pushpa sreevaani
-
పుష్పశ్రీవాణి మాస్ స్పీచ్ కి దద్దరిల్లిన కురుపాం
-
లోకేష్ ఇది బాబుపై దండయాత్ర.. పుష్ప శ్రీవాణి కౌంటర్..
-
చంద్రబాబు ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారు - పుష్ప శ్రీవాణి
-
గిరిజన మ్యూజియం దేశానికే ఆదర్శం
సాక్షి, చింతపల్లి(విశాఖ) : తాజంగిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం దేశానికే ఆదర్శంగా నిలవాలని డిప్యూటీ సీఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి ఆకాంక్షించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని శుక్రవారం విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 21 ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మ్యూజియాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాయన్నారు. చింతపల్లి ప్రాంతం వేదికగా అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో ఎంతోమంది గిరిజనులు బ్రిటిషు పాలకులపై తిరుగుబాటు చేశారన్నారు. డౌనూరు నుంచి లంబసింగి వరకు ఘాట్‌రోడ్డు నిర్మాణ సమయంలో అల్లూరి సీతారామరాజే స్వయంగా బ్రిటిషు పాలకులపై దాడి చేసేందుకు సిద్ధంకావడం గొప్ప చరిత్ర అన్నారు. సాధారణ విల్లంబులతో చింతపల్లి పోలీసుస్టేషన్‌పై దాడిచేసి తుపాకులు స్వాధీనం చేసుకోవడం బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించిందన్నారు. ఆయనకు అండగా మల్లుదొర, మర్రి కామయ్యలు ప్రాణత్యాగానికి సిద్ధంకావడం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు. దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న గిరిజన యోధుల గురించి భావితరాలకు తెలియాలన్నారు. అందుకు మ్యూజియం నిర్మాణం పూర్తయితే లంబసింగి ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని, గిరిజనులకు కూడా ఉపాధి కలుగుతుందని పుష్పశ్రీ వాణి అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల గిరిజనులకు ఆదర్శం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోని గిరిజనులకు ఇక్కడి మ్యూజియం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఆంధ్ర కశ్మీర్ అయిన లంబసింగిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు, జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, ఐటీడీఏ పీఓ ఆర్. గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి. అభిషేక్, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల లోగోలను ఆవిష్కరించారు. -
ఫ్యామిలీతో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి-ఫోటోలు
-
ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
-
దిశా యాప్ ను ప్రతి ఒక్క మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలి :పుష్పశ్రీవాణి
-
గిరిజన రైతుల సంక్షేమమే జీసీసీ లక్ష్యం
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) గిరిజనులకు అండగా నిలుస్తున్నదని, గతేడాది కంటే ఎక్కువ వ్యాపారాన్ని చేసి గిరిజనులకు ఆర్థిక చేయూతను అందించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. జీసీసీ ద్వారా 2020–21 ఏడాదిలో సాగించిన ఆర్థిక కార్యకలాపాల ప్రగతికి సంబంధించిన వివరాలను ఆమె శనివారం మీడియాకు ఓ ప్రకటనలో వివరించారు. గతేడాది గిరిజన ఉత్పత్తుల ద్వారా రూ.368 కోట్ల వ్యాపారాన్ని చేసిన జీసీసీ.. ఈ ఏడాది రూ.450 కోట్లు ఆర్జించిందని తెలిపారు. గిరిజనులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించేలా జీసీసీ చూస్తుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్రోల్ పంపులను, సూపర్ బజార్లను నిర్వహించడంతో పాటు పౌర సరఫరాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా జీసీసీ నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు గిరిజన రైతులకు అవసరమైన రుణాలను సైతం జీసీసీ అందిస్తుందని పేర్కొన్నారు. 2019–2020లో అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు రూ.13.18 కోట్లను వెచ్చించగా, 2020–21లో రూ.76.37 కోట్లు వెచ్చించామని తెలిపారు. 2019–20లో జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు రూ.24.22 కోట్ల మేర జరిగితే 2020–21లో రూ.33.07 కోట్లకు పెరిగాయని వివరించారు. మెరుగైన ఫలితాలను సాధించిన జీసీసీ అధికార, సిబ్బందిని పుష్ప శ్రీవాణి అభినందించారు. -
విజయనగరం జిల్లాలో ఫోర్టీ ఫైడ్ బియ్యం పంపిణి
-
యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం ఫోర్ట్: విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో పైప్‌లైన్ లీకై కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అధికారులు యుద్ధప్రాతిపదికన సరిచేశారు. 17 మంది కోవిడ్ రోగులను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటనే చికిత్స అందేలా చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తమకు ఆక్సిజన్ అందడం లేదని కోవిడ్ రోగులు అక్కడి సిబ్బందికి చెప్పడంతో వారు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్.మహేశ్‌కుమార్, కోవిడ్ ప్రత్యేకాధికారి సత్యనారాయణ కేంద్రాస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికప్పుడే మరమ్మతులు ఆస్పత్రిలో 2 వేల కిలోలీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. దీని పైప్‌లైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేయించి సరఫరాను పునరుద్ధరించింది. విశాఖ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పించి ట్యాంక్‌ను నిండా నింపారు. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరా పూర్తి స్థాయిలో జరుగుతోంది. ఘటన జరిగిన సమయంలో కేంద్రాస్పత్రిలో 290 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కాగా, కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకై ఐదుగురు మరణించారని, కాసేపటికి 11 మంది మృతి చెందారని పలు చానళ్లు అత్యుత్సాహం చూపాయి. ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం విషయం తెలియగానే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువెళ్లాం. అవసరమైతే రోగులను విశాఖ తరలించాల్సిందిగా ఆయన సూచించారు. ఐసీయూలో ఉన్న వారిని విజయనగరంలోనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. –పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి సకాలంలో చర్యలు తీసుకున్నాం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆక్సిజన్ సరఫరాలో సమస్య ఏర్పడిందని ఫోన్ రాగానే ఆస్పత్రికి చేరుకున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి బల్క్‌గా ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆక్సిజన్ అందించాం. ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. – ఎం.హరిజవహర్‌లాల్, విజయనగరం జిల్లా కలెక్టర్ -
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో స్పెషల్ ఇంటర్వ్యూ
-
గిరిజనుల హక్కులు కాలరాసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమంపై మాట్లాడే అర్హత టీడీపీ నేత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గిరిజనులను చంద్రబాబు అంటరాని వారిగా చూసి కేబినెట్లో కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్ల పాలనలో గిరిజనులను అవమానించి, వారి హక్కులను కాలరాసిన చంద్రబాబును గిరిజనుల ద్రోహిగా అభివర్ణించారు. జీవో నంబర్ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునః సమీక్ష చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గిరిజనుల తరఫున ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసిందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఆ జీవో కొట్టేయడానికి చంద్రబాబే కారణమని అందరికీ తెలుసన్నారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నామని, గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశామని, ఈ ఏడాది సబ్ ప్లాన్ కింద రూ.5,177 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, పాడేరులో గిరిజన మెడికల్, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలలు, సాలూరులో గిరిజన యూనివర్సిటీ, అరకులో గిరిజన స్టేట్ యూనివర్సిటీ, ఐదు ఐటీడీఏల పరిధిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్న సీఎంగా వైఎస్ జగన్ గిరిజనుల గుండెల్లో నిలిచిపోతారని కొనియాడారు. -
గిరిజనుల రహదారి కల సాకారం
‘అక్షరం’ అనేక జీవితాలను నిలబెడుతుందని... చరిత్రను ‘కలం’ తిరగరాస్తుందని... మరోసారి రుజువైంది. శతాబ్దాలుగా రహదారులు లేక... అభివృద్ధికి నోచుకోక... కాలం వెళ్లదీస్తున్న గిరిజనుల కష్టాలను, కన్నీళ్లను కళ్లకు కట్టినట్లు చూపించిన ‘అరణ్య రోదన’ కథనం అడవి బిడ్డల కలలను సాకారం చేస్తోంది. చేయీ.. చేయీ కలిపి చందాలు పోగేసి మొదలుపెట్టిన మట్టి రోడ్డు ఇప్పుడు ప్రధాన రహదారిగా రూపుదిద్దుకోనుంది. సాక్షి, విజయనగరం: సాలూరు మండలం కొదమ పంచాయతీ చింతామల గిరిశిఖర గ్రామ ప్రజలు, నూట ఇరవై ఐదు కుటుంబాలు కలిసి, బంగారం, భూమి తాకట్టు పెట్టి, ఆవులు, గేదెలు, మేకలను అమ్మి, అదీ చాలక షావుకారు వద్ద అప్పుచేసి, ఇంటికి రూ.7 వేలు చొప్పున చందాలు వేసుకున్నారు. మరికొంత రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా బారి జంక్షన్ వరకూ సొంతంగా రహదారి వేసుకున్నారు. దీనిపై సాక్షి ప్రధాన సంచికలో ఆగస్టు 14న కథనం ప్రచురితమైంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం కార్యాలయం జిల్లా అధికారులను వివరాలు కోరింది. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సాక్షి కథనం గురించి ప్రస్తావన గిరిజనులను అభినందించారు. త్వరలోనే వచ్చి కలుస్తానన్నారు. కదిలించిన సాక్షి కథనం ఈ క్రమంలోనే గిరిజనులు అనుభవిస్తున్న కష్టాలపై ‘అరణ్య రోదన’ శీర్షికతో ఆగస్టు 25న సాక్షి జిల్లా సంచికలో మరో కథనం ప్రచురించింది. ఆ కథనం అధికారులను కదిలించింది. స్పందించిన ఐటీడీఎ పీఓ ఆర్.కూర్మనాథ్ గిరిజన పల్లెల్లో ఆ మరునాడే పర్యటించా రు. మరోవైపు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఇటు ఐటీడీఎ పీఓతోనూ, అటు అటవీ శాఖ జిల్లా అధికారి చేతన్‌తోనూ చర్చించారు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సైతం స్పందించారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్య లు చేపట్టాల్సిందిగా ఐటీడీఎ పీఓ కూర్మనాథ్‌ను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులు విడుదల ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉపాధిహామీ పథకం జిల్లా కోఆర్డినేటర్ అయిన డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేశారు. సాక్షి కథనాన్ని తొలి రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కలెక్టర్ తరఫున ఐటీడీఎ పీఓ కూర్మనాథ్ రూ.1.65 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేశారు. చింతామల గ్రామం నుంచి ఒడిశా సరిహద్దు వరకూ రహదారి నిర్మాణానికి బుధవారం శంకుస్తాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పీఓ కూర్మనాథ్ ‘సాక్షి ప్రతినిధి’కి వెల్లడించారు. గిరిజన ప్రాంతాభివృద్ధిపై వైఎస్ ముద్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆయన హఠాన్మరణం, తదితర కారణాలు వల్ల నిర్మాణం పూర్తికాలేదు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అటవీ శాఖ కూడా అనుమతులు ఇచ్చే విషయంలో సానుకూలంగా ఉంది. దానికి నిదర్శనమే తాజాగా రూ.1.65 కోట్లు మంజూరు కావడం. ఈ రహదారితో పాటు గిరిజన ప్రాంతంలో మిగిలిన రోడ్లు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు. రహదారుల కొరత తీరుస్తాం గిరిజనులు పడుతున్న ఇబ్బందు లను రహదారుల నిర్మాణంతో కొంతైనా తీర్చగలుగుతాం. ఈ విషయంలో ఎలాంటి తాత్సారానికీ తావివ్వకుండా అన్ని అనుమతులు తీసుకుంటున్నాం. మరో రూ.11.62 కోట్లతో పోనంగి రహదారి నిర్మాణానికి కూడా చర్యలు చేపడుతున్నాం. అటవీశాఖ నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్‌లు కూడా వ స్తున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, చెక్ డ్యామ్‌ల నిర్మాణాలు కూడా పూర్తి చే స్తాం. ప్రభుత్వం నిధుల మంజూరుకు సిద్ధంగా ఉంది. – ఆర్.కూర్మనాథ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఎ, పార్వతీపురం -
విజయనగరంలో మంత్రుల సమీక్ష
సాక్షి, విజయనగరం: జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు అళ్ల నాని, పుష్ప శ్రీ వాణి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనాపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా జిల్లాలో సమీక్ష చేయడం జరిగిందని మంత్రులు తెలిపారు. భవిష్యత్తులో జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ కరోనా వైరస్ పాజిటివ్ నుంచి నెగిటివ్ రాగానే ఆసుపత్రి నుంచి డిశార్జి చేసి ఇంటికి పంపిస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి శనివారం నాలుగు పాజిటివ్ కేసులు రావడం జరిగిందన్నారు.వీటిలో మూడు పాజిటివ్ కేసులు వలసకార్మికులు కావడం గమనార్హమన్నారు. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం) అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నమన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి స్థాయిలో గుర్తించి వారికి ముందుగానే పరీక్షలు చేసి హోం క్వారంటైన్ చేశామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పూర్తి స్థాయిలో మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. జిల్లాలోని 72 క్వారంటైన్ కేంద్రాల్లో పరిశుభ్రత పాటిస్తూ వారికి ఆహారం అందిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనుమానితులని వెంటనే గుర్తించి వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేసి రిపోర్ట్ వచ్చేవరకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం వైజాగ్ విమ్స్ లో కూడా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సిబ్బందికి , వైద్యులు కి అన్ని రకాల రక్షణ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వెంటిలేటర్స్ని కూడా అదనంగా సిద్ధం చేశామన్నారు. వీటితో పాటు జిల్లాలో ఐదు ప్రైవేటు ఆసుపత్రులను కూడా కోవిడ్ ఆసుపత్రుల కింద సిద్ధం చేసినట్లు చెప్పారు. స్పెషాలిటీ సేవలుని కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లా మెరుగుగానే ఉందన్నారు. (వైద్యం అందించటంపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్) వైజాగ్‌లో కరోనా వైరస్‌తో శనివారం మృతిచెందిన బలిజిపేట , చిలకలపల్లి కి చెందిన 60 ఏళ్ల వృద్ధ మహిళకు సంబంధించిన 16 మంది కుటుంబ సబ్యులకు పరీక్షలు చేయగా అందరకీ కరోనా నెగటివ్ రావడం జరిగిందన్నారు. ఆ మహిళ కరోనాతో పాటు డయాలసిస్ పేషెంట్ అని కూడా తెలిపారు. చిలకలపల్లి గ్రామం తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో సర్వే చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు అందరూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనవసర విషయాలకి బయటకి రావద్దు అని విజ్ఙప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. (తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్) -
ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు
-
ప్రతి గిరిజన కుటుంబానికీ ప్రభుత్వ సాయం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, రూ.1000 ఆర్థిక సాయంతో పాటు.. అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న పౌష్టికాహారాన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతి గిరిజన కుటుంబానికీ చేర్చాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ గిరిజన ప్రాంతాలకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులకు పథకాలను చేర్చడం, క్వారంటైన్, భౌతిక దూరం అమలుపై సోమవారం ఐటీడీఏ పీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ► సీతంపేట, పాడేరు, కేఆర్‌పురం, చింతూరు, శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏల పీవోలతో మంత్రి మాట్లాడుతూ గిరిశిఖర గ్రామాలు, రహదారుల్లేని గిరిజన గ్రామాలకు రేషన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. ► నెల్లూరు యానాది ఐటీడీఏ పరిధిలో సంచారజాతికి చెందిన 900 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులు లేకున్నా ఉచిత రేషన్ పంపిణీచేసినట్టు నెల్లూరు పీవో మణికుమార్ చెప్పారు. ► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను క్వారంటైన్ కేంద్రంలో ఉంచి గడువు ముగిశాక వారిని స్వగ్రామాలకు పంపినట్టు చింతూరు పీవో చెప్పారు. -
‘ప్రపంచాన్ని జయించే ఒకే ఆయుధం విద్య’
సాక్షి, విజయనగరం: అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు వస్తున్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగో స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధిస్తుందని విశ్వరూప్పేర్కొన్నారు. (నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..) ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు, ఆలోచనలు, పరిపాలనా తీరు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నెల్సన్ మండేలా చెప్పినట్టు ప్రపంచాన్ని జయించడానికి ఒకే ఆయుధం విద్య అని ఆమె అన్నారు. అటవంటి విద్యను సాధించేందుకు ఎదురయ్యే అడ్డంకులు తొలగించే విధంగా, విద్యపై ఆసక్తి కలిగేలా విద్య వ్యవస్థలో సీఎం వైఎస్ జగన్ మార్పులు తీసుకు వస్తున్నారని ఆమె తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో విన్నారని.. ఈరోజు ప్రజలకు అండగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అనేక అవరోధాలు దాటి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరే విధంగా ప్రభుత్వం పథకాలను తీసుకొస్తుందన్నారు. (జగనన్న వసతి దీవెన: ప్రసంగంతో అదరగొట్టిన అభిమన్యు!) జిల్లాలో ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లినవారు, అక్కడ ప్రాణాపాయ స్థితుల్లో పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ఆ పరిస్థితులు అధిగమించేలా విశాఖ పరిపాలన రాజధాని రాబోతుందని పుష్పశ్రీవాణి అన్నారు. సీఎం జగన్ దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని ఆమె కొనియాడారు. గిరిజన మహిళగా నేల మీద కూర్చుని విద్యను అభ్యసించి, ఉపాధ్యాయునిగా ఉన్న తనకు గొప్ప గౌరవం ఇచ్చిన సీఎం జగన్ అభిమానాన్ని మరచిపోలేనని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ.. గతంలో చంద్రబబాబును ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన మంది మార్భాలన్ని కాపాపడుకునేందుకు కులం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని శంకర్ నారాయణ అన్నారు. -
‘సీఎం జగన్‌కు గిరిజనుల పక్షాన ధన్యవాదాలు’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు రాద్దాంతం చేయడం విచారకరమని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఈ బిల్లుపై చర్చ సజావుగా జరగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేపట్టారు. ఈక్రమంలో స్పీకర్ వారికి ఎంత నచ్చచెప్పినా వినలేదు. టీడీపీ నేతలు నినాదాలు చేస్తుండగానే మంత్రి పుష్పశ్రీవాణి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. దళితులకు టీడీపీ ఎంత వ్యతిరేకమో వారి నినాదాలతోనే అర్థమవుతుందన్నారు. ‘ప్రతిష్టాత్మకమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. వీరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు చేసేందుకే ఈ బిల్లు ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి యావత్ గిరిజనుల తరపున ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకోవాలనే కౌన్సిల్లో టీడీపీ ఎస్సీ వర్గీకరణ తెరమీదకు తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరగకూడదనే టీడీపీ ముఖ్య ఉద్దేశం. గతంలో ఎస్సీలుగా ఎవరైన పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్న విషయాన్ని ఓ సారి గుర్తుచేస్తున్నా. అంతేకాకుండా ఆ రోజు తన మంత్రి వర్గంలో ఎస్సీ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. కానీ ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ వర్కుల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. తన కేబినెట్లో ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన ఏకైక సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు’ అని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. చదవండి: టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మనస్తాపం ‘డర్టీ పొలిటీషియన్ అని అదే కేసీఆర్ అనలేదా’ -
ఇంట్లో ఆడవాళ్లని తెచ్చి రాజకీయం చేస్తున్నారు
-
ఇవ్వాల్సింది గాజులు కాదు.. కొట్టేసిన భూములు
సాక్షి, అమరావతి/విజయనగరం: రాజధాని పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయనే భయంతోనే రాజధాని ప్రాంతంలో ఆయన బుధవారం మరో డ్రామాకు తెర తీశారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేసిన పుష్పశ్రీవాణి.. బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులకు చంద్రబాబే కారణమన్న సంగతి అందరికీ తెలుసని.. గ్రాఫిక్స్ చూపించి రైతులు, ప్రజలను ఇంతకాలం భ్రమల్లో పెట్టి.. ఇప్పుడు వారి కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చారని మండిపడ్డారు. ఐదేళ్లలో రాజధాని ఎందుకు కట్టలేదు? తమ భూములను అభివృద్ధి చేసి ఎందుకివ్వలేదని రాజధాని గ్రామాల ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేదన్నారు. రాజధాని ఉద్యమానికి తనవంతు విరాళం అన్నట్లుగా చంద్రబాబు భార్యతో గాజులిప్పించారని.. అసలు ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్సైడర్ ట్రేడింగ్‌లో చౌకగా కొట్టేసిన రైతుల భూములను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ‘అమ్మా భువనేశ్వరి.. మీ కంపెనీ హెరిటేజ్ పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి 14.22 ఎకరాల భూమిని చౌకగా కొట్టేసింది. దయచేసి 14 ఎకరాలను తిరిగి ఆ రైతులకు ఇచ్చేయండి. ఇవాళ మీరిచ్చే గాజులకన్నా.. ఆ రైతుకు కలిగిన నష్టం వందల రెట్లు పెద్దది’ అని పుష్పశ్రీవాణి కోరారు. చంద్రబాబు 2014 జూన్ 8 నుంచి డిసెంబర్ 14 వరకు నిద్రపోకుండా తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, సహచరులు కలసి 4,069 ఎకరాలను కొన్నట్టు వెల్లడైందని పేర్కొన్నారు. లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా అక్రమాలు బయట పడతాయన్నారు. ముందుగా 4,069 ఎకరాలను రైతులకు తిరిగి ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇంట్లోంచి బయటకు రాని భువనేశ్వరి ఇప్పుడు తమ భూముల కోసం బయటకు వచ్చారంటే ఆమెకు వ్యాపార, స్వప్రయోజనాలే ఎక్కువని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. -
‘గిరిజన విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించండి’
సాక్షి, విజయనగరం : గిరిజన విద్యార్థుల వసతి గృహాల్లో భోజన సదుపాయం కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ సక్రమంగా అమలు చేయకపోతే సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి హెచ్చరించారు. శనివారం ఆమె గిరిజన విద్య,వైద్యంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి, విద్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారన్నారు. గిరిజన విద్య కోసమే రాష్ట్ర బడ్జెట్లో రూ. 1245 కోట్లు కేటాయించిన ఎకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. గిరిజన వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
నవరత్నాల బడ్జెట్‌కు కసరత్తు!
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన నవరత్నాల అమలు దిశగా బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తొలి బడ్జెట్‌ను రూపొందించేందుకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల నుంచి నవరత్నాల అమలుకు అవసరమయ్యే నిధులతో పాటు ఆయా శాఖలకు ఎంత మొత్తం కావాలన్న వివరాలను రెండు రోజుల పాటు సేకరించనున్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన బడ్జెట్ అంచనాల సమీక్షలో భాగంగా రోడ్లు భవనాలు, రవాణా, పశుసంవర్థక శాఖ, పర్యాటకం, పౌరసరఫరాలు, వైద్యం, మహిళా,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, గృహనిర్మాణ శాఖ మంత్రులతో ఆర్థికమంత్రి విడివిడిగా భేటీ అయ్యి వివరాలు సేకరించారు. 2019–20 సంవత్సరానికి నవరత్నాల అమలుకు ఏ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉంటుందో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ప్రెజంటేషన్ రూపంలో ఆర్థికమంత్రికి వివరించారు. ప్రతిపాదనలు అందించిన మంత్రులు.. సమీక్షలో పాల్గొన్న అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని, రహదారుల భూసేకరణకు కావల్సిన నిధులతో పాటు, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ.. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలని, ఇందుకుగాను రూ. 6,900 కోట్లు అవసరమవుతాయన్నారు. రవాణా శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సమాచార పౌరసంబంధాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రికి సమర్పించామని చెప్పారు. బుధవారం మరొకసారి ఆర్థిక మంత్రితో సమావేశం అవుతామని, అప్పుడు మరిన్ని అంశాలపై చర్చిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, పాముల పుష్ప శ్రీవాణి, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. తమ శాఖలకు కావాల్సిన నిధుల వివరాలను ఆర్థికమంత్రికి విన్నవించారు. పేదల బియ్యం కోసం రూ. 5,600 కోట్లు పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రూ.5,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మరో రూ.1500 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో సెప్టెంబర్ నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా పేదల ఇళ్లకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఆ మేరకు నాణ్యమైన బియ్యాన్ని ఏ విధంగా సేకరించాలి, ప్రత్యేకంగా బ్యాగుల తయారీకి అయ్యే ఖర్చు, బడ్జెట్ ప్రతిపాదనలు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ సోమవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో మొదటగా రెండు లేదా మూడు జిల్లాల్లో ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేసే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఐదు, పది, పదిహేను కిలోల బియ్యం బ్యాగుల తయారీకి సంబంధించిన యంత్రాలను ఢిల్లీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో కమిషనర్ కోన శశిధర్ ఇటీవల పరిశీలించారు. వాటి పనితీరుపై సంతృప్తిగా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యంత్రాలను ఏర్పాటు చేసిన అనంతరం.. ప్రతి జిల్లాలోనూ ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన 25 శాతం నూకలు, మరో 40 శాతం బియ్యం తినడానికి వీలులేని విధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ నెల నుంచి అలాంటి బియ్యానికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఆగమేఘాలపై యంత్రాంగం కదిలి సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. 1000, 1010, 1001 రకం బియ్యాన్ని పలు జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్నా ఆ రకం బియ్యం తినడానికి ఇష్టపడడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి సోనా, బీపీటీ తదితర రకాల వరి సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు వివరించాలని అధికారులు ప్రత్యేకంగా చర్చించారు. కాగా, నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనుంది. బడ్జెట్లో గిరిజన ఆర్థిక ప్రోత్సాహక పథకాలకు పెద్దపీట ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి బడ్జెట్ ప్రతిపాదనల్లో గిరిజనులకు ఆర్థిక ప్రోత్సాహక పథకాలు, విద్య, వైద్యానికి పెద్ద పీట వేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2019–20లో ఆర్థిక శాఖ కేటాయించిన తాత్కాలిక కేటాయింపుల కంటే అదనంగా రూ.1,142.13 కోట్లను కలిపి మొత్తం రూ.3,542.22 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో రూ.132.11 కోట్లు నవరత్నాల అమలుకు కేటాయించామన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డైరెక్టర్ రంజిత్ బాషా, అడిషనల్ డైరెక్టర్ ఇ.రవీంద్రబాబు, ఇంజనీర్ ఇన్ చీఫ్ శేషుకుమార్, గురుకులం కార్యదర్శి భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జీసీసీని లాభాల్లో తెచ్చేందుకు ప్రణాళిక: పుష్పశ్రీవాణి
అమరామతి : అర్హులైన గిరిజనులకు లబ్ది చేకూరకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అధికారులను ఆదేశించించారు. అమరావతిలో గిరిజన సంక్షేమశాఖపై ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ట్రైకార్ రుణాల మంజూరు విషయంలో అవినీతిని గుర్తించిన డిప్యూటీ సీఎం.. తక్షణమే కార్ల కొనుగోలు రుణాల మంజూరులో అవినీతిపై విచారణకు ఆదేశించించారు. అర్హులైన గిరిజనులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జీసీసీ భవనాన్ని 5 కోట్లతో నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. నష్టాల్లో ఉన్న జీసీసీని లాభాల్లో తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అలాగే మినీ గురుకులాల విద్యార్థులకు హాస్టల్ వసతి పూర్తిగా కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 గురుకులాల నిర్మాణం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడానికి వీల్లేదని, ఏకలవ్య పాఠశాలల్లో నాణ్యమైన ఉపాధ్యాయులను నియమించాలని అధికారులను సూచించారు. -
పక్కా స్కెచ్‌తోనే నాపై దాడి: పుష్ప శ్రీవాణి
సాక్షి, విజయనగరం : ఎన్నికల పోలింగ్ రోజు తనపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని కురుపాం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పుష్పశ్రీవాణి ఆందోళన వ్యక్తం చేశారు. భౌతికంగా తనను అడ్డు తొలగించుకోవడానికి తెలుగు దేశం పార్టీ నేతలు పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర దాగుందన్న అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఓటమి భయంతోనే పచ్చ పార్టీ నేతలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేంతవరకూ వదిలిపెట్టేది లేదని పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. చదవండి...(ఎన్నికల... దౌర్జన్యకాండ) పుష్ప శ్రీవాణి దంపతులకు పరామర్శ కాగా టీడీపీ నేతలు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుపై హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు. దీంతో ఎమ్మెల్యే దంపతులు మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చీకటి గదిలో గడిపారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్పీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు. -
ఎన్నికల... దౌర్జన్యకాండ
ఓటమి ఖాయమని నిర్థారణకు వచ్చేశారేమో... ఎక్కడికక్కడే అల్లర్లకు తెరతీశారు. ఐదేళ్లపాటు సాగించిన దౌర్జన్యకాండ సరిపోలేదనుకున్నారేమో... ఎన్నికల వేళ తెగ రెచ్చిపోయారు. కవ్వింపు చర్యలకు పాల్పడి అనేకచోట్ల పోలింగ్ కేంద్రాల్లో గొడవలకు దిగారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పలుచోట్ల అన్యాయంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అంతేనా... రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని ఓటర్లు తమ ఓటుద్వారా గురువారం చూపించారు. టీడీపీ పూర్తిగా ఓటమి అంచుకు చేరిందని ఓటర్ల ఓటింగ్ సరళిని బట్టి ఆ పార్టీ వారికి సైతం అర్థమయ్యింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలన్న కాంక్షతో అలజడులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దొంగ ఓట్లు కూడా వేయించారు. అక్కడికీ శాంతించక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. పోలింగ్‌కు వచ్చిన వారిని సైతం భయపెట్టి సెల్ఫోన్లు లాక్కుని వెనక్కి పంపించారు. ఇంత చేస్తున్నా తాము ఓటమి పాలౌతున్నామనే బాధనుంచి బయటపడలేకపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు హత్యారాజకీయాలకు తెర తీశారు. రిగ్గింగ్‌ను అడ్డుకోబోతే... పోలింగ్ బూత్ నంబర్ 152లో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందన్న సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్‌రాజు గురువారం మధ్యాహ్నం పరిశీలనకు వెళ్లారు. బూత్ వద్దకు చేరుకున్న ఆయన్ను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకుని భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన పరీక్షిత్‌రాజు అక్కడినుంచి వెనక్కి వచ్చేశారు. ఈ విషయాన్ని సాక్షి ప్రతినిధి బోణం గణేష్‌కు పరీక్షిత్‌రాజు సమాచారం అందించారు. ఆ సమాచారాన్ని జిల్లా ఎస్సీ ఎ.ఆర్.దామోదర్‌కు తెలియజేశారు. అక్కడ రిగ్గింగ్ జరిగినందున పోలింగ్ నిలిపేసి రీపోలింగ్ జరపాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని కోరేందుకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తన భర్త పరీక్షిత్‌తో కలసి పోలింగ్ స్టేషన్‌కు మధ్యాహ్నం వెళ్లారు. ఆమె రాకను గమనించిన టీడీపీ నాయకులు, స్థానిక జెడ్పీటీసి భర్త డొంకాడ రామకృష్ణ వారిపై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి హతాశురాలైన ఎమ్మెల్యే దంపతులు అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వీలు పడలేదు. పథకం ప్రకారం అక్కడకు చేరుకున్న స్థానికులు, మహిళలు వారిపై దాడులకు తెగబడ్డారు. ఎమ్మెల్యేను గాయపరిచారు. ఎమ్మెల్యే అనుచరులు, అక్కడున్న కొంతమంది పోలీసులు ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నించి పరిస్థితి చేయిదాటిపోతుండడంతో తిరిగి పోలింగ్ బూత్‌లోకే పంపించేశారు. కేంద్రాన్ని వందలాది జనం చుట్టుముట్టి లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అదే సమయానికి అక్కడకు చేరుకున్న సాక్షి ప్రతినిధి కూడా పోలింగ్ కేంద్రంలో చిక్కుకున్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు మొత్తం 25 మంది వరకు పోలింగ్ కేంద్రంలో ప్రాణభయంతో తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు తన సొంత తమ్ముడి కుమారుడు, కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసి కూడా ఏమాత్రం వారిని రక్షించే ప్రయత్నం చేయకపోగా వారిపై దాడి చేసేలా టీడీపీ కార్యకర్తలను పురిగొల్పారు. ఇదే అదనుగా కార్యకర్తలు గొడ్డళ్లు, కర్రలు, కత్తులు పట్టుకుని పోలింగ్ కేంద్రంపై దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ కొంతమంది పోలీసు బలగాలను సంఘటనా ప్రాంతానికి పంపించారు. కాని ఎమ్మెల్యే దంపతులను హతమార్చాలనే ప్రణాళికతో ఉన్న టీడీపీ నేతలు ఇతర గ్రామాల నుంచి మరికొందరిని పోలింగ్ కేంద్రం వద్దకు హుటాహుటిన తరలించి ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని సృష్టించారు. పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజు మరిన్ని బలగాలను పంపించాలని జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆదేశించారు. మరోవైపు విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వెంటనే స్పందించి పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. అంతే గాకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లారు. పార్టీ పెద్దలు రాష్ట్ర డీజీపీకి విషయం తెలియజేసి ఎమ్మెల్యే దంపతులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గార్గ్ హుటాహుటిన మరిన్ని బలగాలను తీసుకుని సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ లోగానే ఎమ్మెల్యే దంపతులను, వారితో పాటు ఉన్నవారిని హతమార్చేందుకు టీడీపీ నాయకులు పురిగొల్పిన వారి వర్గీయులు పోలింగ్ కేంద్రం తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్సీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాదమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు. సంయమనం పాటించాలి: ఎమ్మెల్యే చినమేరంగిలోని తమ ఇంటికి చేరిన ఎమ్మెల్యే దంపతులకు భారీ సంఖ్యలో వారి కార్యకర్తలు, అభిమానులు ఎదురొచ్చి తమ మద్దతు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వవద్దని తమపై ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా సంయమనం పాటించాలని ఎమ్మెల్యే దంపతులు తమ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. పోలీసు, మీడియా ప్రతినిధులు అండగా ఉండబట్టే తాము ప్రాణాలతో బయటపడ్డామని ఈ సందర్భంగా వారు అన్నారు. తమపై హత్యాయత్నానికి జనాన్ని ఉసిగొల్పిన వారెవరినీ వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా వారిని శిక్షించేలా పోరాడతామని స్పష్టం చేశారు.