు. అయితే, ప్రకృతి సేద్యంలో దీని నివారణకు సొంఠిపాల కషాయం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆరోగ్యంగా పెరగటం వల్లనే చీడపీడల బెడద కూడా లేదని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం మాస్టర్ ట్రైనర్ రమేష్, డీపీఎం లక్ష్మానాయక్ ప్రత్యేక శ్రద్ధతో ఎప్పటికప్పుడు అందిస్తున్న సూచనలు, సలహాలను పూర్తిగా పాటించటం వల్ల సత్ఫలితాలు పొందగలుగతున్నానని రైతు రవి ప్రతాప్ రెడ్డి తెలిపారు. మడకశిర డివిజన్ పరిధిలోని 134 గ్రామాల్లో 16,662 మంది రైతులు 32 వేల ఎకరాల్లో ప్రకృతి వ్వయసాయ పద్ధతుల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. గత నెలలో జర్నలిస్టులు ఢీల్లీకి చెందిన సునీతా నారాయణ్, క్రిస్టియన్ గ్రేప్తో పాటు జర్మనీకి చెందిన రాజ్ పటేల్, అమెరికాకు చెందిన ప్రణయ్ తదితరుల బృందం తన తోటను సందర్శించి ఆశ్చర్యచకితులయ్యారని ఆయన సంతోషంగా చెప్పారు. – ఎస్.క్రిష్ణారెడ్డి, సాక్షి, మడకశిర రూరల్, శ్రీసత్యసాయి జిల్లా చెప్పింది చెప్పినట్టు చేసే రైతు! ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను చెప్పింది చెప్పినట్టు వంద శాతం పాటించే నిబద్ధత కలిగిన రైతు రవిప్రతాప్రెడ్డి. దానిమ్మ చెట్ల మధ్య 30 రకాల విత్తనాలను వానకు ముందే విత్తి(పిఎండిఎస్), పెరిగిన తర్వాత కోసి మల్చింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి. మడకశిర ప్రాంతంలో ఈ ఏడాది సగం కన్నా తక్కువ వర్షతపామే నమోదైంది. అయినా మంచి పంట దిగుబడి వచ్చింది. రెండున్నర ఏళ్ల దానిమ్మ తోటలో ఎకరానికి 7 టన్నుల దిగుబడిని అతి తక్కువ ఖర్చుతోనే రవిప్రతాప్రెడ్డి సాధించారు. – లక్ష్మణ్ నాయక్ (83310 57583), జిల్లా ΄జెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, శ్రీసత్యసాయి జిల్లా ఓపికగా చెయ్యాలి ప్రకృతి సేద్యాన్ని శ్రద్ధగా, ఓపికగా చేయాలి. ముందుగానే ప్రణాళిక ప్రకారం జీవామృతం, కషాయాలను జాగ్రత్తగా తయారు చేసుకొని వాడాలి. జీవామృతం కలిపిన 8 రోజులు మురగబెట్టి వాడాలి. రోజూ రెండు పూటలు కలియదిప్పాలి. దీనికి వాడే శనగపిండి సొంతంగా మరపట్టించుకొని వాడాలి. మార్కెట్లో కొని వాడితే కల్తీ వల్ల ఫలితం సరిగ్గారాదు. నన్ను చూసి పది మంది రైతులైనా మారితే అదే నాకు సంతోషం. సొంతంగా తయారు చేసుకొని వాడే ద్రావణాలు, కషాయాలు చాలు మంచి దిగుబడులు పొందడానికి. కెమికల్స్, బయో/ఆర్గానిక్ ఉత్పత్తుల కొని వాడటం ప్రమాదకరం. – రవి ప్రతాప్‌రెడ్డి(93989 80129), దానిమ్మ రైతు, కొత్తలం, మడకశిర మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
దానిమ్మతో కేక్ టేస్ట్ అదిరిపోతుంది.. వీకెండ్లో ట్రై చేయండి
దానిమ్మ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు దానిమ్మ గింజలు – అర కప్పు పైనే కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు అరటి పండు గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు పాలు – పావు లీటర్ పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో పాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటి పండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాతరంగా ఒత్తుకుని.. గట్టిపడనివ్వాలి. వాటిపై దాల్చిన చెక్క పొడి, దానిమ్మ గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. -
సేంద్రియ విధానంలో దానిమ్మ సాగు..!
-
దానిమ్మ తొక్కలను పడేస్తున్నారా? ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
పండ్లు తిన్న తర్వాత సాధారణంగా తొక్కలను పారేస్తుంటాం. కానీ ఆ తొక్కల్లో ఫైబర్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. దానిమ్మ పండు విషయానికి వస్తే.. దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యంతో ఉన్నవారికి దివ్య ఔషధం దానిమ్మ. ఎన్నో సమస్యలను ఈ పండు నయం చేస్తుంది. దానిమ్మ పండే కాదు, తొక్క కూడా చాలా ఉపయోగకరం. దీనిలో యాంటిఆక్సిడెంట్స్ ,ఫినోలిక్ యాసిడ్స్,ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. అసలు దానిమ్మ తొక్క ప్రయోజనాలు తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దానిమ్మను ఇష్టపడతారు. దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్-సి, కె, బి, ఎ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలోని గుణాలు గుండెసమస్యలు, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక దానిమ్మ గింజల్లోనే కాదు, తొక్కలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా పెంచుతుంది. దానిమ్మ రసం కంటే తొక్కలో 50శాతం అదిక మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు ► దానిమ్మ తొక్కల్లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ► చర్మ క్యాన్సర్‌ని తగ్గించడంలో దానిమ్మ తొక్కలు బాగా పనిచేస్తాయి. హానికరమైన యూవీఏ కిరణాల నుంచి ఇది రక్షిస్తుంది. దానిమ్మ తొక్కలతో పొడి చేసుకొని దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది. ► దానిమ్మ తొక్కలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల చక్కెర స్థాయిలను తగ్గించి బరువును కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. ► దానిమ్మ తొక్కలను మరిగించి ఆ రసాన్ని తాగితే కీళ్లనొప్పలు, గొంతునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ► దానిమ్మలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ తొక్కల రసాన్ని మహిళల్లో పీరియడ్స్ సమస్య తగ్గిపోతుంది. ► దానిమ్మ తొక్కలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి...తొక్కలను శుభ్రంగా కడిగి రసం తీసి తాగితే , ఆరోగ్యానికి మంచిది. ► కప్పు నీటిలో టీస్పూను దానిమ్మ పొడి, అరచెక్క నిమ్మరసం వేసి తాగినా మంచిదే. దానిమ్మ పొడి చేసుకోండిలా.. దానిమ్మ గింజలను తిని తొక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తొక్కలను ఎండలో ఆరబెట్టాలి. చక్కగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిచేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. దానిమ్మతో అందం, మొటిమలు మాయం టేబుల్‌స్పూను దానిమ్మ పొడిలో అరటేబుల్ స్పూను నిమ్మరసం, అరటేబుల్ స్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు స్క్రబ్బర్‌లా రుద్ది కడగాలి. ఈ స్క్రబర్ వల్ల మృతకణాలు , ట్యాన్ తొలగి ముఖ చర్మం మృదువుగా మారుతుంది. దానిమ్మ తొక్కలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే.. దానిమ్మ పొడిలో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. వయస్సురీత్యా వచ్చే ముడతలను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పొడిని రాసుకుంటే మార్పు మీకే కనిపిస్తుంది. కొబ్బరినూనెలో దానిమ్మ తొక్కలను కలపి వేడిచేసి చల్లారాక తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. దానిమ్మ తొక్కలు చర్మం pHని సమతుల్యం చేస్తుంది. తేమగా ఉంచుతంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. హానీకరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. -
దానిమ్మ తెగుళ్లకు చెక్
-
కనీసం 3 నెలల పాటు ప్రతిరోజు దానిమ్మ తింటే! ఇక తొక్కలు పొడి చేసి
ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు అంటే ఎక్కువ మంది యాపిల్ గురించి మాట్లాడతారు. కానీ దానితో సమానంగా దానిమ్మ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. దీనివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాట్, స్వీట్ డిష్, ఐస్ క్రీమ్, స్మూతీస్ ఇలా ఏది చేసినా దాని మీద తప్పనిసరిగా గార్నిషింగ్ కోసం దానిమ్మ గింజలను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఏదోవిధంగా దానిమ్మను తీసుకోవడం వల్ల ధమనుల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటే తప్పకుండా దానిమ్మ పండ్లు తినడం అలవాటు చేసుకోండి. దానిమ్మ వల్ల ప్రయోజనాలు ►దానిమ్మ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పోషకాలతో నిండి ఉంటుంది. తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ►యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వ్యాధులను నిరోధించేందుకు సహాయపడతాయి. ►వృద్ధాప్యానికి దారితీసే ఫ్రీ రాడికల్స్ నుంచి మనలని రక్షిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. శరీరం నుంచి అదనపు కొవ్వుని తొలగించడంలో సహాయపడుతుంది. ►రక్తాన్ని పలుచన చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరిచి రక్తప్రసరణకి ఎటువంటి హాని కలగకుండా చూస్తుంది. ►జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే మలబద్ధకం సమస్య దరిచేరదు. కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు తింటే.. ►దానిమ్మలోని గుణాలు ధమనుల్లో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తాయి. దానిమ్మ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ►గుండె పోటు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. ►అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు మూడు దానిమ్మ పండ్లు తింటే చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కార్డియో వాస్కులర్ డిసీజ్ బారిన పడకుండా కాపాడుతుంది. ►రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు మందులు వాడే ముందు రోజూ దానిమ్మను తిని చూడటం ఉత్తమం. ఎందుకంటే దానిమ్మ ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. తొక్కల్లో కూడా.. ►దానిమ్మ పండులోనే కాదు తొక్కల్లో కూడా విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 పోషకాలు ఉన్నాయి. ►అందుకే దానిమ్మ గింజలు తిన్నతర్వాత తొక్కలు పడేయకుండా వాటిని ఎండబెట్టి పొడి చేసుకుని పెట్టుకోండి. ►కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు దానిమ్మ తొక్కలు ఎండబెట్టుకుని చేసుకున్న పొడిని నీళ్ళలో వేసి మరిగించి తాగితే మంచిది. ►దానిమ్మ తొక్కల పొడిని వేడి నీళ్ళలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యను అధిగమించవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Summer Healthy Juices: టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే! Beauty Tips: ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్‌తో.. మచ్చలకు చెక్! ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది! -
Health Tips: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..
Monsoon Healthy Diet: వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వంటివి సహజం. మరి ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా వర్షపు జల్లులు ఆస్వాదించాలంటే రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలి? ఈ 5 రకాల పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వానా కాలంలోని అసలైన మజాను ఆస్వాదించేందుకు అప్పుడప్పుడూ వేడి వేడి ఛాయ్.. పకోడీలు, బజ్జీలు లాగించినా తరచుగా వీటిని మాత్రం తినడం మరిచిపోవద్దని చెబుతున్నారు. జామూన్ అల్ల నేరేడు పండ్లంటే ఇష్టపడని వారు అరుదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో తోడ్పడుతుంది. ఇందులోని కొలాజెన్ కాంతివంతమైన మెరిసే చర్మానికి కారణమవుతుంది. విటమిన్ బి, సీతో పాటు కాల్షియం, ఐరన్ కలిగి ఉంటుంది జామూన్. యాపిల్ రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదంటారు.యాపిల్‌లో ఉండే ఆరోగ్య కారకాలు అలాంటివి మరి! ఇందులో విటమిన్ సీ, ఫ్లావనాయిడ్స్ అధికం. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. దానిమ్మ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు మెండు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకున్న వారు దానిమ్మ పండ్లు తింటే సరి. నిజానికి డిటాక్సిఫికేషన్(శరీరంలో విష పదార్థాలు తొలగించడం)లో గ్రీన్ టీ తాగడం కంటే.. దానిమ్మ తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సెలబ్రిటీ న్యూట్రీషనిస్ట్ ల్యూక్ కౌటినో చెబుతున్నారు. అరటిపండు అందరికీ అందుబాటు ధరలో ఉంటే అరటిపండులో విటమిన్ బీ6 ఎక్కువ. ఇది రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. ఇక అరటిపండును నేరుగా తినడం ఇష్టపడని వాళ్లు చక్కగా స్మూతీలు, షేక్స్ చేసుకుని తాగితే బెటర్. చదవండి: Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! పియర్స్(బేరి పండు) పియర్స్‌లో పొటాషియం, విటమిన్ సీ అధికం. దీని తొక్క కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లావనాయిడ్స్ ఎక్కువ. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. చదవండి: Rainy Season Healthy Diet: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్ వద్దు.. ఇవి తినండి! -
Summer Drinks: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్.. పోషకాలెన్నో! రోజుకో గ్లాస్ తాగితే
Summer Drink- Pomegranate Strawberry Juice: స్ట్రాబెరీలో విటమిన్ సి, కె, పీచుపదార్థం, ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్, పొటా షియం పుష్కలంగా ఉంటాయి. ఇక, దానిమ్మగింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఇ, కె, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. కాబట్టి దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్‌తో పై పోషకాలన్నీ శరీరానికి అంది.. జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు, అధిక రక్తపీడనం నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజ పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీకి కావలసినవి: ►దానిమ్మ గింజలు –రెండు కప్పులు ►స్ట్రాబెరీలు – ఆరు ►రాక్‌సాల్ట్ – టీస్పూను ►జీలకర్రపొడి – అరటీస్పూను ►నీళ్లు – పావు కప్పు ►ఐస్ క్యూబ్స్ – పది. దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీ: ►స్ట్రాబెరీలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి. ►బ్లెండర్లో దానిమ్మ గింజలు, స్ట్రాబెరీ ముక్కలు, రాక్ సాల్ట్‌ను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ను విడిగా తీసుకోవాలి. ►ఇప్పుడు జ్యూస్‌లో జీలకర్రపొడి, ఐస్‌క్యూబ్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. జ్యూస్ మరింత రుచిగా ఉండాలంటేæ తేనెను కలుపుకోవచ్చు. ►తాజాగా ఉన్న స్ట్రాబెరీ, దానిమ్మ గింజలతో చేసే ఈడ్రింక్ మంచి రిఫ్రెషింగ్ జ్యూస్‌గా పనిచేస్తుంది. ►దీనిలో పంచదార వేయకపోవడం, వీగన్, గులెటిన్ ఫ్రీ కూడా కాబట్టి ఉపవాసంలో ఉన్నవారు కూడా ఈ జ్యూస్‌ను నిరభ్యంతరంగా తాగవచ్చు. వేసవిలో ట్రై చేయండి: Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -
రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే..
కావలసినవి బీట్రూట్ – మీడియం సైజువి రెండు, దానిమ్మ – రెండు, పుదీనా ఆకులు – పది, తేనె – రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – అరచెక్క. తయారీ విధానం ►బీట్రూట్ను తొక్కతీసి ముక్కలుగా తరగాలి ►దానిమ్మ గింజలను ఒలుచుకోవాలి ►బ్లెండర్లో బీట్రూట్ ముక్కలు, దానిమ్మ గింజలు, పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేయాలి ►గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడపోసి జ్యూస్‌ను గ్లాసులో పోయాలి ► దీనిలో తేనె, నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవాలి. దానిమ్మ-బీట్రూట్ జ్యూస్ ఉపయోగాలు ►వేసవిలో దాహం తీర్చే డ్రింకేగాక, మంచి డీటాక్స్ డ్రింక్‌గా ఈ జ్యూస్ పనిచేస్తుంది. ► బీట్రూట్ రోగనిరోధక వ్యస్థను మరింత దృఢంగా మారుస్తుంది. ►దానిమ్మ గింజలు, బీట్ రూట్‌ను కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది ►ఈ జ్యూస్‌లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ►బీట్రూట్లో.. ఐరన్, క్యాల్షియం, జింక్, సోడియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బీ 6, సి, ఫోలేట్,, నియాసిన్‌లు..æ, దానిమ్మ గింజల్లోని.. విటమిన్ బి, సి, కె, పొటాషియం, పీచుపదార్థాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ►రోజుకొక గ్లాసు తాగడం వల్ల చర్మానికి, జుట్టుకు పోషణ అందుతుంది. -
బరువు తగ్గించడానికి ఉపయోగపడే దానిమ్మ
దానిమ్మ పండులో అనేక పోషకాలు ఉండటంతో అది ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అన్నిటికంటే ముఖ్యంగా గుండెజబ్బులను దానిమ్మ నివారిస్తుందన్నది కూడా తెలిసిన విషయమే. అయితే ఒంటి బరువు పెరగకుండా నివారించడానికీ, ఒబేసిటీ రాకుండా నియంత్రించుకోడానికి కూడా దానిమ్మ సహాయపడుతుంది. అంటే కొంతవరకు కష్టమైన వ్యాయామాలు చేయనక్కర్లేకుండానే తియ్యటి పండు తింటూ, సంతోషంగా బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. దానిమ్మతో బరువు తగ్గడానికి కారణం ఏమిటంటే... ఇందులో 7 గ్రాముల పీచు ఉంటుంది. అది కడుపు (స్టమక్) ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికి తోడు మంచి ఆరోగ్యాన్ని సమకూర్చే అనేక పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. దీనితో ప్రయోజనాలు అపరిమితం. దానిమ్మలో 3 గ్రాముల ప్రోటీన్, విటమిన్ సీ, విటమిన్ కె అనే ప్రధాన విటమిన్లతో పాటు పొటాషియమ్ వంటి అనేక లవణాలు ఉంటాయి. దాదాపు 25 గ్రాముల చక్కెర కలిగి ఉండి ఒక పండులో 144 క్యాలరీల శక్తి ఉంటుంది. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు కలిగి ఉన్నందున బరువు తగ్గడంలో దానిమ్మ సమర్థంగా ఉపయోగపడుతుందన్నమాట. -
దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా
-
దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా
దానిమ్మ కాయ గురించి తెలియని వారు వుండరు. అనేక ఔషధ లక్షణాలను తనలోదాచుకున్న దానిమ్మ అంటే ఇష్టం పడనివారు దాదాపు ఎవరూ వుండరు. ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ జ్యూస్‌ను సేవిస్తే..రక్తహీనత నుంచి బయటపడవచ్చని వైద్యులు చెపుతారు. అలాగే దానిమ్మ పండు పైన ఉన్న బెరడును పదిగ్రాములు తీసుకుని దాన్ని కషాయంగా కాచి తాగితే విరోచనాల నుంచి విముక్తి కలుగుతుందట. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను తింటే క్యాన్సర్ బారి నుంచి గట్టెక్కవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అయితే.. దానిమ్మ కాయలు వలవడం అంటే అంత సులువు కాదు. కొంచెం కష్టపడాల్సిందే. దానిమ్మ గింజలు చితికిపోకుండా, దుస్తుల మీద గింజల రసం పడకుండా.. జాగ్రత్తగా ఒలవాలి. ఎందుకంటే.. దానిమ్మ రసం దుస్తుల మీద పడితే... ఆ మరకలు ఒక పట్టాన పోవు. దీంతో దానిమ్మ గింజలు ఒలవడం అంటే ఓర్పు, నేర్పూ వుండాలి. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా దానిమ్మగింజలు ఒలిచే విధానంపై ఒక వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి సులభమైన ఆ విధానం కథా కమామిషు ఏంటో మీరు కూడా ఒకసారి వీక్షించండి.. ఇప్పటికే చూశారా.. అయినా మరోసారి చూసేయండి! -
యవ్వనకాంతి
పండ్లు, కూరగాయలు, వాటి నుంచి వచ్చే నూనెలను సౌందర్య లేపనాలుగా ఉపయోగిస్తే చర్మం యవ్వనకాంతితో మెరిసిపోతుంది. విటమిన్ –సి సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ గల స్ట్రాబెర్రీ మాస్క్ వల్ల రెట్టింపు అందాన్ని పొందవచ్చు. ఎండకు కమిలిన, మృతకణాలున్న చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి యవ్వనకాంతిని పెంచుతుంది. ఓ కప్పు తాజా స్ట్రాబెర్రీలు మిక్సర్‌లో మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పు పెరుగు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మెత్తటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి లేదా రెండువారాలకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. చర్మం ముడతలు పడనివ్వని యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ దానిమ్మలో పుష్కలం. యాంటీయాక్సిడెంట్స్, విటమిన్–సి సమృద్ధిగా ఉన్న దానిమ్మ ఓట్స్ లేదా పెరుగుతో కలిపి మేలైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. మృతకణాలను తొలగించడమే కాదు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, కప్పు ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఐదు నిమిషాలు ఉంచి, కడిగేయాలి. -
నేచురల్ మెడికల్ కిట్
దానిమ్మ పండు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో... తినడానికీ రుచి అంతే బాగుంటుంది. అంతేకాదు... తింటే అందే ప్రయోజనాలు అత్యంత ఆరోగ్యకరంగా ఉంటాయి. దానిమ్మను ఒక స్వాభావికమైన మెడికల్ కిట్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే అందులోని గింజలెన్ని ఉంటాయో ఆరోగ్యలాభాలూ అంతకంటే ఎక్కువేనని చెప్పవచ్చు. దానిమ్మ పండును తినడం వల్ల సమకూరే లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే. ♦ దానిమ్మలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. దాంతో అది జీర్ణవ్యవస్థకు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. పేగు కదలికలు హాయిగా సాఫీగా తేలిగ్గా జరుగుతాయి. ఈ గుణాలన్నీ మలబద్దకాన్ని నివారించేందుకు బాగా దోహదపడతాయి. ♦ దానిమ్మలోని విటమిన్–సి కారణంగా రోగనిరోధక శక్తి పెరిగి ఎన్నో రకాల జబ్బులు నివారితమవుతాయి. ♦ దానిమ్మ టైప్–2 డయాబెటిస్, అలై్జమర్స్ వంటి జబ్బులను నివారిస్తుంది. ♦ దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ కాన్సర్, కోలన్ క్యాన్సర్, లుకేమియా వంటివి అందులో కొన్ని మాత్రమే. ♦ దానిమ్మలో పొటాయిషియమ్ ఎక్కువ. ఫలితంగా అది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ♦ దానిమ్మ కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుతుంది. దాంతో రక్తప్రసరణ సాఫీగా జరిగి గుండెజబ్బులు నివారితమవుతాయి. గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ♦ బరువు తగ్గాలనుకున్న వారికి దానిమ్మ ఎంతగానో ఉపకరిస్తుంది. దోహదం చేస్తుంది. ♦ దానిమ్మలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా అది వాపు, మంట, ఇన్ఫెక్షన్లను వేగంగా తగ్గిస్తుంది. ♦ ఒంట్లోని ద్రవాల సౌమతౌల్యతను దానిమ్మ కాపాడుతుంది. ♦ చర్మం పైపొరను కాపాడుతుంది, చర్మకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో దానిమ్మను క్రమం తప్పక తీసుకునే వారి చర్మంలో మంచి నిగారింపు వస్తుంది. అంతేకాదు... మంగు వంటి కొన్ని చర్మ సమస్యలను నివారిస్తుంది. ♦ దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్‌తో వయసు పెరగడం వల్ల వచ్చే అనేక అనర్థాలు నివారితమవుతాయి లేదా ఆలస్యంగా వస్తాయి. ఉదాహరణకు వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలు, మచ్చలు, గీతలను నివారిస్తుంది. ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం వడలిపోకుండా కాపాడుతుంది. దాంతో చర్మం తాజాగా కనిపిస్తుంటుంది. ♦ దానిమ్మ ఆర్థరైటిస్‌కు స్వాభావికమైన ఔషధంగా చెప్పవచ్చు. -
స్త్రీ, పురుషులు ఇద్దరికీ..!
దానిమ్మపండును కోసి చూస్తే లోపల ఎంత అందంగా ఉంటుందో, మన కడుపులోపలికి వెళ్లాక అంతటి ఆరోగ్యాన్నీ ఇస్తుంది. దానిమ్మలోని పోషకాల వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటీ, రెండూ కావు. ఆ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. ♦ దానిమ్మ పండులో అత్యద్భుతమైన రెండు పోషకాలు ఉన్నాయి. అవి... ప్యూనికాలాజిన్స్, ప్యూనిసిక్ యాసిడ్. ప్యూనికలాజిన్ అత్యంత శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ముక్యాన్సర్లను నివారిస్తుంది. ఇక మరో ప్రధాన పోషకమైన ప్యూనిసిక్ యాసిడ్ మనిషికి మంచి ఆరోగ్యాన్నిచ్చే ప్రధాన ఫ్యాటీ యాసిడ్స్‌లో ఒకటి. ♦ బరువు పెరగకుండా నియంత్రించుకో వాలనుకున్న వారికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. దానిలోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను కాపాడతాయి. పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తాయి. ♦ దానిమ్మ కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. రక్తనాళాల్లోని పూడికను తొలగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, గుండెజబ్బులను, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ♦ ఏవైనా గాయాలు అయినప్పుడు వాటి వాపును, మంట, నొప్పి (ఇన్ఫ్లమేషన్)ని తగ్గిస్తుంది. ♦ చర్మాన్ని మెరిసేలా చేసి, మేని నిగారింపునకు దోహదపడుతుంది. వయసు పెరిగాక వచ్చే ముడుతలు, గీతలను నివారిస్తుంది. వయసు పెరుగుదలను తగ్గిస్తుంది. చాలాకాలంపాటు యౌవనంగా ఉండేలా చేస్తుంది. ♦ ఎముకలను పటిష్టంగా ఉంచడంతో పాటు కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలనూ నివారిస్తుంది. -
దానిమ్మతోనూ అమ్మ లాంటి మేలు
గుడ్‌ఫుడ్ దానిమ్మలో చక్కెర పాళ్లు తక్కువ, డయాబెటిస్ వారికీ ఉపయోగకరం. దానిమ్మలో జీర్ణక్రియకు ఉపకరించే పీచు సమృద్ధిగా ఉంటుంది. మలబద్దకం దరిచేరదు. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫీనోల్స్, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఫైటో కెమికల్స్ శరీర నిర్మాణ పోషకాలను సమకూర్చడంతో పాటు చక్కటి రోగనిరోధక శక్తినిస్తాయి. దానిమ్మలో విటమిన్ కె, విటమిన్ బి5, విటమిన్ సి ఎక్కువ. ఇవి ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్, లుకేమియా వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి.కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా ఇస్కిమిక్ కరోనరీ హార్ట్ డిసీజ్‌ను నివారిస్తుంది.గుండె సమస్యలున్న వాళ్లు రోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తీసుకుంటే మంచిది.చర్మం పై పొరను కాపాడుతుంది, చర్మకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మేను మిలమిల మెరిసేలా దోహదపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ముడతలు, మచ్చలు, గీతలను నివారిస్తుంది. ఎండకు వెళ్లినప్పుడు చర్మం వడలిపోకుండా రక్షిస్తుంది.వాపులను, నొప్పులను తగ్గిస్తుంది. -
బ్యాక్టీరియాతో జాగ్రత్త!
దానిమ్మలో సమగ్ర సస్యరక్షణ అవసరం 'మహానంది' ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుబ్రహ్మణ్యం దానిమ్మ తోటలు సాగు చేసిన రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్న వాటిలో బ్యాక్టీరియా మచ్చ తెగులు ప్రమాదకరమైనందున సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి నివారించుకోవాలని కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో దానిమ్మ తోటలపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు, మరో శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు హాజరై అవగాహన కల్పించారు. రోగం లేని మొక్కలు ఎంపిక ఇటీవల దానిమ్మ తోటలకు బ్యాక్టీరియా మచ్చతెగులు బాగా దెబ్బతీస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఆకులు, కాండం, కాయలపై విస్తరించి తీవ్ర నష్టం కలిగిస్తున్నందన ముందుస్తు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ తెగులు నర్సరీల నుంచి, వర్షంతో కూడిన గాలులు ద్వారా, కత్తిరింపులు చేసే సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇందుకోసం పంట పెట్టాలనుకున్నపుడే రోగ రహిత మొక్కలు ఎంపిక చేసుకోవాలి. నర్సరీల్లో మొక్కల ఆకులు, లేత కొమ్మలపై నీటితో తడచినట్లు మచ్చలు కనిపిస్తే రోగం ఉన్నట్లుగా గుర్తించాలి. టిష్యూకల్చర్ మొక్కలు బాగున్నా వాటిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కత్తిరింపుల సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కత్తిరించే ప్రతిసారీ కత్తెరలను డెటాల్ లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ముంచి శుభ్రం చేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ కత్తిరింపుల తర్వాత ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారి చేసుకోవాలి. కొత్త ఆకులు వచ్చిన తర్వాత మూడు గ్రాములు శాలిసిలిక్ యాసిడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే కాయ ఊరేదశలో కూడా శాలిసిలిక్ యాసిడ్ నెల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. బ్యాక్టీరియా మచ్చ తెగులుకు సంబంధించి లక్షణాలు కనిపిస్తే 25 గ్రాములు బ్లైటాక్స్ + 5 గ్రాములు స్టెప్టోసైక్లీన్ + 5 గ్రాములు బ్యాక్టీరొనాల్+ జిగురు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేత ఇగుర్లు వచ్చిన తర్వాత 2 మి.లీ రీజెంట్ ఒక లీటర్ నీటికి లేదా 3 గ్రాములు ప్రైడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీనికి 2 మి.లీ వేపనూనె కలుపుకోవాలి. కాయలపై శిలీంధ్రపు మచ్చ తెగులు కనిపిస్తే గ్రాము బావిస్టన్ లేదా 2.5 గ్రాములు ఎం–45 లేదా 1 మి.లీ టిల్ట్ లేదా 1 మి.లీ స్కోర్ లేదా 2 గ్రాములు అవతార్ లేదా 2 గ్రాములు మిర్జ్ మందులు 20 రోజుల వ్యవధిలో మందులు మార్చి రెండు సార్లు పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోగ లక్షణాలు కనిపించిన కొమ్మలు, రెమ్మలు, ఆకులు, మొక్కలు పీకేసి కాల్చివేయాలి. తోటలను ఎపుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట పైర్ల ద్వారా భూసారాన్ని పెంచుకుంటే దానిమ్మ రైతు ఇంట ప్రధాన వాణిజ్యపంటగా లాభదాయకంగా మారుతుంది. -
దానిమ్మతో ఎన్నెన్నో మేళ్లు!
పరి పరిశోధన ఏజింగ్‌తో కనిపించే శరీరక పరిణామాలు కనపడకూడదని కోరుకుంటున్నారా? కాలం గడుస్తున్న అదే యౌవనంతో ఉండాలని భావిస్తున్నారా? దానిమ్మపండు తినండి. ఇందులో ఉన్న అద్భుతమైన రసాయనాలు చాలా మేలు చేస్తాయి. వయసు పెరుగుతున్నప్పుడు కండరాల బలాన్ని సడలనివ్వకూడా చూస్తాయి. అదే కండరాల బిగువును చాలా కాలం కొనసాగనిస్తాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దానిమ్మలో ఉండే ‘యురోలిథిన్-ఏ’ అనే మాలెక్యూల్ వయసు పెరుగుతున్నప్పుడు కలిగే దుష్పరిణామాలను నివారిస్తుంది. అంతేకాదు అంతేకాదు కణాల పనితీరు కాస్త తగ్గిన మొదట ఉన్నట్లే వాటిని రీఛార్జ్ చేస్తాయి. అంతేకాదు దానిమ్మలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణం కూడా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో రోజూ దానిమ్మను తినేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతుందని తెలిసింది. ‘యురోలిథిన్-ఏ’ క్యాన్సర్ కణాలను అడ్డగించడానికి కూడా ఉపయోగపడుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దానిమ్మలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం ఉందనీ, పార్కిన్సన్స్ వ్యాధిని సైతం మరో అధ్యయనంలో తేలింది. అంతేకాదు... అది గుండెజబ్బుల ముప్పులనూ నివారిస్తుందన్న విషయం గతేడాది ప్రచురితమైన అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో నమోదైంది. -
దానిమ్మతో దీర్ఘాయుష్షు!
మీరు రోజూ పండ్లు తింటారా..? అందులో దానిమ్మ పండ్లు ఎక్కువగా ఉంటాయా..? అయితే మీ ఆయుష్షుకు ఢోకా లేదు. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎక్కువగా తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిమ్మ గింజల్లో ఉండే ఓ పరమాణువు కడుపులో ఉండే బ్యాక్టీరియా వల్ల వయోభారంతో వచ్చే సమస్యలను సరిచేసేదిగా మారుతుందని పేర్కొంటున్నారు. ఎలుకలతోపాటు నెమటోడ్ సి.ఎలిగాన్స్ జీవులపై జరిగిన పరిశోధనల్లో ఇప్పటికే రుజువు కాగా, మానవులపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. వయసు మీద పడుతున్న కొద్దీ మన శరీర కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా బలహీనపడుతుంటాయి. చేయాల్సిన పనులు కూడా చేయలేక పోగుపడుతుంటాయి. దీని ప్రభావం కండరాలు, కణజాలంపై పడి అవి బలహీనమవుతుంటాయి. పార్కిన్సన్స్ వ్యాధికి కూడా ఇలా పోగుబడిన మైటోకాండ్రియాలు ఒక కారణం కావచ్చని ఇప్పటికే కొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఉరోలిథిన్-2 అనే ఓ రసాయనం.. ఈ బలహీనపడ్డ మైటోకాండ్రియాను పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దానిమ్మ గింజల్లో ఉరోలిథిన్-ఏ తయారీకి అవసరమైన పరమాణువులు ఉంటాయని, పేగుల్లోని బ్యాక్టీరియా సాయంతో దీన్ని తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. 8 నుంచి 10 రోజులు మాత్రమే జీవించే నెమటోడ్లపై దీన్ని ప్రయోగించినప్పుడు వాటి ఆయువు దాదాపు 45 శాతం వరకు ఎక్కువైంది. ఎలుకల్లో కూడా 42 శాతం వృద్ధి కనిపించడంతో పాటు అవి మరింత చురుగ్గా కదులుతున్నట్లు గుర్తించారు. తగిన బ్యాక్టీరియా లేకపోతే కొంతమంది ఎన్ని దానిమ్మ పండ్లు తిన్నా ఫలితం ఉండకపోవచ్చునని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అమేజెనిటిస్ అనే కంపెనీ ముందుకొచ్చింది. ఉరోలిథిన్-ఏను నేరుగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది యూరప్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాలు చేపడుతోంది. ఈ పరిశోధన తాలూకూ వివరాలు నేచర్ మెడిసిన్ మేగజీన్‌లో ప్రచురితమయ్యాయి. -
మృదువుగా... దానిమ్మ!
చలికాలం.. కోమలమైన చర్మం ఈ కాలం పొడిబారడం వల్ల గరకుగా తయారవుతుంది. మృతకణాలు పెరుగుతాయి. దీని వల్ల చర్మకణాలు నిస్తేజం కనిపిస్తుంది. ఫలితంగా మేనికాంతి తగ్గుతుంది. ఈ సమస్యలకు మేలిమి పరిష్కారం దానిమ్మ. మేనికి స్క్రబ్.. కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్, గోధుమ రంగు పంచదార, తేనె రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. దానిమ్మ గింజలు (చిదపాలి), కమలాపండు తొక్కల గుజ్జు, రోజ్ వాటర్ టీ స్పూన్ చొప్పున, కోకా పౌడర్ రెండు టీ స్పూన్ల తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ ఒక గాజు పాత్రలో వేసి, చెక్క స్పూన్‌తో కలపాలి. ఈ మిశ్రమం దేహానికి పట్టించి, రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ మిశ్రమం చర్మానికి మంచి స్క్రబ్‌లా ఉపయోగపడుతుంది. దానిమ్మ నూనెలో ఉండే కెరటినోసైట్స్ కణాలను ఉత్తేజితం చేసి, మృతకణాలు తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ముడతలను నివారిస్తాయి. కొన్ని చుక్కల దానిమ్మ రసంలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి బుగ్గలకు, పెదవులకు రాసుకుంటే చర్మం పొడిబారదు. దానిమ్మ గింజల్ని భోజనం తర్వాత తీసుకుంటే ఆరోగ్యకరం. ఎర్రై పెదవులకు... పొడిబారడం, చిట్లడం... వంటివి చలికాలం పెదవులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. పెట్రోలియమ్ జెల్లీ, వెన్న వంటివి ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం లేకపోతే.. దానిమ్మ నూనెను పెదవులకు రాయండి. మృదుత్వం, ఆరోగ్యకరం, మరింత ఎరుపును మీ పెదవులకు తెచ్చిపెడుతుంది. దానిమ్మ నూనె గల లిప్ బామ్‌లూ మార్కెట్లో లభిస్తున్నాయి. చిట్లిన, పొడిబారిన పెదవులకు ఈ లిప్‌బామ్స్ మంచి పరిష్కారం. -
చల్లని వేళ చక్కటి ఆహారం
వేరుశనగలు వేరుశనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వేరు శన గగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది. పాలకూర ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీస్జుకుంటే ఎంతో మంచిది. ఎముకల పటిష్టానికి దోహదం చేస్తుంది. నువ్వులు నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి చక్కటి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవడంవల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. నువ్వులవల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. జొన్నలు వారానికి ఒక్క సారైనా జొన్నతో చేసిన ఆహారం తీసుకోవాలి. జొన్నలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కండరాల కదలికలకు బాగా ఉపకరిస్తుంది. జొన్నతో చేసిన పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ. డ్రైఫ్రూట్స్ డ్రైఫ్రూట్స్‌ను చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌లోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో కావలసిన శక్తి వీటివల్ల లభిస్తుంది. జీర్ణశక్తిని అధికం చేస్తాయి. రక్తాన్ని బాగా శుద్ధి చేస్తాయి. డ్రైఫ్రూట్స్ సహజంగానైనా, ఆహారంలో భాగంగానైనా తీసుకోవచ్చు. దానిమ్మ సకల పోషకాల నిధి దానిమ్మ. రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్ కావలసినంత లభిస్తాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి శరీరం అనారోగ్యం బారినపడకుండా కాపాడుతాయి. చిలగడ దుంపలు చక్కటి పోషకాహారం. ఈ దుంపలు శరీరానికి కావలిసిన వేడిని అందిస్తాయి. పిల్లలు, వయోధికులకు ఇది ఎంతో అవసరం. ఈ దుంపల్లో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, సీతో పాటు ఖనిజ లవణాల్ని శరీరానికి అందిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి జల్లుకొని తింటే ఆ మజాయే వేరు. దీంతో చలికాలంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలను నివారించవచ్చు. -
మామిడి మధురం.. చేదు నిజం..!
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మామిడి, అరటి, బొప్పాయి, సపోట, ద్రాక్ష, దానిమ్మ ఇలా అనేక రకాల పండ్లు కాలాలకు అనుగుణంగా ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. శరీర ఎదుగుదలకు, పరిపుష్టికి దోహదపడుతాయి. అన్ని కాలాలలో దొరికేది అరటి. వేసవి కాలంలో దొరికేది మాత్రం మామిడి. అయితే పండ్ల వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగపెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్భైట్, పొగబెట్టి మాగబెట్టడం వంటి చర్యలతో కాయలను పండ్లుగా మారుస్తున్నారు. అనంతరం బహిరంగ మర్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. శరీరం నీరసించిపోయినప్పుడు ఇవి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో ఇవి ఉండవు. కాగా, ఆరోగ్యానికి హానికరం. జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, చెన్నూర్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో మామిడి వ్యాపారం జరుగుతాయి. ఏటా రూ.11 కోట్ల మామడి పండ్ల వ్యాపారం జరుగుతుంది. మామిడిని ఎలా మాగ పెడతారంటే.. మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారంకు కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైట్‌ను కొనుగోలు చేస్తారు. ఈ రసాయనాన్ని పొట్లాలుగా మారుస్తారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో, నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు కార్బైట్ పొట్లాలను మధ్య మధ్యన పెడతారు. ఆ కార్బైట్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. నాలుగు రోజులపాటు బాక్స్‌లలో, నేల మీద రాశులుగా ఉన్న మామిడికాయలు పండ్లుగా మారతాయి. పూర్తి పచ్చదనంలోకి వచ్చి మామిడి ప్రియుల నోర్లు ఊరించేలాగా మారుతాయి. అలా తయారైన మామిడి పండ్లను మార్కెట్లోకి రిటైల్ అమ్మకం దారులకు విక్రయిస్తారు. అలా చేతులు మారిన మామిడి పండ్లు మామిడి ప్రియుల చేతికి చేరి కడుపులోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. గ్యాస్ ద్వారా పండ్లుగా మార్చడం మరో పద్ధతి గ్యాస్ ద్వారా కూడా మామిడి కాయలను పండ్లుగా మార్చడం కొత్త పద్ధతి. గతేడాది మంచిర్యాలలో ప్రారంభమైంది. కాల్షియం కార్బైట్ తక్కువ ఖర్చుతో పండ్లుగా మార్చే వీలున్నప్పటికి పెద్ద మొత్తంలో పండ్లుగా మారడం సాధ్యం కాదు. దాంతో కూలింగ్ స్టోర్ విధానం ద్వారా కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ఒకేసారి 8 వేల కిలోల వరకు కాయలను పండ్లుగా మార్చే సౌలభ్యం కూలింగ్ స్టోర్‌లో ఉంటుంది. ఇథిలేన్ అనే గ్యాస్‌ని కూలింగ్ స్టోరేజ్‌లోకి పంపుతారు. పగలంతా కూలింగ్, రాత్రి వేళ మాత్రమే గ్యాస్‌ను స్టోర్‌లోకి విడుదల చేస్తారు. అలా రసాయనాల ప్రభావంతో నాలుగు రోజుల్లోనే కాయలు పండ్లుగా మారతాయి. ఒక మామిడిపండే కాకుండా అరటికాయలను కూడా పండ్లుగా మారుస్తున్నారు. పండ్లను మాగ పెట్టడానికి కూలింగ్ స్టోరేజ్‌లు పెట్టడానికి రూ.25 లక్షల నుంచి రూ.30 వరకు వ్యయం చేస్తున్నారంటే లాభాలు ఎలా ఉన్నాయో తేట తెల్లం అవుతుంది. అమలు కాని నిషేధం బహిరంగ మార్కెట్లో కార్బైట్ విచ్చలవిడిగా దొరుకుతోంది. కిలో విలువ రూ.80 ఉంటుంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించిన అమలుకావడం లేదు. వ్యాపారులు గోదాముల్లో కార్బైన్‌ను వినియోగించి మాగబెడుతున్నా పట్టించుకోవడం లేదు. వీటి వాడకాన్ని తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు.