raithu barosa yatra
-
వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
వసంతరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సున్నిపెంటలో వైఎస్ఆర్సీపీ నేత వసంతరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. 2015లో టీడీపీ వర్గీయుల చేతిలో వసంతరావు హత్యకు గురయ్యారు. అంతకుముందు శ్రీశైలం చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శ్రీశైలం నుంచి మొదటి విడత రైతు భరోసా యాత్ర గురువారం ప్రారంభమైంది. శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో మొదటి రోజు ఆయన పర్యటన కొనసాగుతోంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. -
మోసం కాదు.. మేలు చెయ్..
సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు - ‘అనంత’లో మొదలైన ఐదో విడత రైతు భరోసా యాత్ర - బంగ్లాలో కూర్చొనిరాష్ట్రం బాగుందని అబద్ధాలు చెబితే సరిపోదు - మీ మాటలు నమ్మినందుకు రైతులకు ఆత్మహత్యలే దిక్కవుతున్నాయి - పల్లెల్లో రైతు కుటుంబాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో చూడు - ప్రతిపక్షం గొంతు వినిపించకుండా చేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు - ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 40 కోట్లు చెల్లిస్తున్నారు.. ఆ డబ్బంతా ఎక్కడిది? - శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు? - రైతులు, డ్వాక్రా మహిళలతో వైఎస్ జగన్ ముఖాముఖి సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘రైతు, డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం... ఉద్యోగం రానివారికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రెండేళ్లయ్యింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆయన మోసపూరిత మాటలు నమ్మి, రుణాలు మాఫీ కాక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నాయి. చంద్రబాబు మాత్రం ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ అసెంబ్లీలో ఊదరగొడుతున్నారు. బంగ్లాలో కూర్చొనిరాష్ట్రం బాగుందని అబద్ధాలు చెబితే సరిపోదు. ఇప్పటికైనా బుకాయించడం మానుకో, పల్లెల్లోకి వచ్చి రైతు కుటుంబాలు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో చూడు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్ జగన్ ఐదో విడత రైతు భరోసా యాత్రను బుధవారం అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. తొలిరోజు తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలంలో పర్యటించారు. చిన్నవడుగూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నాగ సంజీవప్ప అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత దిమ్మగుడిలో నాగార్జునరెడ్డి, చింతలచెరువులో వెంకటనారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి కుటుంబాలను పరామర్శించారు. తొలుత పెద్దవడుగూరు మండల కేంద్రంలో రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ఏం చెప్పారంటే... ఇంతకంటే దారుణమైన పాలన ఉంటుందా? ‘‘రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు, సంతోషంగా ఉన్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఊదరగొడుతుంటే... ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? మీ మోసపూరిత వైఖరితోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీ కంటికి కనిపించలేదా? అని గట్టిగా నిలదీశా. బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. బంగారం మాత్రం ఇంటికి రాలేదు. రుణ మాఫీ పేరిట రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులు.. ఇలా అందరినీ మోసం చేసి, పంగనామాలు పెట్టారు. బాబు నిర్వాకం వల్ల రైతులు 18 శాతం అపరాధ వడ్డీ చెల్లిస్తున్నారు. బీమా, ఇన్పుట్ సబ్సిడీ సైతం రావడం లేదు. అనంతపురం జిల్లా నుంచి దాదాపు 5 లక్షల మంది రైతులు వలస వెళ్లారు. ఉపాధి హామీ పథకం అమలు కోసం కేంద్రం నుంచి ఏటా రూ.500 కోట్లు వస్తుంటే... రాష్ట్రంలో ప్రజలకు పనులు కల్పించకుండా ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. వలసల నివారణకు కనీసం ఉపాధి హామీ పనులు కూడా కల్పించలేకపోతున్నారు. ఇంతకంటే దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షం గొంతు వినిపించకుండా చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మా ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్ల దాకా ఇస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? అదంతా అవినీతి సొమ్ము కాదా?’’ యాడికి కాలువకు నీళ్లేవీ? ‘‘తాడిపత్రి నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.600 కోట్లతో యాడికి కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన హయాంలో కాలువ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ఆ కాలువకు నీళ్లివ్వలేదు. చంద్రబాబు హయాంలో కాలువలకు నీళ్లు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యాంలో 800 అడుగుల నుంచే నీళ్లు తీసుకెళుతుంటే ఆ అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏముంటుంది? ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మోసం చేయడం మానుకోవాలి. ప్రజలకు మేలు చేసేందుకు ముందుకు రావాలి’’ అని జగన్ సూచించారు. పెద్దవడుగూరు మండల కేంద్రంలో ప్రతిపక్ష నేత నిర్వహించిన ముఖాముఖిలో పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు మాట్లాడారు. -
అనంతలో ఐదో విడత రైతు భరోసా యాత్ర
-
బాబు నిర్వాకం వల్లే వడ్డీ భారం
♦ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం ♦ అనంతపురంలో 4వ విడత యాత్ర పూర్తి.. 28 కుటుంబాలకు జగన్ భరోసా (రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి) ‘అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా. మహిళలు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టొదు. బ్యాంకు అధికారులు అడిగితే కట్టేది లేదని నిక్కచ్చిగా చెప్పండని ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పగా హామీలు గుప్పించారు. తీరా పీఠమెక్కాక హామీలన్నింటినీ అటకెక్కించారు. చంద్రబాబు నిర్వాకం వల్లే ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మలపై వడ్డీ భారం పడింది.’అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఆప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ నెల 6 నుంచి అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర మంగళవారం(12వ తేదీ) చెన్నేకొత్తపల్లి మండలంలో దిగ్విజయంగా ముగిసింది. చివరిరోజు మండలంలోని వెంకటాంపల్లి, బసంపల్లి గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులు వన్నా వెంకట్రామిరెడ్డి, సోమశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మా ప్రభుత్వం వచ్చాక ఆర్థికసాయం... బసంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు సోమశేఖర్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. మృతుడి భార్య మాలతమ్మ జగన్‌ను చూడగానే కన్నీరుమున్నీరయ్యింది. తల్లి బాధను చూసి ఆరేళ్ల కుమారుడు కూడా ఏడ్వడం.. అది చూసి వారి కుటుంబ సభ్యులందరూ కంటతడి పెట్టడంతో జగన్‌తోపాటు అక్కడ ఉన్న అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. తల్లీబిడ్డలను జగన్ ఓదార్చారు. ‘ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటి? అప్పు ఎంత ఉంది? మాఫీ ఎంత అయ్యింది? ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా?’ అని ఆమెను జగన్ అడిగారు. ‘అప్పుల బాధతో నా భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకులోన్ రూ. 1.76 లక్షలు(మూడు వేర్వేరు బ్యాంకు అకౌంట్లలో) ఉంది. బంగారు రుణం రూ. లక్షకుపైగా ఉంది. బ్యాంకులోనుపై రూ. 40 వేలు మాత్రమే మాఫీ అయ్యింది. బంగారుపై ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. భర్త చనిపోయి ఎనిమిది నెలలవుతోంది. అధికారులు సాయం అందిస్తామంటున్నారు కానీ.. ఇంత వరకు ఒక్క పైసా ఇవ్వలేదు.’ అని మాలతమ్మ వాపోయింది. ‘నేను వస్తున్నానని తెలిసే వాళ్లు ఆర్థిక సాయం ఇస్తామని చెబుతుంటారు తల్లీ.. తీరా నేను వెళ్లిపోయాక సమస్య మళ్లీ మొద టికొస్తుంది’ అని జగన్ అన్నారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు కూడా తమ సమస్యలు ఏకరువు పెట్టారు. చంద్రబాబు మాటలు నమ్మి.. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో కష్టాలు పడుతున్నామని, తాకట్టు పెట్టిన బంగారు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయని వారు వివరించారు. డ్వాక్రా రుణాలపై వడ్డీ మీద వడ్డీ వేశారని, చంద్రబాబు మమ్మల్ని ఇంత మోసం చేస్తారని ఊహించలేదని. వితంతు పింఛన్లు కూడా ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని వారు తెలిపారు. ‘బాబు చేసిన నిర్వాకం వల్లే అందరిపైనా వడ్డీ భారం పడింది. మంచి రోజులు వస్తాయి తల్లీ.. అంతవరకు ఓపికపట్టండి. ఈ ప్రభుత్వం మీకు సాయం చేయకపోయినా మా ప్రభుత్వం వచ్చాక మీకు ఆర్థిక సాయం అందిస్తాం. పింఛన్లపై కోర్టులో కేసు వేసి మీకు న్యాయం జరిగేలా చూస్తా.’ అంటూ వారందరికీ జగన్ భరోసా ఇచ్చారు. పరిహారం కోసం పోరాడదాం... మంగళవారం ఉదయం అనంతపురంలోని ఆర్డీటీ అతిథి గృహం నుంచి యాత్రకు బయలుదేరిన జగన్ రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మీదుగా వెంకటాంపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నా వెంకట్రామిరెడ్డి నివాసానికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. మృతుడి భార్య నాగలక్ష్మమ్మతో ఆత్మహత్యకు దారితీసిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ‘పొలం ఎంత ఉంది? ఎన్ని బోర్లు వేశారు? వాటిలో నీళ్లు ఉన్నాయా? బ్యాంకు రుణం ఎంతుంది? బంగారు రుణం ఎంత? వాటిపై రుణమాఫీ ఎంత అయ్యింది? ఇన్సూరెన్సు, ఇన్‌పుట్‌సబ్సిడీ వచ్చిందా? ప్రభుత్వ ఆర్థిక సాయం రూ. 5 లక్షలు ఇచ్చారా?’ అని ఆమెను జగన్ అడిగారు. ‘ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఐదు బోర్లు వేసి నా నీళ్లు పడలేదు. బ్యాంకు లోను రూ.70 వేలు ఉంది. బంగారం లోను తీసుకోలేదు. డ్వాక్రా రుణం రూ. 30 వేలు ఉంది. బ్యాంకు లోనుకు గాను రూ. 14 వేలు మాత్రమే మాఫీ అయ్యింది. ఇన్సూరెన్సు, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఏదీ రాలేదు. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం అర్జీ పెట్టాం. అధికారులు వచ్చి విచారణ చేసి వెళ్లారు కానీ.. ఒక్క పైసా ఆర్థిక సాయం అందించలేదు. పింఛను కూడా ఇవ్వలేదు.’ అంటూ ఆమె వాపోయింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మీకు రూ. 5 లక్షల పరిహారం అందే లా చూస్తామని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. -
మేమొస్తేనే అధికారుల్లో చలనం
ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ విమర్శ రెండు కుటుంబాలకు పరామర్శ (రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి) : ‘ఇది దగాకోరు ప్రభుత్వం.. రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రతిపక్ష పార్టీ పరామర్శించేందుకు వస్తుందని తెలియగానే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మేమొస్తే తప్ప అధికారులు కదిలే పరిస్థితి కనిపించడం లేదు’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతన్నల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించకుండా ప్రభుత్వం లేనిపోని సాకులు చూపుతూ కాలం వెళ్లదీస్తోందన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఐదో రోజు ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని ఉప్పరపల్లి, ఎర్రగుంట గ్రామాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు పొన్నా మారుతీ ప్రసాద్, నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఉదయం పొన్నా మారుతీ ప్రసాద్ ఇంటికి చేరుకున్న జగన్.. మారుతీ ప్రసాద్ భార్య అక్కమ్మ, తల్లి నారాయణమ్మ, సోదరుడు తిరుపతయ్యలను ఓదార్చారు. ‘అధికారులెవరైనా వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారా? ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇచ్చిందా’ అని జగన్ ప్రశ్నించగా ‘ఏడాదిన్నర అవుతోంది. ఎవరూ రాలేదు. రూపాయి కూడా సాయం చేయలేద’ని భార్య అక్కమ్మ చెప్పారు. తల్లి నారాయణమ్మ మాట్లాడుతూ.. ‘నా భర్త చనిపోయి మూడేళ్లు, కొడుకు చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. ఇద్దరికీ ఇంత వరకూ వితంతు పింఛన్లు రాలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా అధికారులు పట్టించుకోలేదు. నా పెద్దకొడుకు వికలాంగుడు. వాడికి కూడా పింఛను ఇవ్వడం లేదు. నాకు కేన్సరొస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నా. సంవత్సరం బాగానే ఉంది. మళ్లీ రక్తం పడుతోంది. ఆసుపత్రికి వెళ్తే డబ్బులు కట్టమన్నారు. రూ. 30 వేలు ఖర్చు చేశా. ఇక పెట్టే శక్తి లేక వైద్యం చేయించుకోవడానికి వెళ్లలేదు’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా వైద్యం చేయమంటున్నారు అని ఆమె తెలిపింది. ఇందుకు జగన్ స్పందిస్తూ.. ‘అన్యాయం కదా! మీకు మేం ఆపరేషన్ చేయిస్తామ’ంటూ భరోసా ఇచ్చారు. ముగ్గురు పింఛన్ల విషయంపై లోకాయుక్తలో కేసు దాఖలు చేస్తామన్నారు. అనంతరం ఉప్పరపల్లి నుంచి ఎర్రగుంటకు చేరుకున్న వైఎస్ జగన్.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య నాగేంద్రమ్మ, కుమారులు సుదర్శన్‌రెడ్డి, చిన్న ఓబిరెడ్డిలను ఓదార్చారు. మీ నాన్న చనిపోయాక ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిందా అని ఆరా తీయగా.. ‘ఈ రోజే వీఆర్ఏ వచ్చి ఒక పేపర్ ఇచ్చి వెళ్లార’ని చెప్పాడు. జగన్ ఆ లెటర్‌ను తీసుకుని చదివారు. ‘ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వానికి లేదు. కాబట్టే నారాయణరెడ్డి చనిపోయి ఆరు నెలలవుతోన్నా.. పోస్టుమార్టం రిపోర్టు పెండింగ్‌లో ఉందని సాకులు చెబుతోంద’ని జగన్ మండిపడ్డారు. నారాయణరెడ్డి చిన్న కుమారుడు చిన్న ఓబిరెడ్డి మాట్లాడుతూ.. తాను విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నానని, ఫీజులు కట్టలేదని ఇంటికి పంపారని, మీరే ఆదుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన జగన్.. పక్కనే ఉన్న రాప్తాడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి సూచిస్తూ అతని చదువు బాధ్యతలు తీసుకోవాలన్నారు. సుదర్శన్‌రెడ్డికి కూడా ఉపాధి కల్పించాలని ప్రకాశ్‌రెడ్డికి సూచించారు. రైతు : పొన్నా మారుతీప్రసాద్ ఊరు : ఉప్పరపల్లి, అనంతపురం రూరల్ మండలం ఆత్మహత్య చేసుకున్నది: 26-7-2014 భార్య, 18 నెలల కుమార్తె ఉన్నారు. అప్పుల వివరాలు: అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అక్కమ్మ డ్వాక్రా మహిళా సంఘంలో సభ్యురాలిగా రూ. 20 వేలు రుణం తీసుకుంది. మాఫీ కాలేదు. ఈ ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు. రైతు : నారాయణరెడ్డి గ్రామం : యర్రగుంట, రాప్తాడు మండలం ఆత్మహత్య చేసుకున్నది: 29-7-2015 భార్య, ఇద్దరు కుమారులున్నారు. అప్పుల వివరాలు : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. 2.38 ఎకరాల భూమి ఉంది. భార్య పేరు మీద 4.15 ఎకరాలు ఉంది. పంట రుణం రూ. 31 వేలు తీసుకున్నాడు. ఇందులో రూ. 5,393 రుణమాఫీ అయింది. అనంతపురం కెనరా బ్యాంకులో బంగారంపై రూ. 95 వేలు రుణం తీసుకున్నాడు. ఇందులో రూ. 3,586 మాఫీ అయింది. భార్య నాగేంద్రమ్మ పేరుమీద రూ. 93,595 పంట రుణం ఉంది. ఇందులో రూ. 12,045 మాఫీ అయింది. ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించినా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. -
ఒక్క రూపాయీ ఇవ్వలేదు
-
ఒక్క రూపాయీ ఇవ్వలేదు
♦ ఆత్మహత్యల పరిహారంపైనా చంద్రబాబు మోసం ♦ రైతు భరోసా యాత్రలో జగన్మోహన్రెడ్డి ధ్వజం (రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘రైతులు చనిపోతే పరిహారంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇళ్లన్నీ తిరుగుతున్నా. ఈ జిల్లాలో దాదాపు 100 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. ఆ ఇళ్లకు పోయినపుడు అందరూ అన్నా మాకు ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదని చెబుతూ గొల్లుమంటున్నారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతూ.. మోసం చేస్తూ ఏ స్థాయికి వెళ్లిపోయాడో తెలుసుకునేందుకు ఇదో నిదర్శనం’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తర్వాత నెరవేర్చ లేదని జగన్ వివరించారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర ఐదోరోజైన ఆదివారం నాడు రాప్తాడు నియోజకవర్గంలోని బండమీదపల్లిలో రైతులు, డ్వాక్రా మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... హామీలు అటకెక్కించినందునే... ‘‘రైతు భరోసా యాత్ర సందర్భంగా ఇక్కడకు వచ్చాను. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలేమిటి? పదవి చేపట్టిన తర్వాత ఆయన చేస్తున్నదేమిటి? అనే అంశాలపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ ఈ యాత్ర చేస్తున్నా. రైతుల కష్టాలపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మీరు పక్కన పెట్టినందువల్ల రైతులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతులే కాదు, చేనేతలు, పేదలు అందరూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. వారి గురించి ఆలోచించండి అని చంద్రబాబును అడిగితే... లేదు లేదు.. రైతులందరూ సుఖసంతోషాలతో బతుకుతున్నారు అని ఆయన చెప్పారు. నాకు ఆశ్చర్యమేసింది. నిజంగా ఒక మనిషి అబద్ధ్దాలు చెబుతూ.. మోసం చేస్తూ ఏ స్థాయికి వెళ్లిపోయాడంటే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆ మనిషికి కనిపించడం లేదు. అంతా మోసం..మోసం..మోసం.. ఎన్నికల ముందు రైతులతో, చేనేతలతో, చదువుకుంటున్న పిల్లలతో, అవ్వాతాతలతో, పేదలతో పని ఉంది కాబట్టి చంద్రబాబు అనేక హామీలు ఇచ్చాడు. అనాడు ఊరూరా ఫ్లెక్సీలు పెట్టారు. అవి కనిపిస్తాయో లేదోనని వాటికి లైట్లు పెట్టారు. గ్రామాలలో గోడలన్నిటిమీదా పెద్దపెద్ద అక్షరాలతో రాతలు రాసేవారు.. ఇంటికి వెళ్లి టీవీలు ఆన్ చేయగానే ప్రకటనలతో ఊదరగొట్టేవారు. చంద్రబాబు ఊరూరా తిరిగి మైకు పట్టుకుని మాట్లాడిన మాటలేమిటంటే.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలి అన్నారు.. రైతుల రుణాలన్నీ బేషరతుగా, పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు.. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు... గుడిసెలు లేని రాష్ర్టం కావాలంటే.. అందరికీ కాంక్రీటు ఇళ్లు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు.. బాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు. చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. మోసం.. మోసం.. మోసం.. మూడోవంతు వడ్డీకీ చాలని మాఫీ నిధులు రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ అన్నారు.. రైతులను మోసం చేశారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతు రుణాలు రూ. 87,612 కోట్లు ఉన్నాయి. బాబు రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకులకు కట్టవద్దని చెప్పాడు. దాంతో రైతులు ఆ రుణాలు కట్టలేదు. అప్పటి వరకు రైతులకు పావలా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇవాళ అపరాధ వడ్డీ 14శాతం బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. రైతుల రుణాలపై వడ్డీ ఈ 20 నెలల్లో రూ.20 వేల కోట్లు అయ్యింది. బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ రుణాలను, వడ్డీని వసూలు చేస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం రుణమాఫీ జరిగిపోయిందని చెబుతున్నాడు. రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నా.. (కాలేదంటూ సభికులు రెండు చేతులు పెకైత్తి అటూ ఇటూ ఊపుతూ చెప్పారు) రెండేళ్లలో రైతు రుణమాఫీకి చంద్రబాబు ఇచ్చింది రూ.7,300 కోట్లు. రైతు రుణాలపై వడ్డీలే రూ.20వేల కోట్లు ఉంటే బాబు ఇచ్చిన రూ.7,300 కోట్లు వడ్డీలో మూడోవంతుకు కూడా సరిపోదని అర్థం కావడం లేదూ..? రైతులనే కాదు డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా బాబు మోసం చేశాడు. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ అన్నాడు. మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అక్కచెల్లెమ్మలను అడుగుతున్నా... (లేదని సభలో ఉన్న మహిళలంతా ముక్త కంఠంతో చెప్పారు.) బాబొస్తేనే జాబొస్తుం దని ఆరోజు రాతలు రాశారు. ఇంటింటికీ వెళ్లి పాంప్లేట్లు పంచారు. ఒకవేళ ఉద్యోగమివ్వలేకపోతే ప్రతి ఇంటికీ రూ.రెండువేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. జాబొచ్చిందా అని అడుగుతున్నా.. (లేదని యువకులంతా పెద్ద పెట్టున అరిచారు..) మరి నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతున్నా... (లేదు లేదని సమాధానం వచ్చింది). బాబు ముఖ్యమంత్రి అయితే పేదలందరికీ కాంక్రీటు ఇళ్లు కట్టిస్తానన్నారు. ఒక్క ఇల్లన్నా ఇచ్చాడా అని అడుగుతున్నా... (లేదని అంద రూ గట్టిగా చెప్పా రు.) అందరికీ పెన్షన్లు ఇస్తానన్నారు. ఇవాళ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు కూడా ఎలా కత్తిరించాలా అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. పేదలకు బియ్యం కోటా కూడా ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్నారు. కరువు మండలాలపైనా కపట నాటకాలు ‘ ఈ ఏడాది కరువొచ్చింది. తమ ప్రభుత్వం రాగానే ప్రతి రైతునూ ఆదుకుంటామని, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ. 1,692 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడకు పోయిందని చంద్రబాబును నిలదీయండి. కేంద్రం ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చింది. ఈయన మాత్రం రాష్ర్టం ఇవ్వాల్సింది కలిపి రైతులకు ఇవ్వకుండా దాన్ని వేరే పనులకు వాడుకున్నారు. రైతుల కళ్లలో మట్టికొట్టారు. 2014-15కు సంబంధించి రూ.736 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు రూ.284 కోట్లు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కరువుతో అల్లాడిపోయాం. కరువు మండలాలు వెంటనే ప్రకటించాల్సిన చంద్రబాబు తాత్సారం చేశాడు. 163 మండలాలను కరువు మండలాలుగా ఎప్పుడు ప్రకటించాడంటే.. నెల్లూరు జిల్లాను అకాల వర్షాలు, వరదలు ముంచెత్తినపుడు. వరదలొచ్చిన తర్వాత కరువు మండలాలు ప్రకటించిన సీఎం దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరే. కరువు మండలాల గురించి ముందే లెక్కలు వేసి నివేదికలు కేంద్రానికి పంపి ఉంటే నిధులు వచ్చేవి. కేంద్రం ఒకవేళ నిధులు పంపిస్తే 50శాతం నిధులు తాను పెట్టుకుని రైతులకు పంపిణీ చేయాలి కాబట్టి కరువు మండలాలను ప్రకటించకుండా తాత్సారం చేశారు.’ అని జగన్ అన్నారు. రెండు కుటుంబాలకు పరామర్శ రైతు-చేనేత భరోసా యాత్రలో భాగంగా ఐదోరోజు జగన్ రాప్తాడు నియోజకవర్గంలోని ఉప్పరపల్లి, ఎర్రగుంటలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు మారుతీప్రసాద్, నారాయణరెడ్డి కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటా అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు అండగా ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) నాయకులు.. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను కలిసి ఉపాధ్యాయ రంగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. జగన్ స్పందిస్తూ...పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు అండగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమకు నీళ్లిచ్చే ముఖమేనా? శ్రీశైలం నీళ్లన్నీ రాయలసీమకే ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఇవాళ పేపర్లలో కనిపించింది. నాకు ఆశ్చర్యమనిపించింది. ఇదే చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు పోతిరెడ్డిపాడు కట్టాలన్న ఆలోచన కూడా చేయని దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు. పోతిరెడ్డిపాడు కట్టింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెప్పుకుంటాం. రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉండాలి. కరెంటుకోసమని చెప్పి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీశైలం నీటిమట్టాన్ని 790 అడుగులకు తీసుకొచ్చారు. 854 అడుగుల నీటిమట్టం లేకపోతే రాయలసీమకు నీళ్లు వెళ్లవని తెలిసినా ఎందుకు నోరు మెదపలేదని చంద్రబాబును అడుగుతున్నా. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు. ఇటువంటి వ్యక్తి రాయలసీమకు నీళ్లిస్తానని చెబుతున్నాడు.’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
పింఛన్ల కోసం లోకాయుక్తలో కేసు
-
పింఛన్ల కోసం లోకాయుక్తలో కేసు
♦ బాబుకు బుద్ధి చెబుదామంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ♦ అవ్వాతాతలంతా ఆధార్, రేషన్ కార్డులివ్వండి ♦ పోరాటం చేసి పింఛన్ సాధిద్దాం ♦ ఎన్నికల ముందు అందరికీ పెన్షన్లన్నారు... ♦ గెలిచాక ఎలా కత్తిరించాలా అని చూస్తున్నారు.. రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎన్నికల ముందు అందరికీ పింఛన్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పెన్షన్లు ఎలా కత్తిరించాలా అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడం లేదు. పింఛను రాని అవ్వాతాతలందరూ ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వండి. పింఛన్లపై లోకాయుక్తలో కేసు వేసి పోరాటం చేద్దాం. చంద్రబాబుకు బుద్ధిచెబుదాం’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కందుకూరులో తనకు పింఛన్ రావడం లేదంటూ బాల్‌రెడ్డిగారి శ్రీరామ్‌రెడ్డి అనే 75 ఏళ్ల వృద్ధుడు మొరపెట్టుకోవడంతో జగన్ కదిలిపోయారు. అవ్వాతాతలందరికీ పింఛన్ అందేందుకు గాను లోకాయుక్తలో పోరాడదామని జగన్ హామీ ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం నాలుగు కుటుంబాలను జగన్ పరామర్శించారు. రాప్తాడు నియోజకవర్గం కందుకూరులో హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. అందుకే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పి.. వారి కష్టాల గురించి చంద్రబాబుకు తెలిసేలా చేసేందుకే ఈ భరోసా యాత్ర చేపట్టినట్టు జగన్ వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... బాబు కళ్లు తెరిపించేందుకే భరోసా యాత్ర ‘‘ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిందొకటి.. ఇపుడు చేస్తున్నదొకటి.. హామీలన్నీ ఆయన అటకెక్కించారు. రుణాలుమాఫీ కాక, పంటలు పండక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ వారి కష్టాల గురించి మేం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే రైతులందరూ సుఖసంతోషాలతో ఉన్నారని చంద్రబాబు అంటున్నారు. రైతులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న అగచాట్లను, అవస్థలను తెలియచెప్పి, ఆయన కళ్లు తెరిపించేందుకే భరోసా యాత్ర చేస్తున్నాను. ఈ యాత్రలో రైతులు చెప్పే బాధలు వినైనా చంద్రబాబుకు బుద్ధి వస్తుందని భావిద్దాం. చంద్రబాబు పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక్క విషయం చూద్దాం.. రాష్ట్రంలో కరువు వస్తే... వెంటనే కరువు మండలాలను ప్రకటించాల్సిన ముఖ్యమంత్రి తాత్సారం చేస్తూ వచ్చారు. తీరా అకాల వర్షాలకు వరదలు వచ్చి నెల్లూరు మునిగిపోయిన తర్వాత 162 కరువు మండలాలను ప్రకటించారు. కరువు వచ్చిన వెంటనే కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదంటే... కరువు మండలాల సహాయం కోసం కేంద్రం 50 శాతం నిధులు ఇస్తే రాష్ట్రం 50 శాతం నిధులు ఇవ్వాల్సి వస్తుందనే ఈ విధంగా జాప్యం చేశారు. ఇటువంటి చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క హామీనన్నా నెరవేర్చారా..? ఎన్నికల ముందు చంద్రబాబు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఏ టీవీ ఆన్ చేసినా ప్రకటనలతో ఊదరగొట్టారు. అర్ధరాత్రి కూడా ఆ ప్రకటనలు ప్రసారమయ్యేవి. ఏ ఊర్లో చూసినా ఫ్లెక్సీలే. ఆ ఫ్లెక్సీలకు లైట్లు పెట్టి మరీ ప్రచారం చేశారు. గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో రాతలు రాశారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని... బాబు వస్తేనే జాబు వస్తుందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిందేమిటి? ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అందరికీ ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు... గెలిచి 20 నెలలైనా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఎన్నికల ముందు రేషన్ బియ్యమన్నా కరెక్టుగా వచ్చేవి. ఇపుడు చంద్రబాబు ఆ బియ్యాన్ని ఎలా కత్తిరించాలా అని చూస్తున్నారు. రైతులను నట్టేట ముంచారు.. గతంలో రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలు వచ్చేవి. లక్ష నుంచి 3 లక్షలలోపు రుణాలు పావలా వడ్డీకే లభించేవి. బాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు రుణాలు కట్టకపోవడంతో ఇప్పుడు బ్యాంకులు రైతుల రుణాలను రెన్యువల్ చేయలేదు. కొత్త రుణాలివ్వడం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రైతులు కోల్పోయారు. అంతేకాదు రైతులు ఏకంగా 14 శాతం అపరాధ వడ్డీ కట్టాల్సి వస్తోంది. రాష్ర్టంలో మొత్తం రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉండగా... వీటికి ఈ 20 నెలల్లో వడ్డీనే రూ. 20 వేల కోట్లు అయ్యింది. కానీ రైతు రుణమాఫీకి చంద్రబాబు కేవలం రూ.7,300 కోట్లు మాత్రమే ఇచ్చి ఇదే రుణమాఫీ అంటున్నారు. ఆయన ఇచ్చిన నిధులు మూడోవంతు వడ్డీకి కూడా సరిపోవు. బంగారాలకు కూడా బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయి. డ్వాక్రా రుణాలను కూడా చంద్రబాబు మాఫీ చేయలేదు. మొత్తంగా చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కలో చెప్పాలంటే మోసం...మోసం...మోసం. అందుకే మనందరం కలిసి పోరాడి ఈ పాలనకు చరమగీతం పాడాలి. ఒక్కటై చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు తొందర్లోనే వస్తుందని చెబుతున్నా.’’ అని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్ భాషా, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాలుగు కుటుంబాలకు పరామర్శ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేదాకా పోరాటం కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన నాల్గో విడత రైతు- చేనేత భరోసా యాత్రలో భాగంగా నాల్గోరోజు శనివారం ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో నాలుగు రైతు కుటుంబాలను పరామర్శించారు. డీఏ ఇవ్వకపోతే ఉద్యమం వైఎస్సార్‌టీఎఫ్ డైరీ ఆవిష్కరణలో జగన్ అనంతపురం : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రెండు విడతల డీఏ ఇవ్వకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2016 డైరీని శనివారం ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్స్ ఫెడరేషన్ నేతలు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హామీ ఇచ్చారు. -
ఒక్కటై పోరాడుదాం!
-
ఒక్కటై పోరాడుదాం!
బాబు మోసాలపై వైఎస్సార్ సీీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు అనంతపురం రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలప్పుడు ఏ హామీలనైతే ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చేలా ఆయనపై గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు బుద్ధిరావాలంటే అందరూ ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు. నాలుగో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజున బత్తలపల్లి జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల, చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో, మూడు మాటల్లో చెప్పాలంటే మోసం..మోసం..మోసం అని హర్షధ్వానాల మధ్య జగన్ అన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘అనంత’లోనే 100కు పైగా రైతుల ఆత్మహత్యలు అనంతపురం జిల్లాలో ఇప్పటికే మూడు విడతల రైతు భరోసా యాత్రలు చేశా. ఇప్పుడు నాలుగో దఫా యాత్ర చేస్తున్నానంటే కారణం ఈ ఒక్క జిల్లాలోనే వంద మందికి పైగా మరణించారు. తన పాలనలో రైతులు ఎలా బతుకుతున్నారనేది చంద్రబాబుకు అర్థం కావాలని, చేనేతలు ఎలా జీవిస్తున్నారనేది అర్థం కావాలని ఈ యాత్ర చేస్తున్నా. ఎన్నికలప్పుడు ఇంట్లో ఎప్పుడు టీవీని ఆన్ చేసినా ఏ గోడపై రాతలు చూసినా ఒక్కటే కనిపించేవి.. ఆనాడు చంద్రబాబు మైక్ పట్టుకుని సభల్లో మాట్లాడింది కూడా ఒక్కడే. అదేమిటంటే.. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి..బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఈ మాటలే వినిపించేవి. గ్రామాల్లో పెద్దపెద్ద ఫ్లెక్సీలు కట్టి వాటికి లైట్లు పెట్టి ఇవే మాటలు ప్రదర్శించారు. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయని ఆ ఫ్లెక్సీలపై కనిపించేవి. కానీ ఎన్నికల తర్వాత ఇవన్నీ అమలయ్యాయా అని ప్రశ్నిస్తున్నా.. (లేదు..లేదు..అనే కేరింతలు) బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు.. ఈ రోజు డ్వాక్రా అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నారమ్మా అని అంటే ‘బాబు వచ్చాడన్నా.. గెలిచాడన్నా..మాకు మూడు పంగనామాలు పెట్టాడన్నా’ అని అంటున్నారు. చదువుకున్న పిల్లల దగ్గరకి వెళ్లి ఎలా ఉన్నారని ప్రశ్నిస్తే ‘బాబు వచ్చాడన్నా..ముఖ్యమంత్రి జాబులో కూర్చున్నాడన్నా.. కానీ మాకు మాత్రం పోస్టింగులు లేవన్నా’ అని అంటున్నారు. డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాది దాటుతున్నా పోస్టింగులు ఇవ్వడం లేదని ఆ పిల్లలు వాపోతున్నారు అని జగన్ ఆవేదనగా అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికలప్పుడు టీడీపీ నాయకులు, చంద్రబాబు స్వయంగా మైకులు పట్టుకుని ప్రచారం చేసుకున్నారు. కానీ బాబు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడమేమో కానీ ఉన్నవి పీకేస్తున్నారని అందరూ వాపోతున్నారు. ‘బాబొచ్చాడు..35 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపించాడు. బాబొచ్చాడు.. దాదాపు 40 వేల మంది ఆదర్శ రైతులను ఇంటికి పంపాడు. బాబొచ్చాడు.. 40 వేల మంది అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తావున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నాడు’ అని జగన్ అన్నారు. బాబేమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు గానీ రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితుల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇన్‌పుట్‌సబ్సిడీపై మాటమార్చిన సీఎం.. ఎన్నికల సమయంలో 2013-14 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని ఇస్తానని జిల్లాలన్నీ తిరిగి చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే జిల్లాల్లో రైతులందరినీ ఆదుకుంటా.. ఇన్పుట్ సబ్సిడీని ఇస్తా అని ప్రచారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యా క మాత్రం మాట మార్చారు. సాక్షాత్తూ అసెం బ్లీ వేదికగా 2013-14 ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వ ను అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టారు. 2013-14 ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వకపోగా 2014-15 ఇన్పుట్ సబ్సిడీని కూడా బాగా తగ్గించివేశారు. ఈ సంవత్సరంలో రూ.736 కోట్లు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే రైతులకు మాత్రం రూ.224 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 2015-16 సంవత్సరానికి కరువు మండలాలను ప్రకటించండి. రైతులంతా అల్లాడిపోతున్నారు అని కోరితే చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదు. చివరకు ఆయా జిల్లాలన్నీ తుపాను వచ్చి అతలాకుతలం అయిన తర్వాత వర్షాలు బాగా పడిన తర్వాత మరో 163 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. వర్షాలు పడిన తర్వాత కరువు మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారూ అంటే అది చంద్రబాబే. అంతటి దారుణంగా చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అర్థమవుతోంది. రైతులతోనే కాదు చేనేత కార్మికుల జీవితాలతో కూడా తాను ఎలా చెలగాటమాడుతున్నాడో చంద్రబాబుకు అర్థం కావాలని మరణించిన వారి ప్రతి ఇంటికి మనం వెళ్తున్నాం. ఆ కుటుంబీకులకు జరిగిన నష్టాన్ని ఎలుగెత్తిచాటుతున్నాం. చని పోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహా రంగా ఇస్తామని ప్రకటించారు కదా ఇచ్చారా అని అడిగితే ఇవ్వలేదనే అన్ని చోట్లా చెబుతున్నారు. అలా చనిపోయిన వారి కుటుంబాల జీవితాలతో కూడా బాబు ఆడుకుంటున్నాడు. మూడో వంతు వడ్డీ కూడా మాఫీ కాలేదు.. రుణమాఫీ కాదు కదా రైతుల రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ.87,612 కోట్ల మేర రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిన వ్యవసాయ రుణాలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ 20 నెలల్లో ఆ రుణాలపై 14 శాతం వడ్డీ పెరిగింది. రుణాలు చెల్లించవద్దంటూ చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి చెల్లించని నేరానికి ఈ రోజు ఆ రైతులపై ఈ అపరాధపు వడ్డీ భారం రూ.20 వేల కోట్లు పడింది. ఆ 20 వేల కోట్లను బ్యాంకులు వసూలు చేస్తామంటున్నాయి. అయితే రెండేళ్లకు కలిపి చంద్రబాబు రుణమాఫీ కింద ఇచ్చిన మొత్తం రూ.7,300 కోట్లు మాత్రమే. అంటే వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోని విధంగా చంద్రబాబు గారి రుణమాఫీ పథకం అమలుజరుగుతోంది. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇళ్లను కట్టిస్తామని బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గుడిసెలే లేకుండా చేస్తానన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్నికలప్పుడు మీరిచ్చిన హామీలేమిటి, ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి.. ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి అని నేను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాను. రైతులు, చేనేత కార్మికుల జీవితాలను వారు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజార్చారని చెప్పాను. నేనలా మాట్లాడినప్పుడు రాష్ట్రంలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చంద్రబాబు, టీడీపీ నాయకులు చెప్పా రు. అందుకే అలా చనిపోయిన వారి ప్రతి కుటుంబం వద్దకు నేను వెళ్తాను. అప్పటికైనా వారి కష్టాలు నీకు అర్థమవుతాయేమో ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి అని అసెంబ్లీలో ఆరోజు చెప్పాను.’’ అని జగన్ పేర్కొన్నారు. ఐదు కుటుంబాలకు పరామర్శ: అనంతపురం జిల్లాలో జగన్ చేపట్టిన నాల్గోవిడత రైతు- చేనేత భరోసా యాత్ర మూడో రోజు శుక్రవారం ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఐదు కుటుంబాలను పరామర్శించారు. -
అండగా ఉంటా.. అధైర్యం వద్దు
-
అండగా ఉంటా.. అధైర్యం వద్దు
♦ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా ♦ తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య... అనాథలైన బిడ్డలు ♦ వారి చదువు బాధ్యత తీసుకుంటామని జగన్ హామీ ♦ నాల్గోవిడత రైతు-చేనేత భరోసా యాత్ర ఆరంభం ♦ తొలిరోజు మూడు కుటుంబాలకు పరామర్శ ♦ నేడు ధర్మవరం చేనేత కార్మికులతో ముఖాముఖి రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘మీకు ఎలాంటి కష్టమొచ్చినా అధైర్యపడకండి. అండగా నేనుంటా. మీకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో పోరాడతా. అయినా స్పందించకపోతే అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరుస్తా’అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. వారి కన్నీటి గాథలను విని ఆయన కదిలిపోయారు. తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో అనాథలుగా మారిన ఇద్దరు చిన్న పిల్లలను చూసి ఆయన కంటనీరు ఉబికింది. ఆ బిడ్డల చదువుల బాధ్యతలను తాము తీసుకుంటామని బంధువులకు జగన్ హామీ ఇచ్చారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నాల్గో విడత భరోసా యాత్ర బుధవారం ప్రారంభమైంది. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా ఉదయం 11 గంటలకు కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ జగన్‌కు అనంతపురం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి ధర్మవరం చేరుకున్నారు. పరామర్శిస్తూ... ధైర్యం నింపుతూ.. పట్టణ శివార్లలోని వైఎస్సార్ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతులు చట్టా రమేష్, చట్టా రమాదేవి కుటుంబాన్ని, చేనేత కార్మికుడు కప్పల నారాయణస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తమకేమీ పరిహారం కానీ, చేయూత కానీ లభించలేదని వారు తెలిపారు. వారి పిల్లలతో, బంధువులతో మాట్లాడి, సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల చదువుల బాధ్యత చూస్తామని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.. ఎన్నికల ముందు చేనేత రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేయడం వల్ల కార్మికులంతా బ్యాంకుల దృష్టిలో ఎగవేతదారులు(డిఫాల్టర్లు) అయ్యారని, అందువల్ల కొత్త రుణాలేవీ పుట్టలేదనే విషయం వైఎస్ జగన్ దృష్టికి వారు తీసుకొచ్చారు. ‘భర్త చనిపోవడంతో ఉన్న ఒక్క కొడుకును చదివించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నానని, కూలీ పనులకు వెళ్లినా ఇళ్లు గడవని పరిస్థితి నెలకొందని, మీరే ఆదుకోవాలని’ కన్నీరుమున్నీరైన కప్పల నారాయణస్వామి భార్య ముత్యాలమ్మను వైఎస్ జగన్ ఓదారుస్తూ ‘మీకు అండగా ఉంటాను. మీ కుమారుడిని చదివించే బాధ్యత తీసుకుంటాం’ అని ఆమెకు భరోసా ఇచ్చారు. అనంతరం పట్టణంలోని లోనికోటలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు గవ్వల కుళ్లాయప్ప కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. కుళ్లాయప్ప భార్య తిప్పమ్మ, కుమారులు రాజశేఖర్, మురళీ, ప్రసాద్, కుమార్తెలు ఉమాదేవి, లక్ష్మితో జగన్ మాట్లాడారు. రైతృు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని జగన్ వారికి హామీ ఇచ్చారు. కుళ్లాయప్ప కుమార్తె లక్ష్మీ డిగ్రీ చదువుతుండడంతో ఉన్నత చదువులు లేదా ప్రైవేటు ఉద్యోగం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. నేతన్నలతో సమావేశం.. జగన్ గురువారం ఏడు చేనేత కార్మిక కుటుంబాలను పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు ధర్మవరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా చేనేత కార్మికులతో సమావేశమవుతారు. -
6 నుంచి జగన్ రైతు భరోసా యాత్ర
-
6 నుంచి జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రను చేపట్టనున్నారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం నాడిక్కడ తెలిపారు. రుణమాఫీ జరగక రాష్ట్రవ్యాప్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనేకమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని హిందూపురం, మడకశిర, సింగనమల, ఉరవకొండ, గుంతకల్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో రైతు భరోసా యాత్రను నిర్వహించినట్టు తెలిపారు. తిరిగి ఈ నెల 6న ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభిస్తారని, ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజకవర్గాల్లో వారం రోజులపాటు కొనసాగుతుందని రఘురాం వివరించారు. -
అవినీతి, అసమర్థ పాలన
♦ ఫాంహౌస్‌కు వందసార్లు వస్తారు.. పక్కనే ఉన్న రైతుల గోస పట్టదా? ♦ {పజాగ్రహంలో టీఆర్ఎస్ కొట్టుకుపోక తప్పదు ♦ రుణమాఫీని ఏకమొత్తంలో అమలు చేయాల్సిందే ♦ మెదక్ జిల్లా రైతు భరోసా యాత్రలో సీఎంపై కాంగ్రెస్ నేతల ఫైర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అవగాహనలేని అసమర్థ, అవినీతి పాలన. ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వంద సార్లు వచ్చిపోతున్న ముఖ్యమంత్రికి పక్కనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే సమయం కూడా లేదా?’ అనిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మెదక్ జిల్లాలో జరిగిన రైతు భరోసా బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభతో ముగి సింది. ఇస్లాంపూర్‌లో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఆకుల వెంకటేశ్ కుటుంబాన్ని, శివ్వం పేట మండలం దొంతిలో శంకర్ రైతు కుటుం బాన్ని నేతలు పరామర్శించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే తమ గొంతు నొక్కి అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటికి పంపారని ఉత్తమ్ ఆరోపించారు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు సహాయం చేయడం పోయి జబర్దస్తీ చేస్తున్నారని విమర్శించారు. రూ. లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో రైతుల రుణాలను ఏకమొత్తంలో ఇవ్వడానికి రూ. 8,500 కోట్లు లేవా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో నాలుగు దఫాలుగా చెల్లిస్తామని చెబుతున్న డబ్బులు రైతు రుణాల వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. చైనా పర్యటనకు రూ 5 కోట్లు, ఆయన ప్రత్యేక హెలీకాప్టర్‌కు రూ. 5 కోట్లు, మంత్రుల కార్లకు రూ. 30 కోట్లు ఖర్చు చేయడానికి ఉంటాయిగానీ, రైతులకు ఇవ్వడానికి ఆయనకు మనుసు రావటం లేదా.. అని దుయ్యబట్టారు. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి ఉంటే రైతుకు కొంత మేలు జరిగేదని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మీద వచ్చే ఐదేళ్ల కాలానికి రూ 70 వేల కోట్ల అప్పు భారం పడుతుంద న్నారు. శాసనసభ పక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మాటల గారడీకి, అబద్ధాలకు మోసపోయి ప్రజలు టీఆర్ఎస్కు అధికారం అప్పగించారన్నారు. త్వరలో జరగబోయే నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుందని చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ 49 రోజులు ఆఫీ సుకు రాని సీఎం ప్రపంచంలో ఎక్కడైనా ఉం టారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజానికి ఓర్పుతోపాటు తిరగబడే గుణం ఉందని, జనం తిరుగబాటులో కేసీఆర్ కొట్టుకుపోతారని హెచ్చరించారు. తుమ్మల నాగేశ్వర్రావు లాంటి ద్రోహులు ఉన్న తర్వాత బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సునీతారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పాల్గొన్నారు. -
అది రాబందుల యాత్ర
కాంగ్రెస్ నేతల రైతు భరోసా యాత్రపై కేటీఆర్ నేటి రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించొద్దని విజ్ఞప్తి మెదక్: రాష్ట్రంలో రైతు భరోసా యాత్ర చేపడుతున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి కె. తారక రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోగానే కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ రైతు భరోసా యాత్రలంటూ రాబందుల యాత్ర మొదలుపెట్టారని దుయ్యబట్టారు. శుక్రవారం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు శనివారం పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. దశాబ్దాల పాలనలో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశాయన్నారు. ఇప్పుడు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా ప్రవర్తిస్తున్నాయని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలలే అయిందని, రైతు రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేయాలంటే ఎలా కుదురుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు రుణాలను 4 విడతల్లో వడ్డీతో సహా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.8,500 కోట్లను బ్యాంకర్లకు చెల్లించిందని, దీనివల్ల రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని ఆయన వివరించారు. వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది గత పాలకులేనని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వాలు మరిచిపోయాయన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్లు వెచ్చిస్తోందని కేటీఆర్ తెలిపారు. పంటల బీమా చెల్లించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్న కేటీఆర్.. ఈ విషయంపై రైతు యూనిట్‌గా పంటల బీమాను వర్తింపజేయాలని కేంద్రానికి గతంలోనే చెప్పామన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయనకు దమ్ముంటే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు. నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రకటించి, తెలంగాణను విస్మరించినా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించని ప్రతిపక్షాలు రైతు భరోసా యాత్ర పేరుతో ఏకమై ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నాయన్నారు. రైతు ఆత్మహత్యలు చేసుకుంటే గత ప్రభుత్వం రూ.1.5లక్షలు మాత్రమే ఇవ్వగా, దాన్ని సీఎం కేసీఆర్ రూ.6 లక్షలకు పెంచారని కేటీఆర్ గుర్తుచేశారు. -
రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెేస్సే..
♦ వరంగల్, ఖమ్మం రైతు భరోసా యాత్రలో కె.జానారెడ్డి ♦ హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది ♦ నెపం గత ప్రభుత్వాలపై వేయాలని చూస్తోంది ♦ రైతుల రుణాలు ఒకే విడతలో మాఫీ చేయాలి సాక్షి, హన్మకొండ/ఖమ్మం: ‘‘తెలంగాణ తెచ్చింది మా పార్టీ.. తెలంగాణను రక్షించేది కూడా మా పార్టీయే..’’ అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వాలపై నెపంవేసి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోందంటూ మండిపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ ఖమ్మం, వరంగల్ జిల్లాలో రైతు భరోసా యా త్ర చేపట్టింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజల చేతిలో పెడితే, ప్రజలు దాన్ని టీఆర్ఎస్ చేతిలో పెట్టి మోసపోయారని అన్నారు. ఇంకా వేచి చూస్తే గ్రామాలకు గ్రామాలే అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్లే రైతుల తరఫున పోరాడుతూ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిందన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శనివారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మాఫీ పక్కనపెట్టి... గ్రిడ్‌కు వేల కోట్లా? రుణమాఫీని పక్కనపెట్టి సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త రాష్ట్రంలో సంబరాలు చేసుకోవాల్సిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రతీరోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం.. దున్నపోతుపై వర్షం పడ్డట్లుగా వ్యవ హరిస్తోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు డీకే అరుణ, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఆత్మహత్య చేసుకున్న ఎనిమిది మంది రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల సాయం అందజేశారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలో భరోసా యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రతి మూడు గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని, ఇంత జరుగుతున్నా.. సీఎం పట్టించుకోవడం లేదన్నారు. -
26 నుంచి నాగం జనార్థన్ రైతు భరోసా యాత్ర
హైదరాబాద్: రైతు భరోసా యాత్రను రేపటి నుంచి ప్రారంభించనున్నట్టు బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదంటూ? నాగం సూటిగా ప్రశ్నించారు. రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం కక్ష కట్టినట్లుగా వ్యవహారిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరువుపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అమలు చేయాలని నాగం డిమాండ్ చేశారు. -
దిగొచ్చిన ప్రభుత్వం
అనంతపురం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన మూడోవిడత రైతు భరోసాయాత్రతో ప్రభుత్వం దిగొచ్చింది. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 33 మంది రైతుల కుటుంబాలకు మధ్యంతర పరిహారం కింద రూ.49.50 లక్షలు విడుదల చేస్తూ బుధవారం జీవో జారీ చేసింది. వైఎస్ జగన్ ఈ నెల 21 నుంచి 27 వరకు ఏడు రోజుల పాటు జిల్లాలో యాత్ర సాగించారు. కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో 17 రైతు కుటుంబాలను పరామర్శించారు. యాత్ర ఆసాంతం ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. రైతులు, చేనేతలు కష్టాల్లో ఉన్నా, అప్పుల బాధతో ఆత్మార్పణం చేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం మెడలు వంచైనా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా రైతులు, కూలీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్ వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం తమ ఇబ్బందులను ఏమాత్రమూ పట్టించుకోని వైనాన్ని వివరించారు. జగన్ రైతు భరోసా యాత్రకు విశేష స్పందన లభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. రైతు కుటుంబాలకు పరిహారం కోసం నిధులను విడుదల చేసింది. కాగా.. అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలు లేవంటూ జగన్ రైతు భరోసా యాత్రపై రాష్ట్రమంత్రులు విమర్శలు చేసిన విషయం విదితమే. తాజాగా 33 కుటుంబాలకు పరిహారం విడుదల చేయడం ద్వారా జిల్లాలో ఆత్మహత్యలు ఉన్నట్లు ప్రభుత్వమే ఒప్పుకుంది. ప్రతిసారీ ఇలాగే.. కరువు కోరల్లో చిక్కుకుని ‘అనంత’ అన్నదాత విలవిల్లాడుతుంటే ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. అసెంబ్లీ మొదటి సమావేశంలో ‘అనంత రైతు ఆత్మహత్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించినప్పుడు సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి ‘అసలు అనంతలో రైతు ఆత్మహత్యలే జరగలేదు’ అన్నారు. దీంతో వైఎస్ జగన్ బాధిత కుటుంబాల పరిస్థితి తెలుసుకుని రైతు భరోసా యాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన చేయగానే పాలకులకు ముచ్చెమటలు పట్టాయి. అసలు ఆత్మహత్యలే లేవన్న వారు... 29 మంది రైతులు, 11 మంది చేనేతలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండోసారి జిల్లాలో రైతు భరోసాయాత్ర ప్రారంభించగానే ప్రభుత్వ యంత్రాంగం హడావుడిగా రైతు ఆత్మహత్యలపై వివరాలు సేకరించింది. మొత్తం మూడు విడతల్లో వైఎస్ జగన్ 42 రైతు కుటుంబాలను పరామర్శించి.. భరోసా కల్పించారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడమే కాకుండా రైతుల నుంచి కూడా పెద్దఎత్తున వ్యతిరేకత రావ డంతో ప్రభుత్వం స్పందించక తప్పడం లేదు. ద్వంద్వ వైఖరి : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఇంకా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు అప్పుల బాధతో 85 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ప్రతిఒక్కరికీ ఎంతో కొంత పొలం ఉందన్న విషయం అధికారుల విచారణలో తేటతెల్లమైంది. ఈ రైతులందరూ వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందినవారే. అయితే ప్రభుత్వం కొంతమందికే పరిహారం ప్రకటించడం విమర్శలకు దారితీస్తోంది. మిగిలిన వారు రైతులు కాదా? వారికి అప్పులు లేవా? అనే విమర్శలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. -
బాధలు వింటూ.. భరోసా ఇస్తూ..
♦ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో సాగిన వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ♦ వాల్మీకి , ఫాదర్ ఫై విగ్రహాలకు పూలమాల వేసిన జగన్ ♦ రోడ్డుప్రమాదంలో కార్యకర్త మృతి.... అండగా ఉంటానని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్ ♦ ఐదోరోజు 3 కుటుంబాలకు పరామర్శ ..48.5 కి..మీ. యాత్ర ♦ మడకశిర నియోజకవర్గంలో నేడు 2 కుటుంబాలకు భరోసా సాక్షిప్రతినిధి, అనంతపురం : రైతులు, రైతు కూలీల బాధలు, బాగోగులు తెలుసుకుంటూ ‘నేనున్నానని’ భరోసానిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదోరోజు రైతుభరోసా యాత్ర సాగింది. శనివారం కర్ణాటకలోని వెంకటాపురం నుంచి యాత్ర మొదలైంది. దొమ్మతమర్రి, చెరుకూరు మీదుగా పెద్దమంతూరు, రొప్పాల మీదుగా పి. కొత్తపల్లి చేరుకున్నారు. దారిలోని ప్రతీ గ్రా మంలో జగన్‌కు కోసం రైతులు, మహిళలు ఎదురు చూశారు. జగన్ కనిపించగానే ‘జై జగన్’అంటూ నినదించారు. కరచాలనం చేసేందుకు యువకులు పోటీపడ్డారు. మహిళలు హారతి పట్టారు. పి. కొత్తపల్లి గ్రామంలోకి చేరుకోగానే గ్రామస్తులు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న లక్ష్మన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అక్కడి నుండి దొమ్మతమర్రి చేరుకున్నారు. మడకశినియోజకవర్గం నేతలు జగన్‌కు స్వాగతం పలికారు. యువకులు బైక్‌ర్యాలీతో కాన్వయ్ వెంట వచ్చారు. అక్కడి నుండి ఆర్.అనంతపురానికి చేరుకున్నారు. ఫాదర్ఫై విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత చౌటిపల్లి మీదుగా మడకశిర చేరుకున్నారు. వాల్మీకి సర్కిల్లో జగన్‌ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. వాల్మీకి విగ్రహానికి జగన్ పూలమాల వేశారు. దళితహక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.ఆర్ హనుమంతు వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని, ఎస్సీ వర్గీకరణపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్‌కు వినతి పత్రం సమర్పించారు. తర్వాత జగన్ ప్రసంగించారు. చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించారు. జిల్లాకు వరప్రసాది అయిన హంద్రీ-నీవాను పూర్తి చేసి ప్రతీఎకరాకు నీరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుండి టీడీపల్లి తండా మీదుగా టీడీపల్లి చేరుకున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న ఆనందప్ప కుటుంభ సభ్యులకు భరోసా ఇచ్చారు. అక్కడి నుండి అమిదాలగొంది చేరుకున్నారు. ఇక్కడ కూడా మహిళలు భారీగా రోడ్డుపైకి తరలివచ్చారు. అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. చిన్నపిల్లలను ముద్దాడారు. మహిళలను దీవించారు. అక్కడి నుండి హెచ్ఆర్ పాళ్యం చేరుకున్నారు. ఇక్కడికి జగన్ రాగానే వర్షం మొదలైంది. వర్షంలోనూ మహిళలు, యువకులు జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు ఓబన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఐదోరోజు యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పేస్వామి, ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ్, రాష్ట్ర కార్యదర్శులు వైసీ గోవర్దన్‌రెడ్డి, మీసాల రంగన్న, సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖరరెడ్డి, కార్యదర్శి, వై.మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ శివకుమార్, జిల్లా కార్యదర్శి రంగేగౌడ్, డాక్టర్ శివప్రసాద్, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, సోమనాథరెడ్డి, మహిళనేత శ్రీదేవి పాల్గొన్నారు. రోడ్డుప్రమాదలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి పరామర్శ: రైతుభరోసాయాత్రకు వస్తూ రోడ్డుప్రమాదంలో రామాంజనేయులు అనే కార్యకర్త మృతి చెందారు. మోటర్‌సైకిల్‌పై వస్తున్న రామాంజనేయులు రోడ్డు పక్కన నెంబర్రాయిని ఢీకొట్టారు. తలకుపెద్ద గాయం కావడంతో మృతి చెందారు. మరో కార్యకర్త గాయపడ్డారు. విషయం తెలిసిన జగన్ మడకశిర ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రామాంజనేయులు మృతదేహనికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. నేటి భరోసా యాత్ర ఇలా.. ఆరోరోజు రైతు భరోసా యాత్ర వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ప్రకటించారు. ఉదయం మడకశిర నుంచి గుడిబండ మండలం దేవరహట్టి చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రంగప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఎస్ఎస్గుండ్లులో ఆత్మహత్య చేసుకున్న గిడ్డీరప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. -
21 నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించి వారిలో ఆత్మస్ధైర్యాన్ని నింపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లాలో మూడవ విడత రైతు భరోసా యాత్ర చేపడుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ శనివారం తెలిపారు. భరోసా యాత్రకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 21వ తేదీ కళ్యాణదుర్గంలోని శెట్టూరు నుంచి ప్రారంభమై 22, 23 తేదీలలో ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది. 24నుంచి పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో చేపడతారు. భరోసా యాత్ర షెడ్యూల్ ఇలా.. ఈ నెల 21వ తే దీన శెట్టూరులో మధ్యాహ్నం 1గంటకు బహిరంగసభ అనంతరం ఒక కార్యకర్త కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు.22వ తేదీన శెట్టూరు మండంలోని కైరేవు గ్రామంలో ఒక రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత కళ్యాణదుర్గం మండలంలోని ముదిగళ్ళు, వర్లి గ్రామాల్లోని రైతు కుటుంబాలను భరోసా కల్పిస్తారు.23వ తేదీన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం, తిమ్మాపురం, వంటారెడ్డిపల్లిలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర చేపడతారు. -
ధైర్యంగా ఉండండి..
- రైతు కొండూరు శివారెడ్డి కుటుంబంతో జగన్ పామిడి: ‘కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా అందరం కలసికట్టుగా పోరాడదాం. మేమంతా అండగా ఉంటాం’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగ న్మోహన్రెడ్డి.. పామిడి మండలం పి.కొండాపురంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కొండూరు శివారెడ్డి, రామరాజుపల్లికి చెందిన రైతు వి.పుల్లారెడ్డి (64) కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఆయన గురువారం రెండు కుటుంబాల వారిని వేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా శివారెడ్డి భార్య రంగమ్మతో మాట్లాడి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆరా తీశారు. ఎంమేర అప్పులు పాలయ్యారు. వారి పిల్లలు ఏం చదువుతున్నారు అనే విషయాన్ని తెలుసుకొని రంగమ్మ చిన్న కుమార్తె స్వాతి చదువుకు సాయమందించాలని స్థానిక నేతకు సూచించారు.అదే విధంగా పుల్లారెడ్డి కుటుంబీకులతో మాట్లాడుతూ వారి కుటుంబ స్థితి గతులను తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందిందా లేదా అని ఆరా తీశారు. పుల్లారెడ్డి కుమారుడు లక్ష్మి రెడ్డి తమ స్థితి గతులను తెలియజేస్తూ... మూడేళ్లుగా వర్షాల్లేక పంటలు పండక ఎకరాకు ఒక క్వింటా దిగుబడి రావడం గగనమైందని తెలిపాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరలేదని చెప్పాడు. వారి సమస్యను విన్న జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు. అంతా ధైర్యంగా ఉండాలని, కలసి కట్టుగా సమస్యలను ఎదుర్కొందామని చెప్పారు. -
'చంద్రబాబు నమ్మించి మోసం చేశారు'
- చర్చావేదికలో వైఎస్ జగన్‌తో మొరపెట్టుకున్న రైతులు రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి : ‘‘రైతులందరూ ఆన్లైన్ పేపర్లు తీసుకుని ససాక్ష్యాలతో రుణమాఫీపై మోసాన్ని వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఇదే ఇబ్బంది పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు. రైతులకు జరిగిన మోసంపై ఉద్యమాన్ని ఆపేది లేదు. చంద్రబాబు దిగివచ్చేదాకా అందరం కలసికట్టుగా నడుం బిగించి పోరాడదాం’’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం ఆయన అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లిలో నిర్వహించిన సదస్సులో రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, జగన్ మధ్య సాగిన సంభాషణ.. రూ.60 వేలు అప్పునకు గాను రూ.3,642 మాఫీ అయింది కేశవరెడ్డి: సార్ నాకు బ్యాంకులో 60 వేల రూపాయల అప్పుంది. అయితే నాకు 3,642 రూపాయలు మాఫీ అయిందని ఇదో ఈ పత్రంలో ఉంది. (మీ సేవా సెంటర్లో తీసుకున్న రుణమాఫీ పత్రం చూపిస్తూ) జగన్: (ఆ పత్రం తీసుకుని) ఇది నా దగ్గరే పెట్టుకుని అసెంబ్లీలో చంద్రబాబుకు చూపిస్తా 99 వేలు అప్పుంటే రూపాయి పోలేదు సుబ్బమ్మ: సార్ 99 వేల రూపాయలు బ్యాంకులో క్రాప్‌లోన్ తీసుకున్నా. ఎనిమిది వేల రూపాయలు పోయింది అన్నారు. అది కూడా పోలేదు సార్. జగన్: (పత్రాలు చేతికి తీసుకుని) మా సుబ్బమ్మ పరిస్థితి ఇది. 99 వేల రూపాయలు తీసుకుంది. వడ్డీతో కలిపి 1,07,362 రూపాయలైంది. అయితే 8,312 రూపాయలు మాఫీ అయిందని చెబుతున్నారు. అది కూడా పోలేదు. అది వచ్చినా కనీసం వడ్డీకి కూడా సరిపోదు. ఏ విధంగా రుణమాఫీ చేశావు అని చంద్రబాబును నిలదీస్తా అవ్వా.. మొదటి సంతకం దీనికే అని మోసం చేశారు రోశన్న: సార్.. నేను బ్యాంకులో 72 వేల రూపాయలు అప్పు తెచ్చుకున్నా. రూపాయి పోలేదు. మొదటి సంతకం రుణమాఫీపై పెడతా అన్నారు. ఇప్పుడు పావలా ఇవ్వలేదు సార్. జగన్: రోశన్నకు 4.56 ఎకరాలు ఉంది. 72 వేల రూపాయలు తీసుకుంటే దమ్మిడీ కూడా మాఫీ కాలేదని అసెంబ్లీలో చెబుతాను. చౌడమ్మ: సార్.. నేను డ్వాక్రాలో ఉన్నా. మా ఆయనకు అనారోగ్యం కావడంతో 50 వేల రూపాయలు తీసుకున్నా. నెలకింత కట్టుకుందామనుకున్నా. రుణమాఫీ చేస్తామన్నారు. డబ్బులు కట్టలేదు. ఇప్పుడు అంతా కట్టాలంటాండారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తాడు. కట్టేది లేదన్నాను. అయితే చంద్రబాబునే అడుగండంటున్నారు. మాకు మాత్రం బాకీ కట్టాల్సిందే అని బ్యాంకర్లు నిలదీత్తన్నారు. మాకు పొలం లేదు. ఏం చేసేది మందుతాగి సావాలా? జగన్: అయ్యో.. అంత మాట అనొద్దు చౌడమ్మవ్వా.. చౌడమ్మ: నాయనా.. మా బిడ్డలాంటోడివి. దేవుడి లెక్క ఈడకి వచ్చినావు. నువ్వు బస్సు పెట్టు. మేమంతా హైదరాబాద్‌కు వస్తాం. చంద్రబాబు ఇంటిముందు ధర్నా చేద్దాం. జగన్: నువ్వు చేసిన మోసంతో చౌడమ్మవ్వ ఇలా బాధపడుతోందని నేను అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తా అవ్వా. చంద్రబాబు కాలర్ పట్టుకుని అడుగుతా సుధాకర్: సార్.. మేం బ్యాంకులో 36 వేల రూపాయల రుణం తీసుకున్నాం. వడ్డీతో కలిపి దాదాపు 47 వేల రూపాయలైంది. నాకు ఆ రుణ మొత్తం మాఫీ అయినట్లు అప్లికేషన్ స్టేటస్‌లో ఉంది. చంద్రబాబు సంతకంతో రుణ విముక్తి పత్రం కూడా పంపారు. ఫీల్డ్ ఆఫీసర్ మాత్రం రుణమాఫీ కాలేదంటున్నారు సార్.. జగన్: మాఫీ అయిందని చంద్రబాబు లెటర్ పంపినాడు. కానీ ఫీల్డ్ ఆఫీసర్ కాలేదంటున్నారు. రెండూ నాకివ్వు. అసెంబ్లీలో చంద్రబాబును అడుగుతాను. సుధాకర్: నన్నూ తీసుకుపోండి సార్.. కాలర్ పట్టుకుని అడుగుతా. నేను ఎంఏ బీఈడీ చేశా. బీఈడీ వాళ్లకు ఎస్జీటీ అవకాశం ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చారు. ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. ఇప్పుడు మోసపోయాం. చేతకానప్పుడు తప్పుడు హామీలు ఇవ్వకూడదు సార్.. (ఆవేదనతో ఏడుస్తూ) నా మాదిరి చాలామంది మోసపోయారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దమ్మిడీ ఇవ్వలేదు. పోనీ కాంట్రాక్టు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే టీడీపీ నేతల సిఫార్సు కావాలంటున్నారు సార్. ఏం వాళ్లకు తప్ప మిగతా వాళ్లు అర్హులు కాదా సార్.. జగన్: సుధాకర్.. నీలాగే రాష్ట్రంలో కోటీ డెభ్భైఐదు లక్షల కుటుంబాలు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నాయి. నీకు రుణమాఫీ కాలేదు. నీ తరఫున నేను అసెంబ్లీలో బాబును నిలదీస్తా. ఆ లెటర్లు నాకు ఇవ్వు. వెంకిరెడ్డి: సార్. నేను 28 వేల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకున్నా. కానీ రూపాయి మాఫీ కాలేదు. 3.5 తులాలు బంగారు పెట్టి మరో 43 వేల రూపాయలు తీసుకున్నా. అదీ మాఫీ కాలేదు. పంటల్లేవు. పనుల్లేవు. డబ్బులు కట్టలేక నిలబడిపోయినా. ఏం చేసేది సార్.. జగన్: ఎన్ని ఎకరాలు ఉంది తాతా.. వెంకటరెడ్డి: ఐదు ఎకరాలు జగన్: ఆ కాగితాలు నాకు ఇవ్వు వెంకటరెడ్డి తాతా.. పరిస్థితి ఇదీ అని నేను అసెంబ్లీలో బాబును నిలదీస్తా. జగన్ : మీ అందరి తరఫున నేను అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తాను. న్యాయం జరిగే వరకు అందరం కలసికట్టుగా పోరాడదాం. ఆ వడ్డీ ఎవరు కట్టాలి సార్ సార్.. నేను 3.60 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా. 2013 డిసెంబర్ 31 నాటికే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తామంటోంది. 2014కు, ఈ మూణ్ణెళ్లు ఎవ్వరు వడ్డీ కట్టాలి? రైతులు 15 నెలల వడ్డీ చెల్లించాలి. మీరు అసెంబ్లీలో అడగాలి. - రామచంద్రారెడ్డి, ఆకులేడు రూపాయి మాఫీ చేయలేదు మాది దేవి మహిళా సంఘం సార్. 4.50 లక్షల రూపాయల లోను తీసుకున్నాం. మాఫీ అవుతాదని 5 నెలలు కంతులు కట్టలేదు. ఐదు నెలలకు 55 వేల రూపాయలు వడ్డీ అయింది. అట్టాగే నాపేరు, మా ఆయన పేరు మీద 45 వేల రూపాయల క్రాప్‌లోను, 3.5 తులం బంగారం పెట్టి 35 వేలు గోల్డ్‌లోను తీసుకున్నాం. ఇద్దరికీ 11 వేలు పోయిందన్నారు. రూపాయి కూడా మాఫీ కాలేదు. అప్పులు మాఫీ చేస్తానని సీఎం చెప్పారు కదా అంటే ఆయన్నే అడుగు పో అంటున్నారు. ఎన్నికలొచ్చేదాకా ఆయప్ప ఈపక్కకు రారు. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఎట్టా చేసేది? - కమలాక్షి, వెదురూరు చేసేది లేక వడ్డీ.. కొంత అసలు కట్టినా నాకు ఐదెకరాలు ఉంటే ఈ మధ్యనే రెండెకరాలు అమ్మినా. 46 వేల రూపాయలు క్రాప్‌లోను తీసుకున్నా. రూపాయి కూడా మాఫీ కాలేదు. వేలం వేస్తామని నోటీసులు పంపినారు. వడ్డీ, కొంత అసలు కట్టినా సార్. ఏం చేసేది? - సుంకిరెడ్డి కాసేపల్లి -
‘మాఫీ’ మాయపై అసెంబ్లీలో నిలదీస్తా
- రుణమాఫీతో రైతులు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు - రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ‘ఉపాధి’ చూపడం లేదు - ‘హంద్రీ-నీవా’ను తానే పూర్తి చేశానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు - రైతు సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తా - ఐదోరోజు రైతు భరోసా యాత్రలో విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి - ముగిసిన మొదటి విడత భరోసా యాత్ర రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఎన్నికలకు ముందు ఒకమాట.. తర్వాత మరోమాట చెప్పి రైతులను చంద్రబాబు పూర్తిగా మోసం చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారు. బాబు వైఖరితో బ్యాంకుల్లో అప్పు తీరకపోగా రైతులపై 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. దీంతో రైతులు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల కష్టాలు, ఆత్మహత్యలపై అసెంబ్లీలో చంద్రబాబు సర్కారును నిలదీస్తా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లాలో గురువారం ఐదో రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా పామిడి మండలం రామరాజుపల్లిలో రైతుల చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ‘‘రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలన్నా, బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలన్నా.. జాబు కావాలన్నా.. బాబు రావాలన్నారు. జాబు లేకపోతే నెలకు 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయ్యి తొమ్మిది నెలలవుతోంది. ఒక్క హామీని అమలు చేయలేదు. 87 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఉండేవి. ఇటీవల ఎస్ఎల్బీసీ మీటింగ్‌లో 99 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. అంటే వ్యవ సాయ రుణాలపై 12 వేల కోట్ల రూపాయల వడ్డీ భారం పడింది. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 4,600 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తామంటోంది. ఇది కనీసం వడ్డీకి కూడా సరిపోదు. రాష్ట్రం కరువుతో అల్లాడుతున్నా ఉపాధి లేదు రాష్ట్రంలో ఈ ఏడాది 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కరువుతో రాష్ట్రం అల్లాడుతోంది. రుణమాఫీ పుణ్యమా అని ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరె న్స్ వచ్చే పరిస్థితి లేదు. పనుల్లేక ప్రజలు వలస బాట పట్టారు. అనంతపురం జిల్లా నుంచే కర్ణాటకకు నాలుగు లక్షల మంది వలస పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. అయినా ప్రభుత్వం ప్రజలకు ఉపాధి పనులు చూపడం లేదు. డ్వాక్రా రుణాల పరిస్థితి మరీ దారుణం. రాయలసీమపై బాబుకు ప్రేమ లేదు రాయలసీమపై తనకు చాలా ప్రేమ ఉందని చంద్రబాబు చెబుతున్నారు. ‘హంద్రీ-నీవా’ను తానే పూర్తి చేశానంటున్నారు. ఆయన సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో కేవలం 13 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వైఎస్ సీఎం అయిన తర్వాత 5,800 కోట్ల రూపాయలు విడుదల చేసి 85 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేశారు. కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు వైఎస్ పూర్తి చేసిన ప్రాజెక్టుకు నీళ్లొస్తే ఆ ఘనత తనదే అని అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు విషయంలోనైనా చంద్రబాబు చేసింది సున్నా. పల్లెల్లో పిక్ పాకెటింగ్ చేస్తే 420 కేసు పెడతారు. మరి అబద్ధాలు ఆడి ఏకంగా సీఎం అయిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలి? ప్రజలను చంద్రబాబు ఒకసారి మోసం చేశారు. మళ్లీ మోసపోరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి డిపాజిట్లు కూడా రావు. ఢిల్లీలో ఆప్‌కు 70 సీట్లకు 67 వచ్చినట్లు ఇక్కడా అవే ఫలితాలు వస్తాయి’’ అని చెప్పారు. ఐదో రోజు రెండు కుటుంబాలకు పరామర్శ ఐదో రోజు యాత్రలో జగన్ రెండు కుటుంబాలను పరామర్శించారు. పామిడి మండలం పి.కొండాపురం, రామరాజుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతులు శివారెడ్డి (46), పుల్లారెడ్డి (64) కటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. గురువారం ఐదో రోజుతో తొలి విడత రైతు భరోసా యాత్ర ముగిసింది. ఈ నెల 22న ప్రారంభమైన యాత్ర ఐదు రోజుల్లో ఐదు నియోజకవర్గాల్లో 781 కిలోమీటర్లు సాగింది. ఆత్మహత్య చేసుకున్న 11మంది రైతుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. యాత్ర ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమైన ఆయనకు ‘అనంత’ నేతలు జిల్లా సరిహద్దు వరకు వెళ్లి వీడ్కోలు పలికారు. యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, తాడిపత్రి అదనపు సమన్వయకర్త రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ఐదో రోజు
-
మీ కోసం పోరాడతా...
- న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తాం - ఓబన్న కుటుంబాన్ని పరామర్శించిన జగన్ అనుంపల్లి (పామిడి): ‘అప్పుల బాధ తట్టుకోలేక ఓబన్న ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ఆత్మహత్యగా గుర్తించలేదు. ప్రభుత్వం నుంచి మీకు 5 లక్షల రూపాయల పరిహారం అందాలి. కచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. అవసరమైతే మీతో పాటు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వారందరినీ కలిపి కలెక్టరేట్ ఎదుట పెద్ద ధర్నా చేద్దాం. నేను వచ్చి ధర్నాలో పాల్గొంటా’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓబన్న కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారిని పరామర్శిస్తూ పంటసాగు, పెట్టుబడి, అప్పులు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు. ఓబన్న భార్య సునీతతో జగన్ జరిపిన సంభాషణ ఇలా... జగన్: పొలం ఎంత ఉందమ్మా? పట్టాదారు పాసుపుస్తకం పెట్టి రుణాలేమైనా తీసుకున్నారా తల్లీ? సునీత: రెండెకరాలు ఉంది సార్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 30 వేల రూపాయలు తీసుకున్నాం. బయట 1.50 లక్షల అప్పులున్నాయి. బంధువుల వద్ద చేతి బదులుగా రూ. 50 వేల రూపాయలు తెచ్చుకున్నాం సార్. జగన్: ప్రభుత్వ అధికారులు ఏమైనా ఇంటి దగ్గరికి వచ్చారామ్మా? సునీత: ఎవ్వరూ రాలేదు సార్. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదు సార్ జగన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 9 నెలలవుతోంది. ఆదుకోవాలనే ఆలోచన ఉండి మీకు పరిహారం ఇవ్వాలంటే ఇవ్వొచ్చమ్మా. కానీ ఇవ్వలేదు. ఇప్పటికైనా ఇస్తే మంచిది. లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతాం. నేనూ కూడా వస్తా. ఇప్పుడు నేను రావడంతో మీకు జరిగిన అన్యాయం రాష్ట్రమంతా తెలుస్తుంది. మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వచ్చా తల్లీ. ఏం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. ఏమన్నా ఉంటే వెంకట్రామిరెడ్డితో పాటు మన పార్టీ జిల్లా నేతలు అంతా అండగా ఉంటారు. పిల్లలను బాగా చదివించుకోవాలమ్మా.. బాగా చదివించుకుంటే అదే మనకు పెద్ద ఆస్తి. ధైర్యంగా ఉండండి. -
అండగా ఉంటా.. ఆందోళన వద్దు..
- ఇగ్గుడ వన్నూరప్ప కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా పామిడి: ‘మీకు అండగా నేనుంటాను. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి. లేదంటే కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మీరెవ్వరూ ఆందోళన పడవద్దు’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఆయన అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లిలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇగ్గుడ వన్నూరప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వన్నూరప్ప భార్య లక్ష్మీదేవితో జరిపిన సంభాషణ ఇలా... జగన్: ఎందుకమ్మా.. మీ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అప్పులు ఎంతయ్యాయి తల్లీ? లక్ష్మీదేవి: వర్షాలు కురవక పంట మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. దీంతో అప్పులపాలయ్యాం. అప్పులు ఎలా తీర్చాలో తెలియని నా భర్త వన్నూరప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం రూ.3 లక్షల 9 వేల అప్పు ఉంది. అందులో ఎద్దులపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.9 వేల క్రాప్‌లోన్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.3 లక్షల అప్పు ఉంది సార్. జగన్: ప్రభుత్వ సాయం అందిందామ్మా? వితంతు పింఛన్ అయినా ఇచ్చారా? లక్ష్మీదేవి: ప్రభుత్వ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు, ఫించన్ ఇవ్వలేదు సార్ అనంతరం జగన్ వన్నూరప్ప కుమారుడు ఎర్రిస్వామి, కుమార్తె పావనిలతో మాట్లాడి చక్కగా చదువుకోవాలని సూచించారు. లక్ష్మీదేవి తన ఆర్ధిక స్థితి సహకరించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా అక్కడ చేరిన డ్వాక్రా మహిళలతో వైఎస్ జగన్.. మాట్లాడారు. అక్కడే ఉన్న కేన్సర్ బాధితురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..కేన్సర్ చికిత్స కోసం రూ.6 లక్షల దాకా అప్పు చేశానని తనను ఆదుకోవాలని జగన్‌కు విన్నవించింది. జగన్ స్పందిస్తూ వన్నూరప్ప పిల్లల పై చదువులకు, కేన్సర్ బాధితురాలు భాగ్యలక్ష్మినీ ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వెంకట్రామిరెడ్డికి సూచించారు. -
ఉపాధి ఊసేది చంద్రబాబూ?
- అనంతపురం జిల్లాలో 4 లక్షల మంది వలస వెళ్లారు - ఖరీఫ్, రబీల్లో రైతులకు రుణాలు ఇవ్వలేకపోయారు - బతికేందుకు ఉపాధి లేక.. అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు - అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు - నాలుగోరోజు రైతు భరోసా యాత్రలో విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘వర్షాలు లేవు.. పంటలు లేవు.. చేసేందుకు ఉపాధి హామీ పథకం పనులు లేవు. చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన మోసపూరిత వైఖరితో రైతులు, డ్వాక్రా మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆత్మాభిమానం చంపుకోలేక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఇంకొందరు బతికేందుకు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఒక్క అనంతపురం జిల్లా నుంచి మాత్రమే నాలుగు లక్షలమంది రైతులు వలసెళ్లారు. అయినా ప్రభుత్వం మాత్రం రైతులు, రైతు కూలీలకు దన్నుగా నిలవలేదు’’ అని విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగోరోజు బుధవారం ఆయన గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలంలోని పాళ్యంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు ‘‘ఎన్నికలకు ముందు టీవీ ఆన్‌చేస్తే.. బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి. రుణాలు మాఫీ కావాలన్నా బాబు రావాలి. జాబు కావాలంటే బాబు రావాలి. లేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలైం ది. అయినా ఎందుకు హామీలు అమలు చేయలేదని అసెంబ్లీలో నిలదీశా. ‘అయ్యో నేనెప్పుడు చెప్పాను ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని’ అని చంద్రబాబు అంటున్నారు. ప్రజలతో పనైపోయినాక చెబుతున్న మాటలు ఇవి. సీఎం కాకముందు 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. డిసెంబర్లో జరిగిన ఎస్ఎల్బీసీ మీటిం గ్లో రూ.99 వేల కోట్ల వ్యవసాయ రుణ బకాయిలు ఉన్నాయని బ్యాంకర్లు తేల్చారు. అంటే చంద్రబాబు చేసిన మోసానికి రైతులు రూ.12 వేల కోట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం 4,600 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామంటోంది. ఇది కనీసం వడ్డీకి కూడా సరిపోదు’’ అన్నారు. పొదుపు సొమ్ము బకాయిలకు జమ ‘‘డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు అందేవి. కానీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పడంతో 6-7 నెలలుగా బకాయిలు చెల్లించలేదు. అప్పు చెల్లించాలని, లేదంటే ఇంట్లో ఆస్తులు వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారని మహిళలు చెబుతున్నారు. మహిళలకు తెలీకుండా పొదుపు డబ్బులను పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారు.’’ అని తెలిపారు. హంద్రీ-నీవా, ఘనత వైఎస్‌దైతే చంద్రబాబు తనదని చెప్పుకోవడం అబద్ధాలు కావా అని ప్రశ్నించారు. ఢిల్లీ ఫలితాలు ఏపీలో పునరావృతం ‘‘ప్రజలు నమ్మి ఓట్లేశారు. దాన్ని కాపాడుకోవాలి. నమ్మకాన్ని వమ్ము చేస్తే బంగాళాఖాతంలో కలుపుతారు. ప్రజలను బాబు ఒకసారి మోసం చేశారు. మరోసారి వారు మోసపోరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఢిల్లీలో ఆప్‌కు 70 సీట్లకు 67 వచ్చినట్లుగా ఏపీలో మనకూ అవే ఫలితాలు వస్తాయి.’’ అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు ‘‘ప్రభుత్వ వైఖరితో కష్టాలున్నాయి. నష్టాలున్నాయి. అయితే ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. రాత్రిపోయాక పగలు వస్తుంది. మనకూ మంచి రోజులు వస్తాయి. అందరం చేయిచేయి కలిపి కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాడదాం’’ అన్నారు. నాలుగో రోజు రెండు కుటుంబాలకు పరామర్శ నాలుగోరోజు భరోసా యాత్రలో పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నూరప్ప (38) కుటుంబాన్ని, అదే మండలంలోని అనుంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఓబన్న (30) కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. యాత్రలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, కార్యదర్శులు బోయ తిప్పేస్వామి, ఎల్.ఎం.మోహన్‌రెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, నేతలు ఆలూరు సాంబశివారెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే.. ‘‘అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై నేను గట్టిగా నిలదీశా. ప్రజల ఓట్లతో అవసరం ఉన్నపుడు ఏం చేస్తామని చెప్పారు.. ప్రజలు ఓట్లేసి అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని గట్టిగా అడిగాను. మీ అబద్ధాలు న మ్మి ప్రజలు మీ కు ఓట్లేసి గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెట్టా రు. కానీ ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. రైతులు, చేనేతలు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. మీరాడిన పచ్చి అబద్ధాలతో మోసపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రు. దీనంతటికీ మీరు కారణం కాదా.. అని అడి గా. 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా వివరాలను చూపించా. కానీ చంద్రబాబు రైతు ఆత్మహత్యలను అవహేళన చేశారు. రైతులు సుఖ సంతోషాలతో, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారన్నారు. ఎవరూ చనిపోలేదన్నారు. ఆత్మహత్యలు నిజమే అని ఒప్పుకొంటే ఎక్కడ రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని ఒప్పుకోలేదు. అయ్యా.. నేను ప్రతీ ఇంటికీ వెళ్లి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చూపిస్తా.. అని చెప్పా. ప్రభుత్వం నుంచి ఆదరణ లభించని క్రమంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరో సా కల్పించి వారికి అండగా నిలిచేందుకే రైతు భరోసా యాత్ర చేపట్టాను’’ అని జగన్ చెప్పారు. -
కలసికట్టుగా పోరాడుదాం
‘చంద్రబాబు హామీలు నమ్మి జనం ఓట్లు వేశారు. ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టాక ఆయన హామీలు మరచిపోయారు. అనంతపురం జిల్లాలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారంటే.. తొలుత ఆయన నమ్మలేదు. ఆధారాలతో అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఒప్పుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేదాక కలసి కట్టుగా పోరాడుదాం. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేద్దాం. నేనూ ఆ ధర్నాలో పాల్గొంటా’ అంటూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ప్రతి పల్లెలోనూ ఆత్మీయ స్వాగతం.. జగన్ రాకతో ప్రతి రైతు కుటుంబంలోనూ ధైర్యం.. జగన్ కనిపించగానే అంతులేని ఆనందంతో ఈలలు, కేకలతో హోరెత్తించిన యువకులు.. మంగళహారతులు ఇచ్చి, దిష్టి తీస్తూ.. విజయ తిలకం దిద్దుతూ దీవించిన మహిళలు.. వెరసి రైతు భరోసా యాత్ర నాలుగో రోజు బుధవారం దిగ్విజయంగా సాగింది. బుధవారం ఉదయం పామిడిలో వీరాంజనేయులు గెస్ట్‌హౌస్ నుంచి యాత్ర మొదలైంది. పెన్నప్పగుడికి చేరుకుని శంకర్ అనే రైతు పొలంలోకి వెళ్లి ధాన్యాన్ని పరిశీలించి, దిగుబడిపై జగన్ ఆరా తీశారు. సొరకాయలపేట మీదుగా ఎద్దులపల్లికి చేరుకున్నారు. ఎద్దులపల్లి పొలాల్లోని మహిళలు జగన్ కాన్వాయ్ కనిపించగానే పరిగెత్తుతూ రోడ్డుపైకి వచ్చారు. జగన్‌ను చూసి సంబరపడిపోయారు. డ్వాక్రా రుణ మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని జగన్‌కు వివరించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న హరిజన వన్నూరప్ప(38) కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అక్కడి నుండి పాళ్యం గ్రామానికి చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం అవలంభిస్తోన్న మోసపూరిత వైఖరి, రైతులు ఆత్మహత్యలు చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు.. తాను రైతు భరోసా యాత్ర చేపట్టేందుకు కారణాలను ప్రజలకు వివరించారు. మోసం చేసి సీఎం పీఠం దక్కించుకున్న చంద్రబాబుపై కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. తర్వాత రామగిరి, ఎగువతాండా, దిబ్బసానిపల్లి మీదుగా కట్టకింద పల్లెకు చేరుకున్నారు. ఇక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి అనుంపల్లికి చేరుకున్నారు. అనుంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఓబన్న కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు అత్తార్‌చాంద్‌బాషా, వై.విశ్వేశ్వరరెడ్డి, శింగనమల కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ సీనియర్ నా యకుడు చవ్వా రాజశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్ఎం మోహన్‌రెడ్డి, బోయ తిప్పేస్వామి, పార్టీ నేత మీసాల రంగన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, జిల్లా కార్యదర్శి కృష్ణవేణి, ట్రేడ్ యూనియన్, రైతు విభాగం, సేవాదల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, వెంకట చౌదరి, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, పీ.బాలకృష్ణారెడ్డి తాడిపత్రి రమేష్‌రెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 40 బస్తాలయ్యేది.. 11 బస్తాలయ్యాయన్నా.. పామిడి మండలం పెన్నప్పగుడి సమీపంలోని పొలంలో వరి నూర్పిళ్లు చేస్తున్న రైతు పొలంలోకి జగన్ వెళ్లి పంటసాగు, గిట్టుబాటుపై ఆరా తీశారు. జగన్: ఏం పేరన్నా? రైతు: శంకరయ్య సార్ జగన్: ఎన్ని మూటలు పండినాయన్నా? శంకరయ్య: సార్.. ఎకరాకు 40 మూటలయ్యేవి. ఈసారి 11 మూటలే అయినాయి. నీళ్లు లేక పంట పూర్తిగా నష్టపోయాం. హెచ్చెల్సీ నీళ్లన్నీ తాడిపత్రికి పంపించారు. అప్పుడు పంట పాలుపోసుకునే దశలో ఉంది. నీళ్లు లేకపోవడంతో పంట తాలు పడింది. దీంతో 11 మూటలే అయినాయిసార్.. జగన్: చూస్తుంటే తాలు దండిగా ఉందన్నా.. పంటపాలు పోసుకునే దశలో నీళ్లొచ్చి ఉంటే బాగా పండేది. ఏం చేద్దాం. ఈ ప్రభుత్వం రైతులకు నీళ్లు కూడా ఇవ్వదు. ధైర్యంగా ఉండు. మంచి రోజులు వస్తాయి. నేటి రైతు భరోసా యాత్ర ఇలా.. ‘రైతు భరోసా యాత్ర’ ఐదో రోజు వివరాలను పోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ వెల్లడించారు. గురువారం ఉదయం పామిడి వీరాంజనేయులు గెస్ట్‌హౌస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. పీ కొండాపురంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కొండూరు శివారెడ్డి (46) కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఆ తర్వాత రామరాజుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వెన్నెపూసల పుల్లారెడ్డి (64) కుటుంబాన్ని పరామర్శించనున్నారు. -
నేనున్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు
ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తా ఇన్ని అబద్ధాలాడి సీఎం అయిన ముఖ్యమంత్రి దేశచ రిత్రలో లేరు పిక్‌పాకెట్‌కు 420 కేసు.. తప్పుడు హామీలతో మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలి? మొదట రైతు ఆత్మహత్యలే లేవన్న చంద్రబాబు.. మా ఒత్తిడితో ఒప్పుకున్నారు జగన్ వస్తున్నారని భయం తప్ప.. రైతులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు అతి త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది.. మన ప్రభుత్వం వస్తుంది రైతులు, డ్వాక్రా మహిళలు ఏ ఒక్కరూ అధైర్యపడొద్దు మూడోరోజు రైతు భరోసా యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆతర్వాత మరోమాట చెప్పి రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. బాబులా పచ్చి అబద్ధాలు ఆడే సీఎం.. దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. బాబు చేసిన మోసాలతో కష్టాలు వచ్చిన మాట నిజమే. అయితే నాదో విన్నపం. ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు నేనున్నా.. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తాం. ధైర్యంగా ఉండండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజు మంగళవారం కూడేరు, మర్తాడుల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారు? టీవీ ఆన్ చేస్తే ఓ తల్లి మంగళసూత్రం లాక్కుపోతుంటారు. బ్యాంకులో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. కటౌట్లు, గోడలపై పెద్ద రాతలు రాశారు. వ్యవసాయ రుణా లు, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు అనేక హామీలతో చంద్రబాబు సంతకం చేసిన కరపత్రాలను టీడీపీ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి పంచారు. కటౌట్లలోని రాతలు కనిపించవని రాత్రిళ్లు లైట్లు అమర్చారు. చివరకు విద్యార్థులనూ వదల్లేదు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. బాబు సీఎం అయ్యాడు. ఇపుడు ఉన్న జాబులు ఊడిపోతున్నాయి. జాబు ఇవ్వకపోతే 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 9 నెలలవుతున్నా దాని ఊసులేదు. ఇదేం టని నిలదీస్తే ‘అయ్యో నేనెప్పుడు చెప్పాను ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని’ అంటున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాకపోవడంతో 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. రుణమాఫీ పుణ్యమా అని పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా రాని పరిస్థితి. ఈ ఏడాది రూ.57 వేల కోట్లు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు నిర్దేశిస్తే కేవలం రూ.13 వేల కోట్లు అందించారు. దీంతో రైతులు అధిక వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకుంటున్నారు. చివరకు యూరియా బస్తా రూ. 200 ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ.450కి రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి.’ పిక్‌పాకెట్‌కు 420... మోసాల బాబుపై ఏ కేసు? ‘ఎవరైనా గ్రామాల్లో పిక్ పాకెటింగ్ చేస్తే 420 కేసు నమోదు చేస్తారు. మరి రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలి?’ అని ప్రశ్నించారు. జగన్ అంటే భయం తప్ప.. రైతులపై ప్రేమేదీ? ‘అనంతపురంలో 46 మంది రైతులు చనిపోయారు. వారిని ఆదుకోండి’ అని అసెంబ్లీలో బాబుకు విన్నవించాం. అయితే రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని, అందరూ సుఖసంతోషాలతో ఉన్నారని చంద్రబాబు వెటకారం చేశారు. ఆత్మహత్యలు నిజమే అని ఒప్పుకొంటే కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని బాబుకు మనసు రాలేదు. రాష్ట్రంలో 86 మంది రైతులు (గత అసెంబ్లీ సమావేశాల నాటికి) ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 46 మంది రైతులు అనంతలో ఆత్మహత్య చేసుకుంటే మీకు అర్థం కాదా? అని నిలదీశాను. ప్రతీ ఇంటికి నేను వెళ్లి పరామర్శించి భరోసా కల్పిస్తానని, అప్పుడు రైతులు ఎలా చనిపోయారో మీకు తెలుస్తుందని చెప్పాను. తీరా నేను అనంతపురానికి వచ్చేందుకు తేదీలు, ప్రోగ్రాం ఖరారు చేశాక.. జగన్ వస్తున్నారని అధికారులను పరుగులు పెట్టించారు. ఎవరూ చనిపోలేదన్న బాబు 29 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెక్‌ల పంపిణీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అంటే జగన్ వస్తున్నారని ఇదంతా చేశారు. జగన్ వస్తున్నారనే భయం తప్ప. రైతులంటే చంద్రబాబుకు ప్రేమ ఎక్కడ ఉంది?’ అని నిలదీశారు. ప్రాజెక్టుల విషయంలో బాబు చేసింది సున్న ‘హంద్రీ-నీవా తన వల్లే వచ్చిందని చంద్రబాబు గొప్పులు చెబుతున్నారు. తాను సీఎంగా ఉన్న కాలంలో ఆయన విడుదల చేసింది రూ.13 కోట్లే. ఆ తర్వాత సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5,800 కోట్లు ఇచ్చి ప్రాజెక్టు పనులను శరవేగంగా చేయించారు. మరో రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ నిధులివ్వరు. అయితే మొత్తం ఘనత మాదే అని, ఇక్కడికి వస్తే నాకు 60 శాలువాలు కప్పారని అంటున్నారు. హంద్రీ-నీవాను పూర్తిచేసింది వైఎస్ తప్ప బాబు కాదు. గాలేరు-నగరి, వెలిగొండతోపాటు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా బాబు చేసింది సున్న’ అని చెప్పారు. అతి త్వరలో బాబు ప్రభుత్వం కూలిపోతుంది ‘మళ్లీ చెబుతున్నా.. ఏ ఒక్కరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అందరం ప్రభుత్వం మెడలు వంచుదాం. అతి త్వరలోనే బాబు ప్రభుత్వం కూలిపోతుంది. మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండండి. ప్రజలను ఒకసారి మోసం, వంచన చేయొచ్చు. పదేపదే చేయలేరు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. ఢిల్లీలో ఆప్‌కు 67 సీట్లు వచ్చినట్లుగా మన పార్టీకీ అదే ఫలితాలు వస్తాయి. మూడు కుటుంబాలకు భరోసా మూడోరోజు యాత్రలో జగన్ మూడు కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కూడేరు మండలం అంతరగంగలో ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులు నేసే వన్నూరప్ప, నారాయణమ్మ కుటుంబాన్ని పరామర్శిం చారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తర్వాత శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మర్తాడులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు తాతిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత శింగనమల మండలం లోలూరులో ఆత్మహత్య చేసుకున్న గోవిందరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మూడోరోజు యాత్రలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, కార్యదర్శులు వై.మధుసూదన్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, జిల్లాలోని నియోజకవర్గాల ఇన్చార్జీలు నవీన్‌నిశ్చల్, ఉషాశ్రీ చరణ్, తిప్పేస్వామి, వీఆర్ రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండగా ఉంటా.. కూడేరు: ‘మీకు అండగా నేను, వైఎస్సార్ సీపీ నేతలు ఉంటాం. ఏ కష్టమొచ్చినా స్థానిక నేతలకు చెప్పండి. ఆత్మస్థైర్యం నింపుకొని ధైర్యంగా జీవించండి. మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందకపోతే మీతో కలసి కలెక్టర్ ఎదుట ధర్నా చేసి న్యాయం జరిగేలా చేస్తా’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజు మంగళవారం ఆయన అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతరగంగలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులు నేసే వన్నూరప్ప (50), నేసే నారాయణమ్మ (45) కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోకపోయినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు తాతిరెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఆయన భార్య ఆదిలక్ష్మితోపాటు ముగ్గురు పిల్లలతో మాట్లాడారు. ఆర్థిక సమస్యలతో ముగ్గురు పిల్లలు చదువుకోవడం లేదని తెలిసి జగన్ తీవ్రంగా బాధపడ్డారు. పెద్దకుమారుడికి తక్షణమే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని శింగనమల నేత సాంబశివారెడ్డికి సూచించారు. తక్కిన ఇద్దరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం మంగళవారం అర్ధరాత్రి శింగనమల మండలం లోలూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు గోవిందరెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. -
కొండంత ధైర్యం
‘ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటి గురించి ఆయన మరచిపోయారు. వాటిని నమ్మి ఓట్లు వేసిన జనం అష్టకష్టాలు పడుతూ భారంగా బతుకీడుస్తున్నారు. ఎవ్వరూ అధైర్య పడొద్దు. మీ వెంట నేనుంటా. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనకే తావివ్వద్దు. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేసే వరకు పోరాడుదాం’ అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇస్తుండటంతో రైతుల్లో ధైర్యం పెరిగింది. రైతు భరోసాయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : అప్పుల బాధ తాళలేక.. ప్రభుత్వం నుంచి భరోసా కరువై.. ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించి నేనున్నానని ధైర్యం నింపేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న రైతు భరోసా యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ప్రతీపల్లెలోనూ ప్రజలు నీరాజనం పడుతున్నారు. పూల వర్షం కురిపిస్తూ బంతిపూలపై నడిపిస్తున్నారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి, నుదుట విజయ తిలకం దిద్ది దీవిస్తున్నారు. ప్రతీపల్లెలో యువకులు, రైతులతో పాటు భారీ సంఖ్యలో మహిళలు రోడ్లపైకి వచ్చి జగన్‌ను చూసి సంబరపడ్డారు. ప్రభుత్వ వైఖరితో మోసపోయి, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దిగాలుగా ఉన్న తమ కుటుంబాల్లో భరోసా నింపేందుకు వచ్చిన జగన్‌ను చూసి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబీకులతో పాటు యాత్రసాగే దారిలోని ప్రతీ గ్రామంలోని రైతులు, మహిళలు గర్విస్తున్నారు. యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. సోమవారం రాత్రి అనంతపురంలోని ముత్యాలరెడ్డి అతిథి గృహంలో బస చేసిన జగన్.. మంగళవారం ఉదయం 9.50 గంటలకు యాత్రను ప్రారంభించారు. సిండికేట్‌నగర్, లెప్రసీ కాలనీ మీదుగా రాచనపల్లికి చేరుకున్నారు. గ్రామం దాటగానే పుట్లూరు మండలానికి చెందిన రైతులు జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయని, తద్వారా చీనీచెట్లు నిలువునా ఎండిపోతున్నాయన్నారు. పింఛన్ల పంపిణీలో కూడా తమ మండలంలో అర్హులకు అన్యాయం జరుగుతోందని విన్నవించారు. తర్వాత బ్రాహ్మణపల్లి మీదుగా కూడేరు చేరుకున్నారు. జగన్‌ను చూసేందుకు ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, బెళుగుప్ప నుంచి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రైతులు, మహిళలతో కూడేరు సర్కిల్ కిక్కిరిసింది. కూడేరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై తనను చూసేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఒకమాట...గద్దెనెక్కిన తర్వాత మరోమాట మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు వైఖరిపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. అక్కడి నుండి అంతరగంగ చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులు నేసే వన్నూరప్ప(58), నారాయణమ్మ(50) కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల కష్టసుఖాలను అడిగి తె లుసుకున్న తర్వాత అక్కడి నుండి అరవకూరు, కమ్మూరు, కోటంక మీదుగా మర్తాడుకు చేరుకున్నారు. ఈ మూడు గ్రామాల్లో జనాభిమానం మధ్య ఇరుక్కుపోయిన జగన్ మర్తాడుకు వచ్చేందుకు చాలా సమయం పట్టింది. మూడు పల్లెలు దాటేందుకు నాలుగు గంటలకుపైగా సమయం పట్టిందంటే అభిమాన తాకిడి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రాత్రి 8.50 గంటలకు మర్తాడు చేరుకున్నారు. మర్తాడులో బ్రహ్మరథం మర్తాడు గ్రామస్తులు రోడ్లను బంతిపూలతో నింపారు. జగన్ చూసేందుకు దాదాపు కిలోమీటరు మేర రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. మహిళలు, యువకులు మిద్దెలపైకి ఎక్కి నిలుచున్నారు. జగన్ రాగానే పూల వర్షం కురిపించారు. మర్తాడు ప్రజల అభిమానంతో జగన్ తడిసి ముద్దయ్యారు. రైతు ఆకులేటి తాతిరెడ్డి కుటుంబీకులు వారి స్థలంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పటి వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులు వైఎస్‌పై పాటలు పాడారు. పాటలు విని జననేత జగన్ ఆనందించారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు తాతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ నుండి శింగనమల మండలం లోలూరుకు చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు గోవిందరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్‌చాంద్‌బాషా, శింగనమల కోఆర్డినేటర్ జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జిల్లాలోని పలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు నవీన్ నిశ్చల్, ఉషాచరణ్, వీఆర్‌రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపీ వీరన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయసుశీలమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మైనుద్దీన్, బోయతిరుపాల్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపరుశురాం, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి జయరాంనాయక్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ధనుంజయ యాదవ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, అనంతపురం నగర అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా కార్యదర్శి కష్ణవేణి, షమీమ్, పసుపులేటి బాలకష్ణారెడ్డి తదితరలు పాల్గొన్నారు. నాలుగోరోజు భరోసా యాత్ర ఇలా.. రైతు భరోసా యాత్ర నాలుగోరోజు వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ వెల్లడించారు. బుధవారం ఉదయం గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నరప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అదే మండలంలోని అనుపంల్లిలో ఆత్మహత్య చేసుకున్న మరో రైతు ఓబన్న కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు. తాతిరెడ్డికి అభినందనలు వైఎస్ విగ్రహాన్ని స్థాపించిన ఆకులేటి తాతిరెడ్డిని జగన్ అభినందించారు. ఈ ప్రభుత్వంలో వైఎస్ విగ్రహాలను టీడీపీ నేతలు పగలగొడుతున్నారని ఆరోపించారు. అయితే వైఎస్‌పై ఎంతో ప్రేమతో కలెక్టర్, చంద్రబాబు ఎవ్వరూ అనుమతి ఇవ్వకపోయినా తన స్థలంలో తాతిరెడ్డి.. వైఎస్ విగ్రహాన్ని స్థాపించారని కొనియాడారు. -
కేశప్ప కుటుంబానికి YS జగన్ పరామర్శ
-
ఆనంతపురం జిల్లాలో జగన్ రెండో రోజు పర్యటన
-
నేనున్నాననీ...
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ఆత్మహత్యలకు పాల్పడుతున్న ‘అనంత’ అన్నదాతలకు భరోసా కల్పించేందుకు జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘అనంత’ ప్రజలు ఘన స్వాగతం కలిపారు. రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ ఆదివారం ఉదయం 11.14 గంటలకు చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టుకు వచ్చారు. జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, హిందూపుం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు శ్రీధర్‌రెడ్డి, నవీన్‌నిశ్చల్ స్వాగతం పలికారు. అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. అక్కడి నుండి మరవపల్లి, వీరాపురం మీదుగా చిలమత్తూరుకు చేరుకున్నారు. అక్కడి నుండి దేమకేతేపల్లి, టేకులోడు, కనుమ, గాదాలపల్లి, గొంగటిపల్లి మీదుగా మామిడిమాకులపల్లికి చేరుకున్నారు. ప్రతి గ్రామంలోనూ జగన్‌ను చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. మహిళలు, వృద్ధులు, యువకులు రాగా అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. చిన్నపిల్లలకు ముద్దాడుతూ.. ఆశీర్వదిస్తూ చిరునవ్వుతో ముందుకుసాగారు. యువ కులతో కరచాలనం చేశారు. సిద్ధప్ప కుటుంబానికి పరామర్శ మామిడిమాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న సిద్ధప్ప(65)కుటుంబాన్ని పరామర్శించారు. సిద్ధప్ప భార్య రంగమ్మ, కుటుంబీకులతో ముచ్చటించారు. సిద్ధప్ప ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, అప్పుల వివరాలు, ప్రస్తుత జీవనాధారం వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. వారిని పరామర్శించి 50 వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుండి లేపాక్షికి చేరుకున్నారు. లేపాక్షిలో జగన్‌ను చూసేందుకు ఉదయం నుంచి భారీగా జనం ఎదురు చూశారు. జగన్ రాగానే ఈలలు, కేకలతో లేపాక్షి మార్కెట్ సర్కిల్ హోరెత్తింది. లేపాక్షిలో మసీదులోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత బీఈడీ చేసిన నిరుద్యోగులు జగన్నను కలిశారు. బీఈడీ ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, తాము నష్టపోతున్న విధానాలను వివరించారు. వారికి అండగా ఉంటామని జగన్ భరోసా నిచ్చారు. తర్వాత బిసలమానేపల్లిలో అలచంద తోటలోకి వెళ్లారు. మహిళా రైతును పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్రికల్చర్ అధికారులు కనీసం పంటలు చూసేందుకు రావడం లేదన్నారు. వైఎస్ హయాంలో ఏడాదిలో నాలుగైదుసార్లు అధికారులు తమ పొలంలోకి వచ్చేవారన్నారు. పొలంలోనే గోవిందమ్మ అనే మరో మహిళా రైతుతో మాట్లాడారు. ఏ పంటసాగు చేసినా నష్టం వస్తోందని, సాగునీరు లేదని ఆమె చెప్పారు. తర్వాత దారిలో గొర్రెలకాపరి ఎదురై జగన్‌కు గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చారు. ఆపై పూలకుంట చేరుకున్నారు. అక్కడ డ్వాక్రా మహిళలు తమకు రుణమాఫీ అమలులో ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని జగన్‌కు వివరించారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు చెబుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. అక్కడి నుండి శ్రీకంఠాపుం మీదుగా హిందూపురం పట్టణానికి చేరుకున్నారు. హిందూపురం శివార్లలో జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆలస్యమైనా ఎదురుచూపు సాయంత్రం 5 గంటలకు హిందూపురానికి చేరుకోవాల్సిన జగన్ రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. అడుగడుగునా జగన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడటం, వచ్చిన వారందరినీ జగన్ ఆప్యాయరంగా పలకరించడంతో పర్యటన 2.30గంటలు ఆలస్యంగా సాగింది. అయినా జనం అలుపెరుగకుండా ఎదురుచూశారు. రాత్రి 7.30 హిందూపురంలో అంబేద్కర్ సర్కిల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యలకు దారి తీసిన పరిస్థితులు, రైతన్నకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్న వైనంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. బహింరంగ సభ అనంతరం అక్కడ నుండి నేరుగా పుట్టపర్తి నియోజకవర్గం తలమర్ల సమీపంలోని చెన్నకేశవాపురానికి వెళ్లారు. అక్కడ బస చేశారు. జగన్ తొలిరోజు పర్యటన 91 కిలోమీటర్లు సాగింది. జగన్ పర్యటనలో నియోజవకర్గ ఇన్‌చార్జ్‌లు ఆలూరు సాంబశివారెడ్డి, ఉషాచరణ్, తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సోమశేఖరరెడ్డి, రమేశ్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట సూర్యప్రకాశ్‌బాబు, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ట్రేడ్‌యూనియన్, సేవాదల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఓబులేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు బాబుల్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. నేటి ‘రైతు భరోసా యాత్ర’ సాగుతుందిలా.. సోమవారం ఉదయం తలమర్ల సమీపంలోని చెన్నకేశవపురం నుంచి జగన్ కొత్తచెరువు మండలం మరుకుంటపల్లికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కురబ కేశప్ప(55) కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుండి కొత్త చెరువు చేరుకుంటారు. డ్వాక్రా మహిళలతో వారి సమస్యలపై చర్చిస్తారు. ఆపై అక్కడి నుండి బుక్కపట్నం మీదుగా కొత్తకోట చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డ సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పిస్తారు. తర్వాత అక్కడ నుండి నేరుగా అనంతపురానికి చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కళ్లెదుటే ఎండిపోతుంటే... అప్పుల కుంపటి గుండెను రాజేస్తుంటే.. బతుకు భారమై వలసబాట పట్టిన రైతులు కొందరైతే.. అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడిన వారు మరికొందరు. ఆదుకోవాల్సిన పాలకపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వేళ ‘నేనున్నానంటూ’ వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు కదిలారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు ‘రైతు భరోసా యాత్ర’ ప్రారంభించారు. ఆదివారం జిల్లాలో ప్రారంభమైన యాత్రకు జనం నీరాజనం పలికారు. తమ కోసం వచ్చిన నాయకుడికి ఆత్మీయ స్వాగతం పలికి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఎల్లవేళలా మీకు తోడూ..నీడగా ఉంటానంటూ భవిష్యత్‌పై వారికి జగన్ భరోసా కల్పించారు. భార్య రంగమ్మ, కుటుంబీకులతో ముచ్చటించారు. సిద్ధప్ప ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, అప్పుల వివరాలు, ప్రస్తుత జీవనాధారం వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. వారిని పరామర్శించి 50 వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుండి లేపాక్షికి చేరుకున్నారు. లేపాక్షిలో జగన్‌ను చూసేందుకు ఉదయం నుంచి భారీగా జనం ఎదురు చూశారు. జగన్ రాగానే ఈలలు, కేకలతో లేపాక్షి మార్కెట్ సర్కిల్ హోరెత్తింది. లేపాక్షిలో మసీదులోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత బీఈడీ చేసిన నిరుద్యోగులు జగన్నను కలిశారు. బీఈడీ ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, తాము నష్టపోతున్న విధానాలను వివరించారు. వారికి అండగా ఉంటామని జగన్ భరోసా నిచ్చారు. తర్వాత బిసలమానేపల్లిలో అలచంద తోటలోకి వెళ్లారు. మహిళా రైతును పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్రికల్చర్ అధికారులు కనీసం పంటలు చూసేందుకు రావడం లేదన్నారు. వైఎస్ హయాంలో ఏడాదిలో నాలుగైదుసార్లు అధికారులు తమ పొలంలోకి వచ్చేవారన్నారు. పొలంలోనే గోవిందమ్మ అనే మరో మహిళా రైతుతో మాట్లాడారు. ఏ పంటసాగు చేసినా నష్టం వస్తోందని, సాగునీరు లేదని ఆమె చెప్పారు. తర్వాత దారిలో గొర్రెలకాపరి ఎదురై జగన్‌కు గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చారు. ఆపై పూలకుంట చేరుకున్నారు. అక్కడ డ్వాక్రా మహిళలు తమకు రుణమాఫీ అమలులో ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని జగన్‌కు వివరించారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు చెబుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. అక్కడి నుండి శ్రీకంఠాపుం మీదుగా హిందూపురం పట్టణానికి చేరుకున్నారు. హిందూపురం శివార్లలో జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆలస్యమైనా ఎదురుచూపు సాయంత్రం 5 గంటలకు హిందూపురానికి చేరుకోవాల్సిన జగన్ రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. అడుగడుగునా జగన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడటం, వచ్చిన వారందరినీ జగన్ ఆప్యాయరంగా పలకరించడంతో పర్యటన 2.30గంటలు ఆలస్యంగా సాగింది. అయినా జనం అలుపెరుగకుండా ఎదురుచూశారు. రాత్రి 7.30 హిందూపురంలో అంబేద్కర్ సర్కిల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యలకు దారి తీసిన పరిస్థితులు, రైతన్నకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్న వైనంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. బహింరంగ సభ అనంతరం అక్కడ నుండి నేరుగా పుట్టపర్తి నియోజకవర్గం తలమర్ల సమీపంలోని చెన్నకేశవాపురానికి వెళ్లారు. అక్కడ బస చేశారు. జగన్ తొలిరోజు పర్యటన 91 కిలోమీటర్లు సాగింది. జగన్ పర్యటనలో నియోజవకర్గ ఇన్‌చార్జ్‌లు ఆలూరు సాంబశివారెడ్డి, ఉషాచరణ్, తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సోమశేఖరరెడ్డి, రమేశ్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట సూర్యప్రకాశ్‌బాబు, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ట్రేడ్‌యూనియన్, సేవాదల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఓబులేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశేఖరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు బాబుల్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
ప్రభుత్వం మెడలు వంచేందుకే రైతు భరోసా యాత్ర
అనంతపురం అర్బన్: ప్రభుత్వ మెడలు వంచేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో ఈ నెల 22 నుంచి 26 వరకు చేపడుతున్న రైతు భరోసా యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటచౌదరి, యూవజన విభాగం జిల్లా అధ్యక్షుడు డి.ధనుంజయయాదవ్, తదితరులు మాట్లాడారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుందన్నారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు అపద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు సీఎం పీఠాన్ని దక్కించుకున్నారన్నారు. జిల్లాలో కరువు పరిస్థితుల కారణంగా అప్పులపాలైన రైతుల ఆత్మహత్యలు చేసుకోగా.. అవి ఆత్మహత్యలు కావని సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు చెప్పడం రైతు సంక్షేమంపై వారి చిత్తశుద్ధిని తెలియచేస్తోందన్నారు. జిల్లాలో రూ.6 వేల కోట్ల వ్యవసాయ రుణాలు వుంటే రూ. 700 కోట్లు మాఫీ చేసి.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని మరోసారి రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. రైతుల ఆత్మహత్యలపై జగన్మోహన్రెడ్డి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడంతో మెట్టుదిగిన ప్రభుత్వం 29 మంది బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందజేస్తామని ప్రకటించిదన్నారు. అయితే ఇంత వరకు ఒక పైసా కూడా ఏ ఒక్క కుటుంబానికి అందించిన పాపాన పోలేదన్నారు. ఈ నిర్లక్ష్య ప్రభుత్వాన్ని నిలదీయడానికే జగన్ రైతు భరోసా యాత్ర చెపడుతున్నారని ఆయన తెలిపారు. ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజినేయులు, సేవాదల్ విభాగం జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపరుశురాం మాట్లాడుతూ చంద్రబాబు జిల్లా రైతాంగాన్ని చేసిన మోసంపై నిలదీసేందుకు రైతన్నలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు.