Qasem Soleimani
-
Iran: ట్రంప్‌పై దాడిలో మా ప్రమేయం లేదు
టెహ్రాన్: అమెరికా ఎన్నికల ప్రచారంవేళ మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యోదంతంలో తమ ప్రమేయం అస్సలు లేదని ఇరాన్ స్పష్టంచేసింది. రెండేళ్లక్రితం ఇరాక్‌లో ఇరాన్‌కు చెందిన సైన్యాధికారి జనరల్ ఖాసిం సులేమానీని ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక డ్రోన్ దాడిచేసి అంతంచేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆనాడు ఇరాన్ చేసిన ప్రతిజ్ఞకు, ట్రంప్ హత్యకు సంబంధం ఉండొచ్చన్న ఆరోపణల నడుమ ఇరాన్ బుధవారం స్పందించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కసీర్ కనానీ ఇరాన్ అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘ ట్రంప్ మేం దాడి చేయించామంటున్న వార్తల్లో వీసమెత్తు నిజం లేదు. మా సైనిక కమాండర్ సులేమానీని అంతం చేసినందుకు ట్రంప్‌ను అంతర్జాతీయంగా చట్టప్రకారం శిక్షార్హుడిని చేస్తాం. అంతేగానీ ఇలా హత్య చేయబోం’’ అని ఆయన అన్నారు.ఇరాన్ నుంచి ముప్పు నేపథ్యంలో ఇప్పటికే భద్రత పెంపుట్రంప్ హత్యకు ఆగంతకుడు విఫలయత్నం చేయడంతో ట్రంప్‌పై గతంలో కక్షగట్టిన ఇరాన్ పేరు మరోసారి తెరమీదకొచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ కమాండర్ సులేమానీని అమెరికా బలగాలు నాటి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే అంతమొందించాయని ఇరాన్ ఆరోపిస్తోంది. దీంతో ట్రంప్ అంతానికి ఇరాన్ కుట్ర పన్ని ఉండొచ్చని అమెరికా నిఘా వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్‌కు కొన్ని వారాల క్రితమే భద్రతను మరింత పెంచారు. అయితే ఇరాన్‌కు, ఆగంతకుడి దాడి ఘటనకు మధ్య సంబంధాన్ని అమెరికా నిఘా, దర్యాప్తు వర్గాలు సహా ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. అయితే ఇరాన్ నుంచి ముప్పు ఉందని, జాగ్రత్తగా ఉండాలని అమెరికా సీక్రెట్ సర్వీస్, ట్రంప్ ప్రచార బృందానికి గతంలోనే ముందస్తు హెచ్చరికలు చేశామని అమెరికా జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పారు. దాడి జరగొచ్చని, తగు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని మాకు తరచూ సందేశాలు వస్తూనే ఉన్నాయని యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఆంటోనీ చెప్పారు. ‘ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉంది. సులేమానీని చంపేశాక ఇది మరింత ఎక్కువైంది’ అని అధ్యక్షభవనం వైట్‌హౌజ్‌లో జాతీయ భద్రతా మండలి మహిళా అధికార ప్రతినిధి ఆండ్రినీ వాట్సన్ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా జాన్ బోల్టన్ ఉండేవారు. ఆయనను చంపాలని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ కోర్ సభ్యుడు కుట్ర పన్నాడు. ఆ సభ్యునిపై 2022లో న్యాయశాఖ నేరాభియోగాలు మోపింది. ‘ట్రంప్‌ను కోర్టులో చట్టప్రకారం శిక్షపడేలా చేస్తాం. అంతేగానీ ఇలా చంపబోం’ అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ తాజాగా స్పష్టంచేశారు. -
Iran explosions: రక్తమోడిన ర్యాలీ
దుబాయ్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి ఖడ్గం ఝుళిపించింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం మధ్యాహ్నం మూడింటపుడు కెర్మాన్ నగరంలోని ఖాసిమ్ సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర నాలుగో సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్–జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా సమాధికి 700 మీటర్లదూరంలో మొదటి పేలుడు సంభవించింది. గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి ఒక కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనాస్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డెప్యూటీ గవర్నర్ రహ్మాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఎవరీ సులేమానీ? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని కీలక ఖుర్డ్స్ ఫోర్స్‌కు మేజర్ జనరల్ సులేమానీ నేతృత్వం వహిస్తుండేవారు. ఖుర్డ్స్ఫోర్స్ అనేది విదేశీ సైనిక వ్యవహారాల విభాగం. సైన్యం కోసం ఆయుధాలు, నిధుల సేకరణ, నిఘా, సరకుల రవాణా బాధ్యతలను ఈ దళమే చూసుకుంటుంది. ఇరాన్‌కు మద్దతు పలికే గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌కు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకూ సాయపడుతుంది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గతంలో ప్రకటించింది. ఎందుకు చంపారు? 2020 జనవరిలో ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంక్యూ9 రీపర్ డ్రోన్ సాయంతో అమెరికా సులేమానీని హతమార్చింది. ‘‘ 1998లో ఖుర్డ్స్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇరాక్, సిరియాలో లక్షలాది మంది అమాయకుల మరణాలకు సులేమానీ కారకుడు. ప్రపంచ నంబర్‌వన్ ఉగ్రవాది అయినందుకే అతడిని అంతమొందించాం’ అని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి రోజున ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఇరాన్ అప్పట్లో ప్రతీకార దాడులకు దిగడం తెల్సిందే. ఇరాన్ సైన్యాన్ని పటిష్టవంతం చేయడంలో సులేమానీది కీలక పాత్ర. అందుకే ఇరాన్ వ్యాప్తంగా సులేమానీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. నేషనల్ ఐకాన్‌గా కీర్తింపబడ్డారు. 2011లో అరబ్ ఉద్యమం తర్వాత సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. కానీ ఈ ఘటనలో సిరియాలో అంతర్యుద్ధం రాజుకుని అది ఇప్పటికీ రగులుతూనే ఉంది. 2018లో ప్రపంచ ఆర్థిక శక్తులు కీలక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగాక ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ట్రంప్ సర్కార్ ఇచి్చన ఆదేశాలతో సులేమానీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో అప్పట్లో సంచలనమైంది. సులేమానీ హత్యేకాదు అంత్యక్రియల ఘటనా వార్తపత్రికల పతాకశీర్షికలకెక్కింది. 2020లో వేలాదిమంది పాల్గొన్న అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. -
వెయ్యిరెట్లకు మించి ప్రతీకారం : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికాపై ఏదైనా దాడి జరిగితే అంతకుమించి "1,000 రెట్లు ఎక్కువ" ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు.ఇరాన్ టాప్ మిలటరీ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు మీడియా వార్తలు రావడంతో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాద నాయకుడు సులేమాని హత్యకు ప్రతీకారంగా అమెరికాపై ఇరాన్ హత్య, లేదా ఏ రూపంలోనైనా,ఎలా దాడిచేసినా దానికి వెయ్యిరెట్లు అధికంగా ప్రతి స్పందిస్తామంటూ ట్విట్ చేశారు. (ఇరాన్ ప్రతీకారం) దక్షిణాఫ్రికాలోని అమెరికా రాయబారి లానా మార్క్స్‌పై ఇరాన్ ప్రభుత్వం హత్యాయత్నాలు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఒక ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఇదే జరిగితే అమెరికా, ఇరాన్‌ల మధ్య మరింత ఉద్రిక్తతలు రాజుకోనున్నాయని పేర్కొంది. ఇరాన్ గతంలో అమెరికన్ రాయబారులపై హత్యలను ప్రణాళిక వేపిన నేపథ్యంలో ఈ వార్తలను ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయని తెలిపింది. అటు ఈ అంశంపై స్పందించిన దక్షిణాఫ్రికా స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎస్ఎస్ఎ) దక్షిణాఫ్రికా పౌరులు, ఇతర డిప్లొమాటిక్ అధికారులతో సహా యుఎస్ రాయబారి భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. నవంబర్ 3న జరగనున్న ఎన్నికలకు ముందు ఇరాన్ వ్యతిరేక ప్రచారంలో భాగమే ఈ ఆరోపణలని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖతీబ్జాదే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి 3న ఇరాక్‌లో డ్రోన్ దాడితో రివల్యూషనరీ గార్డ్స్ కుడ్స్ ఫోర్స్ నేత సోలైమానిని అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 2015 అణు ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉందంటూ అమెరికా వైదొలగిన తరువాత నుంచి వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతోంది. (ట్రంప్ తలపై రూ.575 కోట్లు) According to press reports, Iran may be planning an assassination, or other attack, against the United States in retaliation for the killing of terrorist leader Soleimani, which was carried out for his planning a future attack, murdering U.S. Troops, and the death & suffering...— Donald J. Trump (@realDonaldTrump) September 15, 2020 -
ఇరాక్ గ్రీన్‌జోన్‌లోకి దూసుకొచ్చిన రాకెట్లు
-
దద్దరిల్లుతున్న ఇరాక్.. మరో రాకెట్ దాడి
బాగ్దాద్: ఇరాన్- అమెరికా పరస్పర ప్రతీకార దాడులతో ఇరాక్ దద్దరిల్లుతోంది. తమ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్... ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై బుధవారం క్షిపణులు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఇరాక్ రాజధాని బాగ్దాద్ గ్రీన్‌జోన్‌లోకి రెండు రాకెట్లు దూసుకువచ్చాయి. విదేశీ రాయబార కార్యాలయాలు కలిగి నిత్యం భద్రతా సిబ్బంది నిఘాలో ఉండే ఈ ప్రాంతంపై కత్యూష రాకెట్ల దాడి జరగడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాగా అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరాక్‌కు చెందిన హషీద్ గ్రూపు(ఇరాక్‌లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్)లే ఈ దాడికి పాల్పడినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు) ఇక ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. గత మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్ దాడికి పాల్పడి.. ఇరాన్ జనరల్ సులేమానిని హతమార్చింది. ఈ దాడిలో సులేమానితో పాటు ఇరాక్ మిలిటరీ కమాండర్ అబూ మహ్ది అల్- ముహందీస్‌తో పాటు మరికొంత మంది అధికారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమ కమాండర్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హషీద్ గ్రూపులు ప్రకటించాయి. ఇరాక్ పారా మిలిటరీ చీఫ్ ఖైస్ అల్- ఖాజిలీ(అమెరికా ఇతడిని ఉగ్రవాదిగా బ్లాక్‌లిస్టులో పెట్టింది) మాట్లాడుతూ..‘ఇరాన్ ప్రతీకారం కంటే ఇరాక్ ప్రతీకారం ఏమాత్రం తక్కువగా ఉండబోదు’ అని వ్యాఖ్యానించాడు.(రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే) ఇక సిరియాలో కీలకంగా వ్యవహరించే ఇరాక్ పారామిలిటరీ గ్రూపు హర్కత్ అల్- నౌజాబా సైతం...‘ అమెరికా సైనికులారా మీరు కళ్లు మూసుకోకండి. అమరుడైన ముహందీస్ కోసం ఇరాకీలందరూ చేతులు కలుపుతారు. మీరు ఇరాక్‌ను వదిలివెళ్లేంత వరకు ప్రతీకారంతో రగిలిపోతారు’ అని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హషీద్ గ్రూపులే బుధవారం అర్ధరాత్రి అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా కత్యూష రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. (ఇరాన్ క్షిపణుల వర్షం.. అమెరికా శాంతి మంత్రం) -
ఇరాన్ ప్రతీకారం
ఇరాన్ సైనిక జనరల్ కాసిం సులేమానిని ద్రోన్ దాడిలో హతమార్చడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెట్టిన చిచ్చు ఇరాన్ ప్రతీకార దాడితో కొత్త మలుపు తిరిగింది. బుధవారం వేకువజామున ఇరాక్‌లోని అమెరికాకు చెందిన రెండు సైనిక స్థావరాలపై ఇరాన్ డజనుకుపైగా క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో స్వల్ప నష్టం మాత్రమే జరిగిందని ట్రంప్ ప్రకటించగా, తాము 80మంది ‘అమెరికా ఉగ్రవాదులను’ హతమార్చామని అంతక్రితం ఇరాన్ తెలిపింది. చానెళ్లలో చూస్తే నష్టం ఎక్కువగానే కలిగివుండొచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. అధి కారంలోకొచ్చింది మొదలు ట్రంప్ ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఆ దేశంపై ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన ప్రయత్నించినప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం సీఐఏ అందుకు అభ్యంతరం తెలిపింది. అణు ఒప్పందంలోని ఏ అంశాన్నీ ఇరాన్ ఉల్లంఘించలేదని అది నివేదిక ఇచ్చింది. అటు తర్వాత 2018 మే లో ఆ ఒప్పందంనుంచి ఏకపక్షంగా బయటకు రావడంతోపాటు కొత్త ఒప్పందానికి సిద్ధపడకపోతే ఆంక్షలు అమలు చేస్తామంటూ హుకుం జారీ చేశారు. దీన్ని ఇరాన్ ఖాతరు చేయకపోవడంతో ఆ ఏడాది డిసెంబర్లో ఆంక్షలు మొదలుపెట్టారు. ఆ దేశం నుంచి ఎవరూ ముడి చమురు కొనరాదని ప్రపంచ దేశాలకు ఆదేశాలిచ్చారు. తర్వాత చర్యగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) దళాలను ఉగ్రవాద బృందంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. దాని ప్రకారం సులేమాని అమెరికా దృష్టిలో ‘ఉగ్రవాది’ అయ్యారు. హఠాత్తుగా ఆయనపై ద్రోన్ దాడికి దిగి సంక్షోభానికి అంకురార్పణ చేశారు. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న అమెరికా స్థావరాలు రెండూ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి. ముఖ్యంగా అల్ అసాద్ స్థావరానికి 2018 డిసెంబర్లో ట్రంప్ వెళ్లారు. ఇది అమెరికాకు అత్యంత ప్రధాన మైనదని ఆ సందర్భంగా ఆయన చెప్పారంటే దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. అమెరికా యుద్ధ విమానాలతోపాటు హెలికాప్టర్లు, ద్రోన్లు అక్కడ నిరంతరం సిద్ధంగావుంటాయి. తమ సైనిక జన రల్ సులేమానిని హతమార్చిన ద్రోన్ ఇక్కడినుంచే బయల్దేరివుంటుందన్న అనుమానం ఉండ టంవల్లే ఇరాన్ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందంటున్నారు. రెండో స్థావరం ఎర్బిల్ ఇరాక్‌లో కుర్దుల ప్రాబల్యంవున్న ప్రాంతంలో వుంది. ఐఎస్ ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించడంలో ఈ రెండు స్థావరాలు ప్రధాన పాత్ర పోషించాయి. సులేమాని ఉగ్రవాదని చెబుతున్న అమెరికాకు ఆయన నాయకత్వంలోని కుద్స్ ఫోర్స్ వల్లే ఉగ్ర వాద సంస్థలు అల్–కాయిదా, ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లు తుడిచిపెట్టుకుపోయాయని తెలియంది కాదు. కానీ పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ప్రస్తుతం తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ నుంచి ప్రజల దృష్టి మళ్లించ డానికి ట్రంప్ ఈ వృధా ఘర్షణను నెత్తికెత్తుకున్నారు. అపారమైన చమురు నిల్వలతోపాటు తమ భూభాగంలో ముస్లింలు అత్యంత పవిత్రమని భావించే మక్కా, మదీనాలున్నాయి కనుక ముస్లిం ప్రపంచానికి తానే తిరుగులేని సారథినని సౌదీ భావిస్తుంటుంది. 1979లో ఇరాన్ షా మహ్మద్ రేజా పెహ్లవీని కూలదోసిన ఇస్లామిక్ విప్లవం దీన్నంతటిని మార్చింది. అంతవరకూ సౌదీ అరేబియా తోడ్పాటుతో పశ్చిమాసియాపై పెత్తనం చేస్తున్న అమెరికా ఆధిపత్యాన్ని ఆ విప్లవం దెబ్బతీసింది. దాంతోపాటు సౌదీ నాయకత్వానికి కూడా సవాలు విసిరింది. ఇరాన్ షియాల ఆధిపత్యంలో ఉండ టం, సౌదీ సున్నీల ప్రాబల్యంలో ఉండటం ఈ విభేదాలను పెంచింది. 2003లో అమెరికా దురా క్రమణ, సద్దాం హుస్సేన్ పతనం అనంతరం ఇరాక్‌లో మెజారిటీగావున్న షియాలకు బ్యాలెట్ ద్వారా అధికారం చిక్కింది. మరోపక్క సిరియాలో సున్నీలదే మెజారిటీ అయినా అక్కడ అలేవీ తెగకు చెందిన బషర్ అల్ అసద్ గత 20 ఏళ్లుగా అధికారంలోవున్నారు. ఇరాక్‌లో తమ వర్గంవాడైన సద్దాంను కూలదోసిన అమెరికాకు బుద్ధి చెప్పి, అక్కడ ఆధిపత్యం సంపాదించడంతోపాటు తమ వర్గం మెజారిటీగావున్న సిరియాను కూడా చేజిక్కించుకోవాలని చూసిన ఐఎస్‌ను సులేమాని నాయకత్వంలోని కుద్స్ ఫోర్స్ ధ్వంసం చేయగలిగింది. తమకు సాధ్యంకాని పనిని సులేమాని సునాయాసంగా చేసినప్పటినుంచీ అమెరికాకు ఆయనపైనా, ఇరాన్‌పైనా శంక పట్టుకుంది. భవి ష్యత్తులో ఈ ప్రాంతంపై ఇరాన్ పట్టుపెంచుకుంటే ఇజ్రాయెల్, సౌదీలకు పెను నష్టం వాటిల్లుతుం దని భావించబట్టే ఏదో వంకన ఇరాన్‌ను ఊపిరాడనీయకుండాచేసి చక్ర బంధంలో బిగించాలని ట్రంప్ భావిస్తున్నారు. పనిలో పనిగా తనపై వచ్చిన అభిశంసనపై అమెరికన్ ప్రజల దృష్టి పడకుండా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో తన విజయానికి తోడ్పడుతుందని ఆయన అంచనా వేసుకున్నారు. ప్రతీకార దాడుల ద్వారా అమెరికాను ఇరాన్ రెచ్చగొట్టిందని, దాన్ని యుద్ధం చేయక తప్పని స్థితికి నెట్టిందని కొందరు చేస్తున్న వాదన సరికాదు. తనకు ఇష్టమున్నా లేకున్నా ఆ దేశం 80వ దశకం నుంచి ఘర్షణలమధ్యే మనుగడ సాగిస్తోంది. దాని పర్యవసానాలు అనుభవిస్తూనేవుంది. తనంత తాను కయ్యానికి కాలుదువ్విన చరిత్ర మాత్రం ఇరాన్‌కు లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెత్తనం చేజారుతోందని గ్రహించిన అమెరికా ప్రపంచంపై ఏదో రకమైన సంక్షోభం రుద్దడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ క్రమంలో మన దేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవ స్థలు తలకిందులవుతాయి. పశ్చిమాసియాలో యుద్ధం బయల్దేరితే ఆ ప్రాంతంనుంచి చమురు సరఫరా నిలిచిపోతుంది. అలాగే ఇరాన్, సౌదీ అరేబియాతోసహా పలు దేశాలతో మనకున్న వాణిజ్యం ఆగిపోతుంది. ట్రంప్ తాజా ప్రకటన గమనిస్తే వెంటనే యుద్ధం వచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే ఉద్రిక్తతలు మాత్రం ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేదు. ఈ దశలోనైనా ఆ ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా ప్రపంచ దేశాలన్నీ చిత్త శుద్ధితో కృషి చేయాలి. -
ప్రపంచం ఇరాన్‌ను ఒంటరి చెయాలి: ట్రంప్
వాషింగ్టన్: ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు ఇరాన్‌ను ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇక మీదట ఎటువంటి ఉగ్రవాదాన్ని కొనసాగనివ్వమని ట్రంప్ హెచ్చరించారు. సులేమానినీ ఉగ్రవాద సంస్ధ హిజ్బుల్లాకు మద్ధతిచ్చారని ఆయన మండిపడ్డారు. ఇరాన్ దారికి రాకుంటే కఠిన ఆంక్షలు విధిస్తామని ఆయన వెల్లడించారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలను విరమించుకోవాలని హెచ్చరించారు. ఇరాన్ చేసిన దాడిలో అమెరికన్లు ఎవరూ గాయపడలేదని ట్రంప్ వివరించారు. ఇరాన్‌కు అణుబాంబును ఎట్టి పరిస్థితుల్లో చిక్కనివ్వమని ట్రంప్ తెలిపారు. సులేమానినీ చంపడం తప్పేమి కాదని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. అదేవిధంగా తమకు ఎవరి చమురు అక్కర్లేదని.. తమ దగ్గరే కావాల్సినంత ముడి చమురు ఉందని ట్రంప్ తెలిపారు. -
80 మంది చచ్చారు.. ఇంకా 100 లక్ష్యాలు!
టెహ్రాన్: ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 80 మంది ‘అమెరికా ఉగ్రవాదులు’ మరణించారని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రయోగించిన 15 క్షిపణులు లక్ష్యాల్ని ఛేదించడంలో సఫలమయ్యాయని తెలిపింది. ఈ దాడిలో అమెరికా హెలికాప్టర్లు, సైన్యం సామాగ్రి పూర్తిగా ధ్వంసమైనట్లు పేర్కొంది. అదే విధంగా ఈ దాడులకు ప్రతిగా అమెరికా ఎదురుదాడికి దిగితే సమాధానం చెప్పడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా చర్యలను తిప్పికొట్టేందుకు ఇరాక్‌లో మరో 100 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ వర్గాలు తెలిపాయని పేర్కొంది.(ఇరాన్ ప్రతీకార దాడి; రేపే ప్రకటన: ట్రంప్) కాగా అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న ఇరాకీ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అల్- అసద్, ఇర్బిల్‌లో ఉన్న వైమానిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. తమ జనరల్ సులేమానీని డ్రోన్ దాడిలో చంపిన అమెరికా సైనికులు.. ఈమేరకు ఆదేశాలు జారీ చేసిన రక్షణశాఖ (పెంటగాన్), అనుబంధ సంస్థల అధికారులు, ఏజెంట్లు, కమాండర్లందరినీ ఉగ్రవాదులుగా పరిగణిస్తామంటూ ఇరాన్ పార్లమెంట్ తీర్మానించిన విషయం తెలిసిందే.(అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు) ఇక ఇరాన్ చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలో ఎక్కడలేనటువంటి.. అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ తమ వద్ద ఉందని.. గురువారం ఉదయం ఓ ప్రకటన చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణి దాడి చేయడాన్ని ఇరాన్ సమర్థించుకుంది. ఆత్మరక్షణ కోసమే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపింది. అంతేకాదు తమ పౌరుల రక్షణ కోసం ఎంతదాకా వెళ్తామని అమెరికాకు కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా విరోధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా సైన్యాలు ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన నేపథ్యంలో.. ఇరాన్ ప్రతీకారంగా క్షిపణి దాడులు చేసింది. దీంతో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. -
ఇరాన్ ప్రతిదాడి
-
ఇరాన్ దాడి; రేపే ప్రకటన: ట్రంప్
వాషింగ్టన్/టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. తమ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చినందుకు గానూ ఇరాన్.. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. పన్నెండు బాలిస్టిక్ క్షిపణులతో అమెరికా వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. కాగా ఇరాన్ చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అంతేగాకుండా యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు జారీ చేశారు. ఈ మేరకు.. ‘అంతా బాగుంది! ఇరాక్‌లో ఉన్న రెండు సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఇదంతా చాలా బాగుంది! ప్రపంచంలో ఎక్కడలేనటువంటి.. అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ మా దగ్గర ఉంది! రేపు ఉదయం నేను ఓ ప్రకటన చేస్తాను’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. (అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు) All is well! Missiles launched from Iran at two military bases located in Iraq. Assessment of casualties & damages taking place now. So far, so good! We have the most powerful and well equipped military anywhere in the world, by far! I will be making a statement tomorrow morning. — Donald J. Trump (@realDonaldTrump) January 8, 2020 ఆత్మరక్షణ కోసమే: ఇరాన్ ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణి దాడి చేయడాన్ని ఇరాన్ సమర్థించుకుంది. ఆత్మరక్షణ కోసమే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ మాట్లాడుతూ.. ‘ఐక్యరాజ్య సమితి చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం... మా పౌరులు, సీనియర్ అధికారులపై పిరికిపంద దాడులు చేసిన వారి నుంచి ఆత్మరక్షణ కోసమే ఈ చర్యకు పూనుకున్నాం. అంతేగానీ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అయితే మాకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకునేందుకు ఏ అవకాశాన్ని వదులుకోం’అని స్పష్టం చేశారు.(52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్! ) Iran Foreign Minister Javad Zarif: We do not seek escalation or war, but will defend ourselves against any aggression. (2/2) https://t.co/sQWSje74fh — ANI (@ANI) January 8, 2020 -
ఇరాన్ దాడి : భగ్గుమన్న చమురు
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సైనిక దాడి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను రాజేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇరాక్‌లోని అమెరికా రెండు ఎయిర్‌బేస్‌లపై క్షిపణి దాడి అనంతరం బుదవారం ఉదయం చమురు ధర 4.5 శాతం ఎగిసింది. డబ్ల్యుటిఐ 4.53 శాతం పెరిగి బ్యారెల్ 65.54 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధర ఒకదశలో 70 డాలర్లును దాటింది. ప్రస్తుతం 69.29 వద్ద వుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. మరోవైపు మంగళవారం కొద్దిగా శాంతించిన బంగారం ధరలు నేడు మరోసారి పుంజుకున్నాయి. ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. మిలిటరీ కమాండర్ ఖాసేం సులేమాని అమెరికా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్లో స్పందించారు. దాడిని ధృవీకరించిన ట్రంప్, అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నామనీ, తమ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలున్నాయని హెచ్చరించారు. దీనిపై రేపు (గురువారం) ఒక ప్రకటన చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. చదవండి : అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే -
కెర్మన్‌లో సులేమనీ అంత్యక్రియలు
-
అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
బాగ్దాద్: అమెరికా సైన్యాలు ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన నేపథ్యంలో.. ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న ఇరాకీ స్థావరాలే లక్ష్యంగా బుధవారం దాడులకు దిగింది. అల్- అసద్, ఇర్బిల్‌లో ఉన్న వైమానిక స్థావరాలపై దాదాపు పన్నెండు బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో... ఇరాన్, ఇరాక్ గగనతలం మీదుగా తమ విమానాలు ప్రయాణించకుండా అమెరికా నిషేధం విధించింది. అదే విధంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ జలాల మీదుగా వెళ్లే విమానాలను సైతం నిషేధిస్తూ ఎయిర్‌మెన్‌కు నోటీసులు జారీ చేసింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్ క్షిపణి దాడుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని పెంటగాన్ తెలిపింది. ‘ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ పన్నెండుకు పైగా క్షిపణులతో దాడికి దిగింది’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. (సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట) కాగా ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. గత మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం రాకెట్ దాడికి పాల్పడి.. ఇరాన్ జనరల్ సులేమానిని హతమార్చింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్- అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.(‘అమెరికా ఉగ్రవాదులు’ ; జర్మనీ కీలక నిర్ణయం) ఇక ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా విరోధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అండతో పాలిస్తున్న ఇరాన్ పాలకుడు మొహమ్మద్ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా 1979లో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళనకారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నవంబర్ నుంచి 1981 జనవరి వరకు ముట్టడించారు. ఈ సమయంలో దాదాపు 52 మంది అమెరికన్లను బందీలుగా చేశారు. ఈ క్రమంలో గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ పౌర విమానాన్ని అమెరికా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు.(52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్!) ఇందుకు కొనసాగింపుగా 2000లో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు విధించింది. అంతేగాకుండా ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను తమ దుష్టత్రయం(2002)లో చేర్చింది. ఈ నేపథ్యంలో బరాక్ ఒబామా తన పదవీ కాలంలో ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకున్నారు. ఈ క్రమంలో 2015లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్... 2019లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా దాడుల నేపథ్యంలో అవి తారస్థాయికి చేరుకున్నాయి. (ఇరాన్‌కు అమెరికా షాక్!) #WATCH: Iran launched over a dozen ballistic missiles at 5:30 p.m. (EST) on January 7 and targeted at least two Iraqi military bases hosting US military and coalition personnel at Al-Assad and Irbil, in Iraq. pic.twitter.com/xQkf9lG6AP — ANI (@ANI) January 8, 2020 -
సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట
టెహ్రాన్/వాషింగ్టన్/బెర్లిన్/బ్రస్సెల్స్: అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందిన ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ అంతిమయాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 50 మంది మరణించగా మరో 200 మంది వరకు గాయపడ్డారని ఇరాన్ మీడియా వెల్లడించింది. సులేమానీ అంతిమయాత్ర ఆయన స్వస్థలం కెర్మన్‌లో మంగళవారం జరిగింది. తమ ప్రియతమ నాయకుడికి నివాళులర్పించడానికి లక్షల్లో పోటెత్తిన జనం అదుపుతప్పడంతో తొక్కిసలాట జరిగింది. అనంతరం వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, గాయపడిన వారి అరుపులు, కేకలతో కూడిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ ప్రసారం చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. అంతకు ముందు కెర్మన్లోని కూడలిలో గుమికూడిన వేలాది మందిని ఉద్దేశించి రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ హొస్సేన్ సలామీ మాట్లాడారు. అమెరికాకు మద్దతిచ్చే ప్రాంతాలను బుగ్గిపాలు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. వాళ్లందరూ ఉగ్రవాదులే ‘అమెరికా సైనికులు, రక్షణశాఖ (పెంటగాన్), అనుబంధ సంస్థల అధికారులు, ఏజెంట్లు, కమాండర్లతోపాటుæ సులేమానీని డ్రోన్ దాడిలో చంపాలని ఆదేశించిన వారందరూ ఉగ్రవాదులే. అమెరికా సైనిక, నిఘా, ఆర్థిక, సాంకేతిక, రవాణా, సేవా రంగాలకు చెందిన బలగాలకు ఎలాంటి సాయం చేసినా ఉగ్రవాదులకు సాయపడినట్లే పరిగణిస్తాం’అంటూ ఇరాన్ పార్లమెంట్ తీర్మానించింది. జనరల్ సులేమానీ నేతృత్వం వహించిన రివల్యూషనరీ గాడ్స్‌లోని ఖుద్స్ బలగాల విదేశీ కార్యకలాపాలకు గాను రూ.1600 కోట్లు కేటాయించేందుకు కూడా ఆమోదం తెలిపింది. కాగా, సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రభుత్వం 13 రకాలైన పథకాలను సిద్ధం చేసిందని ఇరాన్ వార్తా సంస్థ ‘తస్నిమ్’తెలిపింది. ఐరాస సమావేశాల్లో పాల్గొనాల్సిన ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్‌కు అమెరికా వీసా నిరాకరించింది. సమయం దొరకనందున జరీఫ్‌కు వీసా ఇవ్వలేదంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమాచారమిచ్చారంటూ ఐరాస చీఫ్ గుటెరస్ తెలిపారని ఆయన వెల్లడించారు. శతాబ్దంలోనే తీవ్రస్థాయి ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అస్థిర పరిస్థితుల మధ్యే ఈ నూతన సంవత్సరం మొదలైంది. మనం ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ శతాబ్దంలోనే అతితీవ్ర స్థాయికి చేరాయి’అని న్యూయార్క్‌లో అన్నారు. ఇరాక్‌లోని తమ బలగాల ఉపసంహరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ వెల్లడించారు. అమెరికా బలగాలు అప్రమత్తం అమెరికా నేవీ తమ యుద్ధ నౌకలకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. హోర్ముజ్ జల సంధి గుండా ప్రయాణించే చమురు నౌకలకు ముప్పు నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకుంటామని బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నావికా దళం పేర్కొంది. -
సులేమానీ అంత్యక్రియల్లో అపశ్రుతి.. 35 మంది మృతి
టెహ్రాన్ : ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో.. 35 మంది మృతి చెందగా, 48 మంది గాయపడినట్టు ఇరాన్ ప్రభుత్వ చానల్ తెలిపింది. సులేమానీ స్వస్థలం కెర్మన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ చీఫ్ కౌలివాండ్ ధ్రువీకరించారు. సులేమానీ అంతిమయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది ఇరానీయులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు ఆన్లైన్లో పోస్ట్ చేయగా.. అందులో పలువురు రోడ్డుపై విగత జీవులుగా కనిపించగా.. మరికొందరు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు. కాగా, బాగ్దాద్‌లో శుక్రవారం అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతని మృతదేహాన్ని టెహ్రాన్‌కు తరలించారు. సులేమానీ అంతిమయాత్రలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ సహా సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పాల్గొన్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అమెరికా డ్రోన్ దాడి : ఆ వీడియో అసలైనదేనా !
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానిని హతమార్చడానికి అమెరికా డ్రోన్ విమానం క్షిపణులతో పేల్చివేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారంలోకి వచ్చాయి. సులేమానీ ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై డ్రోన్ ద్వారా బాంబులు ప్రయోగించి పేల్చిన ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ అంటూ తెర ప్రచారంలోకి వచ్చిన ఈ వీడియో నకిలీది కావడం గమనార్హం. ఒక వీడియో గేమ్‌లోని వీడియో క్లిప్పును ఈ రకంగా ప్రచారంలోకి తెచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ వాస్తవానికి ‘వీడియో వార్ గేమ్–ఆర్మా 3’లోనిది. ఇదే వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా, అప్పుడు రెండు లక్షల మంది వీక్షించారు. అందులో ఇద్దరు టర్కీ సైనికులు వాకీ టాకీలో మాట్లాడుతుండగా, వెనక బ్యాక్ గ్రౌండ్లో టర్కీ సంగీతం కూడా వినిపిస్తుంది. సిరియాలోని ఆఫ్రిన్ ప్రాంతంలో టర్కీ డ్రోన్ దాడులు జరిపిన వీడియో అంటూ నాడు టర్కీ ప్రభుత్వ టీవీ ఇదే వీడియోను ప్రసారం చేసింది. ఎలాంటి యుద్ధ వార్తలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన ‘వీడియో గేమ్’ దృశ్యాలను ప్రసారం చేయడం టర్కీ టీవీ ఛానళ్లకు మొదటి నుంచి అలవాటు. ఇప్పుడు ఆ జబ్బు ప్రపంచ వ్యాప్తంగా చాలా టీవీ ఛానళ్లకు పట్టుకుంది. అమెరికా, ఇరాక్ దేశాలు కుమ్మక్కయ్యాయంటూ ఒకప్పుడు రష్యా ప్రభుత్వం కూడా ‘ఏసీ–130 గన్‌షిప్ సిములేటర్’ మొబైల్ గేమ్ క్లిప్పును ప్రసారం చేసింది. వాటిని వీక్షించిన వాళ్లు ఆ క్లిప్పింగ్‌లను కాపీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. నాడు భారత్ వైమానిక దళం పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి పాక్ టెర్రరిస్టుల స్థావరాన్ని పేల్చివేసిన దృశ్యాలంటూ భారత్ టీవీ ఛానళ్లలో కూడా వార్ వీడియో గేమ్ క్లిప్పింగ్‌లను ప్రసారం చేశాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లిప్పింగ్‌కు సంబంధించిన ‘ఆర్మా 3 వీడియో వార్ సిములేషన్ గేమ్’ వీడియోను యూట్యూబ్ గత ఏప్రిల్ నెలలోనే లోడ్ చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్‌లోని టర్కీష్ మాటల స్థానంలో ఇంగ్లీష్ మాటలను లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఏ నకిలీ వీడియోనైనా ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ పద్ధతిలో పట్టుకోవచ్చు. ఇందుకు ‘ఇన్విడ్, రివ్‌ఐ’ అన్న టూల్స్ కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. లేదంటే వీడియోలో చెబుతున్న లొకేషన్, వాస్తవంగా సంఘటన జరిగిన లొకేషన్ ఒక్కటేనా అన్న విషయాన్ని గూగుల్ ఎర్త్, వికీమాపియా ద్వారా కూడా సులభంగానే తెలుసుకోవచ్చు. ఇరాన్ జనరల్ సులేమాన్‌పై అమెరికా జరిపిన డ్రోన్ దాడికి సంబంధించిందేనా వైరల్ వీడియో అన్నది తేల్చుకోవడానికి ఇంత సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలు. ఆ రోజు సులేమాన్, ఆయన ఇరాక్ మద్దతుదారు అబూ మెహదీ అల్‌తో కలిసి ఒక టయోటా ఎస్యూవీ కారులో బాగ్దాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరగా, వారి ఇద్దరికి సంబంధించిన 8 మంది బాడీ గార్డులు మరో టయోటా ఎస్‌యూవీలో బయల్దేరారు. అమెరికా డ్రోన్ ద్వారా వాటిపైకి మూడు క్షిపణులను ప్రయాగించగా ఆ రెండు ఎస్యువీ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కరు కూడా బయట పడలేదు. పైగా అమెరికా డ్రోన్‌కు ఒకే సారి నాలుగు క్షిపణులను మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో పదులు, ఇరవై సంఖ్యలో క్షిపణులు ప్రయోగించగా ఏడెనిమిది సైనిక వాహనాలు ధ్వంసం అవడం, ధ్వంసమవుతున్న వాహనాల నుంచి తుపాకులు పట్టుకున్న సైనికులు బయటకు రావడం కనిపిస్తోంది. కొసమెరుపు : ఏసీ 130 గన్‌షిప్ సిమ్యులేటర్ కాన్వాయ్ ఎంగేజ్మెంట్ పేరుతో 2015 లోనే ఒక వీడియో గేమ్ యూట్యూబ్‌లో పబ్లిష్ కాగా 57 లక్షలకుపైగా వీక్షించారు. అందులోని క్లిప్పులే ఇలాంటి సందర్భాల్లో అనేక రకాలుగా వాడుకలోకి తెచ్చి వైరల్ చేస్తున్నారు. -
ఈ వీడియోలు అసలువా, నకిలీవా!?
-
‘అమెరికా ఉగ్రవాదులు’ ; జర్మనీ కీలక నిర్ణయం
బెర్లిన్/టెహ్రాన్: ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా మట్టుబెట్టిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. గత మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకార చర్యగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం రాకెట్ దాడికి పాల్పడి.. అగ్రరాజ్యం సులేమానిని హతమార్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. అంతేగాకుండా ఇరాక్ పార్లమెంట్ సైతం అమెరికా తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ తీర్మానం చేసింది. అదే విధంగా... సులేమానీని హతమార్చిన అమెరికా సైన్యాన్ని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఇరాన్ పార్లమెంట్ మంగళవారం తీర్మానించింది. దీంతో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.(52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్!) ఈ నేపథ్యంలో జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాక్‌లో మోహరించిన తమ బలగాలు కొన్నింటిని వెనక్కి పిలిపించినట్లు పేర్కొంది. బాగ్దాద్, తాజీలో ఉన్న సదరు బలగాల(30 మంది సైనికులు)ను జోర్డాన్, కువైట్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్ మట్లాడుతూ.. ‘ఇరాక్ ప్రభుత్వం, పార్లమెంట్ నుంచి మాకు ఆహ్వానం అందినపుడు బలగాలు మోహరించాం. అయితే ప్రస్తుతం విదేశీ బలగాలు తమ దేశం విడిచి వెళ్లాలని ఆ దేశ పార్లమెంట్ తీర్మానించింది. కాబట్టి చట్టప్రకారం మేం అక్కడ ఉండకూడదు. ఇందుకు సంబంధించి త్వరలోనే బాగ్దాద్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను ఎదుర్కొనే క్రమంలో ఇరాక్‌కు మద్దతుగా.. జర్మనీ దాదాపు 415 మంది సైనికులను అక్కడ మోహరించిన విషయం తెలిసిందే. (ఇరాన్‌కు అమెరికా షాక్!) ఇక పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ‘ ఇటువంటి సందర్భాల్లో ఐఎస్‌కు వ్యతిరేకంగా జట్టుగా కలిసి ఉండటం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధాన్ని ప్రమాదంలో పడవేయవద్దని విఙ్ఞప్తి చేశారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సంబంధిత కథనాలు ట్రంప్ తలపై రూ.575 కోట్లు మా ప్రతీకారం భీకరం నిశ్శబ్దంగా చంపేశారు అమాయకులను చంపినందుకే.. -
ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అసభ్యకరంగా పోస్టులు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్ డారెన్ లీమన్ ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని లీమన్ అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌కు కోచ్‌గా లీమన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం బ్రిస్బేన్- సిడ్నీ థండర్స్ మ్యాచ్ సందర్భంగా లీమన్ బిజీగా ఉండటంతో అతడి ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైన విషయాన్ని ఆలస్యంగా గుర్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీమన్ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా.. ఇరాన్, ఖాసీం సులేమానీలకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేశాడు. అంతేకాకుండా లీమన్ ఖాతా పేరును 'Qassem Soleimani| F**k Iran' గా అసభ్యకరంగా మార్చాడు. దీంతో లీమన్ ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా కొందరు లీమన్‌పై దుమ్మెత్తిపోశారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన లీమన్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాడు. తన ట్విటర్ ఆకౌంట్‌కు హ్యాక్‌కు గురైందని బ్రిస్బేన్ హీట్ అధికారిక ట్విటర్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లు, పోస్ట్‌లను ఎవ్వరూ నమ్మవద్దని, తనను తప్పుగా అపార్థం చేసుకోవద్దని తన ఫోలవర్స్‌కు, అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా తన ఫాలోవర్స్‌కు క్షమాపణలు చెప్పాడు. అయితే తన ట్విటర్ హ్యాక్ గురవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూశాక కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు. కాస్త విరామం తర్వాత మళ్లీ వసానని, అప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటానన్నాడు. లీమన్‌కు 3,40,000కు పైగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక లీమన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడు. ఆటకు సంబంధించి ఛలోక్తులు విసురుతుంటాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా కోచ్ పదవికి లీమన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ట్విటర్ హ్యాక్‌కు గురైన రెండో ఆసీస్ మాజీ క్రికెటర్‌గా లీమన్ చేరాడు. గతేడాది అక్టోబర్‌లో షేన్ వాట్సన్ అకౌంట్ కూడా హ్యాక్‌కు గురైంది. వాట్సన్ ట్విటర్ ఆకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్ అశ్లీల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులతో పాటు, వాట్సన్ కూడా షాక్‌కు గురయ్యాడు. అయితే తన వలన జరిగిన అసౌకర్యానికి వాట్సన్ అభిమానులకు క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. ఆ హెలికాప్టర్‌ను తమ సైన్యమే పేల్చేసిందని, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో రెండు దేశాల మధ్య అగ్గి రాజుకుంది. అమెరికాపై ప్రతిదాడి తప్పదని ఇరాన్.. గట్టిగానే హెచ్చరించింది. అయితే, ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్‌కు మరిన్ని సైనిక బలగాలను పంపుతున్నట్టు అమెరికా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంది. -
52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్!
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాక్‌లో జరిపిన రాకెట్ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ సులేమానీ అంతిమయాత్రకు కోట్లాది మంది తరలివచ్చి అశ్రునివాళి అర్పించారు. ఈ సందర్భంగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ సహా సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రతిన బూనారు. అంతేగాకుండా ట్రంప్ తలపై సుమారు రూ. 575 కోట్ల రివార్డు ప్రకటించినట్లు స్థానిక ప్రభుత్వ మీడియా పేర్కొంది. అదే విధంగా అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో తాము సైతం భీకర ప్రతీకారానికి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. దీంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ట్రంప్‌ను మరోసారి హెచ్చరించారు. 52 ప్రదేశాలు లక్ష్యంగా దాడులకు పాల్పడతామన్న ట్రంప్ బెదిరింపులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇరాన్‌ను బెదిరించే సాహసం చేయొద్దని హితవు పలికారు. ఈ మేరకు.. ‘ఎవరైతే నంబరు 52 గురించి మాట్లాడుతున్నారో.. వారు 290 గురించి కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివి ఇరాన్ జాతిని బెదిరించలేవు’ అంటూ 1988లో అమెరికా ఇరాన్లో సృష్టించిన మృత్యుఘోషను గుర్తుచేశారు. ట్రంప్ 52 ప్రదేశాల్లో దాడి జరిపితే... తాము 290 టార్గెట్లు పెట్టుకుంటామని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. (ట్రంప్ తలపై రూ.575 కోట్లు) ఎందుకు 52.... 290? ఇరాన్ ప్రతీకార హెచ్చరికల నేపథ్యంలో... ‘అమెరికన్లపై కానీ, అమెరికా ఆస్తులపై కానీ, అమెరికా స్థావరాలపై కానీ దాడులకు దిగితే ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్లో రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైన 52 ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాలు లక్ష్యంగా చేసే దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా 1979-81 మధ్య 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టింది. ఈ ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ఉటంకిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో హసన్ రౌహానీ సైతం అదే రీతిలో IR655 హ్యాష్‌ట్యాగ్‌తో ట్రంప్‌నకు బదులిచ్చారు. 1988 జూలై 3న టెహ్రాన్ నుంచి దుబాయ్ బయల్దేరిన ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 655 ను అమెరికా నౌకాదళ క్షిపణి కూల్చివేసింది. దాడి సమయంలో విమానంలో ఉన్న మొత్తం 290 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 66 మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇది అనుకోకుండా జరిగిన దాడి అని అమెరికా చేతులు దులుపుకుంది. 1988 ఇరాన్- ఇరాక్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాక్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా... పర్షియన్ గల్ఫ్‌లో షిప్పింగ్ మార్గాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పొరబాటున పౌర విమానాన్ని కూల్చివేశామని పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం అంత తేలికగా ఈ ‘నరమేధాన్ని’ మరచిపోలేదు. సులేమాని అంత్యక్రియల్లో సైతం ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ.. అమెరికాకు ఇక చావే అంటూ నినదించింది. తాజాగా ఈ ఘటనను గుర్తుచేస్తూ హసన్ ట్రంప్‌నకు కౌంటర్ ఇచ్చారు.(‘కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’) Those who refer to the number 52 should also remember the number 290. #IR655 Never threaten the Iranian nation. — Hassan Rouhani (@HassanRouhani) January 6, 2020 -
ట్రంప్ తలపై రూ.575 కోట్లు
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ జనరల్ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఇరాన్ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన జనరల్ సులేమానీ(62) మృతదేహం సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది. సులేమానీకి నివాళులర్పించేందుకు నలుపు రంగు దుస్తులు ధరించిన జనం ఇసుకేస్తే రాలనంతమంది తరలివచ్చారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. జనరల్ సులేమానీ, తదితరులకు చెందిన శవపేటికల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో ఖమేనీ కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యక్షుడు రౌహానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపిన వారికి భారీ బహుమానం అందజేస్తామంటూ ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్(సుమారు రూ.71.79) చొప్పున రూ.575 కోట్లు చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామన్నట్లు మిర్రర్ వెబ్సైట్ తెలిపింది. సులేమానీకి నివాళులర్పిస్తూ ఖమేనీ కంటతడి అలాగైతే.. ఇరాక్‌పైనా ఆంక్షలు అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానించడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.‘ఇరాక్ కోసం మేం చాలా డబ్బు వెచ్చించాం. మా బలగాలను ఉంచిన వైమానిక స్థావరం ఏర్పాటుకు కోట్లాది డాలర్ల ఖర్చయింది. అదంతా తిరిగి చెల్లించకుండా ఖాళీ చేసేదిలేదు. ఒక వేళ మాపై ఒత్తిడి చేసినా, తేడాగా వ్యవహరించినా ఎన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ఆంక్షలను ఇరాక్ చవిచూడాల్సి ఉంటుంది’అని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అణు ఇంధన శుద్ధి పరిమితులపై.. తాజా పరిణామాల నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని ఇరాన్ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా, 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విరోధం ఇప్పటిది కాదు ► 1979: అమెరికా అండతో కొనసాగుతున్న ఇరాన్ పాలకుడు మొహమ్మద్ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళనకారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నవంబర్ నుంచి 1981 జనవరి వరకు ముట్టడించారు. ► 1988: గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ విమానాన్ని అమెరికా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ► 2000: ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు. ► 2002: ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను అమెరికా దుష్ట్రతయంలో చేర్చింది. ► 2013–16: ఒబామా హయాంలో ఇరాన్‌తో సంబంధాలు గాడినపడ్డాయి. ► 2015: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ► 2019: అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. -
అమెరికాపై ప్రతీకారం తప్పదు: ఇరాన్
-
అమెరికాపై ప్రతీకారం తప్పదు
‘అమెరికాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని అమెరికా క్షిపణి దాడిలో మరణించిన ఖాసిం సులేమానీ స్థానంలో ఇరాన్ జనరల్‌గా నియమితులైన ఎస్మాయిల్ ఘానీ సోమవారం ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ‘మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనికులపై దాడులు నిర్వహించి తీరుతాం. తమ పిల్లల చావు కోసం వారి తల్లులు, కుటుంబ సభ్యులు నిరీక్షించాలి’ అంటూ సులేమాని కుమార్తె జైనాబ్ సోమవారం ఇరాన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ హెచ్చరించారు. ఇరాన్ భూభాగం నుంచి అమెరికా సైనికులంతా వెళ్లి పోవాలంటూ ఇరాన్ పార్లమెంట్ తీర్మానం చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సులేమాని హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని ఆ దేవుడే హామీ ఇచ్చారు. తగిన శాస్త్రి చేయగలవాడు అతనే. తప్పకుండా ఆయన చర్యలు ఉంటాయని భావిస్తున్నాను’ ఎస్మాయిల్ ఘానీ వ్యాఖ్యానించారు. అమెరికాపై ఇరాన్ సైనిక దాడి లేదా ఇస్లామిక్ మిలిటెంట్ల ద్వారా ప్రతీకారం తీర్చుకోవచ్చంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుండగా నష్టపరిహారంగా తమకు వందల కోట్ల డాలర్లు చెల్లించాలని, లేకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. చదవండి : మా ప్రతీకారం భీకరం ట్రంప్ తలపై భారీ రివార్డు ప్రకటించిన ఇరాన్..! ఆందోళనకు ఊపిరి పోస్తున్న ‘పాటలు’ ఆయన సూట్ వేసుకున్న టెర్రరిస్టు.. ఖాసీం అంత్యక్రియలు.. హోరెత్తిన నినాదాలు ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ అమాయకులను చంపినందుకే.. -
ట్రంప్ తలపై భారీ రివార్డు ప్రకటించిన ఇరాన్..!
టెహ్రాన్ : ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశం మరోసారి స్పష్టం చేసింది. ఇరాన్ అధికారిక ఛానెల్ ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చిన వారు 80 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.570 కోట్లు) గెలుచుకోవచ్చని తెలిపింది. దేశంలోని ప్రతి పౌరుడు తలా ఒక డాలర్ చొప్పున పోగుచేసి ఆ మొత్తాన్ని ట్రంప్ ప్రాణాలు తీసిన వారికి రివార్డుగా ఇస్తామని వెల్లడించింది. ‘ఇరాన్ జనాభా 8 కోట్లు. మా దేశ జనాభా ఆధారంగా ట్రంప్ తల నరికి తెచ్చివారికి రివార్డు ప్రకటించాం’అని సదరు టీవీ ఛానెల్ పేర్కొంది. (చదవండి : నిశ్శబ్దంగా చంపేశారు) కాగా, ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అయితే, ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ శనివారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. (చదవండి : మా ప్రతీకారం భీకరం) -
క్యూ3 ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల క్యూ3 (అక్టోబర్ – డిసెంబర్) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–ఇరాన్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. డ్రోన్ దాడి జరిపి తమ మిలటరీ కమాండర్ కాసిం సులేమానీని హతమార్చిన అమెరికాపై ప్రతీకార చర్య తప్పదని తాజాగా ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో సైతం ఒడిదుడుకులకు గురయ్యే ఆస్కారం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే.. కేంద్ర బడ్జెట్ సమీపిస్తుండడం వంటి సానుకూల సంకేతాలు మార్కెట్‌ను భారీ పతనం నుంచి నిలబెట్టేందుకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. భౌగోళిక రాజకీయ ప్రకంపనలు లాభాల స్వీకరణలకు ఆస్కారం ఇవ్వవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. తాజా పరిణామాలతో ముడిచమురు ధరలు పెరిగిపోగా.. ఈ వారంలో కూడా క్రూడ్ ర్యాలీ మరింత కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపేందుకు అవకాశం ఉందని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ విశ్లేషకులు సంతోష్ మీనా అన్నారు. ఫలితాల ప్రభావం... ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ఈ వారం నుంచే ప్రారంభంకానుంది. ఇన్ఫోసిస్, అవెన్యూ సూపర్ మార్ట్స్ (డీమార్ట్), ఇమామీ, ఐటీఐ, జీటీపీఎల్ హాత్వే కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. స్థూల ఆర్థికాంశాలు... గతేడాది డిసెంబర్ సర్వీసెస్ పీఎంఐ ఈ నెల 6న (సోమవారం) వెల్లడికానుండగా.. నవంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 10న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. రూ. 2,418 కోట్ల పెట్టుబడి వెనక్కు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 2,418 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. అమెరికా–ఇరాన్ తాజా పరిణామాల కారణంగా 2020లో జనవరి 1–3 కాలంలో వీరు స్టాక్ మార్కెట్ నుంచి రూ. 524 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,893 కోట్లు వెనక్కు తీసుకున్నారు.